వడివడి జన సందోహము
విడివిడిగా నుత్సహించి వేగమ యెక్కన్
సుడు లడరు కడలిని నడరి
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్ 60
[తరణి = ఓడ]
గడగడ లాడు లోకములు గాఁకవెలుంగు సరోష చిత్తుఁడై
విడిచిన నిత్య కృత్య మగు విన్ను ప్రయాణము కేళి కేనియుం
దడఁబడ కుండ నెప్పటి విధమ్మున సప్త రథుండు వెల్గుచుం
బడమట, నుద్భవించి రవి ప్రాగ్దిశఁ, జేరఁగ సాగె ముందుకున్ 59
పరమ ముదకరములు బాల్యస్మృతులు కాల
మహిమ మేరి కెఱుక మరలి రా ద
యినను నేడు నిన్న యేఁ గోరుచుందు శై
శవమ! లేచి రమ్ము సంతసమున 58
హవనీయమ్ముల నీయఁ జాల నకటా యాచింపకే కాచితే
యవనీశుండగు నంబరీషు నల నే నర్చింతు నోరారఁగా
నవనార్థంబు సహస్రధార! స రణోద్యత్పాంచజన్యంబ! కే
శవమా! సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై 57
[కేశవము = విష్ణువునకు సంబంధించినది]
సూర్య చంద్రులు నిత్యము సొంపు మీఱ
వెల్గుచున్న నేమి ఫలము వెక్కసముగ
మునుపు వ్యాపించి యెల్లెడఁ, గనఁగ నిపుడు
దివ్వె వెలిఁగెడి గదిలోన, తిమిర ముండె 56
ఎవ్వరి కైన జ్ఞాన మను నింపగు దీపము చిత్త మందునన్
నివ్వటిలంగ సంతతము నిండుగ వెల్గును మోము వానికిన్
సవ్వడి సేయుచున్ జనులు సందునఁ జాగఁగఁ గాగడా యనన్
దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్ 55
[పాఠాంతరముగ నిక్కడ గది యన్న చిత్తమన్న యర్థము గ్రాహ్యము.]
హృద యానందము గూర్చును
సదమల పట్టణము చన విశాలతర మహా
సదనములను విగ తాయా
సదయుఁడు గంటం బడఁడు విశాఖ నగరిలోన్ 54
[ఆయాసము = ఉత్సాహము]
సమీప పట్ట ణేతర వాసి మనోగతము:
ధరణీ దేవులు వేదవాఙ్మయులు నిత్యంబుండ గానమ్ములన్
వర చేలాంచల మానినీ మణులు వే వామాక్షులం జూతుమే
గురు రోషావృత చంచలద్వపువు దుర్గోత్రుండు శోధించ నా
కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో 53
[నాకు +అరుణాత్ముండు]
"తట్ట - గుట్ట - చుట్ట - పుట్ట"
'స్వచ్ఛభారత్' లక్ష్యాల గురించి :
పుట్టవు పుర్వులు జనులం
గుట్టవు లోతట్టవటలు గాంచక పాఱుం
జెట్టులఁ బెంచుచు నట్టిలు
పట్టీ చుట్టడరి తుడువ వార్తం బలరున్ 52
తెమ్మనఁ దెచ్చిన పండిన
నిమ్మలు పుల్లనివి యేరి నేర్పున నేనే
సమ్మతి వేసితి రెంటిం
దొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ 51
కమ్మఁగ రెండు శబ్దములు గల్పఁగ సంధి యనం జెలంగులే
కమ్మని తెల్గు బాస నిల గారవ మొప్పఁగఁ జిత్ర రీతిలో
నమ్మరొ కల్ప నిప్పదికి నన్యము తొమ్మిది యట్టి సంధి పం
దొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే 50
[పది +తొమ్మిది = పందొమ్మిది; ఒకఁడు: ఇక్కడ తొమ్మిది యన్న పద మొకటి]
వర వాస్తు శాస్త్ర మరసిన
గురువు లనిరి యివ్విధమ్ము గూల్చుము దానిం
బర మది, తనరంగ నపా
గరళము, లభియించ దకట కత్తియు లేదే 49
[అపాక్ +అరళము = అపాగరళము; పడమటి తలుపు]
దురవస్థం గన దైవ కృత్య మనఁగాఁ దోచుం గదా లేనిచోఁ
దరులం ద్రెంచెద మన్న గొడ్డలియు విత్తం బీయ నప్రాప్తమే
బరులం గోరిన నెవ్వరీయ రిట గోవ్రాతమ్ము భక్షించఁగా
గరళమ్మింత లభించదే యకట ఖడ్గంబైనఁ జేఁజిక్కదే 48
[గరళము = గడ్డి మోపు]
మార్గములు వేఱయిన నేమి మతము లన్ని
యు నుడివెడు గమ్య మొక్కటె కనఁగ వసుధ
నే నెఱుఁగ కుంటి నీ మాట లెవ్వ రేల
పరమతమ్ముల దూషింపవలెను సతము 47
కర మరుదే కదా సురలఁ గాంచుట కాయము తోడ నేరికిన్
వరములఁ బొందఁ గోర నిల భక్తి విధేయత లుండగా వలెన్
గురు వగు నమ్మకమ్ము మదిఁ గూర్చును భక్తిని దైవ చింత నా
పర మత దూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్ 46
[చింతనా + అపర = చింత నాపర; మతము =అభిప్రాయము]
భక్ష్య రాశు లున్న కక్ష్యాంతరమ్మునఁ
ద్రాగ నీరు లేక వేఁగ వలదె
జగమున మనఁడు సుఖముగ మధుర వినిర్మ
లాప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద 45
కప్పము నందుఁ గల్గును సుఖమ్ముగ నించుక మేలు మిత్రమా
గొప్పకు కాదు నీకు నిలు కూర్మి వసించుటకే తలంచుమా
తప్పదు వేశ్మ మెల్లరకు ధాత్రినిఁ, గట్ట గృహమ్ము తప్ప వీ
యప్పులు, లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్ 44
దోసంబు లేమి యక్కట
చేసెనొ యీతం డనుచు నశేషంబు మదిన్
రోసంబు గల్గ, భర్తకు
మీసంబులు దెల్లనయ్యె, మీనాక్షి కహా 43
ఆ సాంబుండు దయారసార్ద్రహృది నిత్యారాధ్య దేవుండు కై
లాసోర్వీధర మందు న్యస్తములు భద్రప్రౌఢిఁ గల్మాషమే
యాసాంతంబును హర్షదమ్మగుచు, నీహారాద్రి లింగాకృతుల్
మీ సంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా, మీనాక్షికిన్ వింతగన్ 42
[సంబులు = శివ ప్రతిమలు; సంబుఁడు = శివుఁడు]
విప్పను గోపపు జాలియ
నొప్పొనరించ నవకాశ మొప్పును నాకే
యెప్పుడయిన నా మాటల
తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్ 41
తప్పునె యెక్కఁగా నిచట దప్పపు టక్కఱ లేని పీఠమున్
విప్పుచుఁ జిక్కు టర్థములు నిప్పుల కుప్పగ నుక్కఁ బెట్టగన్
ముప్పులు వొంద మిక్కుటము బొప్పుల కుక్కక తప్పకుండగం
దప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్ 40
అరుదె సుర సంచయమ్ములు
ధర న్దురవగాహము సుర తత్వ గ్రాహం
బరయ వచించెద వీ వే
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్ 39
నర లోకమ్మునఁ బుట్ట రక్షకుఁ డగున్ నారాయణుండే చుమీ
పరమేష్ఠ్యన్వయ భూత రావణుని దుర్వాజ్యాత్ము వీక్షించమే
సుర విద్వేషి హిరణ్య భుక్తిఁ గనమే చోద్యంబె దూరంబగుం
బర మాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్ 38
[పరము + ఆత్మార్చన = పరమాత్మార్చన; ఆత్మార్చన = ఆత్మస్తుతి]
తెలుపుమ భామామణి నీ
కలవడఁ జుట్టరిక మెట్లు కాంతలు నిలువన్
వలపట దాపట నటు నిటు
చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో 37
కలరే యిట్టి దయార్ద్ర చిత్తులు భువిం గాంతామణుల్ పూర్ణ కా
మలు పుణ్యౌఘ కృతార్థ జన్మలు సుసన్మానార్హ లెందైననుం
దెలియన్నేరము నీదు సేవలు గనన్ దేదీప్యమానంబుగాఁ
జెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో 36
చెల్లఁగ నొళ్ళలయంగా
నొల్లక త్రుళ్ళుచుఁ గడింది యుబ్బెడు వాఁడే
కల్లరి తలంచు నెప్పుడు
నిల్లరికమ్మేఁగ దోష మెట్లగు జగతిన్ 35
అల్లుఁడు శీత శృంగికి ననంగ విరోధుఁడు భూతరాట్టు దోః
పల్లవ యుగ్మ మం దునిచి పన్నుగ ఝర్ఝర శూల రాజముల్
చల్లని గంగ నెత్తి నిడి చంద్రునితో శివుఁ డేఁగఁ గొండకే
యిల్లరికంపు టల్లుఁడుగ నేఁగుట యెట్లగు దోష మిద్ధరన్ 34
కట్టా కార్యము లెల్లయు
వట్టాయెనె యింతవట్టు పట్టెన్ గ్రహమే
దట్టపు మంచెల్లెడలను
బుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో 33
వరదము శ్రీనివాస వర పాదము తచ్ఛరణేతరమ్ముఁ గో
ర రిఁక హిరణ్య లోచన హిరణ్య మహౌదన జన్మ మందు సా
గరములు భూతలమ్ము లవి కంపము సెందె స శైల సాలముల్
పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో 32
ఉఱుములు మెఱపులు సెలంగ నూఁగఁ తరులు
భేకము లఱవఁ ద్రుటి నేల వేఁడి తొలఁగ
నెమ్మి నొసఁగుచు జనులకు నిష్పలంపు
మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె 31
మోఘము లెట్లగున్ దివిని మూగిన మబ్బుల విక్రమమ్ములే
యా ఘన రాశి తోఁచ దట నక్కజ మౌచు నమాంత మంత నై
దాఘము నందు భాస్వరము దారుణ రీతిఁ జెలంగు చుండగన్
మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే 30
పారావార పరీవృత
భార ఖగవతీ తల ప్రభాసిత యా గా
గార కృత పుణ్యతమ పశు
మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్ 29
ధారుణి జన్మ మాత్రమున దారుణ పాపులు గారు లోకులే
వారని లోభ మోహ మద వైర రు షేషణ దుర్గుణాలి నాఁ
గారణ కార్య కాయములు గాంచుచు భూజన దౌష్ట్య చింతనా
మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్ 28
భస్మ హస్త దైత్యుఁ డడరి పడఁగ వెంట
దాఁగ వేగ పరుగున నుదకము నందు
నుండ నసురు కంటఁ బడఁగ నుదరి యంచు
హంపి విడిచి పాఱెను విరూపాక్షుఁ డడలి 27
[అంచు+ ఊహు+అంపి = అం చు హంపి; అంపి నీళ్ళు]
చెంపల్ నల్లఁగ మార మో మడలఁ గాశీక్షేత్ర నిర్వాసుఁడై
యంపన్ ధాత దయా విహీనుఁ డయి కాయం బందు దుర్వారపుం
గంపం బారఁగఁ దొఱ్ఱఁ దూఱ శని శంకా చిత్త సంరంభియై
హంపీ క్షేత్రము వీడి పాఱెను విరూపాక్షుండు భీతాత్ముఁడై 26
శ్రవణానందము నీయఁగఁ
జవు లూరఁగఁ బాడు చుండ సంగీతంపుం
జవు లెఱుఁగని పూరుషుఁ డో
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్ 25
భువి రాజ త్కవిసార్వభౌముఁడు సుధీ పూర్ణుండు ప్రఖ్యాత స
త్కవి యా డిండిమభట్టు ఢక్కఁ ద్రుటి వ్రక్కల్ సేయ విఖ్యాతుఁడున్
ఛవిమత్కంకణ హస్త భాసితుఁడు శ్రీనాథుండు దక్కంగ దోః
కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్ 24
[దోః కవి = చేతులకు కళ్ళెములు కలవాఁడు]
ఆ కారండవ కలహం
సాకంపిత కోకనద న లాకర వారిన్
రాకా నిశీధి జల భే
కాకర! తీఁగలకు నల్లకలువలు పూసెన్ 23
[జల భేక +ఆకర = జలభేకాకర;
జలమునకు,కప్పలకు నాకరమైన సరస్సు]
కలువలు నీకు నెఱ్ఱనివి కావలె నంచు తలంచి తీ వయో
కలువలు పూసె నల్లనివి, కా కర, తీఁగలకున్ భళీ భళీ
మలగఁకు మయ్య నిస్పృహత మంచివి గాంచెద మిచ్చ టచ్చటం
గొలఁకుల నీవు చిత్తమునఁ గోరెడు కోకనదమ్ము లింపుగన్ 22
[కాకు + అర = కాకర; సగ మవకు, చిన్నఁబోకు]
లక్స్మీదేవి పతి విసర్జన పాపము కలి కాలమున
వికసించి వేంకటనాథుని ప్రసాదించిన దన్న భావము.
కోప మూని తపసి ఘోరముగా వక్ష
మందు విష్ణుఁ దన్నె నక్కజముగ
మాత లక్ష్మి చనెను మౌని భృగువు దన్న
మార్గశీర్షమందు మాఘ మలరె 21
[మార్గశీర్షము = మార్గశిరము మాసముగా కలది, సంవత్సరము;
మా +అఘము =మాఘము; లక్ష్మీ దేవి పాపము]
మాఘము నందు మున్పు దమి మాటల వేడితి నేఁడు దారిలో
శ్లాఘము సేయ మిత్రవరుఁ జక్కఁగ నీయఁగ నర్థ గుంభ నా
మోఘము కావ్య రాజము నపూర్వము నా కట మాస మేమనన్
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్ 20
[మాఘము = మాఘుని కావ్యము, మార్గ శిరము = దారి చివర]
అవి యివి యేల ననంగ సు
కవీంద్ర నిర్జర వరేణ్య కాయమ్మున కెం
చ వర బృహస్పతిని వదలి
కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్ 19
[కవి = శుక్రుఁడు; పురస్కృతుఁడు = ముందు నుంచఁ బడిన వాఁడు]
సన్మానమునకు నోచుకొనని యొక కవి మనోభావము:
భువి వీక్షించమె సర్వ వేదచయ సంపూర్ణార్థ విద్వాంసులన్
సవి చెప్పంగ విరోధులం చకట తాత్సారంపుఁ జిత్తమ్ము నుం
చి విచారించక పండితబ్రువుని, నాక్షేపించి సంభావ్య స
త్కవివర్యుం, బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్ 18
చేతులాడ వెందు దాతయే తా నను
వ్రాతల కవి ననును బూతు లుండు
మనసు వెన్న యనును మాట సాయము సున్న
మాట తీపి కాలకూట మెడఁద 17
పచ్చఁగ నుంటఁ గాంచి కడుపారఁగఁ దింటను జూచి కన్నులే
పుచ్చఁగ మ్రుచ్చిలం దలఁచి పొచ్చెపు బుద్ధి వహించి చెప్పఁగా
నెచ్చెలి నంచు వచ్చి తగ నిచ్చలు నచ్చపు టిచ్చకమ్ములే
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే 16
చేయ శతాధిక దూఱులు
మా యత్త కొడుక మన దరమా శిశుపాలా
యీ యవని ననుచుఁ జక్రము,
వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్ 15
[చక్రము = సహస్రధారము]
మాయాజాలమయుండు వృత్రు నిఁకఁ దున్మాడంగ నున్మాదియై
యాయాసమ్మునఁ బూర్వదిక్పతి సహస్రాక్షుండు ధాతాది గా
నా యాదిత్యుల విష్ణు వింద్రుఁ డన విఖ్యాతుండు మున్యంగ మా
వేయంచుల్ గల కైదువుం గొని మహా విష్ణుండు రేఁగెన్ వడిన్ 14
[ఆయాసము = ఉత్సాహము]
వార లయోధ్యా పట్టణ
పౌరు లనఁగఁ జెల్లుఁ గాక పద్మదళాక్షుం
దీరుగ నేర్పడఁ జెప్పవె
శ్రీరాముని రోసి రెల్ల రే పల్లె జనుల్ 13
[ఎల్లరు + ఏ పల్లె జనుల్]
ఆ రామామణి కోరఁ బంక్తిరథుఁ డబ్బా యంచు నేలం బడన్
గారాబంబు నొకింత సూపకయు నా కాకుత్స్థు వేధించెనే
ఘోరారణ్యము లక్ష్మ ణావని సుతల్ గూడంగఁ దా నేఁగఁగన్
శ్రీరామున్ జనులెల్ల రోసిరి కదా రే పల్లె లోఁ జూడఁగన్ 12
[రేపు +అల్లె = రేపల్లె; రేపు= ప్రాతఃకాలము; అల్లె = ఎల్ల, సరిహద్దు;
రోసిరి = వెదకిరి ]
విత్తములు భూము లేలయ విద్య యున్నఁ
జాలు విశ్వ మందు వెలుంగ మేలు గల్గుఁ
జేతలఁ దలఁపు ల నుడులఁ బ్రీతిగఁ జెఱు
పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె 11
[చెఱుపు + ఆపి = చెఱుపాపి]
నయగారంపు మునీంద్ర వాక్కులను సన్మానించి యింకెట్టి బూ
మియలం జేయక కాఁగఁ దా జనని వల్మీకంబు సత్కావ్య సం
చయ కర్తృత్వ నిమిత్తతన్ హృదయ సంసద్దేవ సచ్చింత నా
నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్ 10
[చింతనా + అనయదూరుండు = చింత నానయదూరుండు]
కారణము లెన్ని చెప్పిన
గారవ మతిశయిలఁ బద నికాయము తోడం
బూరుష వరేణ్యునకునుం
బూరణఁ జేయంగఁ బలుకుఁ, బోఁడికిఁ దరమే 9
సార ధరా సతీపతి విశాల చతుర్భువ నాధినేతృ మా
యా రమణీ సురూప ధరణైక విలోల వినీల దేహ స
త్సారస లోచ నాక్షధర శార్ఙ్గధ రాంచిత వర్ణనీయ స
త్పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే 8
పుస్తక గోపుర మ్మొసఁగు భూరి మనోభ్యుదయమ్ము గాంచగం
బుస్తక మిచ్చు నమ్రతను బుస్తక మంద చరిత్రఁ గాంతుమే
పుస్తక గుప్తముల్ శ్రుతులు పుస్తక మాకర మయ్య విద్యకుం
బుస్తక మౌ సరస్వతియ పుస్తక మల్పమె నోము పంటయే 7
పుస్తకము లొసంగు భూరి విజ్ఞాన మా
స్తరము కవి వరులకు వర మకుటము
కలుగఁ జేయు వృద్ధి బలము సంఘము నందు
ముఱిపెముగ జనులకుఁ బుస్తకమ్ము 6
అట్టట్టహాసముగ ము
న్నట్టడవిని రెక్క లుండ నభమున మఱియున్
బెట్టిదముగ నేల పయిన
గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్ 5
ఖగములు బారులై యెగురు గాడుపుతండ్రి పథమ్ము నందు నీ
మృగములు సంచరించుఁ దమి మేదిని మీద విలాస మొప్పఁగన్
నగములఁ గంటిరే నడువ నా నన నవ్వ తరీష యుగ్మ మ
న్నగములు వార్ధిలో గునగునా నడచెన్ గడు సుందరమ్ముగన్ 4
[ప్లుతోచ్చారణముతో గునగునా]
సర్వామర గణ గురువు న
ఖర్వ జ్ఞాని వికసిత ముఖ బృహస్పతి యా
గీర్వాణుఁడు ఛాత్రీ కృత
చార్వాకుం డాస్తికుండు సద్భక్తుఁడె పో 3
సర్వత్రాతను నిల్పి చిత్తమున సత్సంగంబు సేకూరఁగా
నుర్వీ దేవులు దైత్య సంచయముచే నున్మూలముం బొందరే
గర్వం బొప్ప ననాదరమ్ముగ సువిఖ్యాతాగ్ర జన్ముండు నా
చార్వాకుం డను మౌని యాస్తికుఁడుగా సద్భక్తుఁడై యొప్పెఁ బో 2
[అను = అనును]
హరి భూషణ చంద్రకళా
విరాజి తోమాధవ! పరివేష్టిత వసుధా
ధర తన యాసిత కేశ వ
ర రమణ్యచ్యుత నిరంతర నుతా ప్రణతుల్ 1