కృత్స్నమ్ము చిత్తము లలర
మృత్స్నా నేచ్చ జనియింప హృత్కమలములన్
జ్యౌత్స్నమ్మున జీవాళికి
జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్ 59
కృత్స్నోద్దీపిత చిత్త రాగ జని తాంగీకార భావమ్ము సూ
హృత్స్నిగ్ధేద్ధ విచార సంచలిత వక్రేక్షా ప్రతీక్షార్త బా
ర్హత్స్నేహార్ద్ర మనోవిలాస జన పంచాస్త్రార్త జీవాళికిన్
జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్ 58
తగ నానందం బేపా
రఁగ మిత్రయుగము పరస్పరమ్మున్ భాషిం
చఁగ నట ఖండాంతరములఁ
బగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్ 57
క్రమాలంకార స్ఫురణము:
విగతశ్రీ గత మిత్ర బాంధవ యశో విధ్వంస భావంబునన్
మృగలోలాక్షి ధ రార్థ ధాన్య వహముల్ నిత్యంబు వర్ధిల్లగన్
గగ నాకారము దాల్చి చిత్తమున దుఃఖహ్లాదముల్ గల్గగాఁ
బగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్ 56
ఇట్టు లట్టు లెట్టు లెట్టులు వెట్టిన
వట్టి దౌను పెట్టి యొట్టు చిట్టి
పట్టి చెప్పు చుంటి గట్టిగ నమ్ముమ
నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుఁడు 55
పలుక నిజమ్ము నెవ్వ రిల వైష్ణవ శైవుల యందు దేవునిం
గొలిచిరి కాంచి రూప మతి గుహ్యమ యాత్మగతుండు దైవమే
పలువురు వారి కిష్టముగఁ బల్కుదు రన్యుల యందు ద్వేషులై
నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై ! 54
ఈ యా వాక్యము లఱిముఱి
వేయేల పలికెద వీవు వెఱ్ఱిదనమునం
గోయుమ వేగమ యానప
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్ 53
ఏ యొక దైవ మైన నను నింపుగఁ గావఁగ వేగ రా గలం
డే యని దిక్కు లారయుచు నివ్విధి దీనుఁడు చూచుచుండగాఁ
బాయక దుఃఖ సంచయము పాఱఁగఁ గన్నులఁ గాచి నట్టివౌ
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్ 52
సంచుల నిండుగ విత్తము
పెంచఁగ నేల బ్రతుకుటకుఁ బృధ్విని మిత్రా
యంచితముగ, జీవించక
వంచనతో, సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్ 51
మించి నిజమ్ముఁ గట్టెదుట మేదినిఁ బల్కిన నిష్ఠురం బగుం
గొంచెము నైన నన్నరునిఁ గోవిదు లైనను మెచ్చ రక్కటా
పంచను జేరి తియ్య నగు పల్కులు పల్కుచు నిచ్చమెచ్చఁగన్
వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్ 50
తహతహ నింద్రుఁడు మునిసతి
నహల్య మోహించె నకట యన్యాయముగా
నహరహము కురిసె శిలలను
మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే 49
గృహగత కార్య భారమునఁ గృచ్ఛ్రము లందు మునుంగఁ దోఁచదే
బహువిధ దుఃఖ సంచయము పట్టి భృశమ్ముగ నొంచుచుండగా
నిహమున భక్త పుంగవుల యెల్లరి చిత్తము లందు నివ్విధిన్
మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానిపించదే 48
ఉంచి యసూయ మనమ్ములఁ
గించపఱచుచుండ జనులు కీర్తికి మున్నే
యెంచఁ బుడమిఁ ద్వరితమ్ముగ
మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్ 47
ముంచును మృత్యు వెల్లరను మూఁడినఁ గాలము మాన కెవ్వరిన్
సంచిత వర్జి తాఘులను సర్వ సజీవ విహార కోటినిం
ద్రుంచుము సందియమ్ము మదిఁ దూర్ణము మంచినిఁ జేయకున్ననున్
మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే 46
పుడమిన్ నేటికిఁ దలఁచమె
కడు గారవమునను మొల్లఁ గవయిత్రినిఁ దా
మిడి భీతిలి వెనుకంజను
బడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్ 45
[సరి పోరు = నశించరు]
కాంతా రత్నము లెంచఁ గాంతులకు నిక్కం బిత్తురే స్ఫూర్తినిం
బొంతన్నిల్చి సతమ్ము సాదరము నంభోజాక్షులే కాన వే
దాంతం బౌనె తలంచ సత్కవులు, సాహాయ్యమ్ము నీ కున్నచో
నింతుల్, వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్ 44
మించి సంపదలను సంచయమ్ము తివిరి
చేయు వారి కిట్లు చెప్పు మింకఁ
దుదకుఁ దృప్తి లేక తోరమ్ముగా దుష్ట
బుద్ధి గల జనులకు బూది మిగులు 43
వృద్ధి యనంగ నెంచకుమ విత్త సమార్జన మొక్క టంచునుం
దద్ధిత ముక్తిఁ గాంచుమ నుతప్రవరమ్మును సుంత సత్య మీ
వృద్ధ జనోక్త భాషణము విష్ణు పదాంచిత చింత నాది స
ద్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్ 42
[బూది = భూతి =విభూతి; అంతియే కాక యైశ్వర్యము హరించి ముక్తి
మార్గమును జూపెద నని సాక్షాత్తు శ్రీకృష్ణుఁడే ధర్మరాజుతోఁ జెప్పెను.
కనుక వారికి బూది మిగులుట కూడా వాస్తవమే.]
వాడలు వాడలు పురమున
వేడుక తోఁ దిరిగి తిరిగి వినుఁ డీ వింతన్
వాఁడు సుపుత్రుండౌ మా
గాడిద గ్రుడ్డుఁ గొనివచ్చెఁ గాశికిఁ జనియున్ 41
ఓడెను విశ్వ మల్ప మగు నొండొక కీటక సింహ ధాటికిన్
వేడిరి నిత్య కృత్యముల వేగమ యాప ధరాతలమ్మునం
గీడులు పెక్కు లయ్యె మఱి కీళులు వాచె జనాలి కెంచగఁన్
గాడిద గ్రుడ్డుఁ దెచ్చెనఁట కాశికిఁ బోయి జనమ్ము మెచ్చఁగన్ 40
క్రొమ్మదము మీఱఁ దా న
మ్మమ్మ సుఘోరము కలియుగ మాహాత్మ్యమ్మే
సుమ్ము ధన పాన మత్తుఁడు
తమ్ములఁ జంపంగఁ గోరెఁ దనయుఁడు దండ్రిన్ 39
పమ్మెడు లోని శత్రువులు బాధల ముంతురు స్యీయ పుత్రులై
యిమ్మెయి దేహి కెంచ నగు నింపుగ నగ్రజుఁ డంతరాత్మయే
యెమ్మెయిఁ దాఁ దరించఁ బరమేశుని సద్దయ జన్మ వారిధిం
దమ్ములఁ జంపుమంచు నొక తండ్రిని పుత్రుఁడు కోరెఁ నమ్రుఁడై 38
'ర-రి-రు-రె' ప్రాసాక్షరాలు:
వరమగు వృద్ధాప్యము శ్రీ
హరి నెద ధ్యానించి భక్తి ననవరతమ్మున్
సురుచిర పరమ పదం బం
దరె సుజనులు శంకయె విబుధా నీ కిందున్ 37
ధర జీవాలికిఁ గల్గు నిక్కముగ వృద్ధాప్యమ్ము జీవించ న
త్తరి సారోగ్యము దైవచింతనల శుద్ధంబైన చిత్తమ్మునన్
గురు వాక్యమ్ములు సంస్మరించి మది సంకోచమ్ములన్ వీడఁ బో
వరె సన్మార్గులు దివ్య ధామములకున్ భద్రమ్ముగా నిద్ధరన్ 36
గొల్ల పిల్లల నట గోపాలుఁడు కనులు
మూసికొనుఁ డనంగ మూసి తెఱవ
దరికొని పఱతెంచు దావానలమ్మున
నారనట్టి మంట లారె నెటుల 35
భూరి యశోవిరాజిత నభోవర పట్టణ ముల్లసిల్లగం
జారుతరమ్ము భాసిలుచు సంయమనీ పుర నిత్య మోక్షవ
త్తీరము సేరి మౌనముగ దేహి ప్రసన్నత శాంతి నొందగా
నారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్ 34
కోపము నుపశమించఁగఁ గూర్మిఁ జేసి
శాంత మూని చిత్తమ్మున సుంత నంతఁ
జక్కని సహన మ్మది, బల్కి వాక్కు నర్మ
గర్భముం, దాల్చె మగఁ డని కాంత మురిసె 33
దర్భ కరాంబుజుండు నిరతవ్రత విప్రుఁడు సద్గుణుండు భూ
గర్భ కృపా రసామృతము గ్రన్నన దక్కఁ గరమ్ము నెమ్మి నే
నర్భకు వేఁడఁ దన్మయ కృశాత్మను వింత నిజోదరమ్మునన్
గర్భముఁ దాల్చె భర్త యని కాంత వచించెను సంతసంబునన్ 32
[తాల్చు = ఉంచు, చేర్చు, నిర్మించు; గర్భము = బిడ్డ]
సుంత చింతించు మింపుగ నంతరంగ
మందుఁ జాలక యున్నదె డెంద మందు
నొత్తిడి మన కిప్పట్టున గ్రొత్తది గొలు
వేల కొలఁది సమస్యలు వెతలఁ గూర్చె 31
[కొలువు +ఏల = కొలు వేల]
కందురె వైపరీత్యములఁ గ్రమ్మఁ గరోన వినూత్న కీటకం
బెందును విశ్వమందుఁ బరమేశ్వరు నండను గొన్న జీవియే
యందఱిఁ దారతమ్యముల నారయ కక్కట ముట్టడించఁగా
వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్ 30
[కరోన = చేతులు తక్కువ యైన]
నాగరికం బయ్యెను వే
వేగఁ జనఁగ వైద్యు కడకు వెఱ్ఱిగ భీతిన్
వేగఁ దిరిగి కనిపించఁగ
రోగము నయ మైన మిగుల రోదించెనయో 29
[నయ మైన(న్)]
బాగుగ చిత్త ముంచి మఱి వైద్యము సేయఁగఁ గీర్తి హస్తుఁడే
క్రాఁగఁగఁ జేసి సంతతము కంటకమై రుజ కొన్ని నాళ్లహో
దాగి శరీరమం దిపుడు తగ్గిన హర్షము పొంగ నత్తరిన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగ సాగె బిట్టుగన్ 28
శాంతి హర్షదాయ కాంతరంగ విమల
కారకమ్ము సుమ్ము తోరముగను
భంగపఱచ నేల సంగర మూని య
శాంతిఁ గోరువాఁడె శత్రువు గద 27
అంతము లేదు ద్వేషమున కార్యులు మెచ్చరు దాని నెన్నడుం
జింతలె దక్కు నంతమునఁ జిత్తము నందిఁక నిశ్చయమ్ముగన్
బంతము మాను ఘోర జననాశక యుద్ధము, దేనిఁ గాంచవో
శాంతినిఁ, గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్ 26
మబ్బు - వాన - ముసురు - వరద
వరదా మేమబ్బుర మం
ద రోదనము సురుచిరమును దయతో విని మా
ది రమాసతితో రావా
న రార్తులము మాకు రక్షణం బీయంగన్ 25
మతి శూన్యమ్ము శయనమే
సతతం బెవ్వరికి లేవు చదువులు నిత్య
మ్ము తిని తిరుగ నకటా నా
సుతు లే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ 24
[పతి = ఏలిక]
శతసాహస్ర తపః ప్రభావ మహిమన్ శస్త్రాస్త్ర విద్యా విని
ర్జిత సాపత్న్యులు వీర విక్రములు దుర్భేద్యాక్త్ర ధారుల్ కరో
ద్యత బాణాసన లబ్ధ కీర్తులును సాద్వ్యంబాలికా పుత్ర రా
ట్సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా 23
వైద్య శాస్త్రము జగతి నపార వృద్ధి
సెందె నేఁడు రోగములకు మందు లుండ
కోటి యొండొక మందు గైకొన రకట వి
పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె 22
[విపాండవులు = మిక్కిలి పాండు రోగము కలవారు]
దండధ రాంశ వృద్ధ జన ధార్మిక బాంధవ మిత్ర తాప సో
ద్దండ నికాయ భీష్మ గురు తాత సమాతృ వచో విరుద్ధులున్
గండులు ధార్తరాష్ట్రు లగు కౌరవ వంశులు క్రూర దుర్న యా
పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా 21
[దుర్నయ + అపాండవులు = దుర్నయాపాండవులు]
నిస్త్రాణ మేల నతనికి
నా స్త్రీకిం గవలు పుట్టి రానందముగన్
శాస్త్రికి భార్యామణి ని
శ్శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్ 20
వస్త్ర విభూషణాదుల నపార ముదాకర రూప సత్కృపా
నిస్త్రిగు ణాంతరంగ యవనీసుత ధారుణి భర్త తప్తయై
నిస్త్రుటి తాత్మ దర్ప ఖర నిష్ఠుర దుర్జయ దైత్యకోటికిన్
శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ ముదంబునన్ 19
ఏటికి సంశయము జటా
జూట తపోధన మహిమలు చోద్యము లెంచన్
మేటి మునీంద్రని మాటను
దాఁటిన వేగిరమ కీడు తథ్యముగ నగున్ 18
కాటికి నేఁగఁ దల్చి నరకమ్ము గనుంగొన నెంచి తేని నీ
వాటగఁ జేయ వచ్చును మహాత్మ యొకింతఁ దలంచు మయ్య య
య్యేటినిఁ గట్టి నట్టి మును పెన్నఁడొ భద్రము జీర్ణ వారధిన్
దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై 17
బ్రహ్మ రుద్ర శక్రాదులు బ్రహ్మఋషులు
నింక దేవర్షి గణముతో నెలమి రాఁగ
మిథిల నాఁ బురి నేలెడు మేటి ఱేఁడు
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ 16
[కొమరుఁడు = కుమారస్వామి]
కమలజు కన్నతండ్రి లతికా సుతనూ కమలా ధవుండునుం
గమల ధనూ రమాసుతుని కన్న మహాత్ముఁడు నందపుత్రుఁ డా
కమలదళాక్షఁడే వరుణ కాంతు జగమ్మున కేఁగి నందుఁ దేఁ
గొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్ 15
వేశ్యాలోలులు మానవు
లా శ్యామల జోలి కేఁగ కావల యున్నన్
వేశ్యలఁ జూడన్ శక్యమె
వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ 14
వశ్యలె వారు క్షుద్రుల కవద్య నరాలికి నెన్నఁ డేని కా
ర్కశ్యపుమాట లేల సుర కాంతలు క్షీర సముద్భ వాంగనల్
కశ్యప మౌని పుత్రికలుఁ గారణ జన్మలు వింత యేల స్వ
ర్వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే 13
వ్రణకారక ద్విష ధను
ర్గుణ ధ్వనులు నంతరించె క్షోణితలమునన్
క్షణమాత్రమ్మున నర మా
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్ 12
ఫణిశయనస్త వాభిరత పావన విప్ర మహాకులైక భూ
షణుఁడు నిరంత రాధ్యయన శాంత మనస్కుఁడు సత్యవంత స
ద్గుణగణ ధాముఁడున్ లస దకుంఠిత వైష్ణవ సంభృతాంక ధా
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్ 11
మానినిఁ జపలాక్షిం జం
ద్రానను దనుమధ్య ఘన నితంబిని నచటం
గానఁగ మున్నూనిన యది
దా నవ రూపమును విడిచె దానవుఁ డచటన్ 10
[నవ రూపము = క్రొత్త రూపము]
మానవ మాత్రుఁ డాతఁ డని మత్తిలి బాహు బలోద్ధతిన్ సరో
షానన భీకరుండు ముని సత్తము దూఱి చెలంగ శప్తుఁడై
దానవ కిన్న రాహి నర దైత్య సుపర్వులు సూచుచుండగం
దా నవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్ 9
[దాను +అవరూపి = దానవరూపి]
శ్రవణాలంకృత మండము
లవి కాంతుల నీనఁగ నయనానందముగన్
యువతీమణి సుందరముగ
నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్ 8
భువ నౌఘమ్ముల శ్రేష్ఠ మీ వసుధ యంభోజాక్ష సంప్రీతమై
యవనీ లోక నభో జగత్ప్రవర లోకావాస చిత్తాలిఁ దాఁ
కి విశుద్ధాత్మ మహా జనోత్సవము భోగిన్ గోమయోత్పత్తులా
నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్ 7
[నవనీతము = క్రొత్తగాఁ దేఁబడినది; గోమయోత్పత్తి ప్రతిమ = పిడుక]
ఏ మనఁ దగు నాగడముల
సామర్షాత్ములు కలియుగ సంభవు లుభయుల్
భీమ బలాఢ్యులు దుష్టులు
రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై 6
[గోతి = స్త్రీ]
భూమిభృ దింద్ర సన్నిభుఁడు భూమిజ భర్త నరోత్తముండు నా
కోమలి సీత రక్షణకుఁ గోపమునన్ శిబి రార్థ రక్తినిం
దామరసాక్ష యుగ్ముఁ డటఁ ద్రవ్వి సమర్కట కోటి లంకలో
రాముఁడు గోతులం, దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో 5
[నెయ్యము = ఇంపు]
ధర్మ సమ్మతము గడించి ధనము కరము
నీడుజోడగు పూఁబోడి నెలమి వెదకి
సంతతమ్ము హర్షమ్మునఁ జారుతర గు
ణాలి నడఁచి పొందుము వెల, యాలి సుఖము 4
[వెల = మూల్యము /ఫలితము]
ఆర్య జనుండు సద్గురు గణావన తాంగ విధేయ చిత్తతం
గార్యము లాచరించుచు నకామియు నై చరియించుచున్ వరౌ
దార్య దయాది సద్గుణ యుతమ్ము నిజేంద్రియ కాంక్ష కోటి నా
భార్యను జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్ 3
[వార వరానన నిత్య సౌఖ్యము = శంకర ముఖ దర్శనంపు సంతత సౌఖ్యము;
వారుఁడు = శివుఁడు]
నవనీ తోపమ సు మనో
వివశత నిత్యామర వర వేష్టిత జగతిన్
వివిధ వ్యథోపశమ నా
శవ పూజ లొసంగును శుభసంతోషములన్ 2
[ఆశవము ==శీఘ్రత]
అవనీదేవుల సంయమీశ్వరుల హృద్యానంద సంధాయ కై
క వరాభ్యర్చనలన్ రమా కుధరజా కాంత ప్రశంసాలి స
న్నవ గానామృత తృప్త చిత్తమున సద్భక్తిన్ గవాహ్యాది పా
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే 1
[నవము =స్తోత్రము; గో+అహి+ఆది = గవాహ్యాది;
పాశవము = పశువులకు సంబంధించిన]