సరసంపు హావ భావమ
లరంగ నొక గాయకబ్రు వాధిపుఁ గనుచున్
సరసన నున్నది గార్దభ
గురు వారమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్ 34
[గురు = గొప్ప ; వారము = సమూహము]
గిరిరాజ కన్య శాంభవి
మరకత మాణిక్య కంఠ మంగళ గౌరీ
కరుణ శుభములు కలుగు నన
సరసీరుహనేత్ర కొక్క స్తనమే కనుమా 33
[నేత్రకు + ఒక్కు + అస్తు + అనమే =నేత్ర కొక్క స్తనమే;
ఒక్కు = వృద్ధుఁడు; అస్తు = అగుఁ గాక]
ఆజి నరిసూదనుఁడు కన
దోజో బల సంయుత సమరోత్సాహ సువి
భ్రాజితుఁడు ప్రతిధ్వనిత న
గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్ 32
[ఆజి =1. యుద్ధము, 2. తిట్టు; ప్రతిధ్వనిత నగ+ ఆజులు =
ప్రతిధ్వనిత నగాజులు : మారుమ్రోగిన పర్వతములు గల తిట్లు]
ఆజిని గెల్వ సూచితము నద్భుత రీతిని నయ్యె యుద్ధమే
యోజము ప్రజ్వ రిల్ల నట నుత్తర గోగ్రహణమ్ము నందు వి
భ్రాజితుఁ డా ధనంజయుఁడు బంగరపుం గడియమ్ము లైన యీ
గాజులు గల్లుగల్లనఁగఁ గవ్వడి గాండివ మెత్తెఁ గ్రుద్ధుఁడై 31
ఈశ్వరుని కృపఁ గృష్ణ మునీశ్వరు నను
మతినిఁ గంసారి గృష్ణ సమ్మతిని నెంచి
కుంతి కృష్ణ యని యెఱుఁగ కుండ కోర
ధర్మ జానిలజుల వెన్క ధర్మ మెంచి
ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె 30
[కృష్ణుఁడు = వ్యాసుఁడు, పార్థసారథి, అర్జునుఁడు; కృష్ణ = ద్రౌపది]
పర దారసుప్రధర్షణ
మరవింద భవప్రసాది తామోఘ వరో
త్కర గర్వమ్ము కలిమి కా
వరమే పదితలలవాని ప్రాణముఁ దీసెన్ 29
విజయునకుఁ దా నిలిచి దయ విజయ మీయ
రణత లాజయ్య మంతఁ గౌరవ విభునకు
భారత రణస్థలినిఁ దలపడుట కొఱకు,
బార్థసారథి పరి మార్చెఁ, బాండవులను 28
[పరి = సేన; మార్చు = వడ్డించు]
మూడు చక్రముల నడుపు మోడు జీవి
రేయి వగలు ద్రొక్కుఁ దనదు వాయి నింప
నంత వచ్చె భూరి తనుఁడు వింత గొలుప
నెలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు 27
వలపటి చేతి యంకుశము వామ కరంపుఁ బరశ్వథమ్మునుం
దల గన సామజేంద్రునిది దర్శన మీయఁగ భీతి లేకయే
సలలిత సర్పసూత్రమునఁ జక్కగఁ గన్పడఁ బన్నగేంద్రుఁ డా
యెలుక వడంకె విఘ్నపతి యెక్కుటకై చనుదెంచఁ గాంచియున్ 26
దక్షిణ దిశాధినాథుఁడు ధర్మమూర్తి
దండ ధరుఁడు సంయమనీ సుమండన సమ
వర్తి కాలుండు తారకాధ్వ చల నావి
రామ భద్రునకున్ ధర్మరాజు సుతుఁడు 25
[తారక+అధ్వ+చలన +అవిరామ భద్రుఁడు =
తారకాధ్వచలనావిరామ భద్రుఁడు: సూర్యుఁడు]
కాలాను గుణముగా సల
హాల నొసఁగుచుఁ గలహాల నన్నింటి మహా
హాలాహలా లనుచు మురి
పాలిచ్చిన తన జనకుని భజియింపవలెన్ 24
సంసారార్ణవ తారక
హంసాఘౌఘాసి సత్కృపాంభోనిధి యా
కంసారి ఘోర రాక్షస
హింసకుఁ బాల్పడెడి వాఁడె హితమును గూర్చున్ 23
దానవ స్త్రీల తర్జనము:
జానకి! రాముఁడు కేవల
మానవుఁడే దానవుఁడును మా ధవుఁ డయ్యెన్
మానుగ రావణు మది నభి
మానింపుము నీదు శుభపు మనుగడ కొఱకై 22
పార్వతీ దేవితో తల్లి మేనకా సతి మాటలు:
కనలేమా వర దేవ షండము మదాగారమ్మునం బ్రీతినిన్
వినవే నీ పతికాంక్ష తీరఁగ నిటన్ వేడంగ నొప్పున్ మహా
నిన దాభీల భయాటవీ స్థల తపోనిష్ఠైక సంతప్త జీ
వనమా! సాహస మింత చెల్లదు సుమా బాగోగు లూహింపుమా 21
రోగములు రామి మదినెంచి వేగ మంచి
మందు నెన్నుకొని సుఖము నొంద, ముందు
చూపు గల వాని వీనినిఁ జూడు మప్ర
మత్తు, మందు సేవించుట మంచిదె కద 20
గురు వితరణ గుణ మగు నే
తరులకు నెన్నండు నీవు, దాన మిడ వలెం
బరులకు నన లంఘించరె
గురువుల, పదసేవఁ జేయఁ గూడదు శిష్యా 19
[గురువు = వేగపు పరుగు; ఏతరి = లోభి]
ఋషభ రాజమ కాని గౌరీపతికి ర
థం బనఁగ లేదు దమయంతి నంబ కావఁ
దలఁచి చాటుగను గరుణార్ద్రహృదయ దయ
విజయ సారథి జన్మించె విపినమందు 18
[విజయ = పార్వతీ దేవి; స+అరథి = సారథి = రథము
లేనివానితోఁ గూడి, ఇచట శివుఁడు; జన్మించుట: అవతరించుట]
ఏమని చెప్పుదుఁ గుసుమా
స్త్రామర సితభాను మైత్రి యద్భుతమె శర
ద్యామిని నిండుగఁ గువలయ
కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్ 17
స్వజన జన గణ పాలిత పర జన నిచ
య పరతంత్ర నిర్మూల నాయత దృఢాంత
రంగ భరిత యంత్రణ సత్కృ తాంగ తుష్ట
చిత్తుల మయి జరపు కొంద ముత్తమముగ 16
[యంత్రణము= రక్షణము]
సంతత దానరత మహా
ద్వాం తారా త్యాత్మజుండు ఫల్గుణ రిపుఁడున్
దంతిపుర నాథ మిత్త్రుఁడు
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు గద శిష్యా 15
[వి నాయకుఁడు = ప్రతి నాయకుఁడు]
ఆ హాలిక కష్టార్జిత
దేహ విదారక ఫలమ్ము ధృతిఁగొను వ్యాపా
రాహారాపహరణు లీ
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే 14
[కాదే = ఏమాత్రము కాదు]
బంధు మిత్త్రుల నెల్లరఁ బరమ మోద
మునఁ బిలిచి కలహము లున్నఁ బుత్త్ర నిభునిఁ
బేర్మి మీఱ మానసమునఁ బిలువ కుండ
తమ్ముని, కొడుకు పెండ్లికిఁ దగదు చనఁగ 13
అరి సెగ ఱేనికిఁ గమలా
రి రిపుం డనిలేనులును సరి వడరు నణఁగా
రె రిపు నికాయము మది యం
త రజోగుణ పూరితమ్ము దశకంఠునకున్ 12
భారపు శిష్ట రక్షణకుఁ బద్మదళాక్షుఁడు లోకనాథుఁ డా
శౌరి వచింపఁ బుణ్య జన సంచయ శోధన సక్త చిత్తులై
భూరి సురల్ చరింతు రట భూతల మందున దేవ లోకపుం
జారులఁ జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో 11
[చారులు =వేగులు]
చిత్త మందు ఘోరమ్ముగఁ జిలుకు నట య
నయము పాపపు టాలోచనలు సుదతికి
మానసమ్మతి మలినమ్ము మేను నరయ
రూపసినిఁ జూచి నట్టి కురూపి నవ్వె 10
రాము నిక్ష్వాకు వంశవర్ధను చరిత్ర
సరళ రామాయణ మనగ సన్నుతముగ
దిక్కు లన్నిట నమర కీర్తి గడియింప
భారతము, వ్రాసి వాల్మీకి వాసికెక్కె 9
శ్రావణి యగు నాఱవ దివసమ్ము గడవ
నవమి, నాఁడు రక్షాబంధనమ్ము వచ్చుఁ
బండుగే యది సంతాన మండలికినిఁ
గాంచ రక్తసంబంధము గట్టిపడును 8
[శ్రావణి= శ్రావణ మాసపు పున్నమి]
ఆతత రోషా కలితా
తీత విచా రాగ్ని తప్త దేహి వెడల, నీ
వ్రాతల దెలియంగ వశమె
తాతా! యని, ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్ 7
[తాత = బ్రహ్మ]
నిత్య హోమ కృత వినీతుండు ధర్మాచ
రణ రతోత్తమ వితరణుఁ డధర్వ
ణప్రవరుఁడు సుర గణ నిషేవణప్రథ
మాంస మిష్టపడు సుమా ద్విజుండు 6
జన సంత్రాస రతుండు రావణుఁడు దుస్సాధ్యుండు ధాత్రిన్ దశా
నన విభ్రాజిత విగ్రహుండు దనుజామ్నాయాధి నాథుం డటన్
జనకాత్మోద్భవ నుత్త మాంగనను సచ్ఛారిత్రఁ గాకుత్స్థు రా
ముని పత్నిం గొనిపోయి చచ్చెను గదా మోహాంధుఁడై యాజిలో 5
శుభతర కటాక్ష లబ్దేంద్ర శుభ్రి హరుల
క్రమము దనర శ్రీరంగ ధామ మలరంగ
వార్ధి సంజననంబు దేవ గణ సేవ
రంజిలు సిరినిఁ బూజింతు లక్ష్మి నెపుడు 4
ఆధూర్జటి, యల దేవా
రాధిత కారణ భవుండు ప్రద్యుమ్నునకున్
యోధునకు జన్మ నీయఁగ
మాధవుఁడే, కీర్తి నందె మదనాంతకుఁడై 3
వింతగఁ గౌరవాధములు వీర్యము వీడి సభాంతరమ్మునం
గాంతను నేక వస్త్రఁ బరకాంత వివస్త్రను జేయు చుండ గో
త్రాంతక సన్నిభార్జున ఘనాగ్రజుఁ డాగ్రహ తప్త చిత్తుఁడై
కాంతుఁడు లేనివేళఁ గలకంఠి పకాలున నవ్వె నెందుకో 2
ఆట పాటలఁ దేల బాల్యమున మిగుల
భారపుఁ జదువు లందుఁ గౌమార ముండ
వఱల సంసార మందు యౌవనము ముక్తి
కాంతకై తపింతురు వార్ధకమున మిగుల 1