అంగదు డుత్తముండు దమయంతికి భర్తయు వాని పుత్రుడు
త్సంగ విరాజితుండు వయసుండగ నోపయిదేండ్లు గర్ణుడి
భ్భంగిన నున్న నొక్కపరిఁబాటున భార్య కృతాపరాధి కా
నంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్. 34
యదు వంశాంబుధి సోమ వ
సుదేవ నందన పదాంబు జోల్లసిత విశే
ష దురిత నిచయ విదారక
మదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ. 33
ప్రవిమల సంస్థానమ్ములు
వివేక విజ్ఞాన నిధులు విద్యార్థులకున్
భవితవ్య దాయకమ్ముల
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్. 32
శరవణ భవ భవ కారక
శరపుష్ప కరాబ్జ ముక్త శరతప్త ఘనా
తుర హర విదళిత తను రతి
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్. 31
పుర జను లెల్లరు మెచ్చగ
పరదారల గౌరవింపఁ బాడియ సుమ్మీ
పరసతిఁ గామించెడి కా
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్. 30
వేండ్రపు పల్కుల నందర
గండ్రించి యకారణంబ గద్దిం చంగన్
గాండ్రించి కొట్టి నంతట
గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్. 29
[ వేండ్రము= తాపము; గండ్రించి=ఖండించి; గాండ్రించి= అఱచి]
వందే మాతర మన్నమాట చెవి కింపై తోచ దెవ్వారికిన్
సందేహం బది యేలవార లిట దేశాందోళ నోద్దేశ్యులే
యిందందే యననేల సచ్చరితులన్నెందెందు గాలించిన
న్నందందే గలరుత్త మోత్తములు మాత్రారాధ్యు లిద్ధాత్రినిన్ 28
కోరి బంధుజనులు గూడి నీకుం బిల్ల
నిత్తు రంటిరి గద చిత్త మలర
కరుణ వీడి మదిని గఠినంబుగ దెలుపు
తెలుఁగ దేల నీకుఁ దెలుఁగు బిడ్డ 27
[ఎలుగు=ధ్వని]
ఆవులించి భుక్తాయాస మంత దీర
బకుని వన మేకతమ మేగి పాండు సుతుడు
రక్కసున కుక్కటయు నెల్ల నుక్క డగుగ
భీతి కంపిల్లి సూడగ వేగ జంపె 26
చెన్నుగనన్నయాదులురచించినసత్కవితానురక్తులై
మన్నన గొన్న గొప్పకవి మాన్యుల విద్యను గొందరెంతకా
దన్నను జెల్లునే బహుపదార్థకవిత్వము సెప్పనేర్చినన్
నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా? 25
దొడ్డిలోననున్నదొడ్డపూవులనడ్డు
జడ్డు లేక గోసి గడ్డి పూలు
కొండచూలి బిడ్డ నండకై కొలువగ
గడ్డిపూవు విలువ దొడ్డ సుమ్ము 24
విద్రోహ విహీ నామల
సద్రాజిత సుహృద యాతిశయ సంపదలన్
భద్రంబుగ బాపిన నప
హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్. 23
అస్త్ర శస్త్ర సంపన్నులు నలఘు బలులు
నిద్ర కుంభ కర్ణారి యభద్ర గతిని
శాపములు సూర్య సూనుని శత్రు తతులు
కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట. 22
[ఇద్దరూ శాపగ్రస్తులే]
భూవిభుడు రామ జననము
పావని సీతపరిణయము వనవాసమునున్
రావణ వధ సహితము, మై
రావణు కథ లేక, వ్రాసె రామాయణమున్. 21
ఉపకృతి సేయందలచినఁ
గృపతో చింతవల దేరికిన్ స్వజనవిహీ
న పరాధీనమ్మైన
న్నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్. 20
సూర్యుని తాతతండ్రి మధుసూదన సూనుడు పద్మజుండిల
త్సంగ విరాజితుండు వయసుండగ నోపయిదేండ్లు గర్ణుడి
భ్భంగిన నున్న నొక్కపరిఁబాటున భార్య కృతాపరాధి కా
నంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వఁగన్. 34
సుదేవ నందన పదాంబు జోల్లసిత విశే
ష దురిత నిచయ విదారక
మదిగో ద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ. 33
వివేక విజ్ఞాన నిధులు విద్యార్థులకున్
భవితవ్య దాయకమ్ముల
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్. 32
శరపుష్ప కరాబ్జ ముక్త శరతప్త ఘనా
తుర హర విదళిత తను రతి
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్. 31
పుర జను లెల్లరు మెచ్చగ
పరదారల గౌరవింపఁ బాడియ సుమ్మీ
పరసతిఁ గామించెడి కా
పురుషుని నిందించు సతినిఁ బూజింతు రిలన్. 30
గండ్రించి యకారణంబ గద్దిం చంగన్
గాండ్రించి కొట్టి నంతట
గుండ్రాతికి నోరు వచ్చి గొల్లున నేడ్చెన్. 29
[ వేండ్రము= తాపము; గండ్రించి=ఖండించి; గాండ్రించి= అఱచి]
సందేహం బది యేలవార లిట దేశాందోళ నోద్దేశ్యులే
యిందందే యననేల సచ్చరితులన్నెందెందు గాలించిన
న్నందందే గలరుత్త మోత్తములు మాత్రారాధ్యు లిద్ధాత్రినిన్ 28
నిత్తు రంటిరి గద చిత్త మలర
కరుణ వీడి మదిని గఠినంబుగ దెలుపు
తెలుఁగ దేల నీకుఁ దెలుఁగు బిడ్డ 27
[ఎలుగు=ధ్వని]
బకుని వన మేకతమ మేగి పాండు సుతుడు
రక్కసున కుక్కటయు నెల్ల నుక్క డగుగ
భీతి కంపిల్లి సూడగ వేగ జంపె 26
చెన్నుగనన్నయాదులురచించినసత్కవితానురక్తులై
మన్నన గొన్న గొప్పకవి మాన్యుల విద్యను గొందరెంతకా
దన్నను జెల్లునే బహుపదార్థకవిత్వము సెప్పనేర్చినన్
నన్నయ తిక్కనాది కవినాథులు సెప్పినదే కవిత్వమా? 25
దొడ్డిలోననున్నదొడ్డపూవులనడ్డు
జడ్డు లేక గోసి గడ్డి పూలు
కొండచూలి బిడ్డ నండకై కొలువగ
గడ్డిపూవు విలువ దొడ్డ సుమ్ము 24
విద్రోహ విహీ నామల
సద్రాజిత సుహృద యాతిశయ సంపదలన్
భద్రంబుగ బాపిన నప
హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్. 23
నిద్ర కుంభ కర్ణారి యభద్ర గతిని
శాపములు సూర్య సూనుని శత్రు తతులు
కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట. 22
[ఇద్దరూ శాపగ్రస్తులే]
పావని సీతపరిణయము వనవాసమునున్
రావణ వధ సహితము, మై
రావణు కథ లేక, వ్రాసె రామాయణమున్. 21
గృపతో చింతవల దేరికిన్ స్వజనవిహీ
న పరాధీనమ్మైన
న్నపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్. 20
న్నార్యులు నిత్య సత్య వచనారతు లుత్తము లట్టి వారికిన్
కార్యము కాదు పల్కగ నకారణ నిందలు మేలె చెప్పుమే
భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్. 19
దైవనింద, కడు హితమ్ముఁ గూర్చు
ప్రాణుల దయజూడ పరమ రాగంబొప్ప
దేవ దేవు డెలమి బ్రోవ రాడె 18
మకర రాశికి సంక్రాంతి మనకు కల్గు
పర్వ దినము శుభకరము భవ్య దైవ
చింత లెన్నియొ కూర్చు సంక్రాంతి మనకు. 17
చిత్ర మంత జూచి చిట్టి తల్లి
గుక్కబెట్టి యేడ్వ మిక్కుటముగ నంత
భోగిపండ్లు వోయఁ బోయె నుసురు. 16
శక్తి దీనజనుల ఘన సంకటములు
సక్కదిద్ది యెలమి సాంత్వవాక్కులు పలు
కు జనులెల్ల సజ్జనులె యీ కువలయమున. 15
వధువు వైపు వారు వరుని బంధువులకు
వంత సెంది యుండ బంధువొకడు
వచ్చు వారి జూచి పలికెనా వచ్చెడి
వారు వేఱు వీరి వారు వేఱు. 14
కృష్ణవేణి వారి కృత్స్నముం బంచిరి
మూడు రాష్ట్రములకు ముచ్చటగను
రాష్ట్ర త్రయము నాల్గు రాష్ట్రంబు లయ్యెను
వారి వారి వారి వేరు వేరు 13
[వాళ్ళ వాళ్ళ నీళ్ళు వేఱు వేఱు ]
కందమూల రతులు కర కమండలు ధారు
లు ప్రవిమల చరితులు రుచిర మతులు
ధర్మ సత్య పరులు తాపసులు ఘనులు
వారి వారి వారి వేరు వేరు 12
గాధిసుత శరద్వం తాదిగ ముని వరులు
సంయమాత్ములు శస్త్రాస్త్ర సకల శాస్త్ర
పారగులు వనితాలోలు లైరి జూడ
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె? 11
మత్కారము లేల సేయ మాన్యుల యెడల
న్నుత్కంఠత నీ కించిద
సత్కార్యంబుల ఫలమ్ము సంతాపమ్ముల్. 10
హరి హరికి నరియగు హరి విధ మది
హరి హరులు నభమున నలరుచు నుండగ
హరిని హరి హరించె హరి కనంగ. 9
వలయు బూజింప దగు వృద్ధ పౌరు లందు
భక్తి గౌరవమ్ములు సూప వలయు గాని
ముదుసలిం గొట్టువారలే పోటుమగలు? 8
కట్నమ్ముల కొఱ కటంచు కలగను తరుణిన్
కట్నమదియేల వధువను
కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్. 7
నందము కను విందు జేయ నలరించె నటన్
డెందమ్మున దా నితరుల
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ 6
దారుణ రణభూమి దానకర్ణుం డంగ
రాజు సకల శత్రు రాజ ఖండ
నుండు నుత సుయోధనుం డపరాజిత
సవ్యసాచి సఖుఁడు సైంధవునకు. 5
ధనమద గరిమంబు దలకొన నతి
దురిత కారకుండు దుష్టుడైన విభుని
బాటఁ బట్టి పోవువాఁడు ఖలుఁడు. 4
భాద్రపద శుద్ద చవితిన పర్వ దినము
నందు విఘ్నవినాశన మొందఁ దలచి
పుడమి జనులెల్ల భక్తిని పూజ సేయ
చైత్రమందు వినాయక చవితి వచ్చు. 3
[చైత్రము=గుడి]
వనమేగి కట్టెలకుఁ దరు
వునెక్కి తానిలచిన ఘనపు విటపమును బూ
నెనొకడు ఖండింపంగఁ ద
నను మించిన మూర్ఖుఁ డుండునా లోకమునన్. 2
వత్సరమ్ము లెల్ల వచ్చును బోవును
క్రొత్త వత్సరమునఁ గోటివెతలు
పాత మేలనంగ పాడిగా దేరికిన్
సత్కృషియ యొసంగు సత్ఫలములు 1