సాధన విదితం బుత్కట
మేధోద్ధారణ సుకరము మేదిని సారా గాధపద సుఖని మిథ్యా మాధుర్యము లేని భాష మన తెలుఁగు గదా 55 సాధింపంగఁ బటుత్వ మాంగ్లమున భాషాంతర్గ తమ్మేలనో బాధల్ కల్గినఁ జిట్టి పిల్లలకు నింపారంగ నమ్మాయనన్ వేధించం బరిపాటె యాంధ్రులకు నావేశంపు చిత్తమ్ములన్ మాధుర్యం బిసుమంత లేనిది గదా మా యాంధ్ర మీ భూమిపై! 54 [అంతర్గతము= మఱవఁబడినది] మ సితావారణ సుదేహ మహి మాసదృశున్ బిసరుహ నయన పృథ కనియె నసమాన వరప్రదాత హరిదశ్వునకున్ 53 [మయూఖపక్షము = కిరణముల సమూహము] దనపు టలంకరణల విశదపు వ్యాకృతులన్ ఘన వర్ణ నార్థ రతులై వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్ 52 [సమాసము= సంక్షేపము ( ఎక్కువగా మాట్లాడకూడదు), సమాసములు; అలంకరణ = నగలు, అలంకారములు; వ్యాకృతులు = వివరణలు, వ్యాకరణము; వర్ణన = పొగడ్తలు, వర్ణనలు; అర్థము = ధనము, భావము] సునిశిత దోష శోధకుల సూక్ష్మపుఁ జక్షువు లెల్ల దాటుచున్ మనమున నున్న భావమును మాన్యులు మెచ్చగఁ జెప్ప నొప్పగున్ జనహిత చిత్త మోదకర శబ్ద సుయుక్త నిగూఢ భావ సు స్వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా 51 హేతువు లారయన్ జగ దభీష్ట సమృద్ధికి ఘోర దుష్టపుం గూతలు గూసి నట్టి వెడ కుబ్జయ మంథర రామ వైభ వా రాతినిఁ గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చోద్యమో? 50 శక్రుడు సురవిభుడు సంక్రందనుండట పంచ కన్యక యట చంచలాక్షి నుడువ గల రహల్యను జను లిటుల బలా రాతిఁ గూడి చెలియ రాయి యయ్యె 49 ద్ధర్తృ విభూతి గాత్ర భవ తాప విదూరుడు చంద్రశేఖరున్ కార్తిక మాసమందు శితికంఠుని పూజలు సేయఁ బాప మౌ హూర్తికు డావిలాంతమున హోత్రియుడై వెలుగొందు నిత్యమున్ 48 [పాప మౌహూర్తికుడు= దుష్కృతపు జోస్యుఁడు; ఆవిలము= కలుషము] ఆర్తి జనుల సకలాఘా హర్తమని మదిం దలంతు రట శర్వాంత ర్వర్తిత ముత్తమ మాసము కార్తికము నశివుని పూజ గడుఁ బాపమగున్ 47 సదమల పుష్క రాకలిత సాగర గర్భము లందుఁ బొందరే విదళిత మైన వేదన నుపేక్ష వహింపదు రత్నగర్భ స ద్ధృదయముఁ జీల్ప రత్నములు హేమములుం గనవచ్చు నంతటన్ 46 సదమల మనో వికాసుల హృది నివాసు లా పరమ పావన హరి భక్తాగ్ర మునులు మదన బాణార్త విరహంపు మనుజులఁ గని యెదను జీల్పఁ గనంబడు హేమమణులు 45 [హేమమణులు= నారీరత్నములు]
సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక:
అక్కజ మైన ధైర్యమును నందము లొల్కు ముఖారవిందముంజక్కని వేష ధారణయుఁ జారు వచోరు విలాస చూడగా నక్కలకంఠి మాటలు మహామయ శీఘ్ర వినాశ హేతువుల్ మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి నౌషధమ్ముగా 44 శ్రుతి హేలాభవ చిత్త మానవు సదా రోషద్యుతిక్షీణునిన్ హిత కామార్థ విభూతి పూజ్యు సతతై కైకాంబ రాచ్ఛాదితున్ మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే 43
మొదటి అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = లోతైన భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో పొండబడిన సంతోషము కలవానిని
శ్రుతి హేలాభవ చిత్త మానవు = శ్రుతి హేలా + అభవ చిత్త మానవు= వేదములందు తిరస్కారము పుట్టని మనస్సు గల మానవుని
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోషపు కాంతి లేని వాని హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల వలన పూజింపబడు వాడు
సతత+ఏక+ఏక+అంబర+ఆచ్ఛాదితున్ = ఎల్లప్పుడు అంబరమే ఆచ్ఛాదన (కప్పు) గా కలవాడు
మతిహీనాచల భావ పూరుషుని = కోరికలు లేని వాడు, స్థిరమైన భావములు కలవానిని
సన్మానింప సంభావ్యమే.
రెండవ అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = వంకర భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో నపహరింప బడిన సంతోషము కలవానిని;
శ్రుతి హేలాభవ చిత్త మానవు = శ్రుతి హేలా + భవ చిత్త మానవు = వేదములందు తిరస్కారము పుట్టు మనస్సు గల మానవుని;
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోష కాంతులచేత క్షీణుని;
హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల శూన్యుడు;
సతతైకైకాంబరాచ్ఛాదితున్ = ఎల్లప్పుడు నేక వస్త్రము నాచ్ఛాదన గా కలవాడు;
మతిహీనాచల భావ పూరుషుని = మతి హీనుడు, కొండ వంటి (కఠిన) భావములు కలవానిని;
సన్మానింప సంభావ్యమే?
గత కల్మష దర్ప భాస కర్మాసక్తున్ ధృతరాగమానస, కలుష మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ 42 మొదటి అర్థము: నుతజల సన్ముఖ ధౌతున్= మంచి నీటితో కడిగిన ముఖము వాడు; గత కల్మష దర్ప భాస= పోయినకల్మష దర్పములతో భాసిస్తున్న; కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృతరాగమానస = అనురాగముతో నిండిన మనసు వాడు; కలుష మతిహీన= కలుషపు బుద్ధి లేని; పురుషు నుతింప మాన్యులు సుమ్మీ = పురుషు నుతింప మాన్యులే. రెండవ అర్థము: నుతజ=పొగడ్తల వలన కలిగిన ; లసన్ముఖ= వెలిగిన ముఖము; ధౌతున్= కడిగిన వాడు; గత కల్మష దర్ప భాస= పూర్వపు కల్మషము గర్వములు ప్రకాసమానమగు; కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృత రాగ మానసకలుష= నిశ్చయమైన మాత్సర్యపుమనస్సుచేత కలుషితమైన వాడు; పురుషు నుతింప మాన్యులు సుమ్మీ = పురుషు నుతింప మాన్యులే? వివశాత్ముల జేయ నెంచి వేల్పుల నెల్లన్ దివి కేగితివా! చెపుమా! భువి వీడితి వేల బాల మురళీకృష్ణా! 41 గుట్టది రట్టయినఁ దేలు కుట్టిన బరులే దిట్టముగా నింట కవిల కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా 40 [కవిలకట్ట= ఆస్తిపాస్తుల సంబంధమైన కాగితముల కట్ట; బరి= దొంగ] చుట్టము లంచు వత్తురిక చోద్యము మీరగ నెల్ల వేళలం గట్టుడు పన్నులంచు నధికారులు నిత్యము వచ్చి పోదురే పెట్టుదు రంచుఁ గన్నమును వీటికి దొంగలు చింత నొందరే కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా 38 జిన్నాభిన్నములైన గాత్రములు నుత్సేకంబు నక్షీణమై దన్నొప్పార నభీతి భీకరపు యుద్ధంబందు నేపారు రౌ తన్నం జూచిన భక్తి గల్గు మదికిం దత్త్వంబు సుగ్రాహ్యమౌ 37 కన్నీరే సద్గంధపుఁ బన్నీరైనను గుములక వరిపొల మందా వెన్నులు సూచి మురియు రై తన్నం జూచిననె భక్తితత్త్వము దెలియున్ 36 జడ్డ లడ్డమైన గిడ్డ గాక దుడ్డు గడ్డుజడ్డు నొడ్డి దొడ్డ మనసు పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు 35 [జడ్డ=సంకటము; గిడ్డ=పొట్టి; జడ్డు=తగులము] త్రాగ్ర జనార్చ నేప్సిత విహార విభూషిత తోషితాత్ము నే కాగ్రమనోవిలాస సుపరాక్రమ విక్రమ తేజయుక్త సౌ మ్యాగ్రహ మున్నఁ జాలు సుజనావళి మెచ్చును స్తోత్రవాక్కులన్ 34 [వ్యగ్రము= వేగిరిపాటు; పరాక్రమము=సామర్థ్యము; విక్రమము= శౌర్యము; తేజము= ప్రభావము, ప్రకాశము; ఆగ్రహము=అనుగ్రహము] ప్రాగ్రము శాంతము ధరణి స మగ్ర గుణ సమూహముల సదాచారంబే యుగ్రత చెఱచు బనులను ని రాగ్రహ మున్నపుడె మెత్తు రందఱు సుజనుల్ 33 తామరసాన్విత మధుకర తటినిం గనుమా కామద దర్శిత నిర్జర భామార మ్మనుచు ముదిత భర్తను బిలిచెన్ 32 [భామా+ఆరమ్ము=భామారమ్ము; ఆరము = ఒక తటాకము] దద్దినమే లేనిరోజు నా తద్దినమే యద్దిన మగు నిక సుమ్మీ విద్దియ యియ్యది వృధాయె వివరింపంగన్ 31 ఏ దినమందు తద్దినములే కరవౌనొ మదీయ తద్దినం బా దినమౌను నిక్కముగ హాలికు డోర్చునె వర్ష శూన్యమున్ మోదము నీయ నేర్చునె విభూషణ హీనము నీరజాక్షికిన్ కాదనలేరు క్షత్రియులు కయ్యము లెన్నడు వీరవర్యులై 30 హలహల దర్ప సర్పమున హాని యొనర్చగ నెంచి రుగ్రులై మలమల మాడ్చ నెంచిరి యమానుష రీతిని వారణాసి దు ష్పలితముఁ గోరి పాటుపడు వారికి దక్కునె లాభ మెయ్యెడన్ 29 దీటుగ నూహలు మనమున నాటగఁ బరికించ వలె గుణ మగుణము లిలన్ చీటికి మాటికి నాతుర పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్ 28 న్నుల్లము సంతసిల్లఁ గడు నొప్పగు దుస్తుల నెమ్మిఁ దోడు రాఁ దల్లియు దండ్రి భార్యయును దానికఁ బిల్లను, జూడకుండ నే పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్ 27 పండ్లు పువ్వులు కొనకుము పర్వ మందు గుండ్లు నిండిన భూమిని గొనుము వేగ పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ యిండ్ల నవ్వరె కని పువ్వుబోండ్లు నిన్ను 26 క్షుప్ర కరాభిశోభితుడు కోవిదు డుత్తము డెల్ల విద్యలం జప్రము జేరి చూచి కలశమ్ముల నేర్పడ వీడి ఖిన్నుడై విప్రుఁడు మద్యమాంసముల విందనగాఁ దల యూపి వచ్చెనే 25 [సృప్రము=చంద్రుఁడు; ఇక్షుప్రము= ఱెల్లు; ౘప్రము/ౘప్పరము= పందిరి, గుడారము] విజయ దుందుభు లని మ్రోగ వీర వరుడు సర్వ సైన్యాధిపతి భూరి సద్గుణుండు శత్రురాజ శార్దూల సుక్షత్రియుండు ద్విజుఁడు మద్యమాంసమ్ముల విందుఁ గోరె 24 ధృక్త్రాతాయత సద్గుణాత్త విలసద్దివ్యాస్య విష్ణూద్ధతన్ దృక్త్రేతాగ్ని రుచిప్రభా సదృశ సందీప్తాననాశీస్సులన్ వక్త్రస్తోత్ర పరాయణత్వమున నీ వాగ్ధార శ్ల్యాఘ్యంబగున్" 23 [వాక్త్రాణ= వాక్బలము; ధృక్త్రాత= ధైర్యముతోగూడినరక్షకుడు; దృక్త్రేతాగ్ని= చూపులనే మూడగ్నులు] జేరగఁ దప్పు లట వంద శిశుపాలుని నే పార బకారియు,శివుడున్ మారుతి, చక్రాయుధమున, మన్మథుఁ జంపెన్ 22 ఆరగ నేలఁ గృష్ణుఁ బరమాత్ము డటంచును గొల్తు రెల్లరున్ ధీరుడె వీడ టంచును మథించ మనమ్ము మురారి చైద్యునిన్, దారుణ నిందలం గలగి ధర్మ సుతాదుల తోడఁ జూడ నా మారుతి, చక్రమున్ విడిచి మన్మథుఁ జంపెను గ్రూరకర్ముఁడై 21 [మన్మథుఁడు = బుద్ధిని కలవరము చేయువాడు; క్రూరకర్ముఁడు = భయంకరమైన కర్మ చేసిన వాడు] బెగ్గడిల జనులు వదలక బేరము లెల్లన్ డిగ్గున జేయు వినీతుని సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్ 20 [వినీతుఁడు = వర్తకుఁడు] మగ్గంబుల్ పడి యున్న నింట సిరి సమ్మానింపఁ దా నేర్చునే బుగ్గై పోయినఁ బంట కర్షకుని దాఁ బూరించునే విత్తముల్ నుగ్గుల్ సేయగఁ గొండ లన్నిటినిఁ గన్నుల్ నిండు నీరమ్ముతో సిగ్గెగ్గుల్ దమలోన లేని మనుజున్ శ్రీ చేరు నెల్లప్పుడున్ 19 న్మాన మునీంద్ర పూజితుడు ధర్షిత భామయ సత్యభామ తో దానికఁ బారిజాతమును దప్పక తెచ్చెద నంచుఁ బల్కి యా మానిని మానముం జెఱచి మన్ననలన్ మగవాఁడు పొందెరా 18 [మానము = స్త్రీలకు పురుషులయెడఁ గలుగు కోపవిశేషము; మగవాఁడు = శూరుఁడు] అన్న గారి యాజ్ఞను బీముడు దుర్యోధను కట్లు విప్పు సందర్భము: మౌనమున భీమసేనుడు సేనాయుత చిత్రసేన శృంఖల బద్ధుం గానల సుయోధను దురభి మానిని మానమ్ముఁ జెఱచి మన్నన లందెన్ 17
భాషను విన్న రోత యగుఁ బండిత వర్గము గొల్చు నిత్యమున్
రోషము భూషణమ్మట విరుద్ధము లాతని పల్కు లెల్లయున్
దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో 16
శాంత మెరుగని ఘోర పాషాణ హృదయ
మున్నఁ గాషాయ వస్త్రము లూన నింక
నవని ఘోషించునవి కల్ల లైన నేమి
దోషము లరుదు ధనమున్న దుష్టు నందు 15
కండలు నిండుగ నుండిన
మెండుగ నుద్దండు లైన మిండల నెల్లన్
దండిగ చెండాడంగన్
బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే. 14
[మిండఁడు = పురుషుడు]
దండోరా విని సంతసమ్మున ఘనోద్దండక్రియన్ సాగి తాఁ
జండంబౌ మృదు విడ్డెనల్ చిదిమి యాశ్చర్యమ్ముగన్ ముప్పదుల్
గండం బించుక నెంచకుండ నలభై గారెల్ విలాసంబుగన్
బోండా లర్వది యైన నేమి నమిలెన్ భూమయ్య పేలాల్వలెన్ 13
ఘోరమ్ముగఁ జేసిరి యతి గోప్యముగ నదీ తీరము సారపు భూమ్యప హారము గొలిచిన నది పది యామడ లుండెన్. 12 దారుణ మర్థ నాశము నధర్మము ప్రాణ వినాశ కారమున్ ఘోరపు టాజి భూజనులకుం దగ దెన్నడు నిక్కమే సుమీ పారిన దచ్చటన్ రుధిర వాహిని వే జరుగం బగన్ మహా హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ 11 [హారము=యుద్ధము] చిత పద పంకజ నిసర్గ చిత్తానందాం కిత సత్య ధర్మ పాలన ధృత విక్రమ యాతుధాన ధృతి హర! రామా! 10 [నిసర్గ =స్వభావము; చిత్తానందము, సత్యధర్మపాలన కంకితపు స్వబావము కలవాడు] బావన నామ కీర్తనలఁ బన్నుగఁ గొల్చిన సంతసించుచుం బ్రోవగ నేర్చు సంతతము రోషముఁ బూనుచు శాప మిచ్చెడిన్ దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్ 9 కైవల్యానుగ్రహ సు శ్రావితుడు కలియుగ మందు సప్త నగేశుం డీ వేంకటేశు మించిన దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్ 8 వినయ విధేయ తాది గుణ విశ్రుత సచ్చరి తాంత రంగుడే యనయము దైవ చింతనము నాకలి దప్పులె రుంగ డమ్మ శాం త నయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునో మఱి యొప్పునో సఖీ 7 [నయుడు= నీతిపరుడు] తన వారన్న న్గిట్టదు తన మాటయె కాని యొరుల తలపుల వినడే వినయమ లేని వదరుఁబో తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో 6 [వదరుఁబోతు+అనయుఁడు; అనయుడు = నీతిలేనివాడు] వేరే రీతిఁ దలంప నేల వినుమా విస్తారపుం బల్కులన్ దూరం బైనను నేమి సంతసము దాఁ దోడై శ్రమింపంగ నా కారాగారమునందు లభ్యమగు సౌఖ్యంబుల్ ముదం బొప్పగన్ 5 [కార = యత్నము,ఉద్యోగము; కారాగారము = ఉద్యోగము చేయు చోటు, కర్మాగారము] నీరారాతి విధూమాం గారక మిచ్చు ఘన శీతకమ్మున ముదమున్ ఘోర తర నిధాగమ్మున కారాగారమున ఘనసుఖంబులు దక్కున్ 4 [కార+ఆగారము = కారాగారము; కార = మంచుకొండ; మంచుకొండలలో యిల్లు] యియ్యగమున చిక్కితేను నెరుగను మరలన్ గుయ్యిడె నతడు వరూధిని యయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే 3 [అయ్య = పూజ్యుడు] అయ్య నియోగ మంత శిరమందునఁ దాల్చి వనాంతరమ్మునం జయ్యన లక్ష్మణుండు సతి జానకి తోడుగ సంచరించగన్ దయ్యపు రూపు శూర్పణఖ ధార్మికుఁ డున్నత సుందరుండు రా మయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా 2 [ ధార్మికుఁడు = ధానుష్కుఁడు] తగమున సద్ద్వారకన్నుత నివాసుడిలన్ దగ నంబుముక్కు వర్ణుడు బిగి మగువ గన సమయించె విలయుని నరకున్ 1 [అంబుముక్కు = మేఘము] |
ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
1, నవంబర్ 2016, మంగళవారం
సమస్యాపూరణ_నవంబర్ 2016
పద్యాలు_నవంబర్ 2016
నేర మవినీతు లన్నియు
దూరము మానవులు లేని తోరపు భువినిన్
ఘోరారణ్యము పంపిన
రౌరవ మేగినను నరులు లంచముఁ దినరే 22
రామ భవాఘ విరామ
శ్యామల తను రుచి లలామ సద్గుణ ధామా
రామా సత్య పరాక్రమ
భామావనిజహృదయాబ్ధి భాసిత సోమా 21
బాల్యము నుండి కష్ట పడి బాధ్యత లెంచి చరించి భాతృ వా
దూరము మానవులు లేని తోరపు భువినిన్
ఘోరారణ్యము పంపిన
రౌరవ మేగినను నరులు లంచముఁ దినరే 22
శ్యామల తను రుచి లలామ సద్గుణ ధామా
రామా సత్య పరాక్రమ
భామావనిజహృదయాబ్ధి భాసిత సోమా 21
త్సల్యము మీరగం బెరిగి సంపద లెల్ల గడించి యుక్త సౌ
శీల్యము విస్మరించి మరి చీలిన నొండొరులన్ దురాశగన్
దుల్యము పైడి బాతుఁ తెగఁ ద్రుంపఁగ నక్కట మూర్ఖ చిత్తులై 20
అంభోజాక్షుని భూమిపుత్రుఁ జిరుహర్షావేశ దృగ్జాలల
న్నంభోజాననజూచి ఘోర తర బాణాగ్రక్షతేంద్రారి యా
గంభీరానన రౌద్ర రూపి యనురాగహ్లాద సంత్రాస సం
రంభాహార్యుల సత్యభామ గని పోరాడెన్ రణోత్సాహియై 19
అందము లొల్కు మోము పయి హాస మనోజ్ఞ విలాస రేఖలున్
చిందులు వేయఁ జెంప నును సిగ్గులు మొగ్గల రూపు తేరగన్
డెందము నందు ప్రేమ పురడించగ నించుక భీతి చొప్పడన్
సుందరి రుక్మిణీ సతి యశోద కుమారుని గాంచె నచ్చటన్ 18
సుందర వదనారవిందావలోకనా
తత్పర పరివేష్టిత వివశ లల
నావర వచనాభి నందిత భాసుర
వాసుదేవు గొలుతుఁ బరమ పురుషు. 17
భ్రమ వీడి కనియె రుక్మిణి
కమనీయారుణ నయన వికాసప్రభలన్
రమణీయాంచిత ధవళ
ద్రుమసుమ రోచిష్ణు కృష్ణు దుష్ట జనోగ్రున్ 16
తెనుగు హృద్య పద్య దివ్య వనమునందు
శబ్ద పల్లవముల సంకరమ్ము,
తులసి వనము చెఱచ మొలచిన గంజాయి
మొక్క వోలె, సేయ మక్కు వేల? 15
శ్రీరామాయణ కావ్య కర్త ఘన వల్మీకోద్భవుం డిద్ధరన్
తోరంబౌ తరణోద్భవుండు ఘన చిద్రూపుండు వ్యాసుం డిలన్
వారిప్రాంత శరోద్భవుండు శుభ షడ్వక్త్రుండు క్రౌంచారియున్
హీరాభద్యుతి కుంభసంభవుడు యోగీంద్రుం డగస్త్యుం డిలన్
నీరాటార్త పునర్భవార్చిత భవానీ శంకరాచార్యులున్
దారిం జూప నమస్కరింతు మదినిం ద్రైలోక్య సంభావ్యులన్ 14
ఆకాశ వీధిని నసమాన విద్యుల్లతా తతి తోరణవ్రాత మనఁగఁ
బద్మాకరమ్ముల ప్రవిమల ధవళంపు ముత్యాల రతనాల ముగ్గు లనఁగ
ధరణీ తలము వనార్ద్రస్ఫటిక విభవ జలపూర సమతల ఫలక మనఁగ
సప్త సాగరముల ఝషరాశి భీతిలి వేగంబ పాతాళ మేఁగె ననఁగఁ
బురులు విప్పి యాడ ముదిత శిఖిగణము
బెకబెక నినదములు పృథ్విఁ జెలఁగ
వరుణుఁడు కరుణింపఁ బురజనులకు నెల్ల
హర్ష మెసఁగ వచ్చె వర్ష మవని 13
బద్మాకరమ్ముల ప్రవిమల ధవళంపు ముత్యాల రతనాల ముగ్గు లనఁగ
ధరణీ తలము వనార్ద్రస్ఫటిక విభవ జలపూర సమతల ఫలక మనఁగ
సప్త సాగరముల ఝషరాశి భీతిలి వేగంబ పాతాళ మేఁగె ననఁగఁ
బురులు విప్పి యాడ ముదిత శిఖిగణము
బెకబెక నినదములు పృథ్విఁ జెలఁగ
వరుణుఁడు కరుణింపఁ బురజనులకు నెల్ల
హర్ష మెసఁగ వచ్చె వర్ష మవని 13
వీణా తంత్రుల మీద నాట్యమును ప్రావీణ్యమ్ముగన్ సల్పుచున్
వాణీ హస్త నఖాంకురప్రతతి భవ్యాంభోజ రేఖాభలై
ప్రాణిశ్రేణుల సృష్టికర్తృ చికురాపారాళి సంచారముల్
వీణాపాణి కరాంచి తోద్భవములై విద్యోత మానమ్ములే 12
బహు కష్టము తెలిసి పలుక
బహుళమ్మగునత్వసంధి వనజజు కైనన్
విహరించు నిష్ట గతిని క
లహకారణము కవులకు నిలఁ దరింపుహరీ! 11
గేహమున రేగఁ గలతలు
బాహువుల బలము సడలినఁ బరువము జారన్
దేహమునఁ జెలగ జాడ్యం
బోహో యిక వాని వెతలు నోర్వగఁదరమే 10
మత్తేభారిస్కంధుని
మత్తేభప్రాణ దాత మాధవు గొలుతు
న్నుత్తుంగాభంగ తరం
గోత్తంసోత్కర దయాపయోనిధి గుణధిన్ 9
కరివర వరదు మకరి హరు
హరినిభకటి మురహరి నరహరి ఘనకిటినిన్
హరిగణ విభునుతు భవభయ
హరు ముదముగ గొలుతు హరిని హరిఫణ శయనున్ 8
కమలార్చిత పద కమలము
కమలాసనున కభయంపు కరములు కరమా
ల మరులు కొనియెడి సుమములు
సుమ దామ విలసిత కంఠు సుందరు గొలుతున్ 7
కమల విలసితము:
దశరథ తనయ సదమల చరిత్రా
కుశలవ జనక సుగుణ గణ ధామా
శశినిభ ముఖ హరి సదృశ సుమధ్యా
దశశిర విదళన ధరణిజ నాథా 6
కనిపెంచి పెద్ద జేసిన తల్లిదండ్రులఁ జదువులు నేర్పిన
సద్గురువులఁ
బుట్టి పెరిగినట్టి పుణ్య భూమిని నాట పాటల జదివిన పాఠశాలఁ
గలసి మెలసి తమకంబున నాడిన చిననాటి దట్టంపు చిట్టి సఖుల
నాపద లందున నాదుకొన్న ఘనులఁ జేయూత నర్థించి రోయు జనుల
వృద్ధ జనుల నెల్ల వెలదుల బాలల
మూగ జీవ రాశిఁ బుడమి నున్న
వినయ మతిశయిల్ల విబుధ జను లెపుడు
విస్మరింపఁ దగదు విమల మతిని 5
కందుకపు క్రీడలాడిరి
సుందరవదనారవింద శోభిత రమణుల్
కందర్పబాణవిద్ధలు
మందస్మిత చిద్విలాసుమాధవు తోడన్ 4
ఇంద్ర వజ్రము:
ధర్మమ్ముసత్యమ్ము సదాస్మరింపన్
మర్మంబు మంత్రంబు సమాచరింపం
గర్మంబు నిత్యమ్ము ప్రకాశ మైనన్
నైర్మల్య రాజ్యంబు ఘనంబు సుమ్మీ
3
మర్మంబు మంత్రంబు సమాచరింపం
గర్మంబు నిత్యమ్ము ప్రకాశ మైనన్
నైర్మల్య రాజ్యంబు ఘనంబు సుమ్మీ
3
కన్న తల్లిదండ్రులుమరి గనిరి దివిని
తోడ బుట్టిన యక్కలు
దూరమాయె
కట్టు కొన్నసాప్త పదియు కాల మొందె
నకట భారమయ్యె బ్రతుకు నవని నిపుడు 2
చిత్తాభ సత్వతరు మరు
దుత్తమ వేగున్ జితేంద్రియు నధికమతి
హ
ర్యుత్తమ వరాధికు ఘన మ
రుత్తనయున్ రామదూత రూఢిగఁ గొలుతున్ 1
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)