ఆటంకవాదులు:
ఏజ్ఞానమ్ము గడించ నేరకయు ద్వేషేర్ష్యాది దౌర్బల్యయు
క్తాజ్ఞాతస్థిత దుర్జనవ్రజమనో~ర్థాశానిశోద్రిక్త చి
త్తజ్ఞాతిద్విషదుర్వివేకమొసఁగుందాపమ్ము గర్వోత్పతి
త్రజ్ఞానమ్ము వికాసదాయక మహో రాగమ్ము పండించెడిన్ 84
నేర్చితి ఛందమ్ము నర్చించి గురువు శంకరు వ్రాసితిని శతకమ్ము నొకటి
పౌగండ మందు యౌవన మెల్ల కుక్ష్యర్థ మడరంగ నుద్యోగ మందు నిందు
భాతృ చోదన మంత భాసిల్ల శంకరాభరణ సమస్యా కవనము లల్ల
రతి వేంకటేశ్వర రామచంద్ర మఱియుఁ బోచిరాజ శతకము లలరించి
వ్రాసి పద్మావతీ శ్రీనివాసము ద్విప
దమ్ము సుందర కాండ యంత రచియించి
తిని తెనుఁగు భగవద్గీత తెల్లముగను
వెలయ నారాయణీయము నలరె నిపుడు 83
శ్రీ గణేశ శంకర రామ రాగ నుతులు
శ్రీద బ్రతుకమ్మ పాటయు హృద్యముగను
గూర్చి దైవత శ్లోకము లర్చ నార్హ
గతి నవగ్రహ స్తుతి రచించితి ముదముగ 82
ఆంధ్ర ప్రదేశము నందలి గౌతమీ ప్రాఙ్మండలపు దొడ్డవరము నందుఁ
దొలి చదువు చదివి మలి చదు వది మామిడి కుదురు పురి మొదటి గతి నేర్చి
యమలాపురమున విద్య యొక యేఁడు చదివి యంత్ర మర్మము విజయ పురి నరసి
యుద్యోగ మణుసంస్థ నొప్పుగ నున్నత విద్యలు ననువుగఁ బేర్మిఁ బడసి
పిమ్మట నొజ్జనై విద్య గఱపితి భాగ్య నగరి నలరఁగ నాలు సంతు
భారతీ సత్కృపా వర్ష పాత మంది
పూనితిఁ గవిత్వమును వ్రాయ బుధులు మెచ్చ
రక్తి నుంచి మురారిపై రాయపురిని
వంత వీడి సతము రచియింతు నేను 81
బుద్ధిమంతుల కోపమ్ము శుద్ధ హిమము
చెడ్డ వారి యలుక యుండు చివరి వఱకు
వేలవేల యుగము లైన వీడ కలుక
భానుఁ గబలించి పట్టె స్వర్భానుఁ డకట 80
ఖతలం బెల్లయు దుఃఖ సాగర చలత్కల్లోల సందోహ మ
గ్నత నాదిత్య రుచి ప్రభా రహితమై కన్పట్టె భూలోక సం
తతి నిత్యోచిత కార్య భగ్న భవ సంతప్తాంత రంగంబునన్
నత శీర్ష స్తితి నిల్చె నింపుగను బ్రాణాయామముం జల్పుచున్ 79
జననం బంది సు కౌశి కాన్వయమునన్ సద్బ్రాహ్మణజ్యోత్స్నఁ జి
ద్ధన రాజత్కపిలేశ్వరాఖ్య పురి విద్యాశుద్ధ చేతస్కుఁడై
మనమం దెన్నఁడు విష్ణు నామ రతి నే మాత్రమ్ము క్షీణింప నే
రని వృత్తమ్మున గ్రామపాలకుఁడు బేర్రాజాఖ్య జీవించెనే 78
ద్వ్యక్ష రాది త్యారాధనము :
నీ నామ మేను మనమున
నూని మనో మననమున నిను నమః నా నే
నేని మననీ న నన నను
మాన మిన! మనమున మాని మననీ నన్నున్ 5/8/2018. 77
[నీ నామము ఏను మనమునన్ ఊని మనో మననమున నిను
నమః నాన్ ఏను ఏని మననీ నను అన అనుమానము ఇన!
మనమున మాని మననీ నన్నున్ ]
నేను నేనంచు నెల్లరు నిక్కు చుంద్రు
నా శిరమ్ము నా కన్నులు నా మన మని
కలవరించు చుండంగ నా కాయ మందు
నాది నాదన్న దానిలో నేది నేను 76
కాళ్లు లేనివి యున్నవి కాంచఁ జగతి
కాళ్లు రెండుండు నరులకుఁ గాంతలకును
నాలు గాఱు మించియుఁ గాళ్లు నేల నుండు
నేల జీవుల కీ భేద మేరి కెఱుక 75
అంద దేరికి నెన్నఁడు నాకసమ్ము
నీర మిల మూడు వంతులు మూరి యుండు
నాకమున నీరు వాయువై వీఁక నుండు
నెవ్వఁ డుంచెను వీటిని నేరి కెఱుక 74
కంటికిం గాన రాకుండు గాలి యెపుడు
నొంటికిం దెలియని శక్తి మంటి కుండు
నంటి నంతఁ గాల్చు ననల మొంటి నెల్ల
నెట్టు లేర్పడె నివి యెల్ల నేరి కెఱుక 73
అణువు నందుండు వేర్వేఱు కణము లంట
బిందు వుండు నంట నడుమఁ గందకుండఁ
జుట్టు తిరుగంగ నవి యెల్లఁ బట్టు పట్టి
యెవ్వఁ డట్టులు గూర్చెనొ యేరి కెఱుక 72
పూసి రెవ్వరు రంగులు పూల కెలమి
నేల వాసన లీనును బూలు కొన్ని
యిచ్చి రెవరు ఫలములకు మెచ్చి రుచులు
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు 71
ఱాతి నడుమున జీవించుఁ బ్రీతిఁ గప్ప
పండు లోపల నక్కి పుర్వుండుఁ జుమ్ము
వాన రాఁబుట్టు మట్టిలో వాన పాము
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు 70
ఉంచుఁ బిల్లను దన పొట్ట సంచి నొకటి
చెట్టు లెక్కునొకటి పిల్ల పట్టఁ బొట్ట
గొయ్యి త్రవ్వి గ్రుడ్డుల నుంచు నయ్య యొకటి
యెట్టు లీ విద్య లబ్బెనొ గుట్టు సుమ్ము 69
పాఱు నంతరిక్షమ్మున మీఱి యినుఁడు
కృష్ణ బిలరాశి చెలరేఁగుఁ దృష్ణ తోడఁ
జెంతఁ జేర నన్నియుఁ బోవు నంతు లేక
కారకుఁ డెవండు ధరలోన నేరి కెఱుక 68
ఉన్నవి మృతికిఁ ద్రుటి ముందు నన్ని బొంది
పుట్టు టేరికి నెక్కడ గుట్టు సుమ్ము
గిట్టు టెట్టుల నెన్నడు గుట్టు కాదె
యెట్టు లుండును నడిమిని గుట్టె యౌను
గుట్టు లేరికి నెన్నడు పట్టఁ దరము 66
సందు లేనంత కోటను గందిరీగ
తేనె లూరు మైనపు టిల్లు తేనెటీఁగ
మేలు వల నోటి నూలున సాలెపుర్వు
కట్ట విశ్వము వింతల పుట్ట కాదె 65
పంచదారను గని చీమ పంచఁ జేరు
మాఁగ నింట మామిడి పండు మూఁగు నీగ
యప్పు నిండఁగ గుంటను గప్ప సేరు
మేటి విద్య లబ్బె నెటుల వాటి కిట్లు 64
కాన రానంత చిన్నవి కలవు కొన్ని
కొండ కన్నను బెద్దవి కొన్ని కలవు
నేల నీట నింగి చెలంగి నివ్వటిల్ల
నంతు గాంతుమె విశ్వంపు వింతలకును 63
బళ్ళు తెప్పించి పయనింపఁ గీళ్లు నొచ్చు
యోడ లందు బోనెంచిన నొళ్లు తూలు
గగన యానమ్ము సేయంగఁ గాళ్లు లాగు
భూమి యానము నెఱుఁగమే యేమి వింత 62
తోయ మాక్రమించెఁ పుడమి హాయిగాను
మూడు వంతులు చుట్టును ముచ్చటగను
భూమి గిఱ్ఱునఁ దిర్గుచుఁ బోవుచుండఁ
దొనఁక దిసుమంత వింతగఁ దోయ మరయ 61
సంతరించును జిఱు విత్తు సాలరూపుఁ
జాల నిద్రించి పుర్వగు లీలఁ జిలుక
గ్రుడ్డు పగులఁగ నగుఁ బక్కి గూటి లోన
మఱి పురుడు పోసె వాటి కే మంత్రసాని 60
వాయు వహ్ని తోయములకుఁ బాద పాద్రి
జలచర విహగ నర జంతు జాలములకుఁ
గాంచ నాధార మీ భూమి క్షమను మిన్న
దాని కాధార మెద్దియో తలఁచ నగునె 59
జల వాయు రిక్త భోజన
లలి తామల వర్త నానురాగ మనస్కా
ఖిల జన సాదర వర దృ
గ్వలయ పరివృ తాంగ భాస భట్టార నతుల్ 58
మొన్న యొక్క యూరు నిన్న వేరొక్కటి
నేఁడు గాంచ నింక వీడు వేరె
యెప్పు డేది యేరి కేమగు నిఁక నేరి
కెఱుక యెఱుక కలుగ మఱవ నేల 57
వరవనితా జన మోదక
మురళీ ధర పింఛ దామ మోహన రూపా
మర గణ సేవిత రామా
వరజ పరంధామ కృష్ణ ప్రణతులు గొనుమా 56
కమలాప్త భూ నభో జన
రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా
కమలాప్త భూ నభో జన
రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా 55
[కమలాప్త: లక్ష్మీ దేవి చేఁ బొందఁ బడిన వాఁడు, విష్ణుమూర్తి.
కమలాప్త : పద్మములకు మిత్రుఁడు, సూర్యుఁడు.
లావణ్యాంగా : అందమైన దేహము కలవాఁడా
లావణ్యాంగా : సముద్ర జలము (లవణముతోఁ గూడినది) తో నిండిన నోరు కలవాఁడా]
అత లామ్నాయ ధరాది లోక సహి తాజాండోల్ల లాభీల భం
జిత నీడోద్భవ జంతు సంచయ పయో జీవ్యౌఘ సద్యః కృ తా
నత దేవాలి నృసింహ విగ్రహ! హిరణ్యప్రాశనఘ్నా! త్వ దా
శ్రిత భక్తోత్కర పాలకా! వెలసితే సింహాద్రిఁ గొన్మా నతుల్ 54
దుర్గ! దత్త గాత్ర తుష్టాంతరంగ భ
ర్గా! గగన దుకూల కాయ రమణ!
దేవ నుతి నికాయ తృప్త! సర్గ స్థితి
విలయ కార్య భార విలసి తాంబ! 53
మన్మోహమ్ము నశింపఁ జేసి జగదంబా! కావుమా కాళికా!
సన్మాయా తను కామ రూప విలసత్సాహస్ర నామాత్మికా!
సన్మానార్చక నిర్జ రోత్కర సదా సంసేవ్య మానాంబికా!
తన్మూర్తిత్రయ రూప ధారిణి! జగద్రక్షైక మాతృత్రయీ! 52
వీరాలాపము లాడితే మఱచితే భీతిల్ల నేలా మన
స్సారక్షీణము ధైర్యలోపము నిరాశం జెందిరే యెన్నడుం
దారాధ్వమ్ము నతిక్రమించు పర సంతానోత్కరత్రాస దు
ర్వారోత్సాహముఁ జూపరే క్షితిపు లర్వాచీన కథ్యమ్ములన్ 51
ఆధునిక శాస్త్ర విద్యా
బోధము క్షుద్భాధఁ దీర్చుఁ బూర్ణ రుచిర భా
షా ధారణమ్ము జన చి
త్తాధీ నానంద మొసఁగు నంచిత కళయై 50
భవబంధమ్ములఁ జిక్కి మేము కలి దుర్వారాఘ రాశిన్ మునిం
గివివేకచ్యుత చిత్త కర్దమమునంగ్రీడించఁగా నిన్ను గా
కెవరిన్ వేడుదు మయ్య ప్రోవు మని రావే భక్త మందార భ
వ్య వరౌఘప్రద శ్రీ రమా సహిత దేవా సత్యనారాయణా! 49
పద్మాక్షు పద్మ నాభుం
బద్మా చిత్తేశుఁ బద్మ భవ గురు దేవుం
బద్మా హృదయ సరోవర
పద్ముం బద్మోద్భవాండ పాలకుఁ గొలుతున్ 48
ఈ చదువుల్ ధరా జనుల కీఁ గలవే యజ వాస మక్కటా
యీ చవి లేనివౌ పదవు లిచ్చునె భవ్య వికుంఠవాసమే
యీ చదరంగ మాటలు సురేశ్వర లోక నివాస మిచ్చునే
దాచ ధనమ్ము నన్య ధరఁ దా లవణాంబుధి వారి తుల్యమే 47
స్వీయ కల్పిత నూతన వృత్తము: మందారము
ఛందము: 20 , కృతి; వృత్తము సంఖ్య : 1.
మ మ మ మ మ మ గగ; ప్రాస కలదు; 10 వ యక్షరము యతి.
భామా రత్నంబుల్ వే విత్తంబుల్ భాగ్యాగారశ్రేణుల్ బంధువ్రాతంబ
య్యా మాయల్ ధాత్రిన్ దాటంగన్ సాధ్యంబౌనే యాదిత్యాపత్యశ్రేష్ఠుండా
కామగ్రామంబుల్ రేగెన్ నాలోఁ గావన్ రావే వేగం గాకుత్స్థజ్యోతీ
రామా సీతానాథా నా కీయన్ రావయ్యా ముక్తిం గారుణ్యాంభోరాశీ 46
విఘ్నారణ్య కుఠార! భక్తజన దుర్భే ద్యావనీ వాస పా
పఘ్నా! నిర్జర పూజితాంఘ్రి యుగ! దుర్వా రోగ్ర దుర్దాంత శ
త్రుఘ్నోదార దయా రసామృత మహోత్తుంగాత్మ! షడ్వక్త్ర గ
ర్వఘ్నా! విఘ్నపతీ! నుతింతు నిను గాపాడంగ రావే దయన్ 45
సమధి కానంత విశ్వాండ సమ్య గావ
రణ విరాజమాన చరాచర నయన యుగ
గోచ రాగోచర ప్రాణి కోటి సంభ
వైక కారణ పరమాత్ము నాత్మఁ గందు 44
నను నీ విత్తరి వీడి యొంటరిగ యానం బైతి వేకాంతమే
కన రానట్టి సుదూర తీరములకుం గాంతామణీ న్యాయమే
తనువుల్ ప్రాణము లొక్కటే యనఁగ నిత్యం బెంచి పాటింప నే
రని నిన్నక్కట యేమనంగఁ దగు నా బ్రాహ్మంబ యిట్లుండగన్ 43
ఫల్గు దురంత కార్యచయ భంజన! చిత్తము నందు స్వార్థమే
కల్గ నెఱుంగ వీ వెపుడుఁ గామ మదోద్ధృత ఖాండ వాటవీ
ఫల్గుణ! బంధు మిత్ర జన వర్గ సమంచిత పూజ్య పూరుషా!
వెల్గితి వీవు దొడ్డవర వీర్య జనప్రవ రాధి నేతవై 41
ఏజ్ఞానమ్ము గడించ నేరకయు ద్వేషేర్ష్యాది దౌర్బల్యయు
క్తాజ్ఞాతస్థిత దుర్జనవ్రజమనో~ర్థాశానిశోద్రిక్త చి
త్తజ్ఞాతిద్విషదుర్వివేకమొసఁగుందాపమ్ము గర్వోత్పతి
త్రజ్ఞానమ్ము వికాసదాయక మహో రాగమ్ము పండించెడిన్ 84
నేర్చితి ఛందమ్ము నర్చించి గురువు శంకరు వ్రాసితిని శతకమ్ము నొకటి
పౌగండ మందు యౌవన మెల్ల కుక్ష్యర్థ మడరంగ నుద్యోగ మందు నిందు
భాతృ చోదన మంత భాసిల్ల శంకరాభరణ సమస్యా కవనము లల్ల
రతి వేంకటేశ్వర రామచంద్ర మఱియుఁ బోచిరాజ శతకము లలరించి
వ్రాసి పద్మావతీ శ్రీనివాసము ద్విప
దమ్ము సుందర కాండ యంత రచియించి
తిని తెనుఁగు భగవద్గీత తెల్లముగను
వెలయ నారాయణీయము నలరె నిపుడు 83
శ్రీ గణేశ శంకర రామ రాగ నుతులు
శ్రీద బ్రతుకమ్మ పాటయు హృద్యముగను
గూర్చి దైవత శ్లోకము లర్చ నార్హ
గతి నవగ్రహ స్తుతి రచించితి ముదముగ 82
ఆంధ్ర ప్రదేశము నందలి గౌతమీ ప్రాఙ్మండలపు దొడ్డవరము నందుఁ
దొలి చదువు చదివి మలి చదు వది మామిడి కుదురు పురి మొదటి గతి నేర్చి
యమలాపురమున విద్య యొక యేఁడు చదివి యంత్ర మర్మము విజయ పురి నరసి
యుద్యోగ మణుసంస్థ నొప్పుగ నున్నత విద్యలు ననువుగఁ బేర్మిఁ బడసి
పిమ్మట నొజ్జనై విద్య గఱపితి భాగ్య నగరి నలరఁగ నాలు సంతు
భారతీ సత్కృపా వర్ష పాత మంది
పూనితిఁ గవిత్వమును వ్రాయ బుధులు మెచ్చ
రక్తి నుంచి మురారిపై రాయపురిని
వంత వీడి సతము రచియింతు నేను 81
చెడ్డ వారి యలుక యుండు చివరి వఱకు
వేలవేల యుగము లైన వీడ కలుక
భానుఁ గబలించి పట్టె స్వర్భానుఁ డకట 80
ఖతలం బెల్లయు దుఃఖ సాగర చలత్కల్లోల సందోహ మ
గ్నత నాదిత్య రుచి ప్రభా రహితమై కన్పట్టె భూలోక సం
తతి నిత్యోచిత కార్య భగ్న భవ సంతప్తాంత రంగంబునన్
నత శీర్ష స్తితి నిల్చె నింపుగను బ్రాణాయామముం జల్పుచున్ 79
జననం బంది సు కౌశి కాన్వయమునన్ సద్బ్రాహ్మణజ్యోత్స్నఁ జి
ద్ధన రాజత్కపిలేశ్వరాఖ్య పురి విద్యాశుద్ధ చేతస్కుఁడై
మనమం దెన్నఁడు విష్ణు నామ రతి నే మాత్రమ్ము క్షీణింప నే
రని వృత్తమ్మున గ్రామపాలకుఁడు బేర్రాజాఖ్య జీవించెనే 78
నీ నామ మేను మనమున
నూని మనో మననమున నిను నమః నా నే
నేని మననీ న నన నను
మాన మిన! మనమున మాని మననీ నన్నున్ 5/8/2018. 77
[నీ నామము ఏను మనమునన్ ఊని మనో మననమున నిను
నమః నాన్ ఏను ఏని మననీ నను అన అనుమానము ఇన!
మనమున మాని మననీ నన్నున్ ]
నేను నేనంచు నెల్లరు నిక్కు చుంద్రు
నా శిరమ్ము నా కన్నులు నా మన మని
కలవరించు చుండంగ నా కాయ మందు
నాది నాదన్న దానిలో నేది నేను 76
కాళ్లు రెండుండు నరులకుఁ గాంతలకును
నాలు గాఱు మించియుఁ గాళ్లు నేల నుండు
నేల జీవుల కీ భేద మేరి కెఱుక 75
నీర మిల మూడు వంతులు మూరి యుండు
నాకమున నీరు వాయువై వీఁక నుండు
నెవ్వఁ డుంచెను వీటిని నేరి కెఱుక 74
నొంటికిం దెలియని శక్తి మంటి కుండు
నంటి నంతఁ గాల్చు ననల మొంటి నెల్ల
నెట్టు లేర్పడె నివి యెల్ల నేరి కెఱుక 73
బిందు వుండు నంట నడుమఁ గందకుండఁ
జుట్టు తిరుగంగ నవి యెల్లఁ బట్టు పట్టి
యెవ్వఁ డట్టులు గూర్చెనొ యేరి కెఱుక 72
నేల వాసన లీనును బూలు కొన్ని
యిచ్చి రెవరు ఫలములకు మెచ్చి రుచులు
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు 71
పండు లోపల నక్కి పుర్వుండుఁ జుమ్ము
వాన రాఁబుట్టు మట్టిలో వాన పాము
వింత లెన్నంగఁ దరమౌనె విశ్వ మందు 70
చెట్టు లెక్కునొకటి పిల్ల పట్టఁ బొట్ట
గొయ్యి త్రవ్వి గ్రుడ్డుల నుంచు నయ్య యొకటి
యెట్టు లీ విద్య లబ్బెనొ గుట్టు సుమ్ము 69
కృష్ణ బిలరాశి చెలరేఁగుఁ దృష్ణ తోడఁ
జెంతఁ జేర నన్నియుఁ బోవు నంతు లేక
కారకుఁ డెవండు ధరలోన నేరి కెఱుక 68
నున్న వన్నియు మృతికి ముందున్న వెల్ల
చన్న త్రుటికిఁ బిదపఁ గూడ వన్నె తోడ
నేది లోపించె నీకట్టె నేరి కెఱుక 67
చన్న త్రుటికిఁ బిదపఁ గూడ వన్నె తోడ
నేది లోపించె నీకట్టె నేరి కెఱుక 67
గిట్టు టెట్టుల నెన్నడు గుట్టు కాదె
యెట్టు లుండును నడిమిని గుట్టె యౌను
గుట్టు లేరికి నెన్నడు పట్టఁ దరము 66
తేనె లూరు మైనపు టిల్లు తేనెటీఁగ
మేలు వల నోటి నూలున సాలెపుర్వు
కట్ట విశ్వము వింతల పుట్ట కాదె 65
మాఁగ నింట మామిడి పండు మూఁగు నీగ
యప్పు నిండఁగ గుంటను గప్ప సేరు
మేటి విద్య లబ్బె నెటుల వాటి కిట్లు 64
కొండ కన్నను బెద్దవి కొన్ని కలవు
నేల నీట నింగి చెలంగి నివ్వటిల్ల
నంతు గాంతుమె విశ్వంపు వింతలకును 63
యోడ లందు బోనెంచిన నొళ్లు తూలు
గగన యానమ్ము సేయంగఁ గాళ్లు లాగు
భూమి యానము నెఱుఁగమే యేమి వింత 62
మూడు వంతులు చుట్టును ముచ్చటగను
భూమి గిఱ్ఱునఁ దిర్గుచుఁ బోవుచుండఁ
దొనఁక దిసుమంత వింతగఁ దోయ మరయ 61
జాల నిద్రించి పుర్వగు లీలఁ జిలుక
గ్రుడ్డు పగులఁగ నగుఁ బక్కి గూటి లోన
మఱి పురుడు పోసె వాటి కే మంత్రసాని 60
జలచర విహగ నర జంతు జాలములకుఁ
గాంచ నాధార మీ భూమి క్షమను మిన్న
దాని కాధార మెద్దియో తలఁచ నగునె 59
జల వాయు రిక్త భోజన
లలి తామల వర్త నానురాగ మనస్కా
ఖిల జన సాదర వర దృ
గ్వలయ పరివృ తాంగ భాస భట్టార నతుల్ 58
నేఁడు గాంచ నింక వీడు వేరె
యెప్పు డేది యేరి కేమగు నిఁక నేరి
కెఱుక యెఱుక కలుగ మఱవ నేల 57
మురళీ ధర పింఛ దామ మోహన రూపా
మర గణ సేవిత రామా
వరజ పరంధామ కృష్ణ ప్రణతులు గొనుమా 56
కమలాప్త భూ నభో జన
రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా
కమలాప్త భూ నభో జన
రమణీ యార్చిత నితాంత లావణ్యాంగా 55
[కమలాప్త: లక్ష్మీ దేవి చేఁ బొందఁ బడిన వాఁడు, విష్ణుమూర్తి.
కమలాప్త : పద్మములకు మిత్రుఁడు, సూర్యుఁడు.
లావణ్యాంగా : అందమైన దేహము కలవాఁడా
లావణ్యాంగా : సముద్ర జలము (లవణముతోఁ గూడినది) తో నిండిన నోరు కలవాఁడా]
జిత నీడోద్భవ జంతు సంచయ పయో జీవ్యౌఘ సద్యః కృ తా
నత దేవాలి నృసింహ విగ్రహ! హిరణ్యప్రాశనఘ్నా! త్వ దా
శ్రిత భక్తోత్కర పాలకా! వెలసితే సింహాద్రిఁ గొన్మా నతుల్ 54
ర్గా! గగన దుకూల కాయ రమణ!
దేవ నుతి నికాయ తృప్త! సర్గ స్థితి
విలయ కార్య భార విలసి తాంబ! 53
సన్మాయా తను కామ రూప విలసత్సాహస్ర నామాత్మికా!
సన్మానార్చక నిర్జ రోత్కర సదా సంసేవ్య మానాంబికా!
తన్మూర్తిత్రయ రూప ధారిణి! జగద్రక్షైక మాతృత్రయీ! 52
స్సారక్షీణము ధైర్యలోపము నిరాశం జెందిరే యెన్నడుం
దారాధ్వమ్ము నతిక్రమించు పర సంతానోత్కరత్రాస దు
ర్వారోత్సాహముఁ జూపరే క్షితిపు లర్వాచీన కథ్యమ్ములన్ 51
బోధము క్షుద్భాధఁ దీర్చుఁ బూర్ణ రుచిర భా
షా ధారణమ్ము జన చి
త్తాధీ నానంద మొసఁగు నంచిత కళయై 50
గివివేకచ్యుత చిత్త కర్దమమునంగ్రీడించఁగా నిన్ను గా
కెవరిన్ వేడుదు మయ్య ప్రోవు మని రావే భక్త మందార భ
వ్య వరౌఘప్రద శ్రీ రమా సహిత దేవా సత్యనారాయణా! 49
పద్మాక్షు పద్మ నాభుం
బద్మా చిత్తేశుఁ బద్మ భవ గురు దేవుం
బద్మా హృదయ సరోవర
పద్ముం బద్మోద్భవాండ పాలకుఁ గొలుతున్ 48
యీ చవి లేనివౌ పదవు లిచ్చునె భవ్య వికుంఠవాసమే
యీ చదరంగ మాటలు సురేశ్వర లోక నివాస మిచ్చునే
దాచ ధనమ్ము నన్య ధరఁ దా లవణాంబుధి వారి తుల్యమే 47
ఛందము: 20 , కృతి; వృత్తము సంఖ్య : 1.
మ మ మ మ మ మ గగ; ప్రాస కలదు; 10 వ యక్షరము యతి.
భామా రత్నంబుల్ వే విత్తంబుల్ భాగ్యాగారశ్రేణుల్ బంధువ్రాతంబ
య్యా మాయల్ ధాత్రిన్ దాటంగన్ సాధ్యంబౌనే యాదిత్యాపత్యశ్రేష్ఠుండా
కామగ్రామంబుల్ రేగెన్ నాలోఁ గావన్ రావే వేగం గాకుత్స్థజ్యోతీ
రామా సీతానాథా నా కీయన్ రావయ్యా ముక్తిం గారుణ్యాంభోరాశీ 46
పఘ్నా! నిర్జర పూజితాంఘ్రి యుగ! దుర్వా రోగ్ర దుర్దాంత శ
త్రుఘ్నోదార దయా రసామృత మహోత్తుంగాత్మ! షడ్వక్త్ర గ
ర్వఘ్నా! విఘ్నపతీ! నుతింతు నిను గాపాడంగ రావే దయన్ 45
రణ విరాజమాన చరాచర నయన యుగ
గోచ రాగోచర ప్రాణి కోటి సంభ
వైక కారణ పరమాత్ము నాత్మఁ గందు 44
కన రానట్టి సుదూర తీరములకుం గాంతామణీ న్యాయమే
తనువుల్ ప్రాణము లొక్కటే యనఁగ నిత్యం బెంచి పాటింప నే
రని నిన్నక్కట యేమనంగఁ దగు నా బ్రాహ్మంబ యిట్లుండగన్ 43
శత వర్షంబులు గాంచఁ జాగినను మా స్వాంతమ్ము లందుండు నీ
దు తలంపుల్ నెఱి నింపుఁ జిత్తముల సంతోషామృతద్రోణి నీ
వితతస్ఫూర్తి వచో నికాయ మొసఁగున్ విజ్ఞాన విత్తమ్ములం
బితృలోకాంతర వాస! మమ్ముఁ గరుణన్ వీక్షించి దీవింపుమా! 42
కల్గ నెఱుంగ వీ వెపుడుఁ గామ మదోద్ధృత ఖాండ వాటవీ
ఫల్గుణ! బంధు మిత్ర జన వర్గ సమంచిత పూజ్య పూరుషా!
వెల్గితి వీవు దొడ్డవర వీర్య జనప్రవ రాధి నేతవై 41
శిరిడి లోన వెలసి దీన జీవ తతికి
సేద దీర్చి యాత్మజ్ఞాన మాదరమునఁ
జెప్పి ముక్తి మార్గము దెల్పి చిత్ర రీతి
జనులఁ బ్రోచితి నతు లివె సాయిబాబ!
40కృష్ణద్వైపాయన! రో
చిష్ణూదకజజ సన్నిభా! విశేష పురాణో
త్కృష్ణ! శ్రుతివ్యాస వర స
హిష్ణు! పరాశర కుమార! యివియే ప్రణతుల్ 39
కాకి కూఁక కూక కాకీఁక కేకి కూఁ
కా కుకు కుకు కూక కీక కౌకు
కాక కాకి కాకి కేకి కేకే కేకి
కాకి కెక్కు కాకు కేకి కాఁక 38
పద విభజన:
కాకి కూఁక ,
కాకి ఈక కూక కేకి కూక, ఆ కుకుకుకు కూకకు, ఈక కు ఔకు కాక
కాకి కాకి కేకి కేకే
కేకి కాకి కెక్కు
కేకికి కాకు ఆఁక
[ఊఁక = పొట్టు; కూక =కూత; ఈఁక= రెక్క; కూఁక +ఆ = కూఁకా; కుకు కుకు (కూ) : పికముల తొలి కూత, ధ్వన్యనుకరణము; ఔకు = దుర్బలము; కాక = కావచ్చు; ఆఁక = అడ్డంకి.]
తాత్పర్యము:
కాకికి పొట్టు కేకికి పొట్టే (ఆహారము). కాకి కూక కేకి కూకకు, కాకి యీక కేకి యీకకు నౌకు కాక! కాకి కాకీయే కేకి కేకీయే కేకి కాకి కన్న మిన్న , కేకికి నడ్డంకి కావలదు.
నన్నోడి తాన యోడెన
మున్నోడి కడంకఁ దాను బున్నెంపు సతిన్
నన్నోడెనొ సన్నంబై
యన్నా మున్నడుగు పోయి యన్నర నాథున్ 37
పారా
వారా
గారో
దారా 36
దేవే
శా వే
రావే 35
బ్రోవన్
నాలుగు వృత్తము లుండును.
1. స్త్రీ. / శ్రీపెంపు.(గగ)వృత్తము.
రారే
లేరే
వీరుల్
వోరన్ 34
2. రమా. (లగ) వృత్తము.
రమా
శ్రమా
ఘ మా
పుమా 33
3. స్వీయ కృత నూత్న వృత్తము.
రామ. (గల)
రామ
యేమి
మేము
లేమ 32
4. స్వీయకృత నూత్న వృత్తము.
రణము. (లల)
అని
నిను
మనఁ
గన 31
ద్వ్యశ్వైక చక్ర సన్నుత
విశ్వాత్మా ఖ్యామర గణ విఖ్యాత నభో౽
నశ్వర గమన మహా ద్యు
త్యైశ్వర్య వికాసిత జగదాధార నతుల్ 30
నిత్యాశా కలి తాత్మ భూజనుఁడు వే నీల్గున్ ధనాపేక్షతో
నిత్యామర్ష తపో ధరామరుఁడు దా నీరౌను నిక్కంబుగన్
నిత్యభ్రాజిత శాంత మానసుఁ డహో నిల్చుం బ్రజారాధ్యుఁడై 29
గారెలు బూరె లావడలు గారపుఁ బూసయు లడ్డు లింక నో
రూరెడు పాల బువ్వ పులిహోరయుఁ బప్పును దప్పళమ్ములుం
గూరలు నాల్గు పచ్చడులు గుమ్మను నేయియు నప్పడమ్ములుం
గోరిన పెర్గు గప్పురము గూర్చిన విడ్యపు విందు బొజ్జకున్! 28
ఇంద్ర భవనమ్ము లారయ చంద్ర శాల
లయ్య వైద్యశాలలు నేడు చయ్యన గురు
సంస్థ లై తనరారు నిస్సంశయమ్ము
సంతసమ మహారాజ పోషకు లడుగిడ 27
[మహారాజ పోషకులు= రోగులు]
గొనముల గెల్వ ముజ్జగముఁ గూరిమి నిల్పఁగఁ దమ్మిచూలిపైఁ
దనరఁగఁ జిల్క పొత్తములు తామర పూసల పేళ్ళు కేలులం
బెనుపున మీట వీనియను విద్దెల కుప్పను దెల్ల వల్వలం
గనిననె సంతసమ్ము మదిఁ గల్గును దండము లట్టి తల్లికిన్ 26
ఇన వంశార్ణవ పూర్ణచంద్ర నిభ మత్తేభేంద్ర సంచార మో
హన నీలద్యుతి భాసి తావయువ సత్యద్యోత దుర్విక్రమా
వన కార్యైక సునిశ్చయాత్మక లసద్బాణాసన స్కంధ సా
వనిసంజాత సలక్ష్మణ స్థిత సుదుర్వైరిఘ్న రామా నుతుల్ 25
ధరకన్యామణి హృద్వనాంతర లసత్కల్పద్రుమా రాఘవా
వర రాజన్య విరాజమాన రవి సద్వంశాటవీ కౌముదీ
దురభిక్రాంత సురారి ఘోర గిరి సందోహైక నిర్ఘాతమా
హర పద్మాసన శక్ర దేవగణ నిత్యారాధ్య రామా నుతుల్ 24
గుణ సంసిద్ధ సదా విరాజిత మహా కోదండ హస్తాంబుజా!
గుణ సంధాన పరాక్రమ ద్యుతి మహాకోదండ విధ్వంసకా!
క్షణి కోద్రేక మహీసు రార్చిత మహేష్వాస ప్రభా గ్రాహకా!
రణ విచ్ఛేదిత దైత్య సంచయ! విభూ! రామా! మముం గావుమా 23
నీలాంగ ద్యుతి పుంజ నిర్జిత చలన్నిర్భేధ్య పర్జన్యమా!
వేలాక్రాంత యశః పయోధి! కృత నిర్వీ ర్యోగ్ర రత్నాకరా!
లీలా మానుష రూప సంచరిత కేళీ ఖండితాస్య వ్రజా!
బాలా భూమిజ హస్త పూజిత పదా! పాలింపవే రాఘవా! 22
[ఆస్య వ్రజుఁడు= ముఖ సమూహములు కలవాఁడు, రావణుఁడు]
నీలి మేఘశ్యామ రామ
వాలి జీవధ్వంస భీమ
లాలితోత్సంగస్థ సీత
జాలి చూపించంగ రావ! 21
ప్రేత భూ సంచారి రిక్తాంబరుండు త్రినేత్రుండు వరదుండు నిత్య శుభుఁడు
భస్మ చందన దేహి ఫణివృత బాహుండు శీతాంశు జాహ్నవీ శేఖరుండు
నలి జటాజూటుండు నమరారి బంధుండు నత నిర్జర గణుండు సిత తనుండు
నట నానురాగుండు పటు విషగ్రీవుండు నాదిభిక్షుం డభయ ప్రదుండు
నస్థి మాలి కర కపాలసుస్థిరుండు
నశుభ దృశ్య మాన నిరంతర శుభ దాయ
కుండు నా విశ్వనాథుని రండు కొలువ 20
తీరము ఘోరపు భవముల దింపకు రామా
కోరెద నీ పయి భక్తియ
తోర మఘలతా లవిత్ర తోయజ నేత్రా 19
యచ్చు సంధులు రోత యాంగ్ల మించుక యున్న నయ్య కుఱ్ఱల కయ్యొ నయ్యె డాడి
బాస లన్నియు గొప్ప యాస లెన్నున్నను నొవ్వి కలుగ వచ్చు నవ్వ బాస
కట్టుబాటు లగు రక్ష మనకు నట్టులె వ్యాకర ణమ్మగు బాస కెంచ
పొట్ట కూటి కెంచి యెట్టెట్టు పోయిన
వట్టి వేళ లందుఁ బట్టు కొనుమ
తేట తెలుఁగు బాసఁ దీర్చి దిద్ద వలయు
పూర్వ వైభవమ్ము పొసఁగు పగిది 18
దేటికి ముద్దు బిడ్డఁడ! మితిం గన నేరని నేలచూఁలి నే
ల్పోటు మగండ! మిన్న దివె! పున్నెపు వేఁడి వెలుంగు కందువం
బోటరి గొంగ! రక్కసుల మ్రొక్కెదఁ దామర కంటి! నిచ్చలున్ 17
రగువు తెగ దిబ్బెమ్మా! మగడా మన్నుపట్టికిన్! 16
నిడుద బుజ రాయండా! నిడుద తమ్మి కన్దొరా!
వడి సోఁకుడులఁ జెండాడం గడు నేర్పరి! దండముల్ 15
తల్లి కుప్పొంగ! మన్నొజ్జా! నల్ల దేవర! దండముల్ || 14
[పెంబేరు లన్న = ఆనకదుందుభి; మల్లు = చాణూరుఁడు; ఉప్పొంగు =
పరమానందము; మన్నొజ్జ = జగద్గురువు; నల్లనయ్య = కృష్ణుఁడు]
మొగ యొరిగ దొల్వేల్పా
తగఁ గావు వెల్గు దొరా
పగ ల్సేఁతరి దండంబుల్
జిగి పెన్గుప్ప మ్రొక్కెదన్ 13
తగఁ గావు వెల్గు దొరా
పగ ల్సేఁతరి దండంబుల్
జిగి పెన్గుప్ప మ్రొక్కెదన్ 13
దీటుగ వింద్రోవఁ దమిం దేలెడు వాఁడా యో
నీటికలంకూ నలువన్జేరిన రాయండా
మేటి కుసుళ్ళుం జెవులన్ మేలిమి తమ్మంట్లున్
దీటగు టోపీ గల యోదేవర చే సంకున్
వాటపుఁ గన్నున్ సరియుం బైడిమెయీ గొల్తున్ 12
తేరున వింద్రోవ పయిం దేలెడు వాఁడా యో
నీరిరవయ్యా నలువన్జేరిన పెన్వేల్పా
మూరు కుసుళ్ళుం జెవులన్ ముత్తెపుఁ దమ్మంట్లుం
దోరపుఁ గన్నుం గరమున్ దొడ్డది యౌ సంకున్
బారెడు టోపీ సరియుం పైడి మెయీ గొల్తున్ 11
నత దాసీ జన తుల్య దేవ వనితా నానా జగద్దీపికా
వితతానుగ్రహ లబ్ధ వైభవ బలద్విడ్బ్రహ్మ గంగాధరా
నతు లేనిత్తును నీకు నిత్యము జగన్మాతా ముకుందప్రియా 10
విలసిల్లెం దగ వేంకటాద్రి పతియే విద్యార్థి బృందమ్ములే
యిలలో నమ్మెడు నమ్మకమ్ము లవి వే యింపార సత్యంబుగాఁ
జెలఁగన్ నిత్యము దాఁ గృపా రస సుసంశ్లే షాంతరంగమ్మునన్ 9
సమ దా ళ్యావలి పాఱెఁ గాంచి లలనా శ్యామాలక శ్రేణులం
గమనీ యాబ్జము లప్పు దూఱె నరయం గాంతా ముఖాంభోజముం
దిమి వేశ్మమ్మున దాఁగె శంఖములు దొంతిం గాంచి తద్గ్రీవముం
దమి యేపారఁగఁ గాంచి లే ళ్ళుఱికె సీతాదేవి కందోయినే 8
జలచర భాసమాన సిత సారస కైరవ మండిత మ్మపా ర లస దభంగ భంగ సుపరాజిత పార యుగ ప్రభాసముం జల దనిలాత్త బిందుచయ సార దళావృత భృంగ రాశియున్ విలస దనూన జాలపద వీర్య విహార సరోవరం బదే! 7
నిన్నే వేడన్ నెమ్మిన్ నీకుం జన్నేయీ తాత్సారం బయ్యో నన్నుం జూ డన్నా యో లక్ష్మీ సన్నాథా విశ్వత్రా తాఖ్యా 6
కాంచెం గృష్ణుఁడు సాధు నీరము మహా గంభీరముం బద్మ భా గంచ ద్గోకన దాత్త మోద మద భృంగ ద్వంద్వ ఝంకారముం గాంచి ద్భంగ లతా వితాన విహర త్కాదంబ కల్లోల ఘో షాంచ త్స్ఫారము మంద వాయుజ కణాసారంబుఁ గాసారమున్ 4
చిత్రపదము. భ భ గగ ; ప్రాస కలదు; అనుష్టుప్ చందము. రాజకుమారుని డంబాల్ తేజ విహీనతఁ గోరన్ భోజనమా రవి కెట్టుల్ భాజనమే తగ భావిన్ 3
నూతన ధైర్య విక్రమ వినోద సమంచిత పూర్ణ భాగ్యముల్
చేతన సంయు తోత్తమ విశేష వివేక విలాస భోగముల్
నీతి విచార కార్య చయ నిర్జిత శుద్ధ యశస్తరంగముల్
శీత గిరీంద్ర నాథు దయఁ జేకురుఁ గావుతఁ గ్రొత్త యేటినిన్ 1
చేతన సంయు తోత్తమ విశేష వివేక విలాస భోగముల్
నీతి విచార కార్య చయ నిర్జిత శుద్ధ యశస్తరంగముల్
శీత గిరీంద్ర నాథు దయఁ జేకురుఁ గావుతఁ గ్రొత్త యేటినిన్ 1