దాతలును నీతులును భాతి నేతలును స
నాత నాచారములు సున్న రోత కలుగుఁ
గలియుగాన నక్కట స్వార్థకారణమున
రామ! రాజ్యాన ధర్మము రాక్షసమ్మె 62
బాముల నేమి సేసితిమొ పార్థివ నందన నిన్ను గంటిమే
పామర దైత్య నాథ ఖర పాలన మందుఁ జెలంగఁగం బరం
ధాముఁడ దండకావనము దైన్యులు పల్కిరి, చూచి మౌను లా
రాముని, రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్ 61
జనుల కనుగుణ మగు నట్టి సరణి మార్చ
మోదము నిడు విద్యుద్దీపమును బుడమిని,
దూఱ నేల తచ్ఛక్తినిఁ బాఱఁదోలఁ
జీకటిని, మించు వెలుఁగున్నదా కనులకు 60
లోకము లందు జీవులకు రూఢిగ నింద్రియ గోచరంపు టే
కైక సురాగ్ర గణ్యుఁడు మహాత్ముఁడు నిత్యుఁడు లోకసాక్షియే
కాఁకవెలుంగు భాస్కరుని కన్న, జగమ్ముల నెల్లఁ గప్పెఁ బెం
జీకటి కంటె, మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే 59
[కంటె = చూచితివా]
రాచబిడ్డల చేతలు రాఁజు కొనఁగ
స్థలముల తగవు లడరంగఁ జలము పగయుఁ
దెనుఁగు నుడికారపు సొగసు మునుఁగఁ గలి క
రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన 58
ఫణముగఁ బెట్టి వర్ధనము పామరులోయన సంత తమ్మకా
రణ సువిరోధ చిత్తమున రాక్షస తుల్య మదైక బుద్ధి యం
త్రణ మది యగ్నియై తనరఁ దర్క పరస్పర రోష మోహ వా
గ్రణము సెలంగెరా తెలుఁగు రాష్టము లందున నేమి చెప్పుదున్ 57
కాశి కాన్నపూర్ణ సమేత కాలకంఠ
దర్శనమ్ముఁ జేయఁగ నమితంపుఁ బ్రీతిఁ
బుణ్య గంగావగాహము, మున్న చేసి
గౌతమీ స్నాన మొ,నరించెఁ గాశి కేఁగి 56
సితదే హాసిత గాత్ర భూతపతి కాశీనాథ విశ్వేశ్వ రా
యత పాదద్వయ వారిజద్యుతి వికాసాంభోధి సద్యఃఫ లా
తత పుణ్యప్రద భక్త పాపచయ విధ్వంసేద్ధ గంగా నదిం
గుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్ గోదావరీ! స్నానమున్ 55
అతులిత రాగ మ్మడర ను
చిత రీతి నెదిగి తనరిన శీల పురుషుఁ డా
సుతునకు నేర్పిన మాతయు
సతియే కద పూరుషునకు సద్గురువు గనన్ 54
సతు లెంచంగ జగత్రయమ్మున మహా చారిత్ర సంభావ్యలై
తత విజ్ఞాన విహీనులే చెపుమ యింద్రాణీ వరాఖ్యా సతీ
పతి నిత్యార్చ్యనిజాత్మభర్త వసుధాభర్త త్రయం బందునన్
సతి యే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్ 53
కమలాసన భవ బలరిపు
నమస్కృత విరాజమాన నరహరి లక్ష్మీ
సుమనః కాసారమునకుఁ
గమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్ 52
[కమలాప్తుఁడు = విష్ణువు]
కమలా కాంత మనఃప్రకార తతి సుగ్రాహ్యంబు గానేర్చునే
కమ లోద్భాసిత శారదాపతికి నక్కామారి కైనన్ మదిన్
విమలాంభోధి సహోద్భవ ద్వయము సంప్రీతిన్ రమాచంద్రులే
కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా 51
[కమల = లక్ష్మీ దేవి]
అఘ్నా గణాధి విభుఁడు కృ
తఘ్నతఁ జూపిన నొరులకుఁ దన కాంక్షలకున్
జఘ్నివ్రజ ఘాతమ్మున
విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్ 50
[గణపతి = పూర్వోక్త గోగణ పతి]
విఘ్నమ యైనభూభ్రమణ విస్తృత యత్నము ఘోర దైత్య శ
త్రుఘ్ననిజాగ్రజప్రవరు తోడుత పందెము నందు నింక నా
విఘ్నగణాధిపత్యము భువిన్ మఱి దక్కుట కివ్విధమ్మునన్
విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్ 49
పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట
నా సమస్య నొసఁగి కవి నాథ నాథు
లక్కట విశాఖ కరుదెంచ మనఁగఁ దగునె
శంకర శతక వీక్షణ సంపద కయి 48
పాంథశ్రేణికి నేత్ర పర్వమగు నిర్వ్యాపార సంధానతన్
మంథాద్ర్యాభ కవీశ్వ రాళి కది సమ్మానంబ చింతించగన్
గ్రంథివ్రాత సమాహితార్థము లసంగ్రాహ్యమ్ములై యున్న నా
గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్ 47
మున్న వెలయంగ విష్ణుండు సన్నుతముగ
నద్రి నింపార లక్ష్మితో భద్రముగను
క్షేత్ర మహిమమును ద్విగుణీకృతము సేయ
హరుఁడు గౌరితో వెలసె సింహాచలమున 46
అవనీ భారముఁ దీర్ప నర్భకుని దుఃఖాంభోధి నెండింపగన్
భువి కేతెంచి రమాధినాథుఁడు దయం బూరించి దైత్యేంద్రు నా
యువులం దీసి చెలంగి గోళ్ళ నరసింహుండంతఁ, గీర్తింపగన్
శివుఁ డంబా సహితుండు, కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్ 45
మధుసూదన నామాంచిత
సుధా రసాస్వాదన మనసులునౌ నానా
విధ పాప కార్య దూరులు
మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్ 44
[మధుప + అనాసక్తులు = మధు పానాసక్తులు;
మధుపము = మద్యపానము చేయునది]
విధనంబైనను ధాన్య హీనమయినం భేదంబు లేదంచు ద
ద్విధి సద్బావ తరంగ చోదితులు దేవీ దివ్య సంప్రీత చి
త్త ధవ క్షేమద భక్త కల్పతరు పద్మ ద్యోత పాదార్చనా
మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్ 43
పారావా రాభపు సం
సా రావన సంభృత విలసన తత్పరులుం
గారే యక్కట యీ సం
సారుల కెందులకొ యీ వసంతోత్సవముల్ 42
మత్సర మెల్లఁ జిత్తమున మాని నిరంతర దీక్షఁ బూని శ్రీ
వత్స పదాంబు జార్చనలు భక్తినిఁ జల్పుట గాక గేహినీ
వత్స నికాయ సంజనిత బాధల నియ్యభిసారికా వసం
తోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకుం దలంపఁగన్ 41
హాయ్ - హలో - గుడ్ – బై
హాయనముం బైశున్యా
మేయ క్రియ నా మహా సమీరజు నిహ లో
కాయత గేహ విదూర వి
ధాయక రతుఁ డగుడు వినఁగఁ దాపం బయ్యెన్ 40
నీ కింక శంక యేలయ
యీ కలి లోకోపకారు లెందును లేరే
కేకలు వేసెడి లోకులు
కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్ 39
లోకులఁ గాంచి పొందకుమ రోషము దుస్సహ దేహజోగ్ర జా
డ్యాకర హేతుభూతములు హ్లాద వినాశక భూతముల్ వచో
భీకర దూషణాకలన వేధిత మానసపుం గడింది చీ
కాకులు మానవాళి కతి కష్టములం గలిగించు నెప్పుడున్ 38
ఏకపత్నీవ్రతమ్మున నెంచ రామ
చంద్రుఁ గాకుత్స్థునకు ధర సరి యెవండు
సత్య నిత్య వ్రతమునఁ గాంచ, వలదయ్య
బొంకఁగా, హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు ? 37
ధరయం దుండిరె భూతలాధిపులు సత్యత్విట్టు లెన్నండు నే
నరయం జాలుదు వాని సత్య రత మా యౌన్నత్య మెల్లం దపో
వర గాధేయుఁడు వల్కె నింద్రసభలోఁ బాకారి వీక్షించఁగన్
సరి రాఁ డెవ్వఁడ? సత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్ 36
అజిర విలాసార్థము చి
త్త జనిత దుష్కార్య రతము ధర్మం బగునే
సుజితంబై ఘోరాంహ
స్సు జన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్ 35
సుజన గుణోన్నతద్యుతి సుశోభిత మూర్తుల కెల్లఁ బేర్మి భా
వజ వశ వర్తనాధమ వివాద విహారుల క్రూర చిత్తులుం
గుజనుల సజ్జనార్దిత సుఘోర సుభీషణ దుష్ట వా గియా
సు జన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్ 34
ధన మవసర మగును ధరణీపతుల కెల్ల
యజ్ఞ యాగములకు నవని జన సు
రక్షణమునకును ధరను న్యాయ రీతిని
ధనముఁ గోరువాఁడె ధన్యజీవి 33
ధనముల్ ధాన్యము లెల్ల నక్షయములే తర్కింప నిద్ధాత్రినిన్
వినయం బింకయు భక్తి యింపెసఁగ నా విష్ణు ప్రపత్త్యర్చనా
జనితంబైన సుఘోరపాప చయ నాశప్రాభవో గ్రాగ్ని కిం
ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ 32
[అగ్నికి + ఇంధనము = అగ్ని కింధనము]
సంకట కారకు రావణు
నంకము నందుఁ దునుమాడి యంబాపతినిన్
సంకీర్త నాళి నిమ్ముగ
శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్ 31
పంకజ నాభు వేఁడ నల పంకజ గర్భ ముఖామరుల్ తమిం
బంకజ లోచనుండు ఖల పంకిల మానస దైత్యు రావణుం
బంకజ లోచనార్థ మట పంకజ జాన్వయు దర్పు ధర్మ నా
శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే 30
నల్గురినిఁ గలిపి యొకండు నయముగఁ బలు
కంగ బహువచనమ్ము వాడంగ వలయు
నాగ ఫణి శర్మ సుకవు లనంగ వలయు
నాగ ఫణి శర్మ సుకవి యనం దగండు 29
ఉత్కటు నందు జాలి గొను టొప్పునె చెప్పుమ యెన్నఁ డేని యా
పత్కర మై చెలంగు నది వాని వధానము గూలుఁ గాక యీ
సత్కృపఁ జూప నేలనయ చాలును బండిత మాని కివ్విధిన్
సత్కవి, కాని, నాగఫణి శర్మవ ధానముఁ జేయు టెందుకో 28
[పద విభజన: సత్కవి నాగఫణి శర్మవ కాని ధానముఁ జేయు టెందుకో; ధానము = అండ]
దురిత చయ విచారు భయం
కరు రాత్రించరు విషాదకరు నా భస్మా
సురు వర నిమిత్త పూజిత
హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్ 27
ధరలోపాప జనక్షయమ్మునకు సద్ధర్మావనార్థమ్ము కా
దె రమానాథుఁడు దాల్చ నేర్చును విహారేద్ధావతారమ్ములే
యరవిందాక్ష ధనుర్వినిర్గతము బ్రహ్మాస్త్రమ్ము సీతా సతీ
హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందముం బొందెరా 26
ధారుణి వెల్గిన సత్య వ
చో రతు లెల్లరుఁ జరించి చూపిన ఘనమౌ,
చేరఁగ నీకుమ యెన్నఁడుఁ
గ్రూరుని, మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్ 25
దారకు చే నెఱింగిన నుదార యదూత్తమ వంశ నాశమున్
ధీరతఁ జెప్పెఁ బార్థునకు దీనుఁడు నా సదసద్విచార వి
స్ఫారుఁడు యాదవాన్వయుఁడు శౌరి నిజాత్మ విదుండు సౌమ్యుఁ డ
క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ 24
చెన్నుగ సక లామర సై
న్యోన్నత పతి షణ్ముఖుండు నుగ్రుఁడు, వల్లీ
సన్నుత నామయె, పార్వతి
కన్న కుమారుండె నా మగండని పల్కెన్ 23
తిన్నగఁ జూడ నిప్పడుచు దేహ విలాసము నంచు రోయఁ దా
సన్నముగన్ మనో జనిత సంశయ మెల్లయుఁ గాంత కంత వి
చ్ఛిన్నము గాఁగ రుక్మిణినిఁ జేరి రతీసతి యీతఁ డవ్వ నీ
కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటం చన మెచ్చి రెల్లరున్ 22
దాన ధర్మము లందు సతమ్ముఁ బరఁగి
తోటి వారి కెల్లరకు సంతోష మెల్లఁ
బంచి కీర్తి శేషులయి సత్పథము సేర
మరణమే లేనివారలు మనుజు లెల్ల 21
దరుమము నిల్పి యెల్లెడల దయ్యము నుంచి మనమ్ము నందునన్
గరువముఁ జూప కుండ తమ గాదిలి పెండ్లము లండ నుండ బా
మర జను లైన నేమి యిల మాన్యులె యప్పుడ నిక్క మెంచ దు
ర్మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్ 20
శుద్ధ చరిత్ర తనరఁగ వి
రుద్ధ గమనముఁ ద్యజియించఁ గ్రోధము లున్నే
యిద్ధాత్రి వలదు నిత్యము
యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్ 19
కృద్ధత దేశ పౌరులకుఁ గీడులు పెక్కులు కల్గఁ జేయు నీ
బుద్ధి విహీన ఘాతకులఁ బూర్ణము చంపుట లెల్ల ధర్మ సం
బద్ధము నిత్య నీచ తమ భావ మహోగ్ర జనఘ్నమై మహా
యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్ 18
వీరు వార నియెడి భేద భావము లేక
యందఱి యెడ నొక్క చంద ముండి
శాంత మూర్తు లౌచు సంతత సద్ధర్మ
పరులు సేయ నొప్పు పాలనమ్ము 17
అరు లధికమ్ముగా నునిచి యార్జనమం దనునిత్యముం బ్రగా
ఢ రతి వహించి నిర్దయయు డంబము నెక్కొన లోభ మోహ త
త్పర జన వంచనా కలిత ధర్మ పరిచ్యుత రాజ కోటికిం
బరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్ 16
ఓరామా బ్రోవు కృపా
పారావారా రఘువర పద్మదళాక్షా
నా రామదాసు పాడం
గారాగారమున మధుర గానము వింటిన్ 15
దూరము నుండి వినంబడ
సార సరాగ పదనిసల శ్రావ్య ఫణితు లే
పార మనో వికల జన వి
కా రాగారమున మధుర గానము వింటిన్ 14
ఔరా ధాతృ సులీలలే మదికిఁ జోద్యంబై ప్రవర్తింపవే
కీరానీకము కోకిలాలియుఁ బరీక్షింపన్ మనుష్యేతరుల్
లేరే గాన విశారదుల్ భువిని కేళీ సంచలద్భృంగ ఝం
కా రాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్ 13
భామామణులు గలరు నీ
వేమాఱిచి వారి వీడి యిమ్మెయి నకటా
కామమున వారకాంతలఁ
బ్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్ 12
నీమము తోడ జీవనము నిత్యము సజ్జన వాంఛనీయమే
కామము దక్కు బానిసవు కాకుము వింటిమి కాదె వేద వా
క్స్తోమము వీడి ద్వేషమును దూర్ణముఁ జక్కఁగ నాశ్రయించినం
బ్రేమయె, కీడొనర్చుఁ గద ద్వేషమె, మేలొనఁగూర్చు నిచ్చలున్ 11
“బస్స”న నలుగకుమ మనము,
బుస్సనియెడి కోపమునకుఁ బోయుమ వే యా
పస్సను జాలున కితరము
“బస్సే”, సాధనము గద దుబాయినిఁ జేరన్ 10
[స+అధనము = సాధనము; ధనహీనతఁ గూడియుంట]
ఇస్సమయంబునన్ దొరక విక్కడ యన్యము లైన వెవ్వియున్
విస్సన సెప్పె నాకు మును బేర్మిని నాంగ్లపు భాష యందునం,
గస్సు మనంగ నేల నలకం గొని, యాన విశేష శబ్ద మీ
“బస్సె” దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్ 9
భీమాపత్తులఁ గావ వి
రామ మెఱుంగక యునిచి పరంధాము మదిన్
రామ నవమి పర్వదినము
రామ భజన సేయుము శివ! రాత్రికి భక్తిన్ 8
దారుణ రాక్షసాంతకుఁడు ధర్మ రతైక విభుండు నేక స
ద్దార మనస్స్థితుండు ననృతద్విషుఁ డిద్ధర రామచంద్రుఁడే
యేరకి నిశ్చయమ్ముగను నిద్దిన మద్దిన మేల నిత్యముం
శ్రీరఘురామ సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిం దమిన్ 7
లలనా వినుమా నిర్మల
కలధౌతాత్మ జన తతికి, కలవరమేలా,
సలలిత భాషణ ఖండిత
కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే 6
ఇలయే నాకము ధర్మ రక్షితముగా నింపార నిక్కమ్ముగం
గలవే దుస్తర వైరభావములు లోకం బందుఁ జింతింప ని
శ్చల చిత్తస్థిత శాంత భాషణములన్ సౌహార్ద జీర్ణమ్ములై
కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీయె మున్పెప్పుడో 5
ఊరి కుపకార మొనరించ నూహ సేసి
వారి వారి యిండ్లకు నేఁగి మీరు దుడ్డు
లిమ్మని యడుగ మఱి పాఱి రెల్లరు కడు
బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు 4
కదలి సతమ్ము లోకజన కంటక నీతి వహింప కుండి తా
నుదుటునఁ బాపసంచయము నొందు విధమ్ములు వీడి నెమ్మదిం
బదుగురు దుఃఖ వారినిధి పాల్పఁడు, ధర్ముని దండ నీతికిన్
బెదరుచుఁ, గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్ 3
సద్బల హీనులు రైతులు
క్షుద్బాధ నణచఁ దలఁచిరి గోప్యమ్ముగ నీ
బుద్బుదపు టసువులు సనఁగ
క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్ 2
ఉద్బాధార్త జనాళి వేదనల సద్యోభంగ కార్యమ్ము లం
చద్బాధ్యత్వ ధురీణులై పరఁగి సంచారమ్ము సేయం దగున్
సద్బోధల్ వలుకంగ భావ్య మగునే క్షామంబు వర్తిల్లగన్
క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే 1
[చను = ప్రవర్తించు]