ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
1, డిసెంబర్ 2022, గురువారం
సమస్యాపూరణ_డిసెంబర్ 2022
1, నవంబర్ 2022, మంగళవారం
సమస్యాపూరణ_నవంబర్ 2022
31, అక్టోబర్ 2022, సోమవారం
Talupulamma Tallii Trisati
తలుపులమ్మ
తల్లీ త్రిశతి.
వింశతి
పద్య ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.
5/1/2020.
|
తలుపులమ్మ
వృత్తము. |
శ్రీకరమై వెల్గు
నీ పాద చిహ్నములు మది నిల్పి భక్తిన్ నీ కథ లన్నింటి
నింపార నెమ్మి దలఁచుచు సంతత మ్మే వీఁకఁ జరింపంగఁ
గారుణ్య వీక్షణముల నొసంగుమా దే వీ!
కరుణాంభోనిధీ! మాకుఁ బెన్నిధి! తలుపులమ్మ తల్లీ! |
1. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
ఒక్కొక
గ్రామంబు నందుందు వొక్కొక యభిధఁ బ్రస్తుతింపం జక్కఁగ నిత్యమ్ము
మా యూరి సంతస మలర గోగులమ్మా దక్కఁగ
నీకక్క ముత్యాల తల్లినిఁ గదిసి యుంటి వమ్మా పెక్కురు
మ్రొక్కంగ నిన్మాకుఁ బెన్నిధి! తలుపులమ్మ తల్లీ! |
2. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
అమ్మలఁ గన్నట్టి
పెద్దమ్మ వందఱిఁ గనుచు నుండఁగా నే లమ్మరొ మాకింక
దుఃఖంబు లారయఁ బుడమి భక్తితో మే మిమ్ముగ నింగొల్వఁ
గెందమ్మి యీక్షణ శశి నిభాననా నీ విమ్మిల మా
కెల్ల సౌఖ్యమ్ము లింపుగఁ దలుపులమ్మ తల్లీ! |
3. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
అజ్ఞత నిన్నేర
కుండంగ నన్య సురలను గొల్వఁగా నే విజ్ఞులు బోధింప
రారమ్మ పేర్మినిఁ గడు విచిత్రమే య ల్పజ్ఞుల
మేమమ్మ నీవుండఁ బన్నుగ వెతలఁ గాంతుమే వే దజ్ఞవు లోకైక
మాతా! యుదారద! తలుపులమ్మ తల్లీ! |
4. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
విద్దెలు రాణించుఁ
గీర్తింపఁ బెద్దగ నుతుల నిన్ను భక్తిన్ ముద్దుగఁ
బ్రొద్దెల్లఁ బాడంగ నొవ్వ గళము భవమ్ము లాఱున్ సుద్దులఁ బూజింప
నిత్యమ్ము చొప్పడు సిరు లనంత రాశుల్ తద్దయు
నిన్నెంచ నీవౌదు త్రాతవు తలుపులమ్మ తల్లీ! |
5. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
తద్భవ సంసార
పాథోధి దాటఁగఁ దరణ మౌదు వమ్మా యుద్భవ పాపౌఘ
వల్లీ వరోగ్ర నిశిత కుఠార మీవే యద్భుత
కారుణ్య రత్నాక రాంబువుల మము ముంతువమ్మా సద్భట
సంచారవై కొన్ము సన్నుతిఁ దలుపులమ్మ తల్లీ! |
6. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
చక్కఁగ నా శారదా
దేవి సంస్తుతి వలనఁ గల్గు విద్యల్ మక్కువ నా
మాధవీ దేవి మన్ననల నగు విత్త రాశుల్ తక్కక నా పార్వతీదేవి
దక్కెడు కొలువ మంగళమ్ముల్ సిక్కును నిన్నెంచి
కీర్తింప శీఘ్రమ తలుపులమ్మ తల్లీ! |
7. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
మూకలు పల్కంగఁ
బల్కంగ మూరెన తలఁపు తల్పు గాఁగన్ వ్యాకరణ మ్మేల
మాకింకఁ బన్నుగఁ బలుక నట్టు లైనం దాక నిరోధింపఁ
దల్పుల్ గదా కలుషితములౌ తలంపుల్ ప్రాకటమే యమ్మ
నామమ్ము పావని తలుపులమ్మ తల్లీ! |
8. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
వత్తురు నిన్వేడ
నిత్యమ్ము పామర జనులు దూరదర్శుల్ తెత్తురు
మ్రొక్కుల్ నిదానమ్ము తీర్చఁగఁ జెలఁగి నీకు భక్తిం జిత్తము నందుంచి
మత్తిల్లి చిందు లలయఁగఁ ద్రొక్కుచుందుర్ వత్తువు కాపాడ
నీవంచు వారక తలుపులమ్మ తల్లీ! |
9. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
జాతర వీక్షింతు
వుప్పొంగి చారువదన విలాస లీలన్ మ్రోతలు
మ్రోగంగ వాద్యాలు ముమ్మరముగఁ బురమ్ము లోనన్ నేతుల
నైవేద్య మీయంగ నేరముల గణియింప కమ్మా వ్రాతలు
మావెల్ల మార్చంగ రమ్మిఁకఁ దలుపులమ్మ తల్లీ! |
10. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
కన్నులు
సూర్యుండు చంద్రుండు గాఁగ ననిశము వెల్గుచుండం జెన్నుగ
శూలంబు హస్తంబుఁ జేరి మఱి విలసిల్లు
చుండం బన్నుగ
సింహంబు రౌద్రంపు వాహన మగుచుఁ గొల్చు చుండన్ దన్నుగ
నీవుంటి వమ్మా సతమ్మిలఁ దలుపులమ్మ తల్లీ! |
11. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
ఎవ్వరు
నేమేమి నీ కీయ నీ ధర నెలమిఁ గొందువమ్మా యెవ్వరు
కేల్మోడ్చి నిన్నెంచి యేమొఱ లిడినఁ
గాతువమ్మా దవ్వులఁ దా
ముండి రాలేక తల్చ నిను మది వత్తువమ్మా నొవ్వులు
రావమ్మ నోఁచంగ నోములు తలుపులమ్మ తల్లీ! |
12. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
పేరులు
నీ కుండు వేవేలు పెద్ద వట యిల నమ్మలందుం గోరఁగ
నెవ్వారి కిన్నీవు కొంగు పసిడివి యౌదు వమ్మా దారులు
లేకున్నఁ జూపంగ దారిని నవుదు వీవు దిక్కే పేరిమిఁ
జూడంగ మా కీవు పెన్నిధి తలుపులమ్మ తల్లీ! |
13. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
రా వకటా సుద్దు
లర్చింప రాగముల దయఁ జూపు మమ్మా లే వకటా సొమ్ము
లర్పింప లేశమును నను గావు మమ్మా చేవయు నా
బొంది లేదమ్మ చేరి నిను గొలువంగఁ దల్లీ యే విధి
నన్నింక రక్షింతు వింపుగఁ దలుపులమ్మ తల్లీ!
|
14. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
చాలిఁక నూరంత
మార్మ్రోగు చప్పుడులు గుడి దద్దరిల్లం జాలిఁక
నాట్యమ్ము లల్లాడఁ జట్టలు వెకిలి చేష్ట లింకం జాలిఁకఁ
గ్రూరంపుఁ బాపంపు జంతు బలు లవి మాన్పుమమ్మా చాలదె
పూజింపఁ జూపించి శాంతము తలుపులమ్మ తల్లీ! |
15. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
పర్వత
పక్షాళి సంహార వాసవ ముఖ సురాళి వంద్యా! పూర్వ సకౌబేర
దిఙ్నాథ మోద కర జగ దేక మాతా! సర్వజ నారాధ్య
దుర్భేద్య శక్త్యనుపమ శివార్ధ భాగా! యుర్విని నీ
వుండ మాకుండు నూఱట తలుపులమ్మ తల్లీ! |
16. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
గుహ్య తరం బౌను
నీమాయ కోమలి సురవ రాళికిన్ నీ వాహ్యము దైత్యాళి
కెంచంగఁ బ్రాణ పవన వినాశకంబే లేహ్యము నీచూపు
పాపఘ్న లేపన నిచయ సన్నిభమ్మున్ సాహ్యము నిత్యమ్ము
మాకిమ్ము శాంభవి తలుపులమ్మ తల్లీ! |
17. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
చక్ష్వమ లోత్తుంగ
పక్ష్మ ప్రచార మిడు జన విహ్వలమ్మున్ భిక్ష్వవలోక ప్రకాంక్ష
ద్రవీకృత విమల దివ్యచిత్తా యిక్ష్వతి మాధుర్య
ధారా మహేక్షణ రుచిర రూప! ప్రజ్ఞా చక్ష్వవిరామ స్తుతీద్ధ
ప్రజాక్షిద! తలుపులమ్మ తల్లీ! |
18. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
సవ్యపుఁ జారిత్ర్య
మే నూని సత్య గతిఁ జరియింప నిమ్మా కావ్యము లల్లంగ
భవ్యమ్ముగా మఱి గిరలు నేర నమ్మా దివ్యతమం బైన
త్వన్నామధేయము మది స్మరింతుఁ బూజా ద్రవ్యము లర్పించి
పూజింతుఁ దప్పక తలుపులమ్మ తల్లీ! |
19. |
|
|
|
|
|
తలుపులమ్మ
వృత్తము. |
క్షుద్రము లా
పూజ లేలమ్మ కోరుదు సలలి తాంతరంగా! రౌద్రము నీ కేల
నూనంగ రాగమయ హృది భద్రకాళీ! రుద్ర తనూద్భాసి
తార్ధాంగ! లోలిత నయన పద్మయుగ్మా! భద్రము లింపార
మాకిమ్ము భార్గవి! తలుపులమ్మ తల్లీ! |
20. |