విశ్వామిత్రుని తిరిగి రాజువు కమ్మని సుహృదుడు బోధించు సందర్భము:
ఇమ్ముగ రాజ్యము నేలుచుఁ
బమ్మిన వైభవ విలాస పరవశ హృదినిన్,
నమ్ముము కౌశిక, సంసా
రమ్మును గ్రోలి నపుడె ముని! రాజన నొప్పున్ 60
సమ్మద లీల సంతతము సాగఁ దపో జప నిష్ఠ లెల్ల పా
త్రమ్ముగఁ గందరాకర సుదారుణ వారణ వాల సింహ గో
త్రమ్మున శాంతి సంజనక ధాత్రిని నీరముఁ గంద మూల సా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్ 59
చూపు లందు నైర్మల్యము దోపు చుండఁ
జేత లందు నైపుణ్యము సేరి యుండ
మాట లందుఁ గన్పించఁగఁ దేట పడతి
పడఁతి, పడఁతినే పెండ్లాడ వలెను విధిని 58
అడర గృహస్థ ధర్మము నరాధికుఁ డింపుగఁ బెండ్లి యాడి యె
య్యెడలను మోక్ష మందుటకు నెంచిన వాఁ డిఁక నిశ్చయమ్ముగన్
జడతను గాంచ కెన్నఁడును సద్గుణ శాంత వివేక శీల యౌ,
పడఁతి! , పడంతినే కద వివాహము గావలె శాస్త్ర పద్ధతిన్ 57
సంతత రత సంగ్రామ
ధ్వాంతులు నాసేతు శీత ధాత్రీధర ప
ర్యంతము రాజులకు మహీ
కాంతయె మూలమ్ము గాదె కలహమ్ములకున్ 56
కంతుని కోల కోడి దశకంఠుఁడు గూలె ధరాత్మజార్థమై
పంతముఁ బూని కీచకుఁడు వాడువడెన్ ద్రుపదాత్మజార్థమై
భ్రాంతినిఁ బోరు సల్పె శిశుపాలుఁడు భైష్మకిఁ గోరి కృష్ణుతోఁ
గాంతయె కారణమ్మగును గాదె ధరం గలహమ్ము లేర్పడన్ 55
ఆతత గుణశీలి జగ
త్త్రాతకు భక్తుఁడు కరమ్ము ప్రహ్లాదుఁడు సం
ప్రీతిని దైత్యుఁడు దై వా
రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్ 54
భూతల శిష్ట రక్షణకు భూరి గుణోన్నత భాసితుండు సా
కేత పురంబు నందు సుర కీర్తిత రాముఁడు రాక్షసేంద్ర ని
ర్యాతన హేతు రాజిత మహాకృతిఁ బంక్తిరథుండు రాక్ష సా
రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్ 53
ఆర్యావర్తము నందునఁ
గార్యా సక్తులె పురుషులు గాముకు లవరే !
యార్యా యెవ్వం డెవ్వని
భార్యనుఁ గని మనసుపడెను పరభామినిపై? 52
భార్యను నన్ను జూడకయుఁ బాడిగ నింటను సంతతమ్ము స
త్కార్య విహీనుఁడై యకట దౌష్ట్య మనమ్మున నుండు దుర్జ నా
హార్యమ యంచు నెంచమి నిజానన భాతి జితేందు బింబ శో
భార్యనుఁ జూచినంతఁ బరభామినిపై మనసాయె భర్తకున్ 51
[శోభ + ఆర్య = శోభార్య; ఆర్య = తరుణి]
అయినను విజయుం డస్త్ర ని
చయ నిపుణుం డే నతనినిఁ జంపెదను సమా
హ్వయమున ననియెం గర్ణుఁడు
హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్ 50
నయమే యిట్టులు సేయ నేరికినిఁ గానన్ సింహ శార్దూల సం
చయ విఖ్యాత మృగావృత ద్విజ మహా సంఘాతపుం గొండలన్
హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్
రయ శౌర్యోద్ధత కారణమ్మునను నేరండక్కటా యాపదన్ 49
[శృంగము = గుఱుతు; హయశృంగములు = గుఱ్ఱపు గుఱుతులు కలవి]
భూరి సప్త సముద్ర సుముద్రి తాచ
ల సువిభూషిత లవణ జలధి ముఖాంబు
రాశి సప్త రత్నముల నరయఁగ నిక్షు
సాగర జలమ్ము తీయన చక్కెర వలె 48
నాగరి కాత్మ చింతనలు నైజము నెక్కుడు వింతలే సుమీ
యేఁగఁగ మీరి యూరక యహీన దురాసద యాన మీ గతిన్
వేఁగఁగ క్షుత్పిపాసల నపేత జలోదన యాత్రి కాళికిన్
సాగరమందు నీరమది చక్కెర తీరునఁ దియ్యనౌ సుమీ 47
సంతసమున జరుగఁ బెండ్లి సంబరములు
వింతఁ జెలరేఁగెనె విషాద మంత విషపు
టమృతమును ద్రాగి మరణించి రమరు లెల్ల
రైరి దుఃఖ మలముకొన నందఱ కట 46
[అమృతము = అన్నము / పాలు]
దమ నార్హం బగు యుక్త తంత్రము సదాదానా వడిం దల్చుమా
యమి తోగ్రాస్త్ర నికాయముల్ ఘనులు దైత్యాగ్రేసరుల్ వీరులా
యమరద్వేషులు క్రూర మానసులు వేయన్ వారుణాస్త్రావృతే
ష్వమృతమ్ముం జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా 45
వటపత్రశాయిఁ గొల్చినఁ
దటాలున లభించు ముక్తి దాక్షిణ్యమునం
బటు చిత్రమ్ముగ మఱి యె
క్కటి పాపాత్ములకు ముక్తికాంత లభించున్ 44
సంబంధమ్ములువీడి మానవులు సచ్ఛాంతమ్ము మృత్య్వాస్య పా
తంబం దిమ్ముగ నేర కైనను బరంధామున్ వినన్ శార్ఙ్గ ధ
న్వుం బాడంగ నిజాంతరంగముల వే నోళ్ళన్ సు నామంబు రా
గం బాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ 43
శ్రీమంతుని రఘు వీరు న
యోమయ తనుఁ బుణ్య సతులు జ్యోతిష్మంతున్
ధీమంతునిఁ గని చక్కటి
సీమంతముఁ జేసిరంత సీతాపతికిన్ 42
[సీమంతము = పాపట]
ఏమీ మాయ బలారి శత్రువట తా నేతెంచి బంధించ నే
లా మా రామున కిట్టి బాధలని గోలాంగూలవీరుల్ వడిన్
భీమాస్త్రమ్ముల తీక్ష్ణఘాతముల సంప్రీతిన్ దయామానసుల్
సీ మంతంబును జేసి రెల్ల రపుడున్ సీతాసతీ భర్తకున్ 41
[సీము +అంతంబును = సీమంతంబును; చీము = తెల్లని చెడ్డ రక్తము]
వా రొయ్యన తెచ్చిన శివ
సారంగము చే పడంగ సన్మానసుఁడై
యా రాముఁడు గన నత్తరి
వారెల్లరు విఱిచి పీత వస్త్రుం డనియెన్ 40
మత్త మాతంగుఁ బ్రహ్లాదు మానినీ మ
ణి ద్రుపద రాజ తనయఁ గనిన నెఱుఁగమె
నెమ్మి భజియింపఁ గాపాడ నేర నట్టి
దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె 39
ఏ విధి నుత్తరింతురొ యిఁ కే నరుఁ డండగ నుండు మీ కిలన్
దైవ మెఱుంగు నిత్తరిని దాట సుఖమ్ముగ దుఃఖవార్ధినిన్
నావగ మిమ్ము గావఁగను నాస్తికులం గని మీ మనమ్ములన్
దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా! 38
శుక్రు శాప ముక్తి చొప్పడు విధ మెంచి
ధరను దారుణమని తలఁచకయె య
యాతి కొడుకు పరువ మంది వేగమ వీడి
ముదిమి మీఁదఁ బడఁగ మురిసెఁ బడఁతి 37
ముదమున బెస్త దంపతులు మూరి సముద్రము సేరి శీఘ్రమే
పదముల యందుఁ బమ్ముకొన వారిజనేత్ర వికాసవంతమై
యదరుచు నున్నయండజము నారయఁ ద్రుళ్ళుచు నంది తా ముద
మ్ము దిమినిఁ బొందఁగా మురిసి ముద్దియ ముద్దు లొసంగె భర్తకున్ 36
[తిమి = పెద్ద చేప / సముద్రము]
ఈ కలతల యేరి కెఱుక
రాకలు పోకలు దివమణి రాహువు నోటన్
వ్యాకులుఁడై యుండ దివినిఁ
జీఁకటిలో సూర్యునిఁ గని చేడియ నవ్వెన్ 35
వెలుఁగు లన్నింటినిఁ దనలోనే యమర్చు కొనిన శంకరుని పార్వతి
చీకఁటిలో చూచి భయపడని సందర్భము:
ప్రాకట దివ్య సచ్చరిత పార్వతి యత్తరి నిర్భయమ్ముగం
బాకల సన్నిభాక్షి యుత ఫాలు సితామల భస్మదేహు ర
త్నాకర భోగ భాసిత వరాభరణప్రభఁ జంద్రశేఖరుం
జీఁకటిలోన సూర్యుఁ గని చేడియ నవ్వె మనోహరమ్ముగన్ 34
[సూర్యుఁడు = శివుఁడు]
కరుణ వరదలై పాఱగఁ
బురుష వరేణ్యుం డొకండు పుట్టగ గ్రీష్మం
పు రెయిని నెండలు మండగ
జరిపిరి జన్మదిన మనుచు సంతాప సభన్ 33
[సంతాప సభ = మిక్కిలి వేడి సభ]
కరుణను వీడఁగ దైవము
పురుష వరేణ్యుం డొకండు పుణ్యపు లోకం
బరిగినఁ బుట్టిన రోజున
జరిపిరి జన్మదిన మనుచు సంతాప సభన్ 32
దట్టపుఁ గ్రూర భావమున దైత్య వికారుఁడు నాంగ్ల దేశపుం
బుట్టుక వాని పంపున నపూర్వపు రీతి నమృత్సరమ్మునన్
గిట్టిరి మిక్కిలిన్ జనులు కేళి వనమ్మున నుండ దానికిం
బుట్టిన రో జటంచుఁ గడుఁ బూనిక శోక సభన్ రచించిరే 31
జలజల రాలుచు నభము వ
దలుచు జటాజూటు శిరము దవిలి కులుకునన్
వెలయ జటాలమనఁ గడలి
వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్ 30
[కడలి వెలఁది = మిన్నేఱు; జటాలము = జడలు గలది, మఱ్ఱిచెట్టు]
వలచిన వాఁడు మాధవుఁడు పన్నుగఁ దాల్చిన వాఁడు శేషుఁడుం
గొలిచిన వారు భూజనులు కూర్మి నొసంగఁగ నెల్ల వారికిన్
గలగల వానవచ్చిన ముఖమ్ము వెలుంగ మఱింత భూమి యన్
వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్ 29
రాజు దుష్యంతుఁడు కుజ నారాతి యిందు
వంశ తిలకుండు గనఁ బారవశ్య మంది
కణ్వు నాశ్రమమున వింత కాదనంగ
మూషికం బొండు పిల్లిని ముద్దులాడె 28
మూషిక మేర్పడంగఁ దిని మూరిన తృప్తి బిడాల ముండెనే
రోషము మాని గోముగ విరోధము సూపక సంభ్రమించుచున్
భీషణ దేహ దార్ఢ్యమున బీరపుఁ బిల్లి నిరుక్త భుక్త దు
ర్మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను బ్రేమతోడుతన్ 27
[నిరుక్త భుక్త దుర్మూషికము = పైన చెప్పఁబడిన, తినఁబడిన గొప్ప యెలుక కలది;
ఒండు పిల్లి = మఱియొక పిల్లి]
ఆరయఁ బలలము నందున
మూరిన బల ముండు శాకముల యందుఁ గడుం
గూరలు గాయలలో ని
స్సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్ 26
కారము పుల్పు మిక్కుటము గాక సమంబుగ నుంచి షడ్రుచుల్
క్షీరము గొంచు నిత్యము నశేష మహోన్నత పుష్టి దాయ కా
హార వితాన సంయుత వరాన్న భ రామల రోగ కీట కా
సారము లేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే 25
[ఆసారము = వ్యాపించుట]
బాలు రిరువురు కుశలవులు
బాలార్క నిభులు జనించఁ బరమానందం
బే లలనకుఁ బతి పా దా
వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్ 24
[ఆవాలము = ఆలవాలము]
ఆలం బందునఁ జంపు రాముఁ డని తా నాశించుటన్ వాసు రాం
బా లాలిత్య తపో బలమ్మునను దా మండించ కుండంగఁ గ
ల్లోలాత్ముండు దశాననున్ విడిచెనే రోషమ్ము నారీ మహా
వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్ 23
[వాసు రాంబా లాలిత్య = భూమాత యంత లలిత భావము (క్షమ) కలది;
నారీ మహా వాలము = స్త్రీలకు గొప్పదైన కత్తి]
వేద శాస్త్రములను విశదముగ నెఱిఁగి
యుత్తమంపు విద్యయు వినయము న
ఖర్వ మున్న నింక గర్వ మది, నిజము
పలుక,లేని వాఁడె పండితుండు 22
అల జల మున్న నేమి లవణాంబుధి మెత్తురె త్రాగి నీటినిన్
మల గరళమ్మ యల్పతర మాత్రమ త్రెక్కొను బాల నన్నిటిన్
సలలిత శబ్ద భావ స రసక్షయ వాక్కులఁ గర్కశమ్ముగం
బలుకఁగ లేని వాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్ 21
అరి - ఉరి - కరి – గిరి
భీముఁడు బకాసురుని చంపిన సందర్భము:
అరిగి బకు వనము బలమున
నురి నసురున కతి చలమున నుదర తలపు టు
క్కరి బకు ననిఁ దునుమఁగఁ దిరి
గిరి పుర జను లెలమినిఁ దొలఁగిన యలజడులన్ 20
ఉదరి పాశ్చాత్య వరదేశ మొక్క టపుడు
పెనఁగి నిరతము మత్సరమ్మున నడుమను
గట్టి నిడుదంపుఁ గుడ్యముఁ గట్టఁ దీసి
యడ్డుగోడఁ, గట్టిరిక స్నేహమును గోరి 19
ఒడ్డి ధనాసువుల్ పడసి యుత్తమ రాజ్యము భారతీయులే
గడ్డు సమస్య లందుఁ బథకాలకు నిద్ధ మనోభివృద్ధికి
న్నడ్డము కాదనం గుల మతాది విభేద విషాగ్ని హేతికే
యడ్డుగ గోడఁ గట్టి రిట నందఱు నొక్కటి యంచు నెంచుచున్ 18
విత్త మాన నిజప్రాణ విలయ మందు
నబల విప్ర గో రక్షణ మందుఁ దక్క,
జగ మెఱిఁగిన విఖ్యాతంపు సత్య మిది, య
సత్యమును బల్క బుధు లపచార మంద్రు 17
సత్య వచో ధురంధరుఁడు సాగ నరణ్యము వేదనన్ నిజా
మాత్యుని నాపు తేరన సుమంత్రునిఁ బంక్తి రథుండు, రాముఁడే
యత్యధిక ధ్వజి ధ్వనిని నశ్రుత మంచు వచింపుమా యనన్
నిత్య మసత్య భాషణము నేరము సంతత దుఃఖ దాయమౌ
సత్యముఁ బల్క నార్యు లపచారమఁ టందురు శాస్త్రసమ్మతిన్ 16
అంశము - జడపై పద్యము; నిషిద్ధము - 'జ, డ' అన్న అక్షరాలు.
ఫుల్లాంబురు హా క్ష్యార్యా
పల్లవ దేహార్ధ భాసి పర మామర గం
గా ల్లాలవాల మీ ధ
మ్మిల్లము చంద్ర విలసితము మేరు సు ధామా 15
[అల్ల = తల్లి; ధమ్మిల్లము = జడకొప్పు]
గురువులఁ దరుణులఁ బసి బా
లుర గురి సేసి వెతలకుఁ బలుకులఁ గుటిలుఁడై
పరువపు బలిమినిఁ దా నిఁకఁ
బరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్ 14
పరువం బందలి కావరమ్మున మనో వైకల్యముం జెంది వే
మరు పీడింప దురాత్ముఁడై జనులఁ గామజ్వాల దగ్ధుండు నై
కరుణాహీన మనస్కుఁడై సతము గాఁకన్, నేర్వ లేకున్న నా
పరమేశుం గొలువంగఁ, బాపములు వే పండంగ నిక్కమ్ములే 13
ధర యుఱుములు మెఱుపులఁ దాఁ
బరేత భూమిఁ దలఁపింపఁ బట్ట శవములం
బర మాశను వ్రాలఁగఁ గణ
సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్ 12
[కణసరము = డేగ]
ఉరువుగ నేఱి యేఱి మఱి యూడ్చి తటిం బడ వేయఁ జెత్తనుం
దెరలి కరమ్ము వారుచును దీర్చుచు నుండఁగఁ గాలకృత్యముల్
పరిపరి పాఁడి గేదెలను బాటవ మొప్పఁగఁ దోము చుండఁగన్
సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్ 11
[సరములు = కొలనులు]
అనితర జన సాధ్య ఘన తపో మహిమ బ
లాన్విత సతి సరసిజాక్షి శీత
శైల తనయ మృదు వచన భరిత మధుర
వాణి రాణియయ్యె భర్గునకును 10
త్రాణ గుణాభి రాజిత విలాసిత షట్చరణ ప్రభా లస
ద్వేణి మహోత్పలాక్షి యుగ దేవి సు శీతల శైల సంచల
ద్రాణి వినీలలోహిత విదగ్ధ సుగాత్ర తపఃపునీత శ
ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై 9
పూని విశ్వమందున మిన్ను మానికమ్ము
మీఱి చండ ప్రచండుఁడై మిన్ను నుండఁ
దాఁక సూర్య కిరణములు వీఁక రాత్రి
జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె 8
[రాత్రి జలము = మంచు]
సలలిత జీవ కోటికి నిశా దివసమ్ములు ఘోర హైమ లా
తుల శిశిర మ్మసహ్య మగుఁ దోరముగన్ బడబాగ్ని రూపమై,
సలిలము శీతలమ్మున వెసన్ ఘన మౌటను రోష వార్థికిం
జలమున, నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే 7
[వార్థికిన్ + చలమున = వార్థికిం జలమున]
సురుచిర యతి వేషమ్మున నరుఁడు దివిరి
కళ్ళు గప్పి తాలాంకుని కాంత సేవ
లంది కపట వేషమ్మున నంతఁ గృష్ణు
చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము 6
అగ్నిద్యోతనుఁడు రుక్మిణి మాటలుగా కృష్ణునకు చెప్పిన సందర్భము:
ఉల్లము నందు నేఁ దఁలచ నోర్వ మనోధవుగాఁ బరుం గడుం
బ్రల్లదు నాపి సోదరునిఁ బన్నుగఁ జేకొను మంచుఁ గోరఁగన్
వల్లె యటంచుఁ బల్కి వడి భామను రుక్మిణిఁ జక్రి రుక్మికిం
జెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్ 5
పోవ దొడ్డవరము ముత్యా లనఁగ వేల్పు
లేమఁ గాంతు మచట లేక సాటి
రమణి వెంట నుండ నమృతాశి గోగుల
మ్మ యతి భక్తి నే నమస్కరింతు 4
అరి గణ దమనుం డస్త్ర విద్యా నిపుణుఁడు
రణ విశారదుండు కిరీటి గుణ యుతుండు
నత్తరి ననిఁ జలమున దండెత్తిన పర
చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు 2
[చక్రము = దండు/సేన]
విక్రము లిద్ద ఱుద్ధతులు భీకరులై చన నాజినిం జమూ
చక్రము నొంద నచ్చెరువు జాలిగఁ గర్ణుఁడు నేల దూల భూ
చక్రము నందు దూఱ రథ చక్రము చక్రి యనుజ్ఞతో ధను
శ్చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై 1
[చక్రి = కృష్ణుడు; రథ చక్రము హస్తమున కలవాడు, కర్ణుడు]

పోవ లేరు విడిచి మూర్తి పోలేరమ్మ
లేవ రమ్మ నిద్ర భావ మంద
రయక నిన్ను నమ్మ రక్షింప మమ్ము ర
మ్మ నినె పోల లేరమ భువి నమ్మ 3
రణ విశారదుండు కిరీటి గుణ యుతుండు
నత్తరి ననిఁ జలమున దండెత్తిన పర
చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు 2
[చక్రము = దండు/సేన]
విక్రము లిద్ద ఱుద్ధతులు భీకరులై చన నాజినిం జమూ
చక్రము నొంద నచ్చెరువు జాలిగఁ గర్ణుఁడు నేల దూల భూ
చక్రము నందు దూఱ రథ చక్రము చక్రి యనుజ్ఞతో ధను
శ్చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై 1
[చక్రి = కృష్ణుడు; రథ చక్రము హస్తమున కలవాడు, కర్ణుడు]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి