కడఁగి రఘురామ సన్నిభుఁ
డొడయుఁ డొకం డిటఁ జదువుల నూఱక నీయం
గడు దిట్ట పంపు నిడ రా
బడు లన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్ 60
పడఁతులు పూరుషోత్తములు పన్నుగ నింటను జిక్కియుండఁగా
నడలుచు వింత జీవికిని నాత్రము చిత్తము నందు రేఁగఁగన్
గడుసరి పిల్ల యల్లరిది గంతుల కంత మెఱుంగ నంచు నీ
బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్ 59
అడరుచు మొఱుఁగుచు శునకము
వడి వడి మా పైకి దూకఁ బర్వులు వెట్టం
దడయక యుంచి తలు పనెడు
గడి యారము సిగ్గుపడును గమనము నాపున్ 58
(గడి = ఎల్ల; ఆరము = నశించము]
అలపులు గల్గు జీవులకు నారయ లోకము నందు నెల్లెడం
గలుగునె జంత్ర మండలికిఁ గార్య నికాయము లందు నెన్నఁడున్
సొలయదు యంత్ర కర్ణ మది చొప్పడ కున్న నిరోధ తప్తమై
యలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా 57
విగ తాపత్రపఁ జిత్తా
పగత శ మాబ్జ నయనలకుఁ బంతము మీఱన్
మగువలకుం జెలరేఁగుఁ గ
సిగరె ట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్ 56
[కసిగరె = కోపముగరె (బళిరె వలె); ట్ = నిస్పృహకు
ధ్వన్యనుకరణము; శ్రేయము గూర్చున్: నిందార్థమున ]
తగు సౌహార్దము కాల చోదిత ఘనత్రాసమ్ము లింతింత మూఁ
గఁగఁ గేశావన దీప్తసుప్రణయ శృంగారమ్ము లందందుఁ దోఁ
చు గతిన్ మస్తక మందు నారఁ దడి వే చుట్టంగఁ బోరాడఁగన్
సిగ రెట్టున్ సిగ పట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్ 55
[సిగ రెట్టున్ = సిగకు కట్టుకొను ముతక బట్టయు; రెట్టు = ముతుకబట్ట]
అక్కుంతీ సుతుఁ డర్జును
చిక్కులు దీర్చఁగ మురారి చిక్కిన రీతిం
జక్కని మిత్రుఁడు, తీర్చఁగఁ
బెక్కు సమస్యలు, గలుగుట పెన్నిధియె కదా 54
చిక్కులు కల్గ మిక్కుటము సిక్కక చింతల నిబ్బరమ్ముగా
నుక్కు లయమ్ము గాక పరమోన్నత యుక్త వివేక మంద వీ
లెక్కుడు కల్గఁ బాత్ర మగు నేరికి నిద్ధర వింత కాదులే
పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై 53
ఏపార దర్పము సని మ
హీపుఁడు గద్దియకుఁ దూలి యెరియన్ సభలోఁ
గోపా టోపమ్ము లడరఁ
బాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్ 52
పొసగం జూతుమె స్వచ్ఛ భారతము నంభోజాక్షుఁ డేతెంచినం
బసి చందంబునఁ బౌర ధర్మ నిరతిం బాటించ నేర్వం డహో
యిసు మంతైనను సిగ్గు సెందక విసర్జించెన్ నశించంగఁ దా
వెస పాపాత్ముఁడు విట్టు, బా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్ 51
[పసి = గోగణము; తావు +ఎస = తా వెస; ఎస = అధికము; విట్టు = మలము]
అడవి కేఁగ నేల నరయంగ వీటిని
జంతు శాల కేల సనుదు చెపుమ
పల్లె పల్లె లందుఁ బన్నుగ నుండవె
యెలుక పాము నెమలి యెద్దు కపులు 50
లలిత మనస్కులై ధర మెలంగఁగ నోపుఁ బరోపకారులై
కలుష విదూరులై నిజము గాంచఁగ మానవు లౌదు రిద్ధరం
బలువురు నిమ్న దత్తములు బాములు తీరఁగఁ గర్మ పక్వమై
యెలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రముం గపుల్ 49
తాఁక సమర్థులె వీరలు
వీఁక నెదిర్చి నృపరాజి వీక్షించుమ నీ
వా కన్యను లోకై కా
స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్ 48
[లోకైక + అస్త్రీ = లోకై కాస్త్రీ; అస్త్రి = ధనుర్ధరుఁడు ]
నాక నివాసు లైన మఱి నాతినిఁ గైకొని సంతసింతురే
ప్రాకట వంశ జాతుఁడవు భామిని నేల వరించ నొల్లవో
యూఁకొని మిత్రమా తివిరి యుత్తమురా లగు, మాతృమూర్తి కా
స్త్రీ కడు ధన్యతం గనుము, స్త్రీని వరించి వివాహమాడినన్ 47
[ స్త్రీ కడు ధన్యతం గనుము = స్త్రీ యొక్క మిక్కిలి ధన్యతను జూడు]
మూర్ఖ జనుఁ డౌను జూపిన
మూర్ఖత్వమ్ము నతఁ డగునుబో తమ్ముండే
మూర్ఖ నృప సతికి ననకుఁడి
మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్ 46
[శకారుఁడు = రాజుంచుకున్న దాని తమ్ముఁడు;
పోలునె = పోలును గదా]
కార్ఖలు లెల్ల దానవులు గాడుపుదిండులఁ జంప నెంచుచుం
బోర్ఖగ రాజ పుంగవుల మూర్ఖపు జీవు లనంగ వచ్చునే
నీర్ఖర మౌనె హీనముగ నిందిత మేరికి నైనఁ గావునన్
మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్ 45
[కారు ఖలులు = కార్ఖలులు; పోరు ఖగరాజ = పోర్ఖగ రాజ; నీరు ఖరము =
నీర్ఖరము; శకారుఁడు = జనులను భయ పెట్టువాఁడు (తప్పు చేసిన)]
ఎప్పు డెయ్యది యేరికి ముప్పు తెచ్చు
నెవ్విధిని నెచ్చట నెఱుంగు నవ్విధాత
మాయదారి కీట మ్మిట మత్సరించఁ
గన్నవారినిఁ దల్లియే కాటికంపె 44
వింతలు గావు దేవతల భీకర కృత్యము లెంచ భావి భూ
శాంతికిఁ గారణమ్ము లగుఁ జాలదు మానవ మేధ నేర్వఁగన్
శంతన పుత్ర సప్త వసు సంఘముఁ దీర్చఁ బ్రతిజ్ఞ గంగ తా
నంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్ 43
అంగరంగ వైభ వాతిశయమ్మున
నంగ విలసనమ్ము నారయంగ
రంగ నంగ జాభు రంగునఁ బసిడిఁ దూఁ
గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె 42
తుంగ తరంగ భృంగ గణ దుస్సహ రంగ దశేష కేశ స
త్సంగ హృషంతరంగ స్మర సంగ మనో విరహాంగనా మణిన్
గంగను శంతనుండు గని కంజదళాంబక లోలనేత్ర యా
గంగ, వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్ 41
[ఆగంగ = ఆగఁగ]
భవభయ దురితౌఘ లతా
లవిత్ర భక్తజనకోటి రక్షక కృష్ణుం
డవలీల నెత్త గిరి శై
శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్ 40
అవియఁగ విశ్వరూపుఁ డటు లాగ్రహ ముప్పతిలంగఁ ద్వష్ట దే
వ వర గణాధినాథు పయిఁ బంతము నూని సృజించ దైత్యునే
వివృత శరీర కాంతులను వృత్రుని శస్త్ర వరాస్త్ర పాట వా
శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకఁగన్ 39
[పాటవ +ఆశవ = పాటవాశవ; ఆశవము = వడి]
భూమిసు రావాసమ్ములు
భామా రత్న ద్వితీయ వసుధేశునకున్
ధీమద్వానప్రస్థ వి
రామునికి వనంబులుండ రాజ్యంబేలా 38
తామరచూలి చెయ్వులను దాటఁగ శక్యమె యేరి కైననున్
సోమ నిభాస్య నేఁ గననిచో నిఁక నేఁగుమ నీవు లక్ష్మణా
ధామము కాన నాపహృత దార విచార కబంధ మగ్నుఁడీ
రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్ 37
ఎఱ్ఱఁగఁ బండ వలెఁ జుమీ
గిఱ్ఱునఁ దే తములపాకు క్రిందం గలదా
యఱ్ఱనఁ బొడవున మించును
మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ! 36
[మఱ్ఱాకును +అ = మఱ్ఱాకున ; మఱ్ఱాకునే; అఱ్ఱ = పెట్టె యఱ]
కనకభ్రాజిత కుండలా సరస శృంగారోజ్జ్వ లాస్యా సఖీ
నినదప్రస్ఫుట కింకిణీ గురుకుచా నీరేజ పత్రేక్షణా
వనజాస్యా మద మత్త నాగ గమనాభా పెట్టుమా సున్నమున్
మనసాయెన్ గద భామినీ! తినుటకై, మఱ్ఱా కునన్, వీడ్యమున్ 35
అంకమున నిల్పుదురు ని
శ్శంకను దారల నితరు లసమనేత్రుం డా
వంక నునుచంగ దేవిని
శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్ 34
వరసంజాతుఁడు రామ భక్తవరుఁడున్ వజ్రాంగ దుర్భేద్యుడుం
దరుణీ రత్నవిమార్గ ణాచలిత విద్యానైపు ణోద్భాసియున్
స్థిర సంకల్పుఁడు వాయు నందనుఁడు సందీప్తావతారమ్మునం
బరమేశుండగు, శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్ 33
[శూలి = శూలము నూనిన వాఁడు (లంకలో)]
కాల ముత్తరింప నగునె కంజునకును
గరుణ యొకయింత నేరక కాలు భటులు
కర్మపరిపక్వ మైన దుఃఖమ్మువొందఁ
దండ్రి కూఁతుండ్రు, చంపిరి తల్లి నయ్యొ 32
కన విన నేర నట్టి విధిఁ గాంతునిఁ బుత్రిని సేవ లందు ముం
చినఁ గడుఁ బ్రీతి నిత్యము సుశీల చెలంగ భృశంపు టార్తియే
నెన రది మీఱ ముంచి యనునిత్యము వాగభిమాన వార్ధిలోఁ
దనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్ 31
[నెనరు =కృతజ్ఞత; చంపిరి యన నుక్కిరిబిక్కిరి చేసిరని భావము]
కుంతీ సుత మధ్యము రథ
మెంతయు ధీరత నలంకరించ రణమునన్
వింత ద్రుపద రాజాత్మజ
యింతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్ 30
వైవస్వత మనువు తనూజ యిలాదేవి చరిత్ర నిచట ననుసంధానము సేసికొన వలెను.
ఒకనెల స్త్రీగ నొక్క నెల నొందఁగఁ బుంస్త్వము వింతఁ, బుట్టి తా
సకి యిల పూరుషుండు నయి సద్గురుఁ డైన వసిష్ఠ భూమిదే
వు కృపను, దిర్గి భామ యయి పుణ్య పురూరవుఁ బుత్రుఁ గన్న యా
సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను బూర్వపుణ్యమై 29
అన్వయము; యిల పూరుషుండు నయి సద్గురుఁ డైన వసిష్ఠ భూమిదేవు కృపను,
దిర్గి భామ యయి (కుమార వనమున నడుగిడుట వలన) పుణ్య పురూరవుఁ బుత్రుఁ గన్న...
కృష్ణా తీర నివాసులు
వైష్ణవులే యిరువురుం గవలు సావిత్రీ
కృష్ణు లొక తల్లి బిడ్డలు
కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్ 28
వేళాకోళము లెల్లఁ బాపి వ్రజమున్ వీక్షించుచున్ నిత్యముం
గాలాతీతుఁడు వాసుదేవుఁ డకటా కాంతా విలోలుండు నా
లీలారూపుఁడు గోపకాంతల రసక్రీడావిశేషమ్ములం
గేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్ 27
[వేళాకోళములు = చిక్కులు; సావిత్రి = యమునా నది; నవ్వెనఁట యా
కృష్ణుండు సావిత్రితోన్ = యమునా నదితోఁ గలిసి కృష్ణుఁడు నవ్వెనఁట]
హరి నారీమణి రూపం
బరయం గోరి మదనాస్త్ర బాధితుఁ డగుచున్
వర మోహినీ కరాబ్జ న
ఖర హతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్ 26
[నఖరము =గోరు; కాలుఁడు = శివుఁడు]
కరివర చర్మధారి విషకంఠుఁడు భర్గుఁడు భస్మదేహుఁడున్
హరహర నామ పూజితుఁడు హంతృ భయార్దిత రక్షణక్రియా
పరుఁడు మృకండు సూను పరిపాలన సక్త మనస్క చంద్ర శే
ఖర హతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్ 25
అవి, దుష్ట రాజ తతి కృత
వివి ధాకృత్యముల నాప విలసిల్లెడు స
త్కవి తతి ముఖేరిత వచన
కవి తతికిన్ సామ్యతయె, మృగములకుఁ గలిగెన్ 24
[కవి = కవి, కళ్లెము; అవి = ఆ కళ్ళెములు]
కవి మృగముల్ విచార మది కల్గఁ గవిత్వ గళస్రవద్ధ్వనుల్
కవి మృగముల్ ముదమ్ము మదిఁ గల్గఁ గవిత్వ గళస్రవద్ధ్వనుల్
కవి మృగముల్ వరాసన సుఖస్థిర సానుల నుండి చేయఁగాఁ
గవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్ 23
పాడిగ మన సున్న మొఱకు
నీడ యనఁగఁ జెలఁగి తనకు నిత్యంబుండం
దోడుగ మానవ రూపపు
గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్ 22
వాఁడు కరమ్ము సుందరుఁడు భద్రము సేకురు జీవితమ్మునం
దోడుగ నుండఁ బెండ్లి యయి తోరము సౌఖ్యము లబ్బు నంచునున్
వాఁడిగఁ దల్చు చివ్విధిని వానిని, నుండఁగ నొప్పిదంపుఁ బ్రో
గాడి దనున్ వరించి, యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా 21
[ప్రోగు +ఆడి = ప్రోగాడి; ఆడి= బాతు; తనున్ = తన్ను ; ఆడబాతు తన్ను
వరించి యుండఁగఁ దాను సుందరునిఁ బెండ్లి యాడె నని భావము]
కల్ల కాదు వినవె తెల్లని పిల్లలు
కల్లు పాక చెంత నుల్ల మలర
నల్ల నల్లఁ దిరుగు నల్ల రంగున నున్న
పిల్లికి జనియించె నల్లకోఁతి! 20
[నల్లకోతి = నల్లని వాఁడా]
కల్లల కెల్ల ఘోర కలికాలము మూలము వింత వింతగం
దల్లి గుణంబు రాదు మఱి తండ్రి వివేకమురాదు సుంతయుం
బిల్లల కక్కటా కనమె విశ్రుత సూరికిఁ బుట్టు మూర్ఖుఁడే
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా 19
చూతము రండి వినోదము
ప్రీతిని జగతిఁ బరికించి వేడుక మగదౌ
బాతును నుంచ సరసి వా
రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా 18
[వారు +ఆతి = వారాతి; ఆతి = ఒక జాతి బాతు]
భూతల రక్షణార్థము నభోధవు నానతి నుత్సహించి తా
నాతత పుష్ప బాణముల నక్షరుఁ గ్రుచ్చ మనోజ బాణ సం
పాత సుతప్త శంభురత పార్వతి వేఁడఁగ మత్స్యలాంఛ నా
రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్ 17
ఎవ్వ రేమి సెప్పినను జోటివ్వఁ డకట
సంధికి సుయోధనుం డిట నంధుఁడై ని
కృష్ట చారిత్ర దుష్ట చతుష్టయ చయ,
మూడు మూడు మూడును మూడు, గూడె నిచట 16
[చయము+ఊడుము+ఊడుము+ఊడును = నిచయ మూడు మూడు మూడును; ఊడుము =పాఱుము; ఊడును = రాలును; ఊడును మూడు =ప్రాణ మాన ధనములు మూడు రాలును]
గమనిక: మూడులో నర్ధానుస్వార మిడిన: మూఁడు మూఁడు మూఁడును మూఁడు = నిస్సంశయముగా ముగియును.
ఏడవ యేడునన్ దినము లేడులు పాడిఁగఁ గూడ వేడుకల్
వాఁడును వీఁడు వీఁడు మఱి వాఁడును వీఁడును జూచుచుండఁగా
వాడుక వాడి వాడి పరిపాటిగ వీడక ద్వాదశమ్ములే
మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్ 15
సద్దయ మీ కుల జన్యము
నద్దామోదరుఁడు గొనియె నంగన మనగం
బెద్దవె నీ విలఁ జుమ్మీ
గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో 14
గంభీరస్వన భీక రోద్ధత మహా కంఠీరవం బుండఁగా
నంభారావము పిక్కటిల్ల దిశలం దాఁబోతు లుండంగ సం
రంభావేశములం జెలంగి వని వ్యాఘ్రం బుండ గర్జించుచున్
స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్ద వైనా వటే 13
చలమున నీయఁగ దుష్కర
కలుష ప్రాసను వినోద ఘాత మనంగం
గలతం జెందెడు వీనినిఁ,
గలఁగిరి, యష్టావధానిఁ గని జనులు సభన్ 12
కుహనా చర్యయె పండితోత్తములు నుద్ఘోషింతు దౌర్భాగ్యమే
సహ పీఠమ్మ లలంకరించి రిట నీశా వీని మించంగ లే
రిహ లోకమ్మునఁ బండితబ్రువులు గాలించంగ సత్యమ్ముగా
నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్ 11
వీనుల విందుగఁ జెప్పఁగ
నాన లిడి వరు గుణగణము లానందముగన్
లోన ననుమాన మెల్లయు,
మానిని పెండ్లికి ధరించె, మాసిన, చీరన్ 10
[చీర = పెండ్లి చీర]
సేసలు చల్లు కాలమునఁ జిన్నది యాత్రము మిక్కుటమ్ముగా
భాసిలు చుండఁ జిత్తమునఁ బర్వులు వెట్టుచు వింతగొల్పుచుం
గాసెకుఁ జాల నట్టి నును కాంతుల వెల్గెడు పట్టుబట్టనే
మా సిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్ 9
[మా సిన = మా చిన్న; మేమిచ్చిన చిన్న చీర ]
మృదువచన మోహనాకార హృదయ రాణి
నన్ను దా నిష్టపడు చున్న దన్న మాట
నచిర కాలమ్ముననె వినఁగఁ జెవులారఁ,
బలుకు రాదయ్యె, నా కాశ, వాణి నోట 8
[నాకు +ఆశ = నా కాశ]
అయ్యో వింతగ నారి పోయె నట నాత్మానంద మయ్యన్నకుం
దియ్యంబోఁడిని సాగనంపఁ దమినిం దేరున్ వడిం దోలుచున్
సయ్యాటించుచుఁ జెల్లి బావలను గంసక్రూరు చిత్తమ్ము దా
నయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిం గనన్ 7
[కనన్ = తెలియఁగా]
ఏకతమ్మునఁ బ్రజ నుంచి సోఁక నీక
క్రిమిని వైద్య మందించుచుఁ గేవలమ్ము
ధైర్యము వహించి మాన్య ప్రధాన మంత్రి
పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు 6
[కరోనా నరులు = కరోనా సోఁకిన నరులు; కేవలము = సమస్తము]
ఏ నాఁడైన నెఱుంగ నేరని దహో యిక్కీటకం బీ ధరన్
నానాదేశ విహార మానవ మహా నాశంకరం బైననుం
దా నీ నా డిట నైకమత్యమును సంధానించి సత్యంబుగా
నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చఁగన్ 5
అన్నదమ్ముల పెండ్లిండ్లు కన్ను లదర
మేళ తాళధ్వనులు మించ మిథిల జరుగ
గ్రీవదశకుండు వీరుండు రావణుండు
రాఁడు, పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు 4
రాముని సీతనున్ నిలిపి రంజిల భక్తి మనమ్ము లందు నీ
భూమి జనుల్ నుతించఁ గడు పుణ్యము వెండిళు లేల నిత్యమున్
గోముగ సీతతో మిథిల గోత్ర సనామ వివాహ మేర్పడన్
రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట భద్రగిరిస్థ వేదికిన్ 3
ఇషణ మ్మలర వినాలం
బుషమ్ము ముని కుంభసంభవుం డల కూలం
కషము లవణాంబుధి వఱలు
విషమును హరి! మ్రింగె మురియ వేల్పులు దితిజుల్ 2
[విషము = జలము; ఇషణము: ఇచ్ఛ (దేవతల); కాలకేయులు,
రిపులు కనిపించినందుకు సురలు, సోదర దర్శనమున దితిజులు మురిసిరి]
విషమ సులోచనుండు పరివేష్టిత భూత గణాధి నాథుఁడున్
విషధర భూషణుండు విష వేష్టిత మూర్ధజ బాసితుండునుం
దృష తపియింపఁగా జలము తీరున శంకరుఁడే దయాళువై
విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్ 1
[విషము = విసము, జలము]