ఆరయ నింపుగ వరుసగ
నా రుద్రుఁడు శంకరుఁడు మహా దేవుఁ డటన్
పారావా రాత్మజ కిఁక
గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్ 50
వారిజ సంభవుం డజుఁడు పన్నుగ జన్మ నొసంగె లక్ష్మికిం
గూరిమి రుద్ర దేవునకు కొందఱు సెప్పఁగ వింటి నిద్ధరన్
వారిధి ముద్దు బిడ్డకును బద్మకు లబ్ధ మహా దయా లస
ద్గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్ 49
[లబ్ధ మహా దయా లస ద్గౌరి = పొండబడిన దయవలన వెలుగు చున్న గౌరి కలది.]
అగ మాభ ధృతి పరాక్రమ
సగర్వ బాహుబల సహిత సాహస నిపుణా
వగత రణ నీతి సమరా
పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్ 48
[ సమర+అపగతురు = సమరాపగతురు: యుద్ధములో మరణించినవారు]
విగత యశో దురాగతులె వీరులు పాఱిన యుద్ధ మందుఁ గాం
చ గత విభూతి సంపదల శక్తి విహీనమ రాజ్య మత్తరిన్
నగ నిభ ధైర్య శూరు నభినందితుఁ జేయఁగ నొప్పుఁ జీల్చుచుం
బగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్ 47
[కొప్పు = జుట్టు]
శివధనుర్భంగము నిషిద్ధాక్షరములు - శ-ష-స-హ:
గాధేయుఁడు గను రాఘవ ధను వన రాముఁ డనె మేటి వింటిని నార్య తాకి
తొడఁగెద నెత్తఁగ వడి నారిఁ దొడుగ నని కొని యనుమతి ముని వరు నుండి
లీలగఁ జని కదలించి భాండము నుండి విల్లు వేల జనులు నల్లనఁ గన
నారినిఁ బూరించి ధీరత లాగంగఁ బెల్లున నంత గుభిల్లు మనుచు
విఱిగె మధ్యమున ధనువు వింత గొలుప
నా ధ్వని పిడుగు మించఁగ నవని నగము
లు వణఁకెను మూర్ఛిలిరి జనులు ముని జనక
రాఘవులు దక్క నజితు ధర్మమ్ము విఱుగ 46
శీత కాలమం దుదయమ్ము వీతిహోత్రుఁ
గాంచ సంతసం బైనను గర్కశంపు
మండు టెండ యందునఁ జన మండుచు ముఖ
పద్మములు ముకుళించెను భానుఁ జూచి 45
సద్మము నందు మెండుగ ప్రశస్త మణివ్రజ నీలముల్ మహా
పద్మము లుండ నా గృహము భాసిలు పద్మిని చందమై యిలం
బద్మిని యందు వింతగ నపార విలాస సరోజముల్ వినా
పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా 44
[బానుని జూచి సరస్సులోని పద్మేతరములు వాడినా గృహపద్మిని లోని
మహాపద్మముల తో పాటు మిగిలిన రత్నసరోజములు ననిశము
వికసించుచునే యుండును.]
పంకజ భవ వర కలిత భ
యంకర దానవ నిచయ గణాధీశుఁడు కూ
లంకష సహిత సుర గణ వ
శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్ 43
బింకము తోడ నా త్రిపుర భీషణ దైత్య గణమ్ము క్రుద్ధతన్
శంక యొకింత వొందక సశక్ర సురాలిని నొవ్వఁ జేయ చం
ద్రాంకుఁడు మన్మథారి త్రిపురాంతకుఁ డుగ్రుఁడు మేరు చాపమున్
శంకరుఁ డెత్తె, వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్ 42
సవినయ విధేయతలఁ బలు
కవలెను సతతము తన కపకారము జరుగన్
భువి నేలు మహా రాజుల
నవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్ 41
[అవధానము = ఎచ్చరిక]
కవి విద్వాంస సుశాస్త్ర పారగులఁ బెక్కండ్రన్ విలోకించి తా
కవనంబందున మెప్పుఁ బొందగను శక్యంబౌనె దుస్సాధ్యమే
యవనీ భార సమాన మంచును మనంబందెంచి భీతాత్ముఁడై
యవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ 40
భార సమాస బృహ దలం
కార సవర్ణన వర యుత కల్పిత కావ్యా
పారద్యుతి గీర్పతి వా
చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే? 39
[వాచా+ఉరు = వాచోరు; వాక్కు లందు విరివియైన వాఁడు /
విరివియైన వాక్కులు గల వాఁడు]
ఆరయఁ జోరు లెల్లరు శుభాంగుల మానస చోరుఁ డయ్యె శృం
గార రసామృతస్రవణ కార్య ధురీణ జగద్గురుం డిలన్
సార మయార్థ శబ్ద సుమ సంపదఁ బండిత చిత్తహారి యై
చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే 38
త్రాణ గుణ సంచయములకుఁ
గాణాచి గిరిజ రజత నగవర విభు బహిః
ప్రాణము పార్వతి సురుచిర
వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్ 37
ప్రాణి నికాయ సుప్రణతి భాసిత పద్మదళాయతాక్షి సు
శ్రోణి పతివ్రత ప్రణుత సువ్రత శంకర సంగ్ర హేద్ధ స
త్పాణి ధరాధరాత్మజ కపార కృపారస సిక్త భవ్య భా
వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్ 36
[భావ+ఆణి = భావాణి; ఆణి = ఎల్ల (హద్దు);
దయాగుణపూరిత భావములకు హద్దు]
కొందఱికిఁ గా గుణితమును గొందఱి కిఁక
రా పలుకఁ గష్టమౌను గరమ్ము సుమ్మి
పా పలుక రాదు పాపకుఁ బసితనమున
రమణికిం బూలు చేటగుఁ బ్రాయమందు 35
కమల దళాయతాక్షుఁడు బక ద్విషుఁ డార్త జనౌఘ పాలకుం
డమర వరైక పూజిత మహాత్మున కిష్టము మేటి పూవులే
యమర నదీ కుమారుఁడు మహా గుణవంతుఁడు భండ నోగ్ర శూ
ర మణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్ 34
పేదరిక మంత దుఃఖమ్ము మేదిని మన
మరయ మృగ్యమ్ము ధనవంతుఁ డంచు నెట్టు
లేని వరియించు మన బీదవాని, రోసి
పండు ముసలిని, వరియించెఁ బంకజాక్షి 33
ఉత్సాహము:
అండఁ గోరి రేవతి విమలాంగి యంత నాది శే
షుండు రోహిణీ సుతుండు శూర వరుఁడు వాసు దే
వుండు నంబుజ దళ నయను బూజ్యు ముసల ముండ గం
బండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో 32
[పండు = శయనించు; ముసలి = బలరాముఁడు]
అన్నగ సప్తక విభు న
న్నన్న దయామృతము గ్రోలి యానందముగన్
మన్నన లను గ్రన్నన న
య్యన్న కనియె నన్నమయ్య యాశ్చర్యముగన్ 31
వీఁకం దిరుగుచు జగతిని
నా కంటెన్ ఘనుఁడు లేడనంగఁ జెలగినం
వే కాచఁ బొందెను వరము
శ్రీకృష్ణుని, కంటె, ఘనుఁడు శిశుపాలుండే 30
[కంటె = చూచితివా]
అరవిందాసన వల్లభ
వర కుల సంజాత యశుఁడు వజ్రధర వరా
మర ముని నికాయ సంక్షో
భ రతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై 29
పరమ పతివ్రతా సతినిఁ బార్థివ వీర కుమార పత్నినిన్
వర రవి వంశ రామ సతిఁ బావని మాయ హరించఁ క్రుద్ధుఁడై
వర బల గర్వితుండును క్షపాచరుఁ డా దశకంఠు ఘోర దం
భ రతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై 28
[దంభ రతుఁడు = కపటము నందు నాసక్తి కలవాఁడు]
అరయఁ బుడమి నొనరించిన
చరాళి కర్మముల కెల్ల స్వర్గ నరకముల్
పరఁగు నల వాని యందు న
పరమ పదము లభ్యమగును పాపాత్ములకే 27
[అపరము = ఉత్తరము, తరువాతది]
కరయుగ లాఘవమ్మును నఖండ వివేకము సచ్చరిత్రమున్
విరివిగ నున్న విద్యలును విత్త విహీనున కేది దిక్కిలం
గరయుగ లాఘవంపు టవకాశ నిరీక్షణుఁ డుండ మేటి ప్రా
పరమ, పదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్ 26
[ప్రాపు+అరమ = ప్రాపరమ; అరము = త్వరితము; పదము = ఉన్నత పదవి]
నేఁ డబ్బురముగ దొరఁకొని
వాఁ డప్పుర జనుల కెల్ల బాధల నొసగం
గూడని వడ్డినిఁ గొంచును
వేఁడెద నీ వడ్డి యతని వేగము మాన్పన్ 25
భారతార్థమున:
నేఁ డబ్బురముగ దొరఁకొని
వాఁ డప్పుర జనుల కెల్ల బాధల నొసగన్
వేఁడెద నీవడ్డి యతనిఁ
దాడనములఁ దునుము వేగ తనయా భీమా 24
కనిపించఁగ సంపూర్ణపు
టినగ్రహణ మపర దివమ యిల నొక్క పరిన్
ఘన విద్యుద్దీపమ్ముల
విను వీధిని పట్టపగలు వెన్నెల విరిసెన్ 23
ఇల నజాత శత్రువే రాజ రత్నము
కురు కుల శశి పాండు వర సుతుండు
ధర్మ తత్పరుండు ధర్మజుం డెఱుఁగఁ డే
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును 22
మడిమడి నుడువ వడివడి నెడనెడ తడ
బడి వెడవెడ మగుడ యడఁగి మడఁగి
నుడుపులు మడుఁగునను దడిపి తడిపి తడి
పొడి యొనర్చువానిఁ బొగడ వశమె 21
ఆతురత గతజల సేతుబంధన మనఁ
గాల కర యుగళము గోల నాకు
లలము నట్ల నిసినిఁ బలవరించుచు నింక
బుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు 20
దుస్తరమైన కామ మద దూషిత మానస చోది తార్తయై
విస్తరమై చెలంగెడు వివేక వినాశక భూత జాలముల్
మస్తక తాప కారకపు మాన హరమ్ములు దుష్ట సాహితుల్
పుస్తకముల్ బఠించునట మూర్ఖజనాళి వివేకశూన్యమై 19
కవి సార్వభౌము శ్రీనా
ధ విబుధుని నిగళ యుతునిగఁ దఱలించి రిసీ
భువిఁ జెలఁగు మహా కవులను
గవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్ 18
[కవి = కళ్లెము]
భువి లే రిప్పుడు రాజ పోషకులు సంపూర్ణమ్ముగన్ మృగ్య మ
య్యె వరాంధ్రమ్మిక పాఠశాలల నిసీ యీ యాంధ్ర దేశమ్ములం
గవియన్ నీచపు భావ జాల మిటులం గావ్యంబు లెట్లుండునో
కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్ 17
కవితలకుఁ గ్రొత్త సొగసులు
భువిని నొసఁగి గీత సుమ సమూహమ్ములఁ దా
నవనీ జనగణ సుమన
శ్శివ భక్త వరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా 16
[శివము = వేదము; శ్రీశ్రీ : మహాకవి శ్రీరంగము శ్రీనివాస రావు]
అవనీ జాతగ సీత దారయయి త్రేతాఖ్యంపుఁ గాలమ్మునన్
భువనఖ్యాతయ రుక్మిణీ సతియ తాఁ బో ద్వాపరం బందునన్
రవి చంద్రాక్షుఁడు విష్ణు దేవునకు భార్యారత్న మయ్యెన్ ధరన్
శివ భక్తాగ్రణి! యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే 15
[శ్రీ శ్రీ = శ్రీలక్ష్మీ దేవి]
అరి షడ్వర్గమ్ములు మదిఁ
బరిత్యజించి వినయ నయ భాసిత వృత్తిన్
సుర వర శరణవ్రత స
త్కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ 14
[కరణము = కార్యము]
పరువది ముఖ్య మెల్లరకుఁ బన్నుగ నున్న ధనమ్ము తోడనే
సరియగు మార్గ మెంచి చన సంతస మింపుగఁ గల్గు నిద్ధరం
బరులకుఁ జుల్క నౌదువె యవశ్యము కోరకు మయ్య యప్పపా
కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా 13
[అప్పు+అపాకరణము = అప్పపాకరణము; అపాకరణము = తిరస్కారము]
కాముఁడు దుష్టుఁడు కీచకు
భీముఁడు చెలరేగి చంపె, భీష్ము రణమునన్
లేమ కతమ్ము శిఖండియ
నీమము గలవానిఁ జేసె నేలం గూలన్ 12
వామపు టేక చక్ర పుర వాసుల క్షేమము నెంచి కుంతియే
భీమునిఁ బంప బండి పయి విస్తృత భోజన రాశి తోడుగన్
భీమపు టాకృతిం బరమ భీకరుఁ డా బక దైత్యు కోసమే
భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్ 11
[భీష్ముఁడు = భయంకరుఁడు]
గుర్తు తెలియని యొక దుండగుం డట తిరు
గాడె నాత్రముగను రాత్రి వాఁడు సూడ
సంపదలు కొల్ల, గొట్టెద జనులు మెచ్చ
వానిఁ బట్టి కక్కించెద నేను వేగ 10
చంపిరి దేశ పౌరులను శౌర్య విహీనులు క్రూరులై విదే
శంపు టయోగ్య సైనికులు శాత్రవ సింహము హిందు దేశపుం
బంపున నేగి సత్వరము పన్నుగ గర్వము నెల్లఁ, గాచుచున్
సంపదఁ, గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్ 9
పతులు గల రైదుగురు సాధ్వి , భానుమతికిఁ
దోటి కోడలు, కృష్ణకు దోర్బ లాతి
శయులు కౌంతేయులు పరమ సాత్వికులును
ధర్మ పరులు ధానుష్కులు ధరణి పతులు 8
హతవిధి ధాత్రి నందుఁ గలి దౌకళఁ దాల్చి జనించి తీ విసీ
యతులిత మైన రీతి యివి యారయ నీ కిల మూర్తివంతముల్
మతి నతి వంచనల్ దురభి మానము పంతము క్రోధ వైరముల్
పతులు గణింప నైదుగురు భానుమతీ సతికిన్ సుయోధనా 7
అంగడి వస్తువ యిది వీ
రంగము సేయు మును ముందు రాకుండఁగ నే
భంగమ్మును వారసు మన
సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్ 6
[మనసు+ఇంగమ్ము = మనసింగమ్ము; మనసు = ఇష్టము;
ఇంగము = అభిప్రాయము]
చెంగునఁ దీర్చు నీ పురుష సింహుఁడు దానను కొన్న కార్య మె
భ్భంగిని నైన ధీ వరుఁడు పార్థివ సూనుఁడు రామ చంద్రుఁ డు
త్తుంగ కరద్వయుండు ఘన దోర్బల ధన్వి మహాత్ముఁ డిద్ధరన్
సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా 5
నర్తన కర యుగ సంచల
దార్త సువిన్యాస గతుల నతి చిత్రముగన్
నర్తకి శశి నిభ ముఖమునఁ
గార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్ 4
[నెలవంక = నఖక్షతము]
అలసి సొలసి వెఱచుచు భూ
వలయమ్మునఁ దిరిగి తిరిగి పర్వతపున్దా
పుల నరసి మెఱయ కనుపా
పలలమ్మును, గోరి చిలుక ఫలముల రోసెన్ 3
[కనుపాపలు+అలమ్ము = కనుపాపలలమ్ము; అలము =
శాక విశేషము, పిందె, పచ్చి కాయ; రోసెన్ = వెదకెను]
క రహిత కుచేలోపాఖ్యానము:
ధరణిం గుచేలుఁడు గరిమ మానధనుఁడు విప్ర వరుఁడు బ్రహ్మ వేత్త ధర్మ
వత్సలుండు పరమ భాగవతుఁడు రాగ విరహితస్వాంతుఁడు విదిత శాంత
గుణ భాసితుఁడు వర గుణవతీ దార సహితుఁడు దరిద్రుండు సుత వితత వి
లసితుండు నద్రి ధర సఖుండు సనియె మురారి సందర్శ నార్థమ్ము భార్య
పంపునఁ జిపిటములు గొన్ని వడసి యంతఁ
గాంచ వసుదేవ నందను నంచితముగ
సఖుఁ గనుచుఁ గుశల మడిగి శాంత పఱచి
చిపిటములు దిని వెన్నుండు సిరుల నిచ్చె 2
సవన సఫలత కవసరం
బవనిఁ జతుష్పండితులు మహా వేదజ్ఞుల్
కవనమున శుద్ధి బుద్ధులు
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్ 1
[బ్రహ్మహోత్రుద్గాతాధ్వర్యులు నల్గురు యజమానున కవసరము. శుద్ధి : వాక్శుద్ధి]