ఆకాశ వాణి వారి సమస్య:
ముద్దుల బాల కృష్ణుని తృణావర్తుఁ డెత్తుకు పోవు సదర్భము:
చక్కని నొక్కు లున్న శిఖ చక్కియ నెక్కుడు చెక్క ఱోలుతో
చిక్కని యుక్కు పిక్కటిలఁ జెక్కిన మక్కువ తోడ శిల్పమే
యెక్కటి దిక్కు చక్క నెఱు పెక్కిన చెక్కిలి స్రుక్క నేర కీ
రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్ 60
భృగు మహాముని కల్పిత భీమ దివ్య
హోమ జనితంపు ఋభుగణ మున్న నేమి
దక్షునకు వీరభద్రుఁడు తలఁచ బేసి
కంటి దీపమౌ సుతుఁ డయ్యెఁ గాలయముఁడు 59
పంటికిఁ జేయ వైద్యమును బన్నుగఁ గూర్చొనఁ జేసి తండ్రినిన్
వెంట ద్విచక్ర వాహన మపేత భయోన్నత వేగ మంటగన్
మింటినిఁ దాఁ దమిన్ నడుప మిఱ్ఱగు రాతిని నెక్కి కూలగం
గంటికి దీపమౌ సుతుఁడె కాలయముండుగ నయ్యె నయ్యయో 58
ఫాలనయనుండు నెలతాల్పు నీలగళుఁ డ
మేయ భూత భేతా ళాధినాయకుండు
హరున కపరాజితునకు శంకరునకు నుత
హరికిఁ గైలాస మేలెడు నాశ గలిగె 57
లలి తోద్యాన తటాక సల్లలిత విభ్రాజిష్ణు భూభృత్తునున్
విలయద్యోతక సత్క్రియా వర మనోభీష్టాత్త విఖ్యాతుఁ డా
లలితస్కంధుఁడు చంద్రశేఖరుఁడు సర్పభ్రాజితాంకద్యుతిం
గలిగెం గోరిక శ్రీ సతీవిభునకుం గైలాసమే యేలఁగన్ 56
[శ్రీ సతీవిభుఁడు = శ్రీ శంకరుఁడు]
సృష్టి యందుఁ దనరు చిత్రమ్ము లెంచఁగఁ
దరమె యేరి కైన ధరణి యందు
రయమునఁ జరియించఁ బ్రసవంపు వేదనం
బిల్లి పుట్టెఁ బులికి వింత యగునె 55
[పులుకు = వేదనతో కను రెప్పలార్పుట]
ఉల్లము తల్లడిల్లఁగ మహోగ్ర మృగేంద్ర నికాయ ముండఁ గో
కొల్లలు క్రూర జంతువులు ఘోర నినాద వనాంతరమ్మునం
బిల్లలు, వన్యజంతు తతి భీతిలి నిల్వఁగ దద్దఱిల్లి కం
పిల్లి, జనింపఁగాఁ బులికి వింతగఁ జెప్పుకొనంగ నొప్పునా 54
కనువిందు గొల్పు మంటప
మున నాఁడపడుచులు సేరి ముదమారగఁ ద
మ్ముని దీవించుచుఁ జూచుచు
హనుమంతునిఁ బెండ్లి, యాడి రార్గురు కాంతల్ 53
మనసుల్ దోచిన వారి నెన్నుకొని షణ్మాన్యప్రభా భూషలం
జని వేగమ్ముగ నాంజనేయు గుడికిన్ సంరంభ మేపారఁ జ
ల్లని చిత్తమ్మున వారి కాపురములన్ రక్షించగన్ వేడుచున్
హనుమంతుం, దగఁ బెండ్లియాడిరట తా మయ్యార్గురౌ కాంతలే 52
అంశము - రక్షాబంధనోత్సవముపై పద్యము నిషిద్ధము - 'ర'కారము (రకార సంయుక్తము కూడ)
కాపాడ కల్గిన కవచమై తను వెల్ల వ్యాపించి దీపించ భవ్యముగను
మన మందు నిల్పఁగ మమతల బంధము భగినీమణుల యందవనపు బుద్ధి
గృహ మెల్ల నింపఁగ ధృతితోడ ముదమును జ్ఞప్తిగొనఁ గుటుంబ జనులు సతము
పిల్లలు పెద్దలు భేదమ్ము దలఁపక యాడుచుఁ బాడుచు నవని వెలుఁగ
నాది కాలము నుండియుఁ బాదుకొనఁగఁ
జలుపు చుండఁగ నీ పృథ్వి జనులు తమిని
హస్త పాశము పదిలమ్ము ననయ మీయ
మనమునఁ దలంచి కట్టుమ మానితముగ 51
అవిరళముగఁ జిత్తమ్మున
వివశుం డగుచుం గరమ్ము వివిధపు టయ్యై
యవసరములఁ దా నాశై
శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్ 50
అవనీ చక్ర నివాస మానవ సమూహానంద సంధాత దే
వ వరేణ్యవ్రజ భాజనీయ గగన ప్రాప్తేద్ధ రత్నమ్మునున్
భవ సాన్నిధ్య తటిం దమిన్ నిసి నిసిన్ స్వచ్ఛంపు గంగానదీ
శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్ 49
[శవము = జలము]
వరముల నొసంగు లక్ష్మి యిద్ధర విశదమ
గును గరము వరలక్ష్మి నాఁ గువలనేత్ర
పూజ సేయఁగ లలనలు బుద్ధి నుంత్రు
చేరి కాపాడు సతము లక్ష్మి యని భక్తి 48
వనజ దళాయతాక్షి నిజ భక్తజనావన సత్క్రియా రతై
క నిజ మనోరథప్రకర కంజ ముఖాంబుజ వారిరాశి సం
జనిత రమాభిధాన విలసల్లలితాంబుజ హస్త హస్తి భా
జన జల భాసమాన శిర చక్రధరాంగన లక్ష్మిఁ దల్చెదన్ 47
వదలక పట్టి తనను జం
పుదురని యెంచి మనమందుఁ బోయిన వానిన్
బెదరి వడి యొకండు జనుల
కదలని వాఁ డిల్లుఁ జేర్చెఁ గాననివానిన్ 46
[జనులకు + అదలని = జనుల కదలని; కానని వాఁడు =కనిపించని వాఁడు]
చదివితి వీవు మెండుగను జాలి యొకింతయుఁ బుట్ట దేల నీ
హృదయము నందు నంచు సఖు లెల్లరు తన్నటఁ గిన్కతోడుతన్
గదుమఁగ భీత మానసుఁడు కర్కసుఁ డన్యుల యార్తి కెన్నడుం
గదలని వాఁడు సేర్చె నిలుఁ గానని వానిని విభ్రమంబుగన్ 45
అమ్మ భూమాత యేమని యందు వాసు
దేవుఁ డేఁగు దెంచి సభార్య దివ్య బాణ
సంతతిని నరకాదుల సమర మందు
నమ్ము బిడ్డలఁ దునుమాడె నమ్మ విధిగ 44
ఇమ్మెయి దేహ మాహుతిగ నీయఁగ వేగ నుపక్రమించఁ దా
నమ్మద నాంతకప్రద మహాసినిఁ గల్మష కంఠ సాహ్యమే
చుమ్మన ద్రౌణి దుష్ట మతి, శోక పయోధినిఁ గ్రుంక, నిద్రనున్
నమ్మిన బిడ్డలం దునిమి నవ్వుచు సాగెను, మాతృమూర్తియే 43
నగవరుఁడు సురవరుల వరు
సగఁ గాంచి శివుని గణించి జనకుం డంతం
దగు నీతఁ డనంగ సురా
పగ వానిం బెండ్లియాడె పడతియె ప్రీతిన్ 42
తగఁ డీ చైద్యుఁడు రాక్షసాంశుఁ డని చిత్తంబందుఁ దాఁ దల్చుచున్
మృగ లోలాక్షియ యేఁగుదెంచ వడి నా కృష్ణుండు విప్రుండు పం
చఁగ వైదర్భి మహానురాగమున రక్షశ్శ్రేణి కత్యంతపుం
బగవానిన్ సతి పెండ్లియాడి పడసెన్ భాగ్యోన్నతిం బ్రీతితో 41
కలశామృత లలితామ్ర సు
పలాశ షండ ప్రవిమల పాథః ప్రోక్ష
ల్లలి తామర సన్నిభ దివ
స లసద్భోజన వరమ్ము సాలునె పొగడన్ 40
అండగ నుండును హేరం
బుం డని నైవేద్యములను భోజ్యములను వే
దండ నిభమ్ములగు కుడుము
కొండలనె యలంకరించి కోమలి మురిసెన్ 39
పండుగ నాఁడు పూజ లిడఁ బన్నుగ మాకు నొసంగవే యనన్
దండము వెట్టి పల్కి యిటు తాను సఖీజన కోటి కెల్ల నా
కుండఁగ నీయ కుండుదునె యుత్తమ విగ్రహ సంచయమ్మునుం
గొం డనలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే 38
[కొండు + అనలంకరించి = కొం డనలంకరించి]
తల్లినిఁ జంప మన్న తండ్రి తపశ్శక్తిఁ దలఁచి పరశురాముఁడు మనస్సు లో నూహించు సందర్భము:
కశ్చి దకార్యము జనకుఁడు
నిశ్చయముగ నుడువిన జప నిరతుం డలుకన్
నిశ్చింతఁ జేయఁ దగుఁ బడి
పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్ 37
[విడి = ఒంటరి]
నిశ్చింతన్ మన నెంచు దేని వడి వీనిన్ మాను దుశ్చర్యముల్
గిశ్చర్యమ్ముల నింక నైనను గృతాకృత్యాలికిం జెందుమా
పశ్చాత్తాపము, వీడి పుణ్యమునకై పాపక్రియల్, సల్పుమా
యాశ్చర్యమ్మును బొంద నెల్లరును నిత్యం బీవు సత్కార్యముల్ 36
విశ్వ మందున వంశాభి వృద్ధిఁ గర మొ
సంగు సంతాన మరయని జన్మ మేల
సాధుతర పాక సంచయ సంభృతపు ర
సవతి లేని సంసారము సాగు టెట్లు 35
[రసవతి = వంటయిల్లు]
యవనిక చాటు నుండక మహత్తర రోష విహీనయై కృతా
నవరత గేహ కర్మ చయ నైపుణ మొప్పి చరించు దార ప
త్యవసర కార్య భార రత హాస్య రసావృత రుగ్వచో విలా
సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో 34
ఆడుచుఁ బాడుచుఁ దిరుగుచు
వాఁ డెడతెగక యెపుడు పుర వర మందుఁ దమిన్
వేడుకఁ దేనెను గోరుచుఁ
గో డలి పొం దభిలషించెఁ గుణకోవిదుఁడే 33
[కోడు + అలి = కోడలి; కోడు = ఊరి చివరి చిన్న చెఱువు;
అలి = తుమ్మెద; పొందు = స్నేహము]
వీడని ప్రేమ పాశమునఁ బెన్మిటి నింపుగఁ గట్టి వేయుచున్
వాడని మోము వన్నె లవి పమ్మఁగ నేరికిఁ దీసి పోని యే
చాడుపుఁ జూడ పుణ్యసతి సద్గుణరాశి నిజాంగ కర్తకుం
గోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా 32
వైద్యు లుండినఁ బెక్కురు పరఁగు రుజలు
ప్రగతి గన్నను గల రిట బడుగు జనులు
న్యాయ సభ లున్నఁ దగ్గ దన్యాయ మిచట
స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు 31
ఇచ్ఛలు మీఱ సంతతము నీసు నసూయలు పిక్కటిల్ల నీ
యచ్ఛపు బీద సాదలకు నర్థ పదోద్ధతి నంధులౌ మన
స్స్వచ్ఛత లేని పౌర తతి, భారత మాతకు నిక్కమెంచగన్
స్వేచ్ఛ లభించె, దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్ 30
వాలము నాడించుచు వే
పాలను ద్రాగంగఁ దాను బర మాతురతన్
వ్రాలఁ బొగలు గ్రక్కెడు నా
పాలం గనినంతఁ బిల్లి భయపడి పాఱెన్ 29
పాలు విశుద్ధ కుంద నిభ పాండిమ వర్ణ విరాజమాన మా
ర్జాల మనోభిలాష ఘన రంజన దుగ్ధము గ్రోలఁ జేరి తా
నా లలి తోన్నత స్థిత గృహాంతర మందలి సారమేయ రూ
పాలనుఁ జూచి పిల్లి వడిఁ బాఱెను తీవ్ర భయార్తిఁ జెందుచున్ 28
స్వాదు జల పూరితమ్మగు స్థలము నెంచి
కష్ట మని విడువకయు సకల జన హిత
తత్పరతయు నుండఁగఁ బట్టుదలయుఁ గార్య
దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును 27
మోహ మదారి సంయుతము మూరిన మత్సర కామ లోభ సం
దోహము మూట గట్టి యతి దుష్కర మైనను బాఁతిఁబెట్ట సం
దేహ నికాయ మంతయును దీర్చు కొనంగను జిత్త మందునన్
దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్ 26
ఆ కరుణా చిత్తుని నే
నీ కారణమునఁ గనంగ నెట్లని తనదౌ
ప్రాకట దుస్థితిని, దలఁచి
శ్రీకృష్ణునిఁ, దిట్టె నయొ కుచేలుం డలుకన్ 25
ఏకైకుం డట ధర్మ రాజ కృత భూమీ శావనీ దేవ సం
ఘైకత్వార్జిత పుణ్య నిర్ణయము కృష్ణాగ్రార్చనం గాదనన్
శ్రీకృష్ణ ప్రతియోగ చేల ధర దుశ్శీలుండు చైద్యుండు వే
శ్రీకృష్ణుం గటు భాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో 24
[కుచేలుఁడు : చెడ్డ వస్త్రమును ధరించిన వాఁడు; శ్రీకృష్ణుని మీద పగ యనెడు
బట్టను కట్టి కుచేలుఁ డయ్యాఁడు.]
ద్రుపదునకు వ్యాస భగవానుఁడు పంచేం ద్రోపాఖ్యానము చెప్పి
ద్రౌపదినిఁ బంచ పాండవుల కిచ్చి వివాహము సేయు మని
చెప్పిన సందర్భము:
చక్కఁగ హరి హరు నానతి
పెక్కువ హరి పంచమ మయి పృథ గర్భమునం
దక్కిన సురాంశఁ బుట్టఁగ
నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్ 23
[హరి = ఇంద్రుఁడు]
పాండవు లైదుగు రొక్క యింద్రుఁడే, యగుటయు శ్రీకృష్ణ పరమాత్ముఁ
డష్టోత్తర షోడశ సహస్ర కృష్ణులై యొక్కొక్క కృష్ణుఁడు నొక్కొక్క భార్య
యొద్ద నారదునకుఁ గనిపించుటయు నయిన పరమార్థము నుదహరించుట:
పిక్కటిలంగ స్వార్థము వివేక విహీను లధర్మ మార్గముల్
త్రొక్కుచు నుండ నెంత మది రోసిన నేరరు విష్ణు మాయ లోఁ
జిక్కిన మోహ మానసులు సెప్పిన నీ పరమార్థ తత్త్వమే
యొక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్ 22
పగ లనక రేయియు ననక
వగవక మగలు మగువలును వారక నీయన్
నిగనిగ లాడు తమ కురులు
సిగ రెట్టింపనెఁ దిరుమల శ్రీవారు దగన్ 21
తగఁ గన్పించు నిలం బ్రభావములు ప్రత్యక్షమ్ముగన్ మూర్ధ జా
పగతం బైనను జింతఁ జెందకుమ దైవజ్ఞాన మజ్ఞానమే
తెగుచుం, బన్నుగ నీయ మాని తగఁ దా దేహాభిమానమ్మునున్
సిగ, రెట్టింపనె వేంకటేశుఁడు సురల్ సేవింపఁ దద్వాసనల్ 20
[వాసన = అనుభూతార్థస్మృతి]
ఈ క్రూరుని బారి పడి సీత యెంత బాధ పడినదో
యని తలఁచు కొని రాముఁడు విలపించు సందర్భము:
పఙ్క్తి రథాత్మజుఁడు వడయఁ
బఙ్క్తి క్లేశముల నంత భగ్న హృది మహా
పాఙ్క్త సురారి పురమ్మునఁ
బఙ్క్తిముఖునిఁ గాంచి రామభద్రుం డడలెన్ 19
అఙ్క్తప లోల మానసుఁడు నా రఘువీరుఁడు దీనుఁడై మహా
పాఙ్క్త నిశా విహారుఁ డనవద్య ధరాసుత నేమి సేసె నా
శఙ్క్తర శక్తి హీనుఁ డయి సద్గుణ వంతుఁడు లంక కేఁగి తాఁ
బఙ్క్తిముఖుం గనుంగొని యపారభయమ్మును బొందె రాముఁడే 18
[ అఙ్క్తప = గట్టిగ ముద్ర పడ బాధ పడినది; అపాఙ్క్త = పంక్తి కనర్హుఁడు, పతితుఁడు;
శఙ్క్తర = సందేహము దాటుట]
యతి విరామమే మిత్రత్వ మవసరమ్ము
లేక యతి పురాతనములు ప్రాకటంపు
సురవ రోచిత సంస్కృత శ్లోకము లవి ,
యతులు ప్రాసలు లేని పద్యములు, మేలు 17
విత తార్థ ద్యుతి వెల్గు చుండగను బ్రావీణ్యంపు శబ్ద ప్రభన్
నుతియింపం బడఁ బండి తోత్తముల చే నోరార రమ్యంబుగన్
శృతి కానందము గూర్పఁ దోడ్పడఁగ వైచిత్ర్యమ్ము దోషంబులౌ
యతులున్ బ్రాసలు లేని పద్యములె మేలంచున్ గురుల్ సెప్పరే 16
సుమనస్కుండు నిషధ పతి
దమయంతినిఁ బెండ్లియాడె దశరథసుతుఁడే
యమిత దయ రక్ష సేసె ని
డుమ లందు వనములఁ దిరిగెడు తరుణ మందున్ 15
విమలాంతఃకరణుండు సత్యరత గంభీరేద్ధ ధానుష్కుఁడున్
సమదేభాభ సు సంప్రహార నుత సచ్చారిత్ర సీతా సతిం
గమనీయంబుగ లక్ష్మి నాఁ బరఁగు సత్కాంతా మణిన్ విష్ణు చం
దమ యంతిం దగఁ బెండ్లియాడెను గదా ధర్మాత్ముఁ డా రాముఁడే 14
[అంతి = సంతోషము]
ద్వ్యక్ష రాది త్యారాధనము :
నీ నామ మేను మనమున
నూని మనో మననమున నిను నమః నా నే
నేని మననీ న నన నను
మాన మిన! మనమున మాని మననీ నన్నున్ 13
కంటి నిట వెంట వెంటన
మింటిని నంటెడి మృదంగ మిశ్రిత రవముల్
టంటం టంటం టంటం
టంటంటం టంట టంట టమ్మనె భేరుల్ 12
టంటంటం టట టంట టంట టటటం టంటం ట టంటంటటం
టంటంటం టట టంట టంట టటటం టంటం ట టంటంటటం
టంటంటం టట టంట టంట టటటం టంటం ట టంటంటటం
టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే 11
పడయ వచ్చు భోగ భాగ్యములు దనరి
యేల వచ్చు ధరను గాల మెల్లఁ
గాని కాంచఁ గలము కాలు ధామమున న
ధర్మ వర్తనునకె దండనమ్ము 10
కర్మ ఫలంబ యాయె నిఁకఁ గాటికిఁ గాపు త్రిశంకు సూనుఁడే
ధర్మపు మూర్తి దాశరథి దారుణ గోత్ర నివాసి యయ్యెనే
ధర్మము ధర్మ మంచు నల ధర్మజుఁ డయ్యెను రాజ్య దూరుఁడే
ధర్మము నాచరించు నెడఁ దప్పదు దండన మెట్టి వానికిన్ 9
వాలి సుగ్రీవ ద్వంద్వ సమరములో రాముఁడు వాలిని జంపు సందర్భము:
ఆలిని బాసిరి యిద్దఱు
నా లలిత స్నేహ రతిని నల సుగ్రీవుం
బాలన సేయ రఘువరుఁడు
వాలినిఁ బార్థుండు గూల్చె బవరము నందున్ 8
కాలము దేశ సంస్ఠితులు గ్రమ్మఱ నింపుగ ధీరుఁడై మహీ
లాలస బుద్ధి సన్నిహిత రాజ్య ధరాపతి యౌ విరోధినిన్
లాలిత కాలనేమి మధురాపతి యొక్కఁడు, గొల్చి తా సినీ
వాలినిఁ, జంపె యుద్ధమునఁ బార్థుఁడు, కంసుఁడు గాంచి మెచ్చఁగన్ 7
[సినీవాలి = పార్వతీ దేవి; పార్థుఁడు = మరియొక రాజు]
కల వెల్ల భాధలకుఁ గిటు
కులు పలు రీతులు వగ పుడుగుమ సత్వరముం
దల నొప్పి కెంచఁ దొలఁగుడు
తలగడ, మంత్రమ్మె, మేలు తరుణుల కెపుడున్ 6
జలజ సుఖాస నాద్యమర సన్నుత భావజ జన్మ కార కా
మల కలధౌత బంధుర సుమస్తక రత్న మొకింత నంతటం
దొలఁగగఁ జేసి పొందెఁ గద తొయ్యలి సత్యయె పారిజాతముం
దలగడ మంత్ర మింతులకుఁ దప్పక మేలొనరించు నెచ్చెలీ 5
కరము ముదంబున ధరణినిఁ
బరఁగుం డనుచుఁ బరమేష్ఠి పంపఁగ మనలన్
నరుఁడు జనుఁడు మనుజుం డనఁ
బురుషార్థములన్ గణింప మూడని తెలిసెన్ 4
పర దారాశల వేఁగి సంతతము దుష్పారంపు విత్తార్థియై
నిరతంబుండఁగ దోష కార్యములఁ దా నేర్వండు సత్యమ్మునున్
ధర మోక్షమ్మును గాంచ నేరఁ డను సంధానమ్మ పో వానికిం
బురుషార్థంబుల లెక్కిడన్ దెలిసెఁ బో మూడంచు నా బుద్ధికిన్ 3
[ఆ బుద్ధికిన్]
పెక్కు పేర్లఁ బరఁగు చుండుఁ బృధ్విఁ గడలి
పలుక విషధి కూపారము పాథి వారి
రాశి వార్థి పయోరాశి రత్న నిధియు
సాగరం బబ్ధి శరనిధి సంద్ర ముదధి 2
మ్రోగఁ దరంగ నాదములు మోహన రాగములై చెలంగి యా
భోగ జలాశయమ్మునను బూర్ణ మనశ్శుచులై మునుంగ వే
నీఁగును దోష సంచయము నే ననిశమ్మును భక్తిఁ గొల్తు నీ
సాగర మబ్ధి తోయనిధి సంద్రము వారిధి ద్వీపవంతమున్ 1