న్యస్తాక్షరములు... అన్ని పాదాల చివరి అక్షరాలు వరుసగా "
గ్ర - హ - ణ - ము" ఉండాలి.
చిత్ర మీ విశ్వ మందున శీతలగ్ర
హాగ్ర గౌరుఁ గబంధ సమగ్ర విరహ
భోగి విగ్ర హోగ్ర రత నభో విహరణ
రాహు వార గించ నగుఁ జంద్ర గ్రహణము 54
దాతృత్వ భావ మరయుచు
దాతలు దాన రతఁ జెలఁగి తత్పరతన్, సం
గీత ఝరులఁ జెప్పు నిటుల
బూతు, పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్ 53
[బూతు = బట్టువాఁడు]
భూతల మందుఁ గాంచఁగ నపూర్వము కా దన మంచి చెడ్డలం
జూతుము సర్వ వేళలను జుట్టపు రీతిని సంగతమ్మునై
యే తరి నైన నుత్థిత సమీప్సిత సిద్ధి కిఁకం ద్యజించుచున్
బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్ 52
దుఃఖ మందుఁ దొలంగును దుష్ట బుద్ధి
దుఃఖమే చేర్చు జనులను దూర మణచి
దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
దుఃఖ మిచ్చుఁ బురుషులకుఁ దుష్టి నెంచ 51
నిఃఖర టాత్మ చింతనము నిత్య విశాల మనశ్శుచిత్వ వి
ద్వఃఖర కాభ వాక్పటిమ బాంధవ గౌరవ భావ దృష్టి మే
ధఃఖననప్రవృత్తి మదిఁ దథ్యము గల్గగఁ జేయు నట్టి యా
దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్ 50
[నిఃఖరటము = మృదువైన; ఖరకము = జలధ్వని; ఖననము = త్రవ్వుట]
సాచివ్య సమాకలిత మ
హా చాతుర్యానుశాస నాధ్యాపకుడుం
బ్రాచుర్య గళోపమిత సు
కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్ 49
[గళ+ఉపమిత+సు కీచకుడు: కంఠము, పోల్చ బడిన
వెదురు గొట్టము కల వాడు; కీచకము = గాలి తాకున
మ్రోగెడి వెదురు/ పిల్లనగ్రోవి]
చాచుచు స్నేహ హస్తమును జాటుచు నీతిని శిష్య కోటికిం
బ్రోచుచు సంకటమ్ములను స్ఫూర్తి నొసంగి నిరంతర ప్రమో
దాచరణ ప్రచోదక మహార్థ సుశబ్ద సుశాస్త్ర కృష్ణకుం
కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్ 48
ఊబియ సంసారమ్మని
యేఁబది యేండ్లవి రయముగ నిలఁ బ్రాయము దాఁ
బైఁబడ మతేతరుఁ డొకఁడు
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్ 47
[భాగవతము = భగవంతుని చరిత్ర]
తాఁ బలుకంగ నింపు జనతా రత మంచు తలంచి యన్ని గా
రాబపుఁ గేంద్ర రాజములు రాజిల నిత్యము దూరవాణులన్
రేబవలెల్ల సాఁగెడు తరిన్ వినిపించెను ముక్క ముక్కలై
బైబిలులో, ఖురానుఁ గని, భాగవతంబు రచించె నింపుగన్ 46
దేశము - కోశము - పాశము – దేశభక్తి :
ఆశయము లుంచి మది నప
దేశము నుత్కోశముఁ గడతేర్చుచు నాశా
పాశములు వీడఁగ వలె న
నాశము నైన నిజ దేశ నాగరికు లిలన్ 45
[అపదేశము = కపటము; ఉత్కోశము = కోపము;
పాశము = సమూహము; అనాశము = తిండి లేమి]
ఛందోగోపనములు:
విదిత జన గణ యుతము భగ
వదుక్త గీత ప్రభృతులు భాగవ తాదుల్
సదమల మతి సద్భక్తినిఁ
జదువుమ వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్ 44
కనివిని నేర నట్టుల జగద్గురు విచ్చెను విశ్వ మందునన్
జనగణ వర్తనోచిత విచార వితానము దేవ గీతముం
గనదరమే భువిన్ జన నికాయ మనంబుల నన్య మింక మా
కనయము పూజనీయ మనుమా వినుమా స్తవనీయ సత్కథల్ 43
భారత రామాయణముల
గ్ర - హ - ణ - ము" ఉండాలి.
చిత్ర మీ విశ్వ మందున శీతలగ్ర
హాగ్ర గౌరుఁ గబంధ సమగ్ర విరహ
భోగి విగ్ర హోగ్ర రత నభో విహరణ
రాహు వార గించ నగుఁ జంద్ర గ్రహణము 54
దాతలు దాన రతఁ జెలఁగి తత్పరతన్, సం
గీత ఝరులఁ జెప్పు నిటుల
బూతు, పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్ 53
[బూతు = బట్టువాఁడు]
భూతల మందుఁ గాంచఁగ నపూర్వము కా దన మంచి చెడ్డలం
జూతుము సర్వ వేళలను జుట్టపు రీతిని సంగతమ్మునై
యే తరి నైన నుత్థిత సమీప్సిత సిద్ధి కిఁకం ద్యజించుచున్
బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్ 52
దుఃఖమే చేర్చు జనులను దూర మణచి
దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
దుఃఖ మిచ్చుఁ బురుషులకుఁ దుష్టి నెంచ 51
నిఃఖర టాత్మ చింతనము నిత్య విశాల మనశ్శుచిత్వ వి
ద్వఃఖర కాభ వాక్పటిమ బాంధవ గౌరవ భావ దృష్టి మే
ధఃఖననప్రవృత్తి మదిఁ దథ్యము గల్గగఁ జేయు నట్టి యా
దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్ 50
[నిఃఖరటము = మృదువైన; ఖరకము = జలధ్వని; ఖననము = త్రవ్వుట]
హా చాతుర్యానుశాస నాధ్యాపకుడుం
బ్రాచుర్య గళోపమిత సు
కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్ 49
[గళ+ఉపమిత+సు కీచకుడు: కంఠము, పోల్చ బడిన
వెదురు గొట్టము కల వాడు; కీచకము = గాలి తాకున
మ్రోగెడి వెదురు/ పిల్లనగ్రోవి]
చాచుచు స్నేహ హస్తమును జాటుచు నీతిని శిష్య కోటికిం
బ్రోచుచు సంకటమ్ములను స్ఫూర్తి నొసంగి నిరంతర ప్రమో
దాచరణ ప్రచోదక మహార్థ సుశబ్ద సుశాస్త్ర కృష్ణకుం
కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్ 48
యేఁబది యేండ్లవి రయముగ నిలఁ బ్రాయము దాఁ
బైఁబడ మతేతరుఁ డొకఁడు
బైబిలుఁ బరికించి వ్రాసె భాగవతమ్మున్ 47
[భాగవతము = భగవంతుని చరిత్ర]
తాఁ బలుకంగ నింపు జనతా రత మంచు తలంచి యన్ని గా
రాబపుఁ గేంద్ర రాజములు రాజిల నిత్యము దూరవాణులన్
రేబవలెల్ల సాఁగెడు తరిన్ వినిపించెను ముక్క ముక్కలై
బైబిలులో, ఖురానుఁ గని, భాగవతంబు రచించె నింపుగన్ 46
ఆశయము లుంచి మది నప
దేశము నుత్కోశముఁ గడతేర్చుచు నాశా
పాశములు వీడఁగ వలె న
నాశము నైన నిజ దేశ నాగరికు లిలన్ 45
[అపదేశము = కపటము; ఉత్కోశము = కోపము;
పాశము = సమూహము; అనాశము = తిండి లేమి]
విదిత జన గణ యుతము భగ
వదుక్త గీత ప్రభృతులు భాగవ తాదుల్
సదమల మతి సద్భక్తినిఁ
జదువుమ వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్ 44
కనివిని నేర నట్టుల జగద్గురు విచ్చెను విశ్వ మందునన్
జనగణ వర్తనోచిత విచార వితానము దేవ గీతముం
గనదరమే భువిన్ జన నికాయ మనంబుల నన్య మింక మా
కనయము పూజనీయ మనుమా వినుమా స్తవనీయ సత్కథల్ 43
వారలు సేసిరె వరాంధ్ర భాగవత కవుల్
దూర కిటు లని పనుల ని
ర్ధారణ లేని కవియె యవధానిగ నెగడున్ 42
చేరును స్వర్గ ధామము సుశీలుఁడు దాన గుణంబు నందునన్
మేర యనంగ నేరని యమేయ దయా గుణ మానవుండిలన్
దూర విచార సంయుత సదుద్భవ సార్థ సుశబ్ద సంపదన్
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్ 41
[ధారణ = మేర / హద్దు]
భాషణ రతులు నయి వేష భాష
లందు నింపు గొలుపు సుందర విబు ధాము
ఖర పథంబు సౌఖ్యకారకంబు 40
[విబుధ+అముఖర= విబుధాముఖర;
అముఖరము= ముఖరము కాని/ అసంబద్ధ వచనము లాడనివారు]
పరిశీలించఁగ భోగ భాగ్యములు సువ్యక్తం బనిత్యమ్ములే
స్థిర జీవేచ్చ వహించి జీర్ణపట రీతిన్ వీడి విత్తంపు లా
హిరి చిత్తమ్మున రామకృష్ణ ముఖ యోగీంద్రాది వేదజ్ఞ శే
ఖర మార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్ 39
హరియె శిష్టుల నరయంగ ననిన నొప్పు
దుష్ట మానవు లందలి దుష్ట గుణము
సంహరింతును జగమున శాంతి నిలుప 38
సింహస్వప్నము వైష్ణ వావలికి నిశ్శేషమ్ము గాంక్షించి హ్రీం
హ్రీంహుంకార నినాద మంత్రముల దైతేయుండు పేట్రేగగన్
సింహాకార వరాంగ సంహితము సుశ్రేష్ఠ ద్విపాదుండనై
సంహారంబును జేసెదన్ జగమునన్ శాంతిం బ్రతిష్ఠింపఁగన్ 37
పర్వ పతి నిశాకరుండు పాథోధి మహా
పర్వద కల్హార మన
స్సర్వజ్ఞుండైనవాఁడు చంద్రుఁడె సుమ్మీ 36
[ఖర్వము = లక్ష కోట్లు; పర్వము సమూహము;
పర్వద = పండుగ నొసంగు వాఁడు]
దుర్వారాగ్రహ తప్త దక్షపతి యాతుఙ్గీ పతిన్ రోహిణీ
గర్వోద్రిక్తు శపింప వేడఁగనె సత్కారుణ్య మేపారగన్
సర్వావస్థలఁ బ్రీతి తోడ నిజ శీర్షంబందు నిల్పెన్ సుమీ
సర్వజ్ఞుండని కీర్తిఁ బొందెను గదా చంద్రుండు సచ్ఛీలుఁడై 35
[సర్వజ్ఞుఁడు = శంకరుఁ డు]
హనుమంతుని వర్ణన:
చూచెన్నుత కపి సత్త్వుఁడు
వీచియుతార్ణవము దాటి వింతగ లంకన్
దాచిన నవనిజ కన్నున్
వేచి యరసి పన్నుగఁ దెలిపెను దన్ను వడిన్ 34
[కన్ను = జాడ]
6Jan2018
మణి నిభేన గమక్రమ మకర రాశి
సాంత సుక్రమణమ్ము ధ్వాంతాంత కారి
నవ రుచి వదన కాంతా జన విమలాంత
రంగ వల్లుల కాంతి సంక్రాంతి వచ్చె 33
[మణి నిభ+ ఇన = మణినిభేన; గమము = ప్రయాణము]
[అంతకారి = అంతము చేయువాడు;
ధ్వాంత అంతక అరి = సూర్య చక్రము/ చంద్రుడు]
కవి హృదయం బెల్లఁ గలఁచఁ గన్నీ రైనన్
వివరమ్ముగఁ గథయై, యే
కవితల లో లేని, తలఁపు కైతల కెక్కెన్
సువదన నా యహల్య నట చోద్యమ చేసెనె ప్రస్తరమ్ముగన్
శివ ధను వక్కజమ్ముగను జేసెనె భగ్నము సీత సన్నిధి
న్నవరజ లక్ష్మణుండు వని నక్కట గీసెనె రక్ష రేఖనుం
గవి తల లేని భావములు కైతల కెక్కెఁ బ్రశంసనీయమై 32
[కవి = వాల్మీకి మహర్షి]
అన్నదమ్ము లైనను మఱి యక్కజముగఁ
జిన్న వానికిఁ దమ కంటె సిరులు పెక్కు
లంచు మన మందు నీర్ష్య జనించి నట్టి
పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు 31
శ్రీ భూ వనితా రత్నములలో ఒకటి గాని రెండు గాని యన్నియు గాని
కారణ భూతముల కదా సకల యుద్ధములకు.
పడఁతియె యిచ్చి భాగ్యములు భండన సంతతి కారణంబగుం
బడఁతియె రాజ్య కాంక్షలను బన్నుగఁ బెంచి యొసంగు యుద్ధముల్
పడఁతియె మోహ కారిణిగ భస్మము చేయును మానవత్వముం
బడఁతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్ 30
[భాగ్యముల నిచ్చు లక్ష్మీ దేవి, భూదేవి, సీతా ద్రౌపదీ ప్రభృతులు పడఁతులే గద!]
షణమ్ము ధర్మాచరణమె సన్మోక్షపుఁ గా
రణ మగు నిద్ధాత్రినిఁ బూ
రణమే యవధానమందు రహి మంగళమౌ 29
తృణమైనం బరికంప మొందమియు నుత్ప్రేక్షా సమీక్షాది నై
పుణ మత్యంతము తోడునీడ యగు సంపూర్ణంబుగం బ్రాగ్ర్య కా
రణ భూతమ్మగు శబ్ద సంప దుచితార్థాత్తమ్ము మేధ స్సధా
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్ 28
జేర విశ్వకర్మ కృతమ్ము మీర ముదము
దేవకి యశోద రోహిణు లా వర బల
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి 27
భార్యల తోడ వచ్చిన నవారిత తేజులు రాఘవానుజుల్
తూర్య నినాదముల్ సెలఁగఁ దూర్ణము రాణులు ముందుగన్ మహా
శ్చర్య కరాస్త్ర భగ్న విలసద్సుత మాత లజాత్మ జేద్ధ స
ద్భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్ 26
యొక్క మారులు సంపిన యోధ! పరశు
రామ! భూసుర! భార్గవ రామ! విదిత
రాఘవా! నీ కుఠారమున్ బ్రస్తుతింతు 25
[విదిత రాఘవ = తెలియఁబడిన (విష్ణువని) రాముఁడు
కలవాఁడు: పరశు రాముఁడు]
ఇంద్ర నందనుండైన కాకి సీతను బాధించి రామ విముక్త
బ్రహ్మాస్త్ర విద్రావితుఁడై తిరిగి వచ్చి రాముని వేఁడుకొను సందర్భము:
ఈ ఘన శీల భాసితను నివ్వసు ధాత్మజ జానకీ సతిన్
శ్లాఘన యుక్త కాంతను నసహ్యపు రీతినిఁ జీరితిన్ మహా
మోఘము నీదు శక్తి కన మూర్ఖు క్షమింపుమ, నేర కిచ్చితిన్
రాఘవ నీకు ఠార మును, బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్ 24
[ఠారు = ఆకస్మికమైన దెబ్బ; మును = పూర్వము]
మండలి మంచి క్రమణము మకరమందు నుత్తరాయణ మగు నుర్వి యందు
కాంతులు వెదజల్లు కలుగఁ బంటలు హాలికులకును భోగిమంట లలరుఁ బురి
రంగవల్లుల నెల్ల రమణీమణు లలరుదురు పూజ లింపుగ జరుగు నిండ్ల
గాలిపటములు నాకమునఁ జెలంగుఁ బ్రభల తీర్థములు తమిఁ బరిఢవిల్లు
భోగిపళ్ళ గొబ్బెమ్మలఁ బుడమి నిండు
పిండివంటల ఘుమఘుమ లుండు నెల్ల
క్రొత్త బట్టల నింపుగఁ జిత్త మలరు
మంచి క్రాంతి ముదకరమ్ము మానవులకు 24
విత్త మందు నుంచి తనదు చిత్త మెల్ల
సుంత యైనను హరిమీద చింత లేక
నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె 23
[తత్వమును+అమ్మి = తత్వము నమ్మి]
కరి రక్షించెను బాలుఁ గాచెను భువిం గాపాడెఁ బుణ్యాత్ములం
బరి రక్షించెను దక్షతన్ననుచు సంభావించి కీర్తింతురే
హరి యంచుం గిరి యంచు మూర్ఖు లిల నిత్యంబంచు నిందింపగన్
హరి తత్వమ్మును, మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా 22
ధారుణి నేత లగుదురు సుతవ్రజ యుతులై
బీరు వకృత కార్య చయ వ
చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే 21
[వచః+ఉరు = వచోరు; అధికప్రలాపి]
క్షీరము నీయఁ బూతనను జీరిన వాఁడు కుమారుఁ డయ్యు నా
తేరును గూల్చె వాయ్వసురుఁ దేర్చెను మద్దులఁ ద్రుంచెఁ గాలి దు
ర్వార బకాసురారి పసి బాలుఁ డు వెన్నుఁ డు తక్ర సారపుం
జోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్ 20
ధాన్యాధిక్యమ్ముల భరత మహాకుల రా
జన్యుని చేత యశో గరి
మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్ 19
[యశోగరిమ+అన్యుఁడు = ఘన యశస్కున కన్యుఁడు]
హైన్యము ధర్మ దూర మని యాత్మఁ దలంచక రావణుండు దా
నన్యుల యక్ష కిన్నర విషాస్య నిలింప నృపాత్మ జాదులం
గన్యలఁ దస్కరించెడు సకామ తమిస్ర మనో వికారుఁడే
మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో 18
నిండుగ - పండుగ - మెండుగ – దండిగ
అవధాన వైభవము:
కవన మరటి పండు గతి మృ
దు వతి మధుర మెండుగడ్డిఁ దూగ వచనముల్
సువిధిని గానిండు గమన
పు వరుస కాదండి గరిమపు విగర్హణలన్ 17
తర్షమది, తీరదఁట త్రాగ ద్రాక్ష రసము
వాటి కాకలి దప్పులు పన్నుగఁ గొను
పచ్చగడ్డియు నీరము వలన గాక 16
[రహిత+ఋషము =రహితర్షము; ఋషము = గడ్డి]
కర్షకు లైనఁ గార్మిక నికాయము నైన నధీశు లైన నా
ధర్షము సేయ జాలరిలఁ ద్రాగెడు నీటిని నెన్న డైననున్
వర్ష జలంబు వోని శుచి వాజము దాహముఁ దీర్చు నింపుగం
దర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్ 15
[తర్షము = దప్పి]
దెన్నఁడును భోగములఁ గృత హితమె తృప్తి
తనదు సుఖములే కాక యిద్దరణిఁ బరుల
దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు 14
నిఃఖలతా మనో రుచిర నిర్వ్యసన ద్యుతి వెల్గు వానికిన్
దోఃఖరమండలాగ్ర రిపు దుస్సహ వీర వరేణ్యులందుఁ బ్రా
తః ఖురలీ విలాస వసుధాపతు లందుఁ దలంచగం బ్రజా
దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్ 13
[నిఃఖలత =దౌష్ట్యము లేమి; ఖురలి = సైనికుల సాము ]
వద్యముగా నేర్చి దూష్య భావ నిరసనా
పద్యాలాప సమాహిత
పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్ 12
మద్యపు మత్తు నందున నమానుష రీతిఁ జెలంగి విత్త సా
రద్యుతి వెల్గి పుక్కిటి పురాణములంచును వెక్కసమ్ముగన్,
హృద్యపు సత్పురాణముల నెంచి పఠించక యొక్కటేనియుం
బద్యము, వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా 11
భాగవత పురాణమ్ముల భారతంపు
బర్వములు సశేషము మూడు, వదలి యపర
భాగవతమును, నన్నయభట్టు వ్రాసె 10
ఆగమ సన్నిభమ్మనుచు నార్యులు చెప్పఁగ భారతమ్మునే
నాగరికంపు టాది కవి నా వినుతించఁగఁ బండితోత్తముల్
వాగనుశాసనుండు తమి భారతమున్, మత గర్భితమ్మనన్
భాగవతంబు, వ్రాసె నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్ 9
[నాగరికము = నాణెమైనది; మతము =సమ్మతము]
పదిలమ్ముగ విని సద్గురు
వదనచ్యుత నిగదితములు పరిచర్యలు నె
మ్మది నాచరించ శిష్యులు 8
నదీతటీన్యాయమునఁ జనవలె గురువులున్
[దరి నదికి రక్ష, నది దరికి నిత్యము సన్నిహితము.
దుష్టులు కపట చిత్తులై తుచ్చ వాంఛ
కోడి మాంసమ్ము హితము యోగులకుఁ దినఁగ
నందురు మహా పురుషు లిలఁ గొంద ఱకట! 7
వచియింపంగ గృహమ్ముఁ బావనము సంభావ్యంబుగన్ సేయరే
యచిరం బంచును వేడ రా నుడివి తే నా మౌనికిన్ భక్తినిన్
శుచులై వండిరి శాకరాజముల నిచ్చో, వీడుఁడీ దానినిన్
రుచిమంతంబగు కోడిమాంసమది, యారోగ్యంబు సన్యాసికిన్ 6
[మాంసము వీడుట సన్యాసికి నారోగ్యదాయకము]
కారకు లిరువురును దుష్ట కార్య తతుల
వెలయు శిశుపాల దంతవక్త్రులను గనుమ
కన్న! వారి కన్న ఖలులు గలరె వెదక 5
[కన్న = కృష్ణ]
ఉత్సాహము.
తిన్నఁదనము లేని జనులఁ దీవ్ర వాద చరితుల
న్నన్నుల విలపించు వారి నన్య విత్త చోరుల
న్నన్న మవని పాలు సేయు నవగుణ రత దుష్టులం
గన్నవారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్ 4
[కన్న వారు = చూచు వారు]
దశరథాత్మజ రాముని ధన్వి వరుని
విపుల బాహుని, భావికాలపు నిహంత
రావణునిఁ, బెండ్లియాడె ధరాతనూజ 3
సేవిత భూసు రానిమిష శేఖర సేంద్ర విరాజమానునిం
బావన సూర్య వంశవర పంక్తి రథాత్మజు రామచంద్రునిన్
భూవల యాధినాథ వరు భూజ మనోరత శూరు శత్రు వి
ద్రావణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా 2
న్యస్తాక్షరములు... అన్ని పాదాల యతిస్థానాలలో వరుసగా "క్రొ - త్త - సా - లు"
కువల యోదధి కింపగు క్రొత్తరఁగ పు
డమి జనులకు విజ్ఞాన విత్త మొసఁగు నవ
సమ యరుగుదెంచెను గనుండు సాటి లేని
ద్రవిణము ససులు క్రొత్త సాలువు లొసంగు 1