అతి దుర్లభమ్ము సుమ్మీ
సతులకుఁ గాన్పగుట నే డశస్త్ర మ్మెలమిన్
సతి కెట్టి శస్త్రముల, రఘు
పతి, సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్ 61
విత తానుగ్రహ దత్త దేవగణ సంప్రీతాత్మ నిర్దోషియై
సత తాచార పరాయ ణైక సుమహాసాధ్వీ లలా మాంబయే
త్రితయం బైన కుమార పూర్వమునఁ గుంతీ దేవియే స్వీయపుం
బతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై 60
సదమల చిత్తులు సున్నిత
హృదయులు సన్నుత చరితులు నెల్ల రహో సం
విద గాన సుధా పాన
మ్మది రా పానరతులు గద మాచర్ల జనుల్ 59
చదువుల్ నేరని మూఢచిత్త నరు లజ్ఞానాంధ సంతప్తు లా
హ! దివం బెల్ల జరా రుజా మరణ దాహక్లేశ సంఘాతముల్
మది భావించుచు దీని తేనియ వడిం బాపంగఁ బాత్రంబు నా
మదిరాపాన విశేష మత్తులు గదా మా చర్ల వాసుల్ సదా 58
[చఱుల = చర్ల; చఱి = కొండ చఱియ]
దోర పండ పండ్లు తుష్టిగ భుజియించు
పండ కున్న నుండు పండు వఱకు
శారికా విహంగ కీర కలుషితమ్ము
పండు మంచిది తినఁ బనికిరాదు 57
దండిగ నారగించు ఫల దండము లింపుగ దేహ వృద్ధికై
దండము లయ్య విప్రకుల ధర్మము భూసుర వర్య! తామ్ర చూ
డాండము శాక భోజనుల మయ్య నిషిద్ధము వీడు మౌర రాం
పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్ 56
[రాంపండు +అది = రాంపం డది]
చీన మనెడు దేశమ్మునఁ దాను జనన
మంది వేగఁ బర్వఁగ గాలి చందమునను
జన భయంకరము నిటఁ గాంచె నొక క్రిమిని
నవ్య వత్సర మిదె కరోనా యనంగ 55
అవివేక మ్మగు ని ట్లనాదరపు వాక్యం బూనఁ జిత్తమ్ములో
నవమానించ మనం బెటుల్ దనరె నయ్యా నూత నాబ్దమ్మునే
యవనిన్ శార్వరి నామ వర్షమును విన్యాసంబుగా నివ్విధిన్
నవ వాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ 54
ఉగ్ర సంగరమున నాపె నుగ్రుఁ డౌచు
నొక్క దివసమ్ము చెలరేఁగి యక్కజముగ
సింధుపతి భీమసేనాది సింహబలులఁ
గుసుమ పత్రంబు ఛేదించెఁ గొండ నౌర 53
బీమ బలాఢ్య దేశ తతి భీతిలఁ జేసె సమౌనరాగ కే
ళీ మనుజాంతక ప్రగతి రేఁగుచు విశ్వము నెల్లఁ జంపునా
యేమి కరోనకుక్షికృమి హీన తరాన్య మృదూపజీవియే
కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే 52
[కర +ఊన కుక్షి కృమి = కరోన కుక్షి కృమి = చేతులు లేని పొట్టగల క్రిమి]
విద్వత్సభలో నోటమి పాలయిన పండితుల పరిస్థితి:
ముష్టిపీడనమ్ము, మూర్ధంగత నఖ చా
లనము, కలవరమ్ము, కనికరమ్మ,
దిఙ్నిరీక్షణ, వినతిమతి, మౌనవ్రతం
బారె, శరణమయ్యెఁ బండితులకు 51
[ఆరె = ముగిసినవి; కనికరమ్మే శరణ మయ్యె]
ఆరయ మెన్నఁ డివ్విధి మహా భయ దాయక సంకటమ్ములన్
వీరవిహార లీల నల విశ్వము నెల్లయు దుష్టకీట దు
ర్నైరృతుఁ డేల నొంటరి తనంబిల జీవనయాత్రలో, సుఖం
బారె, శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్ 50
వికలము కాఁగ నుపాయము
లకటా దీపమ్ము లన్ని యార నొక ద్రుటిన్
వికృతంపు రూప మడరన్
సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్ 49
[శార్వరి = రాత్రి]
ప్రకటిత శుద్ధ వత్సరము బాంధవ మిత్రజ నోఘ చిత్త మో
ద కర మనోర థాది వర దాయక సౌఖ్య విహార మగ్నతన్
సకల బుధవ్రజాలి మనసార నుతించ వినా సుధీ మన
స్సకల జనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ 48
కంస సాంగత్యముతోఁ బూత నాదులకు మోక్షము :
హృత్ఫేన కలుష హరమై
తత్ఫణి తల్ప కర పంచతా భాగ్యమహో
తత్ఫల మెంచఁగ నాహా
సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్ 47
అడరం గాంచమె పాండవేయులకు నాహా కృష్ణ సాంగత్యముం
బుడమిం గాంచమె ధార్తరాష్ట్రునకునుం బో కర్ణ సాంగత్యమే
బడయన్ సజ్జన దర్శనమ్ముఁ గడు దుష్ప్రాప్తిన్ విసర్జించఁగాఁ,
గడు లాభంబగుఁ గాదె, నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్ 46
ప్రభవిల్లు నరుం డాలుఁ గొ
ని భాసురం బాకులంపు నిజరిపు చయమున్
సభ కత్తిరస్కృత ధరా
విభులన్ దూరమ్ము సేసి వింటి బలమునన్ 45
ఎందేనియుఁ గలదే యిది
మందాత్మా సుంత దల్చుమా చిత్తమునం
గందోయి మూసి భక్తిన్
వందే మాతర మనుటయె పాపమ్మగురా? 44
ఒక ముత్తవ్వ మునిమనుమనితో:
సందేహమ్మది యేల నీ కకట వీసంబైన సత్యంబ క
న్విందై వెల్గ నలంకరించి వసు కాంతిన్ విగ్రహార్థమ్ము వీ
టం దోయమ్ము లొసంగుటం బరమ మూఢాచార సంయుక్తమే,
వందే భారత! మా తర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్ 43
[భాః రత = భారత; సూర్యు నారాధించు వాఁడా; మా తరమ్ము = మా యొక్క తరము ]
నవ్వులు మాయం బైనవి
యవ్వదనమ్మునఁ గడు బరు వయి దుస్సహమై
యవ్వగ నిండ హృదయమున,
దివ్వె వెలుంగు గదిలోనఁ, దిమిరము నిండెన్ 42
దవ్వుల నున్న దీప మిటు ధైర్యము నూని భయమ్ము వీడి వే
నొవ్వక తెమ్ము మిత్రమ వినోదము సూచెద వేల యిత్తరిన్
రివ్వున వీచ గాలి విపరీతము, నాఱె గదయ్య సక్కఁగా
దివ్వె వెలుంగు చుండిన, గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్ 41
చోర భయము లేదు రుజల నేర రేరు
మూడు వానలు నెల లోన మూరి కురిసె
నచ్చెరుపడ నేల నల హర్షాబ్ధి మునిఁగి
రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు! 40
రాముఁడు క్షాత్రధర్మ జన రక్షక కార్య నిమగ్న చిత్తుఁడే
యేమఱ కుండ నుండి వని నేచి సదార సలక్ష్మణుండునై
యా ముని కాయ బాధకులు నాసుర వీరులు, దండకావనిన్
వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ, రాముఁ డేలఁగన్ 39
దండిత శాత్రవ శూరుఁడు
గండరగండఁడు నరుం డకట కల్మష కం
ఠుం డగు శంకరు పాలిట
గాండీవోద్గత శరప్రకాండము తృణమే 38
గాండీవ మ్మన నీ వెఱుంగ వకటా కాకుత్స్థ హస్తేద్ధ కో
దండాభ మ్మగు సంగరమ్మున వడిన్ దండించ దుష్టాలి ను
ద్దండాగ్న్యాభము వీరులెవ్వరికి వ్యర్థం బౌనె? సంధించఁగా
గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే? 37
పవలున్ రేయియుఁ బలుమా
ర్లు వచ్చు ముచ్చటలకై సరోజదళాక్షా
వివరం బిమ్మిఁక నీ కీ,
కవితా! కన్యక యనుజయొ? కాక గృహిణియో? 36
[గృహిణియో = చూడ వచ్చిన యొక గృహిణియో]
అవనీ క్షేత్రము నందు వింతలకు వింతా యేమి వీక్షించఁగన్
సవతుల్ రారె తలంచ సీతకును నాశ్చర్యంబు నీ కేల మీ
కు వయోభేదము గాంచ సందియము నాకుం గల్గెఁ జిత్తమ్మునం
గవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో 35
[కవితాకన్యక = కవిత యను కన్య; ఆడపడుచు = కూతురు]
ఆడపడు చన్న మన్నన
కీడు దలఁప దేరికి మృదు గిరలె పలుకు నీ
కోడలు గుణవతి యమ్మరొ
కోడలి వైపుంటి ననుచుఁ గోపింపకుమా 34
పాడుచు నుంటిఁ గీర్తనలు భామరొ మిత్త్రులఁ గూడి యిచ్చటం
బాడిగ వింటి నీ వగు సుభాషణముల్ దమి నాకు నెవ్వడుం
దేఁ డిట నమ్ము నా పలుకు దిక్కులు సూచుచు నానుకున్న నా
కో డలి వైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా 33
[కోడు + అలి =కోడలి; కోడు = మంచపుఁ గోడు; అలి = మద్యము]
తా గర్వాంధ యయి ధరన్
వేగ మనికి దారి తీసె ద్వేషియె చేసెం
దా గారడమ్ము కా దట
నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా 32
బాగరి బ్రహ్మనాయిఁడు దివమ్మున కేఁగెను గోత్ర సంగ రా
వేగ రయమ్మునన్ వెలమ వీరుఁడు సర్వ కులైక మాన్యుఁడే
యే గతి నచ్చ నట్టిదియు, నియ్యది సత్యమ నేను నంటినే,
నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్ 31
[కాదె = కాదు]
అజరామరమౌ కథలను
ద్యజించి దుష్టాత్మ భూప తతుల చరితలన్
భజియించ వింత యేలగుఁ
బ్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్ 30
సుజన సమాహితంపు సభఁ జోద్యము మీఱ జనాంతరంగ మో
ద జనక భార తాగమ సుధారస మొల్కుచు నుండఁగా మనో
రుజ లవి విక్రమించఁగ విరోధి నిరక్షర బుద్ధిహీన దు
ష్ప్రజలు తిరస్కరించి రిదె పద్యకవిత్వము నన్నిరీతులన్ 29
హాస్య మొలికించుఁ జదువంగ నట్టి కృతులు
మత్స్య కన్య మెచ్చునె పరిమళము సోఁక
నచ్చెరు వగు నీ విట్లన నచ్చతెలుఁగు
పద్యమున నాంగ్లపదములె హృద్యములగు 28
అచ్చపు టాంగ్ల మందు మఱి యాంధ్ర పదమ్ముల వారు మెత్తురే
నిచ్చలు గౌరవం బగు ననేక పదమ్ములు భాష నుండవే
మెచ్చరు పండితోత్తములు మేదిని మార్చుమ శోభఁ జెర్చె నీ
యచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చు రా 27
[రా = రమ్ము]
అత్యంత చింతనీయము
స్తుత్యము కాదు సుజనులకు దుశ్చరితునితో
సత్యము స్నేహము, మఱచిన
ప్రత్యుపకారమ్ము, సలుపఁ బాపము దక్కున్ 26
నిత్యము ధర్మసూక్ష్మములు నేలఁ బరంగును వాటి నెన్నుచుం
గృత్యము లెల్ల వారికినిఁ గీ డని యెంచఁ గరమ్ము దోషమే
ప్రత్యుపకార మేరికినిఁ బాడియ చేయుట ధర్మ దూష్యపుం
బ్రత్యుపకారమున్ జలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్ 25
ఆఁకొన్న వారి కింపుగ
నేకాలము నందు నైన నిష్టం బగునే
యా కొత్తిమిరియుఁ గఱివేఁ
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ 24
శాకాహారపు భోజనమ్ములఁ బలాశవ్రాత విఖ్యాతమున్
సాకారమ్మొనరించఁ బాకమున విధ్యాధిక్య వీక్షించుమా
వాకాటుల్ దగ మాని పెద్దలగు నవ్వారిన్ మదిం దల్చ వేఁ
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్ 23
[దల్చవు + ఏఁపు +ఆకుల్ = దల్చ వేఁ పాకుల్; ఏఁపు = బాధ]
మనుషు లందుత్తముండునై తనరు చుండ
ధనవిహీనుం డయిన నేమి యనవరతము
త్యాగనిరతుండు దీన దయాగుణంపుఁ
బూతు మాటలు శ్రీకరమ్ములు బుధులకు 22
[పూతుఁడు = పవిత్రుఁడు]
వీఁక మరల్చ వచ్చుగద భీతి వహించక కాలు జాఱినం
గాఁకను నోరు జాఱ మఱి కాలుని కైన మరల్ప శక్యమే
నీకును నాకు వాచ్యముల నిత్యము వీడిన, నెట్టివారికిన్
శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద, బూతుమాటలే 21
ఇంద్ర సారథి మాతలి భాషణము:
నలినజ వర సంపన్నుఁడు నలినజ కుల
శేఖరుం డవనిజ శాప శిక్షితుండు
నలిన జాస్త్రేతరమ్మున నరవరేణ్య
రావణుని సంహరించుట రామ! తగునె? 20
వాలి మరణ సమయపు సంతాపము:
అకటా నా యనుజన్ము దుశ్చరిత రాజ్యార్థంపు టుత్సాహ మీ
సకలోర్వీధరగాము లెల్లరకు విజ్ఞాతంబ రఘ్వన్వయా
వికటాత్ముండనె నన్నునీ వడిగినన్ వేగంబ తెత్తుం గదా
యకటా రావణు, నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై 19
వేళావేళ లెఱిఁగి యా
వేళయె దాటిన నరుండు వీతోత్సాహా
ప్తాళి గత నిజగృహుండై
హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్ 18
వేళౌచిత్యము నెంచ వ్యాకుల మహా వీచీ నిధిం గూలి పా
తాళాభాంబక ఘోర పావన శిఖాధారోష్ణ సంతప్తు నా
నాళీకాస్త్రు నదేహుఁ జేయ నకటా నాగేద్ధ హారుం డహో
హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా 17
[పాతాళము = బడబాగ్ని]
ముఖ మగు నిఁక వివర్ణము మునుఁగ దుఃఖ
మందు హర్షమ చిత్త సౌఖ్యకరి సుమ్ము
దుఃఖసాగర తాపము దున్ముమ యవ
తలయె, లేనట్టి నరుని నేత్రములు సొబగు 16
అలయం డాతఁడు సాధనమ్మునను నిత్యైశ్వర్య సంభావ్యుఁడే
యిల విద్యాధన సద్గుణవ్రజుఁడు ప్రాణే శానురక్తుండునున్
నలినాభాక్షి మనోహరాంగి మహదానందప్ర దారాళ కుం
తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ 15
కనమీ సౌందర్య మహో
మును పెన్నఁడు దేవకన్యఁ బోలిన దీనిన్
వనజాక్షిం గదిసెడు లో
తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ 14
[లోతు + అనువు = లో తనువు; గంభీరపు టుపాయము]
తరలము.
తను వహో మఱి కంప మొంద లతా వితాన లతాంత కా
నన విహారము సల్పఁగా లలనా యుతమ్ముగఁ గాంచఁ గా
లున కశక్యము కౌముదీ నిశలోనఁ జంద్రుఁడు రాఁ ద్రయీ
తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్ 13
[త్రయీతనువు = సూర్యబింబము]
అనవరత స్వార్థాలో
చనా రత నృపులు సెలంగ సాధారణులౌ
జనుల కకట, దేశమ్మున
ధనధాన్యము లెన్ని యున్న, దారిద్ర్యమ్మే 12
వినుమా నా వచనమ్ము లింపుగ నిఁకన్ విత్తార్థివై యిజ్జగ
మ్మున నన్యంపుఁ బురమ్ము వే చనుము సద్బుద్ధిన్ సభార్యాసుతుల్
పునరాలోచన మేలఁ జుట్ట మయినం బో నిర్దయా లోభికిన్
ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్ 11
శాంత గుణాశ్రిత చిత్త ని
రంతర దానగుణ శీల రాజిత లా సీ
మంతినుల సదమల మతుల
సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్ 10
సంతుష్టాత్మలు రాణు లింపుగను గౌసల్యాది కాంతామణుల్
వింతన్ నల్వుర నంద నోత్తముల సంప్రీతిం గనన్ సత్కృపా
స్వాంతద్యుమ్నుఁడు ఋశ్యశృంగ మునియే భామాన్వ యేక్ష్వాకు స
త్సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై 9
అదితి వేఁడె నిట్టు లరవింద లోచన
వాసుదేవ విహగ వాహనా ము
కుంద కృష్ణ వరద ఘోర నరక దైత్యు
గుండె యాగినపుడె పండుగ యగు 8
నిండఁ దలంపు చిత్తమున నిత్యము కాల కరోగ్ర సంచల
ద్దండ విఘాత హీనమయి తామరసాంబక విష్ణు నామ స
న్మండిత పారవశ్యమున మానవ భక్త వరాళి కెల్ల నీ
గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ 7
పనులు వీడి చేయఁ దలంచి భాషణములు
గడప దాటని మగువలు ఘనత గాంత్రు
భార్య కింపుగఁ జెప్పక భద్ర మెంచి
గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు 6
మాన్యతరంపు జీవనము మంచి దనమ్మును మించి పంచుచున్
వైన్యుని రీతి రాజు లిటఁ బాలన మింపుగఁ జేయు చుండఁగా
నన్య ధనాపహార వని తాశలు నాదిగఁ బాపచింత లన్,
ధన్యుఁడు పూజ్యుఁడున్, గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్ 5
సక లాశలు దద్దరిలఁగ
నొక యుఱు ముఱిమెను వనమున నొక్క ద్రుటి నహో
సకిలించె గుఱ్ఱము పిపీ
లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్ 4
వికలము సేయ నెంచి కడు వెఱ్ఱి దనమ్మున నుత్సహించి మ
త్త కరి కదంబ మారసి కుతంత్రము వెల్గ మనమ్ము నందుఁ దాఁ
జకచక నేఁగి నిల్చె నట సామజ శాలకుఁ గుట్టగం బిపీ
లిక వడిఁ, దుమ్మె నేనుఁగులు, లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్ 3

కుదురుగ మనస్సు నందిడి
చెదరని భక్తి నిరతమ్ము సేసిన నా శే
షుఁ దలంచి పూజ విను పా
ముది పుణ్యపు మూలమగుచు మోద మొసంగున్ 2
పదుగురు నొక్కచోటఁ బరిపాటిగఁ జిత్తము నందుఁ దల్చుచున్
ముదముగఁ జక్రధారి పద పుష్పయుగమ్ము వహించ భక్తితో
సదమల నిర్జరాకలన సక్త మహోత్సవ రా డకాలకౌ
ముది యొక పుణ్యమూలముగ మోద మొసంగును మాటిమాటికిన్ 1
[అకాలకౌముది = ఉత్సవ విశేషము]