కాశ్మీర మది యొసంగును
రశ్మి రుచిర భారత నగర సమూహమునం
గాశ్మీర వాసు లుడిగినఁ
గాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్ 58
అశ్మాగారములై చెలంగు రిపు శూరానీక చిత్తమ్ములే
రశ్మిజ్వాలల రోయ నెల్లెడల వీరశ్రేణు లొక్కుమ్మడిన్
వేశ్మవ్రాత పరీత రక్షణ దళావేశోర్భటిన్ క్షీణమై
కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్ 57
అలవడునే యన్యులకు స
కల వేదార్థజ్ఞత భువిఁ గాకుత్స్థనితాం
త లసద్భాషణములుఁ గా
వలయు ననిన రఘువరా! కువలయ దళాక్షా! 56
మోఱ యెత్తి యెలుఁగు లిడ మీఱి యంత
నావులకుఁ బగ్గములఁ జేయ వే వదులుగ
రాటఁ గట్టిన యా మెడ త్రాళ్ళవ పలు
చ నులు లేని యావులు పాలఁ జాల నొసఁగె 55
[నులు = మెలిక]
చెన్నుగ భూతలమ్మునను జీవ నికాయము గీత నాదముల్
కన్నులు మూసి కొంచు వినుఁ గమ్మగఁ బాలిడ మాను నం చనం
బన్నుగ నెంచ నీ వపుడు పాటల నాపి తొలంగ గట్టు నం
చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్ 54
[అంచు +అన్ను; అన్ను = పారవశ్యము; సంగీతపుఁ బారవశ్యములో
పాలు చేపుట మఱచు నన్న భావము ]
ఎల్లెడను జెల్ల చెదరయి మల్లె లెల్ల
నచ్చటఁ బడియుండఁగ నెండ నబల యరసి
కొల్లలుగ నున్న పువ్వులఁ గూర్చమాసి
నల్లఁ గా నున్న మల్లెల నాతి దాల్చె 53
వెల్లువ గాఁగ సౌరభము వింతగ నెల్లెడ వేశ్మ మందు శో
భిల్లుచు మంద మారుతము వీవ మనోహరమై భృశమ్ముగన్
సల్లలితాంగి సేరి సరసమ్ముగ నింపగు దండ నెమ్మి దా
నల్లఁగ, నున్న మల్లెలను, నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్ 52
చలచల కాగుచు నుండఁగఁ
బలు విధ శాక నిచయములు వాఁడివి యౌ కో
లలు వెదురివి యెగురఁగ నా
వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై 51
[వలలుఁడు = వంటవాఁడు; కీచకము = వెదురు; కీచకుఁడు = మూర్తీకృత వెదురు]
లలిత విరాట రాజ్యమును లాలన లీలగఁ జేయు చుండి వీ
రు లల పరాక్రమించిన శిరోదళన మ్మొనరించి ధాత్రినిం
గల నృప సింహ విక్రమ నికాయము నుద్ధతి, దక్క నొక్కనిన్
వలలునిఁ, జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్ 50
వినుమా చెప్పెద నీకిటఁ
బని గట్టు కొని పిలిచి తమి వారెల్లరిచే
తను మఱి నిన్నున్ దుందుడు
కనిపించిరి, కోఁతుల వలెఁ, గవివరు లెల్లన్ 49
(దుందుడుకు + అనిపించిరి)
జననుత పండితప్రవర సంచయ కూటమి సాగుచుండగన్
ఘనముగ నర్థ శబ్దములు కైతల లోఁ దిలకించి పాడిగన్
మననము సేసి భావము విమర్శన సంభృత వాద కోటినిం
గనఁబడి రప్డు, వానరులు గాఁ గవి వర్యులు తత్సభా స్థలిన్ 48
(వాను+అరులు =వానరులు; వాను =నోటిచేత; వా=నోరు; చేతల గాక
మాటల శత్రువులని భావము, అలుక్సమాసము.)
విద్యాధికులకు నడుమ న
నాద్య మ్ముండుఁ గద దుస్స హాసూయ గనన్
విద్యావంతులఁ దెగడెడు
విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్ 47
మద్యము గీ డొనర్చు భువి మానవ జాతికి నక్ష దుష్కళా
విద్యయు నట్టి దయ్య యవివేకులు వాటికి లోఁబడన్ మహా
వద్య వికామ మోహ మద వైర రుషా భర లోభ మత్స రా
విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్ 46
[కనెం బూర్వమని భావము; మహా+అవద్యము: మహా నికృష్టము; మత్సర+అవిద్య]
కల్లయుఁ గపటం బెఱుఁగక
పిల్లది గుండమునఁ బడ గుభిల్లున మంటల్
పెల్లుబికి కాలు చుండగఁ,
జల్లని నీరమున, నొడలు సర్వముఁ గాలెన్ 45
[చల్లని నీరమున = నీళ్ళు చల్ల కుండమిచే]
చెల్లునె నీకు నక్కట విచిత్రపుఁ జిందులు నివ్విధంబుగా
నల్లరి సేయ నిత్తరిని నందఱు బిత్తఱ పోవఁ జల్లఁగం
బెల్లగు వేడి నీటిని గుభిల్లున చల్లని నీటి నక్కటా
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో 44
తాపస స్వరూపమున సతత మసత్య
వాది దోసము గీసము లేదని మఱి
తిరుగు వానికి నహహా మతి విడనాడి
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును! 43
బాసలు సేత లన్నియును బాడిగ నొక్క విధమ్ము నుండగన్
ధీ సహితమ్ము యుక్త మగు దీన జనాళికి దైవ కీర్తనల్
సేసి సమంచితమ్ముగను సేవ, తలంచక చిత్త మందునన్
మోసముఁ, జేయు వారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై 42
ఏ డుండుకుఁ డేని వడిని
మూఁడుట నాచేత నిక్కము సుమీ కనుమా
నేఁడ యసురుఁ డా రుతముల
తోడఁ బొలియు ద్రౌపది యిటఁ దూర్ణము ధృతినిన్ 41
అమ్మా యిపుడు రయమ్ముగ
లెమ్మిఁకఁ జెల్లెలి నలంకరించుమ మఱి సీ
తమ్మా మంచి ముహూర్తము,
రమ్మని తండ్రి పిలిచెఁ, దొలిరాత్రికిఁ, గూఁతున్ 40
నమ్ముమ తార తమ్యములు నా జనకుండు తలంపఁ డమ్మ యో
యమ్మరొ కోప మేల నిట నామెను ముందుగఁ దాత పిల్వగం
గమ్మని పేరు సంధ్య తన కన్నియ యామిని కూతు రిల్లు దూ
రమ్మని పిల్చెఁ దండ్రి తొలి, రాత్రికిఁ గూఁతును బ్రేమ మీఱఁగన్ 39
[తొలి = తొల్లి; రాత్రికిఁ గూతు = యామిని కూతురు]
అసువులు వడి వీడె నచ్చట నక్కట
యొక్క యాడు బల్లి దిక్కు లేక
పిక్క జారఁ గాంచి బేర్మి సఖి మరణం
బకమునుఁ గబళించు బల్లిఁ గనుము 38
[మరణంబు + అకమును = మరణం బకమును; అకము = దుఃఖము]
ప్రకటిత మౌను దైవ కృత రమ్య వినోద సులీల లన్నియున్
సుకరము గాంచఁ బ్రాకృతిక సుందర జంతు నికాయ మంతటిం
జకచక గోడఁ బ్రాఁకుచును జయ్యనఁ గీటక సంచలత్కదం
బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొను మయ్య మిత్రమా 37
[కదంబకము = గుంపు]
సహకార మించు కేనియు,
వహించ కోర్మి, సలుపంగ వలదంచని తా
విహరించఁ గోప మూని య
సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్ 36
అహ రాద్యంతము దుర్భరాశన సమాహారంబు సాగుం గదా
యిహ మందున్ జన సంచయమ్మునకు నిట్లీక్షించగన్ రోషని
ర్దహనప్రాభవ భాసితద్యుతి మనో ధైర్యమ్ము నిండన్, మహా
సహనమ్మే తొలఁగింపఁ, జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్ 35
[మహా +అసహనము = మహాసహనము]
గణ నాతీతమ్ముగ ఘన
రణ విద్యా విక్రమముల రాజువరులు నై
పుణ ముత్తమముగఁ బొందిన,
రణములె కద, పండితులకు రమ్యక్రీడల్ 34
గుణ ఘన నిస్వనమ్ముల నకుంఠిత విక్రమ వీర్య సంపదన్
రణ మొనరింప వీరు లుదరమ్మున వ్యాకర ణార్థ శబ్ద వా
గ్గుణ గణ తర్జ నాదులను ఘోర పరస్పర పాండితీ విచా
రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్ 33
దైవ భక్తు భంగిఁ బరఁగి దారుణములు
ధర్మ మెంచక క్రూర కర్మమ్ము లెల్ల
వార కెన్నఁడు సేయఁ బోవ గల వయ్య
గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు 32
వెలవెలఁ బోవ బంధు సఖ బృందము పత్తన వాసు లందఱిం
బిలుచుచు బిట్టు తిట్టుచును బీడ లొనర్చి చెలంగు చుండ వా
రల వదన చ్యుత ప్రకట రావ తరంగ సుశాప దాయులౌ
గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్ 31
[సురగంగ = మద్యమను గంగ]
అర్కానిల సమ తేజుఁడు
తర్కంబేలఁ జిరజీవ ధన్యుం డరయన్
మార్కండేయుండొ యపర
మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్ 30
సార్కద్యోచర సంచయమ్ములు దివిన్ సంచారముల్ సల్పు సం
పర్కంబై యుడు చక్రవాళముల సంభావ్యంపుఁ బర్యంతమున్
బెర్కే లే దన, నంజనీ సతికి సంప్రీతుండు, తుల్యుండునై
మార్కండేయునకున్, సుతుం డగుచు జన్మంబందె సామీరియే 29
[బెరుకు = భేదము]
పిన్న లకట వీరిఁ బేర్మినిఁ జూడంగ
వలయు సుమ్మి వీడఁ బాడి కాదు
చెందకుమ నిరాశ చెప్పుము, కోపము
వలదు, చదువు బాల బాలికలకు 28
చదలునఁ దిర్గు పక్షులకు శాస్త్రము సెప్పిరె యెవ్వరేని యీ
యుదక వసుంధరా చర మృగోత్కరముల్ వినెనే వచింప కీ
పదుగురు చెప్పు చుంటిరని పశ్చిమ దేశము లందు మర్మపుం
జదువులు, బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు, వద్దురా 27
అందముగ నిల్పి భూమినిఁ
జిందులు వేయుచు మురారి చిత్క్రీడల నం
దందఁ దిరుగు చుండం దొలి
పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్ 26
అందియ లల్ల ఘల్లు మన నందము లొల్కు సతీ మతల్లి తా
నం దిడఁ బంచ భక్ష్య పరమాన్నము లింపుగఁ బళ్ళెరమ్మునన్
స్కంద గురుండు విశ్వపతి కల్మష కంఠుఁడు గానఁ దోలుచుం
బందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై 25
ఓఘద సత్కథ మఱి యవ
దాఘము తీర్పంగ సముచితము నాకు మ హా
మోఘమ్ము కావ్య రత్నము
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్ 24
[ఓఘదము = ఉపదేశము నిచ్చునది, మాఘము = మాఘ
విరచిత కావ్యము]
దాఘము ప్రేమకై వర వితానమునం దొనరంగ నగ్నికిన్
మోఘము కాక యుండగను మూరి ధరించఁగ భార్య సప్త ఋ
ష్యౌఘ సతీ మతల్లు లట శ్యామ యరుంధతి దక్కఁ దోఁచ భీ
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్ 23
[భీమ = అఘము = భీమాఘము: మహాపాపము; మార్గ శిరము = (బ్రతుకు)
మార్గము యొక్క చివర; కార్తికము = షట్కృత్తికలకు (సప్తర్షుల భార్యలు)
సంబంధించినది]
వడి వడి నరుదెంచి బాలకుం డొక్కఁడు
సవ్వ డించుకయును జల్ప కుండ
వేగఁ దెచ్చి యంత బాగుగ దుప్పటిం
గప్పను గని పాము కలఁతఁ జెందె 22
[కప్పను = కప్పఁగా]
ఎప్పుడు వచ్చు చిక్కు లవి యెక్కడ యేరికి నెట్లెఱుంగ గా
నిప్పుడమిం గలట్టి జను లెన్నఁడు నేర్తురు తప్ప శక్యమే
యప్పను దల్చి చిత్తమున నచ్చటి ముంగిస, మ్రింగ వచ్చుచుం
గప్పను, గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై 21
కలి యుగమ్ము లోనఁ గాంతుమె సుఖమును
రేవగళ్ళు వంత లావరించు
నరుగ నర వరేణ్యు లమర లోకమ్ములు
లయమె శాంతిఁ గూర్చు నయముగాను 20
నియమ క్షీణుఁడు రావణుండు వర మౌనివ్రాత విద్రావణుం
డు యథాజాతుఁడు రాక్ష సాన్వయుఁడు దుష్టుండున్ జగత్కంటకుం
డు యశఘ్నుండు కులాంతకుండు దశ కంఠుం బంప ఘో రాంతకా
లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై 19
ఒట్టు వేసి బెట్టిదముగ గట్టు నందు
నక్కటా పెట్టి యెట్టు లనంగ నేర్తు
విట్టి వట్టి సుద్దుల నెప్పు డెందు నెట్టి
తోడఁ బుట్టు వే యన్నకుఁ గీ డొనర్చె ? 18
భరతుని దుఃఖాలాపములు:
మోడయ్యెన్ గద నాదు జీవితము దంభోళిప్రహారంబునన్
వ్రీడన్వీడెను కేకయాధిప కుమారిం జూచితే వెఱ్ఱినిన్
వీడన్నేర్చెను ధర్మ మక్కట మహావీరుండ యో మామ నీ
తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా! 17
వర మిడు పాదుకలను ని
న్నరసెద నన రామచంద్రుఁ డానందమునన్
వర సోదరుండు వేఁడఁగ
భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్ 16
[రాముఁడు = రామ వర్ణము (నలుపు) వాఁడు,ఇచట భరతుఁడు]
నిరతము రాజ్య మేల నవనీ పతి రా వన వాస సిద్ధినిన్
వర రఘు రాముఁ డంతట నవార్యము న్యాస ధరా తలార్ప ణా
బిరతుఁడు మాండవీ ధవుఁడు వీరవరేణ్యుఁడు సత్యసంధుఁ డా
భరతుఁడు భ్రాతృ వత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్ 15
కమనీయమ్ముగ మా యిం
ట మైమఱచి పాటలం దడరి తమిఁ గనుమా
ప్రమద మ్మది మీఱఁ బఱచి
తిమి ర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్ 14
ప్రమిదల తో జనవ్రజము పబ్బము సల్పుచు నుండఁ జేతిఁ దా
కమియును వే మతాబు లవి కాల్చఁ గనుల్ సెదరంగ రోగ దా
యి మహిని నీ వెలుంగును సహింపఁగ లేక తటిల్లతా ద్యుతిం
దిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్ 13
[తిమిరము = నేత్రరోగము]
పరఁగి తిక్కన హరిహర నాథ యంచును
జేసె రచన నపుడు చిత్త మలర
భేద మనఁగ లేక వెల్గుదు రిద్దఱు
నరక హంతకుండు గరళ గళుఁడు 12
నరముని దేవ సంఘముల నైరృతి నాథులు దుష్ట చిత్తులై
యురువుగ నేఁచు చుండగ బలోద్ధతి నీశ్వరుఁ డుత్సహించగన్
నరహరి దైత్యు లా త్రిపుర నాముల శ్రీపతి బాణ రూపుఁడై
నరక నిహంత యయ్యెఁ గద నాగ గళుం డగ జాత మెచ్చగన్ 11
[నరక (న్) =నఱకఁగ); కదన అగ గళుండు: యుద్ధ మను చెట్టు ధూపమును
పీల్చు వాఁడు]
నాతిని నీవును, భావా
తీత పరాశక్తిని హృదుదిత భక్తి మెయిం
జూతురు సతము జగన్ని
ర్మాతలు మువురైన నొక్క మాతఁ, గొలుతువా 10
ఆతత భార తావనిని నైచ్ఛిక బుద్ధినిఁ జిత్తగించి భూ
మాతను గొల్వఁ జాలునె సమంచిత రీతిని నిత్యమున్ క్షమా
తీత వసుంధరల్ భగవతీ కమలా గిరిజా సతీ జగ
న్మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే 9
కల నైనఁ దలంచఁడు పది
తల లున్నట్టి దనుజుండు దర్పంబెసఁగన్
విలసిత సంగర కౌతూ
హలమున రాఘవుఁడు రాక్షసాధిపుఁ జంపెన్ 8
సలలిత సూర్య వంశ విల సత్పురు షోత్తమ రామ నామ హృ
ద్విలసిత దేవ మౌని వర విప్ర గణార్చిత భాసితుండు వి
హ్వల ఖర దూష ణాది పల లాశన మారక బాణమన్ హలా
హలమున రాఘవుండు దను జాధిపుఁ జంపెను సంగరంబునన్ 7
ఆ పగ లంతయు నతి ని
ష్ఠా పరులై యౌపవస్త సన్ముక్తులు నై
యేపుగఁ గార్తికమున దీ
పావళి పండుగను జరుప నగుఁ బున్నమికిన్ 6
[ దీపావళి నాడు జరిపెడు బాణసంచా సంబరము]
పావన భూమి భావితర భవ్య జనావలి వృద్ధిఁ జెంద సం
భావన నీయ సమ్మదము భద్ర సమీరణ భూ నభః కృపీ
టావరణమ్ము లెవ్విధిని వ్యర్థము సెందవొ యట్టి రీతి దీ
పావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్ 5
[దీపావళి నాడు రాబోవు కార్తికపు పున్నమి రాత్రి కూడ.
సమీరణ భూ నభః కృపీ టావరణములు = వాయువు, పృధ్వి,
యాకాశము, నీళ్ళు కూడిన యావరణము. అగ్నిని దీపావళి
బాణసంచు లెవ్వియు నాశనము సేయ లేవు కదా!]
పొగరు తోఁ దిరుగుచున్న కొడుకును జూచి యొక
తండ్రి పలికిన పలుకులు:
బుద్ధి యున్న వారు వోవు గతులు గావు
కుల వినాశ మగు సకల జన భయ
దమ్ముగ బెడిదంపు దౌర్జన్యమును, ముంచి
మంచిఁ, బెంచువారు మందమతులు 4
సంచుల నిండ నింపుటకుఁ జాలును గాంచఁగ గో కలాపముం
బెంచుట కైన నియ్యది భువిం దగునే మఱి దేశ పౌర స
త్సంచయ నంద వర్ధకము శాలి సుసస్యము మాని పూసకా
మంచినిఁ బెంచువార లిల మందమతుల్ గద యెంచి చూడఁగన్ 3
[పూసకామంచి = ఒక రకమైన గడ్డి, కామంచి గడ్డిలో నొక రకము]
ఊర్మ్య సరోవర కలి తా
కర్మ్య తరూద్భవ సునందకము పుష్కర సా
ధర్మ్య విపిన కూల మహా
హర్మ్యంబున నెదిగె వట మహా వృక్ష మహో 2
[విపిన కూల మహా హర్మ్యము = అడవిలోని
పెద్ద దిబ్బ యనెడు హర్మ్యము]
సగర చక్రవర్తి కుమారుఁ డసమంజసుని ప్రవర్తనపు సందర్భము.
పూర్వ జన్మము లో నతడు మహాయోగి. సామాన్యుఁడు కాదు. మహా వృక్ష సముండే.
ఐర్మ్యమ్ముల్ కలుగంగఁ బౌరులకు సూర్యామ్నాయ హీనుండు సా
ధర్మ్యంబై చెలఁగంగ దైత్యులకుఁ దద్రాజ్యమ్ము నందుండి నై
ష్కర్మ్యంబే నిజ ధర్మ సారమని దుష్కార్య వ్రజోన్మత్తుఁడై
హర్మ్యంబందున మఱ్ఱిచె ట్టెదిగె నాహా యూర్ధ్వమూలమ్ముగన్ 1