మణి రత్నాంబర వాహ నాదిగ మహా మాంగల్య దాయంపు భూ
షణ సంభారము చిత్త శాంతి నిడగన్ సామర్థ్యముం జూపునే
ఘృణయుం బ్రేమ గుణాధికమ్ముల సుసంకీర్ణమ్ము శీలాసు ధా
రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్ 59
[శీల+అసుధారణము= శీలాసుధారణము; అసుధారణము=జీవము, బ్రదుకు]
అణు మాత్రపు సద్గురు వీ
క్షణ జననీ జనక సచివ సంఘ సహిత ల
క్షణ యుత సాధు జనుల ప్రే
రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్ 58
షణ సంభారము చిత్త శాంతి నిడగన్ సామర్థ్యముం జూపునే
ఘృణయుం బ్రేమ గుణాధికమ్ముల సుసంకీర్ణమ్ము శీలాసు ధా
రణమేగా సుఖశాంతు లిచ్చి మనకున్ రంజిల్లఁ జేయున్ మదిన్ 59
[శీల+అసుధారణము= శీలాసుధారణము; అసుధారణము=జీవము, బ్రదుకు]
అణు మాత్రపు సద్గురు వీ
క్షణ జననీ జనక సచివ సంఘ సహిత ల
క్షణ యుత సాధు జనుల ప్రే
రణమే సుఖశాంతు లిచ్చి రంజిలఁ జేయున్ 58
ఆ వైవాహిక కార్య సంచయము సత్యంబై ప్రవర్తింపగన్
దైవానుగ్రహమున్నఁ జాలు నిక నిత్యంబున్ సుపర్వంబులే
దేవా ఫాల్గుణమందు, వచ్చును గదా దీపావళీ పర్వమే
ప్రావృట్కాలము దాట నివ్వసుధ సంరంభమ్ములుప్పొంగగన్ 57
కాల గమన మాపగ లేడు కాలు డైన
నాశ్వయుజమున గాని మహాశివ హరి
నీరజభవు లడిగిన రానేర దెపుడు
ఫాల్గుణమున దీపావళి పండుగ కద 56
రాగద్వేష పరీత చిత్త మయ నిర్మాణంబు లా వీడులే
వేగద్యుమ్న శరాళిఁ బట్టణములన్ విధ్వంసముం జేసె నా
నాగేంద్రాభరణుండు, చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్
నాగేంద్రాస్తర భూషితుండు హరియే నందాత్మజుం డుగ్రతన్ 55
[ ద్యుమ్నము= బలము]
భాగవ తోత్తము లెల్లర
వే గాసిలి పలు విధముల వేధింప నిలన్
వేగమ కృష్ణుడు కీర్తిత
నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్ 54
[ గాసిలి = కోపించి]
విప్ర వరునకు యజ్ఞోపవీత మేల 53
యనఁ గలవు పెక్కు కారణా లవని నెంచ
యజ్ఞ యాగ వేదాధ్యయ నాది కార్య
నిర్వహణ నిత్య కర్మాది నివహములకు
వప్ర నివాస భాగ్యము నపారము గల్గిన నైన నేమి యు
ద్దీప్రము యజ్ఞసూత్రము విధేయత తోడ ధరింపనొప్పునే
ప్రప్రథమంపు కార్య మది వార్చుట సంధ్య, విహీనమైనచో
విప్ర కులావతంసునకుఁ బేరగు జంధ్య మదేల వేయఁగన్ 52
[వప్రము=కోట, ఉద్దీప్రము=ప్రకాశించునది]
త్యమున్ నిమగ్నులై చరింత్రు తాపసోత్తముల్ ధరన్
సమంచితప్రవృత్తి భాస సద్గుణాత్త చిత్త వి
ప్ర మాదముల్ ప్రమోద మిచ్చి రక్షసేయు నెల్లరన్ 51
[మాదము= మదము=సంతోషము]
భద్రత నొసంగ మది నెంచి ప్రభువు సేయు
దుష్కరమ్ములైన నియమ పుష్కలమ్ము
లాపదల నోర్చు మెలకుఁవ లన్నినేర్పఁ
బెను ప్రమాదములు, ప్రమోదమునకె సుమ్ము 50
న్నాడగఁ బ్రీతి నాలు మగ లందరు గూడి కుతూహలమ్ముగం
బాడిగ మేనకోడలిని భార్యగఁ జేకొన నుత్సహించి యా
కోడలు, మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్ 49
కూడవు వలుక నసహనము
తోడఁ గలహపుఁ బలుకులను దురితము సుమ్మీ
చాడీ లేల మగువ యే
కోడలు కనుగొట్టె మామకున్ రమ్మనుచున్ 48
జననం బెంతయుఁ బ్రీతి పాత్రమును సఛ్చారిత్ర్యమున్ వార్ధి ర
త్న నిధిన్ దాటగ దారిఁ జూపుమనఁ దాత్సారంబు సేయంగ రా
మునికిం గోపమె భూషణం బగు ప్రజామోదంబు సంధిల్లఁగన్ 47
శాంతి దయ దమములు సుంతయు నేర్వక
భోగ లాల సుండు భూతి రతుడు
జప తప నెపములఁ బ్రజలఁ గలచు కపట
మునికిఁ గోపమె కద భూషణంబు 46
గాఁక నెదిర్చి యీల్గె ననఁ గర్ణ యుగమ్మున వజ్రకీలమై
తాకగఁ గార నశ్రువులు దైన్యపుఁ టుత్తర జిత్త మంత చూ
రై కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్ 45
ఆ కలికి కట్టి మాసిన
కోకయు మరి కాలవర్ణ కూర్పాసకమున్
శోకమునం గౌశేయపు
రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్ 44
కడతేర్చంగ దినాంతరశ్రమను సౌఖ్యంబౌ శరద్రాత్రినిం
గడు చిత్తద్యుతి కల్గ జేయు మణి సంకాశుండు చంద్రుండు దా
నడిరేయిన్ రవిఁ గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్ 43
బడబాగ్ని మించు తాపము వెదఁజల్లు
కడగన్ను చూపుల కడతేర్చఁ గాంత
తడియారఁ గుత్తుకఁ దారాధిపుఁ గను
నడిరేయి రవిఁ గాంచి నవ్వె నుత్పలము 42
[రవి = జీవుడు]
పాత సుర నదీ మతల్లి పావన గంగా
ధౌతోర్మి శౌచ జిత తుల
సీ తనుబెండ్లాడి శివుఁడు శిశువుం గనియెన్ 41
[తనుబెండ్లి: తనుపు పెండ్లి: తృప్తికరపుపెండ్లి]
సీతననంత దున్ని నర శేఖరు డాత్మజఁ బొందె నిమ్ముగన్
సీతను బెండ్లియాడి రఘుశేఖరుఁ డాత్మజు లిద్దరిం గనెన్
సీతను దస్క రించి దశ శీర్షుడు నాశము జేసె వంశమున్
సీతను బెండ్లియాడి శశిశేఖరుఁ డాత్మతనూభవుం గనెన్ 40
[సీత = నాఁగటిచాలు, జానకి, గంగ; అనంత = భూమి]
మతిహీన వర మడిగిన కుమతి కంజ కులా
వతరణుడు మహిత లంకా
పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్ 39
పతి వలదన్న నేరక సుపర్వ సమూహము నేగు చుండగన్
ధృత మతి యజ్ఞ వీక్షణకుఁ దేజము మీర గృహంబు సేరగం
బితృ కృత భంగ వృత్తి కడు వేదన నీయ కళంకి తాత్మయై
పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా 38
ధనములు ధాన్య సంపదలు దర్ప పదోన్నతు లెన్ని యున్ననున్
ఘన కుల జాతు డైనను వికార విదూరపు వైభవైషమ
స్తనములు లేని పూరుషుఁడు సంస్తవనీయుఁడు గాఁడు ధాత్రిలో 37
[వైభవ+ఐషమస్తనములు; ఐషమస్తనములు = ఈ సంవత్సరపువి (ప్రస్తుతము)]
జన సంచయ ప్రవర్తక
ధన మాన ప్రాణ సముచిత త్రాణమ్ముల్
ఘన కృత సత్కా ర్యాధ
స్తనములు లేని పురుషుండు స్తవనీయుండే 36
[అధస్తనములు: పూర్వపువి]
కవి నిలయము సకల కావ్య పఠన
రతుల సుపరివేష్టిత తలము శుభద మి
య్యవనిఁ గవన మెల్లఁ దివిరి నేర్పు 35
బ్రసవ వేదన భరియించి పడతి యపుడు
చంద్రు డనుచుఁ బొగడ నత్త సంత సింప
మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె 34
జగతిం జూడగ నిట్టి వింతలు మహాశ్చర్యంబులై తోచవే
మగువల్ మెచ్చరె యిట్టి భర్తలను సన్మానమ్ములుం జేయరే
తగదీ దుర్భర బాధ నీకనుచు భర్తై యుండి స్వ్పప్నంబునన్
మగవాఁడే ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్ 33
భృంగ సమూహ నిస్వన గభీర పదోచిత వర్ణ నోద్ధతుల్
ప్రాంగణ మందు నర్తన విలాస మతిం జరియించు చున్న బ
ర్హ్యంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్ 32
[బర్హి+అంగము = బర్హ్యంగము; అంగము = సమీపించినది; బర్హి = నెమలి]
వంగ కళింగ ఘనాంగ మ
భంగాంధ్రద్రవిడ పాండ్య పాంచాలములన్
భంగ మెరుంగ మనుచు పం
చాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్ 31
గంభీరమ్ముగను ద్రుంఛి కాకుత్స్థుడు సం
రంభాలోకన సీతకు
రంభా! పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్ 30
అంభోరాశి విలగ్న నిర్మితము సంస్త్యాయాగ్రణీ ద్వారకన్
గంభీరాజప శేఖరుండు ఘనుడుం గంసారి సోదర్యుఁడు
న్నంభారావము లుప్పతిల్లగ సుకన్యా రేవతీ ధిక్కృతా
రంభా వల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై 29
[అజపుడు = గొల్లవాడు; సంస్త్యాయము = ఆవాసము, ఇల్లు;
ధిక్కృతము = తిరస్కరింపఁబడినది; రాముడు = బలరాముడు]
వైభవ హస్తిపుర నాథవర హస్తక శుం
డాభప్రదోసపురనా
కాభేంద్రప్రస్త వాసు లమలురు గారే 28
[ప్రద+ఉసపురము=ప్రదోసపురము;
ఉసపురము =పేట, శాఖానగరము; శోభ = కాంతి]
భారపు రాజ్యపాలన నవంధ్యము సేసినఁ జాల దెన్నగన్
ధీరులు శూరు లున్నను స్వదేశ సుశాంతికి చిత్త శుద్దినిం
జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా 27
[చారులు = వేగులు]
నారాయణ పదపద్మ స
మారాధన తత్పరక్రియా విలసిత దే
హోరు గుణాధికు లా దను
జారుల మాటలను వినని జాతి నశించున్ 26
[దనుజారులు = దేవతలు; మాటలు = సూక్తులు]
రంధ్రం బందున నున్న నీరము పవిత్రంబే కదా ధాత్రి సై
రంధ్రీత్వంబున కృష్ణకుం బరమ సంత్రాసమ్ము వాటిల్లదే
రంధ్రాన్వేషణఁ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్ 25
ఆంధ్ర పదమ్మును నెమ్మెయి
నంధ్ర మనిన బ్రహ్మరంధ్ర మౌదల యన నీ
రంధ్రము నాకస మనినన్
రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే 24
శైలాత్మజ పూజ సల్పి సంపూర్ణముగన్
మేలుగ నివేదనకు న
ప్పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్ 23
[అప్పములు / ఆ పాలు]
మేలౌ నొక్కని కొక్క దార బరువే మీనాక్షి యుగ్మం బిలన్
గాలం బెప్పుడు నొక్క తీరుగను జక్కన్ సాగునే చెప్పుమా
బేలల్ గా రిభయాన లెల్లరు గనం బిత్రార్జితం బైన యా
పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే 22
విజయ దశమి యిచ్చు విభవము లిల
పర్వ పర్వములను భవ్య తరములు లే
విదియ నేఁడు వచ్చె విజయదశమి 21
[లేవు+ఇదియ = లేవిదియ]
ఉత్సాహము.
పదిలము మన సంస్కృతి బహు పావనంబు పృధ్వినిన్
బదపడి మన పర్వము లిల భావ గర్భితమ్ములే
వదరు మహిమ లెల్ల మాకు భవ్యముగను దెలియ రా
విదియ నేఁడు వచ్చెఁ గనుఁడు విజయదశమి పర్వమే 20
[వదరు = అడరు; రావు+ఇదియ = రావిదియ]
కర రక్షితు డసుర వైరి ఖదిరుం డా భీ
కర దేవాసుర రణమున
కరిసింహము నెక్కి దైత్యగణముం జంపెన్ 19
[కరిసింహము = గజశ్రేష్ఠము, ఐరావతము; ఖదిరుడు = ఇంద్రుడు]
వరదానాది గుణవ్రజాభినుత సంభా వ్యార్థి లోకార్త సం
తరణాసక్త దయా విలోకనయె విధ్వంసంబు నెట్లోర్చునో
పరమార్థంబు నెరుంగ శక్యమె, ధరాభారుల్, నిలింపాభయం
కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా 18
బాతఁడు నా మగండు, పతియౌ నితఁ డూరికిఁ, బోయె భర్త యే
రీతి సహించు నీ లలన లీలలు వైష్ణవ మాయ లిద్ధర
న్నేతఱి నేది సంభవమొ యేరికి నెంచఁ దరంబు సెప్పుమా 17
అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు
మాదు సోదరి కింపుగ మమత లెల్లఁ
జూపు మంచి మనిషి మనసు గన వెన్న
తోటి యల్లుండ్రు స్నేహంబు తోడ నుండ్రు 16
గుందు చుందురు మానవు లెందు నున్న
దిట్ట కవి శేఖరుడు వ్రాసి నట్టి ఫలిత
మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన 15
[ఫలితము+ఒయిలు= ఫలితమొయిలు; ఒయిలు = పుస్తకము]
పయనము భావి భూజనుల పద్మదళాక్షు డెఱుంగు నింక నె
మ్మెయిఁ గృషి సల్పనేర మది మేదినిఁ గాదని విత్త బద్ధమౌ
చెయువులు పిక్కటిల్లగ విచిత్ర రసాయన సంచయాత్తమై
మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్ 14
వనమున నవరాత్రుల నిల భక్త జన ఘనా
వనమున మురియు భవాని భు
వనముల నేలెడి లలితను భద్రను గొలుతున్ 13
[అవనము= రక్షణ; భవాని, లలిత, భద్ర లమ్మ వారి నామములు. ]
గులుకుల నునిచి తళుకు బెళుకులు తనరారం
జెలువము లమ్మగ నయ్యిం
తుల సీ మాతను గొలిచిన దురితము లబ్బున్ 12
[సీ = శ్రీ,, సంపద]
విలువల్ నేర్చిన మానవుండని మహా విద్వాంసు డీతండనిం
జెలువం బొప్పగ నీతనిం గొలువు సచ్ఛీలుండవై యంటినే
కలనైనం దలుపంగ రా దతని ప్రాకారంబటం దాగుఁబో
తుల సీమా? తను గొల్చినన్ దురితముల్ దోరంబులై యబ్బురా 11
గవు లెల్లరు మెచ్చి నట్టి ఘనపుఁ దెనుగు తే
ట వలుకు తేనియలు జనుల
కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్ 10
[జనులకు+అవి = జనులకవి]
అవినీతీతర కార్య నిర్వహణ సాహాయ్యేద్ధ వృత్తమ్మునున్
దివిజారాధన ధర్మవర్తనము సందేహమ్ము వర్జింపు మె
ట్టి విపత్కాలము నందు నైన నవి పాటింపంగ మేలౌను నీ
కవి యన్నం గలికాలమందుఁ గడుఁ జుల్కం జూతురే యెల్లరున్ 9
ధీరోదాత్తుడు శక్ర సోదరుడు ధాత్రీసూను ఖండింపగన్
పారావార పరీత పట్టణ సుఖావాసుండు జిష్ణుండు నా
భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్! 8
[ఆభీరుడు=గొల్లవాడు]
పౌరవ కులాబ్ధి చంద్రుడు
వీరుడు సౌభద్రుడు విలు విద్యాధికుడున్
భారత రణమున రణ గం
భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్ 7
గీర సమూహ మోదితము గ్రీష్మ సుకాల విరాజమానమున్
జారగ వృక్ష మూలమున స్వర్ణ నికాశ సువర్ణ భాసితై
కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్ 6
[భాసిత+ఏక+ఆరము= భాసితైకారము; ఆరము= తియ్యమామిడి;
పల్లవము= చిగిరించిన కొమ్మ]
నేరము పచ్చని చెట్లను
దూరము స్వచ్చపు టనిలము దోరపు నగరిన్
వారపుఁ జివరం జన మన
కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్ 5
[మనకు+ఆరము=మనకారము; ఆరము= ఉద్యానవనము]
దారి యొకింత కానక వృథాశ్రమ జీవన యాత్ర సేయగం
బార మెరుంగ నేరకయు వ్యాధుల బారి పడంగఁ గుందగన్
వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్ 4
ఘనమగు జల సంపద భూ
జనులకు నీయ నది సంతసమయిన నేరుం
గన నేరని వరదల చే
త నదేహమె వైరి యగుట తథ్యము ధరణిన్ 3
[నద+ఇహము = నదేహము : ఇహలోకపు నదము]
నుండు వర బల గర్వి సూనుండు విశ్ర
వసు నకును రావణాఖ్యుండు వంచిత వర
రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి 2
ఖగ రాజేశ్వర వాహనుండు ఖర సంఘాతఘ్న ధౌరేయుడున్
విగతద్వేష్య వితాన తోషణుడు భూవిఖ్యాత ధానుష్కుఁడున్
జగదారాధ్యుడు జానకీపతి తలంచన్ సోదరాంతర్యుడౌ
మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ నా మండోదరీభామకున్ 1
[మగడు = పురుషుడు]