అల్లము మిరియా లేలకు
లుల్లము రంజింప జేయ నొప్పును మెంతుల్
వెల్లుల్లి జాజికాయలు
నల్ల లవంగమ్ము లిచ్చు నధికపు కోర్కెల్ 22
ధారా వాహిక విలసి
ద్వారిజ నయనాంబక స్రవ వారి ఘన సుధా
ధారా భరిత కలశ నివ
హారవ సంభ్రమము దెలుపు నక్షయ వారిన్ 21
విమల ధవళ తనురుచి ప్రభ
శమ సహన విజిత ధరణి వృషభవరు సఖునిన్
మమత నధర సుధఁ దనిపెను
సుమమృదునిభతను సలలిత సుహృదయ మలరన్ 20
ధవళాంబర ధరుని సకల
భువనవ్యాపి శశివర్ణు భుజ చత్వారిన్
సువికసిత ప్రసన్న వదను
ని విఘ్న రాహితికి మదిని నిత్యము దలతున్ 19
పలుకె బంగార మాయెనా భద్ర శైల
వాస కలనైన కనిపించవా యినకుల
సోమ జాగేల నను బ్రోవ సురవిభు నుత
సుంతయిన దయ జూపవా సుంద రాంగ 18
మాతాపిత పద సేవా
నీత తపఃఫల మది రమణీ యాకాశా
పాతామరాపగా ప్లుత
సీతానాధ పదపద్మ సేవా నిభమే 17
వనముల యంద పురముల గ
ననరుదు మధుర ఫలములు మనసును హరించున్
ఘన పుష్టి దాయ కమ్ములు
కను విందుగ సీమచింత కాయలఁ గనినన్ 16
వీరోచిత పోరాటము
ఘోరారణ్యమున జరుగ కోదండ ధరుల్
సారమ్మయు సమ్మక్కయు
వీర మరణమున సురలుగ పేరొంది రిలన్ 15
మేడారమ్మున నేడు
న్నాడంబరముగ గిరిజన హారం బనగన్
వేడుకగ జాతర జరుగు
నాడ పడుచులం దలచుచు నానందముగన్ 14
తల్లీ పొత్తము పట్టితి
నుల్లము నన్నిలిచి సురుచి రోక్తులు సంశో
భిల్లగఁ బల్కుము ప్రీతిం
జల్లగ నను జూడుమమ్మ చదువుల తల్లీ 13
అల్లమున చిత్రముగఁ బ్రభ
విల్లెను రమణీయముగను విఘ్నేశ్వరుడే
కల్లలు గాదన మహిమల్
చల్లగఁ జూచును జనులను సన్నుతిసేయన్ 12
మార్జాల కిశోరము గనె
లుల్లము రంజింప జేయ నొప్పును మెంతుల్
వెల్లుల్లి జాజికాయలు
నల్ల లవంగమ్ము లిచ్చు నధికపు కోర్కెల్ 22
ద్వారిజ నయనాంబక స్రవ వారి ఘన సుధా
ధారా భరిత కలశ నివ
హారవ సంభ్రమము దెలుపు నక్షయ వారిన్ 21
శమ సహన విజిత ధరణి వృషభవరు సఖునిన్
మమత నధర సుధఁ దనిపెను
సుమమృదునిభతను సలలిత సుహృదయ మలరన్ 20
భువనవ్యాపి శశివర్ణు భుజ చత్వారిన్
సువికసిత ప్రసన్న వదను
ని విఘ్న రాహితికి మదిని నిత్యము దలతున్ 19
వాస కలనైన కనిపించవా యినకుల
సోమ జాగేల నను బ్రోవ సురవిభు నుత
సుంతయిన దయ జూపవా సుంద రాంగ 18
నీత తపఃఫల మది రమణీ యాకాశా
పాతామరాపగా ప్లుత
సీతానాధ పదపద్మ సేవా నిభమే 17
ననరుదు మధుర ఫలములు మనసును హరించున్
ఘన పుష్టి దాయ కమ్ములు
కను విందుగ సీమచింత కాయలఁ గనినన్ 16
ఘోరారణ్యమున జరుగ కోదండ ధరుల్
సారమ్మయు సమ్మక్కయు
వీర మరణమున సురలుగ పేరొంది రిలన్ 15
మేడారమ్మున నేడు
న్నాడంబరముగ గిరిజన హారం బనగన్
వేడుకగ జాతర జరుగు
నాడ పడుచులం దలచుచు నానందముగన్ 14
నుల్లము నన్నిలిచి సురుచి రోక్తులు సంశో
భిల్లగఁ బల్కుము ప్రీతిం
జల్లగ నను జూడుమమ్మ చదువుల తల్లీ 13
విల్లెను రమణీయముగను విఘ్నేశ్వరుడే
కల్లలు గాదన మహిమల్
చల్లగఁ జూచును జనులను సన్నుతిసేయన్ 12
దర్జన దృగ్జాల సంయుత గుహాశయమున్
గర్జితముం దననట సము
పార్జిత ధైర్య సువిహార పరితోషితనున్ 11
జీవన చక్ర గమన ధా
రావాహిక నాపగల నరవరులు గలరే
భావింప జనన మరణము
లీవిధి ననివార్య విష్ణు లీలలు సుమ్మీ 10
[సోడా కొట్టులోని సోడాసీసాలఫోటో జూచి]
అంగా రామ్లజ వాయు త
రంగ సమృద్ధ విమలాతి రస నిక్షిప్తం
బుంగనినం దాహంబు
ప్పొంగదె జనులకు ననిశము మురియరె త్రాగన్ 9
నాపతి యిట కరుదెంచును
పాపాత్ముల రక్కసుల సబాంధవ సఖులం
దాపస వర ఘాతకుల
న్నా పృథివీపతి సుతుండు హత మార్చంగన్ 8
కర్తవ్యోచిత సన్ని
ర్వర్తన సంరంభ దుర్వి వశుడా నరుడున్
కర్తవ్య విహీనుడు కపి
వార్తలఁ జదువఁ గనుడు నరవానర వరులన్ 7
ధనమున్న గలుగు మిత్రులు
ధనమున్న గలుగు బదవులు ధన ధాన్యములున్
ధనమున్న బోవు దోషము
ధన మూల మిదం జగత్కదా తలపంగన్ 6
చెంగావి రంగు చీరను
సింగారించె నొక వనిత సిగలో విరులన్
బంగారు చెలిమి తోడన్
శృంగారవతి చెలి నీలి చీర ధరింపన్ 5
త్మాశిగణ విదార ణాతి దారుణ దృశ్యం
బే శమదమాది గుణ రహి
తాశేష ఝష హరణంబు నవివే కంబే 4
ధవళాంచిత పాత్రంబున
చవు లూరించెడి మధుర రస సమన్విత భ
సువర్ణవర్ణ నిభములవి సుస్వాదువులే 3
కరాకృతిని దాల్చ ఘోరకర విహ్వలతం
గరముం భీతిలి యాతడు
కరాంగుళీసుముకుళిత ముఖార్తుం డయ్యెన్ 2
మిక్కుటముగ రవములెల్ల మితి మీరంగన్
చక్కగ నాడుచు నుండిరి
తొక్కుడు బిళ్ళ ముదమారఁ దోరంపు తమిన్ 1