సప్తమి దినమునను జనుదెంచు మనుచును
దాను ముందు నేఁగఁ దనివి తీర
పుత్రి భర్త వేడి పుట్టింటను గడుప
విజయదశమి, వచ్చు విదియనాడు 41
రవి కులము నందుఁ బుట్టిన రవి నిభుండు
వాన రానీక యువరాజు వాలి సుతుఁడు
అన్నదమ్ములు రాముఁడు నంగదుండు 40
గ్రుద్ది నటుల నా నెలఁతుక కుల మత తతులన్
ముద్దుగ భేదము వలదని
చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్ 39
రావణుండు వింత రాఘవుఁడు మ
రీచి కశ్య పేన రీతినిఁ బుట్టఁగ
రావణానుజుండు రాముఁడు కద 38
[అనుజుఁడు = తర్వాత పుట్టిన వాడు]
పావన భార తావని నపత్యము గల్గఁగ సంతసమ్మునన్
వావిరి ప్రేమ నుంచి తమ వారివి కాని మనోహరమ్ములౌ
దేవ మునీంద్ర రాక్షసుల దీటగు నామము లుంచ నేర్వఁగన్
రావణ కుంభకర్ణులకు రాముఁడు తమ్ముఁడు మామ వాలియే 37
భార్య కిఁకఁ బ్రేమ యున్నను భర్త యందు
గురువులకు శిష్యు లందున ఘోర దోష
మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు 36
[దోషము + ఉనికి = దోషమునికి: దోషముండుట]
దనుజేంద్రుండు కృతాపరాధుఁడట సీతన్ దాఁచ పౌలస్త్యసం
హన నార్థంబు మహార్ణవమ్ము నట సాహాయ్యార్థమై యాశ్రయిం
చిన మౌనంబున నుండ రాఘవుఁడు రోచిష్ణుండు నిక్ష్వాకు రా
మునికిన్ గోపమె భూషణంబగుఁ బ్రజామోదంబు సంధిల్లగన్ 35
చారుదతి విమల విచార సుమతి
పుత్రవతియు ధైర్య పూరిత పటుసాహ
స వతి లేని యింట సౌరు లేదు 34
అవసరమున్న కాలమున నాపద లావృత మైన వేళలన్
వివరము లెంచ కుండ సవివేక మనమ్మున ధైర్య మూనెడిన్
సవినయ రాగ భక్తిమయ సౌమ్య సుభాషణ యుక్త సద్విలా
స వతియె లేని గేహమున సౌరు గనంబడ దెన్ని యుండినన్ 33
[వివరము = దూషణము]
యమ్ములు మాతాపిత లిడ నామోదమ్మే
సమ్మత ధన్వి మహా రౌ
తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్ 32
[రౌతు + అమ్ముని = రౌతమ్ముని]
ఇమ్మహి ధీర కాంతలకు నెవ్విధి విఘ్నము లంతరాయముల్
తమ్ముడు నన్న యక్కయును దల్లియు దండ్రియు నెల్ల బాంధవుల్
సమ్మత మీయ కున్నను విచారము నొందక మేనమామకుం
దమ్మునిఁ బెండ్లియాడె నొకతన్వి ముదంబున తానె పెద్దయై 31
దా గోముగఁ జూడ నద్భుత చలన చిత్రం
బే గమకమ్మున నెందున
నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్ 30
నాథుఁడు ప్రియదర్శనుఁడు జనగణమునకు
రాముఁ డాజాను బాహుఁడు రక్కసులకు
భీమసేనుఁడు తాటకి పీఁచ మడఁచె 29
[భీమసేనుఁడు = భయంకరమైన శరీరము కలవాఁడు; సేన = శరీరము]
ధర్మ్యాలోచన లిల దురితదములు సుమి నై
ష్కర్మ్య పరాయణుఁ డైనన్
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్ 28
భిజ్ఞ కృతజ్ఞులు నుపజ్ఞ విషయాధిక త
త్వజ్ఞులతోఁ బర తంత్రా
విజ్ఞత లేనట్టి నరుఁడె విజయము నందున్ 27
[పర తంత్ర + అవిజ్ఞత = పరతంత్రావిజ్ఞత: శత్రువుల
తంత్రములను తెలుసుకొన లేక పోవుట; అభిజ్ఞుఁడు =
స్మరణము కల వాఁడు; ఉపజ్ఞుఁడు = స్వయముగా
తెలుసుకొను వాఁడు; అవజ్ఞ = తిరస్కారము]
ద్రుఁడు పరాశుర తనయుఁడు ఘనుండు
వ్యాసుఁడు వసుధ భగవానుఁడు విద్వత్స
భా రవియె రచించె భారతమును 26
ధారుణి తత్త్వ బోధనము దా మది నెంచుచుఁ బుట్ట పుట్టువే
సూరి కులాబ్ధి చంద్రుని యశో విభ వైక చరిత్ర వ్రాయ, నిం
పారగ వింత వ్యాసుఁ డట వాగ్రుచి షండ తృణీ కృతాగ్ర్య దు
ర్భా రవి వ్రాసె భారతముఁ, బాడిరి దానిని రాఘవాత్మజుల్ 25
[దుః + భా = దుర్భా : చెడ్డ (భరింప లేని) ప్రకాశము]
లల్లన ముఖ మందు నుంచి యా సరసములౌ
సల్లాపమ్ములఁ గృష్ణుఁడు
మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్ 24
పల్లవ కోమ లాంగులు సబాంధవ మిత్ర నికాయ యుక్తలై
యుల్లము సంతసించగ యధోచిత కార్య నిమగ్నలై చనన్
ఝల్లు మనంగ వీచగను జంచల మంతట భీకరమ్ముగన్
మల్లెలు నల్లఁ బాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే? 23
[మల్లెలున్ + అల్ల = మల్లెలు నల్ల]
కర్ణ ముఖ్య యోధ కాయ మోర్చ
నాయుధమ్ము లయ్యె నభిమన్య వీరున
కనుల రెప్ప లకట కత్తు లాయె 22
[వీరునకు + అనుల = వీరునకనుల; అని = యుద్దము]
త్రినేత్రుని నయనాగ్నికి నాహుతి యగుటకు నొక్క క్షణము ముందు మన్మథుని మనోగతము:
అన్నుల మిన్నఁ గల్పగను నన్నగ సూనను బంచ నన్ను వే
కన్నుల దేవ సన్నుత వికాసిత కౌశికుఁ డిద్ద చిత్తుఁ డా
పన్న సురాళిఁ గావగ విపన్నుఁడ నైతిని యన్న శంభు చేఁ
గన్నుల రెప్పలే యకట కత్తులుగా ననుఁ జీల్చె నిల్వునన్ 21
దోత్కట దుష్ట జన చయ ఘనోన్మత్త విచా
రోత్కర సమాహిత కృతా
సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్ 20
[కృత + అసత్కార్యమ్ములె = కృతాసత్కార్యమ్ములె]
తాఘముల నెంచ శక్యంబె యవని భ్రూణ
మరణముల కారణమున క్షమా గుణ జిత
ధరలు తగ్గిన జగమెల్లఁ దల్లడిల్లె 19
[క్షమా గుణ జిత ధరలు = క్షమా గుణమున
జయింపఁ బడిన భూమి కల వారు, స్త్రీలు]
స్థిరముగ భువి జల నభోగ్ని సృకముల నుండున్
హరి లేని యణువు గానము
హరియే మహ్మదు కుదురుగ హరుఁ డేసు గదా 18
జిక్క ధనోరుక్మము నడఁచె విశా లోరుం
డెక్కిడి వీకన్నుతు లిడ
నక్కడి ముని జనులు మెచ్చి యవనీశుండే 17
[మూఁడు +కుటిలము = ముక్కుటిలము; వీకు = ఉన్నతి ]
ముద్దియ భారక్షయకరు మురరిపుఁ బొగడన్
సుద్దుల మొద్దుల కైనను
తద్దినమే శుభ మిడునట తథ్యము సుమ్మీ 16
అద్దిర యే మనంగ వలె నాద్విజ సత్తము చింతనమ్ములన్
విద్దెలఁ దద్దయున్గరిమ పృధ్విని నొందిన నేమి లాభమో
యెద్దిన ముండ నోపును మదీప్సిత తద్దిన భోజనమ్మికం
దద్దినమే శుభం బిడుట తథ్య మటంచు వచించె విజ్ఞుఁడై 15
తాంగ జగద్రక్షకుండు హరిని దురిత హీ
నాంగిత నాస్తికులు వదర
రంగని, ఛీ యనిరి పాండురంగని భక్తుల్ 14
[పదరు = ఆక్షేపించు]
నెక్కటఁ జిక్కి పొగ రెక్కినిక్కిన నిక్కం
బెక్కువ మెక్కిన ముక్కరె
చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా 13
[ఎక్కట = ఏకతము; ముక్కు = చెడు]
ఉత్తరా దిశా గత గజాస్యోత్తమమ్ము
ప్రీతి నతికించి బ్రతికించి శీత గిరి త
నయకుఁ బ్రీతి జేయ హర తనయుఁడు తల్లి
దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు 12
అంకిలి తీరగ నన నా
వంకన శంక యొక యింత పడ కచ్చటఁ దా
నింక దివిరి భక్షింపగ
జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్ 11
[పారెన్ = పరుగెత్తెను]
పంకజ నేత్ర భామలు సివంగులు సుమ్మి భయార్తు లింక బొ
ద్దింకలఁ గాంచి చేరెదరు తెప్పఱి భర్తల యంక పీఠముల్
జంకును గొంకెఱుంగనిది సామజ శత్రువు పూర్ణ వారిఁ దాఁ
జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో 10
[తాను +చింక = తాఁ జింక; చింక = చిన్న కాలువ]
చండ పరిపాల నాధిప
దండా ర్హాదండిత జన తతి బహుమానా
మండిత భృశావమానిత
పండితులు వసింపని ధర పావనము గదా 9
ముంగట నున్న నియమములు
భంగము సేసి జననాధ వర గణము మదిన్
సంగతి యొనర్చి యింపుగ
దొంగలతో దొరలు గలిసి దోఁచెదరు గదా 8
దుష్టచతుష్టయము దొంగై ధృతరాష్ట్రాది కౌరవ వృద్ధులు దొర లవగా
పాండవుల రాజ్యసంపదను దోఁచుకున్న సందర్భము:
అంగ జనాధి వల్లభ సహాంగజ సౌబల సంఘ భీమ దో
ర్భంగ భయార్ది తాంగక చలత్ప్రథి తాత్మ నితాంత కైత వో
త్తుంగ తరంగ సంగత విధూత వివేక ఘనాంతరంగు లీ
దొంగలతో దొరల్ గలిసి దోఁపిడి సేయుటె నీతి యిద్ధరన్ 7
గురుతరజ్ఞాన పూజనీయ రమణీయ
రుగ్వదన దయా పూరి తోరు జల నయన
పూజ తర్పితహ్లాదప్రపూర్ణ హృదయ
జగదఖిల జన యుక్తము సు గురుపూజ 6
అత్తరుణీమణి భృశ దీ
నాత్త హృదయ కవ్వగపును నాతఱిఁ గరుణా
చిత్తాతత బాహు హరి వి
పత్తుడిపె సుమా మఱవక బాంధవ్యమునున్ 5
యాతన లుడిగి సుఖమ్ములు
నాత్త హృదయ కవ్వగపును నాతఱిఁ గరుణా
చిత్తాతత బాహు హరి వి
పత్తుడిపె సుమా మఱవక బాంధవ్యమునున్ 5
వే తలకొను రీతి నొప్ప భీతి కరంబౌ
నా తిమిరము వీడి కడవ
రాతిరి రవి నభమునన్ దిరంబుగ వెలిగెన్ 4
ఆతత భూషణావళి మహాద్యుతు లీయఁ జెలంగ నంగనా
వ్రాతము పెండ్లి పందిరి విరాజిత మయ్యె నభో నిభంబుగన్
నాతి చరామి ఘోషమున నవ్యవధూమణి వెల్గె నింపుగన్
రాతిరి సూర్యబింబము తిరంబుగ వెల్గె విహాయసమ్మునన్ 3
కృష్ణగ్రీ వాతత రో
చిష్ణు జగత్రయ పతి సురుచిర కామ మన
స్తృష్ణాతుర భృశ కామిత
విష్ణువె హాలాహలమను విషమును గ్రోలెన్ 2
చిత్త మెల్లఁ జెఱచుఁ గన నత్తల మగు
దేహ లాఘవమున కింక దిటవు వోవు
మత్తు గలిగించు నాకుల నిత్తెఱంగుఁ
దరువులన్ రక్ష సేయుట తగని చర్య 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి