ఎన్న ధనము కన్న గుణము మిన్న యంచు
నెంచి యంచిత మెల్లడ సంచరించి
వనిత యంతట సద్గుణ వంతు డైన,
మాన్య యయ్యెఁ బతివ్రత, మగని రోసి 60
[రోయు = వెదకు]
అగ మాధిక్య శరీర ఘోర మతి లంకై కాధిపత్యప్రభా
జగదాక్రందన కారకుం డనగఁ దుచ్ఛంబైన జల్పంబుల
డ్డుగఁ దా నొక్క తృణమ్ము నుంచి దశకంఠున్ దైత్య దుష్కోటికిన్
మగనిన్ రోసి పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా 59
[ మగఁడు = రాజు]
మహాకవి పోతనామాత్యునకు వినమ్ర ప్రణతులతో:
బాల రసాల సాల నవ పల్లవ కోమల విగ్రహమ్మునన్
సాల విభంజనుండును విశాల భుజాంతర భాసితుండు గో
పాల సునామధేయమునఁ బద్మ దళాక్షుడు కంస మల్లురన్
బాలుర సంహరించి శిశుపాలుఁడు కీర్తి గడించెఁ బుణ్యుఁడై 58
[శిశువు = వత్సము; శిశుపాలుఁడు =(గో)వత్స పాలకుడు:కృష్ణుడు]
కాల వశంబున కంసుడు
బాలురఁ బరిమార్చిన, శిశుపాలుఁ డనఘుఁడౌ
మాలినిఁ గృష్ణుని నిందల
పాలుం జేయగ సమసిరి వనజజు లీలన్ 57
మారుతి వాపుట కార్తిని
వీరాలాపుండు ఘోర వేగమ్మున భీ
మోరసిలుఁడు కీచకుఁ డటఁ
జేరగఁ గాయమును జీరి చేర్చెను దివికిన్ 56
రక్తిని వేడగఁ గాచును
భక్తుని దైవమ్మె, కొలిచి వరముల నందెన్
భక్త వరదు నా శంభుని
యుక్తిని రాక్షస గణము లనుచితము లైనన్ 55
ముక్తినిఁ గోరి తాపసులు పుష్కర నాభునిఁ గొల్తు రెల్లరున్
భుక్తికి లేక మిత్రుని విమోహ విహీనుడె, కృష్ణునిం దయా
సిక్త హృదంబుజంబునిఁ గుచేలుడు, దా నెరి గిట్లు కాచు స
ద్భక్తుని దైవమే, కొలుచువాఁడయి పొందె వరమ్ము లెన్నియో 54
భూజనుల పాప మణచగ భూతలమున
మేరి మాతకు నింపుగ మేలు గూర్చ
క్రీస్తు పుట్టిన దర్థ రాత్రి యగుట నల
క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనఁగ 53
[శివరాత్రి = శుభరాత్రి]
మస్తక మందు చంద్రుని త్రిమార్గను గౌరిని నుంచ మేను నం
బ్రస్తుత కాల మెల్లరును భారత దేశము నందు, వీడగన్
నాస్తికు లైన వారల వినాశన బుద్ధులు నా మతేతరుల్
క్రైస్తవు లెల్ల, భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్ 52
చూడు నేటి రైతుల తీరు తోడు లేక
మాడు బ్రతుకులు దైవము రాడు వేడ
వేల కొలది వ్యయము జేసి పెట్టె కాపు
బీరతీఁగకుఁ, గాచెను బెండకాయ 51
[కాచెను+పెండ; పెండ = పేడ; పెండకాయ = వ్యర్థపు కాయ (పుచ్చిన బీరకాయ)]
వీర మొప్పగ దైత్య వైరిని వెఱ్ఱి వానిగఁ దల్చుచుం
జేరగన్నభ మందుఁ జంద్రుని చిత్ర రీతిని మంగళు
న్నారయన్నిల శాస్త్ర వేత్త ల యద్భుతమ్ములు శోధనల్
బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా 50
పరమోత్కృష్ట విలాస తాండవ సనిస్వానాద్రి సంచారముల్
గిరికన్యా కర సారసద్వయ సు సంకీర్ణప్రకాశమ్ములున్
శరణాకాంక్షిత మౌని హృద్విపిన సంచారంపు శీతాంశు శే
ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్ 49
పరమ పురుషుండు వేంకట
గిరి నాథుఁ డట విలసిల్లఁ గీర్తిత మయ్యెం
దిరుపతి తిరుమల ప్రముఖ శి
ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్ 48
[పదము = స్థానము]
ఏమి విచిత్రమో తరమ యేరికిఁ జెప్పగ నిశ్చయంబుగ
న్నా మధుసూదనప్రభవు డాతనిఁ గోరుచు రుక్మిపుత్రి భా
మామణి ధీర రుక్మవతి మానుగ భార్యగ నయ్యె వైరభృ
ద్రాముఁడు వియ్యమందె బలరామునితో రవిచంద్రసాక్షిగాన్ 47
ఏమని చెప్పుదు దుర్విధి
నామని రుక్మి యొనరించె నఱ నెత్తమునన్
భీమావమానము పరవి
రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా 46
[అఱ = వంచన; ఆమని = అధికము]
సీతాదేవి దండకావనములో నివసించు తరి:
అల చిక్రోడ శశ హరిణ
ములు నిజ బంధు జన ఘన సమూహముగను ద్యో
తల చరములు సఖులవఁ గే
కు లటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్ 45
సలలిత దేహ కాంతులును జారు శశాంక ముఖారవిందయున్
నలినదళాయతాక్షిని సనమ్రతఁ బ్రీతిని జానకీ సతీ
యలికుల వేణి యో ప్రియతమా యనెడిన్ సఖినిన్, హితైక వా
క్కు ల టను, గాంచి భూమిసుత కోరికతోఁ గురు లల్లఁ బిల్చెరా 44
[వాక్కులు +అటు+అను = వాక్కులటను; అటు = ఆప్రకారము]
వృత్తములు నభస్స్పృశ్యపు వృక్షములుగ
శబ్దములు వివిధ కుసుమ షండములుగ
వెలయ కవన వనాంతర విహరణముగఁ
బృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె 43
మదమున హుంకరించి తృణ మాత్రుడు క్షత్రియ సంభవుండునున్
సదమల చిత్త ద్రౌపదిని సాహస మంచుఁ దలంచి దొంగిలం
బదపడి వెంట దూక నిక పాండవ వీరులు సైంధవుండటన్
బెదరుచు పాఱి పోయెనట, పృచ్ఛకులం గనఁగన్, వధానియే 42
[ పృచ్ఛకులు = యుద్ధ శాస్త్రములో వ్యాసమహర్షి యంతటి వారు;
పృత్ + శకులం = పృచ్ఛకులం; పృత్ = యుద్ధము; శకుడు = బాదరాయణుడు
( వ్యాసముని); వధ + ఆని = వధాని; వధ = మారణము; ఆను = అణఁచు; యుద్ధమునణచి]
నిజ మనోధిపతిని నెరిలేక మన్నింప
మనసు రాని తనదు మాట లెల్ల
చెల్ల నోపు ననెడు చేడియ బలపు టి
ల్లాలు లేని మగఁడు హాయినందు 41
లీలామానుష వేషధారి హరి సల్లీలా విశేషమ్ములే
కాలానుక్రమ దుష్ట కర్మచయ సంఘా తోత్థితమ్ముల్ మనో
మాలిన్యాకలితాపకారమగు నీమాత్సర్యముం గ్రోధ మో
హాలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా 40
[మోహ +ఆలి = మోహాలి ; ఆలి = సమూహము; సంఘాతము = గట్టిదెబ్బ]
అమ్మరొ చూడు డందము ముఖాంబుజ చందము కేశసంపదం
బమ్మిన హంస చారములు పర్వదినమ్మున సంతసమ్మునం
గమ్మని మొల్ల మల్లియలు కాంతకు నల్లిన కోరకొండెలం
గొమ్ములు మొల్వగన్ శశము గుల్కుచుఁ బాఱెను నాల్గు దిక్కులున్ 39
అందిందెందెందును జని
కందర్పుడు చందురుఁ గనఁ గన్యామణియే
విందిమ్మందఱ కిందును
గుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్ 38
[కుందు = దుఃఖము; కుందు +ఏటికి = కుందేటికి: దుఃఖమెందులకు; కొమ్ము =పసుపు కొమ్ము]
రెండు జడలల్లు కొని పువ్వులతో విలాసముగా తిరుగు నందమైన యమ్మాయి గూర్చి యొక స్నేహితురాలు పల్కిన పల్కులు:
అమ్మీనాక్షినిఁ జూడు డందము తదాస్యాబ్జమ్ము కేశమ్ములున్
సమ్మానంపుఁ గరేణు చారములు నా సౌభాగ్య భ్రూభంగముల్
గమ్మత్తైన సువాసనల్ చెలగు నా కందర్ప బాణమ్ములన్
గొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచె, రా కుం ,దేలు నల్దిక్కులన్ 37
[కుందు = తగ్గు; కుందు +ఏలు = కుందేలు; ఏలు = ఏలుతుంది (నల్దిక్కులు గర్వముతో )]
గాధిజ యజ్ఞ రక్షకుడు గాధిజు నాజ్ఞను విల్లు నెత్తి భూ
మేధ విరాజి తాధిపు డమేయ తపోనిధి భూపుఁ డావిదే
హాధిపు ముద్దు పట్టి వసు ధాత్మజ సీతను సర్వమంగళా
రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్ 36
నృత్య వాద్య ఘోషము లంట సత్య జగతి
భృత్య లోకాను కంపియు నిత్య ధర్మ
సత్య వచనుడు సీతను నిత్య నిరప
రాధ నుద్వాహమాడెను రామవిభుఁడు 35
ఉద్వేగంబున రావణుండు ఘన కోపోద్రిక్త చిత్తంబునన్
హృద్వేగుండు కపీశు వాలమును నంటింపన్ వరంబయ్యె శుం
భద్వామామణి దర్శనద్యుతి సుసంభావ్యేద్ధ భీ మానురం
గద్వాలప్రభవాగ్ని కాల్చెగద లంకాపట్టణంబున్ వడిన్ 34
[అనురంగత్+ వాలము = అనురంగద్వాలము: ప్రకాశించుచున్న తోక]
తద్వాలముఁ గాల్చినఁ బర
మోద్వేగి దశాననుండు మూర్ఖుండై శుం
భద్వీరుడు కపివరుని జ
గద్వాలానలము గాల్చెగద లంక నయో 33
[జగత్ + వాలము = జగద్వాలము: తిరుగుచున్న తోక]
కలుష పూరిత మయి విష వలయ మవని
కాల మహిమ దీనిని చెప్ప నేల నేడు
బాల బాలికలకుఁ గల్గు బాధ! నేత్ర
కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును 32
[కుసుమము = 1. పువ్వు; 2. కంటి పువ్వు]
విమలపు టంబరమ్మునను వింతగఁ దారలు వెల్గు చుండగం
గమల సుమిత్రు డా కువల కాంతుడు పశ్చిమ పూర్వ దిక్కులం
దమరిరి సూర్య చంద్రులట నంచిత కాంతుల సంధ్యవేళ నా
సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించెఁ గాంచుమా 31
[సుమము = ఆకాశము; సూనము =మొగ్గ]
అరి గణ హరి భూపాలుని హస్త పాద
చిత్ర చలనమ్ము లెల్ల సూచి రణరంగ
జైత్ర ఖడ్గలావణ్యము శత్రు సేన
భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు 30
రయమున లాగి యా ధనువు లాఘవ మొప్పగ నెక్కుపెట్ట నే
భయమును లేక రాఘవుడు వైష్ణవ తేజుఁడు జామదగ్నియే
భయపడినంత వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్
నయమున నేగె భార్గవుడు నమ్రత నంత మహేంద్రశృంగికిన్ 29
తోయపు వార లెల్లరును దోర్బలముం గని సంతసింపగన్
సాయక షండముల్ విసరి శస్త్రపు టస్త్రపుఁ బాటవంబునం
బాయక ధైర్యముం జలముఁ బార్థు డు వీరుడు సవ్యసాచియే
యాయువు చెల్లఁగన్ గెలిచె నంతటఁ గర్ణు సుయోధనుం డనిన్ 28
[సుయోధనుడు = మంచి యుద్ధము నిచ్చువాడు]
వర్ణ చతుష్క ధర్మములఁ బాలనఁ జక్కగఁ జేయు వాడు నా
కీర్ణ యశో ధనప్రభవ కేళి విలాస విరాజితుండును
న్నర్ణవ తుల్య ధీర సుగుణావలి భాసిత ధర్మసూనుడే
కర్ణుఁడు చచ్చుటన్ విజయ కాంతను లక్ష్మిని బొందె రాజనిన్ 27
[లక్ష్మి = సంపద]
అవని ధనమున్న నింక క
లవె యధిపా డెప్పరపుఁ గరణ చయములు శై
శవ ముద భరితమ్ము లనగ
వివాహపుఁ బనులఁ దలచితివి కదా మదినిన్ 26
[డెప్పరము = అశక్యము]
పితృ సంకాశులు లేరిల
పితృ పాదమ్ములను శరణు వేడుము భక్తిన్
పితృ గృహమునఁ జలుపనిచో
పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్ 25
పితృ సద్వచన చయ మనో
వితృప్త సంతప్త చిత్త వివశాత్మ కృతా
వితృహీనునిం దృణీకృత
పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్ 24
[అవితృప్తుడు = తృప్తి లేని వాడు; అవితృహీనుడు = రక్షకుడు లేని వాడు]
పితరుని లలితపు టుదితము
లతి నుతములు గణితము లరయగ నియతములున్
వెతల విరతిఁ బతిత మయిన
పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్ 23
[నియతము = 1. నియమము గలది 2. నిత్యమయినది.]
నిరతము పూజనీయులు వినిర్మల మానస చిద్విలాసులుం
బరము లభించు సత్యము దివౌకసు లిద్ధర ప్రేమ తోయధిం
గరగుచుఁ దల్లి దండ్రులను గావగ నేరిన, విస్మరించినన్
వర పితృవాక్య పాలనమె పాపులఁ జేయును పుత్రసంఘమున్ 22
అబ్ధి మీన నిలయము రత్నాకరమ్ము
నడవి యౌషధ వృక్షరా జాకరమ్ము
శైల రాజము వరధాతు సంహితమ్ము
పంటల నొసంగని పొలము, పసిఁడి నిచ్చు 21
[పొలము = ప్రదేశము]
కంటిం జిత్రము లెన్న నేరమిక నౌకల్ బండ్లుగన్ మారెనే
తొంటిన్బండ్లు కలమ్ము లాయె నిట సంతోషమ్ము గల్గించుచున్
మింటిన్నంటు విమానయాన కరణన్ మిఱ్ఱైన వ్యర్థంపు టీ
పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే 20
ఏతరి నైన మానవుల కిద్ధర ధర్మ చరిత్ర మేలగున్
పాతక కార్య చిత్త సహవాసము కీర్తి వినాశ కారియౌ
భూతల మందు నున్న ఘన పూరుషు లర్కజ పార్థు లందునన్
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్ 19
[ఉత్తరుఁడు = అనంతరము చెప్పబడిన వాఁడు]
జాతక్షత్రియ వీరుడు
వీత భయభ్రాంతుడు జన విదితప్రౌఢ్యా
భూతిని నర సారథ్యపు
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే 18
వంత వడనేల యెల్లరు నింత పనికి
వృక్ష శాస్త్రవేత్త వెతలఁ బెట్ట నేల
భూరి విటప విస్తృతమైన భూరుహపు చి
గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు 17
బిరుదులఁ బెక్కు పొందుటను విద్యల యందున దిట్ట లౌటయున్
గరువము మిక్కుటంబయి వికారపుఁ జేష్టల నెల్లఁ జూపి యే
యొరిమిక లేకయున్ నిజ గురూత్తము నిందలఁ బాలు చేయు వా
గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్ 16
[వాక్ +ఉరువు = వాగురువు : వాక్కులందు విరివియైనవాడు ( వాచాలుఁడు );
ఉరువు = విరివియైనది]
భావ శబ్ద మహోన్నత వర్ణ నాతి
శయ విభావ వైభవ జిత సత్కవి గణ
తోషిత విబు ధాపూరమై, దూషిత సుర
గణ యతులు లేని, పద్యంబు గణన కెక్కు 15
[యతి = సన్న్యాసి; విభావము = రసోత్పాదనకారణము , పరిచయము]
గణుతి వహింప నెంచ నవికారము వ్యాకరణమ్ము నింతయుం
బణముగఁ బెట్ట కుండ ఘనపండిత భావ నిరంకుశేద్ధ ధో
రణులఁ బరిత్యజించి కవిరాజ వరేణ్యులు దోషదూషణల్
గణయతు లుజ్జగించిననె గారవ మందును పద్యకావ్యముల్ 14
ఉప్పు లేని కూర పులుసు పప్పు లేని
కూడు దిండు లేని పడక గూడు లేని
బ్రతుకు తోడు లేని కునుకు వెతల తోడ
గణ యతులు లేని, పద్యంబు గణన కెక్కు 13
[గణనకు = లెక్కకు]
బంధు మిత్రుల శుభకర భాషణములఁ
దల్లిదండ్రు లాశీస్సుల నుల్ల మలర
బ్రాహ్మణుల వేద సన్మంత్ర వచనము లమ
ర మణి యజ్ఞోపవీత ధారణముఁ జేసె 12
కలధౌతశ్రుతి మంత్ర భాషణము లోంకారప్రభూతమ్ములై
చెలగన్బాంధవ మిత్ర సంచయపు టాశీర్వాదముల్ మ్రోగగన్
నలినావిర్భవ వంశ జాతకుడు, నానందించగం దల్లి యా
యలరుంబోడి, ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్ 11
[కలధౌతము = అవ్యక్తమధుర ధ్వని]
సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక:
సదమల బుద్ధి భూతదయ శాంతము దాంతము గల్గి యుండినం
జదవని వాడె పండితుడు, సంపద గల్గిన వాడె బీదయౌ
మద ఘనలోభ మోహయుత మత్సర కామ విలోలతాత్ముడై
యుదరభరార్థ తప్త హృద యోద్విజమాన జనద్విషుం డవన్ 10
అబ్జజ కుల పౌలస్త్య వధాభిలాష
నలినజ ముఖామర వర గణాధిప ముని
వర సమాశ్రిత మధువైరి భక్త జన వ
శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె 9
ఈశ వరాన్వితాసుర వరేణ్యులు పాపులు ఘోర గోత్ర సం
కాశులు బ్రహ్మదత్త వర గర్వులు రావణ కుంభకర్ణ కీ
నాశుల నాశనార్థమున నందిత వాక్పతి దానవాంత కై
కేశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్థలిన్ 8
[శంకరుఁడు = సుఖమును గలుగఁజేయువాఁడు]
నేరక యన్యు వస్త్రములు నీటను ముంచినఁ దాప మొందుచుం
బారగ నేమి లాభము సభద్ర మనమ్మున శాంతుఁ జేయగా
గోరిన యార్ద్ర వస్త్రములఁ గోపము నందున నున్న వానికిన్
దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములం ద్యజింపుడీ 7
[ఉత్తములు = ఆర్ద్రములు; ధూర్తునకు + ఉత్తములు = ధూర్తున కుత్తములు : ధూర్తునకు తడిసినవి]
వర్తిలిచు నెల్ల వేళల
ధూర్తపుఁ గార్యములఁ బల్కుదు రసురు లిట్లున్
నర్తన విభవుం డభవుడు
ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్ 6
[ధూర్తుఁడు = శివుడు (సూక్ష్ముడు)]
వీరల రక్కసుల వలని
భారము మన భూమి దాల్చ వలెననఁ దరమే
తీరుటకు వెత లసుర సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే 5
దారుణ దానవ రాక్షస
శూరవర నిచయ భరిత వసుమతీ సుమహా
భార విదళ నాసుర సం
హారము లేకున్న నగు మహాప్రళయమ్మే 4
దూరి విరించి శౌర్యమునఁ దోరపుఁ గిన్క హరించి వేదముల్
నీరధి దూరి ఘోరముగ నేర్పు వహించిన సోమకాసురుం
జేరి వధించె నాహరియె శ్రీపతి నందిత దేవతా సమా
హారము లేకపోయిన మహాప్రళయమ్మె సముద్భవించెడిన్ 3

గురుభాషితములు నిజపితృ
సుర మోక్షద కార్య తతుల సువ్యక్తములుం
బరమ శమదంపు టధివా
సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్! 2
[అధివాసరము = శ్రాద్ధ దినమునకు పూర్వ దివసమునఁ
జేయు నుపవాసము]
పరిజన బంధు మిత్రగణ వందిత నేతల భాషణమ్ములం
దరతమ భేద రోదనలఁ దర్జన భర్జన రాజకీయు లా
గురు రవ దుర్భరమ్ములు నకుంఠిత కాలపరంప రానువ
దరతమ భేద రోదనలఁ దర్జన భర్జన రాజకీయు లా
గురు రవ దుర్భరమ్ములు నకుంఠిత కాలపరంప రానువ
త్సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్! 1
[అనువత్సరము = అయిదేండ్ల వత్సర చక్రములో నాల్గవ సంవత్సరము]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి