|
|
కర్మ భూమి భారత దేశ వైశిష్ట్యము:
|
|
|
ఉత్పలమాల
మాలిక. |
శ్రీ
రమణీ మతల్లికి విశేష విధేయులు భారతీయులే
వారని
గొప్ప పట్టుదల వారలు భారత దేశ పౌరులే వీర
వరేణ్యు లెల్ల రిట భీతి విహీనులు దేశ సైనికుల్ పారగు
లీ కృషీవళులు భారత దేశ వరాన్న దాతలే దూరపుఁ
జూపు మిక్కుటము తోరము పెంచును దేశ సంపదన్ వైరముఁ
ద్రుంచి స్నేహమును భారత దేశము గోరు నిత్యమున్ మూరును
దాన ధర్మముల బుద్ధిని నిల్పి నిరంతరమ్మునున్ భారత
భూమి సంతతము పన్నుగఁ గోరును విశ్వ శాంతినే కారు
దురాశకున్ వశులు కార్య నిబద్ధులు
భారతీయులే కా
రనృతమ్మునం జెలఁగు కాపురుషుల్ భరతాఖ్య భూమిలోఁ గారు
గణింప నీ భరత ఖండపుఁ బౌరుల నేరు సోమరుల్ కా
రకృతజ్ఞు లెన్నఁడును గౌరవ మిత్తురు మేలు సేసినన్ వీరలు
రాజ నీతులను బృధ్విని మెచ్చరు పాండవాగ్రజున్ వీరలు
దాన ధర్మముల వీసము మెచ్చరు దాన కర్ణునిన్ వీరలు
వీర్య ధైర్యముల భీముని మెచ్చరు సుంత యేనియున్ వారలె
భారతీయు లట వాసికి నెక్కి చరింతు రెల్లెడం బోరులఁ
బాఱ రెన్నఁడును భూఱి పరాక్రమ భారతీయులే దారులు
వేఱు లైన నెద దైవము నుంతురు భక్తియుక్తులై పార
మెఱుంగ రెవ్వరును బాధ్యత లెల్ల వహింప రక్తిమై కూరిమిఁ జూపి కాచెదరు ఘోర విపత్తులు సంభవించినం బారగు లర్థ శాస్త్రమునఁ బన్నుగ నా చణ కాత్మజుం డిడన్ సార
వివాహ బంధములఁ జాగును జీవన సాగరం బిటన్ సూరి
జనాలి పామర విశుద్ధ మనోజన భాసితమ్ముసూ భూ
రమణీయ దృశ్యములఁ బుణ్య తటమ్ముల శోభితం బిలన్ ఘోరత
రాటవీ కుధరకుక్షి సమేత ధరాధరమ్ములన్ భూరి
సరోరు హోత్పల సుపూర్ణ జలాశయ రాజి తాశలన్ వారి
చరావృ తేద్ధ జల భాసిత రమ్య నదీ నదమ్ములన్
భారత
దేశ సంపదలు వర్ధిలు ధాతుమ యాద్రి పంక్తులన్
వారని
యార్ష ధర్మ పరిపాలన రక్తులు భారతీయులే తారణ
యోగ్య భవ్య మను ధర్మ విధేయులు భారతీయులే భార
పురాణ సూక్త వర వాక్య నిమగ్నులు భారతీయులే తారక
మంత్ర యోగముల ధారణ నిల్తురు భారతీయులే సూరులు
యంత్ర భాషదులు సొచ్చిరి దేశ విదేశ భూములన్ మూరిరి
విశ్వ జాలములు మున్నగు విద్యల యందు మిన్నఁగన్ లే
రిల నంక యంత్రముల లీల గణింపఁగ సాటి
వీరికిన్ భారత
పౌరు లన్నిటను బన్నుగ నైపుణు లైరి
ధాత్రినిన్ [యంత్రభాషదుఁడు
= Software
engineer; విశ్వజాలము = Internet; అంకయంత్రము = Computer] ధీరత
దేశ రక్షణ మతిం జెలరేఁగు భటాలి నిత్యమున్ మూరును
యుద్ధ యంత్రములు భూరి రణావని దుర్జయమ్ములై తోరపు
వాయు సేన రిపు దుస్తరమై విలసిల్లు నుగ్రతన్ వారిధి
సైన్య పాటవ మవారిత రీతి నజేయ మౌ నిలన్
వారని
భక్తి మ్రొక్క వలెఁ బ్రాంజలి నిల్చి ప్రచేతు పట్టికిన్ భారత
కర్త వ్యాస భగవంతున కీ వలె నర్చ లింపుగన్ సూరిని
కాళిదాసుని వచో విభవమ్ములఁ గొల్వఁగా వలెన్ భారవి
దండి హర్ష ముఖ పండిత వర్యుల కీ వలెన్ నతుల్ నారజ
సూను సన్నిభులు నన్నయ తిక్కన శంభు దాసులే వారిజ
నేత్రు భక్తుఁ డగు బమ్మెర పోతన పూజనీయుఁడే మూరును
బండితాలిఁ గవి పుంగవుఁ డా కవి సార్వభౌముఁడే పేరునఁ
జాల పెద్ద యగుఁ బెద్దన పెండెర మందె రాజుచే మారన
రామకృష్ణ కవి మల్లన సోమన లెల్లఁ బండితుల్ సూరన
ముక్కు తిమ్మనయు సూరులు ధూర్జటి భట్టుమూర్తులున్ గౌరన
రంగనాథుఁడును గాఁకలు తీరిన పండితోత్తముల్ పేరు
వహింప భాస్కరుఁడు పింగలి సూరన సత్కవీశ్వరుల్ ధీరుఁడు
కూచిమించి కుల తిమ్మయ విజ్ఞులు సింగనార్యుఁడున్ హీర
సమాన నీతు లిడె నేనుఁగు లక్ష్మణ సత్కవీంద్రుఁడే కూరిమి
నిచ్చె వ్యాకరణ కోశము నప్ప కవీంద్రుఁ డిమ్ముగం
గారయ యల్పు లాధునిక గాఢ రసజ్ఞ కవీంద్రు లెన్నఁగం దీరుగ వెల్గె గుప్త నృప దేశము స్వర్ణయు గాఖ్య ధాత్రినిం జేరె నశోక రాడ్వరు నశేష యశమ్ము నభో౽గ్ర వీథికిన్ దీరుగ వెల్గె గుప్త నృప దేశము స్వర్ణయు గాఖ్య ధాత్రినిం జేరె నశోక రాడ్వరు నశేష యశమ్ము నభో౽గ్ర వీథికిన్ మూరిరి శాతవాహనులు భూవరు లింకను గాకతీయులున్ వారక ధాత్రి ఛత్రపతి ప్రాభవ ముజ్జ్వలమై విరాజిలెన్ వారక ధాత్రి ఛత్రపతి ప్రాభవ ముజ్జ్వలమై విరాజిలెన్ వీరుఁడు
రామరా జన వివేకుఁడు దాస్యము ద్రుంచఁ బోరెనే మేర
యెఱుంగకే భగ దమేయ బలాన్విత సింహుఁ డాఱెనే
శూరుఁడు
చంద్రబో సవనిఁ జోద్యము మీఱ వహించె భారముం
దీరుగ
జాతిపిత్రభిధఁ దెచ్చె నహింస స్వతంత్ర మార్యుఁడే వారిజ
సంభ వాభ ముని వర్యు లొసంగిరి వేద ఋక్కులన్ ధారుణి
నాది శంకరుఁడు ద్వైత విహీనము దెల్పి ప్రోచెనే సారపు రామ సానుజ సుసంజ్ఞ విశిష్టత రేక మిచ్చెనే మారని
బుద్ధి ద్వైతమును మధ్వుఁ డొసంగెను భార తావనిన్
దారులు
వేఱు గా మత వితానము లన్యము లైన మిత్రులే మూరినఁ
బెక్కు భాష లిట మోదమునం జరియింత్రు పౌరులే వారికి
వీరు వీరికిని వారు పరస్పర బంధులే ధరన్ మూరి
చరింతు రైక్యముగ భూతల నాకము భార తావనిన్ లే
రిల భారతీయులకు రేఁపఁ బరస్పర మత్సరమ్ములన్ లే
రిల భారతీయులను లీల జయింప సమర్థు లెన్నఁగన్ లే
రిల భారతీయుల పరీవృత రాగ వినాశకారులే లే
రిల భారతీయుల విలీన సనాతన భావ నాశకుల్ వారని
భక్తి దేశమును బౌరులు నిత్యము గౌరవింతురే వారక
రాజ కార్యములఁ బన్నుగ నేతలు మున్గి యుందురే వారని
రక్తి సైనికులు భద్రత నిత్యము గూర్చు చుందురే వారని
యుక్తిఁ బాఠకులు బద్ధులు విద్యల యందు నిత్యమున్
వారని
శ్రద్ధ కర్షకులు పంటల నింపుగఁ బండ నిత్తురే వారక
కార్య సాధకులు బాధ్యతతోఁ గృత కృత్యు లౌదురే వారక
కర్మ నిష్ఠులు నపార నిబద్ధత నిత్య ముందురే వారక
సద్గురుప్రవర పండితు లిత్తురు విద్య లింపుగా భార
తరాద్రి హైమగిరి ప్రబ్బె నుదీచినిఁ గంచు కోటయై మూరెను
మూడు దిక్కులను బుణ్య పయోధులు
కందకమ్ములై సార
జలాపగా వరము స్వర్ణది గంగ యుదీచి వెల్గఁగా గౌరవ
గౌతమీ నది ప్రకాశము దక్షిణ దిక్కునం దిటన్ ద్వారము
భూతలమ్మునను స్వర్గము నందఁగ మోక్ష ధామమై తారలుగాఁ
జెలంగి రిటఁ దద్దయుఁ బుణ్యము సేయ మానవుల్ స్ఫార
తమంపు జ్ఞాన ముని సంఘము వెల్గెను భార తావనిన్ దూర
విశుద్ధ దర్శనులు తోరముగా జనియించి రిద్ధరన్
వారక
స్వీయ మాంసమును బంచిన రా జిటఁ బుట్టె వింతయే మూరినఁ
బ్రాణ నాశనము మూల్గక త్రాణ మొకం డొసంగెనే దారను
విక్రయించె నిటఁ దప్పక యొక్కఁడు సత్య మిద్ధరన్ నేరరు
దాఁట ధర్మము మనీషులు భారత మందు నెన్నఁడుం గోరరు యుద్ధ మెన్నఁడును గూరిమి నిత్తురు స్నేహ హస్తముం గోరరె
యన్య సంపదలు ఘోరము లక్కట యుద్భవించినం గోరరు
దుష్ట సఖ్యములు కోరిన నన్యులు నీయ నేర్వరే కోరుదు
రెన్నఁ డేని మఱి గొప్ప గుణమ్ముల వెల్గఁగా నిలన్ ధారుణి
దేశ కోటికి నుదాహరణం బగు భారతం బహో మారణ
ఘోర శస్త్రములు మానవ జాతికిఁ గూడ వం చనుం
గ్రూరత
డుల్చి శాంతి నెలకొల్పఁగ యత్నము సేయఁ దోడ్పడున్ దారుణ
ముగ్రవాదమును దద్దయు మార్కొను శక్తి యుక్తులన్ వారిజ
సంభవుండు తగ భద్ర మొసంగుచుఁ గాచు గావుతన్ వారిజ
పత్ర లోచనుఁడు భారము నూనుచుఁ బ్రోచు గావుతన్
మార
రిపుండు సంతతము మానుగ రక్షణ మిచ్చు గావుతన్ భారత
దేశ కీర్తి వెసఁ బర్వును గాక దిశోపదిక్కులన్
|
1.
|
ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
9, డిసెంబర్ 2021, గురువారం
Bharata Tatvotpala Mala
భారత తత్త్వోత్పలమాల.
ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.
1, డిసెంబర్ 2021, బుధవారం
సమస్యాపూరణ_డిసెంబర్ 2021
సాఘ దురాచార ఖలు న
రౌఘ సమావృత జగమ్ము నం దవిరోధం
బే ఘన వివాద ము లడరె
మేఘము లేకుండ వాన మేదినిఁ గురిసెన్ 62
రాఘవుఁ డభ్ర వర్ణుఁ డట రాజ్యము నేలఁగ నిర్మలోద ధా
రా ఘన రాశి సంభృత విరాజిత దిఙ్నిచయమ్ము దోఁపఁ బా
పౌఘ విహీన రాజ్యమున నుగ్ర భయానక శబ్ద యుక్తమౌ
మేఘము లేకయే కురిసె మేదినిపైఁ బెనువాన వింతగన్ 61
బల్లిదుఁడు లక్ష్మణుఁడు కం
పిల్లి భృశము వినిన రామ విపిన నివాసం
బెల్లను నిజ జనకునిఁ బిన
తల్లిని నిందించి సవతి తల్లికి మ్రొక్కెన్ 60
చల్లగఁ గోరి కోరికలు జల్లు మనంగ నిజార్యు డెందమే
మెల్లనఁ బంప రాఘవు నమేయ పరాక్రముఁ గాన లోనికిం
దల్లడిలంగ నుల్లమునఁ దద్దయు నబ్భరతుండు పెల్లునం
దల్లిని దూఱుచున్, సవతి తల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై 59
చేయక ద్రుతాది సంధులు చిత్రముగను
వాడుచుఁ బర భాషా పదవ్రజము నెల్లఁ
జొనుపుచు నడుమ వింత నచ్చులు విసంధిఁ
బద్యమును వ్రాయవద్దనె భార్య పతిని 58
మత్యపకార భావము లమానుష రీతి స్ఫరించు నట్టులం
జోద్యపు శబ్ద దోష తతి చొప్పడ వ్యాకర ణార్థ సంధి వృ
త్యాద్యవిరామ దోష నిచ యావృత రిక్త పదాలి యుక్తమౌ
పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలెఁ బత్నియే 57
ప్రశ్నలలో నతి కష్టపుఁ
బ్రశ్నం బప్రస్తుతమ్ము పన్నుగ నా ప్ర
శ్నాశ్ని కిడ హాస్యపు బదులు
ప్రాశ్నికుఁ డవధానినిఁ గని పక్కున నవ్వెన్ 56
[అశ్ని = తినువాఁడు]
పృశ్ని నికాయ గర్భు ఘన కృత్య కదంబక వర్ణ నార్థమై
ప్రశ్నము వేయ నల్లు మని పద్యము నొక్కటి వర్ష కాల కా
లాశ్న గభీర శబ్దముల నప్పు డవాక్కుఁడు గాఁగఁ దన్మహా
ప్రాశ్నికుఁ డా వధానిఁ గని పక్కున నవ్వెను మెచ్చి రెల్లరున్ 55
[అశ్నము = మేఘము]
పెద్ద కను గ్రుడ్లు త్రిప్పుచు భీతి కొలుపఁ
బురుగు నొకదానిఁ బరికించి పరవశించి
చాచి తన నాలుకను మించఁ జలన మందుఁ
గాలసర్పమున్ మ్రింగెను గప్ప యొకటి 54
అర్పిత మల్ప జీవి ధర యందు నవశ్యము పెద్ద ప్రాణికిన్
నేర్పున వర్ష కాలమున నీరజ మో యన నుద్భవించి తా
నోర్పున గట్టునం దిరుగు చుండెను మెల్లగ వాన పామె యా
సర్పము గప్ప నోటఁ బడి చచ్చెనయో యిది యేమి చిత్రమో 53
సకల జనులు వీక్షింపఁగ
నొక జంతు వినోద శాల నుత్సాహముగా
నొక కఱ్ఱ నంతఁ దాఁకుచు
నొక కరమున నొంటె నెత్తె నొయ్యారి దగన్ 52
ఒక యొయ్యారుల జంట వేయ నిటు లుద్యోగించి పందెమ్మునే
యొక హస్తమ్మున నొంటె నెత్త వలె నంచుత్సాహియై సాలభం
జిక రమ్యమ్ముగ నొక్క దాని నచటం జేయించి వస్త్రమ్ముతో
నొక హస్తంబున నొంటె నెత్తెఁ గదరా యొయ్యారి చిత్రమ్ముగన్ 51
భారతావనిఁ గోదండ పాణి రఘు కు
లాబ్ధి చంద్రు సీతా పతి నబ్జ పత్ర
లోచను జనులు దక్కఁ దురుష్కు లింకఁ
గ్రైస్తవులు రాముఁ బూజింత్రు శ్రద్ధతోడ 50
న్యస్త ఫలాన్య పుష్పముల నన్నర నాథ కుమార వర్యునిం
బ్రస్తుతి సేసి హైందవులు రాముని జన్మ దినమ్ము గావునం
గ్రీస్తు నుతింప వారి గుడికిం దమకమ్మునఁ గూడి యేఁగఁగాఁ
గ్రైస్తవు లెల్ల నేఁడు గడు శ్రద్ధను గొల్తురు రామచంద్రునిన్ 49
అన్యు నొల్లంగ నే నేర నంచు భక్తి
నిలిపి స్వీయ మనమ్మున నీరజాక్షు
వెన్నునిఁ బతిగ నిమ్మని మిన్నగ సతి
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని 48
ఏ వామాక్షి యొసంగె మాల మును తానే వాడి యా భామయే
నా వాఁడై సతతమ్ము నిల్చి మదిలో నారాయణుండే ననుం
గావంగా నిల దైవ మైన పగిదిం గాత్యాయనీ దేవికిన్
దైవంబన్నఁ ద్రినేత్రుఁడే యనుచు గోదాదేవి నమ్మెన్ మదిన్ 47
సమదగజ యాన కులుకుచు
రమణీ మణి వచ్చుచుండ రమణీయముగా
కమనీయ రూప మా తే
జముఁ గాంచిన విటుఁడు పరవశత్వము నందెన్ 46
సమద కరీంద్ర యాన శశి సన్నిభ వక్త్ర సరోజ లోచనన్
విమల వినీల కేశ పరివేష్టిత రూప్య సమాన పాండురో
త్తమ రుచి దీపి తావయవ తాళ ఫలాభ వరాగ్ర భా గురో
జముఁ గని మోహమున్ బరవశత్వము నందె విటుండు చెచ్చెరన్ 45
తేజ మందు నెంచ దినకరునకు సాటి
దాన గుణము నందుఁ దగును శిబికిఁ
బాటవమ్ములోఁ గిరీటికి సాటి యే
కైక వీరుఁ డనుచుఁ గర్ణు మెచ్చె 44
ప్రాకట యుద్ధ నైపుణుఁడు రాధ సుతుండు వరాంగ నాథుఁ డా
పాక విరోధి సన్నిభుఁడు భావి మహోగ్ర రణాంతరమ్మునన్
వీఁక నెదిర్ప నర్జునునిఁ బృథ్వి జనించిన యస్త్ర వేది లో
కైక మహాధనుర్ధరుఁడుగా సభలో నుతియించెఁ గర్ణునిన్ 43
బలము గల వారి దాయలఁ బంత మూని
చేసికొనిరి దూర మకట యాస తోడ
రాజ్య సంపన్మదాంధ కౌరవుల విగత
పాండవుల వంటి మూర్ఖులు వసుధఁ గలరె 42
అండగ నిల్తు మేవురము నన్యులు మార్కొన యుద్ధ భూమిలోఁ
గొండొక యైదు గ్రామములు గోరిన విచ్చిన నన్న దానమే
దండుగ యంచుఁ గౌరవులు దల్పఁగఁ బల్కిరి యివ్విధమ్ముగాఁ
బాండవు లంత మూర్ఖులు ప్రపంచమునన్ గనరారు చూడఁగన్ 41
నిష్ఠ సెలగంగఁ బూజించి నిత్య మత్య
ధిక మయిన భక్తితో దేవ దేవుని మఱి
యంత మయిన నా మాసము సంతసమున
మగువ లెల్ల మానిరి ధనుర్మాస పూజ 40
మగఁడే నారికి గొప్ప దైవ మగుఁ దా మాన్యుండు పూజార్హుఁడే
మగనిం ద్రోసి ముకుందుఁడే తమను సంపాదింప నేతెంచినం
దెగు నంచున్ భయ మంది డెందమునఁ బాతివ్రత్య మా శంకతో
మగువల్ పూజలు సేయ మానిరి ధనుర్మాసమ్మునన్ భీతితోన్ 39
దుష్ట చిత్తులఁ గాంచినఁ గష్ట మైన
వారి వారింప కున్నచో నేర మగును
సజ్జనుల కీయ బాధలు, సాయ మూని
కవుల, నిందించు వారికి ఖ్యాతి గలుగు 38
అవిరళ కోప తాపముల యందు మునుంగుచు మత్సరమ్మునం
దవులుచుఁ గన్ను దోయికి సతమ్మును స్వీయ జ నాన్యు లైన మా
నవుల వెలుంగు నట్టి సుగుణమ్ముల నారయ నొల్ల కూను నా
కవులను దూలనాడుటయె ఖ్యాతికి హేతువు జాతి కిత్తఱిన్ 37
[కవి = కళ్ళెము]
స్వర్ణాంగుండా! యజ్ఞా
నార్ణవ మందు మునిఁగితివె యంటివి యిట్లుం
గర్ణ కఠోరంబే యిది
కర్ణుఁడు నరకుని వధించెఁ గాశీపురిలోన్ 36
జీర్ణము గాఁగఁ బాఠములు చెప్ప మనంగఁ గరమ్ము చక్కనౌ
వర్ణము లిట్లు ప్రశ్నలకుఁ బన్నుగఁ బల్కిరి యొక్క యుమ్మడిం
గర్ణ ముదావహమ్ము లవికారమ శిష్యులు నల్వు రంతటం
గర్ణుఁడు, జానకీరమణికై, నరకాసురుఁ జంపెఁ, గాశిలోన్ 35
రఘు కులాంభోధి చంద్రుండు రాముఁ డయిన
సత్య ధర్మానుకంపన శౌచ వినయ
ము లను కాంతా శిరో రత్నములు ధరిత్రి
నైదుగు రయోధ్యలోన రామయ్య సతులు 34
గొప్ప ధనుర్ధరప్రవర కోటి వరేణ్యుఁడ వీవు ధాత్రి నే
నెప్పుడు చూతు నిన్నిట నిజేశ్వరి యుండఁగ గ్రాహ్య హస్తయై
కప్పుర గందు లోజ నిజ కాంతులఁ గూడి ముదమ్ము మీఱఁగా
నొప్పులకుప్ప లైదుగు రయోధ్యకుఁ జేరిరి రామ! పత్నులై 33
తీరును ఋణమ్ము లెల్లను
వారని రోగములు సెలఁగ వారలకు వెసన్
వారక ముక్తి నొసంగును
వారవధూ సంగమమ్ము పావనము గదా! 32
ధారుణిఁ గుంభ సంభవుల తాపస వర్యుల జన్మ కెన్నఁగా
వార వధూ మతల్లి కద పన్నుగఁ గారణ మయ్యె వింతయే
కారణ మయ్యె నా భరతుఁ గంటకు గాధి కుమార దేవతా
వారవధూ సమాగమము పావనకార్యము సజ్జనాళికిన్ 31
నెమ్మి నుండుమ నీ వింక నిర్భయముగఁ
గష్టములు తీరినవి నీకు దుష్టు వలన
నీకు నీ వారి కిప్పుడు నీ విరోధి
యిల్లు గూలిన కష్టము లేలఁ గలుగు 30
వే పుర మొండుఁ జేర వలెఁ బృథ్విని నవ్య గృహమ్ము నందఁగా
నాపెడు వారు లేక నిర తాతత దారుణ దుష్ట కృత్యముల్
పాపులు సేయు చుండఁ బరిపాటిగ నిత్యము వెక్కసమ్ముగం
గాపుర మందుఁ గష్టము లిఁకన్ దరిఁ జేరునె యిల్లు గూలినన్ 29
[కా పురము = చెడ్డ పురము]
అక్క చెల్లెండ్రు చక్కంగ నాడు చుండ
నేఁగ నగరికి దారిని నీల్గె నక్క
చెల్లె లక్కట పోయెను దల్లడిల్లి
పోయెడిది పోయెఁ బోనిది పోవు టేల 28
ఆయత ధీర యా వినత యన్నుల మిన్నయె పెద్ద వేడ్కతో
నో యని పిల్వ స్నేహమున సోదరి కద్రువ తోడ నత్తరిన్
వేయఁగఁ బందెమే వినత బింకము సెల్గఁగ నోడి నంతటం
బోయెడి దేదొ పోయినది పో నిది పోయె నదేమి చిత్రమో 27
[పోను = పోయిన; ఇది (బింకము) పోయెను]
మూరినఁ బరిపాలనమున
నోరున్నది మగనిఁ గాంచి నుతియింపంగన్
ఘోరుఁ డయినచోఁ బ్రజలకు
నోరున్నది మగనిఁ దిట్టి నొప్పించుటకే 26
[మగఁడు = రాజు]
ఔరా పూరుష పక్ష పాత మిది లోకాలిన్ సుఘోరమ్ముగాఁ
గారే యీ మగ వారు క్రూరులు ధరం గాంతా మణుల్ క్రూరలా
నో రీ లేదె విరించి తిట్టి సతినిన్ నొప్పింప రేయిం బవల్
నోరిచ్చెన్ గద బ్రహ్మ దిట్టి పతినిన్ నొప్పింప రేయింబవల్ 25
జంగము దేవర నారసి
యంగజ నాశకుని సంత తానత నిజ ము
ఖ్యాంగమ్మునఁ గరుణాబ్ధి త
రంగా కావు మన శివుఁడు రయమునఁ బ్రోచెన్ 24
పింగాక్షా వృషభేంద్ర వాహన హరా భృంగీశ్వరా నిర్జి తా
నంగా నాగ విభూషణా గరళ కంఠా పార్వతీనాథ భ
స్మాంగా ఫాలవిలోచనా త్రినయనా హస్తాబ్జ విన్యస్త సా
రంగా కావఁగ రమ్ము రమ్మనఁగఁ దా రక్షించె శ్రీకంఠుఁడే 23
దుష్టముగ నిష్ఠురమ్ము ల
నిష్టమ్ముగఁ బలుకఁగఁ దగునే యిట నీతం
డిష్టుం డెల్లర కక్కట
భ్రష్టాచారుండె లోకవంద్యుండు గదా 22
దుష్టశ్రేణికి నిల్చి దూరముగ సంతుష్టుండునై డెంద మం
దిష్టంబేర్పడ సత్ప్రవర్తనము నందింపార నిక్కమ్ముగన్
శిష్టాచారుల భాషణమ్ములు వినన్ శిష్టుండుగా మాఱఁగా
భ్రష్టాచారుఁడె లోకవంద్యుఁడుగఁ దా భాసించు సత్కీర్తులన్ 21
సద్వ్యయము మేలు భృశ రా
జద్వ్యసనము లొసఁగు కీడు సంతతమును గిం
చిద్వ్యంగ్యముతో విడుచుట
సద్వ్యాసంగ మ్మశాంతి సాధకము గదా 20
హృద్వ్యస్తార్థ విమోహియై జనులఁ దా హింసింప సంసార చం
చద్వ్యామోహము మీఱ డెందమున నిస్సందేహ సౌభాగ్య రా
జద్వ్యాపార మదాంధకారమున సస్వార్థైక సంకల్పి తా
సద్వ్యాసంగ మశాంతికిన్ నిలయ మో సౌజన్యమూర్తీ కనన్ 19
[సంకల్పిత + అసద్వ్యాసంగము = సంకల్పి తాసద్వ్యాసంగము]
అవసర మగు వేళ లందు నందించినఁ
దగిన యట్టి రీతి తప్పక పరి
పాటిగ నిరతమ్ము తోటి వారికి సహ
కారము గలిగించు గౌరవమును 18
వారక స్వీయ కార్యములఁ బన్నుగఁ జూపుచు భాష యందు సం
స్కారము సేసి యింపుగ నకారణ దుష్ట నిజోగ్ర రోష సం
హారము నీ ప్రవర్తనము నందుఁ ద్యజించుట సంతతం బహం
కారము ముఖ్య మైనదని కాంచుము గౌరవ మందు వేళలన్ 17
పూజ లొనరించి నిరతమ్ము పుణ్యవతియె
చాల నిష్ఠను దా నుండి చారుమతియె
మానవతి గర్భవతి కాఁగ మరల మరల
పతినిఁ గూడక సచ్ఛీల వడసె సుతుని 16
అతి గోప్యమ్ములు ధర్మ సూక్ష్మములు గూఢార్థమ్ములన్ వెల్గు సు
వ్రత దుర్వాస మునీంద్ర దత్త వరయై పత్యాజ్ఞఁ గుంతీ మహా
సతి పాటించి తలంచి మంత్రమును దా స్వాంతమ్మునన్ ధర్మజుం
బతి సంపర్కము లేక పుత్రునిఁ గనెన్ వామాక్షి సచ్ఛీలయై 15
కోతులను గూడి యసుర
వ్రాతము దశకంఠుఁ జంపి రాముఁడు దైత్యా
రాతి యనురక్తిఁ గైకొన
సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్ 14
ఆతత భక్తి మ్రొక్క జనకాత్మజ వారక నిత్యమున్ జగ
న్మాత కృపా రసేక్షణ సమాసములం గడు పేర్మిఁ గాచె లం
కా తటి జానకిన్ గిరిజ కాంత నుమాసతి రక్షితైక త
త్సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్ 13
దిగులు తొలఁగించి దరిసేర్చు దిక్కు లేక
బ్రతుకు తెరువింత కనలేక వంత నంది
కడుపు దినమెల్లఁ జెలరేఁగి కాలుచుండ
ముసుగు దొంగలై చరియింత్రు పుడమి జనులు 12
దెస నరయంగ లేక యిల దీన జనావలి మున్గెఁ జింతలో
వెస నిట చిన్ని కీటకము విశ్వము సర్వము నాక్రమింపఁగాఁ
బస చెడ దర్పహీను లయి ప్రాణ భయమ్మున సంతతమ్మునున్
ముసుగులు దాల్చు దొంగ లటు భూజను లెల్లఁ జరింతు రెల్లెడన్ 11
దండుగ యందురు నెలఁతలు
మెండుగ జీవనమున కయి మేదినిఁ గాంచం
గండ బలమ్మును దలఁపులఁ
బండిన తలలున్నఁ జాలుఁ బండితులేలా? 10
అప్పుల నున్న జీవులకు నారయ నున్నదె జ్ఞాన ఋద్ధియే
మెప్పుగ భూచరమ్ములకు మేధ వెలుంగునె మస్తకమ్మునన్
గొప్ప నభశ్చరమ్ము లిల కోవిదులే పరికించి చూడఁగా
నొప్పుగఁ బండి నట్టి తల లుండినఁ జాలు మఱేల పండితుల్ 9
అలసి దినమంత పనిసేసి చెలఁగి యంత
నింటి కరుదెంచి తిని యన్న మింత యింక
భద్ర రీతిని గాఢంపు నిద్ర లోనఁ
బవలు గడచెను గ్రుంకఁడు భానుమూర్తి 8
ఛవి మయ తప్త కాంచన లసద్రథ సూతుఁ డనూరుఁడుండఁగా
జవ హరి సప్తయుక్తమున సంభ్రమ మొప్పఁగ సత్వరమ్ముగా
రవి సన నిర్విరామముగ రమ్యపుఁ బ్రాక్తటి భారతమ్మునం
బవలు గతించి పోయినను భానుఁడు గ్రుంకఁడు పశ్చిమంబునన్ 7
కర్తృత్వము దాను బడయ
భర్తను వేధించు నట్టి వైరికి సద్య
స్స్ఫూర్తిని నుద్వేగమ్మున
భర్తను మెప్పింప విషము భామిని యొసఁగెన్ 6
వర్తుల చంద్ర బింబ నిభ వక్త్ర విలాస మనోహరాంగియే
నర్తన లీల వచ్చిన క్షణమ్మున నింపుగ మల్లికా నవీ
నార్తవ దామ మూని జడ యందుఁ బదాంబుజ మార్జ నార్థమై
భర్త మనంబుఁ జూఱకొన భామిని యిచ్చె విషంబుఁ బ్రేమతో 5
[విషము=జలము]
హితబోధల నొనరించుచు
మతి మంతుల స్నేహమందు మసలుమ యనుచుం
గతిపయ దినముల నగపడు
పతనముఁ గని తండ్రి తనయు వర్ధిల్లు మనెన్ 4
అతి రోషత్వమునం జరించు చనునిత్యమ్మున్ విరోధమ్ములన్
మతి సంధించి మెలంగు వాఁడు కడు సంభ్రాంతాత్ముఁ డత్యుగ్రుఁడున్
సత తావేశ మనస్కుఁ డబ్బురముగా శాంతుండు గాఁ దద్రుషా
పతనంబుం గని పొంగెఁ దండ్రి తనయున్ దీవించుచున్ 3
వాన కురియ మిగుల ఘటము
లో నీరు పడంగ నిండఁ బ్రోచుట కనఁగాఁ
దా నేల నుండి యెగురఁగ
మీనముఁ గుంభమునఁ గాంచి మేషము నవ్వెన్ 2
వానికి వ్రాయ జాతకముఁ బన్నుగ మంచి గ్రహమ్ము లుండఁగా
మే నలరంగ మూడిటను మేలు నొసంగెడు నట్టి రీతిగా
నా నరుఁ డంత హర్షము ఘనమ్ముగఁ బొంగఁగ డెంద మందుఁ దా
మీనముఁ గుంభమందుఁ గని మేషము నవ్వెను మిక్కుటంబుగన్ 1
[అందు(ఆ చక్ర మందు) మీనమును గుంభము మేషము గని తా నవ్వెను మిక్కుటమ్ముగన్]
1, నవంబర్ 2021, సోమవారం
సమస్యాపూరణ_నవంబర్ 2021
బాగుగ స్మరింప విష్ణుని
నే గతి నైన నలినాక్షు నెడఁదఁ దరించున్
వేగ మజామిళ నాముఁడు
యోగభ్రష్టుండు గాంచె నొప్పుగ ముక్తిన్ 59
పోగై యుండును జేసి నంత వఱకుం బో ధాత్రి నిశ్చింత వి
త్తాగారమ్మున దాచి నట్టి నిజ భాగ్యాభమ్ము భోగావలి
త్యాగస్వాంతుఁడు భక్తి యోగ మహిమం దథ్యంబ సత్కర్మ యు
గ్యోగాభ్యాసములోన భ్రష్టుఁ డయినన్ యోగ్యుండు ముక్తిం గనన్ 58
ఆరక మండిన హృదయ వి
దారక దుఃఖానలమ్ము దావాగ్ని వలెన్
దారుణ బాధా తరు కు
ద్దారము లేకున్న బ్రతుకఁ దరమే ప్రజకున్ 57
దారము లేక పుష్పముల దండ కనంబడ నట్టి రీతి కే
దారము లేక యన్నమును ధారుణిఁ గానని భంగి దీన మం
దారము లేక సౌఖ్యమును ధాత్రినిఁ గాంచని యట్టి భంగిఁ గం
దారము లేనిచోఁ బ్రజ ముదమ్మలరన్ బ్రతుకంగ సాధ్యమే 56
[కందారము = వడి గల మేఘము]
ఏమీ దౌర్భాగ్యం బీ
భూమీశ్వరుల వెదకంగఁ బుణ్యాత్ము లహో
యీ మహినిం గలరో లే
రో మము సత్కృపనుఁ గనుచుఁ బ్రోవఁగ నొప్పున్ 55
సేమము లెల్ల నారసి విశేషముగాఁ జదివించి పెంచి మీ
ధామము లందు మీ జనుల దాయల నందఱి నిల్పి నిత్యముం
బ్రేమ సెలంగ బంధువులు పెద్దలు మీరొ దయార్ద్రు లైన వా
రో మము సత్కృపం గనుచుఁ బ్రోవనిచో యశ మెల్లఁ బాడగున్ 54
యుక్తము కాదని సంశయ
యుక్తుం డయి డెంద మందు నూహించి నదీ
ముక్త పురీషణ యాదో
రక్తంబని మంచి నీరుఁ ద్రావఁగ జంకెన్ 53
[యాదో రక్తము = జలచరముల కిష్టము]
యుక్తాయుక్త విచక్షణుండు తర ణోద్యుక్తుండు ధీయుక్తుఁ డా
సక్తింగాంచి జలమ్ము డెందమున హర్షం బందె శశ్వత్తృషా
రక్తుం డయ్యు నదీ జలమ్ముఁ బ్రసరిల్లన్ బాల సూర్యప్రభల్
రక్తం బంచును నిర్మలోదకమునుం ద్రావంగ భీతిల్లెఁ దాన్ 52
చదివినవి పెక్కు లున్నవి చదివి నట్టి
వాని మఱవ నెన్నండును నేను నిజము
నే నెఱుంగుదు నిక్కము నీవె రామ!
కూర్మరూ పాన దశకంఠుఁ గూల్చితె హర 51
[కూర్మ రూపు +ఆన =కూర్మరూ పాన; హర =చంపు వాఁడ]
గజవిక్రాంత విలాస సద్గమన! మేఘశ్యామ రాజద్విరా
జి! జగన్నాథ! ప్రభాకరాన్వయ మణీ! సీతాపహారిన్ ఖలుం
బ్రజలన్ మౌనుల వేఁచు చుండ హరి! వే రామావతారుండవై
కుజనుండౌ దశకంఠుఁ జంపితె హ రాకూర్మావతారుండవై 50
[హర + అకూర్మావతారుండు = హ రాకూర్మావతారుండు:
హరుఁడు నకూ ర్మావతారుఁడు; హరుఁడు = పాపములను హరించు వాఁడు, విష్ణువు]
రెంటి యర్థ మొక్కటి యనిరి విపు లార్థ
శాసనులు నిశ్చయమ్ముగ బాస యందు
నడుగ వైయాకరణుల వా రనిరి కాదు
తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు 49
తద్భవ మౌను లచ్చి మఱి తత్సమ మన్నను లక్ష్మియే చుమీ
యుద్భవ మయ్యెఁ బెక్కులు మహోదధి పంకజ నాభు రక్షతో
నద్భుత రీతిఁ ద్రచ్చ ధవ ళాంబుధిఁ బూర్వము దేవ దానవుల్
తద్భవ మౌను లక్ష్మి మఱి తత్సమ మన్నను లచ్చియే యగున్ 48
[తద్భవము = ధవళాంబుధి భవము; తత్సమము =లక్ష్మి సమము]
బద్ధులునై నిజ మతమున
కిద్ధర సద్భక్తి నెల్ల రెలమి సెలఁగ స
ద్బుద్ధీ వారలు కారే
బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడ లోనన్ 47
యద్ధర్మం బిడు శాంతి సౌఖ్య మిలలో నద్ధర్మమే భాసిలున్
శ్రద్ధాసక్తుల మాట దేవుఁ డెఱుఁగున్ సత్యంబ చూపించుచున్
విద్ధుల్ వేఁగఁగ మారినన్ మత మహో విత్తాశతో హైందవుల్
బౌద్ధుల్ కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభం బందఁగన్ 46
[చూపించుచున్ భక్తిన్ (కఱ వైనను)]
నలిన నయనుండు ధరణీ
తల భార వినాశ సూచిత శకునమే కాఁ
గలుషిత కైతవ కేళిన్
గెలువఁగఁ గౌరవులు గాంచి కృష్ణుఁడు మురిసెన్ 45
కలఁగెఁ దదాంబికేయుఁ డెదఁ గౌరవ సేన వినాశ మందఁగం
దొలఁగెను భూమి భార మది తోరము హర్షము నంద ధాత్రియే
గెలిచిరి ధార్తరాష్ట్రులను గృష్ణ దయోన్నతిఁ బాండవేయులే
గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ గృష్ణుఁడు సంతస మందెఁ గుంతియున్ 44
[కౌరవులు = కురు సంతతి: ధార్తరాష్ట్రులు, పాండవేయులు]
దత్తపది"లడ్డు - బూరె - అరిసె - కాజా" భారతార్థమున:
అంగారపర్ణుం డను గంధర్వుఁ డర్జునునిచే నోడి యుద్దమున దగ్ధ రథుఁ డయినందున గంధర్వ మహిమ ననేక చిత్ర రథములు సృష్టించికొని చిత్రరథుఁ డనఁ బేరు మార్చికొని యర్జునునితో స్నేహము సేయు సందర్భము:
అరి సెడ బలమ్ము కా, జా
లి రగుల, మిత్రుఁడు నరునకు లీలన్ వనిలోఁ
గరమున బూ రెగయ మిగులఁ
ద్వరితము వా లడ్డు తీసి వఱలి నుతించెన్ 43
[బూరు ఎగయ= బూ రెగయ; బూరు=వెండ్రుకలు, రోమాంచము; వాలు+అడ్డు]
అడుగ నెల్లరు దిట్టలె యడుగఁ బడినఁ
గూడఁ బాండిత్య మందెంచ గొప్ప వారె
పెంపు గల వారి యందు గణింపఁగ రయి
తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు 42
ఇచ్ఛ చెలంగ డెందమున నింపుగ గెల్వ వధాని నత్తరిన్
స్వేచ్ఛగ వేయఁ బ్రశ్న లట నింపుగ ముల్కుల చంద మొప్పఁగన్
స్వచ్ఛపు టొక్క యంశమునఁ జక్కని వాఁ డొకఁ డన్న రీతినిం
బృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై 41
భక్తి మీఱఁగ నిత్యమ్ము పడతు లెల్ల
గుడులఁ గొబ్బరి కాయలు కొట్టు చుండ
తియ్య నైన ముక్కలఁ గాంచి దినఁగ రాఁగఁ
గోఁతిమూఁకకు నెలవయ్యెఁ గోనసీమ 40
ప్రీతి తోడుత నేర్చి విద్యలు వీడి సీమను బౌరులే
యాతనల్ వడి పొట్ట కూటికి నన్య దేశము లేఁగఁగాఁ
జూత మంచును జేరి యన్యులు చుట్టు ముట్టఁగ నక్కటా
కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్ 39
భక్త వరదుండు సౌరభ వాహనుండు
ప్రీతిఁ దనతోడఁ జేసి నిర్వీర్యు యముని
ఘన మునిసుతు మార్కండేయుని, నెడఁద నిడ
శివునిఁ, దోడ్కొని చనెఁ జంద్రశేఖరుండు 38
శివ చత్వారము నూనఁ బద్మ భవుఁడే చేతన్ శివుండౌ తగన్
భువి విష్ణుండు సుఖమ్ము లీయఁగను సద్భూతాలి కత్యంతమున్
నవ నామం బగు శంకరుం డనఁగఁ దన్నారాయ ణైకాహ్వకున్
శివునిం దోడ్కొని చంద్రశేఖరుఁడు వచ్చెన్ శంకరుం జూడఁగన్ 37
తర్షము మిక్కుట ముండఁగ
కర్షకులకు సేద్య మందుఁ గలఁత చెలంగన్
శీర్షవ్యధతో ఖండిత
హర్ష మిడును నేతకున్ జనాక్రందనలే 36
మర్షం బూని యెడంద సాయమును సంరంభంబునం గూర్చి ని
ష్కర్షం బాపి కలంత లన్నిటినిఁ దాఁ జాతుర్య మేపారఁగం
గర్షాంతఃకరణుండు నంత జన సత్కాంతుండు పడ్డం జెవిన్
హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్ 35
గరుడం డగు వాహన మ
క్షరుఁ డరవింద నయనునకు సత్యములే నీ
గిర లనుమానం బేలా
గరుడుఁడు వాహనము గాదె గరళ గళునకున్ 34
హరిహర వాహనమ్ములు మహాండజ పాదచతుష్క రాజముల్
పరఁగుచు నుండ సంతతము వాహనమై వృషభమ్ము సంశయా
కరముగ నడ్గఁగా నగును గాదె యనం దగ దిట్టు లెన్నఁడున్
గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్ 33
అక్కట నగరమ్మున గా
కెక్కడ వాని నరయంగ నెన్నఁడు తరమే
మక్కువతోఁ గోరినఁ దా
చిక్కడ? పల్లి సుజనులకుఁ జింతం గూర్చెన్ 32
మిక్కిలి చేటు కల్గు నని మెత్తని వాఁ డవధాని కక్కటా
యిక్కడ నంచు శంకను వహించి వధాన మొనర్పఁ బల్లెలో
గ్రక్కున రిక్త భాషణుఁడు కన్గొని వచ్చెను రక్తి నుండ నీ
చిక్కడ పల్లి యెల్లరకుఁ జింతనుఁ గూర్చె వధాని రాకతో 31
[నీచు +ఇక్కడ = నీ చిక్కడ; వధానిఁ జింతతోఁ గూర్చెను (దన) రాకతో (రిక్త భాషణుఁడు)]
చీమ కుట్టంగఁ జర్మమ్ము జివ్వు మనును
దోమ కుట్టంగ రోగము తోడ బాధ
కంత ముండదు పరికింప నంత కన్నఁ
బఱుపునన్ నల్లి కుట్టినఁ బరమ సుఖము 30
తఱ చగు కార్య భారమును దద్ద వహించి భుజద్వయమ్మునం
వెఱవక చక్కఁ జేయఁగను బ్రీతిని నేరక కుట్టి నట్టులే
యఱిముఱి నిద్ర వోవఁగను సాంతము వెచ్చటి నెత్తు రింపుగాఁ,
బఱుపున వాలి నంత సుఖ భావన గల్గెను నల్లి, కుట్టఁగన్ 29
[నల్లికి +ఉట్టఁగన్ = నల్లి కుట్టఁగన్; ఉట్టు =కాఱు ]
సారతర పృచ్ఛక గణము
చారుతరమ్ము సెలరేఁగ సల్లాపము లే
పారఁగ జ యాపజయ ని
ర్ధారణ యుండదు శతావధానము లందున్ 28
కారట పండితోత్తములు గాంచఁగ నెల్లరు సద్వధానులీ
ధారుణి నవ్వధానులును దల్పఁగఁ గారట పండితుల్ బృహ
ద్ధారణయే చెలంగు నవధానికి నిత్యము మాన వాల్పవ
ద్ధారణ యుండఁ బోదఁట వధానికిఁ జేయ శతావధానమున్ 27
నారీమణి యొలుకఁగ శృం
గారము చెక్కిలిని మీటఁగాఁ బోఱఁ డహో
నేరని విధమ్ముగా ని
స్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్ 26
క్షార విలీన కోమలము చందము సౌరభ హీన పుష్ప వ
ద్ధారము భంగి ఘోరతమ హాలహ లైక కణప్రపూరిత
క్షీరము భంగి శబ్ద పరికీర్తిత మైనను భావ జాల ని
స్సారమునున్ గ్రహింపఁ గల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్ 25
మూల నుంచి తాను మూఢ విశ్వాసమ్ము
మిత్ర బృంద మందు నాత్రముగ ని
జాంతరంగ మందు సంతత మాత్మ వి
శ్వాసముల గణించువాఁడు హితుఁడు 24
చేసిన మేలు సంతతము చిత్తము లోపల నుంచు వారితో
మోసము సేయు దుర్గుణము పుట్టని మర్త్యుల తోడ భూమిపై
వాసికి నెక్కి నట్టి తగు వారల సజ్జను లైన వారి సా
వాసము లెంచు వాని సహవాసము మే లతఁడే హితుం డగున్ 23
వ్రణ సన్నిభముగ నాప
ద్గణములు బాధించు చుండ గతిఁ గానక దా
రుణముగఁ దపించుచుండ శ
రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా 22
మణిమన్మాన్య కిరీట ధారిణి! జగన్మాతా! సుదీనార్త యం
త్రణ దీక్షా రత దేవి! సంతత భవన్నామైక సచ్చింతనా
ర్పణ సద్బుద్ధి విశుద్ధ చిత్తమునఁ బాపారణ్య శశ్వద్విదా
రణముం గోరుచుఁ గొల్చు భక్తులను నార్యా రక్ష సేయంగదే 21
గురుతర మౌనము దాల్చుచు
సురుచిర మౌ నూతనంపు సూత్రము తోడం
గర మనురక్తిఁ దలఁచి నిజ
పురుషుని మెడలోన మగువ పుస్తెను గట్టెన్ 20
విరివిగ మ్రోయ వాద్యములు వెల్గఁగ గాంతులు దిక్కు లన్నిటం
బరఁగఁగ వేద మంత్రములు పమ్మి యొకర్తుక యెత్తఁగా జడన్
వరుఁడు వధూమణిం గని శుభమ్ముగ మూర్తిఁ దలంచి యా రమా
పురుషుని కంఠమందు సతి పుస్తెను గట్టెను బెండ్లిపందిటన్ 19
[సతి పుస్తె = సతి యొక్క పుస్తె; రమా పురుషుని మూర్తిఁ దలంచి]
స్వార్తి నివారణ నిష్ఠా
స్ఫూర్తిని నిత్యోపవాస సురుచిర దీక్షా
కర్తృత్వమునఁ గృశింపఁగఁ
గార్తిక పూజలు సతులకుఁ గష్టముల నిడున్ 18
ఆర్తినిఁ గాలుఁ డా నరక మారసి పాపి విహీనమున్ జగ
త్కర్తను వేఁడ నాతఁ డనె గాంతల నోములు నోఁచఁ జేయుమా
భర్తను విస్మరించుచును భక్తిని గొప్పగఁ జాట నెంచుచుం
గార్తిక మాస పూజలను గాంత లొనర్చినఁ గల్గుఁ గష్టముల్ 17
సద్యస్స్ఫూర్తి నుడువ నన
వద్యము హృద్యమ్ముగఁ బరవశమై చెపుమా
విద్యాధిక! యిది తగదా
పద్యము కర్ణామృత మని పలుకుట తగునా 16
హృద్య ముదావ హార్థ యుత నృత్య సుచోదక కాహళీ మహా
వాద్యర వానుగుణ్య పరిపాలిత తాళ విశేష బద్ధ రా
జద్యమ కా ద్యలంకృత విచక్షణ శబ్ద సరాగ యుక్తమౌ
పద్యము కర్ణ పేయ మను వాక్కును బల్కుట సత్య దూరమే? 15
వెదకి లంకలోఁ దనరారు వీధు లిండ్లు
కాననమ్ములు కోనలు గాన రాక
కలఁత సెంది తనను దాను గాంచ కున్న,
పాపి వని తిట్టె, సీతను పవన సుతుఁడు 14
పాపము జానకీ సతికిఁ బట్టెను దుర్గతి యివ్విధమ్ముగం
గోపము నూని మిక్కుటము ఘోర దశాస్యుఁడు, పల్కు మారుతీ,
నీ పురి లోన రామ సతినిం గన వచ్చితి నన్న రోసి ని
న్పాపి వటంచుఁ దిట్టెఁ గద, పావని సీతను నిర్దయాత్ముఁడై 13
[పావని = పవిత్రురాలు; పావని సీతను రామ సతినిం గన ]
కన రెన్నం డాపదలను
గన రెవ్వరు దుఃఖములను ఘనముగ జీవిం
చిన నిర్జన నర దుర్గమ
వనమున సుఖమబ్బు శ్రీనివాసునిఁ గొలువన్ 12
అనిశమ్ముం బరమాత్ము నిల్పి మదిలో నర్చించినన్ భక్తితో
ననుమానింపఁగ నేల యేరికిని నాహా భావి జన్మంబు నే
ని నివారింప నగుం బ్రమోదమునఁ బ్రాణిశ్రేణి కెల్లన్ జగ
ద్వనమందున్ సుఖసంపదల్ దొరుకులే పద్మాక్షుఁ బూజించినన్ 11
[వనము = సమూహము; జగద్వనము = ముల్లోకములు]
నీ నే ర్పేమయ్యె నహో
కానిమ్మికఁ జేయ నేమి కల దిచ్చట నీ
వీ నాఁ డీ మల్లు నెదుట
శ్రీనాథా! చెఱచినావు సీసపు నడకన్ 10
[సీసము = మల్ల యుద్ధములో నొక పట్టు]
దీ నాలాపము లేల పల్కెదవు నిం దిట్టంగ నీ సత్కవుల్
చానల్ మెత్తురె నీదు పద్యముల లజ్జాహీన! ధీవర్యులుం
గానంగం గవి సార్వభౌముని వ రాఖ్యన్ వెల్గి నీ వివ్విధిన్
శ్రీనాథా! చెడఁగొట్టినావు గద మా సీసంపు సౌందర్యమున్ 9
అలవోకగ నంటి విటులఁ
దెలిసియొ మఱి సుంత యేని తెలియకయో నీ
పలికిన యట్టిది సత్యము
నిలుకడ లేనట్టి నరుఁడె నిజముగ గెలుచున్ 8
[నిలుకడ = విరామము]
అలయక యున్న నించుకయు యత్న మొకింతయుఁ జేయ నొల్లకే
కలవర మంద మిక్కుటము కార్యము లెట్లు ఫలించుఁ జెప్పుమా
పలు వచనమ్ము లేల నయ పల్క నిరంతర యత్న దీక్షతో
నిలు కడ లేని మానవులనే వరియించును గెల్పు నిచ్చలున్ 7
[ఇలు కడ లేని = ఇలు (విశ్రాంతికి) మఱియు నంతము (పనికి) లేని]
ఎన్ని చెప్పిన నీవు నీ కన్ని చెప్పు
బుస్సు మన నీవు దా నప్డు కస్సు మనును
దార చెంతను రాకా సుధాక రాభ
మౌఖిక! పరీక్ష గెలిపించు మౌన మొకటె 6
[మౌఖిక = ముఖమునకు సంబంధించినది ,రూపము కలవాఁడు]
శాఖల భంగి విస్తరిల శాస్త్రము లెల్లను నేఁడు విస్తృతో
లూఖల మందు దంచు విధి రుబ్బఁగ నిత్యము నిబ్బరమ్ముగన్
లేఖన రేఖ లందునె పరీక్షలు వెట్టెద రన్నచో వినా
మౌఖికమౌ పరీక్ష యెడ మౌనముఁ బూనుటె మేలు గెల్వఁగన్ 5
ఎంచి విత్తమ్ము ధర్మమ్ముఁ ద్రుంచి త్రుంచి
నించి ద్వేషమ్ము మాటలు దంచి దంచి
మించి పగవారి కనిశమ్ము పొంచి పొంచి
సాయ మొనరించు వాఁడె పో శత్రు వనఁగ 4
మాయలు పన్ని మిక్కుటము మంతన మింపుగఁ జేసి భండన
న్యాయ మొకింత యేని మది నక్కట యెన్నక మించి సంధి నేఁ
జేయ నెదం దలంతు నని చెప్పుచు యుద్ధము, కూర్చి వింటినిన్
సాయముఁ, జేయు వాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్ 3
[సాయము = బాణము]
నూత్నములు కొన్ని యుండఁగఁ
బ్రత్నమ్ములు నుండఁ గొన్ని పంక కరములన్
యత్నించి వాని ముట్టిన
రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్ 2
రత్న కిరీట భాసిత నరర్షభ! కృష్ణ ! మురారి! మేఁతకై
యత్నములం ద్యజించి తమి నప్పుడు గాంచి తవాంగుళీ లస
న్నూత్న విశేష రాగ సుమనోహర వంశము మోవి నుంచ,గో
రత్నము లెల్ల మారినవి ఱాలుగ, నీ చెయి దాఁకి నంతటన్ 1
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)