పాడిగ సంకీర్తనములు
పాడిరి సద్భక్తి మీఱ వార్చిరి సంధ్యన్
వేడి శివుని వని క్షుత్తన
కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్ 64
[క్షుత్తునకు + ఓడి = క్షుత్తున కోడి; ఓడి = నీవార ధాన్యము]
గూడెము నందు వింతలను గోరి లిఖింపఁగ నెంచి లేఖకుల్
పాడుచు నేఁగి వేగముగఁ బల్లెకుఁ గాంచఁగ గ్రామవాసులం
బాడిగ వాఁడి వార్తలను వా రిడఁ గైకొని, వండి యీయ నా
కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి, భుజించిరి గాదె శ్రోత్రియుల్ 63
[శ్రోత్రియుఁడు = వార్తలు సేకరించు వాఁడు; శ్రుతి = సుద్ది]
ఇష్టా గోష్ఠుల జన సం
క్లిష్ట వికారము లెఱింగి లీలా లీలం
గష్ట మనక చేయ నడచి,
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద, పురువుల మందుల్ 62
[పురువుల (న్) = పురువులను; అడచి పురువులను మందుల్
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద]
ఇష్టము సేయ మిక్కిలి మహీజన కోటికి నుద్యమించి యే
కష్టము దేహ మందునను గానఁగ రాదట వేదశాస్త్ర భూ
ద్రష్ట లొసంగి రంట యుదరస్థిత కీటక నాశకారు లీ,
పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట, పుర్వుల మందుల మ్రింగ మే లగున్ 61
వదనారవింద యే నద
నదీ తటాక భరిత ఘన నగరమ్మున నే
సదనమ్మున నిమ్ముగ నె
మ్ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్ 60
ముదిత సుభద్ర సోమ సమ మోహన రూపుఁడు సవ్యసాచినిం
బదిలపు వీర భావమునఁ బౌరవ రాజస తేజ మేర్పడం
గదలెడు భావి కాల విధి కల్పిత శాప విముక్త భాను మ
న్ముదిత నపుంసకుం గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్ 59
అందము లొల్కు పథమ్ములు
విం దొనరించుఁ గనులకు నవియ దేశము నం
దెందును జూడఁగ మెలఁగుదు
రంద ఱొకని లోన నొక్కఁ డందఱి లోనన్ 58
విందుల యందు మందులును బెం దమకమ్మునఁ జిందు లేయరే
డెందమునం దమంద రహి డిందును బొందియు సందడించుచుం
గుందక యిందు నెందునను గుంద మరంద సనంద పాన మీ
యందఱి లోన నొక్కఁ డగు నందఱు నొక్కని లో వసింతురే 57
ఖండిత నాసికా కర్ణ శూర్పణఖ మనోగతము:
వర రఘువీర సుదారిత
గురు నాసా కర్ణ దుష్ట గుణ శూర్పణఖా
దురవస్థ విమోచన మీ
ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్ 56
గరళగ్రీవ భుజంగ భూషణ లసత్కైలాస హైమప్రభా
భరితక్ష్మాధర సన్నివాస గిరిజాప్రాణేశ దుర్వార దు
ష్పురదైత్యత్రయ ఖండనాత్త సుయశఃపూర్ణుండు బాలేందు శే
ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్ 55
ఊయలల నూఁగఁగఁ దమిని నువిద లెల్ల
లేచి యుదయమ్ము దిని యట్లు లేనగవులఁ
బాటవముగఁ బాడి యలర నేటి నుండి
యష్టమికి జరుపగ నొప్పు నట్ల తదియ 54
ఇష్టము తోఁ గురంటకము నేపుగ నద్ది తలమ్ము లందునన్
మృష్టపు భోజనమ్ము దిన మిక్కిలి యింపగు నట్లతోమనో
యష్టిగ నాడి యాశ్వయుజమం దప రార్ధము పంచ వాస రో
నాష్టమి నాఁడె యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్ 53
[పంచ + వాసర + ఊన + అష్టమి : ఐదు రోజులు తక్కువగా నష్టమి]
ఊనిన భక్తి సతమ్మును
మానిత సు మనోర థౌఘ మయ చిత్తుండన్
నే నుడ్డకేలు వేలుపు
సానిం గొల్చెద నమేయ సౌఖ్యము లందన్ 52
[ఉడ్డకేలు వేలుపు సాని = విష్ణువు భార్య, లక్ష్మీ దేవి]
నానా భూత గణాధి పత్య విల సన్మాన్యా సు కైలాస వా
సా నాగేంద్ర వరావతంస నుత మూర్ధాలంకృ తేందు ప్రభా
మౌనీం ద్రామర సిద్ధ యక్షవర రంభా భవ్య సేవా ప్రభా
సా నిం గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్ 51
అన్నన్న యెంత మాటిది
మిన్నంటెను మిన్నగఁ బుడమిం గ్రన్నన ద
న్నెన్నఁ దరమె యెన్నండును
జిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో 50
కన్నుల రాల నిప్పులు వికారమునన్ జను లిట్లు పల్కిరే
క్రన్నన వ్రాసి తే నడరి కావ్యము గొప్ప దటంచుఁ జెప్పుఁ దాఁ
బన్నుగఁ జేరి నిత్యమును బండిత మానియ యక్క టక్క టం
చిన్నయ సూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గు బాసయే 49
[అంచు + ఈ+నయ సూరి; నయ సూరి = అందమైన పండితుడు!!! నిందార్థమున]
పురాంతరమున బహు కాల క్షుద్బాధతో నలమటించు చున్న
మిత్రు లొకచో వివాహము జరుగు చుండఁ గని తమలో
ముచ్చటించు కొను సందర్భము:
తుల్యము క్షుధ నరకమునకు
శల్య మగుట నిక్క మౌను జావక మున్నే
కళ్యాణోత్సవమునఁ దిన
శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ 48
కాశీనాథ దయా నిమిత్త జన రక్షా దక్ష దేవేంద్ర సం
కాశ క్ష్మావిభు సంచయాన్వితమ యిక్ష్వాక్వన్యయం బౌను స
ర్వాశాభగ్నము కాటకమ్మునను దేశావాస బాధాఘ్న మై
వైశాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ ప్రజాకోటికిన్ 47
[వైశాలి = విశాల దేశ రాజ పుత్రిక (విశాలుని కూతురు);
వైశాలి + ఓదనము = వైశాల్యోదనము; ఓదనము = అన్నము]
వర్తనమ్ము గాంచఁ బాప యుక్తమ పల్కు
లెల్లను బరుషములు తల్లడిల్లఁ
జేరఁ గల్మషమ్ము చిత్తమున మెయి న
స్నాన జపము లేల జంద్య మేల 46
[అస్నానము = స్నానము లేమి]
వీనుల్ విందుగఁ గూయు నా విహగముల్ విన్నేగి యేపారగం
గానన్ వేడుక మీఱ జంతువులు చక్కం దిర్గు చుండంగ నీ
మీనంబుల్ సత ముండ సంతసముగన్ మీనాకరం బందునన్
స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా 45
[ జంద్యంబును + ఆకు = జంద్యంబు నాకు; ఆకు = విస్తరి]
పగలు సనఁగ తెగువ మిగిలి
తగులమ్మునఁ బేక గములఁ దగిలి వెగటుగం
దెగ వాఁగు వాఁడు మగఁడే
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే 44
[నిల్పు = నిల్పుము]
ఒకఁడు తన మిత్రునితో నన్న మాటలు:
తగునే నీ కిట భార్యనుం దెగడ మిత్రా యల్కతో నవ్వ దా
వగలం జూపుచు నెత్తి మొట్టుచు సురాపానంబు మాన్పింపగన్
నగ రాజాత్మజ సేవన ప్రభల నే నారీ లలామంబు ప్రే
మగ నిన్ వాకిట నిల్పు నట్టి మగువా మా జోతలం బొందుమా 43
నవ మన్మథుఁ డగు పతి సం
భవమై తనరంగ నత్త వారింటను నూ
త్న వధూ వరులకు నింపుగ
నవ రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్ 42
[నవము = కొత్త]
శివ లంకా పుర వాస భామిను లిటుల్ సెప్పంగ నే విన్నవే
యివి సద్వాక్కులు సత్యసంధ వన మత్తేభేంద్ర ఘీంకార వా
గవనీ నాథుఁడు రామచంద్రుఁడు పురంబందుండ గర్వాంధ దా
నవ రాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్ 41
మిత్రుఁ డనియె నిట్లు మేటి చరిత భార
తమున నరుని రాథ తనయుఁడు పెను
చలము వూని మదినిఁ, జక్క నతఁడు కథ
లల్లుఁ, జంపఁ దలఁచె నాహవమున 40
కొల్లలు గాథ లివ్వసుధ గోత్ర వినాశన పూరితంబులై
కల్లన రాదు క్రూరమిల క్షత్రియ వంశపు ధర్మ మెంచగం
దల్లడ మంద లోకములు ధర్మ తనూభవు శల్యుఁ డవ్వ మే
నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ క్రుద్ధుఁడై 39
దశముఖ ప్రహరం బయ్యె దశమి దినము
శరముల జయించె నరుఁడు దశమి దినమ్ము
హరసతి సమయించె మహిషాసురు దశమిని
రహి నొసంగు జనులకు దశహర నేఁడు 38
దశకంఠక్షయ కార్య కారణమునం దన్నామ మే కల్గగన్
విశదంబే దశహారి నాఁగ దిశలన్విఖ్యాతియే ధాత్రినం
ద శమీ పల్లవ దాన నిష్కలహ విస్తారక్రియా సంతతిం
బశుపత్యర్ధ శరీరినిం బ్రజలకున్ మందారఁ బ్రార్థింపరే 37
ఈశ - హర - శివ – భవ
వర లక్ష్మీశ జలజ భవ
హర త్రయీ రూప దుర్గ యమ్మల కమవై
పరఁగు శివ వమ్మ నీ విల
నురుతర భక్తిం గొలిచెద ముత్సవ వేళన్ 36
మనఁ గలమె మన మిటఁ దెల్పుమ యిది గాక
యొండు నగర ముండదె జను లుండ గలరె
యచట దుర్గంధ పూరిత మౌర పుత్ర
కా! పురము కంటె కన నరకమ్ము గలదె 35
[కంటె = చూచితివా?]
వే పయనించ నింపయిన వీధులు సత్పథ రాజ పర్వముల్
ప్రా పిడ బంధు వర్గమును వైద్యుని సన్నిహితమ్ము నెమ్మినిం
దీపి జలంపు నూతులును దేవ నిభ ద్విజు లుండ కున్నచోఁ
గాపురముం గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్ 34
[కాపురము = చెడ్డ పట్టణము]
నలిన జాత్మజులు ముని వరులు మహేశు
ముదమునఁ గొలువఁ గైలాసమున కరుగ స
నక సనంద నాదు, లటఁ దనరి హసించఁ
బ్రమథు, లూర్ధ్వపుండ్రములతో వఱలినారు 33
[వఱలు = ప్రకాశించు]
ప్రమదము చిత్తమం దలర వైష్ణవు లధ్వర కార్య దక్షులున్
శమ దమ భక్తి భావ రత శాంత గుణవ్రజ దీప్త కాయు లా
విమల చరిత్రు లుత్తములు విప్ర వరేణ్యులు పంచ జీవ కం
ప్ర మథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వ పుండ్రముల్ 32
[మథి = వాయువు (చలించునది)]
గత్యంతర కృత కల్మష
కృత్య వినాశ మొనరించు గీర్వాణుండే
సత్యము దలంప నచ్చట
మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్ 31
[మృత్యువు = యమధర్మరాజు]
సత్య పథోన్నతస్థిత విషాద విహీన వికుంఠ లోక స
చ్ఛైత్య సమాశ్రయప్రదము చక్రి నిరంతర దివ్య కామ్య సాం
గత్య విరాజమాన సుర కాయ నిరీక్షిత ధామ మందగన్
మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్ 30
సతతము నవ్య కుసుమములఁ
బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలం
గత మేమైనను మఱి యె
ట్టి తరుణమునను దలఁచకుమ డెందము నందున్ 29
నుతులఁ దరించి యలసి సొల
సి తరుణు లుద్వాసన లిఁకఁ జెప్ప నెలమి పూ
జిత విగ్రహములు జలమున
బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్ 28
తోడుగ రాఁగఁ బత్తనపుఁ దొయ్యళు లెల్లరు బేర్మి నాడుచుం
బాడుచు నంతరంగములఁ బ్రబ్బఁగఁ దోరపు భక్తి రక్తినిం
గూడి విభిన్న వర్ణ కుల కోమల పుష్పము లెల్ల, వీడ నా
వాడిన పూవులే, తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్ 27
కాళికా దేవ్యభయ సుప్రకాశ మహిమ
భూసురాన్వయ సద్గుణ భూషణుండు
కాళిదాస సన్నాముఁ డొకండు మున్ను
జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను 26
ఒకానొక పుత్ర చతుష్క సద్బ్రాహ్మణుని ప్రస్తావించు సందర్భము:
మానధనుండు విప్ర కుల మాన్యుఁడు సద్గుణ పంచ దేహ జే
కోనుఁడు గౌరవాన్వయ సముద్భవ సచ్చరితుండు సజ్జ నా
ధీన విశారదుండు నిజదేశ బలారి సమాన రా డవ
జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్ 25
[అవజ్ఞానము = తిరస్కారము]
కాల మహిమ నగ్ని యలుఁగ
జ్వాలిగ నంగిరసుఁ డయ్యె భారము మోయన్
మే లొనగూడుఁ దమి సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్ 24
[సినీవాలి = అంగిరస మునీంద్రుని కూతురు]
కాల సమాన తారక విఘాతక జన్మ నిమిత్త మిత్తరిన్
శూలినిఁ గామపాశమున సోలఁగఁ జేయుము మీనకేతనా
కాలగళుండు వీరవరుఁ గ్రౌంచనిషూదను గాంచు నీ సినీ
వాలిని భార్యగాఁ గొనిన, స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్ 23
[సినీవాలి = పార్వతీ దేవి]
ధరణీ నర గణ జన్మాం
తర కృత దుష్ట హృదయ జనిత ఘన కలుష సం
హరణము కైలాసం బను
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే 22
[ తిరుమల = పవిత్రమైన కొండ]
వర కిటియై హిరణ్యదృ గపార భయంకర దైత్యుఁ జంపి శ్రీ
ధరణి సతీ సమేతము త్రిధాముఁడు వేంకట నాథు డింపుగన్
హర సుర పద్మ సంభవుల కప్పుడు సేసిన బాస తప్ప కా
తిరుమల లోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్ 21
[శశిమౌళి ప్రీతి = శశిమౌళికి ప్రీతి]
హరి నామస్మరణ మొసఁగుఁ
బరమ పదమ్ము తరువంచు వత్సర మంచున్
గిరియంచును గావలదు ము
ఖర మాజీవనమునన్ సుఖంబుల నిడుమా! 20
[ముఖరము = అసంబద్ధవచనము లాడునది;
ఆజీవనమునన్ = బ్రతుకు నంత వఱకు; ఇడుమా = విడువుమా]
సురగణ పూజిత! భక్తవ
ర రక్షక! రమావినోద! రక్షిత కరి రా
డరవిందాక్ష! జితమనః
ఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా 19
వరుసన్ వచ్చెడు వత్సరమ్ములఁ దలంపన్ భీతి మా కయ్యెడిం
గరుణాయత్త మనోవిలాసమున రక్షాదక్ష వత్సమ్మ! మ
మ్మరయన్ రా ఖర! కావుమా! వికృతి నామాబ్దార్తి సంహర్తృ శే
ఖరమా! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా 18
తగులము దఱుమఁగ మరణము
ఖగపతి కిడె రావణుండు గాండీవమ్ముం
దగఁ దీర్చఁగఁ దన కోరిక
ను గిరీటి కొసఁగె ననలుఁడు నుతియించి తమిన్ 17
పగలును రేయినిం జెలఁగి ప్రాణి విరావణుఁ డయ్యె నగ్ని మిం
టఁ గదియ దిక్కులం జిటపట వ్రజ రావము లెల్ల నింపగం
బగతుర భారతాంకమునఁ బాటవ మొప్పఁగ, సవ్యసాచి యా
ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్, నృపకోటిఁ జంపఁగన్ 16
[ఖగపతి = బాణములకు యజమాని]
వింత నవత రించెఁ బుడమి విష్ణు వెంచి
దుష్ట శిక్షణ రక్షింప శిష్ట జనులఁ
బేర్మి తల్లులు, దశరథు ప్రీతి తమపు
భార్యలు మువురు, శ్రీరామభద్రునకును 15
దశరథుని యర్థ సప్త శత భార్యలుతో కూడిన కౌసల్య సుమిత్ర కైకేయులు
ముగ్గురు రాముని మాత లని విశదీకరించు సందర్భము:
భూర్యశ లుత్తమాంగనలు భూభృ దజాత్మజ రమ్య కామితే
ద్ధార్యలు భామినీ వర శతాధిక సంవృత దేవతా సమా
నార్యలు సౌమ్య సద్గుణవ దంబలు, పంక్తిర థాభిధాను స
ద్భార్యలు, మువ్వు రా పరమ పావనుఁడౌ రఘు రామమూర్తికిన్ 14
కలవారినిఁ దోచ మదినిఁ
దలఁచుచు వెదకఁగ ననువులు తటమట గతి వా
క్కుల మోసపుచ్చు పలు పో
కల వాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్ 13
అల వైకుంఠ నివాసుఁడే సుహృదుఁడే యాత్మీయుఁడే యవ్వ దా
యల మోసమ్మున నేకచక్రపురి బిక్షార్థమ్మ, యూహింపగం
దలమే, పాండవ వీరపంచకము సంస్త్యాయమ్ములే తిర్గెనే
కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షం గోరె గ్రామంబునన్! 12
రావణుం డన నామ మరయఁగ నోపఁ
బుష్ప కావరోధన రోష పూరిత హృది
భర్గ భక్తుఁడు దానవ వంశ నిత్య
శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ 11
[శంకరుఁడు = సుఖమును గలుగఁజేయువాఁడు.]
శంక యొకింత లేక నిజ సత్త్వ మదాన్విత ఘోర చిత్తుఁడై
శంకర కింకరుండు విధి సత్కుల జాతుఁడు రావణుండు లం
కాంకిత దానవవ్రజ వరాధిప దైత్యుఁడు సేవ్య హృల్లస
చ్ఛంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్ 10
హనుమంతుఁడు సీతాదేవిని నోదార్చు సందర్భము:
వనరఁ జన దనయ మిచ్చట
మనఁ గలరే పొలసుదిండ్లు మగువా వెఱపిం
చిన నిను నీ పెనిమిటి ధన
ధన వచ్చి తునుము గద పదితలల మొఱకునిన్ 9
ఇష్మ పికాభ గాత్రుఁడు మునీంద్రుఁడు నెమ్మిని హవ్య భుక్ప్రకా
శోష్మ శరీరుఁ డా దశర థోత్తమ సూను తటిల్లతా విభా
శుష్మ ముఖారవిందు రిపు సూదను దైత్య నికాయ హృచ్చల
ద్భీష్ముని భార్య సీత యని వే మన వ్రాసెను భారతమ్మునన్ 8
దోష మనఁగ రాదించుక భాష తెలియ
విశ్రుతమ్మె సుమ్మిద్ధాత్రి భీష్ముని సతి
సీత యనుచు వేమన వ్రాసె నాతత నుత
వాక్య మత్తరి భూతల వాసు లెఱుఁగ 7
[ భీష్ముడు = శివుడు; సీత =గంగా దేవి]
భీముఁ డను వాఁ డొకఁ డలరి
యా మానినిఁ దార యనఁగ నడరెడు దానిన్
వేమన గనన్ వరించఁగ
భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్ 6
రామ కథావృత ప్రవిమల స్తుత కావ్యమునం గవీశ్వరుం
డా ముని శేఖరుండు దమి నంచిత రీతిని నింద్ర దత్త స
ద్దాముఁడు వానరేంద్ర జిత దైత్యగణాధిప వాలి యమ్మహా
భీముని భార్య తార యని వే మన వ్రాసెను భారతమ్మునన్ 5
[భీముని = భయంకరుని; వే = శీఘ్రముగ; మన (న్) = మనుటకు;
భారతమ్మునన్ = భారత దేశములో]
అలజడి లేపఁగ నాంగ్లే
యుల మన మందు మన భూమి నుండెడు వసన
మ్ములు వస్తువులు మఱియు నూ
కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్ 4
కల నందైనఁ దలంప రాదు నర సంఘాతంపుఁ గార్యమ్ములన్
వల దెన్నండు విరోధ భావ మెద భావ్యంబౌను సచ్ఛాంతమే
చల మేలన్ సుజనాభ్ర మందున నహింసా సత్యముల్ మేటి రి
క్కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబుం గనెన్ 3

మాదు వంటకములఁ బోల్చ నీ దినమున
నంగడి కరిగి తెచ్చిన నకట చెప్ప
వేల ధైర్యముగ ననృత మేల వెక్క
సం బలికి, సమం బగునె భక్ష్యములు దినఁగ 2
[వెక్కసంబు + అలికి = వెక్కసం బలికి; అలుకు = భయపడు]
కంబుక మెత్తి చూచినను గన్పడ నేర్చునె పట్టణమ్ములో
నంబ కరంపు వంటకము లద్భుత రీతినిఁ జేయ వీటినిన్
సంబరముల్ సెలంగ సరసమ్ముగఁ జూచెదు గాక పోల్చినం
తం బలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్ 1
[పోల్చినంతన్ + పలి = పోల్చినంతం బలి; పలి = పల్లె]