అనితర సాధ్యు డంచు నత డాలము నందు నరుండు భీష్మునిం
దునుముగ నెంచి ధర్మమును దూరము జేసి శిఖండిఁ బేడినిం
దన రధ మందు నుంచగను దర్పము మీర పరాక్ర మింపగన్
వనితయె మీసమంటి తగఁ బల్కెను పంతము దీరు నిత్తరిన్ 37
కనియా భీష్ముని నుగ్రయుద్ధమున మేఁ గంపింప భీభత్సుడు
న్ననివార్యంబుగఁ గష్ట కాలమున నయ్యంబన్ శిఖండిన్ వడిం
దన సాహాయ్యము సేయ గోరి యరదం బందుంచ రోషంబునన్
వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్ 36
ఆవుని చంపబోవు నొక కటిక వాని యాయుధము (బాణము) పట్టుకొని యొక మానవతా వాది వలదని చెప్పు సందర్భము:
కటిక వాని నొకని గాంచి కరుణ మీర
వాని యత్నమాపగ నొక మానవుండు
వినుము తెలియదె వధియింపగను నిట పశు
వనిత మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు 35
[పశువు +అనితము+ఈస+అమ్ము;
అనితము =పొందబడనిది; ఈస = అల్పము; అమ్ము = బాణము]
ధృతి సంసక్త విశుద్ద చిత్త ఘను డుద్రేకార్త సంరంభియై
జితమాత్సర్య గుణుండు కైక సుతు డాశ్రీరామ సత్పాదుకల్,
శతకోటిప్రణతుల్ చరించి, కొని యాజ్ఞాపించె శత్రుఘ్నునిన్
వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్ 34
సతతము శుభ్రత పాటిం
చు తగిన రీతి తనుమధ్య సూడుము నేనుం
చితి యెత్తుగ నచ్చట సు
వ్రత! పీఠము పైనఁ బాదరక్షల నిడుమా 33
వరముల నెపం బిడుచుఁ గలవరపడఁ బతి
కైక,కుత్సిత చిత్త యేకైక దృష్టిఁ
బుత్రు డుద్దండ సార్వభౌముం డగునని
భరతుఁ ,డంపె రాముని వనవాసమునకు 32
సద్యఃఫల దాయకములు
విద్యాధికుల కవనౌఘ విజ్ఞాన నిధుల్
హృద్యముగ నిగూఢార్థపు
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్ 31
[రోయు = వెదకు]
మారుని కన్నతండ్రి సుకుమారుడు వారిజనేత్రుఁ గృష్ణు దు
ర్వార పరాక్ర మాసదృశ భండన దుర్జయు నత్తరిన్ శిరో
భారము ప్రజ్వరిల్లగను భర్తను దాపెను సత్యభామయే
కారణమేమి లేక నిజ కాంతుని దూఱరె కాంత లెల్లరున్ 30
మురిపెముగఁ బెండ్లి సేయగఁ బుట్టినిల్లు
వీడ నొంటరి యత్తింట వికసితప్ర
ణయని చీటికి మాటికి నవ్య వధువు
కారణము లేక దూఱును కాంత పతిని 29
కుమ్మరి పురుగు తిరుగు పంకమ్ము నందు
నిర్మలముగఁ దమ్మి దళము నీరు వదలు
నెల్ల నాత్మలు పరమాత్మయే యనంగ
పరమభాగవతులు సానివాడ నుంద్రు 28
ధారుణి జననీ ప్రేమకు
మారెక్కడ మాఱుతల్లి మాతయు నగునే
దారుణ విమాతఁ గల్గిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా 27
ప్రీతిని నీరము తెండన
నాతత వీర్యాతిశయులు నట యక్ష కృతా
చేతనులగుటన్ సిగ్గిలి
భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే 26
“హా తండ్రీ” యని వీడి బాణములు ద్రోణాచార్యు లావేదనన్
భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి, భీమార్జునుల్
చాతుర్యంబుగ సంజ్ఞలీయఁ గని ధృష్టద్యుమ్ను డత్యుగ్రతన్
వీతప్రాణునిఁ జేసె ద్రోణునని గంభీరాస్త్ర ఘాతంబునన్ 25
సునిశిత వాక్చాతుర్యత
మన మార్తిం జెందు నుడుకు మాటల కరకుం
దనము పతులు, హాస్యంబున
కని, కరముం జూపఁ దగదు కాంతలపైనన్. 24
లలిత వదనుండు కృష్ణుండు లక్ష్మణుండు
పల్లె పల్లెల నున్నట్టి బాలు రెల్ల
నాశనమయిరి కంసాధి నాయకుల చ
లవ, కుశులు, మేనమామలు లక్ష్మణునకు. 23
[ లక్ష్మణుండు = శ్రీమంతుడు; కుశులు = పాపులు; కంసాధి నేతల, కుశులు, మేనమామలు: రాజస బహువచనము.]
తన్ను మించిన ధన్విని కన్ను చెదరి
కొల్లగొట్టించె కవ్వడి వల్ల మాలి
నట్టి విడు పేకలవ్యుడు నిట్టె యొసగె
ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు. 22
కనఁ జక్కని రూపమ్మును
విన నింపగు మాటలఁ దనివి నొసంగుచు మో
మున మోము మోదముగ, నిజ
మను, మానించెడు పతి గల యతివ సుఖించున్. 21
[నిజము+అనుము+ఆనించెడు]
వనజనాభ సేవ యొసగు స్వర్గ నిధులు
నిత్య మిద్ధర జరిగెడు సత్య మిదియ
యర్చనల పేర దేవాలయమ్ము లందు
దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు. 20
సమనీల వర్ణ దృఢ వి
క్రమ దేహద్యుమ్న ఘోర కర్కశ మృగముల్
ద్రుమ శాద్వల గోత్ర నికా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్. 19
కాలాతీతాలోలా
హేలావేశాతిరోష హేమాభాక్షుల్
డోలాయమాన కాంతల్
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే. 18
కాలము మారెం గలినిన్
శీల వతులకు నలివేణి చిరుసిగ యాయెన్
మాలలు కలలోన నలిగె
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే. 17
ధైర్యము జూపి యిద్ధర సదా చరియించు మనుష్యుడింక నౌ
దార్యము మిన్ను ముట్టగ నితంబిను లెల్లరు మాననీయులే
కార్యము కాదు మత్తిలి యకారణ మిట్లు వచింప నేరికిన్
భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్. 16
ఆర్యులు వార లిద్దరు సదాగమ భాసిత పుణ్య మూర్తులున్
భార్యయు భర్తయయ్యు నన పత్యులు జేసిన దాన ధర్మ స
త్కార్యము లన్ని నిండు ఫలితమ్ము లొసంగెను సంతసంబుగన్
భార్యకు, మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్. 15
కంటి గలలోన నొకనాడు తొంటి యట్ల
చూడ చక్కని రూపమ్ము, చుక్కలకును
ఱేడు, సతులట యిరువది యేడు! రామ!
రామ! చంద్రుండు శయనించె రంభతోడ. 14