9, జులై 2023, ఆదివారం

Lokopakaramu

 

 

లోకోపకారము.

 

 

 

సీ.

గగనాన విహరించు గ్రహరాజు సకల చరాచర జీవుల కన్న మొసఁగు
నాకాశ వీథిని నలరారి నిత్యమ్ము చరియించు ఘనరాశి జలము నొసఁగు
నిల లోన మూలమ్ము లింపారఁ బొదివిన పాదప తండమ్ము ఫలము లొసఁగుఁ 
దృణ మారగించుచు దిన దినం బలరి గో వ్రాతమ్ము కమ్మని పాల నొసఁగుఁ

 

తే.గీ.

దేలి పూలపై మధుపమ్ము తేనె నొసఁగుఁ
బన్నుగఁ బెరిఁగి గొఱ్ఱియ యున్ని నొసఁగు
మించి ధరలోన నిరతమ్ము సంచరించు
నీ వొసఁగ నేర్తు వెయ్యది నిజము  చెపుమ

1.      

 

 

 

సీ.

తన మేని మాంసమ్ము తడయక యొక రాజు కాపాడ శరణార్థిఁ గరుణ నొసఁగెఁ
నిజ దార రాజ్యమ్ము నిలుపంగ  సత్యమ్ముఁ ద్యజియించె నొక్క మహాత్ముఁ డడరి
యాఁకలి యని రాఁగ నభ్యాగతి కొసంగెఁ దన కున్న యన్నమ్ము దాత యొకఁడు
పుట్టుకతో నున్న బొందళం బింకఁను కుండలమ్ము లొకఁడు కోసి యిచ్చె

 

తే.గీ.

వ్రే లడుగ నిచ్చె నొక్కఁడు విద్య నొసఁగ
గొప్ప వారు మా వారంచుఁ జెప్ప నేల
పరుల కుపకార మొనగూర్చు పనులు నీవు
సేయఁ దొడఁగితి వెయ్యవి చెపుమ నిజము

2.