సంద్రము భంగి సాగెడిని సత్సమ రమ్మున మించి సూతవం
శేంద్రుఁడు కర్ణు పాతమున కింద్ర సుతుండు కిరీటి చంద్ర వం
శేంద్రుఁడు రాజ్య లక్ష్మి కొఱ, కెత్తిన భంగిని భవ్య సూర్య వం
శేంద్రుఁడు సీతకై, ధనువు నెత్తెను శల్యుఁడు మేలు మేలనన్ 55
అన్నపూర్ణ యంచుఁ దలతు రమ్మగువను
బేర్మి తోడ పిలిచి యింటఁ బెట్ట బువ్వ
స్వజనులు దినఁ దృప్తిగఁ గల్గు సంతసమ్ము
భక్ష్యముల నా ముదము తోడ వండఁ దగును 54
దనుజులతో శంభుఁడు యుద్ధము చేయు సందర్భము:
దంష్ట్రి దనుజ గురు దత్తా
దంష్ట్ర సదసిదంష్ట్ర తీక్ష్ణదంష్త్రాంకమ్ముల్
దంష్ట్ర యుత మడఁచి నాగపు
దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్ 53
[దంష్ట్రి = శుక్రుని పుత్రుఁడు; అదంష్ట్రము= దంతములు లేని;
అసిదంష్ట్రము= మొసలి; తీక్ష్ణదంష్ట్రము=పులి; నాగదంష్ట్రము= చూరు,
నాగము = సత్తు, తగరము]
ఘనబాహుఁడు హరివక్షపు
వనజాక్షుఁడు సుప్రియాస్య భాసిత తేజు
న్నన విలుకాని సముని రా
మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్ 52
వామనయన గణముల పె
న్గాముం డెనుఁబోతు, విఘ్ననాథుఁడు కపియౌ
నీ మనుజుల కెల్లఁ గొలువ
వేమరు మది భక్తి నిల్పి వినయంబలరన్ 51
[కపి = విష్ణువు]
యేమని నమ్మ నేర్తు నితడే నిజ మారుతి యౌననంగ ము
న్నే మహి వింటి రాక్షసులు నేర్పున రూపములన్ ధరింతురే
యా మహితాసురుండు దమి నౌనికఁ దాల్చగఁ గామ రూపము
న్గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్ 50
రయము - భయము - జయము – నయము
పై పదాలను ఉపయోగిస్తూరామాయణార్థంలో:
శరణార్థుల కాశ్రయము రు
చిర మనయ ముదేజయము నిశీథ చరుల కె
ల్ల రఘు వరోభయము సు దిన
కరాన్వయ దినేశ రాత్రికర నిభ వీరుల్ 49
[అనయము = సతతము; ఉదేజయము = వడకించునది]
ఆద్య మగ్ని వైద్యమ్మిటు లను జనులక
శేంద్రుఁడు కర్ణు పాతమున కింద్ర సుతుండు కిరీటి చంద్ర వం
శేంద్రుఁడు రాజ్య లక్ష్మి కొఱ, కెత్తిన భంగిని భవ్య సూర్య వం
శేంద్రుఁడు సీతకై, ధనువు నెత్తెను శల్యుఁడు మేలు మేలనన్ 55
బేర్మి తోడ పిలిచి యింటఁ బెట్ట బువ్వ
స్వజనులు దినఁ దృప్తిగఁ గల్గు సంతసమ్ము
భక్ష్యముల నా ముదము తోడ వండఁ దగును 54
దంష్ట్రి దనుజ గురు దత్తా
దంష్ట్ర సదసిదంష్ట్ర తీక్ష్ణదంష్త్రాంకమ్ముల్
దంష్ట్ర యుత మడఁచి నాగపు
దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్ 53
[దంష్ట్రి = శుక్రుని పుత్రుఁడు; అదంష్ట్రము= దంతములు లేని;
అసిదంష్ట్రము= మొసలి; తీక్ష్ణదంష్ట్రము=పులి; నాగదంష్ట్రము= చూరు,
నాగము = సత్తు, తగరము]
వనజాక్షుఁడు సుప్రియాస్య భాసిత తేజు
న్నన విలుకాని సముని రా
మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్ 52
న్గాముం డెనుఁబోతు, విఘ్ననాథుఁడు కపియౌ
నీ మనుజుల కెల్లఁ గొలువ
వేమరు మది భక్తి నిల్పి వినయంబలరన్ 51
[కపి = విష్ణువు]
యేమని నమ్మ నేర్తు నితడే నిజ మారుతి యౌననంగ ము
న్నే మహి వింటి రాక్షసులు నేర్పున రూపములన్ ధరింతురే
యా మహితాసురుండు దమి నౌనికఁ దాల్చగఁ గామ రూపము
న్గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్ 50
పై పదాలను ఉపయోగిస్తూరామాయణార్థంలో:
శరణార్థుల కాశ్రయము రు
చిర మనయ ముదేజయము నిశీథ చరుల కె
ల్ల రఘు వరోభయము సు దిన
కరాన్వయ దినేశ రాత్రికర నిభ వీరుల్ 49
[అనయము = సతతము; ఉదేజయము = వడకించునది]
వేద్యము నవద్య వచన మబేద్యముగ క
ర మభినంద్యమును ననవద్య మగును సుమి
“మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను” 48
మద్యము బుద్ధి నాశకము మానుట మంచిది యెల్ల వారికిన్
వైద్య వినీత కర్షక సుపండిత యంత్ర వరజ్ఞ సంఘ మీ
మద్యముఁ గ్రోలు, మానవుఁడె మానిత కీర్తి గడించి మించురా
విద్యయు లేక యున్నను వివేకము గల్గి దయార్ద్రు డైనచో 47
రాక్షసవరు లంత రామ బాణ
హతులు రక్త యుత భటాంబుధి సక్షుర
ప్రేమ పొంగి పొరలె వీథు లందు 46
[స క్షురప్ర + ఈమ = స క్షురప్రేమ; క్షురప్రము = అర్ధచంద్రబాణము;
ఈమ = పుండు; అర్ధచంద్రబాణముల తో నేర్పడిన వ్రణములతో కూడి]
ఏమని చెప్ప నేర్తు నిక నీ విష యోద్ధతి దేశ పౌరులే
తామట మూడు రంగుల పతాకము నూపుచు సంతసింపగా
నామని వోలె తోచె నట నాడగఁ బాడగ దేశ గీతముల్
ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్ 45
అమలిన మాత్మ విలయ హీ
నము పరమాత్మఁ గదియంగ నర్తించుఁ దమిన్
సమయ సమాగతమునఁ గా
యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్ 44
[కాయము = శరీరము]
తమ తమ భోగ భాగ్యముల దర్పము మీఱఁగ సంచరించుచున్
సమద కళేబ రార్థము భృశమ్ము నలంకృతి సేయ నొప్పునే
క్రమముగ వారి వారి తుది కాలము సూచుచుఁ జేయు కాలు గా
యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా 43
సతి కుంది యిక భరియించఁ జాలక దుఃఖా
వృత మనమున ఘోరపు టా
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్ 42
[ఆపతి =ఆపద]
సతతము మాకు నండగ విచారము లెల్లయు బాప నేర్తువే
పతితము ధార్త రాష్ట్ర కృత పాప విచారము ఘోర మీ దురా
గతమున నుండి కావు మని కంస నిషూదనుఁ గృష్ణు రుక్మిణీ
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్. 41
[పార్వతి = ద్రౌపది]
నాతుక యంజన మ్రొక్కఁ గి
రాతికిఁ బుట్టినది కోఁతి రాముని వలెనే
వాతాత్మజుఁడు సహస్రము
లా తిమిర చరుల వధించె నాశ్చర్యముగన్ 40
[కిరాతి = పార్వతి]
నాతుల ధాత్రి నెల్లఱ ననాథులఁ జేసి హరించి మౌని సం
ఘాతము దల్లడిల్లగను గర్కశ బాధల ముంచు బ్రాహ్మణా
రాతి వరాతి దర్ప బల రావణ సంహర ణార్థ ముత్ప లా
రాతికిఁ గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్ 39
అండ నిచ్చు చుండ ననిలుండు మెండుగ
వెండి కొండ నుండ కుండ వెండి
వెండి తిరిగి కడలిఁ గొండపరుఁడు సూడ
కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు 38
[కొండపరుఁడు ఇంద్రుఁడు; మంచుకొండ కొడుకు = మైనాకుఁడు]
కొండ శరాసనుండు మఱి కొండకు నల్లుఁడు శంభు డంబరీ
షుండు త్రిలోచనుండు శిత శూల ధరుండు పురారి సుప్రసా
దుండు శివుండు దూఱె నట తొఱ్ఱ భయమ్మున వక్రుఁ జూడగం
గుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే 37
వీరలఁ గ్రమముగఁ జూడగ
నేరికి నైన ననునిత్య మిలఁ దలపంగన్
మారరు విన రరులు గురులు
క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా 36
ఘోరంబౌ బహుమాన దానము లిలన్ గుప్పించి మోసమ్మునం
దోరంబౌ ముడుపుల్ భువిన్నొసఁగుచుం దోడ్పాటునుం గోరుచుం
గీరమ్ముం బసఁ బల్కి చేయఁగను వే కీడుల్ నరశ్రేణికిం
గ్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా 35
విధమున ములుగుచు దలచెర బిసరుహ నయనుం
గుధర ధరు ద్రుపద విభు సుత
విధికృత మరయ విఫల మయి వినయముగ మదిన్ 34
నాశఁ జెంద నన్యాయంపు టాస్తి కనుచు
సార్థకంబై పఱంగఁగ సత్యముగను
జన్మదిన మంచు నిడఁ దగు శాపములను 33
[శాపము = ఒట్టు]
పాపము నీళ్ళు లేక జన వారిధి శోషిలి యుండ వచ్చునే
నీ పరిపక్వ భావముల నేర్పున గూర్పుము సౌఖ్య శాంతులం
గూపము లేవి లేవనుచుఁ గోరిరి కేంద్ర దయా విభాజి తాం
శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్ 32
[విభాజిత+అంశ+ఆపము = విభాజితాంశాపము]
పద పదమున పరిపాలన
వదలని మదిని ముదిమి తను వరియించిన యీ
ముదురు వటువు జనకుండే!
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్! 31
కదలక కూరుచుండి మమకారపు మిత్రుని వేడ నివ్విధిన్
మదిని హరించు హాస్యము సమర్పణ సేయు మనంగఁ బల్కె దాఁ
బదపద చూడఁ బెండ్లినికఁ బార్థివు లెల్లరు రాఁ జెలంగగన్
ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్! 30
కట్టి నట్టి పుట్టమ్మికఁ గట్ట నన్న
వదలని మదిని ముదిమి తను వరియించిన యీ
ముదురు వటువు జనకుండే!
ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్! 31
కదలక కూరుచుండి మమకారపు మిత్రుని వేడ నివ్విధిన్
మదిని హరించు హాస్యము సమర్పణ సేయు మనంగఁ బల్కె దాఁ
బదపద చూడఁ బెండ్లినికఁ బార్థివు లెల్లరు రాఁ జెలంగగన్
ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్! 30
మట్టి ముట్ట నెప్పట్టున మెట్టి నింట
చుట్ట మెట్టి దిట్టగు మొట్ట వట్టి గట్టి
పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు 29
క్రూరులు వన్ను వ్యూహములు కుంభిని సత్ఫలితమ్ము లిచ్చునే
వీరులు ద్రోణ భీష్ములు నభేద్యులు దుర్గతి జెందరే యనిన్
ధారుణి కౌరవాన్వయులు ధర్మము దైవ బలంబు లేనిచో
నోరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో 28
నాతి నొకర్తిని నెత్తినఁ
బ్రీతి మరియొక తరలాక్షిఁ బెట్టెను లోకా
తీతముగ నర్ధ తనువున
సీతా! పతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ 27
ధాతౄక్థంపు బలుండు రావణుని బాధం బార్వతీ నాథుడే,
సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా, శ్రీకంఠుఁడే శంభుఁడే
ప్రీతిం దీర్చును భక్తవత్సలుఁడు సంవేదమ్ము పౌలస్త్యు ద
ర్పాతిప్రాభవ కారణం బిదియ సత్యంబయ్య విశ్వమ్మునన్ 26
[ఋక్థము = పితృధనము; త్రిమూర్తుల ప్రస్తావన వచ్చినది యాదృచ్ఛికముగా!]
పూని చరించుచు గుంపుల
మానుగ మృగ విహగ కాయ మాంసాహారుల్
కానన నివాసులే పలు
కానరు కాకులను నేఁడు గానలలోనన్ 25
[పలుకు = ముక్క; ఆను = తిను]
వానలు రక్త ధారలగుఁ బమ్మఁగ నెల్లెడ దోష వాయువుల్
వీనులఁ జించు జీవముల పేల్చును నింగిని ఘోర శబ్దముల్
మానవు కాల్చఁ బక్షులఁ బ్రమాదపుఁ గాంత తరంగ జాలముల్
కానరు కాన లందునను గాకుల నాకుల చాటు నందునన్ 24
[కాంతము = ఱాయి/ అయస్కాంతము]
అన్న! ముదితను గని తోఁప నగునె సభకు
నంత సమ్యగంజిష్ఠ్వాభ కాంతి కాంతఁ
జావఁ దలతురె భీముఁ జేఁ జేవ దఱిఁగి
కాన దైవోపహతులకుఁ గలదె దారి 23
మద్య పానానలము నందు మాన లాభ
మందఱకు శ్రేయమగు, దీని నడ్డు కొనిన
చెడుపనియె సుమ్ము, మద్యనిషేధ మిడుట 22
అడుసది త్రొక్క నేల మరి యంఘ్రుల క్షాళన మేల వింతగం
గడు కఠినమ్ము నైన నికఁ గల్లును గాచుట మాన్పనొప్పగున్
వడి సృజియింప నొప్పుకొన బాడియె కావున మాన్పు సృష్టియే
చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్ 21
సాగునె ధర జీవ కోటి చలనము దలుపన్
భోగములఁ గించ పఱచుచు
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ 20
ప్రోగులు ప్రోగులుం గవితలున్ మతి హీనుల భావ జాలముల్
వేగమ ముంచు చిత్తమును వెఱ్ఱి తలంపుల నర్థ శూన్యమై
తూగవు దుష్ట మానవుల తోరపు వ్రాతలు దల్పనెందునుం
భాగవతమ్మునుం, జదువఁ బాప మపారము చేకుఱుం జుమీ 19
ర రుతచ్ఛందస్సుబద్ధ రమణీయ కవీ
శ్వర వినుత పరాజిత కుక
వి రసంబగు రచన యొప్పె వీనుల విందై 18
[రుతము= ధ్వని; రసంబగు =నవ రసములతో నున్న]
పరమును గోరి బమ్మెర సువంశజ పోతన సత్కవీంద్రుఁడే
కరివర పాలకుండు హరి కైటభ వైరి చరిత్ర వ్రాయగన్
వరకవి సన్నుతమ్మును సభావ ముదాత్త పదార్తవంపుఁ దా
వి రసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్ 17
మిష్టిగ నుండిన జనులు సమీప్సిత దినమై
కష్టములఁ దీర్చు నేకో
నాష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్ 16
[ఏకోనాష్టమి = సప్తమి]
అష్టమి నాడు సేయుదురు హ్లాదముగా జను లాయు ధార్చనల్
కష్టము దీర్ప నష్టమినిఁ గల్గెను గృష్ణుడు ద్వాపరమ్మున
న్నష్టమి యన్న నేల నిల నందరి కింత భయంబు దెల్పవే
యష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే 15
శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే
శుకునకు పినతండ్రి మురియ
సకల జన సమక్షమునను సంతోషముగన్ 14
శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్
వికటంబౌ వచనమ్ము లాడఁ దగునే భీష్ముండు సూడంగ తం
డ్రి కుమారుం డగు వ్యాస నందనుఁడు సంప్రీతమ్ముగన్ ధాత్రినిం
బ్రకటంబే యిది యెల్ల వారలకు సద్బాంధవ్యముల్ దల్చవే 13
విద్యాధికుఁ డొకడు తేనె వీడి యపరముం
జోద్యమ్ముగఁ గొని పల్కెను
మద్యమె బలవర్ధకమ్ము మనుజుల కెల్లన్ 12
[మధువు = తేనె, కల్లు]
ఆద్యము చిత్త దేహముల కంచిత పోషక పాన భోజ్యముల్
చోద్యమ దేమి కర్మ మది చూడరు నేటి జనుల్లవమ్ము సం
పాద్యములే బృహద్రుచిర పాన విశేషము లందు వీడ నీ
మద్యమె మానవాళికి సమంచిత బుద్ధి బలమ్ము లిచ్చురా 11
మారు ప్రశ్న లేల మగఁడ! మొదటి
యావు పాలె యింక యపరంపు గోవు కా
దున్నపాలు పిండ దుత్తఁ దెమ్ము 10
[కాదు+ఉన్న =కాదున్న]
వెన్నును జూప నేరని సుభీమ పరాక్రమ భీమ పార్థులన్
సన్ననఁ జేసి కౌరవుఁడు సంధికి నొప్పఁడు యుద్ధ భూమినిం
గ్రన్నన గెల్తు రంట యిక కాలుని యింటికిఁ బంపు వారఁ టే
దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్ 9
నాట్య మయూర నిభ ప్రా
కట్యాంగిక రీతులలరు కన్యన్ నిష్కా
పట్య తరుణిఁ గాంచగ నై
కట్యమున మనం బలరదె కమనీయముగన్ 8
ఏల కానఁ దర్కము శిరో ౽ హితము నేల
కానఁ దర్శించు శయనంపు ఘస్ర మనుచు
దళ శిఖి హరికి ముర దైత్య దళనమునకు
శివ మిడంగ నేకాదశి యవని వెలసె 7
జకచకఁ బరువెత్తి సాగి సాగి
నీరుకట్టె పాము నీటఁ గాంచి తివిరి
కట్లపాము చేరి కౌగిలించె 6
పరవశ మంది యాటలను బాటల నింపుగ నుండ నద్దరిం
దరుణి యొకింత దూరమునఁ దక్షకుఁ బోని భుజంగముం గనెం
గరము భయమ్మునన్ వణఁకు కాంతను బేరిమి నూఱడించఁ దా
స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా 5
[పాము దరి = పాము కల యొడ్డు]
సాచివ్యం బది చిరముగఁ జన నోములనే
నోఁచ శతసహశ్రోత్తర,
తోఁచె సమస్యల గణన, చతుర్వింశతియై 4
అరయఁగఁ జిన్న నాఁడు వల దన్నను గల్గును విద్దె యాతనల్
పరువము నందుఁ జూడగను బట్టుఁ గుటుంబ విచార భారముల్
తరుణమె చూడ వార్ధక సుధారణ నమ్రుల కీయ పూరణల్
యిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్ 3
గతచేతనుఁ డసిత భీమ కాయ వికారా
తత కటుఁడే ముమ్మాటికి
నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే 2
మతిసెడఁ బెట్టి రందరిని మానస రోగుల వైద్యశాల లో
నతులయి పాఱ నందరు ఘనమ్మని యెంచుచు సప్త రోగులే
గతి తెలియంగ వారిది యొకండటఁ జూపుచు వారిఁ బల్కె ని
ట్లితఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి