స్వీయ చరితము.
పోచిరాజు
కామేశ్వర రావు
|
|
మాతాపిత స్మరణ:
|
|
|
కం.
|
కరివరద పదస్మృతి త
త్పరమతి విమల గుణధామ పావన పేర్రా
జ రుచిర నామమున వెలుఁగు
విరాజమాన సురభరిత పితృలోకమునన్
|
1.
|
|
|
|
|
|
తే.గీ.
|
తరళ సాధ్వీ లలామ శుద్ధచరిత సుగు
ణచయ విభ్రాజమాన వినమ్ర లలన
సంతత మృదు భాషి విమల చారు శీల
సత్యసుందరి మాతల్లి ముత్య మెంచ
|
2.
|
|
|
|
|
|
మ.
|
తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాసార
భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ
కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా
సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం
బానుచున్
|
3.
|
|
|
|
|
|
మ.
|
నర వంద్యోత్తమ సేద దీరితి
శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద
సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు
సన్యాసివే
|
4.
|
|
|
|
|
|
ఉ.
|
మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు
స
త్సూనృత గీతసార పరిశోధిత మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ
ధాత్రినిన్
|
5.
|
|
|
|
|
|
మ.
|
సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన
సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ
విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ
ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య
విఖ్యాతునిన్
|
6.
|
|
|
|
|
|
ఉ.
|
దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ
గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల
సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల
మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున
నుంటి విద్ధరన్
|
7.
|
|
|
|
|
|
మ.
|
శత వర్షంబులు గాంచఁ జాగినను మా స్వాంతమ్ము
లందుండు నీ
దు తలంపుల్ నెఱి నింపుఁ జిత్తముల
సంతోషామృతద్రోణి నీ
వితతస్ఫూర్తి వచో నికాయ మొసఁగున్ విజ్ఞాన
వైభోగముల్
పితృలోకాంతర వాస! మమ్ముఁ గరుణన్ వీక్షించి దీవించుమా!
|
8.
|
|
|
|
|
|
|
సహధర్మచారిణి
వేంకట రామ లక్ష్మి స్మృతి:
|
|
|
కం.
|
ఈ ధవళాక్షిం దలఁతున్
సాధుజ నాదరణ శీల సాగర కన్యా
ఖ్యాధిక సచ్చరిత రమా
మాధవ చరణ స్మరణ సమాహిత చిత్తన్
|
9.
|
|
|
|
|
|
ఉ.
|
సేవిత బంధు సంచయ వశీకర వేంకట రామ యుక్త ల
క్ష్మీవర నామ భూషిత సుకీర్తిత సద్గుణ భక్తి భావ
సం
ఘావృత శీల సంతత నిజాత్మ విభూన్నత సక్త చిత్త
సం
భావిత నిత్య దాన గుణ భాసిత కోమలి నెన్న
శక్యమే
|
10.
|
|
|
|
|
|
కం.
|
ద్వ్యక్షర పదక్షయీకృత
కుక్షి క్షేమంకర వర గోత్ర క్షిప్త
త్ర్యక్షర వాచ్య క్షిత్యా
భ క్షాంత మనో రుచి ప్రభావిత సతియే
ద్వ్యక్షరపదములు: “నాస్తి, ఈర్ష్య, కామ, క్రోధ, లోభ, మోహ
మద ” ఇత్యాది దుర్గుణములు.
త్ర్యక్షర వాచ్యములు: “కరుణ, అర్పణ, సంయతి, ప్రశాంతి” ఇత్యాది సద్గుణములు.
|
11.
|
|
|
|
|
|
|
స్వీయ రచనలు:
|
|
|
సీ.
|
నేర్చితి ఛందమ్ము నర్చించి గురువు శంకరు
వ్రాసితిని శతకమ్ము నొకటి
పౌగండ మందు యౌవన మెల్ల కుక్ష్యర్థ మడరంగ
నుద్యోగ మందు నిందు
భాతృ చోదన మంత భాసిల్ల శంకరాభరణ సమస్యా కవనము
లల్ల
రతి వేంకటేశ్వర రామచంద్ర మఱియుఁ బోచిరాజ శతకము లలరించి
|
|
|
తే.గీ.
|
వ్రాసి పద్మావతీ శ్రీనివాసము ద్విప
దమ్ము సుందర కాండ యంత రచియించి
తిని తెనుఁగు భగవద్గీత తెల్లముగను
వెలయ నారాయణీయము నలరు నిపుడు
|
12.
|
|
|
|
|
|
తే.గీ.
|
శ్రీ గణేశ శంకర రామ రాగ నుతులు
శ్రీద బ్రతుకమ్మ పాటయు హృద్యముగను
గూర్చి దైవత శ్లోకము లర్చ నార్హ
గతి నవగ్రహ స్తుతి రచించితి ముదముగ
|
13.
|
|
|
|
|
|
సీ.
|
ఆంధ్ర ప్రదేశము నందలి గౌతమీ ప్రాఙ్మండలపు
దొడ్డవరము నందుఁ
దొలి చదువు చదివి మలి చదు వది మామిడి కుదురు
పురి మొదటి గతి నేర్చి
యమలాపురమున విద్య యొక యేఁడు చదివి యంత్ర
మర్మము విజయ పురి నరసి
యుద్యోగ మణుసంస్థ నొప్పుగ నున్నత విద్యలు
ననువుగఁ బేర్మిఁ బడసి
పిమ్మట నొజ్జనై విద్య గఱపితి భాగ్య నగరి
నలరఁగ నాలు సంతు
|
|
|
తే.గీ.
|
భారతీ సత్కృపా వర్ష పాత మంది
పూనితిఁ గవిత్వమును వ్రాయ బుధులు మెచ్చ
రక్తి నుంచి మురారిపై రాయపురిని
వంత వీడి సతము రచియింతు నేను
|
14.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి