గ్రీష్మము వసంతములను గుక్షి నిడి నీరు
నెలఁత వర్షర్తువున మఱి నిండ నెలలు
నభము తల్లి భూతలమున విభవ మొప్పఁ
జైత్రమునఁ గడుపై కనె శ్రావణమున 57
సూత్రము కట్టి యయ్యెఁ గద చూచుచు నుండఁగ నేండ్లు నాఱు తా
నాత్రము సెందు చుండ మది నంబను గొల్చుచు భక్తి మీఱఁగా
గాత్రము నెండఁ గట్టుచును, గార్తిక మాసము నందు మ్రొక్కఁగాఁ
జైత్రములోనఁ, దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్ 56
[చైత్రము = గుడి]
ఉడ్పగ క్షుద్బాధలు క
న్మోడ్పెఱుఁ గక యుండ నిరతమున్ నిట్టూర్పుల్
కడ్పది నిండని చో నీ
యేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్ 55
తూడ్పన్ మేలగు దుష్ట చింతనలు నిన్దూఱంగఁ జేయంగఁ గే
ల్మోడ్పుల్ వారికి మేలు సుమ్ము మఱి యారోగ్యంబు నీ కింతగాఁ
దోడ్పా టుండఁ జెలంగఁ జిత్తమున సంతోషంబు క్షీణంబు కా
నేడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్ 54
చక్కగఁ గృత్రిమ ఘనములు
వెక్కసముగఁ జల్లి రయ్య విన్నున నా లో
నక్కపటపు విధి నీరపుఁ
జుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్ 53
ఒక్కెడ నాది శంకరున కొక్కతి యీయదు కాయ నొక్కటిం
దక్కఁగ నంతటం గనక ధార యనన్ స్తుతి నాలపించఁగా
నక్కజ మంతఁ దత్క్షణమ యభ్రపు మండలు కెంపు వర్ణపుం
జుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్ 52
సూర్యు బలమెద్ది విశ్వము చుట్టు దిరుగ
తార లంతరిక్షమ్మున మూరె నెట్లు
భూమి కాధారమై నిల్చె నే మగండొ
యెంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె 51
అంతట నింపుగా క్షరుఁడు నక్షరుఁ డంచు వచింప విశ్వమం
దెంతటి వారు నేర రయ యిమ్మెయినిం బరమాత్ముఁ డుండు నం
చింతయుఁ జిత్తమం దకట యీతఁడె మూడవ వాఁడు బ్రహ్మమే
యెంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే 50
సుకులము నందు జనించి ని
జ కులమును జెఱచెను నలినజ కులాసురుఁడే
యకట యతని సుతు తో ధర
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్ 49
[ధరన్ +అకులుని ధర నకులుని; అకులుఁడు = నీచకులుఁడు;
రాఘవుఁడు = లక్ష్మణుఁడు]
సకల ధరా నివాస జన సంతతి నింపుగఁ గావ నెంచి హా
టక వర గర్భ వంశజుఁడు డంబుఁడు రావణ నామ దైత్యు తో
సు కవి సురా సురఘ్న వర సుధ్యవివేక మనశ్చర క్షపా
నకులుని తోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్ 48
[సుధీ + అవివేక; నకులము = ముంగిస; క్షపా నకులము =
రాత్రిపూట తిరుగు ముంగిస వంటి వాడు, క్షపాచరుఁడు]
సుందర వదన గోమున మందిరమున
నమ్ము నారీమణి దనరి నాథు చెంత
సొగసు లొలుకుచు వింత నలుగురి యెదుట
మాటలే రాని మగువయే పాటఁ బాడె 47
తేఁటులు పాడెనో యచట తియ్యని తామర తేనెఁ గ్రోలుచున్
మాటున మావి విద్రుమము మక్కువఁ గోయిల మెక్కి పాడెనో
వాటిక జామపండ్లు దిని వన్నెలు చిల్కుచు రమ్య కీరమో
పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్ 46
లలితపు భంగి నిజ చ్ఛా
త్రులకుం గఱపుచుఁ జదువులు తోరము విద్యా
కలితమ్మగు శిష్య వ్యా
కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్ 45
కలరే నేఁ డిటఁ గాంచ శిష్యుల సుతాకారంపు సద్వీక్షణన్
లలి తార్ద్రాత్మ కృపార సేక్షణములన్ లాలించు నధ్యాపకుల్
చెలువం బొప్పఁగ గొప్ప విద్యలు మహా శిష్యోప శిష్యవ్రజ
త్కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడుం బూజ్యుఁడౌ 44
[వ్రజత్ = చరించుచున్న; కులము = సమూహము]
అవనిఁ గృష్ణరాయు పలుకు లలరి వినమె
దేశ భాష లందుఁ దెలుఁగు తీపి లెస్స
యెందు నంచు మఱి యనంగ నేమి యొక్క
తమిళులకుఁ దెల్గుబాసపైఁ దగని ప్రీతి (న్) 43
గుమగుమ పప్పుచారనినఁ గోరి భుజించెడు పుణ్య కోటికిన్
సముదము త్యాగరాజ సరస స్వనురాగ విమోహ గానముల్
విమల మనో౽న్నమయ్య రస విస్తృత కీర్తన లెల్ల మెచ్చఁగాఁ
దమిళులకున్ దెలుం గనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా 42
[ పప్పు చారు = సాంబారు; అన్నమయ్య నామము యథాతథము
సిద్ధ సమాసమున గ్రాహ్యము]
అత్త వారింటి కేఁగంగ నతివఁ గూడి
యాదిఁ బాద ముంచఁగ నెంచి మోద మడర
నత్త నడకయె చాగఁగఁ దత్తరిల్ల
మార్గ శిరమందు వచ్చె నామని పుడిమికి 41
[మార్గ శిరము = దారి చివర]
నచ్చిన వానిఁ బెండ్లి నిజ నందన యాడి విదేశ మేఁగి తా
నచ్చపుఁ దెన్గు వేషమున నాఱవ యేటఁ బదమ్మిడం దమిన్
మెచ్చఁగ దల్లితండ్రులును మీఱ గృహమ్మున సంతసమ్ము రా
వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రి నిండుగన్ 40
అంభోజాక్షుఁడ యుండడె
యంభోద్యుక్ష్మా చ రాచ రాసు నిచయ భృ
త్సంభారమ్ములఁ గావున
స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్ 39
[స్కందుని లో గూడ నున్నది విష్ణువే యని]
శంకరుని భార్యతో నాడు సరస సల్లాపములు:
అంభోజాక్షుఁడె యక్కుమారునకు బ్రహ్లాదుండు నా మేటికిన్
స్తంభాంతస్థితుఁ డయ్యె స్వామి యనఁగా స్కందుండె దంభార్థమే
రంభా గాంచుమ స్కందుఁ డన్నను గుమారస్వామి తథ్యంబుగా
స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై 38
భర్త గాంచి మోము ప్రక్కకు వడిఁ ద్రిప్పి
మూతి విఱిచి యింతి మూగ వోయె
నగుచు నాఁడపడుచు నగఁ జూపి వన్నెలఁ
జలముఁ జల్లినంత జ్వాల లెగసె 37
[వన్నెలన్ + చలము = వన్నెలఁ జలము]
కలకల నవ్వు చాడుచును గాంతలు గూడి చరించ నంతలో
జెలఁగఁగ హాస్య వాక్యములు శీఘ్రమ వాద వివాద మయ్యె భా
మలు దమ రోష సంజనిత మత్సర నామ వరాజ్య ధార ని
ర్జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో 36
ఔత్స్యమ్మే పల లమ్మగు
గౌత్స్యమ్మే మే ల్గదయ్య కాదని యకటా
వాత్స్యమ్మేల నిఁక వినా
మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్ 35
[ఔత్స్యము = ఔత్సమునకు సంబంధించినది, ఔత్సము = సెలయేట పుట్టినది;
గౌత్స్యము = గౌత్సమునకు సంబంధించినది, గౌత్సము= గుత్సమునకు సంబంధించినది, గుత్సము = వరి;
వాత్స్యము = వత్సము (దూడ) నకు సంబంధించినది]
హృత్స్యం దానుప మాగ్రహమ్ము హృదసంతృప్తిన్ విడం దల్చినం
దత్స్యంత్తృవ్రజ దారణమ్ము విడుఁడీ ధర్మంబె మీకెంచఁగన్
మృత్స్యన్నాంచిత శాకముల్ దగును సుమ్మీ యెల్లరున్ వీడఁగా
మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే 34
[హృత్ + స్యంద + అనుపమ + ఆగ్రహమ్ము; స్యందము =
కాఱుచున్నది; తత్ + స్యంత్తృ; స్యంత్తృ = కదలుచున్న;
మృత్ + స్యన్న + అంచిత; స్యన్నము =కాఱినది;]
ప్రజ లందు నిరత ముండ స
హజమ్ము గద రెండు తెగలు నందు వలననే
సుజనులు పుణ్యాత్మ నరులు
కుజనులు క్రూరాత్ములు గద గుంటూరు జనుల్ 33
కుజముల్ భూ జల జంతువుల్ నరులు పక్షుల్ వుట్టు నిచ్చోట ధ
ర్మజుఁ డున్నట్టి ధరాతలమ్మున మహా మాత్స్యర్య దుర్యోధనుం
డు జనించం గనమే యదె ట్లగును విడ్డూరంబు కా రందు నేఁ
గుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా గుంటూరు వాసుల్ గనన్ 32
మున్ను తాళ పత్ర చయమ యెన్న దిక్కు
పిదప పుస్తకమ్ములు దిక్కు విశ్వ మందు
నవని నింక నంతర్జాల మగుట దిక్కు
శుష్కకార్యము పుస్తకావిష్కరణము 31
కన శక్యంబె పఠించ నేఁ డకట సత్కావ్యాళి ముద్రించ కు
న్నను హా! భారత కావ్య రాజమును నానా దేశ చారిత్రముల్
ఘన రాజన్య పరాక్రమ ప్రభలు సత్కారమ్ము కా దిట్లనన్
వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్ 30
హా నాథా యే మందును
గూన పడెడు నిడుము లకట కుయ్యో యని తా
నే నాథుఁడు లే కే,గఁగ
శ్రీనాథుఁడు రోసెనంట, శ్రీకాకుళమున్ 29
నానా బాధలు తప్ప వక్కట సురామ్నాయైక సంరక్షికిం
జానా యేల విచార మందగను స్వచ్ఛంబుం గనుంగొంటినే
నే నన్నంబున కింక లోటు కలదే నీవింక లెమ్మా యనన్
శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీ కా కుళమ్మున్ గటా 28
[శ్రీ కి + ఆ కుళమ్మున్ = శ్రీ కా కుళమ్మున్; కుళము = కొలను,
ఆలి, ఆళి వలె కులము, కుళము రూపాంతరము]
ధర వాసుదేవు లిద్ద ఱ
డర రవి సన్నిభ తనులు పడమరయు నింకం
బురుహూత దిశలఁ జిత్రము
పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్ 27
[ఇనుఁడు పడమట నుదయించె, ప్రాగ్దిశఁ గ్రుంకెన్]
తడయక కూల్చి యస్త్రముల దద్దరిలంగ ధరాతలమ్ము నే
నడరి కురూగ్ర సేన నని నావులఁ దెత్తును జూడుఁ డంచు నా
గడుసరి యుత్తరుండు వలుకన్ మదిఁ దోఁచు గదయ్య యెట్లనం
బడమటి దిక్కులో పొడిచె భానుఁడు గ్రుంకెను తూర్పు దిక్కులో 26
కనలేదా పెక్కుర ఱే
లను చెఱసాల నిడి యన్నల నిలఁ బ్రజా పా
లన జనుల, వధించి తనదు
జనకుని, సేవించు సుతుఁడు చను యమపురికిన్ 25
కని విని నేర నట్టి విధిఁ గాంతలఁ గారల నుంచి వారినిం
గనికర మించు కెంచకయుఁ గర్కశ రీతి తపించఁ దండ్రి, తా
ముని సుర సంచయమ్మునకు ముప్పులు వెట్టెను గాన, నింద్రజి
జ్జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్ 24
విశ్వ కళ్యాణ మూహించి విశ్వ జనులు
దయ్యమును గూడ పూజింపఁ దగును గాని
లోక నాశనార్థమ్ముగ లోకు లెట్టి
దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు 23
దైవాకారపు విగ్రహమ్ములకు నిత్యప్రోక్త సత్పూజకై
ప్రావీణ్యమ్ముగఁ బంచలోహములనే వాడంగ నొప్పున్ భువిం
గైవల్యమ్మును బొందఁ గోరినను ధిక్కాలాయస స్కంధమౌ
దైవమ్మున్ గొలువంగ రాదని రయోధర్మజ్ఞులున్ యోగులున్ 22
[అయోధర్మజ్ఞులు = ఇనుము గుణములు తెలిసినవారు]
అంబుజ నాభాంబుజ నే
త్రంబులు గల బాలకృష్ణు రండారయ నీ
లాంబుజ నవీన కలికౌ
కంబు సుమీ ముఖము, రతి సుఖంబును బొందన్ 21
[కలికా + ఓకంబు = కలికౌకంబు; కలిక = మొగ్గ;
ఓకము = ఇల్లు; రతి సుఖము = అనురాగపు టానందము]
జంబుక తుల్య మానవ విశాల జనాటవి లోన నున్న హీ
నాంబరుఁ జేరి యుండి కడు నండగ బంధు జనాప్త కోటి కా
లంబన కార కేద్ధ గుణ రత్న నిధానుని నిర్మలేక్షు పా
కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్ 20
[ హీనాంబరుఁడు = వ్యసనములు లేని వాఁడు; ముఖము = మాట;
రతిన్ = అనురాగములో; అనురాగములో నోలలాడిన యతి సుఖము కల్గును]
ఉల్ల మలరు దృశ్యం బిది
కల్లయె సంపూర్ణ సూర్య కర సంగ్రహణ
మ్మల్లదె రవి బింబ మహో
నల్లని యుత్పలము దోచె నభమున శశియై 19
పల్లవ వాగ్దళ జ్వలిత పంకజ శత్రు నిభాస్య మానినీ
సల్లలి తాంబకమ్మునఁ బ్రసన్నత గోచర మౌ ముఖమ్మునం
దెల్లని వర్తులమ్ము పయి తేలెడు నల్లని గ్రుడ్డు వింతగా
నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై 18
[ఇక్కడ కంటి తెల్లని వర్తులము గగనము, నల్లని గ్రుడ్డు ఉత్పలము]
పద్మాసనుఁడు పద్మనాభుని రామావతార విషయమును సురాళికిఁ జెప్పు సందర్భము:
దను జేంద్ర రావణాసుర
హన నైక నిమిత్త రాఘ వావతరణ సం
జనిత స దార సలక్ష్మణ
వనవాసమె సంపదను శుభంబు నొసంగున్ 17
అనయ విహీన పాలన రతైక మనమ్మున స్వీయ దేశ పా
లన మొనరించు చుండి పర రాజ్యము లందిడ నెమ్మి భూతల
మ్మున విలసిల్లు దేశముల పుణ్య సమస్త ధరా నరాధి పా
వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా 16
[నరాధిప + అవనముల =నరాధిపావనముల]
ఎల్లర చిత్తమ్ముల వడిఁ
దల్లడ పెట్టు మొనగాఁడు దానెప్పుడు వూ
విల్లూను వాఁడును సిరుల
తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్ 15
పెల్లుగ మ్రోఁగ వాద్యములు వెల్గఁగ రమ్యపు దీపకాంతులే
యుల్లమె యుల్లసిల్లఁగ సమున్నత పీఠము నందు నుండఁగా
మల్లికి నా వధూమణికి, మానస మందునె మ్రొక్కి తండ్రికిం
దల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్ 14
అజ్ఞాన ధ్వాంతం బీ
ప్రాజ్ఞ జనులఁ జేర రాదు భగవన్మాయా
సుజ్ఞాన మసాధ్యము తద
నజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్ 13
[అ + అజ్ఞానము = అనజ్ఞానము; అజ్ఞానము లేమి
యనగా జ్ఞానము]
ఏ జ్ఞానమ్ము గడించ నేరకయు ద్వేషేర్ష్యాది దౌర్బల్య యు
క్తాజ్ఞాతస్థిత దుర్జనవ్రజ మనో౽ ర్థా శాని శోద్రిక్త చి
త్తజ్ఞాతిద్విష దుర్వివేక మొసఁగుం దాపమ్ము గర్వోత్పతి
త్రజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్ 12
[గర్వ + ఉత్పతితృ + అజ్ఞానమ్ము = గర్వోత్పతి త్రజ్ఞానమ్ము]
ఆకాశవాణి వారి సమస్య:
ప్రాజ్ఞుల్ మెచ్చు కవిత్వ పాటవము పెన్పారంగ వేదాంగ సూ
క్తిజ్ఞానమ్ము తదర్థ భావములు సంకీర్తింప సామర్థ్యమౌ
విజ్ఞానంబు సెలంగ సూరిజన సంవేద్యమ్ము దుష్టార్థ గీ
రజ్ఞానమ్ము వికాస దాయక మహో రాగమ్ము పండించెడిన్ 11
[దుష్టార్థ గీః + అజ్ఞానమ్ము = దుష్టార్థ గీ రజ్ఞానమ్ము: చెడు నర్థము
నిచ్చు వచనములు తెలియమి]
ధారుణి రక్షింపఁగ ను
న్నారా యెవరైన యని యన మహాపదలం
దోరము సేయం గృప నుప
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్ 10
భీరువు వోలె నర్జునుఁడు భీతిలి బంధులఁ జంప నోప నీ
నేరము సేయ లే ననుచు నిస్పృహ నుండఁగ నెమ్మిఁ జూపఁగా
భారత చూడు మంచు నట భాహు సహస్ర విరాట్ప్రభాంగ కా
కారముఁ జూచి దేవుఁడని గట్టిగ నమ్మెను చిత్ర మెట్టులౌ 9
తడఁబడ కెన్నఁడు స్వార్థము
విడిచి కఱపుచుఁ జదువులను విత్తాశల నా
ఱడి తా నన్యంబౌ రా
బడి కేఁగని పంతులె కడు ప్రాభవ మొందున్ 8
కొడుకుల పోలె శిష్యులకుఁ గూరిమి పంచి వరంపు టన్నమున్
మడుగుల నిచ్చి యాగమ నినాదములే చెలఁగంగ సంయముల్
నుడులు ఘనమ్ముగాఁ బలికి నోట నిజాశ్రమ మంద చెప్పిరే
బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవ మొందు మెండుగన్ 7
'లంగా - చీర - రవిక - పయట' దత్తపది భారతార్థములో:
ఉత్తరకుమారుని ప్రార్థన:
అల రవి కడవని కౌరవ
బలగము చీరకయ దండు బవరమున బృహ
న్నల యేలం గాఁగఁగ నీ
కలయ విరూప యట కేఁగఁ గలుగు మరణమే 6
కుక్షి వసియించి కోరఁగ నక్షతుండు
తిరిగి తీర్చంగఁ గోరిక పరమశివుఁడు
చర్మ మనిశమ్ము ధరియించి భర్మ మనఁగఁ
గరుణతో నుమాపతి గాచెఁ గరివరేణ్యు 5
సకలము నీవ నాఁ దలఁచి సన్నుతి సేసిన నన్ను భక్తితోఁ
బ్రకటిత మౌదు నంచుఁ దెలుపంగ జనాళికి నిశ్చయమ్ముగన్
వికలము సేయ శాపమును విష్ణుఁడు దీన జనావనమ్ము నా,
మకరినిఁ జంపి సత్కృప, నుమా పతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్ 4
[ఉమాపతి = కీర్తి కాంతకు పతి; ఇక్కడ విష్ణువు]
'వి - నా - య - కా' పై అక్షరాలు వరుసగా పాదాంతంలో
శశ్వత్కృ తాఘ హర! వి
శ్వేశ్వర కర దత్త మూర్థ! హేరాంబా! నా
నైశ్వర్య దాంతరాయ
ఘ్నేశ్వర! రక్షింపు మయ్య యిభ వక్త్రాంకా! 3
పనియుఁ బాటయు నేరఁడు వారి వీరిఁ
జేరి తిరుగు చుండుఁ జదువు చింత సుంత
లేదు కూనిరాగమ్ముల నూదుఁ గనుఁడు
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము 2
ఈడనె యుండె గడ్డి తిని యింపుగ నంతట మాయమయ్యెనే
యేడకుఁ బోదు నెందు మఱి యెవ్వరి వేడుదు గాంచ గాడిదం
బోడిమి నా కిదే యనుచు మూర్ఛిలి రేవఁడు చింత నుండగా
గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్ 1

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి