వికసిత ఘన కాంతార
ప్రకరము లభివృద్ధి సేయ వలయు మనుటకున్,
సక లాటవీ క్షయ క్షి
ప్ర కృతి వినాశనమె, మిగులఁ బావనము భువిన్ 60
[మిగులన్ = మిగులుటకు; పావనము = జలము]
సుకరము కాదు మార్చ మధుసూదనుఁ డెంచిన నైన మూర్ఖునిం
బ్రకటిత మైనఁ జేయవలెఁ బన్నుగ యత్నము మానవాళికిన్
వికలిత ధీ దయాది గుణ భీకర మర్త్య మనస్థ కుత్సిత
ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్ 59
[ప్రకృతి = స్వభావము]
ఆకాశ వాణి సమస్య :
తీరుగ నేటి నాయకులు దేశ సురక్షణ కార్యపుం బృహ
ద్భారము మేమ మోతు మని బాసలు సేసి యనర్హమైన స
త్కారము సేసి ప్రేముడి సదా స్వజనాళికి దేశమం దధీ
కారముఁ బెట్టి బంధువుల కన్నులు చల్లఁగఁ జేసి రెంతయున్ 58
అల్లనఁ జల్లగ నెల్లఱు
నుల్లాసముగఁ జను చుండ్రి యుంచుమ దానిం
దల్లి కడ వత్తువ యిటులఁ
బిల్లినిఁ జంక నిడుకొనియె, పెండ్లికిఁ జనుమా 57
ఉల్లము సంతసింపఁగ ని నొప్పుగఁ బిల్చిన నేఁగ కుంట నీ
కెల్లిదమై పరంగు భవదీయ సఖుం డట నిన్ను గాదనం
గల్లరి సోమవాసరము కార్తిక మాసము కాన్కపేటి, రే
పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికి నేఁగుట పుణ్యకార్యమౌ 56
[ఇల్లి = ఉపవాసము]
అండాకార చతుర్దశ
షండ భువన భాండ పాల సమ భోగీం ద్రా
ఖండ మృదు భోగ మండిత
ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై 55
[ముండ = తల]
బంగారపు గుండె పాదములను మొక్కుబడి గా సమర్పించెద నని మ్రొక్కు కున్న భక్తుని తో:
నిండైన విగ్రహుఁడు కో
దండ రఘూత్తమున కచట దండము లిడుచున్
మెండైన భక్తి నుంచుము
ముం డా మ్రొ క్కెద నిడు పదముల నా తలపై 54
[మున్ + డా మ్రొక్కు +ఎద + నిడు పదములను + ఆ తలపై;
మున్ = ముందు; డా మ్రొక్కు = ఎడమవైపున నున్న మొక్కుబడి;
ఎద = హృదయము; నిడుపదములు = పొడవైన పాదములు; ఆ తల = ఆ చోటు]
గండంబౌ నని యెంచి పాదములు ప్రక్షాలించి యీ రీతి మి
త్రుండౌ యగ్గుహుఁ డత్తరిం బలికె సంతోషించి భాస్వద్యశో
భాండాగార విరాజమాన మహ దిక్ష్వాక్వన్వ యాంభోధి సో
ముండా మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే 53
సైఁపు వ్యాకర ణాదుల సంస్కరించి
వీఁక సుందరతరముగ లోక మందు
నున్న చిన్న చూపును, దగ నుద్ధరించి
భాషను, నశింపఁ జేసెను పండితాళి 52
కాసుల నీయ నేరదు సగౌరవ ముంచదు దేశ మందునన్
మూసెను జీవ నాధ్వమును బోయెను రాజుల ప్రాపు దీనికిన్
బాస యనంగ నేఁడు పెఱ బాసయ కూటికి గూటి కెంచగన్
బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై 51
గృహముఁ దీర్చి దిద్దెడు నేర్పు కీర్తిఁ బడసి
పేర్మి బుద్ధులు గఱపుచుఁ బిల్లలకును
బోషణమ్మునఁ దల్లినిఁ బోలి నామె
తాతకుం దండ్రికిఁ, దనకు దార యొకతె 50
ప్రీతి సెలంగ మానవతిఁ బెండిలి యాడితి మెచ్చ నెల్లరున్
జ్ఞాతులు దర్ప జాతులయి సంపద నెల్లను దోచి నంతటన్
నీతిఁ గనంగ లేక చన నీతి పథమ్మున నిల్ప నెమ్మినిం
దాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్ 49
[తార = కనుగ్రుడ్డు]
అగ్ని యుత భూతములు జల
మగ్న ప్రాణులు విహంగ మహిచర మృగముల్
భగ్నము కాదిల నీతికి
నగ్నముగా సంచరించినన్ మేలనరే 48
భుగ్న మనో వికారములు వూనక మర్త్యులు, దా రపత్రపా
మగ్న నివార ణార్థము సమంచిత వస్త్రము లూన నొప్పగున్
భగ్నము కాదు ధర్మమిల బ్రాజ్ఞుల కచ్చెరు వేల జంతువుల్
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్ 47
పద్మములు తటాకమ్ములఁ బాలివోవ
నీడజమ్ములు సాగఁగ గూడులకును
నాల మంద వోఁ జాగ గోశాల కంత
మిడుఁగుఱుల వెల్గులో, రవి మింట సాగె 46
అడరఁగఁ గాలకేయుల సురాధిపు పంపునఁ జంపెఁ బోరునన్
జడియక పందికై యెఱుకు జాజర నున్న శివుం బెనంగెనే
కడు వెఱఁ గయ్యె మాత్స్యునకుఁ గవ్వడి సారథి యయ్యె నక్కటా
మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్ 45
తగు కార్యమ్ములు సల్పుచుఁ
బగళులు రేయులు శ్రమబడి పన్నుగ భక్తిన్
భగవద్ధ్యానమునఁ, జనక
పగలో, మున్గిన నఘములు భస్మమ్ము లగున్ 44
జగ దాదిస్థిత విష్ణు పాద భవ సచ్ఛైవాలినీ వారినిన్
సగ రామ్నాయ సహస్ర సంతతి సు నిస్తారప్రదాయీ నదిన్
రుగనీకద్యుతి భాసమాన నదిలో లోకత్రయై కామరా
పగ లో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్ 43
ఇన కుల జలనిధి సోముఁడు
ఘన ధానుష్కుండు నీల కాయుఁడు విల్లున్,
ముని యిప్పించంగ నడిగి
జనకుని, రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్ 42
వనచర సంచయ మ్మది యవారిత రీతినిఁ బోరు సల్పగా
ననుజుఁడు రావణానుజుఁడు నద్భుత లీలఁ జెలంగ నాజినిన్
ఘన మగు లంక యంద దశకంఠుఁడు రావణు దైత్యు నింద్రజి
జ్జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై 41
విశ్వ మెల్లయు నరయంగ వింత యగును
జరము లైనను నిత్య మచరము లైన
దేవు నెఱుఁగు గుప్తంపు రీతిని ననంగ
నా మనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె 40
[మని = దేవుడు, ఎప్పుడు ఉండువాఁడు , మనమందుండువాఁడు]
ఆ కర టీంద్రుఁ డార్తుఁ డయి యచ్యుతు వేడిన యట్టి భంగినిం
బ్రాకట రీతిఁ జూచి గుఱి రౌద్ర నిషాదుఁ డొకండు పక్కిపై
భీకర బాణ మేయగను భీతిలి దైవము నంతఁ జీరుచుం
గోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్ 39
దేవ గంధర్వ యక్ష రాత్రిచర సిద్ధ
కింపురుష జాతి జీవియ కీర్తి సేయ
నబ్బురం బౌను గద విని నంత నెట్టి
చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె? 38
ధామ పిపీలికా సముఁడు ధర్షిత సైంధవుఁ డుగ్ర రోషుఁ డా
శ్యామ గళప్రసాదుఁ డని నడ్డుపడన్ వడి ధర్మజుండు త
ద్భీమ వరాశ్వనీ సుతులు దిక్కరి తుల్యులు నోడి నిల్చిరే!
చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే 37
ధర్మ భూమి యనఁగఁ దనరె ముజ్జగముల
భరత ఖండము మును సురలు మెచ్చ
నిస్పృ హాతి సుప్తి నిష్క్రియా క్లీబ దౌ
ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి 36
యోగ్య నియోగ సంచయ సమున్నతి భాసిల దేశ మందు నా
రోగ్యము దేహసత్త్వము నరోష సఖిత్వము లెల్లఁ బెర్గ వై
రాగ్యము వీడి సంతతము రంజిలఁ బౌరులు కృష్ణవర్ణ సౌ
భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్ 35
వెత లందుఁ దాఁ జలించక
పతితపు సంకటము లందుఁ బంతము తోడన్
ధృత ధైర్యమునఁ, గలసి తన
పతితోఁ, బోరాడిన సతి వంద్య యగుఁ గదా 34
ధృతి చిత్తమ్మున వృద్ధి సెందుచును సంధిల్లంగ సంసార దు
ర్గతులం దెన్నఁడు నీరసించకను సంకల్పించి నిత్యం బభి
ష్టుత నారీమణియై ప్రమాదముల విడ్డూరమ్ముగన్, వీడి తాఁ
బతితోఁ గ్రూరతఁ, బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే 33
కలిగి మిగుల సద్యస్స్ఫూర్తి సులభ రీతి
వివిధ సునిశిత భావార్థ విలసిత పద
తతి నియోగ రతుఁ డయి సతత మపగత
విషగళుండైన నవధాని వినుతి కెక్కు 30
[విషగళుఁడు = దుర్భాషలాడు వాఁడు]
తృషఁ గొని పద్య గద్యములు తెల్లపు రీతిని భావ శబ్ద క
ల్మషములు లేని భంగి బుధ మాన్య విధమ్ముగఁ జెప్ప నేర్వ మా
నుష గురు యత్న భాసిత ఘనుండయి తృప్త కృతార్చనా బృహ
ద్విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై 29
[విషగళుఁడు = శివుఁడు]
ద్రోహమునకుం దగిన ఫలి
తాహార్య మనఁగ సుకన్య కాఖ్య విడి మనో
మోహము చ్యవనుని జర్జర
దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్ 28
ఆహవ దోహ లోద్ధత విహార విలాసిత చండ దైత్య సం
దోహ వినాశకుండు ఘన దోర్బల దివ్య ధనుర్ధరుండు వి
ద్రోహ జనాంత కార్య జన దుఃఖ వినాశక రాఘవుండు వై
దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్ 27
అవనీ జనులకు నీయఁగ
నవసర విశ్రాంతిని ముదమారఁగ నా వా
రువములఁ గ్రుంకె నపర దిశ
రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్ 26
[ఉత్తరమున = పిదప]
శివ దత్తాంచిత శక్తి మీఱఁగను నిశ్చింతం బ్రలాపించి తా
బవరంబందునఁ బాండవోత్తముల నాపం జాలి యల్పుండు సైం
ధవుఁ డుగ్రుండు జయద్రథుం డెద్రిచి సంతాపం బొసంగెం గడున్
రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై 25
వ కార నిషిద్ధము:
అంతరాయమ్ముల నన్నింటి మరల మరల నాపు నిన్నేను గొలిచి కొలిచి
యాద్యంతములు లేని హృద్యంపు నీరూపు లలర నలర మదిఁ దలఁచి తలఁచి
యాగ మోక్తములైన యద్భుతాఖ్యలఁ దనియ తనియ నేరక యఱచి యఱచి
తొండ మేక రదము తోరపు బొజ్జయు చోద్యము చోద్యము సూచి చూచి
మూషిక రథముఁ గని కని మురిసి మురిసి
కుడుము లమర నమరఁ గాంచి కులికి కులికి
దినము దిన మేను నుతియింతుఁ దేఱ తేఱ
బొజ్జ గణపయ్య రక్షించు మూరి మూరి 24
కలవరపా టది యేలనొ
గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునం
బలికితి విట్లు నిజ మరయ
గెలిచెను సోమకు ఝష మయి కేశవుఁ డన్నా 23
వడి వేదంబులు దొంగిలించి చన శ్రీవత్సుండు వీక్షించి తాఁ
గడు వేగంబున దూఱి సంద్రమునఁ జక్కంబట్టి మత్స్యంబునై
యడఁచెన్ సోమక నామ దైత్యుని, వరాహస్వామియై, శూలియే
యడరం జెంతను, వేంకటాద్రి వెలసెన్ హ్లాదంబునన్ ధాత్రినిన్ 22
అల తాళద్రుమ వనమున
ఫలములఁ దిన నీయ డతఁడు ప్రజలను దినుచున్
ఖల ఖర దైత్యుండు బలుఁడె
బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే 21
కల లందైనను బాహు నిర్జిత మహాకాళింది యేకైక కుం
డలుఁ డుగ్రుండును ముష్టికాంతకుఁడు గాఢస్కంధు పాటిన్ రసా
తలమం దెచ్చట నైన రోసినను దైత్యశ్రేణు లందెల్ల, నీ
బలరాముం దలమీఱు, పాపి గలఁడే భావింపఁగా మేదినిన్ 20
[తలమీఱు = అతిక్రమించు]
విష్ణు వయ్యెను రాముఁడు కృష్ణుఁ డుండె
ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె
కృతయుగమ్మున బ్రహ్మకుఁ గీడుసేయ
నామముల కేమి కొఱఁత భూనాథునకును 19
ఏపునఁ జంపె విష్ణు వసురేంద్రుని మత్స్యపు రూప మంది వే
దాపహరున్ జలమ్మున వదాన్యుఁడు వ్యాస మునీంద్ర భవ్య సం
ప్రాపిత కావ్య మందునను బన్నుగ వింటిమి యా యుగంపు ద్వం
ద్వాపర మందు, సోమక వధం బొనరించెను రాముఁ డుద్ధతిన్ 18
[ద్వంద్వ + అపరమందు = ద్వంద్వాపరమందు]
రామున కనుజుండు రమణి సీతాసతీ
సోదరిని విబుధ జనాదరణను
దరుణి జనక రాజ తనయ నూర్మిళ నక
లంక నేలినాఁడు లక్ష్మణుండు 17
మంకుతనమ్ము మీర నవమానిత రీతినిఁ బంప నన్నయే
తంకము సెంది చేరఁగను ధర్మవిదుండు విభీషణుండు ని
శ్శంకను రావ ణానుజుఁడు,సత్య పరాక్రమ రాముఁ డీయగన్
లంకను బోరులో గెలిచి, లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్! 16
[లక్ష్మణుఁడు = శ్రీమంతుఁడు]
మేలగు నీ కిఁకఁ జని తేఁ
జాలిన మఱి నీదు భర్త సతము మధు మహా
శాలను బ్రీతి వదరుఁబో
తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్ 15
[ వదరుఁబోతు + ఏలును = వదరుఁబో తేలును]
పాలను నీటి నింపుగను వారక వేరొనరించ నేరు నీ
జాలపదంపుఁ దెల్లని ఖజాకము కానము దాని నెందు నే
గాలము వేసి చూచినను గాంచుమ యా కలహంస నీటి లోఁ
దేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ 14
[తేలు = నీళ్లలో క్రీడించు]
దేవ కార్యము సాధింప దేవ దేవుఁ
డమిత కారుణ్య మూర్తి విషాంతకుండు
ఫాలనేత్రుఁ డర్థి హిమవత్పర్వత వర
పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను 13
చిత్రము చంపి మన్మథునిఁ జిత్తము నందు నుమా తపో రత
స్తోత్రము మెచ్చి బాపి ఘనశోకము తారక దైత్య జైత్ర స
త్పాత్రుని కార్తికేయు శిఖివాహనునిన్ హిమశైల మేనకా
పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్ 12
మన విఘ్నేశ్వరునకు వా
హన రాజ మగుట ముదావహ మని తలఁచి తాఁ
గనువిందుగ సురగణ పా
వన రాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్ 7
కనఁగన్ వింతగు బొజ్జదేవరకు గంగా పార్వతీ నందనుం
డన విఖ్యాతుఁడు నేక దంష్ట్రుఁడు గణాధ్యక్షుండు శూరుండు హ
స్త్యనవద్యాస్యుఁడు విఘ్నరాజున కనింద్యాఖ్యుండు నా దేవతా
వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్ 6
[వనము = సమూహము]
పూతన జీవాపహర! సు
చేతన భూసుర శివజ్ఞ చేతస్స్థిత! సం
పాత భవ ముక్తి దాయక!
పాతక హర! నిర్జితబక! పాలింపుమయా! 5
[శివజ్ఞ = వేదములు తెలిసిన వారు]
ఈ కొలఁది కడుపున కిదియ
మా కిఁకఁ జాలని తనిసిన మానసు లగుచున్
వీఁకను బాయసము, పితికి
మేఁకను, సాధువులు వండి మేలని తినిరే 4
చేకొని సాధు సజ్జనులఁ జిత్తము నుంచి పదాంబుజంబులన్
గైకొని వారి దీవనలు కమ్మగ నుండినఁ జాల మేలగున్
మాకది యొప్పు వంటలను మాగృహ మందున, నెన్నడేని రా
మేకను, వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే 3
[రాము + ఏకను =రామేకను; ఏకు = తిట్టు]
మగ్నుండై పని యందు న
భగ్నపు రీతి నిరతమ్ముఁ బన్నుగఁ దా ప్ర
త్యఙ్నగము సేరి కదలుచుఁ
బ్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్ 2
రుఙ్నయ నారవింద సఖ రోష విలుప్త ముఖుండు నా పయో
ముఙ్నిచయచ్యుతానన విముక్త నిదాఘ సువిగ్రహుండు ఋ
త్విఙ్నర నిత్యపూజితుఁడు వేగఁ జలించి రయోద్ధృతిన్ మహా
ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో 1

అవని విష్ణువే మఱి పుట్టె నంచెఱుఁగక
రాముఁడే దైవమని, చెప్పె రావణుండు
మానవుం డీతఁ డేల సంశయ మని మది
దలఁచె విఱ్ఱవీగి నశించె దాని వలన 32
భీమపు బాహుమూలమున భీతిలి చిక్కి కృపార్థియై దశా
స్యామరనాథ ఘోర రిపు వంత వినమ్రత దోఁచు చుండ స
ర్వామర పూజనీయుఁడు స్వయంభువుఁ డుద్భవ దత్త జానకీ
రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా 31
వివిధ సునిశిత భావార్థ విలసిత పద
తతి నియోగ రతుఁ డయి సతత మపగత
విషగళుండైన నవధాని వినుతి కెక్కు 30
[విషగళుఁడు = దుర్భాషలాడు వాఁడు]
తృషఁ గొని పద్య గద్యములు తెల్లపు రీతిని భావ శబ్ద క
ల్మషములు లేని భంగి బుధ మాన్య విధమ్ముగఁ జెప్ప నేర్వ మా
నుష గురు యత్న భాసిత ఘనుండయి తృప్త కృతార్చనా బృహ
ద్విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై 29
[విషగళుఁడు = శివుఁడు]
తాహార్య మనఁగ సుకన్య కాఖ్య విడి మనో
మోహము చ్యవనుని జర్జర
దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్ 28
ఆహవ దోహ లోద్ధత విహార విలాసిత చండ దైత్య సం
దోహ వినాశకుండు ఘన దోర్బల దివ్య ధనుర్ధరుండు వి
ద్రోహ జనాంత కార్య జన దుఃఖ వినాశక రాఘవుండు వై
దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్ 27
నవసర విశ్రాంతిని ముదమారఁగ నా వా
రువములఁ గ్రుంకె నపర దిశ
రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్ 26
[ఉత్తరమున = పిదప]
శివ దత్తాంచిత శక్తి మీఱఁగను నిశ్చింతం బ్రలాపించి తా
బవరంబందునఁ బాండవోత్తముల నాపం జాలి యల్పుండు సైం
ధవుఁ డుగ్రుండు జయద్రథుం డెద్రిచి సంతాపం బొసంగెం గడున్
రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై 25
వ కార నిషిద్ధము:
అంతరాయమ్ముల నన్నింటి మరల మరల నాపు నిన్నేను గొలిచి కొలిచి
యాద్యంతములు లేని హృద్యంపు నీరూపు లలర నలర మదిఁ దలఁచి తలఁచి
యాగ మోక్తములైన యద్భుతాఖ్యలఁ దనియ తనియ నేరక యఱచి యఱచి
తొండ మేక రదము తోరపు బొజ్జయు చోద్యము చోద్యము సూచి చూచి
మూషిక రథముఁ గని కని మురిసి మురిసి
కుడుము లమర నమరఁ గాంచి కులికి కులికి
దినము దిన మేను నుతియింతుఁ దేఱ తేఱ
బొజ్జ గణపయ్య రక్షించు మూరి మూరి 24
గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునం
బలికితి విట్లు నిజ మరయ
గెలిచెను సోమకు ఝష మయి కేశవుఁ డన్నా 23
వడి వేదంబులు దొంగిలించి చన శ్రీవత్సుండు వీక్షించి తాఁ
గడు వేగంబున దూఱి సంద్రమునఁ జక్కంబట్టి మత్స్యంబునై
యడఁచెన్ సోమక నామ దైత్యుని, వరాహస్వామియై, శూలియే
యడరం జెంతను, వేంకటాద్రి వెలసెన్ హ్లాదంబునన్ ధాత్రినిన్ 22
ఫలములఁ దిన నీయ డతఁడు ప్రజలను దినుచున్
ఖల ఖర దైత్యుండు బలుఁడె
బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే 21
కల లందైనను బాహు నిర్జిత మహాకాళింది యేకైక కుం
డలుఁ డుగ్రుండును ముష్టికాంతకుఁడు గాఢస్కంధు పాటిన్ రసా
తలమం దెచ్చట నైన రోసినను దైత్యశ్రేణు లందెల్ల, నీ
బలరాముం దలమీఱు, పాపి గలఁడే భావింపఁగా మేదినిన్ 20
[తలమీఱు = అతిక్రమించు]
విష్ణు వయ్యెను రాముఁడు కృష్ణుఁ డుండె
ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె
కృతయుగమ్మున బ్రహ్మకుఁ గీడుసేయ
నామముల కేమి కొఱఁత భూనాథునకును 19
ఏపునఁ జంపె విష్ణు వసురేంద్రుని మత్స్యపు రూప మంది వే
దాపహరున్ జలమ్మున వదాన్యుఁడు వ్యాస మునీంద్ర భవ్య సం
ప్రాపిత కావ్య మందునను బన్నుగ వింటిమి యా యుగంపు ద్వం
ద్వాపర మందు, సోమక వధం బొనరించెను రాముఁ డుద్ధతిన్ 18
[ద్వంద్వ + అపరమందు = ద్వంద్వాపరమందు]
సోదరిని విబుధ జనాదరణను
దరుణి జనక రాజ తనయ నూర్మిళ నక
లంక నేలినాఁడు లక్ష్మణుండు 17
మంకుతనమ్ము మీర నవమానిత రీతినిఁ బంప నన్నయే
తంకము సెంది చేరఁగను ధర్మవిదుండు విభీషణుండు ని
శ్శంకను రావ ణానుజుఁడు,సత్య పరాక్రమ రాముఁ డీయగన్
లంకను బోరులో గెలిచి, లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్! 16
[లక్ష్మణుఁడు = శ్రీమంతుఁడు]
జాలిన మఱి నీదు భర్త సతము మధు మహా
శాలను బ్రీతి వదరుఁబో
తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్ 15
[ వదరుఁబోతు + ఏలును = వదరుఁబో తేలును]
పాలను నీటి నింపుగను వారక వేరొనరించ నేరు నీ
జాలపదంపుఁ దెల్లని ఖజాకము కానము దాని నెందు నే
గాలము వేసి చూచినను గాంచుమ యా కలహంస నీటి లోఁ
దేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ 14
[తేలు = నీళ్లలో క్రీడించు]
డమిత కారుణ్య మూర్తి విషాంతకుండు
ఫాలనేత్రుఁ డర్థి హిమవత్పర్వత వర
పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను 13
చిత్రము చంపి మన్మథునిఁ జిత్తము నందు నుమా తపో రత
స్తోత్రము మెచ్చి బాపి ఘనశోకము తారక దైత్య జైత్ర స
త్పాత్రుని కార్తికేయు శిఖివాహనునిన్ హిమశైల మేనకా
పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్ 12
మెల్లగ యతి వేష మలర
నల్లనఁ గుంతీ తనయుఁడు నర్జునుఁ డంతం
జల్లంగ వాసుదేవుని
చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్ 11
ప్రల్లదు రాజుఁ జేయ జనవారపు సమ్మతిఁ బొంద నేర్తునే
తల్లడ మేల పుత్రకుఁ డితండు విభుం డని చెప్పె రాజు దాఁ
గల్లరి కంత పట్ట మది కట్టక యొక్క దినంబు మాత్ర మం
చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే 10
[అంచు + ఎల్లికి = అంచెల్లికి; ఎల్లికి = రేపటికి]
గుణగణము వెలుఁగ నకుంఠితము నెలమి
రుచిర విద్యలను సముచిత రీతిఁ
దేటపడఁ గఱపుచుఁ దీర్చి దిద్దఁగ శిష్య
వరుల గురువు లెల్ల సురలు సుమ్మి 9
ఉరుతర శిక్షణాక్రియ గురూత్తమ పాణి తలామృతాభగన్
గురుతర బాధ్యతావలిని గోముగఁ జిత్తము నందుఁ దల్చుచున్
స్థిరముగ శిష్యకోటికిని దేశ సకాల సుయుక్త విద్యలం
గరమను రక్తి నేర్పు గురు కాయముఁ గొల్చెద దేవ తుల్యమున్ 8
[అమృత = ఉసిరిక]