తా మది నెఱుంగఁ డింతయు
నామర్షంబు నవసరములం దాదుకొనుం
బ్రేమగ నీతం డక్కట
తామస చిత్తుండె జనుల దైవం బయ్యెన్ 61
భూమి జనించి నంతటను భూసుర వంశము నందుఁ జాలునే
యీ మను జాలి నిన్ను మహి నేల నుతించుఁ దపః ప్రపూర్ణ స
త్కామిత చిత్తు బ్రహ్మ ఋషిగా వచియింపఁగఁ బద్మజుండు త
త్తామస చిత్తుఁడే జనుల దైవముగాఁ బ్రణతుల్ గొనెం గదా 60
గుఱ్ఱం - మైలవరపు - గుండా - రావెల: దత్తపది:
వనిఁ బృథ గుఱ్ఱం గన విని
తన కను మైల వరపు జిగి తగ్గ నడియఁగాఁ
దన కడుపును బోఁగుం డా
య నెలఁత ముని రా వెలవెల యాయె భృశమ్మున్ 59
[కను మైలు = మేను కనులు; పోఁగు = రాశి, పిండపు రాశి;
నెలఁత =వనిత, గాంధారి; ముని = వ్యాస మహర్షి]
సగ జీతంబు వ్యయం బగు
దిగి తగుదు ననంగఁ దృప్తిఁ దిని తాఁ జన్నం
దగునే యీయక ధన మని
భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే 58
వడలున్ బూరెలు పప్పు భోజనమునం బాల్బువ్వ పచ్చళ్ళు న
ప్పడముల్ గూరలు దప్పలమ్ము పెరుగున్ భవ్యంపుఁ జిత్రాన్నమున్
విడియమ్ముం బులిహోర లడ్డు లచటన్ విస్తారమై యుండఁగా
నడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై 57
వాదోప వాదముల నే
లా దూఁకంగ ననివార్యమా యియ్య దిటం
బోదము వేగమ్ముగ నే
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్ ? 56
ఏ దానమ్ములు సేయ కీ పుడమి ద్వేషేర్ష్యాది భావమ్ములం
దాదాత్మ్యమ్మున దుష్ట కార్య రతి నిత్యం బుండి ఘోరంబుగం
బాదాక్రాంతులఁ జేసి దీనుల నిలన్ బాధించి తోరమ్ముగం
గేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా 55
అనంతచ్ఛందపు సమస్య:
లీలా రీతి విహార సంఖ్య నసురారి శ్రేష్ట భూపుత్రులన్
హే లాలోకన విప్రకారముల నయ్యిందీవ రోగ్రాక్షి క
ల్లోల క్రోధ మనమ్ముతోడఁ గనియెన్ లోలాక్షి సల్లాప రో
షాలాపమ్ముల నాలకించి వర చిత్తాభీష్ట రోషాత్తయై
ప్రాలేయాంశువు వోలె మధ్య దివసార్క ద్యోత మానాంగియై. 54
[యుద్ధమందు కృష్ణ నరకులను విలాసము తిరస్కారముల, నిందీవరాక్షి యుగ్రాక్షి హర్షము క్రోధములతో, సల్లాపములు, ప్రేలాపనముల నాలకించి వారిరువురకు చిత్త మందు నభీష్టము రోషమును బొందినదై క్రమముగా చంద్రుని వలె మధ్యందినార్కప్రకాశముతోగూడినశరీరము కలదియై చూచెను.]
హరియె విన్నవింప హరికి నాదిత్యుఁడు
కరుణ తోడ నరిగి కాంత తోడ
నంక మందుఁ జెలఁగి యంచి తారాధిత
శంకరుండు నరకుఁ జంపె నలిగి 53
అంక గణాంక తంక రహితాత్మ కళంక నికాయ పంక డో
లాంక సకంక ణావృత ఖరాయత హస్త విశంక టోగ్రు, స్వీ
యాంకము నందు సత్య నలి నాంబక భాసిల ఘోష వల్లవీ
శంకరుఁ డుగ్రుఁడై, నరకుఁ జంపెను లోక హితైక కాంక్షియై 52
[అంకము = దోషము, అంకె, గుర్తు, సమీపము; డోలము = అభినయ
హస్త విశేషము ; వల్లవీ శంకరుఁడు = గోపికలకు సుఖములు గలుగఁజేయువాఁడు]
ఈ వ్యయం బాపుమా ధీవ రేంద్ర యింక
నవ్యయపు రీతు లింపుగ నాదరించు
భావ్యమే వెలిఁగించుట పట్టపగలు
నవ్య దీపముల్ గృహవితానమున నేల 51
నవనీతం బది యుండఁ గృత్రిమపు టన్యం బాజ్య మేలా యిఁకన్
స్తవనీయం బగు కావ్యముల్ పరఁగఁ దుచ్ఛంబైన వేలన్ వినం
బవ లుద్దీప్తముగం జెలంగ నిచ టన్భానుప్రకాశమ్ము మా
నవ దీపమ్ముల వేలకో గృహ వితానమ్మందు నీవేళలో 50
వ్యాస కృతము సుందర దర
హాసాస్య విశుద్ధ బమ్మె రాన్వయ కవియే
భాసిత సుమహద్విద్వ
ద్వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్ 49
[విద్వత్ + వి +ఆసుడు = విద్వద్వాసుడు: విద్వ త్తను గొప్ప
యాసనము కలవాడు; ఆసము = ఆసనము]
రాస విలోల చిత్త యదు రాట్చరితమ్ము విశుద్ధ మాన సో
ల్లాస కరమ్ము నర్థ పద లాస్య సుధానిధి సత్కవివ్ర జో
ద్భాసము భక్తి పోషణము బమ్మెర పోతనయే, నుతించి యా
వ్యాసమహర్షి, వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో 48
అనవరత వినమ్రుండే
ఘనుఁడే శాంతాంతరంగ కరుణా మయుఁడే
కనుమా యీతం డారయ
జనహననాసక్తుఁడే యశంబుఁ గను ధరన్ 47
విను నర పాండవప్రవర భీతుఁడ వైతి వదేమి చిత్రమో
యనిఁ గన సింహ విక్రముఁడ వగ్ర ధనుర్ధర రాజ వంశ వీ
రున కిల ధర్మ సంయుతము లోక వినాశక కార్య యుక్త దు
ర్జనహన నైక తత్పరుఁడె సజ్జనుఁడై యశ మందు నిద్ధరన్ 46
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
సువనే లసత్కుసుమ నిభ
వివృతాక్ష! నమన్నుత! నిను విన్న యపుడ మి
శ్ర విమల హాస ముఖమ్మ
ట్టి విశ్వ వంద్యా మురారి ఠేవం గొల్తున్ 45
కారాదు నిరాసక్తులు
పోరాటము లవి చెలంగు భువి నిత్యముగా
నారాటముల ననకు మి
స్సీ రామ కథామృతంబు చింతలఁ గూర్చున్ 44
పర దారార్థ కుతూహల మ్మణఁగి సద్బ్రాహ్మ్యైక్య భావంబునం
గర మాసక్తి చెలంగి చిత్తమున నాకాంక్షా వినాశంబు గా
నరయన్ దాశరథుండు దైత్య గణ శిక్షార్థంబు సంజాతుఁ డు
ర్వి ర శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా 43
[నిర్వేదము = వైరాగ్యము]
వంకలు వెదకక ఘన గణ
నాంకము లూహించి నిర్మలాత్మఁ జెలంగం
బంకజలోచను గరుణన్
సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్ 42
కల దీ మేధ కపూర్వ శక్తి నర సంఘశ్రేష్ఠ శీర్షమ్ములన్
నలినాక్షుం డిడఁ దప్ప దియ్యది మదిన్ నమ్మంగ సన్మాన్యు లౌ
దల యందుంచిన భాషణమ్ములివి ప్రాతఃకాల సంజాతముల్
కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే 41
కన్నని సమయింపక యున్నఁ గంసు పాలు
కానఁ బడిన గోపవ్రజ కాంతు పాలు
గ్రోల నక్కట వగలాడి పాలు పూత
నమ్మ పాలు విషమ్మగు నర్భకులకు 40
[పాలు = భాగము, క్షీరము]
మిష యని యెంచ కమ్మ మది మిథ్యలు గావివి సత్య వాక్కులే
సుషి గణ శోధనమ్ము లని చూడకు సంశయ మేల తల్లిరో
తృష యది కల్గఁ ద్రాగ వలెఁ దియ్యని పాలను గాఁచ విర్గినన్
విషమగు నమ్మ! పా లనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే 39
ఒకానొక బావమఱిది పల్కులు:
అత్తయు మామల్ : అపార్థ నివార ణార్థమై “మా మలు” గా విఱుపు:
తెల్లంటులు గొని పంపఁగ
వెల్లువగ నుతుల గృహప్రవేశమునకుఁ దా
నుల్ల మలరంగ మామయు,
నల్లుఁడు రాకున్న, మురిసి రత్తయు మా మల్ 38
[తెల్లంటి = బహుమతి; మా మల్ = మా మలు: మా రెండవది]
మల్లన యంబికా వరుఁడు మామకు నప్రియుఁ డైన వాఁడు దా
నొల్లఁడు జన్న మారయ మదోద్ధత దక్షుఁడు పిల్వ కుండినం
గల్లలు పల్క రాదు కద కాంచఁగ మామయె యత్త గాదు లే
యల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్ 37
చత్వారమునకుఁ జమత్కారము!
కంటి చత్వారమే రాఁగఁ గర్కశముగ
వాడ నిచ్చగించినఁ గళ్ళజోడునకు న
వని తలమ్మున నందాల బాల కంటి
పాప మే దక్కు పాదాభివందనమున 36
[మే = పార్శ్వము;
పాదాభివందనమున వాడ నిచ్చగించిన
(అందము సన్నగిల్లు నన్న భయము)]
తాపసు లన్న నిష్టము త్రిధామున కెన్నఁడు వారి కీయ సం
తాపము రాక్ష సౌఘమును దార్క్ష్యుఁడు తథ్యము చంపెనే కదా
శాపము లున్న ముక్తి, వర సంయమి కోటికి భక్తి మ్రొక్కినం
బాపమె! దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్ 35
పారావా రావని నిభ
ధీరక్షాంతి గుణగణ విదిత వర ధర్మో
దా రాచర సచ్ఛీలుఁడు
కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ 34
వీరావేశుఁడు ధూర్త కంసుఁడు చెఱం బెట్టంగ నున్మాదియై
ధారాళమ్ము గ్రహించఁ గంస పిత సద్ధర్మాత్ముఁ డిందీవ రా
శీ రానుగ్రహ దాయకుండు హరి రాజీవాక్షు దాక్షిణ్యమే
కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే 33
చదలునఁ గాపాడి సురలఁ
గుదురుగ నొక చోట నుండి కొన్ని యుగమ్ముల్
నిదురించెను ముచుకుందుఁడు
నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్ 32
వద్దుర మొద్దు నిద్దుర ప్రభాతపు వేళయు సంధ్య వేళ యం
దద్దము ముందు నిల్వకుమ యందము చిత్తము నందుఁ జూపుమా
యెద్దిన మైన సత్కృతము లింపుగఁ జేసి పరాత్ముఁ దల్చుచున్
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్ 31
గారవ మొప్పఁగ నా ము
న్యారా మావాస ప్రవిమ లాంతఃకరణం
గూరిమి మదిఁ పుణ్య తప
శ్శ్రీ రా ముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్ 30
[ తపశ్శ్రీ - తత్సమాంతము చేయఁ బడినది]
వారని శ్రద్ధతో వెతకి పాదప మూలము నందు నుండగాఁ
దారల నంటు హర్షమునఁ దన్వి నెఱింగి ధరా తనూజగా
మారుతి పెద్దకోతి యనుమానము తీరఁగఁ గాంచి దీవిలో
శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్ 29
[పెద్ద సతి = గొప్ప సతి]
కని విని యెఱుఁగని రీతిం
దన పతి వైద్యార్థ మకట తల్లడపడుచున్
ధనమున కిడి తాకట్టుం
దనయుని తల నరికి నట్టి తల్లికి జేజే 28
[తలను +అరికిన్ =అట్టి = తల నరికి నట్టి]
కనుఁగొన నొక్క కూరయినఁ గానక యింటను జింత సేయఁగా
మనమునఁ దట్ట గొప్ప దగు మంత్రము మోదిలి శీఘ్ర మేఁగి తా
మునుకొని దూటకై పెరట మూరిన పండిన సప్తపత్రపుం,
దనయునిదౌ, తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్ 27
[తనయునిదౌ సప్త పత్రపు : తనయుఁడు వేసి నట్టి అరఁటి చెట్టుది]
అంగనకు నంతరంగము
భంగము కాక మనఁ గలదె పన్నుగఁ బ్రేమో
రం గాభం గోత్తుంగ త
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్ 26
[ఉరంగము = పాము; ప్రేమయను పామనెడు
నిరంతరముగా లేచిన కెరటము]
ఆది శంకరాచార్యుని ప్రసక్తి:
జంగమ సర్వ సంగ సువిసర్జిత లోక హితానుయోక్త స
న్మంగళ సంచయప్రదుఁడు మార విరోధికి నిత్య భక్తుఁడే
యంగజ శాస్త్ర విద్యల మహా సతికిం బరమంపు సాహితీ
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్ 25
భర్గానురాగమయ సం
సర్గా! మాతృత్రయాభిసంజ్ఞా! యకటా
దుర్గమ రూపం బూనఁగ
దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్ 24
దోర్గర్వమ్మునఁ బ్రజ్వలించ వసుధన్ దుష్టా! మురక్రూర సం
సర్గా! పాలిత దుర్గపంచమ! సదా సంపీడ్య మానార్య స
ద్వర్గా! క్ష్మా తనయాధమా! నరక దైత్యా! నిర్జరాభేద్య దు
ర్దుర్గా! నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా 23
[దుర్గము = కోట]
సాదము పైఁగల మక్కువ
వేదన యేల సురలన భువికి సురలనుకో
కాదన మున్నిచ్చిరి యే
మో దీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్ 22
[దీ = డీ]
పాదాక్రాంత సితాద్రి నేత్ర విల సత్ఫాలుండు వేదాంగ సం
వేదోద్యాన విహారుఁ డద్రి తనయం బెండ్లాడఁ గారుణ్య భా
రోదారాస్వని తాంతరంగ రుచి విద్యోతుండు మృష్టాన్న స
మ్మోదీ! పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో 21
ఆ తోఁక మాత్ర మొక్కటి
యే తక్కువ కొంటెపిల్లయే మర్కటమే
నాతిని సంపద లీనెడు
కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా? 20
ఊత పదమ్ము లేరికిని నూరక పోవునె యేఁగ కాటికే
యీ తఱిఁ గొన్న నొక్కటి గ్రహించ నగున్ మఱి యొక్క టూరకే
యాతని కబ్బెసంపు నుడి యయ్యది, నాతినిఁ, బొందు మూరకే
కోఁతినిఁ, బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో 19
వైద్యుఁడు మిత్రుఁడు రవి మరణమును దెలుపు సందర్భము:
వాగ్దీధితి సుజన సఖుఁడు
రుగ్దమనుఁడు, చెప్పుటకుఁ బలుకులు తడఁబడన్
దుగ్ద చెలగంగఁ బల్కెను
బ్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్ 18
దృగ్దైన్యం బను కొంటి రేమొ యకటా దివ్యంబు నా దృష్టియే
దుగ్దం జెందఁగ నేల నెల్లరును దాఁ దొల్లింటి యట్లే చుమీ
వాగ్దోషం బనరాదు సాయముననే, భాసిల్లి దివ్యంబుగాఁ
బ్రాగ్దిగ్గ్రావమునందుఁ, గ్రుంకె రవియున్, బ్రత్యూషకాలమ్మునన్ 17
అణ్వుదిత సత్వ పూరిత రేణ్వఖిల జ
గద్విలయ పరిభూతము కాదె కానఁ
గుతల నాశ నార్థ కృత ఘోరతర మార
ణాయుధమ్ముల పూజ లనర్థకములు 16
ఆయత విశ్వగోళమున నాడుచు నుండు పరాత్మ రూపుఁడై
స్వీయ చ రాచ రాత్మల నభేదము విష్ణుఁడు నిశ్చయమ్ముగా
నాయన లేని కించి దణు వైనను లేదన నిట్లనంగ రా
దాయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్ 15
ధర్మ సూక్తు లనుచు నమ్మి దైవ నిర్ణ
యమ్మ చుమ్మని చిత్తమ్ము నందుఁ గర్మ
రక్తి వీడి భక్షించ నిరంతరమ్ము
భారతమ్మును జదువ వైభవము లడఁగు 14
[భారతము = భారత దేశ చరిత్ర]
దూరము లయ్యె సంపదలు దుష్ట మనంపుఁ బసిండి తిండికిం
దోరపు వైభవమ్ము లల దూరము లయ్యెను దీవి ఱేనికే
యారక పుణ్య భాగవత మందు నిరంతర ముగ్ర నైరృ తా
భారతముం బఠింప ఘన వైభవముల్ నశియించు నందురే 13
[నైరృత+ఆభ+ అరతము = నైరృ తా భారతము; దైత్యులతో సమాన
మగు ద్వేషము ]
ధన మొసంగినఁ బాడునె యనిమకమ్ము
విత్త మీయంగ విచ్చునె విరులు పుడమి
ఫల మనంగ విత్తంబని తలఁచ నిజము
శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము 12
దక్ష యజ్ఞము:
సిత నగ వాస నర్తన విశిష్ట వికాస సతీ మనః ప్రి యా
సిత గళ భస్మ చర్చిత విశేష నిభాక్ష విలాస నిత్య స
న్నత జన రక్ష ణైక రత నాగ కలాప నిరీశ్వ రార్చనా
శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో 11
మననమె చిక్కౌ మఱి పసి
దనమ్మునఁ జదు వగుఁ జిక్కు తారుణ్యమునం
గనవలె పండిత వర్గము
మనుజునకుఁ బ్రమోద మిడు సమస్యలు సతమున్ 10
తనరఁగ నంధకారము సతమ్ము నిశా తతి వచ్చె దీపముల్
తనరఁగ నడ్డుగాఁ గడలి దాటఁగ నింపుగ వచ్చె నోడలే
తనర నిరోధమై గిరులు దారికి వచ్చె విమాన రాజముల్
మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో 9
ఏ తీరున నీ భవమున
నాతనిఁ బెండ్లాడఁగ నగు నను వ్యాకులతం
బూతనఁ జంపిన కంసా
రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్ 8
సీతాసాధ్వి ధరా తనూజ గుణ సచ్ఛీల ప్రభా కీల గా
ఢాతీహా కలి తాంతరంగ వర సూర్యామ్నాయ సుక్షత్రియ
వ్రాత శ్రేష్ఠుని నంబరాంబర మహేష్వాసఘ్న దైత్యవ్ర జా
రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్ 7
అవ్వర పుత్రుని మహిమము
సువ్వే సేంద్రమ్ము ధర్మజుం డడుగిడి తా
నొవ్వులు రివ్వునఁ బోవన్
నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్ 6
హరుసము కల్గు నాకలిని నారట మందెడు ప్రాణి కోటికిన్
విరివిగ భోజనమ్మది లభించిన స్వర్గము కన్న మిన్నగన్
గిరగిర తిర్గుచున్ జలము క్రింద తటాకము నందు నొక్క మీ
నరకము నందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్ 5
[మీను +అరకము = మీ నరకము; అరకము = నాచు]
నిత్యము జరుప మే లగు నిగదితములు
సత్యము నహింసఁ బాటించఁ జాలు సుమ్మి
వాగనుచరణ శూన్యము వరజన వర
దేశ! జనులకు వలదు గాంధీ జయంతి 4
అల పేట్రేగి ప్రజాధినాయకులు వాగావేశముల్ చూపరే
యిల హింసా రత పూరుషేంద్రులును గాంధీయమ్ము వాక్రుచ్చరే
వలదన్నం గలుగున్ ముదమ్ము భర తాంబా, వేడుకల్ మానుటల్
కలనైనం దలపోయరే, జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్ 3

పద్య గద్యము లెన్నఁగఁ బండితుండు
శైలి తలపించు నా కవిసార్వభౌము
నిక్కము వచింతు నాతఁడు నీ వడిగిన
న న్నయ కవివరుండు తెనాలివాఁడు 2
[నన్ను +అయ = నన్నయ]
సన్న పదాలి గర్భిత విశాల మనోహర భావ జాల మా
సన్న సనాతనీ వర విశారద రాజ దయా ప్రకాశుఁ డా
సన్నత దిక్కవి ప్రవర సంచయ ధీనిధి రామకృష్ణ నా
నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి