|
|
శాంతి మంత్రము |
|
|
|
|
|
|
మ. |
ధరలో దేశము లెల్లఁ జాగ వలె నిత్యస్నేహ భావమ్ములన్ స్థిర సంభావిత మిత్ర భావముల వర్ధిల్లున్ మనశ్శాంతియే విరహం బెన్నఁడు లేక
భాసిలును గంభీరాబ్ధి సాదృశ్యమై తిరమై ద్వేషము మండుచుండఁగను సందేహాగ్ని జృంభింపఁ బ ల్వురి డెందమ్ములు తల్లడిల్లు ఘన కల్లోలాబ్ధి చందమ్మునన్ |
1. |
|
|
|
|
|
ఉ. |
స్వీయ ధరా విభాగముల వృద్ధియె లక్ష్యము దేశ కోటికిం బాయ మనస్కరింపమియె భావ్యము సీమల నాక్రమింప నే న్యాయము మేటి శక్తి కల దంచు నెదుర్కొనఁ బాడి యెట్లగుం బోయిన వారి వారి నిజ భూములు కుందరె యెల్ల రెన్నఁగన్ |
2. |
|
|
|
|
|
మ. |
నిరతం బుండఁగ దండయాత్రలను గన్నీరొల్క సంద్రమ్ములై పరిమార్పంగ జనవ్రజమ్ము నిల దైవం బెట్లు మన్నించుఁ సే కురు నెబ్భంగి ద్యులోక మే మతము లుద్ఘోషించు విధ్వంశముం బరమాత్ముండు సహింప నేర్చునె మహా పాపోగ్ర కార్యమ్ములన్ |
3. |
|
|
|
|
|
మ. |
ధరణీ గోళమె యంతరిక్షమున వృత్తక్షిప్త కక్ష్యన్ నిరం తరముం దిర్గుచు మానవాలి కొసఁగెన్ స్థానమ్ము లింపారఁగాఁ బరఁగం బ్రాణము లెల్ల బుద్బుదములై వాత్సల్య భావమ్మునన్ ధరలో నుండక యేల మర్త్యులకు విధ్వంసంపు టాలోచనల్ |
4. |
|
|
|
|
|
ఉ. |
పుట్టిన వార లెవ్వరును భూ జను లాఱక తప్ప దెన్నఁగాఁ జుట్టము లాత్మ నందనులు చొప్పడ మృత్యువు వెంట వత్తురే పెట్టిన దాన ధర్మములు వీడవు కాలుని యింటి కేఁగినం దట్టిన నంత్యకాలమునఁ దద్ధరి నామము కల్గు మోక్షమే |
5. |
ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
27, జనవరి 2026, మంగళవారం
శాంతి మంత్రము
18, జనవరి 2026, ఆదివారం
ప్రజా సేవ
|
ప్రజా సేవ |
||
|
తే.గీ. |
అన్న తఱచు ప్రజా సేవ యంచు విందు
నందు నిందు నా కెద నొక్క సందియమ్ము
ప్రజ లనఁగ నెవ్వరు మఱి సేవ యన నెద్ది
యెఱుక లేదయ్య సుంత నీ వెఱుఁగఁ జెపుమ
|
1.
|
|
|
|
|
|
తే.గీ. |
పదవి లోనున్న వారంద్రు పరమ లక్ష్య
మే ప్రజా సేవ యంచు మా కెప్పటికిని
నంద్రు ప్రతి పక్ష మందున్న నధిపు లట్ల
మఱి ప్రజల కేల యిక్కట్లు మానవేంద్ర!
|
2.
|
|
|
|
|
|
తే.గీ. |
ప్రజలు కనుచున్న వారంచుఁ బ్రభువు లంద్రు
ప్రజలు చూచు చున్నా రని
పదవి లేని
వారు నందు రీ ప్రజలు నా ప్రజ లనంగ
నెవ్వరో యేరి కెఱుకయ్య యింత యేని
|
3.
|
|
|
|
|
|
తే.గీ. |
వినఁబడు సమాజ మను పదం బనవరతము
ప్రజల విభజించి పాలింప రాజనీతి
యన్న సిద్ధాంత ముద్భవ మయ్యె నేఁడు
యిది ప్రజా సేవ కర్థమ యెఱుఁగఁ జెపుమ
|
4.
|
|
|
|
|
|
తే.గీ. |
సేవ కర్హుల నెన్న నెంచిన సమాజ
మేల యర్హత యది యున్న చాలదె మను
జుఁ డతఁ డెవ్వఁ డైనను నేమి కడఁగి తీర్పఁ
గష్ట మించుక ప్రజ
లందుఁ గనమె వాని
|
5.
|
|
|
|
|
|
తే.గీ. |
వీరి ప్రజ లెల్ల వారికిఁ గారె ప్రజలు
కార్య కర్తకుఁ బట్టమ్ము కట్ట నేల
వాని నొక్కనిఁ గందురె
ప్రజల లోన
సేవ లన నర్థ మిద్దియ చిత్రముగను
|
6.
|
|
|
|
|
|
తే.గీ. |
దోఁచు కొను చుందు రిప్పటి దొర లనంగ
దోఁచు కొంటిరి యప్పటి దొర లటంచు
నొకరి నొకరు దూషించుచు నుండ సతము
వీరి వారి ప్రజాసేవ విదిత మయ్యె
|
7.
|
|
|
|
|
|
తే.గీ. |
కందు రెదలఁ బ్రజా సేవ నంద ఱక్క
టా ప్ర జాసేవ గాను దొడ్డ దొర లిపుడు
స్వార్థమే బలీయము గాఁగ వ్యర్థ జనులు
వేచి, వేఁచుచుండ దొరలు, జూచు చుంద్రు.
[ప్రజా + అసేవ = ప్ర జాసేవ, ప్రజలకు సేవ చేయమి; వేచి = నిరీక్షించి; వేఁచు = వేఁగఁ జేయు]
|
8.
|
1, జనవరి 2026, గురువారం
పద్యాలు 2026.
చారుత రాంతరంగుఁడు సు సంయమనుండు పరోపకార చిం
తా రత మానసుండు సమదర్శిత శోక సుఖద్వయుండు దు
ర్వార భవాత్త సంకట సురక్షిత భక్త వరేణ్య గణ్యుఁడుం
దారక కృష్ణ నామ జప తత్పర ధన్యుఁడు పేర రాజిలన్ 44
నిత్యాణ్వేషియు సత్య శోధకుఁడు సందీప్తాంతరంగుండునుం
గృత్యాకృత్య వివేకి సద్హృదయ సంకేతుండు నిర్మోహుఁడున్
దైత్యవ్రాత విరోధి సచ్చరణ పద్మద్వంద్వ మగ్నాత్ముఁడై
నిత్యం బుండెను మద్గురుండు నతులన్ నే నిత్తు సద్భక్తినిన్ 43
విశదము భూ జనావళికిఁ బ్రీతి నొసంగఁ గరమ్ము నీకు నో
శశి రవి నేత్ర! రాజు సహ జాతను బత్నిగఁ చేసె భానుఁ డా
ది, శుభ కరాల పాదములఁ దీరుగఁ జేయుచు నుండు సేవలన్
భృశముగ నో త్రివిక్రముఁడ! పృథ్విని నింగిని దాఁటు వేళలో 42
పల్లవ వ్రాతమ్ము పరిఢవిల్లి విరియు పరమ పావన భూమి పాఠశాల
ఱాల నెల్లఁ గడిగి మేలి మణులఁ జేయు పర్ణశాల విశాల పాఠశాల
బాల బాలికలను బౌరుల నొనరింపఁ బాటుపడు నిల నీ పాఠశాల
విద్యతో సంస్కార వృద్ధి నొసఁగి మానవత్వము పెంచు నీ పాఠశాల
పీఠ మెల్ల పండితుల కీ పాఠశాల
పామరుల కెల్ల దీపమ్ము పాఠశాల
పాట లాటల కాణాచి పాఠశాల
పరమ గురువుల నిలయమ్ము పాఠశాల 41.
ధ్వనితాన్వేషిత విద్వ
ద్వనులకు భారత క థానువాద ప్రతిభా
ధనులకు బుధ మాన్యులకున్
వినతులు ద్విత్వాక్షర సుకవిత్రయమునకున్ 40
రక్షింపఁ బడఁగ ధర్మం
బక్షయముగ నుర్వి లోన నంచిత రీతిన్
రక్షించును దద్ధర్మము
సక్షేమము సకల జనుల సముచిత రీతిన్ 39
దశావతారములు.
హరికి సు మీన దేహునకు నద్భుత కూర్మ వపో విరాజికిం
బరమ వరాహ గాత్రునకు భవ్య నృసింహ శరీర ధారికిన్
సురుచిర వామనాఖ్యునకు సుందర భార్గవ రామచంద్ర కృ
ష్ణ రమణ బుద్ధ కల్కి వర నాముల కిత్తును మ్రొక్కు లింపుగన్ 38
శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సహస్ర చంద్ర దర్శనోత్సవ సందర్భము:
నలినజ వంశ మణిని వే
దుల సుబ్రహ్మణ్య శాస్త్రి దుర్జయ కవినిన్
లలితాంతరంగు ఘన ని
శ్చల మతినిం దలఁచి యిత్తు శత వందనముల్ 37
నిశిత గతి నుభయ భాషా
విశారదులు శాస్త్రి నామ విఖ్యాతు లిలన్
దశ దిశ లందుం బడసిరి
యశమ్ము గురు సార్వభౌముఁ డని సంప్రీతిన్ 36
వేదు లఖిల వేద్యమ్ముల
వేదుల కుల నామ మట్లు విశదం బయ్యెన్
వేదుల వారి వచనములు
వేద సమానమ్ము లెన్న విశ్వం బందున్ 35
చంద్ర సహస్రం బరసెన్
సాంద్ర శత వసంతము లవిచార మరయ దే
వేంద్రుఁ డొసఁగి వర మీ కవి
చంద్రునకు నొసంగుఁ గాక శాంతి సుఖమ్ముల్ 34
వేదుల వృత్తము. (భరనభభమయ; యతి 10.)
శశ్వ దనన్య సద్యశ ఉషః కిరణావృత భాస్వద్గాత్రునిన్ మా
హేశ్వర శుద్ధ సూత్ర రచ నేద్ధ విశారదు భాషా శాస్త్ర మూర్తిన్
విశ్వ వినోద కారక కవిప్రవరేణ్యుని విద్వన్మాత్రునిన్ వి
శ్వేశ్వరుఁ డిద్ధరామరుని నింపుగఁ బ్రోవుత సుబ్రహ్మణ్య శాస్త్రిన్ 33
దారుణోద్యమములు:
ఘోరము ప్రశ్న పత్రము లగోప్యము లైన నకాల మందు నే
దారిని నేరఁగా నగును దైవ మెఱుంగును బాటవమ్ములన్
నేరి లిఖించు వారలవి నేరని వారిని నేర శక్యమే
వారక గట్టి యత్నమున భద్ర పరీక్షల నీయ లేని య
వ్వారినిఁ దప్పు పట్ట వలెఁ బాత్రులె శిక్షకు ఘోర భంగినిన్ 32
పేరునకే యహింస మన వీర విహారము సేయు వారికిన్
మూరుచు స్వప్రయోజన సుపోషణ కాము లొసంగి యండనుం
బోరి ప్రభుత్వ విత్తములఁ బూర్ణము నాశ మొనర్ప రేఁగఁగా
దారుణ రీతి నెల్లెడలఁ దల్పఁ బ్రజా ప్రవర స్వతంత్రమే 31
విభులుగ నెవ్వరున్న నల వింతలె యిట్టివి ఘోర కృత్యముల్
విభుతయె లేని వారలు విభిన్న మనస్కులు విస్మరించి త
న్నిభముల దారుణమ్ముల జనింప స్వ కాలము నందు మున్నహో
నభమును దాఁక నార్వఁగను న్యాయమె చేయుచు నుద్యమమ్ములన్ 30
తప్పట సంభవించె నని తప్పుకొనంగ నమాత్యుఁ డంతటం
దప్పొనరించి నట్టి నరుఁ దాఁకునె బెట్టిద మైన శిక్ష లోఁ
జొప్పడి నట్టి మూలమును శోధన మంచిత రీతిఁ జేయఁగా
నప్పు డమాత్య యుక్తముగ నత్యధికారిని నింక ముఖ్యులం
దప్పక యుంచి ప్రక్కన యథావిధిఁ గన్గొన నొప్పు దుష్టులన్ 29
కంచెకె యుండు మోపు లవకాశము లాఁకలి నాహరింపఁగా
నంచిత సస్య రాజము నహర్నిశ లందు గణింప నావు దా
మించి చరింపఁ జేనుల నమేయము మేయునె దూడ గట్టుపై
వంచకు లంచు నెంచ వలె బాధ్యత గొన్న పదాధికారులం
బంచనఁ బెట్టి ముందుగను వారి విచారము సేయ నొప్పగున్ 28
నష్టము కల్గఁ గొందఱికి న్యాయ మొనర్పఁగ వారి కెల్లఁ బె
న్కష్టము లీయ నన్యులకు న్యాయమె పాలన మాప యుక్తమే
దుష్ట విరోధి సంతతికిఁ దోరముగా నవకాశ మీయఁగా
నిష్టమె దేశ వాసులకు నెల్లర కత్తఱి నిస్సిరో కటా 27
గద్యము నందు స్వప్రతిభఁ గమ్ర విధమ్ముగఁ దెల్ప వీ లగున్
హృద్య ప దాసమాన వర వృత్తి సమేత మలంక్రియాదులన్
వేద్యము పాండితీప్రతిభ విజ్జుల కింపుగ నౌను సద్యమే
యాద్యము సర్వ కావ్యముల కల్పముగా మది నెంచ వచ్చునే 26
పద్యము వ్రాయ నొప్పుఁ బద పంక్తుల దోషము లేక యెచ్చటం
జోద్య విసంధి పాతములు సొప్పడ నీయక యంత రాచ్చులే
హృద్యము లైనఁ ద్యాజ్యములు కృత్యములౌ ద్రుత సంధు లంచునున్
వేద్యము గాఁగ నింపుగఁ, బ్రవీణులు, ముందు తరాల వారికిన్ 25
పుట్టుట కాదు పాపము విభూతి దలిర్ప నెఱింగి తన్ను దా
నెట్టుల నైన నిత్య మన నెవ్విధి నొప్పని భూతలమ్మునున్
నెట్టన వీడి నిత్య మగు నీరజ నాభుని లోకమందునే
పుట్ట శ్రమింప జీవులకు భూరి తరంబగు లక్ష్య మెన్నఁగం
బట్టి! యెఱుంగు మోక్ష మన వైష్ణవ లోకము నెమ్మిఁ జేరుటే 24
తల్లి ప్రేమ
సాఁకు సివంగి పిల్లలను సాఁకును బెబ్బులి యాత్మ సంతతిన్
వీఁకను ద్రిప్పి కూనలను వేఁగి బిడాలమె యేడు చోట్లకున్
సాఁకును సారమేయ మిల సాఁకును పిల్లల జాగరూకతన్
లోకము నందుఁ దల్లులకు రోసిన సామ్యము నుండ నేర్చునే 23
జగతిం గ్రూరము లైన జంతువులు స్వచ్ఛందమ్ము శాబమ్ములన్
విగతక్రూరము ప్రీతిఁ బెంచును గదా విధ్యుక్త ధర్మం బనన్
ఖగసందోహము నట్ల వర్తిలదె యీ కారుణ్య మెబ్భంగి నే
ర్వఁగ నయ్యెం గడు చిత్రమే తలఁప సంభావ్యమ్ము మాతృత్వమే 22
లోకజ్ఞానము పిక్కటిల్ల మఱి యాలోచింప మర్త్యాలి యం
దీ కారుణ్యము కల్గు టెట్లరుదు వర్ధిల్లుం గదా స్త్రీలకున్
సాకారం బయి తల్లి ప్రేమ మది నత్యంతమ్ముగా నిత్యముం
దాఁకం జాలును నింగిఁ బొంగి కడు తాత్పర్యమ్మునన్ వింతయే 21
తాఁ దిన కున్న బిడ్డలకుఁ దప్ప కొసంగదె యన్నపానముల్
వేదన లెన్ని కల్గినను వింతఁగఁ బంచును సంతసమ్ములం
గాదన కెన్నఁ డేని తమకమ్మునఁ దీర్చును బిడ్డ కోరికల్
పాదము లంటి మ్రొక్కవలెఁ బన్నుగ భక్తిని మాతృదేవికిన్ 20
సతతము కాచు చుండుఁ గద చక్కఁగఁ గంటికి రెప్ప చందమే
వెత లవి సేరకుండఁ గనుఁ బెద్ద మనమ్మునఁ దల్లి నిత్యముం
గతలను జెప్పి నిద్ర నిడుఁ గమ్మగఁ బాడును జోల పాటలన్
నతులిడఁ దల్లి కెన్నఁడు ఘనమ్ముగ నొప్పును మానవాలికిన్ 19
కల రిద్ధాత్రిని రామరావునకు శంకాహీన దుర్వార ధూ
ర్తులు సాధింపఁ డొకం డహో జయము విద్రోహమ్ము సేపట్టినం
గలుషాత్ముండు మఱొక్కరుండు ఘన ధిక్కారస్వ రోగ్రుండునై
చెలరేఁగన్ జయ లక్ష్మినిం బడసె నిశ్శేషారి సంఘమ్మునన్ 18
ఇఁకఁ బిమ్మటేమి వాకిలిఁ
బ్రకటింపుఁడు వలదని వలపత్రము వెలయన్
సుకవి గణ చోదనంబై
వికసింప శివాభరణము విశ్వము నందున్ 17
[పిమ్మటేమి వాకిలి = Whatsapp, వలపత్రము = Blog (web log)]
అవమానం బని నిన్ను నెంచెదరు నిత్యం బాత్మ లందుం బరా
భవ మన్నం బరమంపు మోక్షమని సంభావింప నొప్పున్ ధరన్
స్వవనీ సంతతి మోక్ష కారణము నిత్యానంద సంధాయినీ
భవ బంధమ్ములఁ ద్రెంపు మమ్మ వసుధా భద్రమ్ము నిమ్మా కలిన్ 16
[పరా + అభవము = పరమ మైన జన్మ రాహిత్యము]
ఈ వపరాభవై తనరి హీనపరాభవ గానొనర్పుమా
యీ వసుధాతలమ్మును నహీన పరాభవ వత్సరంబ నీ
దీవనలే సెలంగఁ గడతేఱ విపత్తులు విశ్వ మందు వే
కావు మొసంగి శాంతిని సుఖమ్మును మెండుగ మానవాళికిన్ 15
పెరిగెఁ బరాభవమ్ము లిల విశ్వ విశేష జనాంతరమ్ములన్
నరులకు ద్వేష భావము ఘనమ్ముగ నాత్మల నుద్భవించెనే
విరివిగ యుద్ధ మేఘములు విశ్వ నభమ్మున సంచరింపఁగా
నరయవె నూత్న వత్సరమ యమ్మవు నై యిల నింకఁ గావవే 14
నల్ల నయిన వ్యాపారము చెల్లదు గద
కొనెడి వారలు లేకున్న మనుజు లందు
లంచ మే రీతిఁ గైకొను మించి లంచ
మీక యున్నచో నరు లెల్ల రూక లున్న 13
ట్రంపు పగటి కలలు వికటమ్ముగఁ గను
నాపితిని భారత రణము నను నొక పరి
యాకు పచ్చ నేల తనది యను మఱి యొక
తూరి క్యూబాను వెస మ్రింగుదు నను నాస
నా యిరాను పని సమసె ననును నేఁడు 12
నాది నాదని దేశాధినాథుఁ డడరు
నెమ్మి బుద్బుదం బైన జీవమ్ము వోవ
నెచ్చటికిఁ బోయె నా రాజ్య మెల్లఁ జూడ
నేర్చునె జనుల నొక్కరిని నయిన నిఁక 11
కన రెవ్వరు కనిన నొక ర
యిన నుత్తర మొసఁగ రే మెయి నుదా సీనం
బనయం బిట వర్ధిల్లును
మన కవు లెల్లరు నితాంత మౌనవ్రతులే 10
బాల్యావస్థ మనో చాం
చల్య మిచటి ప్రచురణమ్ము చాపచ్యుత దు
శ్శల్యం బరణ్య రోదన
తుల్యంబే సుండి వితత దుఃఖాస్పదమే 9
కవి లోకారణ్యం బిట
వివేక పరిశీల నైక వివిధ కవి వరే
ణ్య విహార విహీనం బయి
ఛవి హీనం బయి మసల విచారం బయ్యెన్ 8
వెలఁదుల మిన్న బంధుజన వృద్ధ జనావళి సుప్రసన్న వె
న్నెలఁ దలపించు మానసము నిండుగ వెల్గెడి ముద్దరాలు తే
నెలఁ గురియించు వాక్యముల నీరజ లోచన నాథు నెప్డు సే
వల నలరించు భామ యని పల్కుదు రెల్లరు రామలక్ష్మినిన్ 7
నీదు స్వగ్రామ మెయ్య దని యడుగంగఁ
జారు వైకుంఠ మందును సద్య మడరి
యెవరు మీవా రని యడుగ నెలమి నేను
బదు లొసంగుదు హరిధామ వాసు లంచు 6
బడులు వడి వడి వెడ యెడలఁ
గడు నడరించుఁ గడఁక నిడుఁ గడ విడిముడులన్
బడు లిడు మెఱవడి కడిమిన్
బడుల గుడు లని నుడువ దడఁబడి వెడలకుమా 5
[వెడ = అల్పము; ఎడ = హృదయము ; అడలించు = వర్ధిల్లఁ జేయు;
విడిముడి = ధనము; మెఱవడి = గౌరవము]
నిండుగ నూర్వసంతములు నెమ్మి శరీరము నందు డెందమం
దుండఁగ బంధు వర్గము సహోదర సంయుత సోదరీమణుల్
మెండుగ నుండ నాత్మజ సమృద్ధి ధ నామిత ధాన్య భూ లస
న్మండన వాహ నావసధ మండలి వర్ధిలు గావుతన్ ధరన్ 4
నన్నయ వ్రాసె మున్నల ఘనస్తవనీయ మహాంధ్రభాషలో
వన్నెలు చిందు భారతము వ్యాకరణమ్మును శబ్ద శాసనుం
డన్న ప్రసిద్ధి నంది మఱి యాంధ్రము నందు సనాతనుల్ కవుల్
మున్నొక రైన లేనియెడఁ బో పరిపక్వత నందు నెట్టు లీ
మన్ననఁ బొందుఁ దెన్గిలఁ గ్రమమ్మునఁ జెందక వృద్ధి సద్యమే 3
అంబుధిఁ బానవట్ట మన నర్యమ బింబము రుద్ర లింగమై
యంబర మందు నుద్భవము నందెను వింతగ విశ్వనాథుఁడే
సాంబ శివప్రసిద్ధ పరమాంచిత తేజమె యర్చికోటులై
సంబర మొప్ప విశ్వమునఁ జక్కఁగ నిండెను వెల్గు నీయఁగా
బింబమె యస్తమించె శశిభృత్తు లయం బొనరించె నిద్రకై
యింబడరంగ లోకులకు నించుక కాలము విశ్వమంతటిన్ 2
ఇల నిరు వేలపై నిరువ దింకను నాఱవ యేఁ డొసంగుతన్
ఫలములు మానవాళికి నపారము లాయు రరోగ సారముల్
సలలిత రీతి సంపదలు సౌఖ్యము శాంతిని స్నేహ వృద్ధులన్
విలయము నంద వైరములు విశ్వము నందు నిరంతరమ్మునున్ 1
సమస్యాపూరణ_జనవరి 2026
పాడిగ వ్రాయం దగ నీ
మూడు పదమ్ములను జరణముల గతి భళిరా
వేడుక మీఱఁగ నింపుగ
మూడునకున్, నాల్గు, గలుప ముప్పది యగురా 66.
[ముప్పది = త్రిపద;
మూడునకున్
నాల్గు
గలుప]
నేఁడును వాడ వాడలను నెమ్మి చరించి గణింప నింపుగాఁ
బాడిగ సుప్రసిద్ధములు భారత వాఙ్మయ మందుఁ జక్కఁగా
మూడు చతుష్టయమ్ముల సమూహము నాఱు త్రయమ్ము లిద్ధరన్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్ 65.
[వేదోపాయ దుష్ట చతుష్టయములు; గుణ తాప కాల ఋ ణేషణ మూర్తి త్రయములు]
మ్రుచ్చులే చెలగంగ విత్త విమోహులై కడు ధాత్రిలోఁ
జెచ్చెరం గపటం బెఱింగినఁ జెప్ప నెంచిన సత్యముం
గచ్చితమ్ముగ మూరి యక్కఱకాండ్రు లేక నటించినం
బిచ్చి వారికిఁ దెల్వితేటలు పెక్కు లుండును బిచ్చిలో 64.
లంచముం గొన్న యట్టి నరప్రవరున
కధిక బాధలు కల్గెడు విధము జనులు
స్వప్రయోజన మాశించి సతమపప్ర
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది 63.
వైన మెఱింగి యింపుగను వంచనముల్ వల దన్న విత్త వి
జ్ఞానులె యాచరింప నిల సాధ్యము కాదని తాము నేరినన్
మానక గెల్వ నెన్నికల మంతన మాత్మ నొనర్చి వ్యర్థ వా
గ్దానము సేయు వారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్ 62.
చైద్యుని వల దన నుభయులు
వాద్యమ్ములు మ్రోగుచుండ భారత రణమం
దాద్యులు, చేరని వీరుఁడు
ప్రద్యుమ్నుం డొకఁడు, పంచపాండవు లందున్ 61.
[అందున్ = ఆ భారత రణములో]
వేద్యుం డీతఁడు మారుతాత్మజుఁ డనన్ విశ్వంబునం దింపుగా
సద్యః కోప యశో విరాజితుఁ డిలన్ సంగ్రామ నైపుణ్యు లం
దాద్యుం డాజి విజేత భీముఁడు సహస్రానేక మాతంగ వ
త్పద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ 60.
[ప్రద్యుమ్నుండు = మంచి బలము కలవాఁడు]
తంట లిడకు నీ వే మను
కొంటివి యిటు లన బలాది గుణ రాసులఁ గ్రా
ల్గంటులతోఁ బోల్పఁగ వే
యింటికి దీపమ్ము మగఁడె యే గతి గనినన్ 59.
[మగఁడు = పురుషుఁడు]
మూరినచోఁ బ్రభువుల యప
కారము సుఖ జీవన లయ కారణ మగులే
వారని పాలక జన సహ
కారమె సుఖ జీవన హిత కారణ మగులే 58.
నీరము నిండుగాఁ దనరు నిండు ఘటమ్ము తొనంక దయ్య గం
భీరము వార్థి మధ్యమము భీషణ రావ విహీన మౌను సం
సారము నందు భాసిలెడు శాంతము నిత్యము వీడఁగా నహం
కారమె కారణం బగు సుఖప్రద జీవన శైలి కెప్పుడున్ 57.
గూటి లోన నున్న గ్రడ్లఁ గాకి బొదుగఁ
గల్ల కాదు సుమ్ము పిల్ల లైనఁ
గూఁత రాక యున్న నాతత రీతినిఁ
గాకిపిల్ల ముద్దు కోకిలకును 56.
పోక నిల్చిన కూనపై నెద మూరఁ గూరిమి యంతటన్
వీఁకఁ దప్పు నెఱింగి యంత విభేద మేర్పడఁ గూఁతలన్,
రాకతోను వసంత కాలము వ్రాలి కైకొనఁ గాకమే
కాకిపిల్లను, గోకిలమ్మయె కాంచి ముద్దిడెఁ బ్రేమతో 55.
రుగ్వ్యంజన రాసుల స
మ్యగ్వ్యయము కరమ్ము భావ్య మైన విధమునన్
ధిగ్వ్యర్థ భాషణమ్ములు
వాగ్వ్యాపారమ్ము లేని వాఁడె బుధుండౌ 54.
ధిగ్వ్యంగ్యార్థ వచో విరాజి సిరులం దేలంగ వీక్షింపమే
లుగ్వ్యాయాముఁడు భాసిలం గనమె యే లోపమ్ము లేకుండఁగా
దిగ్వ్యాకీర్ణ దివాకరప్రభలు ఖ్యాతిం గాంచి వర్ధిల్లవే
వాగ్వ్యాపారము లేని వాఁడె బుధుఁడై ప్రఖ్యాతి నందెన్ గదా 53.
[వాగ్వ్యాపారము = వాక్కుల యమ్మకము]
గురు తప మొనరింప నరే
తరుల వలనఁ జావు లేమి ధాత యొసంగెన్
నిరతమ్మును జెలరేఁగుచు
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్ 52.
వర మిడ పద్మనాభుఁడు సుపర్వుల కింపుగ లోకరక్షకై
పురుష వరుండు రాఘవుఁడు వుట్టె వధింపఁగ రావణాసురున్
సురముని దత్త శాపమునఁ జోద్యము వైశ్రవణుండు కండ కా
వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్ 51.
వీఁకఁ జేయు చుండి లోకోపకారము
స్వార్థ చింత వీడి సంతతమ్ము
శిష్ట జనులఁ గాచి దుష్ట జనులఁ గాంచి
దూఱు వాఁడె యఘ విదూరుఁ డగును 50.
పాఱక భీతి నెన్నఁడును వారక దుష్టుల ఘోర కృత్యముల్
దూఱుచు మంచి బుద్ధులను దోరము వారికి నేర్పి మార్చుచున్
మీఱి జగజ్జనావన నిమిత్తము మ్రొక్కఁగ మందిరమ్ములం
దూఱెడి వాఁడె దుష్కృత విదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ 49.
[దూఱు= నిందించు; తూఱు= చొచ్చు]
సుతు లెల్ల భుజించిరి నీ
కతులమ్ముగ నాఁకలి యని యాత్మ నెఱుఁగుదున్
హితముగ భోజన మే నుం
చితి సిద్ధము రమ్ము నాథ చేకొన సుఖముల్ 48.
పతి సేవన్ సతి మగ్న యై మసలుటే భావ్యంబు నాఁ దల్చెదన్
సతతం బివ్విధి నుండఁ గోరెదను నా స్వామీ స రాగమ్ము సు
వ్రత సంతోషము నిండె డెందమున నీ లాలిత్యముం గాంచ మె
చ్చితి సిద్ధం బిఁక రమ్ము నాథ తనియన్ శృంగార యజ్ఞంబునన్ 47.
ఓర్పు, నేర్పు, మార్పు, తీర్పు
పదాలతో పద్యము.
ఓర్పుష్కరమ్ము కురియఁగ
నేర్పుడమిం బాఱ మేఘమే యడరఁగ వే
మార్పుష్కలముగ వెస నా
తీర్పురికొల్పదె ముదమ్ము స్థిరముగ నెదలన్ 46.
[ఓరు+పుష్కరము = ఓర్పుష్కరము, గాలిధ్వని మఱియు నీరు/
పెద్దగా నీరు; ఏఱు+ పుడమి = ఏర్పుడమి; మారు + పుష్కలము =
మార్పుష్కలము; తీరు + పురికొల్పు = తీర్పురికొల్పు]
అచ్చమైన తెల్లని దని మచ్చరమ్మ
యీఁద నేర్చు నింపుగ నని యీర్ష్య మెండ
కవులు దాని వర్ణించుట కారణమ్మ
యంచపై గ్రుడ్లగూబకు నలుక యేల 45.
మంచుఁ బోలు తెల్ల నైన మనసు దనరు పూరుషుం
గొంచె మైన జాలి లేక కొట్టు చుండు నిత్యమున్
మించి యింగిలంపుఁ గెంపు మేటి గ్రుడ్డు లున్న వాఁ
డంచ పైన గ్రుడ్లగూబ కంత కోప మేలనూ 44.
నీ యడుగులకు మడువులన్
వేయ వలెన లేక యున్న విద్వేషమునం
దీయఁ దలంతువె మానము
వ్రాయకు మయ వ్రాయ కిట్టి వ్రాతల నింకన్ 43.
కాయకు కాయఁ బోకు మయ కాయకు కాయకు పందె మెన్నఁడుం
దీయకు తీయఁ బోకు మయ తీయకు తీయకు తిట్ల పొత్తమున్
రోయకు రోయఁ బోకు మయ రోయకు రోయకు మాత్మ బంధులం
గూయకు కూయఁ బోకు మయ కూయకు కూయకు మిట్టి కూఁతలన్
వ్రాయకు వ్రాయఁ బోకు మయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాఁతలన్ 42.
దండకారణ్య మందుఁ గదన మొనర్ప
ముని వరేణ్యల రక్షింప నినకులుండు
మించి యొకపరి యెదిరించు మేటి యసురు
లాయనకు నేవు రైరి రామాయణమున 41.
ఆయన కని యంటివి యెవ్వ రా నర వరుఁ
డేవు రంటివి గద వార లెవ్వ రయ్య
యెట్లు విశదమౌ నయ్య నీ విట్లనంగ
నాయనకు నేవు రైరి రామాయణమున 40.
కంగా రేలయ చెప్పెదన్ నిలుమ నిక్కం బే విధంబయ్యెనో
యంగీకారముతో నజాత్మజుఁడు పూజార్హుండు శాంతాఖ్యఁ బ్రీ
తిం గాంతా మణిఁ గూఁతుఁ గాఁ గొనిన రీతిన్ బిడ్డ లింపారఁగా
రంగా యాయన కేవు రైరి గదరా రామాయణం బందునన్ 39.
ఇమ్మహి నింపుగ సంరం
భమ్మున శీఘ్రంబ దుష్ట మానవ సాంగ
త్యమ్మును వంచనముల దురి
తమ్ముల వీడంగఁ గల్గు ధర్మము ముదమున్ 38.
సొమ్ముల నింక రాజ్యమును జూదము నందుఁ జెలంగి యొడ్డి తా
నమ్మక చెల్ల యోడినను నాగక యాడుచు మానసమ్మునం
బమ్మిన యట్టి పంతమునఁ బార్థుఁ డజాత రిపుండు దారనుం
దమ్ముల నోడె ధర్మజుఁడు తప్పక ఘోర వినాశనంపు నె
త్తమ్ముల వీడఁ గల్గుఁ గద ధర్మము తోషము సిద్ధియున్ ధరన్ 37.
నారీమణి పాయసమున
ధారాళము ప్రీతి నాకుఁ దనియక కట్టా
నోరూరఁ దినఁగఁ దినఁగ వి
కారము పాయసము నందుఁ గడు హెచ్చయ్యెన్ 36.
కారుణ్యమ్మున విందు నీ వొసఁగినం గాంతా విచిత్రమ్ముగం
బారావార నిభమ్ముగా నడరుచున్ భాసిల్ల భాండమ్ములం
దోరంబై కనిపించు నా యతిథి సందోహమ్మునం బ్రీతి స్వీ
కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా 35.
దిట్ట వేదాధ్యయనమున దిట్ట యౌ ని
తం డుపన్యాసము లొసంగ మెండుగాను
గద్యములు వ్రాయ నేర్చినఁ గాని వ్రాయఁ
బద్యములు రాని యవధాని వాసిఁ గాంచె 34.
[అవధాని = వేదముల నేర్పరి]
చోద్య మాతని పాటవమ్ము వచో విశారదుఁ డిద్ధరన్
విద్యలన్ ఘటికుండు మేటి వివేకి నైపుణుఁ డూహలం
బద్య సంచయ కల్పనా నుత పారగుం డయి వర్ణ నా
పద్య మొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్ 33.
[వర్ణన + అపద్యము = వర్ణ నాపద్యము, నీచమైన వర్ణనము]
అక్కజముగ నెదలోఁ గవి
తిక్కనయే యంచుఁ దలఁచితివ వనజాక్షీ
యక్కట వెస ఖడ్గపు టా
తిక్కనను వరించి తీవు తిక్కల పోరీ 32.
ఒక్కరి కున్నఁ దిక్క కనుచుందుము పోరు నిరంతరమ్మునుం
దిక్క సెలంగ నిద్దఱికి దిట్టగ జంట చరించు నొక్కటై
తిక్క గలట్టి యన్న యగుఁ దిక్కన తిక్కకుఁ దిక్క యొప్పనం
దిక్కననున్ వరించెఁ గద తిక్కల పోరి యిదేమి లొల్లియో 31.
రుణ్మనమున నడుగ నభ
స్త్విణ్మణి సాక్షిగ వచింపు వేల్పుల మిన్నా
షణ్ముఖ యే లోకమ్మున
మృణ్మయ పాత్ర వెల హెచ్చు హేమము కంటెన్ 30.
రాణ్మణు లుండ దేశమునఁ బ్రాకృత మానవుఁ డొంద నేర్చునే
త్విణ్మయ భర్మ భూషలను దిట్టతనమ్మున భారతమ్మునన్
షణ్ముఖ ధాత్రి నట్టి దివసమ్మునఁ దప్పక, యే దినమ్మునన్
మృణ్మయ పాత్ర కుండు వెల మిక్కిలి, స్వర్ణ ఘటంబు చౌకయౌ 29.
వనజాక్షుఁడు కరుణామయుఁ
డనిశం బార్త జన బంధువై చరియించుం
గినియక శరణాగతులను
దన శత్రువు లైన జనుల దైవము ప్రోచున్ 28.
తనిపెన్ మోక్షమునన్ హిరణ్యకశిపున్ దైత్యున్ హిరణ్యాక్షునిన్
వనితం జంపి యొనర్చెఁ బావనినిఁ దాఁ బాలీయఁగాఁ బూతనం
బనిపెం గంసుని స్వీయ లోకమునకుం బాపాత్ము నింపారఁగం
దనకున్ శత్రువు లైన వారిని సదా దైవంబు ప్రోచుం గదా 27.
మతి లేని వారు కొందఱు
నతుల నొసఁగి యేఁగుదెంచిన నృవరు లన్యుల్
వితతజ్ఞానులు జరిగిన
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే 26.
మూరి శతావధానమును ముచ్చట గొల్ప నొకండు సేయఁగా
నేరఁడె వేయఁ బ్రశ్నలను నెమ్మి నొకండును వంద ప్రేక్షకుల్
తోరము మెచ్చ నన్న యది తోఁపక యిట్లని పల్కు వార లె
వ్వారు శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబది మంది చాలరా 25.
సాధారణ విషయం బిది
బోధింపరె సత్కవులు విపులముగ నిత్యం
బీ ధర వేఁడిమి తమ్ముల
బాధింపదు చలివిభుఁడు ప్రవాసం బుండన్ 24.
[చలివిభుఁడు= చలువఱేఁడు]
ఇలలో నింతుల గుహ్య చిత్తముల నూహింపంగ నెవ్వారికిం
దలమౌనే పతి కైన బ్రహ్మ కయినం దథ్యంబుగా నక్కటా
చెలి కిష్టం బఁట యాకుకూర లన నిస్సీ చెంత నుండంగ బ
చ్చలి బాధింపదు వల్లభుండు పరదేశం బేఁగి రాకుండినన్ 23.
చింత సేయ వైతి సుంత యేని నకట
మందబుద్ధి వైతి సుందరాంగ
వే రొకండు లేఁడె యూరిలో నీ కయ్యొ
వాడ వాడ దిరుగు వాఁడు గురువు 22.
పాడిగఁ బార్థ పౌత్రునకు భాగవతమ్మును జెప్పె నిల్చి యే
నాఁడును సుస్థిరమ్ముగ మనస్వి మునీంద్రుఁడు నిల్చు వాఁ డహో
కాఁడఁట క్షీరముం బిదుకు కాలము మాత్రమ యుండు నొక్కెడన్
వాడల వాడలం దిరుగువాఁ డఁట విశ్వ గురుండు చిత్రమే 21.
పురముల క్షేమం బరసి యె
గుర ఱెక్కలఁ గూడి మున్ను కోసె నెఱకలన్
సురపతి ముల్లోకమ్ముల
గిరి విధ్వంసకుని జనులు కీర్తింత్రు సదా 20.
నరలోకమ్మునఁ గొండలే యరయఁగా నారాయ ణావాసముల్
గిరి పూజా రత మానసుల్ జనులు శంకింపంగ రా దేరికిన్
సుర లోకాధిపుఁ గూడి సప్తగిరి వాసున్, శక్రుఁ డుద్రేకియై
గిరి విధ్వంసకుఁ డైన, శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా 19.
వాఙ్మాత్రమ్మున దుస్సహ
దృఙ్మహిమ మడరఁగ దుర్మతి దశాస్యునకుం
దిగ్మాంశుఁడు నమ్రుండై
ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై 18.
వాఙ్మయ మందు నింపుగను భానుఁడు చంద్రుఁడు సుప్రసిద్ధులే
రుఙ్మయుఁ డస్తమించు తఱిఁ గ్రూరత క్షీణము గాఁగ విస్తృ తా
సృఙ్మయ రూపమేర్పడఁగఁ జిత్రముగాఁ గమనీయ కాంతిమ
త్ప్రాఙ్మణి యైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను జంద్రబింబమై 17.
మితముగా వచింప మేలొనఁగూర్చును
మితపు వ్యయ మొసంగు మేలు సతికి
జీర్ణమై త్వరితము చేవ నొసంగి య
మితము గాని తిండి మేలుఁ గూర్చు 16.
జిత నిజ దుర్దమేంద్రియుఁడు చెన్ను వహించు నిరంతరమ్మునున్
మిత మన నేర వెన్నటికి మించి జనించుచు నుండుఁ గోర్కెలే
సతతము కామితమ్ములు భృశమ్ములు జిహ్వకుఁ గాంచ మెన్నఁడున్
మితము నతిక్రమించి తిన మే లగు నెప్పుడు మానవాళికిన్ 15.
హరి వచన మాలకింపుడు
గిరి రిపు సేవన మదేల కృతమతు లారా
ధర గోవర్ధన పుణ్య శి
ఖరమును సేవించి కనుఁడు కైవల్యంబున్ 14.
ధరణీ భృద్ధర పద్మనాభ కరుణోదన్వద్భృశాపన్న స
చ్ఛరణార్థివ్రజ దీన సంచయ సమంచద్భక్త కోటీ నిరం
తర రక్షా పర సర్వ జీవ నిచయాంతర్యామి గీర్వాణ శే
ఖరపాదద్వయ కంజ సేవనమునం గైవల్య మందం దగున్ 13.
పట్టు వదల కుండ వాదించి వాదించి
సత్యము గెలిపించి యత్యధికము
ద్రవ్య మపహరింపఁ బ్రత్యర్థులకుఁ బట్ట
వ్యాధి, నయ మొనర్చు న్యాయవాది 12.
సాధన తోడ జ్ఞానము భృశమ్ముగ నుండఁ బ్రసిద్ధ వైద్యుఁడే
బాధ లొసంగు రోగమును బన్నుగ మాన్ప ధరాతలమ్మునన్
నైధన తుల్య సంకటము జ్ఞాతి నికాయ మొసంగు నా మనో
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధ మిచ్చును న్యాయవాదియే 11.
దైవ కృప సన్నగిల్ల స్వభావ మణఁగు
నమ్ముకున్న తనదు శక్తి నాశన మగు
నోడ లరయంగ బండ్లగు నుర్విఁ బాఱ
నీరు పల్ల మెఱుంగదు నేరు మిట్ట 10.
చల్లగ నున్న మానసము సాగును సుస్థిర మైన రీతి భా
సిల్లును భావజాలములఁ జెన్నుగఁ గంప మెఱుంగ కెవ్విధిం
బెల్లుగ వాయు వైనఁ గడు వేఁడి గ్రహింప ననూహ్య రీతినిం
బల్లము నుండి యెత్తునకుఁ బాఱు జలంబులు సర్వ కాలమున్ 9.
అఖిల మానవులు నిరాడంబరు లయినఁ
దారతమ్యము లిల నేర రెవరు
వేష భాష లందు భూషణమ్ముల నిర్వి
కార మున్ననె మమకార మలరు 8.
గౌరవ మాన వాళి సహకారము పెద్దలు సెప్పు నుళ్ల స్వీ
కార మిహోపకారము నఖర్వ సనాతన సన్ను తైక సం
స్కారము వేష భాషల వికార విహీనము నిత్య నిర్మ లా
కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గ దెప్పుడున్ 7.
చక్కఁగఁ దనకు భర్తగఁ జక్రధరుని
దయ నొసంగు నని మదినిఁ దలఁచి యంత
నరసి యర్ధ నారీశ్వరు కరుణ గరిమ
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని 6.
మునుముం దూనుచు మాల లింపుగను సమ్మోదమ్మునన్ నిత్యముం
దన నాథుం డని పద్మనాభు మెడలోఁ దా నుంచు నా దండలం
దన కింపారఁగ వెన్నునిం బతిగ సంధానింపఁగాఁ గోరుచుం
దన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్ 5.
నేరముగా భావించి పు
రారాతి కని విరి శరము లట ఫాలాగ్నిం,
గోర కొనర్పఁగ సమరము
మారుతి! చక్రాయుధమున, మారునిఁ జంపెన్ 4.
నారి కసత్య మాడఁ గడు నైపుణ ముండు నటంచు విందు నే
సూరి జనోక్త వాక్యమును సుంతయుఁ జింత యొనర్ప కాత్మలోఁ
గోరి యసత్య మొక్కటినిఁ గోమలి పల్కు మనంగ నిట్లనెన్
మారుతి చక్ర ఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో 3.
ఈశ్వ రానుగ్రహమ్మున హీన విక్ర
ముండు సెలరేఁగి యొకనాఁడు పాండు సుతుల
సమర వీరుల వారించె సైంధవుండు
కాల సర్పముం గబళించెఁ గప్ప యొకటి 2.
విను తెరు వందు నేగుచును వేగము మీఱ బలాఢ్యుఁ డొక్కెడన్
మును గజ కచ్ఛపమ్ములను మూరి భుజించిన వాఁడు చక్కఁగా
ఘనుఁ డగు పక్షి రాడ్వరుఁడు కశ్యప సూనుఁడు రేఁగి రెంటినిం
గనుఁగొని కాల సర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్ 1.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)