ఆయాసమ్మున కలయక
వేయం బత్రికల నెల్లఁ బెండ్లి కకట నీ
వే యప్పు డౌనని మఱి య
హో యుత్పలగంధి యిప్పు డూహూ యనకే 62
వివశుల్ గారె కనంగ సుందర తనుల్ భీతాక్షులన్ మౌనులే
యవలోకించుచు మత్స్యగంధి నటఁ గామావేశ చిత్తుండునై
సవనజ్ఞాని ధరామరుం డనె నిటుల్ శక్త్యాత్మజుం డేలనో
యువిదా యుత్పలగంధిరో యిపుడు నీ వూహూ యనం బాడియే 61
దంష్ట్రలు లేని శిశు వహో
దంష్ట్రి దళన కృష్ణుఁ డట నిదానము కందన్
దంష్ట్ర నికాయము కాళియ
దంష్ట్రలపై శంకరుండు దాండవ మాడెన్ 60
[శంకరుఁడు = సుఖముల నిచ్చువాఁడు]
దంష్ట్రలఁ గాంచ నొప్పు స్థిర దంష్ట్రలు పాములు శ్వేత చక్ర వ
ద్దంష్ట్రయ కుంజరమ్ము మృదు దంష్ట్రలు వెక్కులు దైవ భా గయో
దంష్ట్రలు నన్యధాతు వర దర్పిత రాజత ధాతు భృత్చతు
ర్దంష్ట్రల మీఁద శంకరుఁడు దాండవ మాడెను రాము కైవడిన్ 59
[ చతుర్దంష్ట్రలు = నాలుగు శిఖరములు; రాముఁడు = అందమైన వాఁడు]
తా బడిలోన వినిన కథ
లోఁ బరు గిడు పందెమున నులుకి మిగుల న్గా
రాబమున నడిగె బాలుఁడు
తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా 58
కాలుని కైన శక్యమె వికారపు మర్త్యుల చర్య లెంచఁగన్
బేలశశేంద్ర మె ట్లెఱుఁగు భీకర మానవ వర్తనమ్ములన్
వీలుగఁ బ్రేలు మందు నటఁ బెట్టఁగ గుంటను ముట్టి నంత దాఁ
బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్ 57
[తాను + పేలు = తాఁ బేలు]
అన్న తగ దన్న నీ విటు లన్న నొల్ల
నంచిత మతి నిడు భగవ దర్పిత వర
శుద్ధ ధవళాన్నమ యగును క్షుద్రవ దవ
టాన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు 56
[క్షుద్రవత్ + అవట + అన్నము;
అన్నము = 1. అన్నము, 2. నీరు; అవటము = గొయ్యి]
సవ్యంబౌ విధి నుంచు తర్కములు నిస్సందేహ చిత్తమ్మునన్
దివ్యర్షి వ్రజ మేల పల్కును వృథా తిర్య గ్గిరా బోధనల్
భావ్యంబే యిటు లన్నిటన్ విశయ సంభారమ్ము లేపారగన్
“భావ్యంబౌ నొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్” 55
అవ్వ ద్రుత సంధు లెఱుఁగవు
నవ్వుల పాలై సళించ న్యాయమె నీకున్
సవ్వడి సేయఁ దలంచకు
గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో 54
బువ్వకు రాని విద్య లవి బూడిద లోని హిమాంబువుల్ కదా
దవ్వుల కేఁగి యైనను నిదానము నూని ధనమ్ము వొందవే
నొవ్వగునే వినంగ నిది నొచ్చవె యక్కట కాంచు మయ్యెఁ బీ
న్గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుఁడ నందువే యొహో 53
[పీన్గు + అవ్వకు = పీన్గవ్వకు; అవ్వ = తల్లి]
కృష్ణు సహిష్ణు నసిత రో
చిష్ణు మహాలంకరిష్ణు జిష్ణుఁ జరిష్ణున్
విష్ణున్ ధృష్ణున్ వేఁడఁగ
నుష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్ 52
కృష్ణా యంచును వేఁడ గోపకులు నీ కేలన్ గిరిన్నిల్పవే
కృష్ణా యంచును వేఁడఁ గృష్ణ యట నీ కృత్యమ్ము వీక్షించమే
కృష్ణా యెవ్విధిఁ జెప్ప నేర్తు మయ సంక్షేమంపు నీ మాయలీ
యుష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్ 51
అల నలినాక్షునకును జి
క్కులు వెక్కులు తప్పలే దుగువు సెడి కాంతుల్
వలపున దరిఁ జేర ప్రణయ
కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్ 50
కలహపు మాట లేల బలుకంగ నకారణ మివ్విధిన్ సఖా
నలినదళాక్షు లెంచ భువి నంద విదాయిను లయ్య దొమ్మికిన్
జల ఖల విత్త శాసన దిశాదులఁ దల్చవె స్వార్థ నిర్దయా
కల హము లీ భువిం గలుగఁ గాంతలె? కారణమౌదు రెప్పుడున్ 49
[కల = జీర్ణము కాని; హములు =ఆయుధములు]
వింతలు గావె చేష్టలు నవీన విధమ్మునఁ గాంచ దార నే
కాంతము రాఁగ సేవలకు గంతులు నచ్చట వేయ కాగునే
యంతకు మున్న లే వకట యందెలు నగ్గది కేఁగఁ గాలికిం
గాంతకు వింతగా నిపుడు ఖంగున నూపుర మేల మ్రోగెనో 48
తనర నిశీథము పెంపెసఁ
గ నినద రాహిత్య ముండఁ గాంతుండటఁ గా
మిని పాదనూపురము ఖం
గున మ్రోగెను హేతువేమొకో పరమాత్మా! 47
వర్ష ముద్భవంపు భంగి వరము లీయఁ
గర్షకులకు నెల్ల మర్ష మలరి
పంట కొఱకు నీయ దొంటి ఋణమ్ములఁ
గలలు కల్లలైనఁ గల్గె ముదము 46
[కల = వడ్డీ]
నలిన దళాక్షి కైక నిజ నాథుని చావున కయ్యె హేతువే
యెల పద మెత్తి తన్నె నొక యింతియె యెయ్యది సేయఁ నేర్చుఁ బే
రలుక సతీ మతల్లి యిలు లందుఁ జెలంగును నుంకు లంచు శం
క లలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో 45
[శంకలు + అలవి; అలవి = కొలఁది; నుంకులు = పస్తులు]
నిలుకడ కఱ వాయెను నా
కల జడతఁ దడఁబడఁగ వడఁకఁ దొడఁగెఁ గరముల్
విలయమొ విజయంబో నా
కలవడునే యున్నతి యని కందె నొకండే 44
ఊర్జిత మగునె జటిలము స
దార్జిత భోజ్యంబె ఖాదితము ఖాదకముం
దర్జన మేలా కాంచఁగ
మార్జాలము సింహమయ్యె మర్మంబేమో 43
కర్జంబే వని నల్ప జంతువును దా గాలించి చంపంగ నీ
దుర్జేయం బగు సింహ రాజునకుఁ దోడ్తోడన్ విచారించగన్
భీర్జీవమ్మును బాఱ నే నరసితిన్ విద్రావి తాలోల రు
ణ్మార్జాలం బట సింహమయ్యె నవురా మర్మం బెదో చెప్పుమా 42
సేవ్యమ్ములు సుర గణ సం
భావ్యమ్ములు విష్ణు పాద పద్మమ్ములు త
ద్దివ్య చరణాబ్జ వర్ణన
కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్ 41
[ఉసురు =ఉస్సురు = నిట్టూర్పు ధ్వని]
దివ్యపు టస్త్ర జాలములుఁ దీక్ష్ణ కఠారము లేల విస్తృ తా
భవ్య పదార్థ హీనతర భావ సమేత సు దారు ణోపమా
నావ్యయ ఘోరముల్ కవిత లల్లి మనోవ్యయ కార కాభమౌ
కావ్యము వ్రాసి తీయనగుఁ గాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ 40
నిష్కారణ మేల వ్యయము
దుష్కరము సుమీ భరింప దుస్సాహసమే
శుష్కశ్రమములు గ్రంథా
విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె చుమ్మీ 39
పుష్కల శబ్ద భావముల మూర నలంకృతు లచ్చ టచ్చటన్
నిష్కపట స్తవమ్ముల ఫణి ప్రవ రాస్తరు నెంచి భర్తగం
బుష్కర మందు నొక్కటిగఁ బూని రచించి చెలంగి పుస్తకా
విష్కర ణోత్సవమ్ములను వేడ్క నొనర్పఁగ నేల వెఱ్ఱివే 38
ఉర్కులు పర్గులు నేలయ
మూర్కొనిన వచింతు నిమిషముననే నీకుం
దర్కించకు నే నెఱుఁగుదు
శర్కర, చేఁదగును మఱి విషమ్ము, మధురమౌ 37
కూర్కొన నప్పు లందున సుఘోర ముపాయము లేక తీర్చగం
గర్కశ దుఃఖ షండములు కల్గిన మూర విరాగ మాత్మలోఁ
దర్కము లేల నిస్పృహ హృదగ్ని నిభంబయి కాల్చుచుండగన్
శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా 36
సక్రమముగ సాధు జన జీవన మలరఁ
జేయుటకు నధిపతి సెలఁగ వలయు
ధాత్రి లోనఁ గ్రూర తర దుష్ట మానవ
హింస లేని చోట హితము లేదు 35
సంసరణమ్ము సేయ వలె సాఁక ధరిత్రిని వన్య వృక్ష వి
ధ్వంసము మాన వాళికి నపార మొసంగు వినాశమే చుమీ
మాంసము చేటు మే లగు సమస్త చరా చర జీవ సంచ యా
హింసయె, లేనిచో, హితము నెట్టులఁ బొందఁగ వచ్చు నీ ధరన్ 34
గాఢోద్వాహం బీ యా
షాఢమ్మునఁ జేయ నేల సందేహముగన్
రూఢిగఁ జెప్పుదుఁ గడచిన
మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్ 33
ఊఢయ వేడ సమ్మతము నొద్దిక వేగ మొసంగి వాహ నా
రూఢను జేయఁగం బతి వరుండు లభించిన దారకున్ ని జో
ద్వోఢృ విశిష్ట మానస విభూషిత భక్తి సుసంయు తాభి స
మ్మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ వొనరించును గార్యసిద్ధికిన్ 32
[అభిసమ్మూఢము = మిక్కిలి భ్రమ చెందినది]
వేడుక నుండును శ్రీహరి
చూడఁ జరాచర జగతినిఁ జోద్యం బగునే
యోడకు చతుష్పదం బని
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్ 31
వేడుక మీఱఁ బరుండఁగ
నీడ యనంగ మెలఁగంగ నిత్యముఁ బ్రీతిం
జూడుమ బాలిక బాలుఁడు
గా డిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్ 30
[..గాడు +ఇది+అ = ..గా డిద; కాల్పట్ట: గూఢార్థము భార్య యయితే]
ఏడ గలండు విష్ణువు మహిం గన నంచును దాను దైవమే
యీడ చెలంగు రా జని యథేచ్ఛ చరించుచు మించి మెచ్చఁ బూఁ
బోఁడులు నిచ్ఛ స్వర్ణకశిపుం డనె, దైత్య వరుండు గర్వి రా
గాడిద, కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్ 29
[రా గాడిద = రాచ గాడిద]
బిఱ్ఱున నెఱ్ఱని చక్కటి
గుఱ్ఱము నెక్కి చనుదెంచి గురు కామలకుం
గఱ్ఱి, భయము లేక యరసి
పుఱ్ఱె లవియె, మాటలాడెఁ బూర్వపు రీతిన్ 28
కుఱ్ఱలు సేరి మోదముగఁ గూతలు కూయుచు నాడు చుండిరే
వెఱ్ఱినె నమ్మ సుద్దులను వింతలు సెప్పకు మింకఁ జాలులే
యఱ్ఱులు సాచి యున్నయవి యచ్చట జీవులె, కావు చూడుమా
పుఱ్ఱెలు, మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్ 27
ఉద్భవం బొందఁ జేయు నత్యుత్తమ మను
జుల ధరాతల మందు విశ్రుతముగఁ గన
జ్ఞాన మింపుగఁ బంచు ననూనపు బడి,
దేవుఁడే లేని గుడి, కడు దివ్యమయ్యె 26
సావన కార్య మగ్నత దయా రస పూర్ణ మనో విలాసతం
గావఁగఁ బూను నిత్యము జగమ్ముల మేలుగ దేవుఁ డందఱిం
బావన భక్తి తత్పరతఁ బన్నుగ నిత్య మనర్చితుండు నౌ
దేవుఁడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్ 25
ధీరుం డుంగరము నొసఁగి
చేరువ కేఁగి కలతం గృశించిన గిరలం
బారువ, దీవన లిడి మన
సారా, తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్ 24
[పారువ = జాడ]
గారాబమ్ము సెలంగఁ జిత్తమున నా కాకుత్స్థుఁ డాసక్తిఁ గాం
తారత్న మ్మిడ నాన వాలుగను దా ధాత్రీజ నీ వా యశో
కారామమ్మునఁ గొన్న రత్నమును ధీరా నిశ్చ యాతీత సం
సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్ 23
విశ్వ మందు నున్న వివిధ కులముల య
వన వరులకు నెల్లఁ బన్నుగ విను
మ నిరతోపవాస మాసాంత మందునఁ
గలనుఁ దలఁచుకొన్నఁ గలుగు సుఖము 22
[కల = చంద్రునిలోఁబదునాఱవభాగము]
కలవర మేల మానవ నికాయము వొందఁగ సంకటమ్ములన్
సలలిత చిత్త వృత్తి ఘన సన్నుతి సేయుచుఁ గాంచి నంతఁ గ
న్నులలర శాంభవీ గిరి తనూజ సుపింగళ వర్ణ పార్వతీ
కలను స్మరించి నంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్ 21
[కల = శిల్పము]
ఒకయింత యేని యుంచక
కికురింత మదిని నిజ సతికి కుబేరుఁడు కా
నుక నీయ జన్మదినమున
మకరమ్మును ముద్దులాడె మగువ కడుఁ దమిన్ 20
సకలము గాంచి తీర్థముల సంతస మంది కరమ్ము నంత మం
జుకరముగా ముగించి యిక సూన యుతమ్ముగఁ బ్రాణ నాథుతో
సుకరము కాఁగ యాత్ర తముఁ జూడ నిజాత్మజ రాఁగ సత్యభా
మ కరముఁ బట్టి ముద్దు లిడె మానిని మిక్కిలి ప్రీతిఁ జూపుచున్ 19
దూరపు దేశమ్ములఁ గని
క్రూరాచారములు గొంట కూడదు సుమ్మీ
ఘోరంపు నాగరికతన్
దా రాసంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ 18
[దార +అసంగమము; భార్యతో కలిసి యుండకుంట, విడాకులు]
మూరి యశమ్ముఁ గోరుచు సమున్నత భూధన సంచయమ్ములం
గోరిన వారి కిచ్చి యిఁక ఘోర దరిద్రము తాండవించినన్
వారని సంకటమ్ము లవి ప్రాప్తము లైనను జేసి నట్టిదౌ
దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్ 17
[దార = దానము; సంగమించుట = అంటుకొనుట]
కంజదళాక్షుఁడు నరుఁడు రి
పుంజయు లట లేక పాండు పుత్రులు కట్టా
భంజితులే నిర్బలుచేఁ
గుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్ 16
భంజన మేల యిప్పు డను బల్కుల, పశ్చిమ తీర పుణ్య దే
శాంజన రాజ యోధప వరాంకుశి చోదితమై కడున్ వెసం,
బింజర దృష్టి నే నఱవఁ బెద్ద యెలుంగున, వీటి లోనికిం
గుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను, దోమ కుత్తుకన్ 15
[అంజనము = సౌవీర దేశము; వీడు = శిబిరము]
వినఁగ వినఁగ విందు వీనుల కొసఁగితి
వివిధ రాగములను వెలసి నీవు
పాడ పాట లచటఁ గూడఁగ నాలుగు
నాలు గారులు పదునాలు గగును 14
వీలగుం జన సత్వరమ్ముగఁ బ్రీతి నందఱిఁ గూడి వా
హ్యాళికిన్ నగ రేతరమ్ముల కద్భుతమ్ములు గాంచవే
మేలుగా నవి పేర్చ నచ్చట మేటి సుందర వర్ణ యా
నాలు గారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్ 13
[యానాలు + కారులు; కారులు = నలుపువి]
బొంక నేర నయ్య శంకింపఁ బనిలేదు
వమ్ము కాదు సుమ్ము నమ్ము నాదు
మేటి భాషణమ్ము మిత్రమ కా దిది
నీటిమీఁది వ్రాఁత నిలుచు సతము 12
కోటీరమ్మట కావ్య రాజముల సంకోచంబె రామాయణం
బాటల్ పాటల సంతతమ్ము సుజనారాధ్యమ్ము దివ్యమ్ము శై
లాటక్షిప్త విహంగ దర్శనజ మోహార్తుండు వాల్మీకి క
న్నీటన్ వ్రాసిన వ్రాఁత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా 11
కుడ్యము నెక్కఁగఁ దగునే
బాల్యపుఁ జేష్ట లవి యేల వారక యట్లుం
బాడ్యమి నాఁ డేల దుడుకు
కుడ్యముపై నున్న తేలు కుట్టదె వారిన్ 10
ఈడ్యపుఁ గావ్య సంచయము నెవ్వరు మెచ్చక యుందు రెంచఁగన్
విడ్యము వేయ నాలుకయు వింతగఁ బండదె యెట్టి వారికిన్
జాడ్యము రాఁగ నీయరె విచారము సేసి శుభంపు మందులం
గుడ్యము మీఁది వృశ్చికము కుట్టదె వారిని ముట్టి చూచినన్ 9
సాధ్యం బగునే దుష్టుల
మధ్య నొనర్చఁగ వణిక్కు మానుగ నయ వై
రుధ్యానృత దుర్వాణి
జ్యాధ్యాపక! వృత్తి కంటె నధమము గలదే 8
భూ పరివార మం దరయ మూర్ఖ జనాళియ నేడు మెండు సం
తాపద భాషణమ్ముల సతమ్ము సుతప్తులఁ జేయ శిష్యులే
పాప వికార కార్య కులపాంసన దైత్య పిశాచ సన్ని భా
ధ్యాపక వృత్తి కంటె నధమాధమ మైనది గల్గ దెద్దియున్ 7
బాల్ - రన్ - వికెట్ – విన్ :
రవి కెట్టు లకట మూరన్
ఛవి తెలియక యుండు బాల సదమల పదవిన్
భువి నుండ నీదు కోరిక
రవి నిభ నందనుని నిత్తు రాజీవాక్షీ 6
ఉత్తరుని వలె డంబములు పల్కుట, సూర్యుని వలె నడుగ రాని దడుగుట
యోగ్యమా మున్ముందు! యని యచ్చెరు వందు సందర్భము:
చిత్రపదము.
రాజకుమారుని డంబాల్
తేజ విహీనతఁ గోరన్
భోజనమా రవి కెట్టుల్
భాజనమే తగ భావిన్ 5
ఉత్కృష్ట కవి రచిత కవి
తోత్కరములు పెక్కు లుండ నుర్వీ నాథా
సత్కవి వర దేవాంకిత
సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్ 4
సత్కవి సంఘ కృత్యములు చాలవె కైకొన సంస్కృ తాంధ్ర వి
ద్యోత్కట దర్ప మానస మహోన్మదితమ్మును నిత్య గర్వ సం
పత్కర హీన కృత్యమును వ్యాకర ణాదిగ దోష సంయు తా
సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై 3
[సంయుత + అసత్కృతి]
అనయ వచన చయ దూరుఁడు
ఘనుండు విద్యా ధనుఁడు నిగర్వియు సుమహా
వినయుం డార్త నిచయ గో
వని తాలోలుండు వెలిఁగెఁ బండిత నుతుఁడై 2
[గోవు + అనిత + అలోలుఁడు; అనితము = పొందఁబడనిది;
అని తాలోలుఁడు = పొందఁబడని దానిపై నాసక్తి లేని వాఁడు; గోవు = దిక్కు]
ఘన దోర్దండ బలాతిరేక సుర గంగా సూనుఁ డార్యుండునౌ
ఘన శస్త్రాస్త్ర విశారదుండు జిత సంగ్రామారి సంహారి శాం
తనవుం డద్భుతపుం బ్రతిజ్ఞను జగత్ప్రఖ్యాతుఁడై ధీరుఁడై
వని తాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే 1
[వనితా + అలోలుఁడు = వని తాలోలుఁడు]