లక్ష్మి నారాయణా శతకము
పంచ పద్య ప్రణీతము: పోచిరాజు కామేశ్వర
రావు.
|
వాగీశ్వరి.
(సుమందారమాల.) |
తనువ్రాతముల్
పెక్కు లిద్ధాత్రి క్షీణింప ధర్మంబు దర్శించి కాపాడఁగా ననేకాకృతుల్
వూని యత్యార్తి జన్మింతు వింపార నంభోజపత్రాంబకా! ఘనశ్యామ!
నిత్యమ్ము నోంకార నాదమ్ముతోఁ గూడి కన్పించు నామాలియే యనంతాఖ్య!
దేవర్షి నిత్యర్చ్య! వక్షో విరాజన్మహాలక్ష్మి! నారాయణా! |
1.
|
|
|
|
|
|
వాగీశ్వరి. |
కనత్స్వర్ణ కేయూర వక్షస్స్థ లాక్రాంత
హారాళి కాంతుల్ ప్రకాశింపఁగా జనోద్ధార ణైకైక లక్ష్యంబు డెందమ్ము
నందీవు సంధింతువే నిత్యమున్ వినాశమ్ము నింపారఁ గావింతు విశ్వేశ!
దుష్టాలిఁ బీడింపఁ బుణ్యాలి నో యనంతాఖ్య! దేవర్షి నిత్యర్చ్య! వక్షో
విరాజన్మహాలక్ష్మి! నారాయణా! |
2.
|
|
|
|
|
|
వాగీశ్వరి. |
అనూహ్యంబు నీరూప మత్యంత సంతోష సంధాయ కాశ్చర్య పాత్రంబునౌ
దినే శాబ్జజన్మాదిగా దేవ తానీక మెల్లప్డు దేవేశ!
పూజింతురే నినుం బుండరీకాక్ష! ప్రాణివ్ర జోత్తారకా
గ్ర్యేశ! నిత్యుండ! దామోదరా! యనంతాఖ్య! దేవర్షి నిత్యర్చ్య! వక్షో
విరాజన్మహాలక్ష్మి! నారాయణా! |
3.
|
|
|
|
|
|
వాగీశ్వరి. |
మునివ్రాత మెవ్వాని ముప్పొద్దునన్
మంత్ర యుక్తమ్ము పూజించు సద్భక్తితో జనవ్రాత మెవ్వాని విశ్వాస మేపారఁ
బూర్ణమ్ము స్వాంతమ్ములం దల్చునో మనోహారి యెవ్వండు మా మాత కవ్వానిఁ బద్మాక్షు మంత్రాళిఁ బూజింతు నే ననంతాఖ్య! దేవర్షి నిత్యర్చ్య! వక్షో
విరాజన్మహాలక్ష్మి! నారాయణా! |
4.
|
|
|
|
|
|
వాగీశ్వరి. |
అనూరున్ గరుత్మంతు నుష్ణాంశుసారథ్య దామోద
రాశ్వక్రి యాసక్తులన్ సనైపుణ్య సామర్థ్య నిశ్శంకులం జేసి తింపారఁ
జక్రాయుధా!శ్రీధరా! నినుం గొల్వ సద్భక్తి సన్నిష్ఠ
భక్తాలి శ్రీవత్స! నిత్యమ్ము రక్షింపవే యనంతాఖ్య! దేవర్షి నిత్యర్చ్య! వక్షో
విరాజన్మహాలక్ష్మి! నారాయణా! |
5.
|