అగ్గిరివ్రజాధిపతి మహాభుజుండు
ఘన ధనేలబిలాత్మజ కాంతి దనరి
నీరు బలుడు మురారియని తలచి మదిఁ
దఱచు గాలి పోరాడెను ధరణి నతఁడు 1
[నీరు = అల్పము; కాలు = మండు]
కారణ మేమైనను మమ
కారము నుపకారము నిలఁ గమనీయపు స
త్కారము రమణీయ శుభా
కారమ్మును మించి తీపి కలదే పుడమిన్ 2
తారక రామ పాదయుగ దర్శన తత్పర మానసమ్మునన్
ధారుణి మోక్ష సాధన విధానము నెంచి నిరంతరమ్ము దా
భారము నుంచ దైవమున భక్తి తటాకపు విష్ణునామ ఝం
కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడఁగన్ 3
సత్యము గెలుచు నన్నిట నిత్యము నిలఁ
గపటము గెలుచు టెల్ల తాత్కాలికంబ
నిష్ఠురంబని యెంచి పనిగొని నిజము
నడక హానికారకము మానవుల కెపుడు 4
[నిజమును+అడక = నిజము నడక; అడకు = దాఁచు]
పడయరె పుణ్య ధామములు భాగవతోత్తము లెల్ల కొల్చిన
న్నడరి మనంబు నందుఁ బరమాత్ముని నిల్పి నిరంతరం బిలం
దడయక మూఢ భక్తి నికఁ దంత్రము సేకొని గుండ మందుఁ దా
నడచుట హానికారక మనాగరికం బగు మానవాళికిన్ 5
నేత్ర యుగళి సూర్య నీరజ రిపు భాతి
నొప్ప నురము నందు నుభయు లలరుఁ
బోడు లొప్ప నుదుటఁ బుండ్ర మమరెను మ
హాత్మ కావుము కరు ణాలవాల 6
గండర గండుని మద్దెల
డాండడ డాండాం డడాండ డా మ్మనె, వీణెల్
మండిత సుహాసినీ కర
మండితమై మ్రోగె రుచిర మందధ్వనినిన్ 7
కడు దూరంబున నుండి బండి పయి చక్కం బెట్టి యా వీణెలన్
తడఁబా టింతయు లేక పోవునెడ సత్వం బడ్డుగన్ వచ్చినన్
వడిఁ దా నాపఁ దటాలునన్ ధరణి సంపాతమ్ములై యన్నియున్
డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్ వీణియల్ 8
వరుడై యింపుగ నంతటఁ
దరుణుం డొక్కఁడు ముదముగఁ, దరుణీ మణియే
వరియింపుమంచుఁ బెట్టగ
పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్ 9
[గళము+అందుచు+ఆన = గళమందుచాన]
వరుఁడు గుణాధికుండు వర బంధము నిల్పగ, నత్త మామ లా
పరమ పవిత్రమై వెలుఁగు పావన సూత్ర మలంకరింపగం
బురుషుని కంఠమం దపుడు, పుస్తెను గట్టెను, చాన వేడ్కతో
నురమున హస్త ముంచి కను చుండగ సూత్రము, సంతసమ్మునన్ 10
[సూత్రము = 1. జన్నిదము, 2. మంగళ సూత్రము]
ధరణిజకు నీయ నతి దు
ర్భర దుఃఖము నా దురాత్ము రావణుని ఘొరా
సుర రాజుని, నగ్రజుఁ డా
భరతుని రాఘవుఁడు, దునిమె భామిని కొఱకై 11
పరమ పవిత్ర వంశమునఁ బన్నుగఁ బుట్టిన లాభ ముండునే
పరసతిఁ గోర నేరికినిఁ బ్రాణము నిల్చునె ధాత్రి నెన్నడున్
వరబల గర్వి రాక్షసునిఁ బార్థివు రావణు కామ మోహ లో
భ రతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్ 12
వగచిన నేమి ఫల మిక న
వగతము గాక గణితంపు ప్రశ్నలు సాధిం
పగఁ దరమే నీ కిత్తరి
సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా 13
బిగిసిన కర్మఁ దా మనుభ వింపక తప్పునె యెంత వారికిన్
జగతిని సూర్య చంద్రులకు శత్రువు రాహువు భానుఁ బట్టగం
బగఁ గొని యామహా గ్రహణ బంధపు రోజునఁ దామసమ్మునన్
సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడి ప్రొద్దు జామునన్ 14
నిషిద్ధాక్షరి: ఓష్ఠ్యములు(ప,ఫ,బ,భ,మ లు). వానరుల సహాయముతో రాముడు వారధిని నిర్మించుట:
సాగరుఁడు నుడువ సత్తువ నలునిది
రతిఁ గొని నలుఁ డిక రాఘవాజ్ఞ
వానర సత్కృతి వఱలంగ సాలాశ్వ
కర్ణ కుటజ వంశ కర్ణికార
తాలార్జు నాశోక ధవ చూత తిలకాది
వృక్ష షండ సహిత వివిధ ఘనశి
లా కాష్ఠ తతులు వేర్చగ జలధి నతిశ
యించి యైదు దివసా లెంచి యంత
కట్టి రట వారధి తొలి వగటిని నేడు
నేడు యోజనా లనువుగ నింక నిరువ
దియు నిరువది యొక్క టిరువది యును రెండు
నిరువదియు రెండు నొక్కటి యెల్ల వరుస 15
[వారధిని ఐదు రోజులలో వరసుగా 14, 20, 21, 22 & 23 యోజనాలు దూరము కట్టిరి]
సుద్దులు చెప్పిరి యివ్విధిఁ
దద్దయుఁ బొగుడుచు నసురుని దైత్యాంగనలే
ముద్దియ గమి రావణుఁ గని
ముద్దిమ్మనె, జానకి! దశముఖునిం బ్రీతిన్ 16
తద్దైత్యాంగన ధర్షితార్తిఁ గడు సంతాపమ్మునన్ వేగఁ దా
నిద్ధైకాగ్ర్య చరిత్ర చిత్తమునఁ బ్రాణేశున్ మహాబాహునిన్
ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్
గుద్దుల్ గుద్దిన వాని యుద్ధమున సత్క్రోధమ్మునన్ లంకలో 17
నీరజ నేత్రాబ్ధిజ ముఖి
నారామ విహారిణి విమలాదిత్య కులాం
భో రాశి శశి నిభుం డా
సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్ 18
[సతి = పతివ్రత; చిత్రాంగి = చిత్రమైన శరీరము కలది, వనిత]
విదితం బిద్ధర వేగిరంపుఁ బను లన్వీడంగ మే లయ్యెడిం
గదలంగన్ నిజ సేన ఖడ్గమునకుం గళ్యాణ వైభోగమున్
హృది హర్షంబున వే తలంచి యిటు ధాత్రీశుండు దాఁ జేసెఁ ద
ప్పదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై 19
తా నరసి టక్కియమ్మున
నానా రుచిఁ గోవిదార నగ రాజమ్మున్
సేనా సహితము భరతుఁడు
గానోపు ననుకొనె గుహుఁడు కమనీయముగన్ 20
గోముగ వేంకట రమణుఁడు
భామల గూడి వసియించు వర వృష గిరినిం
గామిత వరప్రదంబం
చీ మలఁ గొల్చిననె కలుగు శ్రీ భాగ్యమ్ముల్ 21 [ప్రదంబంచు + ఈ మల = ప్రదంబంచీమల; మల = కొండ]
వేమఱుఁ జూచు చుందు మిలఁ బెక్కుర నుండగ మూఢ భక్తినిన్
మై మఱ పేల దైవమును మానుగఁ గొల్చిన నుత్తమం బగున్
గోముగ జ్ఞాన కోవిదులకుం దగునే పలుకంగ నిట్టులం
“జీమల గొల్చినన్ సతము జేకుఱులే ఘన భోగ భాగ్యముల్” 22
మాయా మయ మీ విశ్వము
ప్రాయమ్ములు బుద్బుదంపుఁ బ్రాయములు సుమీ
కాయమ్ము లనిత్యమ్ములు
వోయిన దేదియును దిరిగి పొందగ వశమే 23
తోయపు వారి కీయ పరితోషము వొందగఁ బుస్తకమ్ములుం
బాయక దృష్టి విత్త సముపార్జనపై సతి నుంచ నొక్కెడన్
మాయపు మాట లెల్ల విని మన్నన నిచ్చిన విత్త రాశులుం
బోయిన దేదియుం దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే 24
సుర గణాధినేత సుత్రాముఁడు బలారి
పాకశాసనుండు వజ్ర ధారి
పర సతీ వికార వశమున ధర్మము,
గనులు వేయి గలిగి, కాంచ లేఁడు 25
తన్నిల వైనతేయునకుఁ దాదృశ మంచు వచింప నెల్లరున్
మిన్నున సంచరించుచు నమేయ జవమ్మున బర్హి రాజమే
పన్నుగఁ దారకమ్ము లనఁ బక్ష యుగమ్మునఁ జిత్ర చిత్రపుం
గన్నులు వేయి గల్గినను గాంచఁగ లేఁడు గదా ప్రకాశమున్ 26
ప్రకృతి కాంతామణి రుచిర ఫాల తటిని
భాసిలు తిలక బింబంపు భాతి వెలసి
తరుణ రవి బింబ మిచ్చెను దర్శనమ్ము
ముగ్ధ మోహనముగ నంతఁ బూర్వ దిశను 27
వేడుక సుదూరవాణుల
వాడియయినవార్తలువినఁ బలువురమాటల్
తోడై విన్పడె వింతగ
గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్ 28
తాడితు లైన శీర్షమున దద్దరిలం దల జ్ఞప్తి హీనులై
తోడుత మేధ యందు సమతుల్యము జారగఁ బ్రశ్నవేయ మా
రాడెద రిట్లు భ్రష్ట మతు లందరు నుష్ణము ప్రజ్వరిల్లగన్
గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై 29
ఆపదలు గలిగినఁ జూతు మపుడు జనత
కనఁగ గత జల సేతు బంధనమె, మేలు
కల్గును భువిని ముందుగఁ గర్జములను
బన్నుగఁ దలచి చేసిన బాధ్య తఁగొని 30
[జనతకు+అనఁగ = జనతకనఁగ]
మతిసెడి రెండు సేతులును మండిన నాకులు వట్ట లాభమే
ప్రతిఫల మెంచి ముందుగనె పాటు పడంగ సతమ్ము మేలగున్
నుత జల పూరితమ్ములు వినూతన ధారల నిండు నిమ్న గా
గత జల సేతు బంధనమె కల్గగఁ జేయు ననంత లాభముల్ 31
[నిమ్నగ+ఆగత = నిమ్నగాగత]
ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు
ననఁగ రా దెవ్వరికి నేల ననఁగ ధ్యాన
మిచ్చు నిలఁ జిత్త శాంతిని నేరి కైన
శాంత చిత్తుండు వర్ధిల్లు సద్గుణముల 32
మానవ జన్మ సర్వభవ మండన మిద్ధరఁ బొంద భాగ్యమౌ
గాన సుమోక్ష సిద్ధికి నిగాదము విజ్ఞులచే నిలన్ సురా
పాన పలాన్న భక్షణకు బానిసలై యిహ లోక కామద
ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్ 33
పండు వెన్నెల కురిపింత్రు చండ రాత్రిఁ
గొండఁ జేయుదు రింపుగఁ బిండి పిండి
యుండ శైత్య యంత్రమ్ములు దండిగ నిక
మండు వేసవి లోఁ జలి మెండు సుమ్ము 34
చూసిన మిక్కుటమ్ముగను జోద్యము లీధరఁ గాల ధర్మముల్
కాసిన వెన్నె లొక్కతరిఁ గాయును మెండుగ నెండ లొక్కెడన్
గాసిలఁ జేసి శీతలపుఁ గాలమునం, గనిపించ నేరదే
వేసవి కాలమందు, చలి వెక్కసమై వడకించు నెల్లరన్ 35
పాప ముదురు విష మిచ్చి ప్ర
కోపము ఫణులఁ గరపించి కుంతీ సుతునిం
జూపి ప్రతాపమున నద భృ
శాపమునం ద్రోసిరి పెలుచనఁ గౌరవులే 36
[నద భృశ+ఆపము = నదభృశాపము: అధిక నదీ జల సముదాయము; ప్రకోపము = ముమ్మరము; ప్రతాపము = తేజము]
పలుకులనొలుక తీయటి వలపు లెల్ల
తలపులఁ జిలుక కమ్మని కులుకు లెల్ల
లలిత లలితంపు మినుకుల నిలను దనదు
కలికి కౌగిలి ప్రాణాంత కారి గాదె! 37
[కాదని భావము.]
విలవిల లాడి ద్రౌపదికి వీడెను బ్రాణము కీచకుండలన్
వలచియిలాతనూజనటఁ బ్రాణము వీడెను రావణుండు మున్
లలనలు నిప్పు రవ్వలు ధరంగన నన్యున కామె చెందినం
గలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా 38
ధారుణి నదృశ్యము ప్రజా
వారమ్మున కెల్ల వాయు భక్షిణియు నిరా
హారి సుముదాశ్రు ధారల
శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్ 39
[శిల = సెలయేఱు]
నీమము తప్పి నందులకు నిత్య తపోధన సంయ మీంద్రునిన్
భీమపు శాప తప్త యయి పేర్మిని నొక్క నిమేష మాత్రమున్
వామసులోచ నాతిశయ వర్ష సహస్రము లెల్ల వేచి తా
రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే 40
[రాయి = స్థాణువు, నిశ్చేష్టత]
చక్కని విషయమ్ము తెలిసె నిక్కముగను
మూడు కోట్ల సురలు సతీ మూర్తు లనుచు
సకల దేవతారాధన సమము, మేము
నేర, మగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము 41
[నేరము+అగు =నేరమగు; నేరము = ఎఱుఁగము]
ఘన దోషమ్మగుఁ గీ డొసంగు సతికిం గాత్యాయనీ పూజలే
మన మందింపుగ భక్తి నుంచి, యిక సంభారమ్ము లే మాత్రముం
గన లేకున్నను, జేయకున్న నట కాంక్షాహీన చిత్తంబునం
దనరున్సంపద లెల్ల కొల్లలుగఁ దత్కారుణ్య మేపారగన్ 42
అనుమతి నంది నిజ పతిది
యనిమిష పతి వాయుదేవు డట మరియున్నా
యిన సూనుండు ఘనుడు ధ
ర్ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్ 43
ఘన విరహాంబుధిన్ మునిగి కానలఁ బద్మదళాయతాక్షియే
మనమున రామ పాదములు మన్నన తోడ స్మరించి నిత్యమున్
వనమునఁ బుట్టపుట్టువు నపార కృపం గని, రాఘవేంద్రు రా
ముని సహవాసమంది, సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్ 44
సత తాబ్జభవ మనోరత
విత తాభిన వాక్షమాల విలసిత హస్త
ద్యుతి జిత శశాంక తను భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్ 45
కతిపయ మానవేంద్రులకుఁ గల్గును సందియముల్ మనమ్ములన్
ద్యుతిసెడి వ్యర్థ కార్యములఁ దోరము నిల్పగఁ జిత్త మంతయున్
స్తుతమతి కేల సంశయము చోద్యమ!వాణికి భర్త, కంతుఁ డా
రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్ 46
పశ్చిమంపు దేశమ్ముల భానునిఁ గన
దుష్కరము కొన్నిట నచట దుర్దినముల
పార మొకచోట, నట గల వా రెఱుగరు
మండు టెండలోఁ, గురిసెను మంచు జల్లు 47
[మండుట + ఎండలో = మండుటెండలో]
గండర గండు లెల్లరను గల్గిన క్రూరపు భీమ చౌర్య దు
ష్షండము కొల్ల గొట్ట నిజ సంపద నంతయు క్షుత్పిపాసఁ దా
నుండగ దుఃఖ తాపమున నుత్తమ మిత్రుడు సేద దీర్చగన్
మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్ 48
పుత్రికా వివాహ దివసంబునఁ దలంచి
సుతను లక్ష్మీస్వరూపి యంచు మది నాపొ
లతి వ్రతోద్యాప నావసరమున నడరి
యమ్మయె నమస్కరించిన దాత్మసుతకు 49
కమ్మని భాషణమ్ములను గర్జము లీయగ దీవనల్ భువి
న్నిమ్ముగఁ బిన్న వారలకు నీప్సిత సిద్ధికి చిత్త వృద్ధికిన్
నెమ్మి నమస్కరించితిని నే బితృ దేవునకే యథోక్తి, కా
దమ్మ నమస్కరించినది యాత్మతనూజకు, భక్తియుక్తులన్ 50
ఆపడతిని హంస గమన
నా పూర్ణేందు నిభ ముఖిని నరయ మనమునం
దాపము జనించి కామ ప్ర
కోపాగ్నులు గురిసినంతఁ గూరిమి హెచ్చెన్ 52
[ప్రకోపము = ముమ్మరము]
పాపపు చింత లేదనుచు భామయ తీర్చఁగ సంశయంబునే
యేఁపునఁ బల్కి తే నటుల నింతియ యంచును జెప్ప దైవపుం
బ్రాపున సత్యమంత ననురాగపు జల్లు లికన్, శమించ నా
కోపపు టగ్నులే, కురియఁ గూరిమి హెచ్చె నదేమి చిత్రమో 53

భద్ర మగు వసుమ తీంద్రున
కద్రి నిభ దృఢాంగకునకు నవని తనూజా
భద్ర విదూరునకా కాం
తద్రుణ భేదికి ఘనారి దర్ప లయునకున్ 51
[కాంతము = ఇనుము; ద్రుణము=విల్లు]
ఆపడతిని హంస గమన
నా పూర్ణేందు నిభ ముఖిని నరయ మనమునం
దాపము జనించి కామ ప్ర
కోపాగ్నులు గురిసినంతఁ గూరిమి హెచ్చెన్ 52
[ప్రకోపము = ముమ్మరము]
పాపపు చింత లేదనుచు భామయ తీర్చఁగ సంశయంబునే
యేఁపునఁ బల్కి తే నటుల నింతియ యంచును జెప్ప దైవపుం
బ్రాపున సత్యమంత ననురాగపు జల్లు లికన్, శమించ నా
కోపపు టగ్నులే, కురియఁ గూరిమి హెచ్చె నదేమి చిత్రమో 53
కారణ శతమ్ము లుడివిన నేర మది య
దోషమే? కాదు చేయుట దొంగతనము
దాన ఫలిత మనుభవింపఁ దప్పునె యిహ
మున నయినఁ బరమున నైన ఘనుల కయిన 54
అంగజ సన్ని భావయువ యాదవ పుంగవ వాసుదేవునిన్
సంగర సింహవిక్రముని సన్నుత వాసవ సక్త చిత్తయై
యంగన రాధ తల్చె మది నచ్యుతు కృష్ణుని దివ్య చిత్తమున్
దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే 55