శ్రీరస్తు.
శుభమస్తు. అవిఘ్నమస్తు.
26-04-2026.
శ్రీ కంచమర్తి
కరుణా దుర్గాప్రసాద్ దంపతుల నాశీర్వదించుచు వారి పుత్రికామణి జాహ్నవీ వివాహ
మహోత్సవ శుభ సందర్భమున జాహ్నవీ హితేష్ వధూవరులకు
నాంధ్రభాషానేక కావ్య కర్త పోచిరాజు కామేశ్వర
రావు సమర్పించు శుభాశీః పద్య రత్నాక్షతలు:
***
ఒనరన్ భాగ్యము
జాహ్నవీ వర హితేష్యుగ్మమ్ము వర్ధిల్లఁగా
ననునిత్యమ్మును
బార్వతీ సహిత ఫాలాక్షుండు రక్షించెడిన్
దిన
రాత్రమ్ములు సాగ వృద్ధిని సదా దీవింత్రు
లక్ష్మీ సతీ
వనజాక్షుల్ ధన ధాన్య వాహన వసువ్రాత ప్రదానమ్ములన్
క్రమ ధారాయుత పుత్ర పౌత్ర వర పారంపర్య మేపారఁగా
విమలాంతఃకరణమ్ము లిర్వురను
సంవేష్టించి వర్ధిల్లెడిం
బ్రమదోపేత
నిరంతరాతిశయ దాంపత్యమ్ము దీపించెడిన్
భ్రమరాంబా నటరాజ
దీవనలు సంప్రాప్తమ్ములై కావుతన్
తగు నీ జాహ్నవి యీ హితేషునకు
నీతండుం దగున్ లేమకుం
దగులం జేసిన పద్మ
సంభవుఁ డహో ధన్యుండు కాకుండునే
తగులం బత్యధికంబ
యిర్వురకు నిత్యం బుండు నన్యోన్యమై
తెగ దీ బంధము ధాత్రి
నెన్నఁడును వే దీవింప నాకౌకసుల్
సర్వమంగళాని భవంతు!
స్వస్తి!
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి