చింత లవి దీరుఁ జూలా
లింత దినిన యంత చింత నెవ్విధ మైనన్
వింతగ నాడుదు రబలలు
సుంతైనను జాలు పాక శుద్దికి వింతన్ 13
కులుకకురా చెలగకు వినకుమురా కన్నా
పలుకకురా తలపకురా
విలపించకు మనువు గాని వేళల యందున్ 12
శకటము జూడ బహులార్థ సాధక మయ్యెన్
ప్రకటిత దరహా సాస్యులు
సుకుమారుల సహచరులకు శుభ యాత్ర గదా 11
కారము మానస హరణము కాదే తలుపన్
నోరూరు జనుల కెల్ల న
పారమ్ముగ మిరెప కాయ బజ్జీలఁ గనన్ 10
బాలానందము కల్గజేయు నవ నౌపర్వమ్ము లందించినన్
హేలా కేళి వినోద విభ్రమ విలో లేక్షా కలాపమ్ములన్
వేలాక్రాంత హృదంబుధిన్మెరయు నావేశాది భావావళుల్ 9
జలమునఁ బాలుని నడుమను సాకగ నెలమిం
గలుపును దీయగ సాగెను
బొలమునఁ గనువిందుగ మన పొలమరి దీక్షన్ 8
ఛద్మా కలిత మధురాతిశయ భక్ష్య మటన్
పద్మారుణ మాణిక్యము
పద్మాక్షునకైన బ్రీతి పాత్రంబు గదా
[సద్మము= ఇల్లు ; ఛద్మము= పైపొర] 7
శ్రమ జీవుల గమ్య మపా
రము శిరమున భార మద్దిర గగన నిభమే
తిమిరము గ్రమ్మక మునుపే
క్రమముగ జనుదేరు చున్న కాంతల గనుడీ 6
ఖర్వ పిపాసా వినాశ కమరిష్ట మటన్
పర్వది నాగంతక జన
పర్వానందాతిశయ సుఫల దాయకమున్
[అరిష్టము = కీడు, మజ్జిగ; పర్వము = పండుగ,
సమూహము]
|
తగవారిం దెలియ సులభ తరమట సుమ్మీ
మగువల మన సది గుంభన
మగు గంభీ రాంబుధి గన నాశ్చర్యముగన్ 4
ప్రవిమల పాకానుకూల భార ధర మిలన్
ధవళ రుచి వికసిత సురుచి
లవణ విహీన పరిపాక లలితము గలదే 3
చటకారామాద్భుత బిల
పటుతర నిర్మాణ శైలి ప్రాప్తంబగునే
ఘటికులు విజ్ఞానులకున్
వటపత్ర శయనుని లీల పరమాద్భుతమే 2
య వినో దాహ్లాద కరము లా మల్లియలున్
ఛవిమత్కాంచన సంకా
శ వర్ణ కనకాంబరములు సనునే విడువన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి