ప్రకృతి ధర్మ మెంచి నడచు పద్మజాండ
మక్కజమ్ముగను నరులు దక్క సత్వ
రమ్ము భూ చరాచర విళయమ్ముఁ గోర
నరుల కొప్పును ప్రకృతి వినాశనంబు 60
సుకరము సేయ జీవనము సూరి జనావళి మార్గ మూని హిం
సకు నతి దూర ముండి యనిశమ్ము మెలంగ శుభం బగున్ ధరం
దికమక యేలఁ బ్రాణములు తీయక దుర్మతి చిత్త దౌష్ట్యపుం
బ్రకృతి వినాశనంబె కడు పావన కార్యము మానవాళికిన్ 59
కరి ముఖారవింద కమనీయ రూప వి
లాస విఘ్న భగ్న రాజ కార్య
రతుని కరము గాంచి ప్రవర సామ్యంబెంచి
యేన్గు చంప నోప దెలుక నైన 58
వానలు రాఁగఁ దూఱి వడిఁ బంటల మెక్కుచు నాశ బెంచఁగా
మేనును బందికొక్కులను మించి చరించెడి, విశ్వమేఖ లా
హీన బిలమ్ములం దుఱుకు నిట్టె తొలంగెడి చిట్టి యెల్క లం
దేనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్ 57
[ఏనుఁగు = పెద్దది]
ధారుణి మానవ సేవయె
యా రాముని సేవ యంచు నటఁ బేదలకుం
దోరమ్ము పంచఁగా నం
బారునఁ గూర్చున్నవాఁడె భక్తవరుఁ డగున్ 56
[అంబారునన్ = ధాన్య రాశితో]
మూరఁగ భక్తి చిత్తమునఁ బూజలు సేయ సదార నింపుగా
నారిన శ్వేత వస్త్రముల నచ్యుత నామ సహస్ర కీర్తనం
దీరుగ నొక్కటం బఱచి తెచ్చిన శుద్ధపు శంబరాజినం
బారునఁ గూరుచున్న వర భక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్ 55
[శంబరాజినంబు + ఆరున = శంబరాజినం బారున: జింక తోలు; ఆరునన్ = రోమాళిపై]
చూచు టన్యుఁల దనవలె సుఖము దుఃఖ
మును గనుట యొక్క రీతిని ననువు గాను
బ్రాణులఁ బరమాత్మఁ గనుట పక్షపాత
మెగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు 54
అడరఁగ సద్గుణమ్ములు సమంచిత యుక్తి పరాజయమ్మునన్
విడువక ధైర్య మెన్నఁడును వీడక కర్మము లందు యత్నముం
దడఁబడ కుండ నాపదల ధారుణి జీవన మందు నాకలిన్
విడుచుటె యెగ్గు సిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్ 53
[జీవన మందు: ఎగ్గు; ఆకలిన్: సిగ్గు]
ఉక్కవు పుణ్యాఘమ్ములు
దక్కవు భాగ్యనిచయములు దైవ కటాక్షం
బెక్కుడు లే కన నిజమే
యెక్కడిదీ మేధ సుంత యెఱుఁగఁడు శాస్త్రాల్ 52
అక్కజ మాయె నెల్లరకు నల్లుఁడు సన్నుత పండితుండునై
చక్కఁగఁ దిర్గి రాఁ బురికి శైల సుతా కరుణా రసార్ర్ద్ర స
ద్దృక్కులఁ గాళిదాస కవి దేవి యనుగ్రహ పాత్రుఁ డయ్యెనే
యెక్కడి మేధ పొత్తముల నెన్నఁడుఁ జూడని వాని కివ్విధిన్ 51
అష్టి ఛందము, నూతన కల్పిత వృత్తము,
పేరు: కామేశ వృత్తము.
పర్వము నందు నిజ జనకు వస్తువు కొఱకై
ఖర్వము నెంచక నెడఁదను గర్వ మడరఁ దాఁ
జేర్వకు దూఱుచు వడివడిఁ జేరి పలికినన్
దుర్వినయమ్మునను మనసు దోఁచెదరు హితుల్ 50
[పర్వము = పరువము; చేర్వ = చేరువ]
ప్రాసేతరముగ:
కుము లన్నేరరు గద కఠి
నముగాఁ బల్కినను నందన వచనములకుం
గొమరులు దుర్విన యమ్మున
ను మనసు దోఁచెదరు హితు లనువుగ నిరతమున్ 49
పర్వము నంద కాక ఘన బాధలు దుఃఖము లందుఁ దోడుగన్
సర్వుల వెంట నుండి తగు సాయము చేయుచు నూఱడించి తా
రుర్వి సుపర్వ పండిత నరోత్తమ మండలి కుండ కెన్నఁడున్
దుర్వినయమ్ముతో, మనసు దోఁచెడువారు హితైషులే కదా 48
తాప తమో హారి వితత
పాప గణ వినాశ కార్త భక్తావళి దుః
ఖాపహరణ సువిరా డ్రూ
పాపము దక్కు జనులకు శివస్తుతిఁ జేయన్ 47
[ విరాడ్రూప +ఆపము; విరాడ్రూపునిచేఁ బొందఁ దగినది]
ప్రాపు నొసంగె దేహమున పార్వతి కేనిక చర్మ మూనె ది
వ్యాపగ కిచ్చె మూర్ధతల వాసము చంద్రున కిచ్చె మౌళినే
తాపము లెల్లఁ బాసి నిరతమ్మును బుణ్యము, ధాత్రి క్షీణమై
పాపమె, దక్కు నెల్లెడ శివస్తుతిఁ జేసిన భక్తకోటికిన్ 46
వీరులు రణ దుర్జయు లరి
వీర భయంకరుల పాండు విభ్వంగజ చ
త్వారము జయద్రథుఁ డణచె
వారిజపత్రమ్ము సోఁకి వజ్రము చీలెన్ ! 45
తోరణముల్ నివేశమునఁ దోరము లుండ కరమ్ము లందు నీ
వారిజ నేత్రఁ గూడి గురు భక్తియు శ్రద్ధయు మానసమ్మునన్
వారక వజ్ర ధారిని వినాయకుఁ గొల్వఁగఁ బత్ర పూజలన్
వారిజ పత్రమే, తగిలి వజ్రము, రెండుగఁ జీలెఁ జిత్రమే ? 44
సీతా దేవి రాక్షస స్త్రీల మాటలు విను నప్పటి మనోగతము:
వెఱ్ఱు లకట యీ యసురులు తుఱ్ఱు మంచుఁ
బోవు నసువులు రాఁగ రాముండు వేయ
నస్త్రములు వీరు నేరక యందు రిట్లు
నభయ మొసఁగి ప్రోచును రావణాసురుండు 43
నభమున దేవ సంఘము ఘనమ్ముగ దీవన లీయ మిత్ర స
న్నిభములు జంతు రాశు లని నిత్యము భూజన పూజ్య కణ్వ ఋ
ష్యభయ వనమ్ము నందుఁ బల లాశన శాక మృగాళి కిమ్ముగా
నభయము నిచ్చి ప్రోచెడి మహాత్ములు రావణ కుంభకర్ణులే 42
[రావణము = పెద్దగా నఱచునది, సింహము;
కుంభకర్ణుఁడు = పెద్ద చెవులు కలవాఁడు, గజరాజు]
మేలుగ నాటఁ బుడమి బీ
జాలు తరు లొసంగు భావిఁ జారు ఫలమ్ముల్
మేలి తపమ్ముల నరులకుఁ
గాలాతీతమునఁ గలుఁగుఁ గద సత్ఫలముల్ 41
చాలఁడు సేయఁ గార్యములు శార్ఙ్గినిఁ దల్చుట తక్క నెవ్వియుం
బోలఁడు పూరుషాన్యులకు మూఢపు భక్తుని కవ్వ తక్కఁ దాఁ
దోలఁడు వాహనమ్ములు మధుద్విషు యాన వరమ్ము దక్క నీ
కాలము మించిపోయినను గాంచును మందుఁడు సత్ఫలమ్ములన్ 40
ఉదక మగ్ని గాలి పుడమి చదలు గృహము
వాహనం బాయుధము జర వ్యాధి యాప
ద లన నిది యది యన నేమి ధరను గాంచ
మిత్తికిన్ ముఖద్వార మమీరుపేట 39
విలయుండౌ నకటా నివాసమున నిర్భీతుండునై యుండఁ గాఁ
గలలో నైనఁ దలంచ నట్టి పగిదిం గావం బడుం గారణం
బిలలోఁ జావున కా శివాజ్ఞయె సుమీ యిభ్భంగి నేనెన్నఁడుం
దలఁపన్ మిత్తి కమీరుపేటయె ముఖద్వారంబు ముమ్మాటికిన్ 38
[తలఁపన్ = తలఁపను]
అంఘ్రి విచేతన దుష్పల
లంఘ్రాతృ సురా విచలిత లయ రాహిత్యా
నంఘ్రి నరాభంబై దు
ష్టాంఘ్రిద్వంద్వమ్ము లేని యాఁడది యాడెన్ 37
[దుష్పలలం ఘ్రాతృ: చెడ్డ మాంసమును వాసన చూచువాఁడు;
అలుక్సమాసము]
సాంఘ్రి ప్రాణులు హీన పాదతతులున్ క్ష్మాంతస్థ దుర్వార గూ
ఢాంఘ్రి ద్యోతిత వృక్ష సంచయము భూమ్యాకాశ సంప్రాప్త బ
హ్వంఘ్రి ప్రాభవ జీవరాశులును ఘోరాభేద్య జాడ్యాది దో
షాంఘ్రిద్వంద్వము లేని భామ వెస నాట్యంబాడెఁ జిత్రమ్ముగన్ 36
త్రాగ నీరు లేక బ్రతుకు వేఁగు చుండ
వట్టి మాట లయ్యెను రాదు కట్ట యొకటి
దట్టముగ నానకట్టలు కట్ట మంటి
వాన లెన్నియో కురిసెఁ బిపాస పోదు 35
[అంటివి +ఆనలు = అంటి వానలు; ఆన = ఆజ్ఞ]
దండిత శాత్రవుండు నిజ దార రతుండును సత్యసంధుఁ డా
చండ పరాక్రముండు రఘు చంద్రుఁడు రాముని దైత్యభండ నో
ద్దండుని యక్ష యాక్షర వితాన సమంచిత కీర్తనమ్ములన్
దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో 34
విద్రావితమ్ము సేయును
గా ద్రవ్యాపేక్ష నెల్లఁ గమనీయముగా
భద్రపు నిజ చిత్తంబను,
భద్రగిరీశుం డొసఁగును భక్తులకుఁ, జెఱన్ 33
ఛిద్రిత కాద్రవేయ గుణశీల ఖగేశ్వర యాన భక్త! సా
ముద్రిక రత్నభూషణ విమోహ సరాగ మనో౽భిలాషుఁడా
రౌద్ర గిరీశ భవ్య విమల ప్రమ దాయతనమ్ము నాఁగ నో
భద్ర! గిరీశునిం గొలుచు భక్తులకుం జెఱసాల దక్కురా 32
[సాముద్రిక = సముద్రునకు సంబంధించిన; రౌద్ర = రుద్రునకు సంబంధించిన]
చిన్మయస్వరూపునిఁ గృష్ణుఁ జిత్త మందు
నిల్పి పంచేంద్రి యాలోల నిరతి వెల్గి
సదసదర్థ నిష్ఠా గరిష్ఠతమ యోగ
కాంతను వలచి యోగిగా గణుతి కెక్కె 31
[పంచేంద్రియ + అలోల నిరతి]
సంతోషార్త ముఖ ద్వయావళుల నిస్సంగుండు సందిగ్ధ వి
భ్రాంతిక్షీణ నరుండు సద్గుణ సు సంపన్నుండు నజ్ఞాన హృ
ద్ధ్వాంతఘ్నుండు సుధీ జనోత్కర సు సంభావ్యుండు నిక్కంబుగాఁ
గాం తాలోలుఁడు యోగిగా గణుతికెక్కన్ సాత్త్వికుల్ మెచ్చిరే 30
[కాంతా +అలోలుఁడు = కాంతాలోలుఁడు ]
అప్సరస లెంచ నింపుగ నమ్మ లౌదు
రయ్య రాజ మున్యాదుల కవనిఁ గాంచ
నాదరం బొప్పఁ జెప్పఁగ నత్త యగును
గాధిసుతునకు మేనక కన్నతల్లి 29
కాల గతస్మృతుల్ దలఁచఁగా విదితం బగు నిశ్చయమ్ముగా
నాలియె చంద్ర వంశజున కమ్మయు నా భరతాఖ్య నేతకున్
లీలగ నా శకుంతల కులీనకు, బద్మదళాక్షి కూతురే
మేలుగ గాధి సూనునకు, మేనక తల్లి యగున్ నిజంబుగన్ 28
నిషిద్ధాక్షరము - స కారము:
నిజపాల నాంచిత నిర్వివాద ప్రజా రంజక శుద్ధ భారతము జగతిఁ
బృథివీప వర గణ వృత రాజ్య మాకాంక్షణీయము మా కిఁక నెమ్మి నుండ
వలజామ రాదిగ వర్ణచతుష్టయమ్ము విరాజిల కరము పుడమి లోన
వరకృషి విజ్ఞాన వర్తక వైద్య విద్యా వైభవమ్ముల నలర భృశము
కావ్య చిత్కళా నర్తన గాన నాట్య
విద్య లలరంగ నిరతము హృద్యముగను
జంద్రయాన భోగ మడరఁ జారుతరము
దేశ కోటి ఘనము నాదు దేశ మెంచ 27
రివ్వున నచ్చట హాస్యపు
సవ్వడి నివ్వటిలఁగ విరసంబై త్రుటిలో
నవ్వ వికటించి నవ్వుల
పువ్వులలో జ్వాల లెగసి బొబ్బలు పుట్టెన్ 26
ఎల్లలు మీఱి పెద్దలని యించుక నెంచక ప్రేలు చుండగాఁ
బెల్లున నిప్పు మిన్కు లవి వెల్లువలై మది నాట నిత్యముం
గల్లరి ఘోర కృత్యములు గాంచిన నాదు మనో వనమ్మునన్
మల్లెలలోన రేఁగినవి మంటలు బొబ్బలు పుట్టె నయ్యయో 25
ఏమర కీవును మఱి మా
మామకు మామ యగు వాని మాన్యుఁ గొలువుమా
యో మగువా విను నే మీ
మామకె మామగను నిల్చు మాన్యునిఁ గొలుతున్ 24
భామ జనించి లక్ష్మి సిత వారిధిఁ గూరిమిఁ బెండ్లియాడె నా
కామిత దాయి విస్ణువు సకౌస్తుభ రత్న లసద్రమా పరం
ధామ పదోద్భ వాపగకు ధాత్రి సముద్రుఁడు భర్త యయ్యెనే
మామకె మామగా నిలిచి మాన్యతఁ గన్న ఘనున్ స్తుతించెదన్ 23
నుతవర కృపా పరీ తా
తత గరి మామల మనో వితత బాహు దురా
గత శిక్షిత కాక జనక
సుతా సు సేవిత రఘువరు స్తుతియింతు మదిన్ 22
బుగ్గ మీద భామ మోదమే గీఱినఁ
జుఱ్ఱు మనును వాడి సూది గ్రుచ్చి
నట్లు దోమ కుట్ట నందుకే నే నంటి
భామ కంటెఁ జిన్నదోమ మిన్న 21
ప్రేమ దోమ యనంగఁ బోకుమ వెఱ్ఱివాఁడవు కాకుమా
భామ దోచును విత్త మించుక వార వారము ప్రేమతో
దోమ తీయును బ్రాణ వాయువు దుర్భరమ్ముగఁ గుట్టుచున్
భామకంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడఁగన్ 20
[ఇక్కడ భామ యన నాడ నేస్తము)
ఉర్వి నొసఁగు ధనము నుత్సాహమే కష్ట
పడ్డఁ గల్గు గౌరవమ్ము కరము
పనులు సేయఁ జూపు బద్దకమున రాదు
కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము 19
చలచల మండు టెండలును సాగర భంగ దురాక్రమమ్ములున్
వలయములై నిరంతరము వారని భూజన కోట్యగమ్యముల్
కలుగక యీతి బాధలు దలంపుల దౌష్ట్యము మేన రోగపుం
గలిమి దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్ 18
కలుషాత్ములు దురహంకా
రులు పాపోన్ముఖులు గురు విరుద్ధుల కిల ని
ష్ఫల మౌను దదుక్త గుణో
ల్లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్ 17
బాలా యేలఁ దలంకు చిత్తమునఁ గొల్వం జాలరే ధాత్రిఁ గ
న్యాలావణ్యలు పూరుషోత్తములు పుణ్యస్త్రీలు వైధవ్యలుం
జాలుం జాలును గట్టిపెట్టు మిఁక వాచాలత్వ మీ మాటనన్
స్త్రీ లెవ్వారలు? భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్ 16
ఆతత విభూతి విలసిత
భూతాత్మ భుజంగ సద్విభూష శిరస్సం
పాత విరాజిత గంగా
మాతను దన పతిగఁ గొని యుమాసతి మురిసెన్ 15
శ్వేత తనూ విరాజిత సుభీకర లోచన చంద్రమౌళి సం
వీత గజాంబరద్యుతి సభృంగి వృషార్చిత హర్ష చిత్తు నా
భూత నికాయ నేతృ ఫణి భూషణ భాసిత బాహుమద్జగ
న్మా తను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను గార్తికేయునిన్ 14
[జగన్మా తను= జగన్మాతను గూడిన తనువు గలవాఁడు]
వేడుక గా నింక మనము
నీడంగఁగ జున్నుపాల నిటు నటుఁ దాఁ దా
రాడఁగ వేదన ధేనుక
మూడేఁడుల పిల్ల కొక్క పుత్రుఁడు గలిఁగెన్ 13
వ్రీడా నమ్ర ముఖారవిందము చలద్విస్ఫార నేత్రమ్ములం
గ్రీడా సక్త వయః ప్రభా యుత లసద్కీరాభ సల్లాపయై
యాడం బాడను జూచు చుండగను బ్రాయం బెంచ యుగ్మంపు ము
మ్మూడేఁడుల్ గల పిల్ల గర్భవతియై పుత్రుం గనెం బ్రీతిమై 12
ఎల్లర కింపుగ నెడదం
దల్లడ ముండక సుఖమ్మునఁ దనర నాలుం
దల్లియు బిడ్డలు నట ని
ష్కల్లోలము సాగుటొప్పు కాశ్మీరమునన్ 11
త్వల్లీలోద్భవ సప్తయుగ్మ సుమహా బ్రహ్మాండ మందుం బ్రభూ
సల్లాపోత్సుక నక్ర కూర్మ తిమి సత్సంధాన మోహాచ్ఛర
త్తల్లోలోదక వాయు సంచలిత విద్ధధ్వాన విస్తారపుం
గల్లోలమ్ము నిరంతరాయ మగుతన్ గాశ్మీర దేశమ్మునన్ 10
[కాశ్ +మీర =కాశ్మీర ; ప్రకాశవంతమైన కడలి; కాశ్ = ప్రకాశము;
మీరము = సముద్రము]
ఉన్నఁ బుట్టువు మృత్యువు నుండు ననఁగ
లోక బంధము తీరఁగ రోగమునకు
లొంగి సుఖనిద్రఁ జేరఁగ నంగ సంగ
కష్టములు దీరఁ గన్నీరు గార్చి రడలి 9
వృష్టి విధమ్ము భాగ్యములు వెల్లువ లై ప్రవహించునే వినా
పృష్టము పుణ్య మున్న నన విత్తము దేవ నికాయ కల్పితా
దృష్టము లింక స్పష్టమగ, దెప్పలుగన్ భువి నుండి పోవ వీ
కష్టము లెల్లఁ, దీరెనని కార్చిరి కంటను నీరు భీతితోన్ 8
కులము మతము లంచుఁ గొంచె మైనను భేద
ముంచ కుండ గుణము లెంచి పంచు
నంచి తంపు నుడులు వంచక జన కల
కలము విడిచి మేటి కవిగ వెలిఁగె 7
పల కలనా సురాది రస పాన విరక్తుఁడు దైవ భక్తుఁడున్
సలలిత శబ్ద భావ విల సత్కవితా ప్రియ మానసుండు ని
ర్మల రచనా ధురంధరుఁడు మానవతీ లలి తాంగ వర్ణ పు
ష్కలముఁ ద్యజించి మేటి కవిగా యశమందె నొకండు ధాత్రిపై 6
భువి దారుణముల నెత్తి వి
రివిగ నిరంతర మతండు లీలా రీతిన్,
వివరమ్ములు వలదుర నీ
కవి, నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్ 5
[ నీకు + అవి = నీ కవి]
అవనీ సంభవ జంతు సంచయ విరో ధాస్వాంత విత్తార్థ ధి
క్భవబంధేషణ దుష్ట శక్తిగణ సేవా లోక మాత్సర్య భై
రవ కార్యాచరణాభిలాష యుత దుర్దాంతాఘ హృన్నిర్దయా
కవి నాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడై 4
[కవి = కళ్ళెము]
కుండపోత వర్ష మనంగఁ గురియ దకట
యెండ మండు నంచు ననంగఁ గుండపోత
వాన రాక పోకల నది కాన లేదు
కల్లలే చెప్పుచుండు నాకాశవాణి 3
దీనవ్రాత విధేయ భూత ఖర నిర్దేశవ్రజ వ్యాప్తమై
నీనా భేదము సేయు దేశజనమున్ నిర్వీర్యమే నిత్యమున్
గానశ్రేణి సపాన వశ్య గురు చీత్కారమ్ములన్ నిల్తురే
యౌనౌఁ గల్లలె చెప్పు నందురు గదా యా కాశ వాణిన్ జనుల్ 2
[కాశము = ఒకానొక దేశము]

ఇందిందిర సందో హా
నం దామం దారవింద నందన వన తు
ల్యేందిర గృహ సందర్శతఁ
నం దామం దారవింద నందన వన తు
ల్యేందిర గృహ సందర్శతఁ
దొందరపడి కైత పిట్ట తుఱ్ఱున నెగిరెన్ 1