హేయపుఁ బనులం జేయును
ఛాయా వినుమా కడింది సాధువె యైనం
బాయక యసురు ఘ నాంహ
స్సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్ 62
[అంహస్సు + ఆయి = అంహస్సాయి; పాప మాదాయము గా
గలవాఁడు]
ఈ యతి వర్తనమ్మును సహించఁ డతండని నీ వెఱుంగవే
పాయక వాని నివ్విధినిఁ బంతము తోమఱి కాఱు కూతలం
గూయఁగ వీరభద్రు మదిఁ, గోపము మీఱఁగ నాదరింప కా
సాయిని, నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా 61
అంధ ప్రక్రియ బంధన
సంధా నార్తి శకటారి సద్దయఁ జూపన్
గాంధారీ నాథుఁడు పు
ట్టంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్ 60
అంధక దైత్య హంతక మహా శివుఁ డద్భుత భూత రూపమే
సంధిలఁ జేసి నిల్వ నర సారథి నెంచి సుయోధ నార్త వా
క్కుంథన చోది తోత్సుకుఁడు కుంభజ సూనుఁడు మత్స రోగ్ర రో
షాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్ 59
మండిత భంగ సంచయ సమాహిత సన్నుత శుద్ధ సంత తా
ఖండ జలోద్ధతిం బరఁగు గౌతమి తెచ్చిన యట్టి దిద్ధరా
ఖండము సారవంత మిది కాదన నేరికి నెట్టు లైన రా
దొండ లతా విశేషమునఁ దోరపు బెండ లభింపఁ జోద్యమే 58
[రాదు + ఒండ = రాదొండ; ఒండు = ఒండ్రుమట్టి; లతా
విశేషము : బెండ మొక్క సన్నని కాండ]
కంటి వేమొ పగటి కల నింట నుండి
తొంటి యట్ల నీవిత్తువు తంట లెన్నొ
చెప్పు మయ్య నిశ్చయముగ నెప్పు డెట్టి
దొండ తీఁగకుఁ గాసెను బెండకాయ 57
మండి తోర్మి కదంబ కేద్ధ సమగ్ర సన్నుత సంత తా
ఖండ కోమల పూర్ణ భాసిత గౌతమీ స్రవ దత్త భూ
ఖండ మియ్యది సారవంతము గా దనంగ సఖుండ రా
దొండ తీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా 56
[రాదు + ఒండ = రాదొండ; ఒండు = ఒండ్రుమట్టి; తీఁగ : బెండ మొక్క సన్నని కాండ]
ఎట్ట కేల కతివ యిందీవరాక్షి ని
జానుమతిని నొసఁగెఁ జంద్ర వదన
యంచుఁ దలఁచి నంత మించ నానందము
కనుల నీరు నింపి కట్టెఁ దాళి 55
ఇన్నర లోక మందు గుణ హీనుల కేమి కొఱంత వింతగం
గన్నులఁ గంటక మ్మనఁగఁ గాపురుషుండు వరుండు మిత్రుఁడే
యిన్నలినాక్షి కే నకట యీడని తల్చుచు నేడ్చు చుండ నేఁ
గన్నుల నీరు నింపుకొని, కట్టెను దాళి వధూ గళమ్మునన్ 54
నారీ విను మొక యించుక
మేరను జక్కెర, చెలువుగ మెఱయు సువర్ణా
కారం బిడు పొడి కాదది
కారముఁ, బాయసము నందుఁ గలిపిన రుచియౌ 53
దార యిదేమి వింత సతతమ్మలుకల్ గొన నీకుఁ బాడియే
పోరులు గల్గవే ముదిత పూర్వ గతిన్ నిజ కాంతు నందునన్
గౌరవ ముంచి సుంత మమకారము, వీడి ముఖంపు టా తిర
స్కారముఁ, బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్ 52
ఆపి మేఘ రాశి నలరి వానల నిచ్చు
సమ్మతపు ఫలౌషధమ్ము లొసఁగు
మూల సంహితమ్ముఁ గాలోచితమ్ముగ
వనమునన్ లభించు ఘనసుఖంబు 51
వన గజ రక్షణోద్యమ కృపా రస సిక్త ఘనాంతరంగు పా
వన ముని సంచయ వ్యసన వారణ సక్త మనోవిరాజి యా
కనకమ యోజ్వ లాంగద వికాస రమా పతి విష్ణు పాద సే
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్ 50
ఏసును గొలువంగ నిద్ధరఁ గొందఱు
సుర గణార్చితుండు మురహరుండు
క్రీడ లలరి చేయు కృష్ణునిఁ గొల్చెద
స్తుత మతులను గూడి సతము నేను 49
ఏ వనితా మతల్లి చెఱ నింపుగఁ గన్నదొ యట్టి బాలకుం
డే వశ యెంచెఁ దా నసువు లెల్లను దీయఁగ నట్టి బాలకుం
డే వరవర్ణినుల్ నుడివి రెవ్వని క్రీడల నట్టిబాలు నే
నా వసుదేవ నందనుని నార్తినిఁ గొల్తును బస్తు లున్ననున్ 48
భామకు బోయ కులమ్మున
నా మహితాత్ముండు తిన్నఁ డవతరిలంగన్
భూమిని నాహా తలఁచం
జీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా 47
ఈ మహి నందుఁ జిత్రములె యిట్టివి గాంచఁ దలంచి చూడగన్
భ్రామక మౌనె కొండ లవి పచ్చిక లచ్చట నుబ్బు చుండగా
నేమని చెప్పు వాఁడ మఱి యేనుఁగు లెక్కుట యబ్బురంబె యం
చీ మల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా 46
[అంచు+ ఈ మలకు = అం చీ మలకు]
మేరు వొసంగినఁ బృథివీ
సార మొసంగిన మనమున సంతృప్తి యనన్
నేరని వానిని నిత్య వి
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్ 43
వారక దుష్ట చిత్తు లగు వారినె కాదు సుమా కడంగి యే
తీరున నొప్పునో తలఁచి ధీరత యోర్పును నైపుణంబు నే
పారఁగ నొవ్వ నీక మృదు వాక్య పరంపర దుష్ట సంఘ సం
చారు ను దూర ముంచిననె చాగును జీవిత మద్భుతమ్ముగా 42
ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ
సంగరమ్ము నం దక్కట భంగ పడక
నిల్వ నేర్తురే యుక్కునఁ బల్వరించ
కవ్వలలుని ముంగట సుంత నొవ్వ కుండ 41
వృక తుల్యోదర భీమసేనుఁడు గదావిద్యా ప్రవీణుండు రా
జ కులైక ప్రవరుండు దుర్జయుఁడు శంసన్ మల్ల యుద్ధంబు నా
పక పోరంగఁ బరాజయమ్మున కటం బాలైన వారెందఱో
యొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో 40
నివసింతురు నాగరికులు
వివేకవంతులు కడింది విజ్ఞానముతోఁ
గవు లెందఱొ కల రచటఁ గు
కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్ 39
అవిరామమ్ముగఁ దిర్గి తిర్గి యిక నే నా పట్టణంబందునన్
సువిశా లాపణ ముత్క్రమించి చనఁగన్ సొమ్ముల్ మహా చోరు పా
లు విచిత్రమ్ముగ నూఱడింపు గల పల్కుల్ విన్న నొప్పౌను నా
కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునం జూడఁగన్ 38
[నాకు + అవి = నాకవి]
కుక్కు టాధమా ప్రకోపించ కిట్టుల
నుక్కు వలదు నీకు వెక్కసముగ
గృధ్ర రాజ మేను గిట్టించ నాదు శా
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను 37
వికటస్ఫూర్తిఁ జరించ భీతిలుదునే విద్రోహి దైత్యాధమా
ప్రకటంబే యిది నిత్య సత్యముగ దుర్వారంపు జ్వా లాస మాం
బక భక్తాళి పఠించు మంత్ర తతు లా పంచాక్షరీ వాక్త్రయం
బకమే చాలును బ్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్ 36
ఘన విక్రముండు దా భయ
మన నెఱుఁగడు మానసమున నటఁ బట్టంగం
జని కని పామును, దలఁచుచు
హనుమంతుని, తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్ 35
అని లోద్ధూత పతాక సంస్థిత వికా సామేయ శౌర్యద్యుతిన్
హనుమంతుండు విరాజమానుఁ డయి తా నార్చన్ వడిం దా ననీ
కిని నిల్చుండఁగ భండన స్థలిని, టెక్కెం బందు వీక్షించుచున్
హనుమద్వాలముఁ, ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్ 34
ఏక్ - దస్ - సౌ – హజార్
రిపు వీ రానేక భయద
సపురస్సర సౌకుమార్య శత జన వృతుఁ డా
విపుల స్కంధుఁడు భీముం
డపుడు హజారమున నిలిచె నానందముగన్ 33
[హజారము = ఆస్థాన మండపము]
అక్కట చరింతురు నరులు దక్కి జాలి
మోయ లేక భారమును నారాయణ యని
ధావ కాంబర సంచయ ధర మహా ఖ
ర మణి, పాపమ్ము గద, పాశురములఁ జదువ 32
కమనీయమ్మగు రీతు లొప్పఁగను సత్కార్యాళి సంప్రీతినిన్
విమలాంతః కరణప్రభామహిమఁ దా వే సేయ నొప్పుం గదా
కుమ తీర్ష్యా దమ నైక చిత్తమున నాక్రోశించి నిత్యమ్మునున్
రమణీ పాశురముల్ పఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ 31
వట్టి మనిషివే నీవని
ముట్టుమ యశనము నని వలపున గంటలు దా
నెట్టెట్టని నట్టింటను
గొట్టెడు పతి నిష్ట పడరె కోమలు లెల్లన్ 30
నెట్టన బుజ్జగించుచును నిత్యము తిర్గుచు వెంట నీవు నా
చిట్టివి బుజ్జివే యనుచుఁ జిత్తము నందునఁ బ్రేమ మీఱఁగన్
మట్టెలు తాకుచుం దనదు మాటల కెల్లను వంత పాడి యూ
కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్ట పడంగ నేర్తురే! 29
అచ్చర యనఁ దగు శరచ్చంద్ర వదనను
నంబుజాయ తాక్షి నాత్మ తనయఁ
గంబుగళ విలసిత జాంబూనద తను ము
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె 28
[ముఖరము=వాగునది]
అరుదగు వింతఁ గాంచుఁడు మహాద్భుత మెంచ నభోధ్వ మందునం
బరువిడి సంభ్రమమ్మున నపార మనః ప్రణ యాత్త చిత్త తా
న రయము రోహిణీ రుచిర నామక తార త్రి నేత్ర శంభు శే
ఖరమును గౌఁగిలించు కొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్ 27
[త్రి నేత్ర శంభు శేఖరము =మూడు కన్నులు గల శంభుని శిరమందున్న వాఁడు, చంద్రుఁడు]
ధరణి భవ్య పుణ్య క్షేత్ర దర్శనములు
కారణము లఘ సంఘ విఘాతమునకుఁ
జూడఁ దగిన యట్టివి పెక్కు సుందరంపుఁ
బొలఁతి! మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట 26
[మేను = పార్శ్వము]
పార్వతీ దేవి మనోదర్శనము సకల పుణ్యక్షేత్ర దర్శన తుల్యము:
గణ్యం బైనది నైమిశాటవి యనం గాంతా శిరశ్శాల లా
వణ్యంబౌ ముఖ మండలమ్ము శశి సంభావ్యంపు వేశ్మంబ తా
రుణ్య భ్రాజిత పాద యుగ్మ మఘ సంరోధంపు క్షేత్రం బనం
బుణ్య క్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై 25
ఆశ లుడిగి చిత్తమునం
బాశ విముక్తులయి నరు లమర గురుని ప్రతీ
కాశము నిజాప్తులకు సం
దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్ 24
దేశము నందునన్ ధరణి దేవుఁడు వాసము సేయ కుండినన్
దేశము నందు వైద్యుఁడు నుదీర్ణతఁ గన్పడ కుండ నుండినన్
దేశము నందు జీవ నది తీర్థము నిత్యము పాఱ కుండినన్
దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్ 23
తీరె నంచితముగఁ బ్రతీకార మంచు
నతిశయమ్ముగ గెలుపొంది నట్టి వారు,
చిత్తయి యొకింత సవ్వడి సేయ కున్న,
నవ్వి, రోడినవార, లానందమొప్ప 22
[ఓడిన వారు - చిత్తయి యొకింత సవ్వడి సేయ కున్న- ]
మూఁడు నిలన్ జయాపజయముల్ సమరమ్మున దైవ లీలలై
యాడిరి శక్తి మీఱ విజయార్థ మనమ్మున గెల్పు లోటముల్
సూడఁగఁ దాఱుమా ఱయినఁ జోద్యముగా నపు డంత గెల్వ ము
న్నోడిన వారు నవ్వి రయయో యని గెల్చిన వార లేడ్చిరే 21
నడయాడఁగ వీధులఁ దా
నడరిన దుర్వ్యసనముల ధనాతిశయమునం
గడువడిఁ గుల గౌరవ మది
చెడు, గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్ 20
నడవడి ముఖ్య మెల్లరకు న్యాయము కన్నను మిన్న యైన దీ
పుడమినిఁ గాంచ నేరము ప్రమోద మొసంగు క్షమా గుణం బిలం
దడయక యుద్యమించుచు సదా శరణన్న నరాతి కోటిఁ గా
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్ 19
ఆతత గదా సమరమున నాదర గురు
పుంగవుం డని మ్రొక్కుచుఁ బూజ సేయ
బావ వరుస వాఁ డని బలభద్రునిఁ దమిఁ
బవనతనయుండు రామునిఁ బరిహసించె 18
వివరము లేలఁ జెప్ప నిట వీనుల చేటు వినంగ లేము మే
ము వదరు లెల్ల దుష్టుఁ డయి మూర్ఖపుఁ గర్మలు సేయు చుండు రే
పవలును మందలించుముర పాడిగ నిప్పుడు నీకు నక్కటా
పవన! సుతుండురా ముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా 17
నిరత ఋజు వర్తనుఁడు జన
వర హృద యావగత విబుధ వరుఁడు సుజనుఁ డౌ
ధరణీ సుర మాన ధనునిఁ
గరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్ 16
పరుగిడు వారు శస్త్ర చయ భగ్నులు దుస్సహ భీత చిత్తు ల
స్థిరమతి వాగు వారి పయి దీర్ఘపు మత్తున నున్న వారి పై
నరిబల శూర సంయుతము నా శరణాగత దీన సత్కృపా
కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయమ్ముగన్ 15
పున్నమి నైనను గానము
చిన్న దొర యితండు పిసరు చెక్కది చెదరం
డెన్నఁడు నిందల కన్నా
యెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్ 14
ఇన్నర దేవ యక్ష భుజగేశ్వర కిన్నర శత్రు వీతఁడే
యిన్నగ ధీర విక్రముఁడు నిమ్మహిషాసురుఁ డుగ్ర రూపునిం
జెన్నుగ దైత్య శేఖరులు సేరి వచించిరి పల్కు లిట్లు వే
యెన్ను కొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే 13
వేగమ మందిరమునఁ దగ
మూఁగుచు శ్రీరామ నవమి పూజల తోడన్
వేఁగక మదిఁ బానకముం
ద్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్ 12
ఆగమ సంచ యావన పరాత్మ రమాహృద యాబ్జ భాస్కర
ప్రాగధినేత కీర్తిత సుపాద ధరా ధవ నామ గానముల్
సాగుచు నుండ నిత్యమును శౌరి పదాంబుజ చింతనా సుధం
ద్రాగిన మాన వోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్ 11
అసమాన యశో విభవ వి
లసిత మహా ప్రాజ్ఞ వర విరచితము నపహా
స సమేత పద పరివృత వి
రస మయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్ 10
ముసరఁగ మేఘ పంక్తి దివి మోదము నందవె కేకి కోటులే
యసదృశ యుద్ధ విక్రమ మహా నిపుణుండు సమిత్తు మెచ్చఁడే
రసహృద యాళి మెచ్చదె కరమ్ము సుకావ్య రసామృతమ్మునున్
రసమయ కావ్య మే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్ ? 9
చిత్రంబుగ నా కిచ్చట
గాత్రం బెండెను గరమ్ము కంపం బయ్యెన్
విత్రాసంబునను భృశము
పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్ 8
[మగని = మగ పిల్లవాని]
నేత్రానందము నీయ నాకు హృదినిన్ నీరేజ పత్రాక్ష స
ద్గోత్రప్రాభవ లాఘవమ్మకట నిర్ధూతంబ నీ యందు నో
పా త్రాపాత్ర వివేక విస్తృత మహా ప్రాజ్ఞుండు మా మామకుం
బుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్ 7
బంగ్లా దేశమున నధిక
పుం గ్లాని తొలంగఁ గోరి పూర్ణము జూదం
పుం గ్లహమును మాన్పఁగఁ దా
నాంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్ 6
[గ్లహము = పందెము; కృతి = ఒక రచన; పోతన = బంగ్లా దేశపు పోతన]
యాంగ్ల మనంగ నేమి భువి నందు వెలింగెడి భాషలందు నీ
యాంగ్ల జనవ్రజమ్ముతిరుగాడగ భారత మందుఁ గాంచి వా
రాంగ్ల పురమ్ము లందలి జనాళి పఠింపఁగఁ గూర్చు రీతి నా
యాంగ్లము నందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో 5
సుధ లూరెడు కవనమ్ము ల
వధు లెఱుఁగక కవి వచింప వారక మఱి యి
వ్విధ మైన సంస్కృత శతా
వధాన మన మదన పల్లె ప్రజలకు భయమౌ 4
రయముగఁ బొట్ట కూటికయి గ్రామ నివాసులు వేఁగఁ బద్య సం
చయముల సంతసమ్ము మదిఁ జారు తరమ్ముగఁ బొంద నేర్తురే
స్వయముగఁ జూచి తే నట నివార్యమ సుమ్మిఁక నెన్ని భంగులన్
భయమునఁ బాఱదే మదన! పల్లె ప్రజాళి వధాన మన్న చో 3
సతులకు నుర్వీ తలమున
సతతము పతు లొసఁగు వార సంపద లెల్లన్
నుతు లీయరె యొక మాసముఁ
బతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్ 2
శ్రిత మందార యశో విరాజితుఁడు కాశీ పత్త నాధీశుఁడున్
నుత సీతాపతి నాగ భూషణుఁడు విష్ణుస్కంధ నారాచుఁడున్
నత శక్రాది సురౌఘ పూజిత మహానందుండు దాక్షాయణీ
పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే 1
ఛాయా వినుమా కడింది సాధువె యైనం
బాయక యసురు ఘ నాంహ
స్సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్ 62
[అంహస్సు + ఆయి = అంహస్సాయి; పాప మాదాయము గా
గలవాఁడు]
ఈ యతి వర్తనమ్మును సహించఁ డతండని నీ వెఱుంగవే
పాయక వాని నివ్విధినిఁ బంతము తోమఱి కాఱు కూతలం
గూయఁగ వీరభద్రు మదిఁ, గోపము మీఱఁగ నాదరింప కా
సాయిని, నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా 61
అంధ ప్రక్రియ బంధన
సంధా నార్తి శకటారి సద్దయఁ జూపన్
గాంధారీ నాథుఁడు పు
ట్టంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్ 60
అంధక దైత్య హంతక మహా శివుఁ డద్భుత భూత రూపమే
సంధిలఁ జేసి నిల్వ నర సారథి నెంచి సుయోధ నార్త వా
క్కుంథన చోది తోత్సుకుఁడు కుంభజ సూనుఁడు మత్స రోగ్ర రో
షాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్ 59
మండిత భంగ సంచయ సమాహిత సన్నుత శుద్ధ సంత తా
ఖండ జలోద్ధతిం బరఁగు గౌతమి తెచ్చిన యట్టి దిద్ధరా
ఖండము సారవంత మిది కాదన నేరికి నెట్టు లైన రా
దొండ లతా విశేషమునఁ దోరపు బెండ లభింపఁ జోద్యమే 58
[రాదు + ఒండ = రాదొండ; ఒండు = ఒండ్రుమట్టి; లతా
విశేషము : బెండ మొక్క సన్నని కాండ]
తొంటి యట్ల నీవిత్తువు తంట లెన్నొ
చెప్పు మయ్య నిశ్చయముగ నెప్పు డెట్టి
దొండ తీఁగకుఁ గాసెను బెండకాయ 57
మండి తోర్మి కదంబ కేద్ధ సమగ్ర సన్నుత సంత తా
ఖండ కోమల పూర్ణ భాసిత గౌతమీ స్రవ దత్త భూ
ఖండ మియ్యది సారవంతము గా దనంగ సఖుండ రా
దొండ తీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా 56
[రాదు + ఒండ = రాదొండ; ఒండు = ఒండ్రుమట్టి; తీఁగ : బెండ మొక్క సన్నని కాండ]
జానుమతిని నొసఁగెఁ జంద్ర వదన
యంచుఁ దలఁచి నంత మించ నానందము
కనుల నీరు నింపి కట్టెఁ దాళి 55
ఇన్నర లోక మందు గుణ హీనుల కేమి కొఱంత వింతగం
గన్నులఁ గంటక మ్మనఁగఁ గాపురుషుండు వరుండు మిత్రుఁడే
యిన్నలినాక్షి కే నకట యీడని తల్చుచు నేడ్చు చుండ నేఁ
గన్నుల నీరు నింపుకొని, కట్టెను దాళి వధూ గళమ్మునన్ 54
నారీ విను మొక యించుక
మేరను జక్కెర, చెలువుగ మెఱయు సువర్ణా
కారం బిడు పొడి కాదది
కారముఁ, బాయసము నందుఁ గలిపిన రుచియౌ 53
దార యిదేమి వింత సతతమ్మలుకల్ గొన నీకుఁ బాడియే
పోరులు గల్గవే ముదిత పూర్వ గతిన్ నిజ కాంతు నందునన్
గౌరవ ముంచి సుంత మమకారము, వీడి ముఖంపు టా తిర
స్కారముఁ, బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్ 52
ఆపి మేఘ రాశి నలరి వానల నిచ్చు
సమ్మతపు ఫలౌషధమ్ము లొసఁగు
మూల సంహితమ్ముఁ గాలోచితమ్ముగ
వనమునన్ లభించు ఘనసుఖంబు 51
వన గజ రక్షణోద్యమ కృపా రస సిక్త ఘనాంతరంగు పా
వన ముని సంచయ వ్యసన వారణ సక్త మనోవిరాజి యా
కనకమ యోజ్వ లాంగద వికాస రమా పతి విష్ణు పాద సే
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్ 50
ఏసును గొలువంగ నిద్ధరఁ గొందఱు
సుర గణార్చితుండు మురహరుండు
క్రీడ లలరి చేయు కృష్ణునిఁ గొల్చెద
స్తుత మతులను గూడి సతము నేను 49
ఏ వనితా మతల్లి చెఱ నింపుగఁ గన్నదొ యట్టి బాలకుం
డే వశ యెంచెఁ దా నసువు లెల్లను దీయఁగ నట్టి బాలకుం
డే వరవర్ణినుల్ నుడివి రెవ్వని క్రీడల నట్టిబాలు నే
నా వసుదేవ నందనుని నార్తినిఁ గొల్తును బస్తు లున్ననున్ 48
నా మహితాత్ముండు తిన్నఁ డవతరిలంగన్
భూమిని నాహా తలఁచం
జీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా 47
ఈ మహి నందుఁ జిత్రములె యిట్టివి గాంచఁ దలంచి చూడగన్
భ్రామక మౌనె కొండ లవి పచ్చిక లచ్చట నుబ్బు చుండగా
నేమని చెప్పు వాఁడ మఱి యేనుఁగు లెక్కుట యబ్బురంబె యం
చీ మల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా 46
[అంచు+ ఈ మలకు = అం చీ మలకు]
కలరూ పెల్లయు నుడువన్
లలితాంగి నిజ పతికయి వలపునన్ వేచం
దెలతెలవాఱం గలఁతన్
నెలఁ జూపి లతాంగి కంట నీరుం గార్చెన్ 45
లలి తాంభోరుహ పాదయుగ్మ మృదు లీలా కేళి డోలాయమా
న లుఠన్మానస చంచలాక్షి పరమానందంబు సంధిల్లగా
నల దా నేఁగఁ బొలమ్ము పాదమునఁ జేయన్ గాయ మచ్చోటి యీ
నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచుం బయ్యెదన్ 44