సరస మృదు సుస్వరము లతిశయముగఁ దన
రగను గించిదపస్వర సంగమ మతి
స్వయముగ సతి మాన్పంగను వరము నిమ్ము
తివిరి కృపఁ జూడుమ సరస్వతీ సతతము 41
సకల సువాఙ్మ యావళికి శారద దేవత వీవు తల్లి సా
ర కవి వరాళి పూజిత సురప్రకరార్చిత తృప్త వీవు సు
స్వక రచనా సుపూజిత విభాసిత మానస కొల్తు నిన్ను నా
తి కరము భక్తిఁ దోరముగ దేవి కృపంగను బ్రాహ్మి భారతీ 40
ఆర్యా సతీ మహా కృప
వీర్యవ రార్జునుని మత్స్య భేదన సుమహా
కార్య విలాస తృణీకృత
దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్ 39
సాహసమ్ముల కెల్లను నోహటిల్లు
ప్రాణమున్న యెడలఁ దీపి బ్రతుకు కలదు
యౌవనమ్ము వోయెను నీకు నయ్య విడుము
తండ్రి! తోరతి కేళినిఁ, దనయ కోరె 38
[తోర+అతి కేళి= తోరతికేళి: ఆపదలతో అమితమైన
చెలగాటము; తోర =ఆపద; అతి (దేశ్యము) = అడి = అమితమైన
మానవత్వ మెల్ల మంటఁ గలిపి తోటి
వారి సొత్తు నెల్లఁ దేర దోఁచు
కొనఁగఁ బంత మూని దనుజారి విష్ణు వి
నాగ పూజ సేయ నరకమబ్బు 37
రాగము మానవాళి నిడి లాలన నార్తుల నాదరించి యే
భాగము వారిఁ గోరని యపార కృపాళులె పుణ్యు లిద్ధరన్
భాగవ తోత్త మోత్తములు స్వాము లటంచును నమ్మి ధాత్రి మ
ర్నాగుల పూజ సేయు నెలనాఁగలకున్ నరకంబు ప్రాప్తమౌ 36
[మర్నాగి = మోసగాఁడు]
భూతల నాథుఁడు కర మెడ
మై తమ్ముల తోడ భూ మహా విభవైశ్వ
ర్యాతిశయముల కులుకడు పు
నీతను సాధ్వీ పురంధ్రినిఁ గని యలమరెన్ 35
కాపురుషు లతి క్రూరులు కాల చోది
త నరులకు మిత్ర నీతి వచనముల నను
రాగ మేల యబ్బుఁ బటుతర జ్వర యుత
జిహ్వికకు పంచదారయె చేదు గాదె? 34
పట్రా వేగమ తాళినిఁ
గట్రా చూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే
తొట్రేల రమకు, నే నగ
నట్రల నిత్తు, రమ దీవన లొసగును దయన్ 33
దశరథ నందనునిఁ జతు
ర్దశ భువన భయంకర ముని దత్తబ్రహ్మా
స్త్ర శరాపాత విదారిత
దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా 32
కుశలం బిచ్చును మానవాళికి ధరం గ్రోధాదు లన్నింటికిన్
వశమై యుండక సంచ రింపగను సద్భావమ్ము తోడన్ మహ
ర్షు శమున్ దార్మికుఁ దాప సోత్తమ వరున్ రూపాంతరశ్రీ మహ
ద్దశ కంఠుం గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్ 31
[రూపాంతరశ్రీ మహద్దశ = అవతారములు (రూపాంతరములు)
భాగ్యదములును గొప్పవి పది కలవాఁడు , విష్ణువు; కంఠుఁడు =
సమీపమున నున్నవాఁడు, విష్ణు భక్తుఁడు]
రావణాసురుఁడు కూడ వైకుంఠ ద్వార పాలకుఁడే గదా!
అరయఁగ నిఁక రవి వారము
పరుగు లిడెడు సతము మఱచి పనులను మదినిం
గర మలిగి సుప్రభాతో
చ్చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే! 30
వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ జూచును లక్ష్మి సేయగం
దరుణులు భక్తి తోడుత వ్రతమ్ముల నంచుఁ దలంచి యంతఁ దా
శరణము వేడి మా సతిని శ్రావణ మంగళ వార సువ్రతా
చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్ 29
[వ్రత+ఆచరణము = వ్రతాచరణము]
పంచవింశతిశతమునకు పంచపాది:
బ్రహ్మ విష్ణు మహేశ్వర వర సమన్వి
తావనీ సుర వర కల్పి తాబ్జభవ స
తీ మణి కరుణా కలిత సుధామ శంక
రాభరణ నామ వర విద్వదాలయమున
పంచవింశతిశత సమస్యాంచిత మిది 28
రావణుని మొదటి సారి సీతాపహరణ నిమిత్తము
మారీచుని వద్దకు వచ్చినపు డతఁడు రాముని
ప్రభావము తెల్పి సాహసము వలదని నచ్చజెప్పి
తిరిగి పంపించిన సందర్భము:
ఆ రాముని బల విక్రమ
పౌరుషములు దెల్పి వక్ర భావము వలదం
చా రాక్షసేంద్రు రావణు
మారీచుఁ డు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్ 27
[మారీచుఁడు+ఆరాము మారీచుఁ డారాము; ఆరాము = విహారణము
చేయు వాడు. ఇక్కడ రావణుని లోని స్వేచ్ఛావిహారణుని.]
ధారాళంబుగ ధాత్రి నింపి జవసత్త్వశ్రేణి సృష్టించె నా
మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపె రా
మారాతి త్రి జగద్భయంకరుఁడు బాహాటమ్ము శ్యేనీయునిన్
వీరావేశత జానకీ హరణమున్ వీక్షించి పోరాడగన్ 26
[మారీచుఁడు = మరీచి తనయుఁడు,కశ్యపుఁడు;
శ్యేనీయుఁడు = శ్యేని పుత్రుడు, జటాయువు ]
మృణ్మయమైనఁ దలచును హి
రణ్మయ మని బుద్దిఁ గనికరము గనలే మీ
షణ్మాత్రము నపవిద్ధ వి
రాణ్ముని దుర్యోధనుండు రా ముని సుతుఁడే 25
[విరాణ్ముని = రాజర్షి , ఇక్కడ ధర్మరాజు; ముని సుతుఁడే - కాఁడు]
కనవలె పుణ్యక్షేత్రము
లు నుడువ వలె హరి కథలను లోల సునేత్రా
విను మీ యపాత్ర వితరణ
ధనలక్ష్మీ! వ్రత మొసంగు దారిద్ర్యమునే 24
మన మందుండెడు ఘోర పాతకపు టా మాలిన్యమున్ వీడ కే
ఘన దైవమ్ముల వేడినన్ ఫలితముం గానంగ శక్యంబె తా
ననయమ్ముం బను లెల్ల మాని యనయుండై భక్తి హీనాత్ముఁడై
ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా 23
భద్ర వీర భూమి పల్నాటి వీరుండు
బాల చంద్రుఁ జూచి పరమ పుణ్య
కాంత యంత వింతఁ గాఁ గోరి వీరున
కాలు పెండ్లియాడె కరము వలచి 22
[వీరునకు+ఆలు = వీరునకాలు]
వివిధ పరిణయ ధ్రువీకర ణాధికా
రి సముఖమున నిజ పరిజన సు పరి
చితులు చూచు చుండఁ జేసి యింపుగ సంత
కాలు పెండ్లియాడె కరము వలచి 21
కాంతారమ్ముల మఱి భువ
నాంతరముల నున్న నరుల కాకలి తీర్చన్
సంతతము హర్షమున భూ
కాంతను సేవించువారె ఘనులు జనహితుల్ 20
కాంతా జ్యోతినిఁ జేసె నక్షర సుసంఘాతేశ్వరిన్ బ్రహ్మయే
కాంతా శ్రేష్ఠము నుంచె వక్షమున భూకాంతుండు విష్ణుండొగిన్
కాంతారత్నము నుంచె నర్ధ ఘన సత్కాయమ్మునన్ శంభుఁడే
కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్ 19
బుడిబుడి యడుగు లవి వడివడి నడువ త
డఁబడ నడలుచుఁ బడి లేచుచుఁ బరుగు లిడు
చు నెడ నెడఁ గడు ముద మిడు చుండు నపర
బాలభానుఁడు నేలపై పరుగులెత్తె 18
అమ్ముని సత్తములకు ని
త్యమ్ము వెత లొసంగెడు నసహన దైత్య నికా
యమ్ముల దుర్భర దుష్ట కృ
తమ్ముల నిరసించె రామ ధరణీశుఁ డొగిన్ 17
రుక్మిణీ మనో హరుండు ముకుందుఁడు
వారిజాక్షుఁడు మురవైరి కంస
హారి యదుకుల శశి యానకదుంధుభి
తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె 16
ఘన రఘు వంశ నీరనిధి గౌరుఁడు నీల సువర్ణ కాయుఁడున్
జనక సుతాంతరంగ విలసన్మహనీయ గుణాంత రంగుఁడున్
ముని గణ సేవితుండు సుర పూజిత తృప్త చతుర్వ రాగ మాం
త నయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో 15
[ఆగమాంత నయుడు = వేదాంతములలో చెప్పబడిన నీతి వర్తనము కలవాఁడు]
సదమల చరితమును శబ్దార్థ భావ యు
క్త విలసితము దగును గావ్య మనఁగ
ననుకరణ వికారమును వ్యాకరణ నిరా
కరణ మేల కావ్య కరణమునకు 14
ఘోరపు వేసవి యందున
నీరమ్ము లుదారముగఁ బని గొని వడిం బ్రా
కారమ్ములును దడిసెడి ప్ర
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్ 13
[ప్రకారమున్ + అయనముల = ప్రకారము నయనముల;
అయనము = త్రోవ]
అడ్డము పడ నేలనొ నీ
విడ్డంకతనమ్ము సూపి యివ్విధి బలిమిన్
విడ్డూరమ్ముగఁ జెప్పెదు
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్ 12
ఎడ్డఁ గనంగ వెన్నయ మహీపతి ధర్మము నెంచి పంచ నీ
గుడ్డలు కూడు భూ జనుల కున్ననుమానము వీడు మింక యే
గడ్డన నున్నఁ జెడ్డవగు కార్యము లేమియు సేయ నొల్లఁ డీ
వడ్డనఁ జేయువాఁడు, పగవాఁడె తినం దగు శంక వీడియున్ 11
కలవర మంది భృశమ్ముగ
నలినాక్షి విజిత తరుణ దినప్రణి సుమన
స్తల తుల్య పాదమున నా
నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్ 10
[ఆనె = దద్దురు; ఏడ్చెను + ఏరుపు = ఏడ్చెనేరుపు; ఏరుపు = మంట]
తాపస పద సేవ ధర్మ రక్షణ దీన
జన సముద్ధరణ సుజన సురక్ష
రాజ వంశ వీర రాజికి మంది కా
పసుల సేవ పరమ పద మొసంగు 9
[కాపు + అసుల = కాపసుల; మంది = కాల్బలము;
కాపు =రక్షణ; అసి = ఖడ్గము]
భక్తిఁ జేయుచు వ్రతమును బడతి యొకతె
పిలువ నతి గౌరవమ్మున నెలత యరయ
సువ్రతయ సత్యనారాయణవ్రతమ్ము
పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె 8
గురు శిష్య బంధము మఱచి
తరుణాదిత్య నిభు భీష్ముఁ దలపడి భృశమున్
శరణాగతాంబ పయి తమిఁ
గరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్ 7
సత్పథ చరి తావ్యయ పా
దోత్పల రత మానస కమ లోద్ధిత పూజా
తత్పర వంశమున బృహద
సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ 6
[బృహత్ + అసత్పుత్రుఁడు = బృహ దసత్పుత్రుఁడు]
చూడ భాగ్యవంతుం డతి సుందరుండు
మిత్రు లట లేరు జనులును జిత్రముగను
దరికిఁ జేర రా రతని రిత్త మనసు బిరు
సో మరి తనమ్మె జనులకు సొబగుఁ గూర్చు 5
[బిరుసు = కఠినము; తనము = చిత్తము (మనస్సు)]
వనజభవుండు వలికె ద
క్షునితో ముదమారఁ గనుమ సుతులను ధరణిం
గన సృష్టి నిలువఁగ వలెన్
జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్ 4
[హననము = హెచ్చవేఁత (గుణకారము)]
విమల తర శరచ్చంద్ర ముఖి మను జేంద్ర
తనయ ధరణిజాత పతివ్రతా మతల్లి
భార్య మిథిలాపుర నభో విభాసమాన
రాధ నాలింగనము జేసె రాఘవుండు 3
[రాధ = మెఱపు]
జాతిపిత యయ్యెను మహాధి నేత గాంధి
భారతావని నున్నట్టి ప్రజల కెల్ల
నచ్చి నట్టి పేరట గాంధి నామ మాత్ర
గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాఁడు నిజము 2
కికురించుచుఁ బాండవులకు
చెకుముకి పాచికలు పేరిచి కురు విభుల ము
న్నె కువలయ మంత దోఁచిరి
వికృతానను శకునిఁ గూడి పెను కౌరవులే 1