పూర్ణాపగా రమణి జ్ఞా
నార్ణవ నిబిడీకృ తాత్ము నసమాన గుణో
దీర్ణా ద్వైతో ద్బోధక
పూర్ణ గురు వరేణ్యు నొసఁగె భూతేశాంశున్ 26
కరములు మొగిడ్చి మ్రొక్కుదుఁ గ్రమ్మర మన
సార పార్వతీ సతి! కరుణా రస ప్ర
పూర్ణ! ససిత రు చ్యవకీర్ణ పూర్ణ తమ సి
తామ లానన బింబాంబ రాంబ రాంబ! 25
వల్మీకాంతర్గత తను
దాల్మి ముఖామర గణ వినుత ముని వరేణ్యా
కల్మష విరహిత చిత్తా
వాల్మీకి కవీంద్ర నాదు ప్రణతులు గొనుమా 24
పుత్రుం దండ్రి సుత జనని
మిత్రుం బరుఁడువిహగమ్ము మీనముఁ గరినిన్
వే త్రుంచు సింహ మొక్కని
క్షేత్రజ్ఞు నరయుదు మెల్ల కీర్తిత వపులన్ 23
ఆమని నిసిరేని వెలుఁగు లలరు చిరు న
గవులఁ దమ్మి కనుల యందము విరియంగఁ
దమ్మి వోలు మోము దనరు తమ్మి చూలి
వాని కలికి గొలుతు నేను బలుకుఁ జెలిని. 22
దత్తాత్త తన్వి రాగపుఁ
దత్తరమున నుత్తలముగఁ ద్యాజ్యం బయ్యెం
జిత్తంబున నిజ భృత్త
న్వాత్త లసత్తార శంకరార్యా తగవే! 21
మానిని.
నీ దగు పాదము నెత్తిని నుంచుచు నిత్యము గొల్తును నిక్కముగా
నీ దగు మూర్తిని నెమ్మదిఁ గైకొని నెమ్మినిఁ గాంచుదు నిక్కముగా
నీ దయఁ గోరుచు నేనిల భక్తిని నిన్నె దలంతును నిక్కముగా
వాదన లేలయ భారము నీదయ భక్త వశంకర పంచముఖా 20
కవిరాజ విరాజితము.
కర మనురక్తినిఁ గావుమ శంకర కాలుని బాధలు ఖండములై
పరఁగెడు రీతినిఁ బన్నుగఁ గొల్తును భక్తిని నిన్నిఁక భస్మతనూ
గురువుగ నెంచితిఁ గూర్మి వహింపుము గోపతి నాపయిఁ గొండ దొరా
పరువపు భాగ్యపు వాపును బాపుమ భక్త వశంకర పంచముఖా 19
కవిరాజ విరాజితము.
కలవర మొందితిఁ గష్టపుఁ దోయధిఁ గానక త్రోవను గామహరా
విలవిల లాడితి వేగమ కావవె భీషణ! భక్తుని విశ్వపతీ
చలిమలచూలికిఁ జక్కటి భర్తవు సన్మతి నీయవె చంద్రధరా
వల దిఁక నాకిట బంధపుఁ బాశము భక్త వశంకర పంచముఖా 18
కవిరాజ విరాజితము.
ననుదయఁ జూడుమ నంది సువాహన నాట్యవిహార యనాథ ధవా
మనమున నిన్న యుమాపతి నమ్మితి మంచుమ నన్నిఁక మంచిగ నే
ననయము చిక్కితి నాపద లందున నాత్మను నిల్పితి నంబపతీ
పనిగొని కొందఱు బాధల నిత్తురు భక్త వశంకర పంచముఖా 17
కవిరాజ విరాజితము.
సగ తను వందున సత్సతి నుంచితి చక్కఁగ నిత్యము సాంబశివా
మగువను గంగను మానుగ నెత్తిని మాతను నుంచితి మారహరా
వగలను మాన్పుమ భక్తుఁడ నైతిని పన్నుగ నీకిలఁ బాంశుధరా
పగలను వీడితి వైరుల యందున భక్త వశంకర పంచముఖా 16.
మానిని.
నిర్జర సంచయ నిత్య సమార్చిత నిర్గుణ భాసిత నీలగళా
దుర్జయ దోర్బల దుష్టపురత్రయ దుస్స్థితి కారక దుఃఖహరా
దుర్జన మానస దోషగుణాంతక ధూర్జటి నామక దుర్గ ధవా
భర్జిత తర్జిత పామర రక్షక భక్త వశంకర! పంచముఖా! 15
దైవ గణార్చిత దండధ రావన దైత్యవ రాధిప దర్ప హరా
గ్రీవ విషంధర కీలి విలోచన కీర్తిత రాజత గేహ శివా
భావజ విగ్రహ భర్జన భాసిత పన్నగ భూషణ పాప హరా
పావన మూర్ధ నివాసిత వాహిని భక్త వశంకర! పంచముఖా! 14
శైల నివాస విషఘ్న విశారద శైల సుతార్చిత సాంబశివా
కాల విరోధక కామ వినాశక కామిత దాయక కాలగళా
శూల వరాయుధ సూరి జనావన సుక్రతు నామక శూర వరా
ఫాల సులోచన భైరవ దండము భక్త వశంకర! పంచముఖా! 13
అన నుగ్ర వాదు లని వా
రినిఁ జన్నే ధూర్తులు జనమృతి సంధాతల్
చను నుగ్రక్రూరు లనం
బని గలదే వారి కెంచ వాదము లందున్ 12
వాసవి నా నామాంచిత
భాసిత వరదేవతా కృపారస హృదయో
ల్లాస విహార నిజాశ్రమ
వాస జన సమూహ నిత్య వరదా ప్రణతుల్ 11
మానిని.
ఈధర వెల్గుచు నింపుగ లోకుల నెల్లరఁ బ్రోవుమ యీశ నభో
వీధి విహారక వేమరు గొల్తును విశ్వవిధాయక! పింగళ! నీ
గాధలు గాంచ యగాధము లయ్య వికారము గల్గె నఖర్వము నా
బాధలు దీర్చి కృపానిధి! కావవె భక్త వశంకర! పంచముఖా! 10
మానిని.
రుద్రుఁడ వీవని రోషుఁడ వంచు విరోధు లనంగ విరుద్ధ మయానార్ణవ నిబిడీకృ తాత్ము నసమాన గుణో

యద్రి సుతార్చిత! యంగభవారి! మహాక్షయ కారక హాలహ లా
భద్ర వినాశక! పన్నగ భూషణ! బ్రహ్మ సురార్చిత! పాపహరా!
భద్ర మొసంగుమ పన్నుగ మాకిల భక్త వశంకర! పంచముఖా! 9
గరము కొసరి కోర్కి యలరఁ గావలె నంచున్
దరి సేరి నంత వింతఁ గు
దు రన్నది చలికి వడఁకునఁ దూలెన్ మేనన్ 8
నారుల కేది భద్రత ఘనమ్ముగ భారత ఖండ మందునన్
దారుణ రీతి రావణుఁడు దర్పము మీఱ సుయోధనుండునున్
మూరి చెలంగరే యనృతమున్ వచియింపకుఁ డంద ఱందఱే 7
వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
కాచ సమర్థులం చనియు గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్ 6
ఔరా రావే వేఁగఁగఁ
దోరముగను బ్రోగు లవఁగ దురవస్థలు రా
నేరమ సూనృత పాలా
రారా వే వేగఁ బ్రోవ రామనృపాలా! 5
ఉదయాన కనిపించు సదయా మతి పితామహి భగినీ ద్వయ మంబ యింక తండ్రి
చివరిండ్ల రామయ్య శేషయ్య యబ్బులు మధిర కంభంపాటి మానధనులు
కామరాజును గ్రొత్త కోమటి ప్రక్కింటి సుబ్బయ్య సతియు నా సుగురు యుగము
నెదురింటి భీమన్న యీవైపు పున్నయ్య వెంకయ్య మంగయ్య వీని సుతులు
నావల నరసింహ మతని యనుజ వరుఁడు
నింక శివల కాంతారాయఁ డింక సత్య
ము నపరంపు వీధుల నున్న మనుజ వరులు
కాల గర్భమ్ము నందునఁ గలసి రకట! 20/1/2019. 4
కనుమ ప్రభలతీర్థ మొసఁగుఁ గనుమ తనరి
కనుమ స్వాగతించి యినునిఁ గనుమ చనును
కనుమ పండుగ లందునఁ గనుమ ఘనము 3
యై యగమ్మున కింతయై యబ్ధి కింత
యై మఱి ధరణి కింతయై యంత విశ్వ
మంతయై కాంతి వెలిఁగె సంక్రాంతి నాఁడు. 2
ఇక్ష్వాక్వంభోనిధిసిత నిశీథేశ సంకాశ మూర్తిన్
సుక్ష్వింకానీక ధవ రవి సత్సూను సంభావ్య ధీరున్
భిక్ష్వామ్నాయప్రముఖ శివ సంప్రీత ధానుష్క వీరున్
స్విక్ష్వత్యుగ్రాస్త్ర ధర నిభు నే నింపుగం గొల్తు రామున్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి