భారత దేశ వైభవము
ఉ.
శ్రీ రుచి కార్య సంచయ వశీకృత మానస సౌరభమ్మునన్
వీర విహార సైన్య పరివేష్టిత రక్షిత భవ్య
సీమలన్
భూరి పరిశ్రమాలయ సుపోషిత సేద్య వణిగ్వ్రజమ్ములన్
భారత దేశ మొప్పు ధరఁ బండిత పామర
ధర్మ సక్తతన్ 1.
ఉ.
మూరును గర్మభూమిగను ముక్తి నొసంగును
వేదభూమియై
కోరు సతమ్ము భూతదయఁ గూరిమి సూపును శాంతి వర్తనిన్
భారము నుంచు దేవ తతి భక్తినిఁ గొల్చుచు
సంచరించుచున్
భారత దేశ మొప్పు ధరఁ
బండిత పామర ధర్మ సక్తతన్ 2.
చం.
పరఁగ గృహస్థ ధర్మమున భవ్య వివాహ విధేయ రీతులన్
గురుజన పూజనాదుల నకుంఠిత దీక్ష వహింప నిత్యముం
దరుణుల నాదరింపఁ దమ తల్లుల చందము పాప భీతినిన్
భరత సువర్ష మొప్పు ధరఁ బండిత పామర ధర్మ సక్తతన్ 3.
గురుజన పూజనాదుల నకుంఠిత దీక్ష వహింప నిత్యముం
దరుణుల నాదరింపఁ దమ తల్లుల చందము పాప భీతినిన్
భరత సువర్ష మొప్పు ధరఁ బండిత పామర ధర్మ సక్తతన్ 3.
చం.
పరమత సామరస్యమునఁ బౌర సమాజము
వెల్గుచుండఁగన్
సురుచిర మైన స్వీయ మత శోధిత సత్యప థానురక్తినిం
బరుష విహీన భాషణ కృపారస మగ్న వికాస చిత్తతన్
భరత సువర్ష మొప్పు ధరఁ బండిత పామర
ధర్మ సక్తతన్ 4.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి