ఘోరారణ్యద్రుమముల
వీరావేశ మలరంగ విచ్ఛేదించన్
సారంగారి సమూహమ
వారిత సువిహార లీల భాసిలె నచటన్ 33
దనయుని నిజభుజ మృదుతర తల్పము నందుం
దనరారగ నుంచిన నా
తనికి నెఱుక లేదు గురుడె దైవం బనియున్ 32
జనగణమనోధి నాయక
దినకర నిభ భారత ధనదేశా యమునా
ఘన గంగాది నదీ నద
వననిధి భాసిత తరంగ వందన శతముల్ 31
నకళం కోదర విలీన నలిన దలాక్షున్
ప్రకటమ్ముగఁ దూచె దళము
వికసిత వదనారవింద వీక్షింపంగన్ 30
హరి కీర్తింపక వక్త్ర మించుక సునాయాసంబు నన్నున్నయున్
కరుణన్ సత్యదయాది సద్గుణములం గాంక్షింప నేర్వండొ యీ
ధరణిన్ వాడు జనింప నేటికి కులోద్ధారంబె తాదల్లికిన్ 29
దనమ్ము నిచ్చు మధురతర ద్రవరాజమునన్
ఘనముగ నాసక్తి కలుగు
మనమందందరుకు వేగ మరువం గలరే 28
విమానమైబరగు బ్రీతి విహరింపంగన్
సముచిత వాహన రాజము
సమద్విచక్రము చరింప సంతస మొసగున్ 27
కలియుగ ధర్మం బెవ్విధి
విలసిల్లె గనుడు రవంత పెడబాసిన వే
కలుగుం జౌర్యము లీలన్
లలితమ్ముగ వేసె తాళరాజము భీతిన్ 26
సతతార్ధాంగీనిబద్ధసంతృప్తాత్ముల్
సతిగతజనితావేదన
నతిసంతప్తమతులౌదురందరుసూడన్ 22
స్తుత మతియై గృహిణి పతి పదోన్నతి మది నెం
చి తనరి చేసెను నిత్యో
చిత కార్యంబుల నపార సేవా రతినిన్ 21
వనితల కసాధ్య మగునే
సునిశిత దృక్కులఁ ద్రిచక్ర చోదనము భువిన్
పను లన్నియు నేర్తురు గద
యనురాగము వంచుచును సహాయము సేయన్ 20
లచ్చిగలవాని మెత్తురు లక్షణముగఁ
దరుణులఁ బదాఱువేల సదమల మతులఁ
బెండ్లి యాడ భార్యాద్వయం బేల నాది
బిక్షువునకుఁ బార్వతి చాలు విడుము గంగ 19
యవ్వచనామృత మృదుమధు రాన్విత సూక్తుల్
నివ్వటిల జూపు చున్నది
సవ్వడి సేయకఁ గనుండు సదమల వృత్తిన్ 18
“అయ్యప్ప - జ్యోతి దర్శనము”
చక్కగ దేవస్థానమె
యక్కథ విశదీకరించె ననృతం బనుచున్
వెక్కసము గాదె జనులకు
మిక్కుటముగ కారణంబు మిథ్యాచార్యుల్ 17
సౌధాగ్రంబుల నుండక
శోధించి విశాల హరిత సుక్షేత్రములన్
సాధించి యెగుర వేసిరి
మాధురి గాలి పటము సుకుమారులు ప్రీతిన్ 16
ఉజ్వల రేఖావృతమై
ప్రజ్వలి తానల శిఖా విరాజిత ప్రహ్లా
దజ్వరిత వరాంగజ తృ
ప్తజ్వలితానన ప్రమోద భరితుల గనరే 15
కలఁ డందురు బొలము నందొక పరి పురమునన్
కలడందురు వేరొక పరి
కలడు కలండెనిడి వాడు కనబడడేలన్ ! 14
చేసినవన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు దా
జేసిన కర్మలన్నిటినిఁ జిత్తము నందుఁ బరిష్కరింపగన్
గాసిలి యత్నమించుక విఘాతమునేర్పడ కుండు నట్టులన్
రోసము వీడి చేసిన నరుండు నొకింత విముక్తు డయ్యెడున్ 13
బొంగర మరచేతినిఁ జ
క్కంగ నమరి రివ్వున తిరుగంగ మనంబు
ప్పొంగెఁ గనుడు బాలున కి
భ్భంగిఁ జిరుముదమె ఘనంబు పసివారలకున్ 12
జేసిన కర్మలన్నిటినిఁ జిత్తము నందుఁ బరిష్కరింపగన్
గాసిలి యత్నమించుక విఘాతమునేర్పడ కుండు నట్టులన్
రోసము వీడి చేసిన నరుండు నొకింత విముక్తు డయ్యెడున్ 13
క్కంగ నమరి రివ్వున తిరుగంగ మనంబు
ప్పొంగెఁ గనుడు బాలున కి
భ్భంగిఁ జిరుముదమె ఘనంబు పసివారలకున్ 12
మానప్రాణ ధనాదుల
మానిని విషయమ్ము లందు మాంగల్యములన్
గోనృసు రార్తత్రాణము
నైన నసత్య వచన మఘ మనరాదు సుమీ 11
కనియెన్ రాముడు సోమభాస విలసత్కన్యా లలామన్ సనా
తన ధర్మాచరణానురక్త రమణిం దామ్రాక్షి లజ్జాన్విత
న్ననిలోద్ధూత విరాజమాన ఘన కేశాచ్ఛాది తాబ్జాననన్
వనజాక్షిన్ వరదామ యుక్త కర శోభన్ సీత ధాత్రీసుతన్ 10
కనియెన్ రాముడు మృగశా
బనేత్ర విమల శరదిందు వదనన్ బాలన్
జనకాత్మజన్ గుణమణిన్
వినమ్ర విభ్రమ విలోల వీక్షన్ సీతన్ 9
రామచిలుక జంటలచట
ప్రేమాతిశయమ్ము లొప్ప విహరించుచు నా
రామంబుల నున్నవి మా
రాములు సేయుచు ఘనాను రాగము వెలయన్ 8
వినయాన్వితు డైనను స
జ్జనునకు నపకార ముర్వి సలు పూరక దు
ర్జనుడుం బేటికఁ జీరలు
చినింగి బోవం గొఱికెడు చిమ్మెట భంగిన్ 7
కలఁ గంటిని కలలోనన్
విలసిల్లె మహోన్నతంపు విగ్రహ మచటన్
ఖలుజన విదారు గృష్ణుని
జలరుహ నేత్రుం గొలుతును జగదాచారున్ 6
చలన క్రియాధ్యయ నమ్ముల
నలఘూత్సాహమున నొప్పె నారీ మణియే
విలసత్శశిప్ర భానన
సలలిత పరిపాక నిపుణ చందము గనరే 5
[చలన క్రియాధ్యయనములు = Motion and Work study, “Production Management” లో ముఖ్యాంశము. పని చేసేటప్పుడు పరికరాలను, వస్తువులనమర్చు విధానము కూడ ముఖ్యము.]
చోర భయం బాయకర వి
చార మెరుంగ దది విద్య సహ జన్ములకు
న్నీరాదు పంచి ధనమది
పేరిమి నిచ్చిన పెరుగును బెద్ద సిరులకున్ 4
మదిరాపానము చౌర్యమున్ పరసతీమానాపహారమ్మునున్
మద మాత్సర్య విమోహ లోభములు కామావేశ బంధమ్ములున్
సదసద్వీక్షణ హీనమున్నశమమున్ సంరంభముం దర్పమున్
మదిరానీయక వర్తిలన్నరుడు సామాన్యుండె చింతింపగన్ 3
చెన్నుదన మతిశయింపం
గన్నారి ఘనద్విచక్ర గమనాతుర ప్ర
చ్ఛన్న నిజమాతసహ సం
పన్నాతి విలాసఁ జూడ ప్రమదంబాయెన్ 2
వచ్చె రెండువేల పదునారు వర్షంబు
తెచ్చు సిరులు జనులు మెచ్చగ నని
యిచ్చిపుచ్చుకొందు రచ్చపు కుశలంపు
పృచ్ఛ లొకరినొక్క రిచ్చకములు 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి