ఆతత కృపా రసాన్విత
చేతో వర దేవదేవ చిన్మయ వపు వా
భూతప్రే తాధ్యక్షుఁడు,
సీతాపతి! యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా 52
నీతిన్ వీడి శిశు వ్రజ క్షయము సంధింపంగ దుష్కార్య సం
వీతా త్మాధముఁ గంసుఁ జంపి భువి నొప్పెం జిన్ని కృష్ణుండు సు
ప్రాతఃకాల దినేశ సన్నిభుఁడు, సంభావించి వీక్షించగన్
సీతా వల్లభుఁ డిందు శేఖరుఁడు, వాసిం గాంచెఁ గంసారిగన్ 51
[సీత = గంగా దేవి]
ఎప్పు డెవ్విధిఁ జరియింత్రు నేర్వ గలమే
ముళ్ళ మీద నడక కళ్ళు తెఱచు
ధన మదాంధ జనుల దగ్గర కొలువు భా
రమ్ము జనులకు శరణమ్ము గాదె 50
ఇమ్ముగ నిచ్చు భక్త జను లెల్లర కెంతొ ముదమ్ము పుణ్య ధా
మమ్ము వికుంఠ పత్తన రమా సతి నాథు ధరా బృహచ్ఛరి
త్రమ్ము గుణప్రకీర్తిత నితాంత సమంచిత కీర్తనాది వా
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ 49
[వారము = సమూహము]
వేసరి మిక్కిలి తెచ్చితి
వీ సంపెఁగ పువ్వు లుంచు మిచ్చోటను నీ
దోసము లే దించుక దు
ర్వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ 48
కోసితిఁ బ్రీతి తోడుతను గోమలి చిత్తము సంతసింపగాఁ
జేసి తరింతు నం చకట చిత్రము మెచ్చదు నీదు దార యీ
భాసిత పుష్ప సంచయము పంచితిఁ గోకనదమ్ము లిందు లే
వాసన! లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్ 47
[లేవు +ఆసన = లే వాసన; ఆసనుఁడు = కూర్చున్నవాఁడు]
ఇనకుల దీపకుఁ గాకు
త్స్థ నరాధిప ముఖ్యు నీలితమ మేఘశ్యా
మునిఁ బద్మదళాక్షుని రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్ 46
ఘనతర బాహు భీమతర గాత్ర విరాజి హిడింబి నా బరం
గు నవ సు మాభ చిత్త వర కోమలి మార సుపర్వ తప్త తా
వనమున నుండ దీప్త తను భాతి పృథా సుత మధ్యముండు భీ
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్ 45
సూనృత వాక్యం బియ్యది
కానేర దసత్య వాక్కు కలనం దైనన్
మానవు లిండ్లను దాకిన
జ్ఞానుల పదధూళి పాప! సంగతిఁ గూర్చున్ 44
[సంగతి జ్ఞానము]
మానిత ధర్మ వర్తనుఁడు మాన్య విభీషణు మాట లెంచ కా
దానవ లోక రక్షకుఁ డధర్ముఁడు రావణ నామ సంతత
ధ్యాన పరాయ ణాత్ములయి దైత్య వరాజ్ఞ, తృణీకరించి సు
జ్ఞానుల పాద ధూళి, శిరసా వహియించిన ఘోర పాపమౌ 43
ఆకాశ వాణి సమస్య
దత్త పది - కరి గిరి దరి సిరి అన్యార్థంలో దేశభక్తి ప్రబోధకముగా
సాతోదరి! యర్థ కరి! వి
ధూ తాధర్మ చయ నిత్య తోషిత! స్వజన
వ్రాత సుదాసి! రిపు మనో౽
తీత వరబలాంగి! రిక్త తృష! భారతమా! 42
అట కరిగి రిపు నుదరి విసి
రి టెంకి వీడఁగఁ బదపడి రివ్వునఁ గడు బ్రా
కటముగ నడిచి గెలువు నీ
పటుతర శక్తి తెలియంగ భారత వీరా! 41
కరములు ముకుళించి కైంకర్య భావము
ప్రస్ఫుటంబు గాఁగఁ బాప చిత్తు
శీల రహితు సేవ, సేవిత తాప సా
భ జన! సేయువాఁడు భక్తుఁ డగున 40
సజనన పోషణ క్షయ విచార ర తాకలి తాత్మ పుణ్య ధా
మ జగ దశేష సత్త్వ వర మండల రక్షకుఁ గొల్వ భక్తుఁడే
సుజనుల వీడి దుర్జనులఁ జోద్యము మీఱఁగఁ గోరి స్వార్థమున్
భజన మొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా 39
విమ లాంబర మరణుం బయి
ప్రమాద సంజనిత మపుడు జ్వలి తానల ధా
మ మనంగ శిలా ద్రవపు మ
హిమ గిరి మండెను భగభగ హేమంతమునన్ 38
విగత సతీ సముద్భవ సుభీమ విచారుఁడు రక్తవర్ణ దృ
గ్రు గధిక చండ శంకరుఁడు రోష హృదుగ్రుఁడు నాట్య మాడగన్
ధగధగ మండఁ గన్నులు పదమ్ముల పీడన మోర్వ లేక తా
భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో 37
సుద్దు లందుఁ గాక శుద్ధ కర్మము లందుఁ
చేతో వర దేవదేవ చిన్మయ వపు వా
భూతప్రే తాధ్యక్షుఁడు,
సీతాపతి! యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా 52
నీతిన్ వీడి శిశు వ్రజ క్షయము సంధింపంగ దుష్కార్య సం
వీతా త్మాధముఁ గంసుఁ జంపి భువి నొప్పెం జిన్ని కృష్ణుండు సు
ప్రాతఃకాల దినేశ సన్నిభుఁడు, సంభావించి వీక్షించగన్
సీతా వల్లభుఁ డిందు శేఖరుఁడు, వాసిం గాంచెఁ గంసారిగన్ 51
[సీత = గంగా దేవి]
ముళ్ళ మీద నడక కళ్ళు తెఱచు
ధన మదాంధ జనుల దగ్గర కొలువు భా
రమ్ము జనులకు శరణమ్ము గాదె 50
ఇమ్ముగ నిచ్చు భక్త జను లెల్లర కెంతొ ముదమ్ము పుణ్య ధా
మమ్ము వికుంఠ పత్తన రమా సతి నాథు ధరా బృహచ్ఛరి
త్రమ్ము గుణప్రకీర్తిత నితాంత సమంచిత కీర్తనాది వా
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ 49
[వారము = సమూహము]
వేసరి మిక్కిలి తెచ్చితి
వీ సంపెఁగ పువ్వు లుంచు మిచ్చోటను నీ
దోసము లే దించుక దు
ర్వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ 48
కోసితిఁ బ్రీతి తోడుతను గోమలి చిత్తము సంతసింపగాఁ
జేసి తరింతు నం చకట చిత్రము మెచ్చదు నీదు దార యీ
భాసిత పుష్ప సంచయము పంచితిఁ గోకనదమ్ము లిందు లే
వాసన! లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్ 47
[లేవు +ఆసన = లే వాసన; ఆసనుఁడు = కూర్చున్నవాఁడు]
త్స్థ నరాధిప ముఖ్యు నీలితమ మేఘశ్యా
మునిఁ బద్మదళాక్షుని రా
మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్ 46
ఘనతర బాహు భీమతర గాత్ర విరాజి హిడింబి నా బరం
గు నవ సు మాభ చిత్త వర కోమలి మార సుపర్వ తప్త తా
వనమున నుండ దీప్త తను భాతి పృథా సుత మధ్యముండు భీ
మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్ 45
సూనృత వాక్యం బియ్యది
కానేర దసత్య వాక్కు కలనం దైనన్
మానవు లిండ్లను దాకిన
జ్ఞానుల పదధూళి పాప! సంగతిఁ గూర్చున్ 44
[సంగతి జ్ఞానము]
మానిత ధర్మ వర్తనుఁడు మాన్య విభీషణు మాట లెంచ కా
దానవ లోక రక్షకుఁ డధర్ముఁడు రావణ నామ సంతత
ధ్యాన పరాయ ణాత్ములయి దైత్య వరాజ్ఞ, తృణీకరించి సు
జ్ఞానుల పాద ధూళి, శిరసా వహియించిన ఘోర పాపమౌ 43
ఆకాశ వాణి సమస్య
దత్త పది - కరి గిరి దరి సిరి అన్యార్థంలో దేశభక్తి ప్రబోధకముగా
సాతోదరి! యర్థ కరి! వి
ధూ తాధర్మ చయ నిత్య తోషిత! స్వజన
వ్రాత సుదాసి! రిపు మనో౽
తీత వరబలాంగి! రిక్త తృష! భారతమా! 42
రి టెంకి వీడఁగఁ బదపడి రివ్వునఁ గడు బ్రా
కటముగ నడిచి గెలువు నీ
పటుతర శక్తి తెలియంగ భారత వీరా! 41
ప్రస్ఫుటంబు గాఁగఁ బాప చిత్తు
శీల రహితు సేవ, సేవిత తాప సా
భ జన! సేయువాఁడు భక్తుఁ డగున 40
సజనన పోషణ క్షయ విచార ర తాకలి తాత్మ పుణ్య ధా
మ జగ దశేష సత్త్వ వర మండల రక్షకుఁ గొల్వ భక్తుఁడే
సుజనుల వీడి దుర్జనులఁ జోద్యము మీఱఁగఁ గోరి స్వార్థమున్
భజన మొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా 39
విమ లాంబర మరణుం బయి
ప్రమాద సంజనిత మపుడు జ్వలి తానల ధా
మ మనంగ శిలా ద్రవపు మ
హిమ గిరి మండెను భగభగ హేమంతమునన్ 38
విగత సతీ సముద్భవ సుభీమ విచారుఁడు రక్తవర్ణ దృ
గ్రు గధిక చండ శంకరుఁడు రోష హృదుగ్రుఁడు నాట్య మాడగన్
ధగధగ మండఁ గన్నులు పదమ్ముల పీడన మోర్వ లేక తా
భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో 37
సుద్దు లందుఁ గాక శుద్ధ కర్మము లందుఁ
గూడ వీడ నెమ్మిఁ గ్రూర కృతుల
నెద్దినమ్ము నైన సద్దయా పూరి తా
హింస గల్గఁ జేయు హితము భువికి 36
[పూరిత = అహింస =పూరి తాహింస]
హింస యనంగ రా దనిమి షీప్సిత కార్యము పూర్వపార్థి వో
త్తంసు లొనర్చ నధ్వర వితానము గూర్చెనె సుంత లోక వి
ధ్వంసము నశ్వమేథ మఖ పావన ఘోటక ఖండనమ్ము నా
హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్ 35
లేరే యమర వరేణ్యులు
చూఱకొనఁగఁ బర ధనమ్ము క్షుద్ర సురాళింగోరుచుఁ బరాపకారము
నారాయణ! మంత్ర జపము నరక మొసంగున్ 34
తల భాసిత కుసుమ మాల ధరణీ తల రా
జు లలరి నమ్రతఁ జేయ ను
తు లసి వరించినది, దుష్ట దుర్యోధనునిన్ 33
[నుతుల్ + అసి = నుతు లసి; అసిన్ = ఖడ్గమును]
కలికి ప్రభావ మద్భుతము కావున వెల్గె సుయోధనుండు భూ
తల సుసమగ్ర పాలన రతద్యుతి నిండఁగ హస్తినీపుఁడై
యలఁ దమి దేవి భానుమతి యవ్వనితా మణి కాదె, యంగనా
తులసి వరించి వచ్చెనట, దుష్ట! సుయోధనునిన్ ముదమ్మునన్ 32
[అవ్వనితా మణి కాదె దుష్ట : చెడ్డది కాదు]
నాగమ వేదులు ఘనులు సదాచారులు న
భ్యాగతిని, మనం బం దిడి
రాగద్వేషమ్ముల, విడరాదు మునులకున్ 31
పలుకం జాలునె సత్య దూరములు నిర్భాగ్యమ్ము సేకూరినం
గలనం దైనను నన్య దారల మదిం గామింప సంభావ్యమే
చలనం బించుక లేక నేత్రముల నాచ్ఛాదించి కూర్చున్ననుం
గలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్ 30
సూత్రీకరించి శుభ వ
ర్ణత్రయ సంకలన రీతి నయమొప్పఁగ నా
రాత్రి యనిద్రన్ గీసిన
చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్ 29
[చైత్రము = పటము: చిత్రమునకు(బొమ్మ) సంబంధించినది;
రథ సప్తమి = ఏడు రథముల గుంపు]
చిత్ర రథమ్ము పైఁ బరఁగి శీఘ్రమ నిత్యము సంచరించు ని
ద్ధాత్రిని సూర్య దేవుఁడు వితాన దయా రస మగ్న చిత్తుఁడై
పాత్రము నెంచి సూర్య నుతిఁ బన్నుగఁ జేయుడి మీరు ముందుగం
జైత్రము నందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్ 28
[చైత్రము = గుడి]
కనువిం దయ్యెను మిక్కిలి
తనివిని నేఁ గాంచ వారి తరళాననముల్
వనమెల్లఁ గార లేచిన
మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్ 27
ధనములు గుమ్మరించి కడు ధైర్యము గైకొని పంట వేయగం
గనులకు విం దొనర్చుచుఁ బ్రకాశ విలాసము గాఁగఁ బంటయున్
మనములు వొంగువాఱఁగ వినమ్రత శాలి వరంపుఁ గంకులన్
మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్ 26
ఎక్కడి రోజు లక్కట యహీనము లందురు ప్రేమ పాశమే
దక్కిన భాగ్యవంతులు ముదమ్ముగ దీవన లొందఁ గోరుచుం
దక్కిన రోజు లెవ్వియును దప్పక మ్రొక్కఁగఁ గూడ దంటినే
మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్ 25
[రోజునను = రోజు కూడా ]
బట్టి మదిన్ దిట్టఁదనము భాసిల్లంగం
జుట్టి యఘ నికాయంపుం
జుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్ 24
కనలుచు మిక్కిలి కోప
మ్మునఁ దాఁ జెలరేఁగు చున్న ముగ్ధుండగు వే
నను గని నంత ముఖము, నా
యిన బింబము, పగటిపూఁట హిమ గోళ మగున్ 23
[ఇనుఁడు = మగఁడు]
హ్వాంగమ్ముగ మారి యంత నతి శీఘ్రమ, వే
దాంగజ్ఞుఁడు మంత్ర జలము,
సింగము నోటన్ వసించెఁ, జిలుక ముదమునన్ 22
[చిలుకు = చల్లు]
అంగ విలాస లీలలు మహత్తరమై చన గోత్ర తుల్యమౌ
భంగినిఁ గానిపించు నొక పాదప కుంజర రాజ మందునన్
సంగడి కాని చెంతను వసంత దినమ్ముల వృక్ష కాండమన్
సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్ 21
[ఆ మహావృక్షంపుఁ దొఱ్ఱ తెఱచుకొన్నసింగపు నోటినిఁ బోలె నన్న భావన.]
భుగ్దయ లేల కలుగును విపుల నెన్నఁడు స
మ్యగ్దృష్టి వహించక యే
వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్ 20
రుగ్దీనత్వము వొందు సంతతము నారోగ్యక్షయా తప్తుఁడై
దృగ్దోషాత్త విచార మానసుఁడు సందేహమ్ము లే దేరికిం
బ్రాగ్దిగ్ద్వేష కవిత్వ సంపదకు శాపధ్యేయ చిత్తుండునై
వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్ 19
స్పష్టముగఁ బలుకుమా యే
యిష్టుల నొనరించ నకట యీమతి నీ కే
యష్టాంగమునఁ గలిగె నే
దుష్టుల కే దైవ మెపుడు దోడ్పడుచుండున్ 18
దుష్ట హిరణ్య లోచనుఁడు దోర్బల దర్పుఁడు భాగ్య మందఁడే
దుష్టుఁడు కాఁడె రావణుఁడు దోరపు భాగ్యములం జెలంగఁడే
కష్టము లెన్ని కల్గినను గందక పాపము పండు నంతకున్
దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడు చుండును ధర్మ రక్షకై 17
అస్త్ర శస్త్ర విద్యా నైపు ణాదు లందుఁ
గర్ణుఁ డెక్కుడ యగు నను నిర్ణయుండు
దుష్ట దుర్యోధనునకుఁ, దాఁ దుల్యుఁ డౌచు
నర్జునున, కాప్తమిత్రుఁడౌ నంగరాజు 16
అర్జును పైన కక్ష హృదయమ్మున నుండి దహించ నిత్యమున్
దుర్జయ దోర్బ లాతిశయ తుష్ట మనమ్మున జామదగ్ని గు
ర్వార్జిత మస్త్ర పాటవము నంది సుయోధను ధార్తరాష్ట్రు త
ప్తార్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్ 15
[అర్జునము = బంగారు]
పావన మౌని వరేణ్యులు
నా వఱలెడు వార లైన నంబుజ నేత్రా
యేవిధి గెల్వఁగ నేర్తురు
భావజు, సుమ! బాణమె యమపాశమ్ము గదా 14
తర మగునే శివుం గెలువ ధాత్రినిఁ గాముకుఁ జేయ నెంచి యీ
శ్వరుని సు మాస్త్ర మేసి వడి శంభుని చండపుఁ గంటి మంటలన్
సురగణ కామి తార్థము నసుచ్యుతుఁ డాయెను గాముఁ డక్కటా
మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్ 13
కవన ప్రియయైన యొక సతి భర్తతో హాస్యరస జనకముగా:
అధ రామృతమ్ముఁ జవిగొన
మధురగ్రీవ! మృదువచన! మదన సదృశ రూ
ప! ధన పశు ధాన్య వాహన
విధవా! రమ్మనెను సతియె విభునిం బ్రేమన్ 12
[.. వాహన విధవా = .. వాహన సమృద్ధి కలవాఁడా; విధ = సమృద్ధి]
విధి కృత్యమ్ములు వింత భర్మమృగమున్ వీక్షింపఁ, గాంచంగ రా
దు ధరాంకమ్మున నిట్టి జింక నిజ సంతోషాబ్ధికిన్ ఖండి తా
వధి భూనందన జానకీ సతి సుసంభావ్యుండు కాకుత్స్థు దే
వి ధవా రమ్మని పిల్చె నాతి విభునిం బ్రేమాతిరేకమ్మునన్ 11
చక్ర ను తాహ్లాద విఘ్న సంహారకు లా
వక్ర విశుద్ధ మతంగజ
నక్రంబులె సంతు నీకు నాగాభరణా 10
[నక్రము = ముక్కు; మతంగగజ నక్రంబులు: విఘ్నేశ్వరులు.
ఏనుగు ముక్కు కలవారు, గౌరవార్థ బహు వచనము.]
శుక్ర వ్యర్థము గాఁగఁ బెల్లుబుక నీ శోకమ్ము నిత్యమ్ము భూ
చక్రం బందు విహంగ జంతు సుమహా సంఘమ్ములం జంపుచున్
వక్రంబౌ విధి సంచరింతు కొను శాపం బిత్తు నుగ్రమ్ముగన్
నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా 9
[శివ = నక్క]
రారామ విలాస తటిని నారయ లేవా
దారానందము సూడవ
రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్ 8
[రంజిలవు+ ఇటులన్ = రంజిలవిటులన్]
లేరే యాపెడు వార లెందు నిఁకఁ గేలీలోల యొక్కర్తె క
ట్టా రాజీవదళాక్షి శార్వరిని వ్రీడన్ వీడి దుశ్శీలయై
ఘోరంబై చనఁ జూచు వారలకు వాగ్ఘోషాబలా రత్నమే
రారమ్మంచును బిల్చె, సాధ్వి!, విటులం రంజింపఁ జేయం దమిన్ 7
మేనునకుఁ బట్టు వలువల మెఱపు లేల
కర్ణములకుఁ గుండలపు సువర్ణ మేల
తోయజాక్షుల కింపగు తొడవు లేల
పద్యముల లోన యతు లేల ప్రాస లేల 6
బద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా
హృద్యము లై వెసం జెవుల కింపొన రింపవె యీ ద్వయమ్ములే
గద్యమ మిన్నయౌ ననుట కాదన నొల్లరు కొంద ఱిద్ధరన్
గద్యముఁ బద్య రాజములఁ గావ్య చయమ్ములు వ్రాయ నొప్పగున్ 5
దిద్దిన యక్షరములతోఁ
బెద్దల సంపాదనమునఁ బే రాస్తులతో
నద్దిర కృప వాణీ రమ
లిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ 4
పెద్దగ దుడ్డు లుండగను బెంచిన తుందము తోడ నున్న యే
దుద్దున కైన నిక్కముగఁ దోటి జనమ్ములఁ గోప మూనకే
సుద్దుల నైనఁ జేతలను శుద్ధ శమేద్ధ దమమ్ము నాఁగ వా
రిద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్ 3
యోగి కడ కేఁగ నాతఁడు
వేగముగ నుపాయమునకు వేదనతో దు
ర్వాగనుచితునకు భా ర్యా
యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్ 2
[భార్య + అయోగి = భార్యాయోగి]
ఈ గతి బంధు మిత్ర గురు హేయ తర ప్రతిఘాతనమ్మునన్
భాగరి నౌట తప్పదని పాప కృపా భయ విహ్వలుండునుం
గాఁగ నరుండు కయ్యమునఁ గర్మ సుయోగునిఁ జేయ దుఃఖ సం
యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి