పొట్టఁ జీల్చి రాఁ గచునకు దిట్ట పఱచి
తండ్రి మరణించె, ముదమందె తనయ మిగుల
బ్రతికి యా కచుఁడు దిరిగి పరమ గురుని
నుద్ధరించ సంజీవని నుచ్చరించి 57
వినయము తోడ వేడఁ గడు వేదన నిండిన మానసమ్ముతోఁ
దనయకు నీయ ధైర్యమును ద్రాసము బాపెదనంచుఁ జెప్పగన్
జనకుఁడు, సచ్చెనంచుఁ, గడు సంతసమందెను కూఁతు రయ్యెడం,
దనదగు దుఃఖ మెల్లనికఁ, దల్చి మనోరథ సిద్ధి నెమ్మదిన్ 56
కంసారిని సద్భక్తిని
హింసా రహితమనియెంచి యిట్లడు గంగన్
సంసారమ్మునఁ “బాలయ
మాం” సాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్ 55
[స+ ఆహారమ్మె = సాహారమ్మె]
సంసారంబులు సాగుఁ జక్కగను సత్సాంగత్య ముండంగ వి
ధ్వంసమ్ముల్ భువి నేమి లాభము మనస్తాపమ్మునుం దక్కగన్
హింసాహీనము రోగ సంక్షయము సుమ్మీ సంతతమ్మున్ వినా
మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే 54
భారతావనిఁ గడు బావనదినము శ్రీ
రామనవమి పూజల నలరంగ
రఘుకుల తిలకుండు రాముండు జానకీ
పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున 53
[చీర = వస్త్రము]
ఆర్తిని శైవ కీర్తనము నంచిత రీతిని చేయుచుం దమిన్
వర్తన మందు తుల్య మట భామ కహల్యకు భక్తి నిచ్చి యీ
కార్తిక మాస పూజలకుఁ గాంచన వర్ణపుఁ బట్టు బట్టలన్
భర్తకుఁ, జీరఁ గట్టినది భార్య కడుంగడు మోద మందుచున్ 52
గారపు వాక్కులు తోడై
నో రలరఁగఁ బుష్పమాలను గళమ్మందుం
దీరుగను గుండియల్ జిను
గారఁగ నిండెల్ వలన బకారి వెలింగెన్ 51
[జినుఁగు = తళుకు; ఇండె = పూలమాల; బకారి = కృష్ణుఁడు]
తల్లడిలి సీతఁ గానక
యెల్లెడల వెదకఁగ లంక నిద్ధచరితఁ దా
నుల్లమున జగన్మాతనె
యల్లా! కరుణించు మనుచు హరి ప్రార్థించెన్ 50
[అల్ల = తల్లి; హరి = కపి, హనుమ]
చల్లంగన్ హరి కృష్ణు లిద్దరును సత్సాంగత్యమే సల్పగం
గల్లోలమ్ము చెలంగ నొక్కతరి దుఃఖంబెల్ల బాధింపగం
దెల్లం బెల్లరకున్ మహర్షి భగవద్గీతన్ భువిన్ వ్రాసె నా
యల్లా నం గరుణించు మంచు హరి తా నర్చించె సద్భక్తుఁడై 49
[అల్లు + ఆనన్ అల్లానన్ ; అల్లు = అల్లిక]
సమ్మతముగఁ బర వనితల
నమ్మ వలెఁ గనవలె నన్న ననుమానంబే
యిమ్మహి నిక్కము జనకుని
తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్ 48
ఇమ్మహితంపు టాకలికి నెవ్వరి వేడెద మంచు వా రర
ణ్యమ్మున సంచరించఁ గన నాశ్రమ మొక్కటి యంతఁ బల్కె రౌ
తమ్ముని భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగం
గమ్మని భోజనమ్మిట సుఖమ్ముగఁ బెట్టును గోరినంతటన్ 47
సీత కౌగిలించె శ్రీరామచంద్రుని
సీత ముద్దు పెట్టె భూతలమును
వింత నభము వీడి వేగ శివుని, వేడ
ముని, నుదుటను సీత ముద్దు లిడెను 46
[సీత = సీతా దేవి; నాఁగటిచాలు; ఆకాశగంగ]
మనమున నున్నకోరికలు మానుగఁ దీరఁగఁ దృప్తిఁ జెంది కా
నన ఘన దర్శనైషణ వనభ్రమణాశ ఫలింప సత్యమై
వనమున నుండి మైథిలి యపార పరాక్రమ విక్రముండు రా
ముని నుదుటన్ ధరాత్మజయె ముద్దు లిడెం గడు సంతసమ్మునన్ 45
ఘన బాహు బల పరాక్రమ
జనిత నినదముల సుఘోర సద్భట సమరా
వని శత్రువు నెదురిచి, పా
వని! తల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా 44
[పావని = భీముఁడు]
అనిశము సాధు రక్షణము నంచిత బుద్దిని నెంచి భూతల
మ్మున నిజ తేజ విక్రమ సముద్భవ భావము విస్తరిల్లగన్
దనుజ వరేణ్యు యుద్ధమునఁ దా మది నెంచక వేగ వచ్చు చా
వని, తల ద్రుంచువాఁడె కద బల్లిదుఁడై యశమందు నెల్లెడన్ 43
చిన్న పెద్ద యన్న విన్నఁదనము లేక
యాట పాటల ముద మంద భృశము
చదువు సంధ్య లలర సదమల వృత్త శై
శవము మోద మిడుఁ బ్రశస్తముగను 42
దివిజుల కెల్ల సంతతము దీవన లిచ్చెడి లోకమాతనున్
ధవళ పయోధి సంభవ సుధా నిభ కాయ విరాజమాన ను
న్నవిరళ భక్తి సంయుతము నర్చన సేయగ లక్ష్మినిన్ సకే
శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్ 41
సంతత విచార కర వి
ఘ్నాంతవ్యాపార భార కార్ద్ర హృదయుఁడే
యింతీ! యంబకు, వినుమా
కుంతీ! పుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే 40
ఇమ్ముగఁ బాండునందనుఁ డహీన పరాక్రమ సత్యవంతుఁడున్
వమ్ముగ జూద మాడి తన వారినిఁ గూడి చరించెఁ గానలన్
సమ్మతినిన్ విరాటునకు సచ్ఛరితుండు యుధిష్ఠిరుండు దా,
నమ్ముఁడు, కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్ 39
[వినాయకుఁడు = గురువు]
అక్త్ర సహస్రమ్ములు సహ
యోక్త్రాశ్వానేకములు రణోత్సంగమునన్
సేక్త్రాసృగ్ధారలఁ గన
వక్త్రంబుల్ పది కరములు పదివేలు గదా! 38
[అక్త్రము=కవచము; యోక్త్రము=పశువుల మెడపలుపు;
సేక్త్రము=బొక్కెన; అసృగ్ధారలు = రక్త ధారలు]
రుక్త్రాసమ్మది లేక యున్న నిల వీరుల్ క్లేశముల్ పొందరే
వాక్త్రాతల్ మది నీయు నాశల మయంబై యెల్ల యుద్ధావనిం
ద్వక్త్రాణాదులు నేలఁ గూలగను శస్త్రాస్త్రప్రయోగమ్ములన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వెయ్యగున్ 37
స్వంతము తాపసునకుఁ బ్రళ
యాంతక శస్త్రాస్త్రములు మహాత్ముడయిన న
య్యింతికిఁ జిక్కె నతివలకు
నెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్ 36
కుంతికి సూను లిద్దరును ఘోరపు శత్రువు లాది నుండియున్
బంతము బూని తల్చెదరు పన్నుగ నిట్లు మహా చలమ్మునన్
బంతుల నేయ నస్త్రములు జ్వాలలలో, విలువిద్య నం దతం
డెంతటి పండితుం డయిన, నిట్టె కరంగును వెన్నపోలికన్ 33
[బంతి = పంక్తి]
యౌగపద్యమున హృదయ మలర వలయు
శబ్ద భావోచితమ్ముల సరసముగ సు
గద్యమునయి హృద్యమునోర్మికా నిభ పద
యోగ మహిమ మద్యము ఘోరు నూరడింప 32
[యౌగపద్యము=ఏకకాలమందగుట; సుగద్యము = బాగుగా
చెప్పఁదగినది; హృత్+యమునా+ ఊర్మికా = హృద్యమునోర్మికా =
హృదయమను యమునా నదీ తరంగములు; మత్+ యముడు =
మద్యముడు (నాలో యున్న యముడు)]
అంక మందు నుండు శంక జంకులు లేక
రొక్క మున్న వాని పక్క యింక
బొంక నేర్చు నమ్మ పూబోడి నిరుపేద
వంక లేనిదమ్మ రంకులాడి 31
జింకలఁ జూచి నంతటనె చిత్తము నందు ముదంబు పొంగు నీ
పంకజ నేత్రకుం గరము పన్నుగ చూచుచు నాడు భామయే
శంక పడంగ నేల బహు సద్గుణ రాశియె యీమె సూడ నే
వంకలు లేనిదమ్మ పలు భంగుల రంకులు నేర్చు లేమయే 30
[రంకులున్+ఏర్చు=రంకులు నేర్చు; రంకు = తెల్లనివెండ్రుకలును
మెత్తనితోలును గల యిఱ్ఱి (జింక); ఏర్చు= ఎన్ను
లోక నుత చతుర్దశ భువ
నైకప్రాభవ కృపా గుణాన్విత సాల్లా
నేక సునాముఁడు విష్ణువు
పాకిస్తాన్ ప్రజలు విష్ణుభక్తులు శిష్టుల్ 29
[స+అల్లా+అనేక= సాల్లానేక; “అల్లా” దైవనామము.]
సాకుల్ సెప్పక మానసమ్మునను విస్తారమ్ము పూజింపగ
న్నేకాంతమ్ముగ నిచ్చు నున్నతి భువిన్నే దైవమైనం ద్రుటిన్
యేకైకమ్ముగ నుండ భారతమునం దెల్లన్, విసర్జించనా
పాకిస్తాన్ ప్రజలెల్ల, విష్ణువునకున్ భక్తుల్ సదాశిష్టులున్ 28
[పాకిస్తాన్ ప్రజలు విష్ణు నామాన్ని విసర్జించి యల్లా నామము నెన్నుకున్నా రన్న భావము.]
మీరి హరిణమ్ము తృణమును మేయు చుండ
నంత మృగరాజు కుప్పించి యారగించెఁ
గాంచి నంతనె సారంగ ఘాసము లట
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ 27
మచ్చం దెచ్చిరి దేశ కీర్తికిక సన్మానంపు గర్వమ్మునం
గచ్చెన్ గెల్చెను బంతియాట నిట బంగ్లాదేశ మా పౌరులే
మెచ్చంజూ పరులెల్ల భారతమునన్ మిథ్యోర్వి వర్తిల్లగం
జచ్చెన్ సింహము జింకచేత నకటా శౌర్యంబు వోనాడుచున్ 26
శ్రీమదాంధ్ర వాఙ్మ యామర ధామ భా
సిత కవి వర నివహ నుతుఁడు తృప్తి
నా బుధుండు రెడ్డి యమరు డయ్యెను గన
రె విజయమ్ము వడయ దివినిఁ గూడ 25
సాతివృష్ట్యనావృష్టి మహాపదలను
రైతు విలపించు, రాజ్యమ్ము రాణకెక్కు
వాని నాప నిరంతర మీ నరప్ర
భువులు యజ్ఞ యాగమ్ముల నవనిఁ జేసి 24
రైతులె యన్న దాతలు నిరంతర ధార్మిక కర్మ జీవులే
యే తఱి నైన వారి నవహేళన జేయగ రాదు సుమ్మిలన్
రైతులు దుఃఖ మందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే
యీ తఱి వర్జనీయమని యిద్ధర సత్వర మెల్ల వారికిన్ 23
కృష్ణుఁ దా వలచెను విష్ణువే యంచును
విష్ణు వయ్యె నపుడు కృష్ణ వర్ణ
రాముడని యెఱుంగు రమణి రాధా సతి
రాధికాప్రియుండు రావణుండు 22
[రాధికా + అప్రియుండు = రాధికాప్రియుండు]
పావన బంధ మయ్యది వివాహము నాడక యున్న నేమి సం
భావిత మెల్ల వారలకుఁ బార్థుని సారధి వాసుదేవుడే
దేవుఁడు సాత్వతీయుని వధించె వడిన్, శిశుపాలుఁ డన్న యా
రావణుఁడే కదా, వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్ 21
దిఙ్మండలమున హరి పద
యుగ్మము పూజింప నరుల కున్నతి కలుగుం
దిగ్మము కలిగించు నధమ
వాఙ్మయమున నున్నదెల్ల వ్యర్థము సుమ్మీ 20
వాఙ్ముఖ మేల నీయఁగ నపార కృపాన్విత చిత్త శౌరి పై
వాఙ్మయ ముండ మేలుగ సుభద్రము లీయ జనాళి కిద్ధరన్
దిఙ్మణి భూషి తామర విధేయ జనౌఘ విసర్జితమ్ము నా
వాఙ్మయమందు నున్నయది వ్యర్థము సుమ్ము పఠింపఁ గీడగున్ 19
పాటవమున ననుజుని తో
మేటి ముని వరు వెనుక పుడమి విభుండు సనన్
హాటక పత్రయుగ విలసి
తాటకఁ గని రాఘవుండు తన్మయ మొందెన్ 18
[విలసిత+ఆటక = విలసితాటక; ఆటకము = పిచ్చుక]
బోటినిఁ జంపఁ దా వెరసెఁ బూర్ణ శశాంక నిభాననుండు ముం
బాటుల నిచ్చు నిప్పడతి పాపము లేదన నుత్సహించె ఘో
రాటవి జీవరాశి,సుమహాసుర కాంతను వేగ చంప న
త్తాటకఁ జూచి రాఘవుఁడు, తన్మయ మొందెను మౌని మెచ్చఁగన్ 17
స్పష్టముగ నవసరమ్ము వి
శిష్టామల మనము జయము సేకుఱ నవనిన్
నష్ట మతి నికృష్ట వ్యస
నాష్ట వధానికి సమస్య లతి కష్టదముల్ 16
[సప్త వ్యసనాలకి కీర్తి కండూతి కలిపితే ఎనిమిది వ్యసనాలు.]
ఇష్టము తో నదృష్టమునె యెంచక మిక్కిలి దీక్ష తోడఁ దాఁ
గష్టము సేయ ధైర్యమునఁ గాగల వన్ని యనాయసమ్ములే
కష్టము కష్ట మంచు మది గట్టిగఁ దల్చినఁ గష్ట మౌను లే
యష్ట వధానికిన్ జటిలమౌను సమస్యల పూరణమ్ములే 15
పెద్ద మనసేల నిద్ధరఁ బేరు తోడఁ
దాత ముత్తాతల తన వద్ద ధనమున్నఁ
జాలి నంతగ నిక్కలి కాల మందు
నీతి రహితుఁడె జనులకు నేత యగును 14
కోతులు వీర లందరని కుత్సిత మానస మాన వౌఘ సం
వీత మటంచు నెంచకయె పేరిమిఁ జూపి ధనార్జనాబ్ధి సం
పాతము గాక దుఃఖములఁ బారక తాఁ గుటిలంపు రాజ దు
ర్నీతివిహీనుఁడే జనుల నేతగ గౌరవమందు నెల్లెడన్ 13
అమ్మ! గిరి తటీ విలసిత
సమ్మద వర కార కాంబ శంసావాచీ
నమ్మగునే ద్రోవది ని
క్కమ్ముగ దుఃఖమ్ము సెల్లు కారుణ్యవతీ! 12
[శంస = స్తోత్రము; అవాచీనము = తాఱుమాఱైనది]
ఆర్యా నాథుని వర బల
పర్యవసానమున సైంధవ మృగం బాపెన్
వీర్యోద్ధత కురు హరులన్
హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్!!! 11
హరిణ చమూరు వానర గజాహి గుహాశయ జంతు జాలమున్
హరి కలకంఠ గృధ్ర చట కాళి చకోర విహంగ రాజులన్
స్థిరముగఁ గాన నన్య మొక చిత్రపు భీకర సింహ రాజమున్
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్ 10
పార్థుఁడు కిరీటి విజయుఁడు ఫల్గునుండు
జిష్ణుఁ డర్జునుఁడు ఘనుఁడు శ్వేతవాహ
నుండు సవ్యసాచి ధనంజయుండు పాండు
సుతుఁడు భీభత్సుఁడు నరుఁడు శూర వరుఁడు
యాదవేంద్రు కృష్ణుని చెల్లియ ముదమున న
పాండు రాజు పెండ్లాడె సుభద్ర నపుడు 9
[అపాండురాజు = నల్లని రాజు]
మెండగు యాద వాన్వయ సుమీన నికాయ శశాంక రేఖ వే
దండ సమాన యాన ఘన తర్పిత విప్ర జనౌఘ తాల్మి భూ
భాండ నిభాంగనా పృథ నపార వివేక వతిం బతివ్రతం
బాండు ధరాధినాథుఁడు సుభద్రను బెండిలియాడెఁ గాంక్షమై 8
[సుభద్ర = శుభకరమయినది]
ఆ శ్రమజీవి కృషీవలు
డశ్రమమున లబ్ధమగు ధనాశ బృహత్పా
రిశ్రామిక వేత్తలకు
న్నాశ్రయము నొసంగి తా నిరాశ్రయుడయ్యెన్ 7
ఆశ్రిత వత్సలత్వమున నార్యులు భారత చక్రవర్తులే
మిశ్రమ దృష్టి వచ్చిరిట మ్లేచ్ఛులు వర్తక భావ మెంచుచున్
విశ్రమ మెల్ల చూఱగొని వింతగ నేలిరి భారతమ్మునే
యాశ్రయమిచ్చి తానిట నిరాశ్రయుడయ్యె నదేమి చిత్రమో!!! 6
అంశము - కైకేయి వ్యక్తిత్వము నిషిద్ధాక్షరములు - ఎ, ఏ, ఐ అను అచ్చులు,
ఈ అచ్చులతో కూడిన హల్లులు. ఛందస్సు - మీ ఇష్టము.
రాము డనిన యనురాగము మది నిండ బడతి చంద్రముఖి యశ్వపతి సుతకు
మంథర కలుషిత మానసవ్యధిత యా రమణి గిరివ్రజ రాజ తనయ
రాజ లాంఛనరత ప్రధన విశారద శిఖరిణి యా యుధాజిత్తు భగిని
స్వార్థ చిత్త పరమ చండి ముక్కోపిని పండిత మానిని భరత మాత
రాజ నీతిఁ దలచి రామునిఁ గంటక
హీన రాజ్య భోగ మిమ్ముగఁ బడ
యంగఁ బంపిన వనజాయతాక్షి ధరణి
దశరథ సతి సాటి తరుణిఁ గనము 5
ఊర్వశీ శాపమున పాండవోత్తముండు
పేడి యైనను వరమయ్యెఁ బాడి గాను
ద్రౌపదీ సుభద్రలకు భద్రమ్ము గాను
బిడ్డ లిద్దఱు పుట్టిరి పేడి వలన 4
అడ్డము లేక గర్వమున నచ్చపుఁ గండల విఱ్ఱ వీఁగినన్
బిడ్డలు గల్గ లేదు విధి వింతగ నాడుట గాక యే మగున్
గడ్డము మీసముల్ లవము గానని వానికి నంతఁ బెండ్లియై
బిడ్డలు పుట్టి రిద్దరట పేడికిఁ జూచి జనమ్ము మెచ్చగా 3
ఇమ్ముగ నను బెండ్లాడఁగ
లెమ్మమ్ముక్కంటి నేల లేమ వరించన్
వమ్ము నలయం దపస్సే
లమ్మా యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్ 2
అమ్మలఁ గన్న యమ్మను గజానను గన్న విశాల నేత్రనుం
బమ్మిన ప్రేమ పాశమునఁ బన్నగ భూషణు డగ్గికంటి లో
కమ్ముల నెల్ల భద్రముగఁ గన్నులఁ గాంచగ జీవరాశి కీ
వమ్మ యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్ 1 [రాశికి+ఈవు+అమ్మ =రాశికీవమ్మ]

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి