యుక్తమె నీ వలుగుట సం
రక్త సులోచన మది నను రాగ మరయవే
రిక్త కషాయము గంధ ని
రక్తముఁ ద్రాగెదను జెలియ రమ్మనెఁ బ్రియుఁడే 61
[నిరక్తము = పోనట్టిది; అక్తము =పోయినది]
భుక్తము లెల్ల భోగములు భూరి తరమ్ముగ భార్యతోమహా
రక్తిని నీవు గూడ మఱి రంజిలి త్రాగఁగ భర్త సన్నిధిన్
యుక్త ఫలాతిరిక్తము మహోత్తమ శీతల పేయరాజ సం
రక్తముఁ ద్రాగెదం జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో 60
[సంరక్తము = ఎఱ్ఱనిది]
దయ్యమును జూడు గియ్యము నయ్యెడ నని
యింక వియ్యంకు నాట పట్టించిన మఱి
చయ్యన వెడల నవ్వులు వ్రయ్యలుగను ,
నయ్యొ సుకవీశ్వరా, గడు పయ్యె నెట్లు 59
కయ్యంబందున వియ్యమందునను సంకాశంబ యొప్పందురే
యెయ్యే రీతులఁ జూచి నప్పటికి నే నీడవ్వ నీకెన్నఁడున్
వయ్యారంబుగఁ జెప్పఁ బద్యములు శబ్దద్యోత భావాకరం
బయ్యయ్యో కడు పయ్యె నేమి కవినాథా నీకుఁ జిత్రంబుగన్ 58
కూర్చి పదమ్ములు స్నాన మొ
నర్చి ద్విజ వరుం డొకండు నయముగను సహ
స్రార్చి నిను జగత్సాక్షిని
నర్చించెనురా త్రిభక్తుఁ డాదిత్యు నొగిన్ 57
[త్రిభక్తుఁడు = మూటి (ధర్మార్థకామములు) యందు భక్తి కలవాడు; ]
అర్చన కేల నెంచ సమయమ్మును సూర్యుని నర్యమున్ సహ
స్రార్చినిఁ బూజనీయు నల సన్నుతి సేయరె యెల్ల వేళలం
జర్చకుఁ దావు లే దిట నసంశయమే యది విగ్రహమ్ము దా
నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్ 56
పాపము కాలును ముఖమే
యే పాప మెఱుఁగదు పాప యిత్తరి నిజమే
యీ పలుకులు విని చేసిన
దీపమ్మును ముద్దిడ సుదతీ సుఖ మబ్బున్ 55
వేపిత దైత్య సంచయము వేణు హితమ్మును వాసుదేవ స
ద్గోప ముఖారవిందము సఘోషము దర్శన మాత్ర ముక్త సం
తాపము చిత్తమందు లలితాప్రకరప్రణయప్రభా సము
ద్దీపము ముద్దుగొమ్ము సుదతీ సుఖ మబ్బు వియోగవేళలన్ 54
ఖలుఁ డా సైంధవుఁడే వర
బల సత్త్వమ్మున హరించెఁ బాండు సుతులలో
నలుగురి విక్రమ మకటా
యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్ ! 53
బల మది యెంత యున్న మఱి భద్రమె వేగ మొకింత లేనిచో
నలమటఁ జెంది యాఁకలికి నాగ్రహ మేసర సింహ రాజమే,
కలుఁగునఁ దూఱ సత్వరము గాంచి మృగేంద్రుని భీతి జెంది యా
యెలుక, వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్ 52
పలికె భీష్ముఁ డంతటి వాఁడు పరమ సఖుఁడు
నక్కిరీటి కుత్తరుఁడు మహారథి యని
కాన సందియ మ్మది వీడి మానితముగ
వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు 51
వీత ధృతిన్ విరాట సుతు పేర్మిని నొంటరి తా జయించె నా
జ్ఞాతి పితామహాది రణ చండ పరాక్రము లన్నరుం డనిం
జూతును సాటి లేని ఘన శూరుఁ డితండని సవ్యసాచినే,
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు, డుత్తరు నేఁ దలంచెదన్ 50
[ఉత్తరుఁడు = ఉత్తముఁడు; ఉత్తరుఁడు = తరువాతి వాఁడు, యిక్కడ
విరాటసుత నరు లలో నరుఁడు]
తెలిసి జనకు కృపయుఁ దపోబలముఁ జంపెఁ
దల్లిఁ దిరిగి ప్రాణ మొసఁగుఁ దండ్రి యంచుఁ
బరశు రాముఁడు లేనిచోఁ బాడి కాదు
పాపి యగు సుతుఁడు పితృవాక్పాలనమున 49
పతితుండై యనిఁ దండ్రి సెప్పగను సంభావించె సుగ్రీవు స
న్మతితో నా కపి యంగదుండు ఘనుఁడై మాత్సర్యమున్ వీడుచున్
ధృత శాంతమ్మున రాముఁ డేఁగె వని సందేహించ కే మాత్రముం
బితృ వాక్పాలన మొక్క టే సుతునిఁ బాపిం జేయు నెల్లప్పుడున్ ? 48
సుందరంపు రజత భర్మ కందుకమ్ము
మంద వాయు చలిత మేఘ మందలమ్ము
నిందు నందున్న నందఁడు చందురుండు
నంది యందని యందమే విందొసంగు 47
సందె జపంబు మాని కను స్వప్నము నిచ్చలు నంద మందగన్
మందుఁడు తూఁగు నూహల విమానము నందున మందహాసుఁడై
చిందులు వేయు హర్షమునఁ జెప్పఁగ జోస్యుఁడు జాతకమ్మునే
యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా 46
రణము నెగ్గఁ బొందుదువు ధరా తలమ్ముఁ
జావ ననిఁ జనియెద వమరావతి తమి
వీర లెమ్మింక ధృతినంది పోరు నందు
విక్రమించ నిశ్చయపుఁ బరాక్రమమున 45
పాత్రము యశస్కరమ్మని మిత్రు లెల్ల
సరస రుచిరార్థ గుంభన శబ్ద భావ
వైభవమ్మున జ్ఞప్తికి వచ్చి రంచు
నన్నయాదులు మెచ్చిరి నా కవితను 44
పన్నుగ భారత మ్మరసి పండితు లెల్లరు హర్ష చిత్తులై
యెన్నఁగ శబ్ద సౌరభము నిద్ధర వ్రాయఁగ నేర్చి రివ్విధిన్
నన్నయ తిక్కనాదులె ఘనం బని మెచ్చిరి, నా కవిత్వముం
గ్రన్ననఁ గాంచి చిత్తమునఁ గందిరి దుర్గతి పట్ట వాణికిన్ 43
నరు నుద్ధరింపఁ గాయము
సురభి రుచి వెలుఁగ సభార్య చోద్యము మీఱన్
వరదుండు వడి నెఱుకు కుల
నరుఁడయి జన్మించె ఫాలనయనుం డలుకన్ 42
[అలుకన్ = నటించెడు నలుకతో]
పరఁగును జన్మ జన్మములు వారక లోకుల కెల్ల ధాత్రినిన్
గరువము చెంది చేయ మఱి కాని పనుల్ ఫల మెల్లఁ బొందగన్
వర ముని శాప తప్తుఁ డయి భ్రష్టుఁడు యక్షుఁడు దుష్టుఁ డొక్కఁ డీ
నరుఁడయి జన్మనెత్తె కరుణా రహితుండగు ఫాలనేత్రుఁడే 41
[ ఫాలనేత్రుఁడు = నెత్తి మీద కళ్ళున్న వాఁడు, గర్విష్ఠి]
మెండుగ నొప్పులు వచ్చిన
మొండితనమ్మునఁ దడఁబడి ములుగుచు వడిఁ దా
నండగ మానిని చేరఁగ
మండూకము, గర్భమందు మనుజుఁడు పుట్టెన్ 40
[మండూకము = దుండిగపు చెట్టు (మఱ్ఱి)]
విండీ మాటను దిద్దుకొండుమఱి మీవృత్తమ్ము లిద్ధాత్రి బ్ర
హ్మాండం బందునఁ బెక్కు జన్మములు నొప్పారుం గృతాత్తమ్ములై
భాండాగారము నింపి నింపి మఱి పాపమ్ముల్ తమిం జేయ మున్
మండూకోదరమందు మానవుఁడు జన్మంబందెఁ జిత్రమ్ముగన్ 39
[కృతాత్తములు = కృతములచేఁ బొందఁ బడినవి]
ధూర్త నరు లందు నున్నట్టి ధూర్త గుణము
రూపు మాపంగ యత్నించు ఱేపుమాపు
చేరి మార్చఁగ నోపును వారి నెలమి
దూరమున నుంచఁగఁ దగదు ధూర్తజనుల 38
దారుణ మైన కష్టములు ధారుణి నిత్తురు దుష్ట మానవుల్
వీరులు ధర్మ దూరుల కుపేక్ష వహించఁగ రాదు సుమ్మి యిం
పారఁగ ధైర్య సాహసము లందఱు పోరుఁడు భీత చిత్తులై
దూరముగాఁ జరింపకుఁడు ధూర్తుల కుత్తములం ద్యజింపుఁడీ 37
అజ సృజనా నైపుణ మెం
చ జగద్విదితము ఘనమ్ము జ్ఞాన విహీనం
పుఁ జరమ్మది గార్దభ ది
గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్ 36
కుజ నగ పూర్ణ మిప్పుడమిఁ గూర్మినిఁ బుట్టగ జంతు కోటి భే
షజము నెఱింగి ద్రోహమును జల్పఁగ నేరును మర్త్యుఁ డొక్కఁ డ
య్య జగతినిం బ్రవర్తిలఁగ నంతట మాసము లెల్ల నిండఁ బ్రా
గజమునకున్ జనించి యొక గాడిద గంతులు వేసె నెల్లెడన్ 35
[ప్రాక్ +అజము =ప్రాగజము; ముందు పుట్టనిది యంటే చెల్లెలు]
అసుర వర దేవ కిన్నర
వసు భద్ర న రోరగ గణ పతగ యశో ద
ర్ప సితాన నాపరాధ కృ
త సకల ఘన రామవధ్య తనులు మన రిలన్ 34
నాగులు పేరున వెలుఁగుచు
భాగమతి వివాహ మాడి పరఁగుచు నుండన్
రాగ మతిశయిల్లఁ బతిని
నాగుల ముద్దాడెను లలనామణి కేళిన్ 33
రాగ మయమ్ము సృష్టియె వరమ్మది జీవన యుక్త శైలి లో
భాగము సుమ్మి కూరిమి యపార ముదంబిడుఁ బ్రాణి కోటికిన్
వేగమ చూడు పాములను వింతగ నచ్చట ముచ్చటింపులున్
నాగుల ముద్దు లాడె లలనామణి! యాత్మవినోద కేళికై 32
[ మద్దులు + ఆడ+ఎ = ముద్దు లాడె; ఆడె = అక్కడే; నాగుల ముద్దులు =
నాగులయొక్క ముద్దులు]
కలవర మేల మనః క
శ్మల పరిహార సువిభూతి మానవుల కిలన్
లలితా దేవీ ముఖ కు
ట్మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్ 31
చలిమల చూలి మర్త్యులకు సంతస మీయఁగ నన్నపూర్ణ యై
వెలయఁగఁ జంద్రశేఖరుఁడు ప్రీతిని నుంచ శిరమ్ము నందునన్
లలిత వరాణసీ పురి ఫలప్రదమై చను జాహ్నవీయ కో
మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్త కోటికిన్ 30
[కోమలము = నీళ్ళు]
ఈ “బ్రా” నెక్కడ విన లే
దీ బ్రహ్మాండమ్ము నందునె నిఘంటువునే,
యబ్రమ వర్ణం బేమిటొ
కో “బ్రా”, తెమ్మనెను భార్య కోరిక లెసఁగన్ 29
ఈ బ్రహ్మాండము నందుఁ జిత్రములు మెండే చుమ్ము చింతింపగా
యే బ్రుంగంగ నిజమ్ము నిష్కరుణ నే డీ కామ వహ్నిన్ వెసం
దా బ్రాఁతిం బరమాప్తు నొక్క నిసి నాథా మల్లియల్ ప్రీతి యా
కో బ్రా తెమ్మని కోరె భార్య మగనిం గోర్కెల్ పిసాళింపఁగన్ 28
[యాకోబ్ +రా = యాకోబ్రా; యాకోబ్ : ఆమె భర్త పేరు]
కుముదేశుఁడు చరియించును
సముదమ్ము నభమ్ము నందు సక్రమముగ ధి
ష్ణ్యముల సమీపించుచు నో
యమ! వసదిన మందు చంద్రుఁ డగుపడె నింగిన్ 27
[అమ = అమ్మ; వసత్ + ఇనము = వసదినము; ఇనము = హస్తా నక్షత్రము]
ఆ నాటి తిథి విషయమై తర్కించుచున్న మిత్రుల భాషణములు:
భ్రమపడ నేల చంద్రుఁడు నభమ్మున నుండును బూర్ణమాసినిన్
సమముగ బింబ రూపమున సంతస మిచ్చుచు జీవ రాశికిన్
విమలతర ప్రభా యుతము వెల్గుచు, పూర్ణిమ సుమ్మి చూడు కా
దమవస, నాఁడు పూర్ణశశి యబ్బురమై కనుపించె నింగిపై 26
సర్వమత సహనము సూప నుర్వి లోన
నొక్కఁడ ప్రభువు పేరులె పెక్కు గలవు
విశ్వమం దనుచు ఘృతము వేగ పోయు
చర్చిలో సంధ్య వార్చెను సద్యవనుఁడు
(చర్చిలో సంధ్య వార్చెను సాయబయ్య) 25
[పోయుచు + అర్చి = పోయు చర్చి; అర్చి = మంట]
చర్చలు సేయ నేల ధర సచ్ఛరి తాత్ములు శుద్ధ చిత్తులై
మార్చఁగ నెంతు రెల్లరను మానవ జాతికి దైవ మొక్కఁడే
యర్చన సేయ నామముల యంతరమే వల దంచుఁ గ్రైస్తవ
స్వర్చన మందిరమ్మునను వార్చఁగ సంధ్యఁ దురుష్కుఁ డేఁగెనే
( చర్చికి సంధ్య వార్చుటకు సాయబు పోయెను సత్వరమ్ముగన్) 24
కల్ల యైన మాటయ సుమ్ము కరము వింత
యంచు నంద నేలయ విస్మయమ్ము దైవ
ముండ నండగ సాధ్యమ్ము మండితముగఁ
జల్లఁ దన మిచ్చె నగ్ని వేసఁగి వెలుఁగుల 23
తల్లడ మంది చిత్తమున ధాత్రిజ జానకి భవ్య పాణి సృ
క్పల్లవముల్ మొగిడ్చి యట పావను వేఁడఁ గపీంద్రు తోకకుం
జల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు వేసవి మండుటెండలం
జల్లిన భద్రమే కలుగుఁ జల్లని దీవన లుండ నండగన్ 22
కార్తికంపుఁ బున్నమి నాఁడు కన్ను లదర
భక్తు లెల్లరు గుమి గూడి పంక్తి కంఠు
నప్పు డింపుగ నాకృతి నొప్పు ప్రతిమ
శవముఁ గాల్చెదరు గుడిలో శివముఁ గోరి 21
బవర మ్మేఁగు తరిన్ జయంబుఁ ద్రుటి సంపాదింప యాత్రాదు లీ
భువి సాగించు తరిన్ సుఖమ్మరయ సమ్మోదమ్ముగం గాల్తురే
ధ్రువ మీ ధాత్రిని చంద నాగరులు సంతుష్టిన్ సుగంధమ్ము లా
శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్ 20
[ఆశవము = వడి]
మరణమ సంధుల దుస్సహ
భరణము ద్రుతముల నిజమ్ము పతనమ తలఁచన్
హరణమ స్వాతంత్ర్యము వ్యా
కరణము వద్దనుచుఁ జెప్పు కాలము వచ్చెన్! 19
సురుచిర విత్త సంచయ యశో విభవమ్ములు వేగ మాకు ని
ద్ధరఁ గర మశ్రమమ్మున సతమ్ము వివృద్ధము నౌచు దేవ భా
సురముగ వచ్చు పద్దతినిఁ జూడుమ స్వప్రతిభాతి శీతలీ
కరణము వద్దు మా కనెడు కాలము వచ్చె నిదేమి వింతయో 18
ఫలమును గోరిన స్నేహం
బలవడునె మన మలరంగ వాణీ సత్పు
త్రులు విద్వజ్జను లా ని
ష్కలుషాత్ముల కెల్ల కవు లకారణమిత్రుల్ 17
వలపటి చేతి ఘంటమున వ్రాయఁగ భాగవతమ్ము ధాత్రినిం
జెలువము మీఱ మారిరి కృశించ మనో౽ఘము లంత మానవుల్
లలితపు వాక్ప్రసూనముల లాలన సేయుచు మార్చ నింపుగం
గలుషమతుల్ దురాత్ముల కకారణ మిత్రులు గారె సత్కవుల్ 16
[కారె = కారు, కారణ మిత్రులే ]
సూతుని సామర్థ్యమ్మున
నాతత నైపుణముతో మహారథి విలస
త్కేతన వీరుఁడు సమరా
భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గున్ 15
ఏ తరి నైన బుద్ధి శమియించు సధైర్యము శోక మంద శో
కేతర ముండునే మదిని నీప్సిత నాశక మెంచ ధాత్రినిన్,
వీతము సేసి శోకము వివేకముతో ధృతిఁ దాల్చి యింక, ని
ర్భీతిని ముందు కేఁగిననె ప్రీతి జగద్విజయమ్ము దక్కురా 14
స్నేహితులను సంబంధుల
నాహా దూరమున నుంచు నక్కట నీ వి
త్తాహంకారము, నిస్సం
దేహము, విడనాడి చూడు ధీరత్వమునన్ 13
దేహత్యాగులె మన్నిమిత్తమున నీ ధీరుల్ స భీష్మాదులే
బాహాటమ్ము నిమిత్త మాత్రుఁడవు నా వారంచు వీ రెల్లరున్
మోహావేశముఁ బొంద నేల మది సంపూర్ణమ్ము భీభత్స సం
దేహమ్మున్ విడనాడి చూడుము సఖా ధీరత్వ మేపారఁగన్ 12
కలదె భయము నాకు గండర గండఁ డే
ననుచుఁ దిరుగఁ దా నిఁక నిరతమ్ము
మండు టెండ లెల్ల నుండగఁ బద్మబాం
ధవుఁడె కారకుండు తనయు మృతికి 11
యుధిష్ఠిరుని సంతాపము:
అవని వెలుంగు యోధుల మహారధి యీ యభిమన్యుఁడే సహ
స్ర వర వరాంగ తుల్య ఘన సత్త్వ వరాన్విత భీముఁ డున్నచో
బవరము నందునన్ ఖదిర పౌత్రుఁడు గూలునె వ్యూహ మందు సైం
ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్ 10
శోకించ నేల భీతిని
నే కాలము నందు నైన నింకఁ గరమునం
బ్రాకటపు దీప ముండగఁ
జీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్ 9
నాకుఁడు గ్రుంకె నక్కట వినా వర దీపిక దుష్కరంబగున్
వాకిట జాఱి కన్పడని బంగరు టుంగర మింకఁ బొందగన్
వ్యాకుల చిత్త మేల ననపాయమ సోమ కృపా లసన్మరీ
చీ కటి లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్ 8
విష్ణు మూర్తి చతుర్భుజ విలసితుండు
దుష్ట శిక్షణకును మఱి శిష్ట రక్ష
ణకు నవతరించగ భువిఁ గర కమలములు
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర 7
ఆలినిఁ బంపె వేఁడ విరహమ్మును సైఁచుచుఁ బుట్టినింటికిన్
జాలిగ వేచు చున్నను నిజప్రియ గేహిని రాక కోసమై
కాలము నిల్చె నేమొ మఱి కానఁడు మాసము లంత నెంచగన్
నాలుగు రెండు నయ్యెనట నల్లనివాని కదేమి చిత్రమో 6
[నాలుగు రెండున్ = ఆరు; అయ్యెను- అటన్ - అల్లని వానికి ;
అల్లని వాఁడు = కబు ర్లల్లని వాఁడు, నిజము చెప్పు వాఁడు.
అల్లు = లేనివి కల్పించు.]
స్నాన జప తపో రత స
న్మానస యమ నియమ సువ్రత చరుఁడునై తా
నే నర మృగ ద్విజములకు
హానిం జేయకయె యెటు లనాచార్యుఁ డగున్ 5
కానఁగఁ గామక్రోధమ
దానీకము లెల్ల జనుల కంతస్థమ్ముల్
తా నా యరి షడ్వర్గము
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్ 4
[ ఆచార్యుఁడు = ఋషి]
కానేరం డది నిక్క మెంచగను రక్షాదక్ష రాజన్య సం
తానశ్రేణికి లక్ష్య దర్శన ధనుస్త్రాణోగ్ర నారాచ సం
ధా నాదిక్రియ లందు శిష్య గణ హృత్సందేహ సంసృష్టికిన్
హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో 3
[సంసృష్టి = సమూహము]
సత్కులాభిజాతుఁడు వర సద్గుణుండు
వేద విధ్యాధ్యయన సువివేక సుప్ర
భావిత మనస్కుఁ డంత సద్భక్తిఁ దల్లి
దండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు 2
చిక్కఁగ సింధు రాజునకుఁ జేవ కృశించ శివప్రదద్యుతిం
జక్కఁగ వేఁడఁ బాండవులు సమ్మతిఁ దెల్పి రయమ్ము భక్తినిం
బ్రక్కన నిల్చి వీరుఁ డభిమన్యుఁడు వ్యూహ విభేద నార్థి యై
మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్ 1

[సు + అర్చన = స్వర్చన]

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి