అత్యధికమైనను దలఁచ
మృత్యు సమంబైన నేమి మీఱఁగ ధృతినిం,
బ్రత్యవమర్షము మన కను
నిత్యముఁ గావలె, సమస్య నెమ్మది గలుగన్ 54
భృత్యుల వోలెఁ గాంచఁబడ వేసరి పోరఁగఁ గల్గె స్వేచ్ఛయే
యత్యణ కోష్ణ కల్పిత వరాట్ట సుచోదిత యంత్రరాజముల్
సత్యపు దీక్ష భారమున సాధిత మయ్యెను భారతమ్మునన్
నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా 53
[అత్యణక+ఉష్ణ= అత్యణ కోష్ణ: అత్యల్పోష్ణోగ్రత; అట్టము = ఇంధనము;
రష్యా దేశము ఋణో ష్ణేంధన యంత్రముల (Cryogenic engines)
నాపిన మన దేశము లోనే కనిపెట్టితిమి.]
దేవ కార్య మెంచి దేవేంద్రు పనుపున
మన్మధుండు సేయ మంచి పనినిఁ
బార్వతి తప మెల్ల ఫలియించ మనువయ్యె
వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ 52
[భీష్ముఁడు = శివుఁడు]
క్రన్నన నేగి కాశికినిఁ గాంతు సభాస్థలి రాజకోటి వి
చ్ఛిన్నము సేసి యంబికను జిన్న సహోదరి నిచ్చి నెమ్మి తాఁ
బిన్న విచిత్రవీర్యునకుఁ బెండిలి సేయుచు నుండ హస్తినం
బిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్ 51
[భీష్ముని పెండ్లి = భీష్ముఁడు చేయు పెండ్లి]
రాముఁ డన్న భృశము భక్తి రామ కీర్త
నలను దనరు నిరంతర మిల నతండు
కష్టములు ముప్పిరిగొనఁగఁ గరము వ్యాజ
నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె 50
సుందర తన్వి పార్వతి విశుద్ధ తపమ్ము మహేశ్వరేచ్ఛతోఁ
గందర శోభి తాగమునఁ గందుచు మేఁ గృశియించఁ జేయఁగన్
డెందము నందుఁ బ్రేమ పురడించఁగ ధూర్జటి శంభు నందు ము
న్నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్ 49
సంసార జనిత దుఃఖపుఁ
బాంసువున మునుగుచు మోయ బాధ్యతలను దా
నంసమునఁ చింత, ధనమున,
సంసారికి, లేని చింత సన్యాసి కగున్ 48
[సంసారము = పుట్టుక); చింత (వగపు) సంసారికి,
ధనమున లేని చింత (ఆలోచన) సన్యాసికి]
సంసిద్ధిన్ మది సంతతమ్మరసి సంసారమ్ము నొల్లం డిఁకన్
హంసోత్తంసుఁడు నిత్య యోగ రతుఁ డత్యారాతి షడ్వర్గ వి
ధ్వంసానంద విలోల మానసుఁ డిలన్ భార్యా సుతార్తుల్ మహా
సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ 47
[చింత = ఆలోచన]
జీతము వారము వారము
నే తరి విడువని విధముగ నీయగ నిఁక సం
ప్రీతిగ ననునిత్యము నెల
జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే 46
వేతన మిత్తు రెల్లరును విత్తము మాసపు టంత మందునన్
భాతిగఁ జేయువాఁడ నిఁకఁ బన్నుగ నిమ్మన రొక్క మంతయున్
నీతి యనంగ వచ్చునె కనీసము ముట్టక యాయుధమ్ము ముం
జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే 45
నే రాధ సఖిని సీతను
ఘోర విరహ వహ్ని భృశము గూర్కొని యచటన్
నీ రాధ వేచి యున్నది
రా రమ్మని పిలిచె సీత రాధాలోలున్ 44
తారావ్రాత పరీవృతేందు ముఖు నిత్యానంద చిత్తుం గృపా
పారావారుని సత్య భవ్య గుణ సంపద్రాఘవున్ హర్షణా
పూరోల్లాస తటిల్లతా నిభ ముఖోత్ఫుల్లప్రభా దర్శనున్
రా రా రమ్మని పిల్చె సీత యెలమిన్ రాధాప్రియుం జెచ్చెఱన్ 43
[రాధ = మెఱుపు; మెరుపు వంటి సీతాముఖ ప్రియుడు]
సంధి మేలు సేయు శత్రు వధికుఁ డైనఁ
బోరు నందు గెలువ వీరుఁ డింకఁ
దలఁప వలయు బలము తనదు శక్తికి మించి
లెక్క యెక్కువైన లేదు సుఖము 42
[లెక్క =లక్ష్యము]
దక్కదు నిద్ర చక్కగను దక్కును నమ్మిక ప్రక్క వారిపై
దిక్క రయంగ దుర్లభము తెక్కలి కానికి చిక్క నిద్ధరన్
మక్కువ యేల నిక్క మిది మానవ లెక్కలు పిక్కటిల్లగన్
లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్ 41
నేత్రము లందు మెఱయఁగఁ బ
విత్రము కలధౌత మా చెవిని చిత్తమునం
దాత్రము సెలంగఁ గైకొనఁ
బుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్ 40
[పోఁగు+ఆలము = పోఁగాలము: కర్ణాభరణము కొఱకు పోరు
( చతుర్థీ తత్పురుష); పోఁగు = చెవి పోఁగు]
చిత్రమ్మే సుమి యౌవనమ్మున నిజ స్తీర్వి ప్రభావమ్మునం
బాత్రాపాత్రము చింత సేయక ధరన్ వర్తించి మోహమ్మునన్
గాత్రం బెల్ల కృశించి చిత్తమున సంఘాతమ్ము కన్పించగం
బుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్ 39
[సంఘాతము = నరకము]
సతి నగుమోము నరసి మో
హితుఁడయి పతి దేవుఁ డట నిజేప్సిత కాంతన్
సుతుఁ దాఁ జూడక మోటుగఁ
బతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్ 38
మతి చలియింప కుండునె యుమాపతి కైనను విష్ణుమూర్తి యే
యతివగ మారి దర్శనము నద్భుత సుందర రీతి నీయ నా
యతులిత మైన రూపవతి నచ్చట మోహినిఁ గాంచి యంబి కా
పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో 37
ఈ మహి నొకఁడు సహస్ర భు
జామిత బల దర్పితుండు యదు వంశ మహా
సోమ కృతవీర్యుని రతా
రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్ 36
[రత+ఆరాముని =రతారాముని: ఆరామముల నాసక్తి కలవాడు;
అర్జునుడు = కార్తవీర్యార్జునుఁడు]
రాముఁడు భీమ భార్గవ విరాముఁడు విశ్రుత ధన్వి భండనో
ద్దాముఁడు లక్ష్మణాగ్రజుఁడు దైత్య మృగేంద్రుఁడు దేవ సంచయ
స్తోముఁడు రామ చంద్రుఁ డఘ దూరుఁడు జానకి భర్త, కాదె యీ
రాముని పుత్రుఁ డర్జునుఁడు, రావణు గెల్చె రణాంగణమ్మునన్ 35
[అర్జునుడు = ఏకైక కుమారుడు]
వింతఁ గొలుపు మయసభ నవ్వినది, గాంచి
దుష్ట దుర్యోధనుని, భార్య ద్రోవది గద
పాండు పుత్రులకును దానఁ బడసె నష్ట
కష్టములు భార తాజికి కారణ మయి 34
నష్ట ఝషంపు ఖ్యాతిని ఘనమ్ముగ వెల్గ సభాంతరమ్ము ని
శ్చేష్టుని కర్ణ సంయుతము సేయఁగఁ బల్గుణుఁ డా నిరంత రా
వేష్టుఁడు నిత్య మత్సరుఁడు భీకర పాండవ శాత్రవుండు నా
దుష్ట సుయోధనున్, వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్ 33
తీర్చ వలె నలుకల నెల్ల మూర్చ రాఁగ
దించ వలె బడిఁ బిల్లల నంచితముగ
సంతకుఁ జని కొనవలె వారాంత మందు
నెంతయో యనుకొంటి మీ రింతె యంద్రు 32
[స్త్రీ పురుష భేదము లేక వర్తించు పూరణ]
సంతత మింత ద్వేషమున సంతుల నింతుల బుద్ధిమంతులం
బంతము వూని వింతగను వంత లనంతము జాలి లేక ర
వ్వంతయు జేయ స్వంత మగు ప్రాంతము లందు నిశాచరుండు నే
నెంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే 31
ఘోర వికృతాస్య తాటక
సారంగ సహస్ర సదృశ సత్త్వ వన జనా
పార పరితాప కపట వి
శారదయే బలిగొనెఁ గద జను లెందరినో 30
దారుణ మయ్యె నక్కట ప్రధాన పరిశ్రమ కారణమ్మునన్
భారత మందు నొక్క తరి భ్రాజిత సుందర పట్టణమ్మునన్
ఘోర మహా రసాయనము క్రూరముగం బ్రసరించ వేగ ని
శ్శారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై 29
[నిః+శార+ద= నిశ్శారద =గాలినివ్వనిది; శారము =వాయువు (ప్రాణ వాయువు)]
అనురా గోద్యాన వనినిఁ
జను ప్రియులకు శారదేందు చంద్రిక మదికిం,
గనలెడు తరి విరహములో
ననలమ్మే సుమ్మి, చల్ల నైనది యిలలో 28
పని గొని ముక్క ముక్కలుగఁ బల్కుట మక్కువ యైన వానినిం
గని యొక ప్రశ్న వేసె నొక గౌరవనీయుఁడు వేగఁ దెల్పుమా
యనలము మంచు గుబ్బలికి నంతర మేమి యనంగఁ బల్కెఁ దా
ననలమె సుమ్మి, చల్లన మహా హిమ శైలము, వేడి యీ భువిన్ 27
దూరము వడిఁ జని చని కే
దారమ్మునకు సరసన లతాభవములతో
నారయ నింపుగఁ దన ముం
దారము, పై వ్రాలెఁ దేఁటి త్రాగఁగ మధువున్ 26
[ముందు+ఆరము = ముందారము: ఆరము = ఉద్యాన వనము]
వారిద దత్త నీరములు పాఱఁగ వెల్లువలై చెలంగు నీ
ధారుణి యం దపారము నదమ్ములు ప్రాణి హితమ్ము లౌచుఁ గా
సారము నందు తామరస షండము లల్లన దోఁచగన్ మహో
దారము, పైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్ 25
శివస్తుతి న్యస్తాక్షరములు... అన్ని పాదాల
యత్యక్షరాలు వరుసగా "శి - వ - రా - త్రి" ఉండాలి.
శ్రీద మాఘ కృష్ణ చతుర్దశి దిన మా య
మరవర యుత శివానంద వరద నిత్య
ధామవర శివ భవ్య విరామ సద్గ
తినిఁ బ్రసాదించెడు శివరాత్రి శుభకరము 24
విను వారును నుడివెడు వా
రును గర మరుదు సుహితము లురుతర కటువులై
నను వచనములఁ బ్రియ తరము
లనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ 23
ఘను లీ రాజులు రాగ తామస గుణైక భ్రాజమానుల్ సుమీ
కన శక్యంబె మనో గతమ్ములను నాక క్ష్మాధి నాథుండునున్
స్వన గాంభీర్య విరాజిత ప్రణత సత్సంభావ్య వాక్కుల్ పరా
గనృతమ్ముల్ గడు నేర్పునం బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్ 22
[పరాక్ + అనృతమ్ముల్ =పరాగనృతమ్ముల్: అనృత బాహ్యములు]
వేసరకు చూచి వీటిని
నీసను జెందకు మదృష్ట హీన యయినచో
నే సతికిని మోచేతిని
మీసములం గనఁగఁ గలమె మేదినియందున్ 21
ఆసను రాఁ జతుర్దశ సహస్ర వరాసురులన్ వధించి వే
ద్రోసితి వీవు ఘోర ఖర దూషణ దైత్యుల నంత కావికిన్
భాసిత భాస్కరాన్వయ నభస్తిలకా రఘువంశ వర్ధనా
మీ సములం గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్ 20
కొలు వది కలవా రెల్లరు తెలుఁగు నేర్చి
మాతృ భాష సేవకుఁ బూన మాన్యు లయ్య
కలత యేలయ యిటులెంచి తెలుఁగు నేర్చు
కొను మనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి? 19
కలవర మంద కయ్య యిటఁ గమ్మగఁ బాడఁగ నేరి కైన పా
టల నిలఁ గష్టమే కటకటంబడి కావలె సత్వరమ్ము నీ
కలఘు తరస్వరంబు మఱి యందుకె,గానపయోధి చాల లో
తెలుఁగును నేర్చుకొమ్మనుట, తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే 18
[లోతు+ఎలుఁగు =లోతెలుఁగు; ఎలుఁగు = కంఠస్వరము;
తేలిక(న్) =తేలికగా; ఇత్తురే = తప్పక యిచ్చెదరు]
అంకిలు లీయ సుజనులకు
మంకుతనమ్మున దివిజ సమాన బలుఁడు ని
శ్శంకం గల్మాషులకున్
సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే 17
విమలద్యోత మహావతారమె గదా, విష్ణుండు సాక్షాత్తిలం
గమనీయమ్ముగఁ గృష్ణుఁడై కడుకొనంగన్, రౌహిణేయుం డటన్
స్తిమితం బిచ్చి మహార్త చిత్తమునకున్ శ్రేయమ్ములం బ్రేమతో
సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్ 16
[సంకటములన్ = సంకటములందు]
చక్కని చుక్కవు మక్కువ
మిక్కుట మక్కజము నీకు మీరగ నలుకే
వెక్కస మైతినె నే నిట
నక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్ 15
[అక్క = ఔర]
మక్కు వయ్యెను నిన్ను జూడఁగ మానసమ్మున నెన్నడుం
జిక్క వైతివి సుద్దు లెల్ల వచింప నింపుగ నింతలో
నక్కజమ్ముగ వచ్చి యింటికి నంతలోననఁ బోదువే
యక్కరో యిటు రాఁగదే యని యాలిఁ బిల్చెను భర్తయే 14
ఏరు - పారు - ఊరు – మారు
ఊ రుత సంగీతము లే
పారును లేమా రుజలవి పాఱవు కాంచన్
మారుతమున నెన్నండును
బైరులకై యేరువాక పల్లెల సాగున్ 13
మేటి యవరోధ గములను
దాటి గడువు లోనఁ గట్టి, తాఁ గన్నుల నా
పూఁట సుమహా ప్రశాంతతఁ
గాటుకగ ధరించె నింతి, కారము నెలమిన్ 12
[కారము = పన్ను]
మేటి గృహాధికారమును మీన సునేత్ర వహించు నింపుగన్
బోటి మహోపకారము నపూర్వపు రీతినిఁ జేయు నిత్యమున్
గాటును వీడి యుత్తమముగన్ మమకారము సూపుఁ గన్నులం
గాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్ 11
[గాటు = కారము]
ధర్మ సురక్షణమునకున్
నిర్మల భక్తి నెదిరించ నీతి యయిన దు
ష్కర్మ మవశ్య మిటు లనఁగ
దుర్మార్గము గాదు గురుల దూషించినచో 10
మర్మంబెల్లయుఁ దేటతెల్లముగ సమ్మానమ్ముగం జెప్పి స
ద్ధర్మం బింపుగ నిల్ప స్వర్గమున నుత్తారప్రదాతల్ గురుల్
కర్మం బింక సుపక్వమౌను యమ లోకంబేఁగ, నన్యంపు టే
దుర్మార్గం బిసుమంత లేదు, గురులన్ దూషింపగా శిష్యులే 9
విద్దెల నలరి శుభకరపు
సుద్దులఁ బ్రొద్దును గడపుచు సుఖముగ నుండన్
ముద్దుగ నిల సమవృష్టి ప
తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్ 8
అద్దము వోలె శుద్ధి యయి యాత్మ విరాజిలఁ బౌరు లెల్లరున్
వద్దని రాగ మత్సర వివాదము లించుక యంచుఁ బ్రేమతో
నెద్దిన ముండు దేశ మిఁక నింపుగఁ గయ్యము వీడి శాంతితోఁ
దద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్ 7
తల్లి యిలా సుతకుఁ గవల
పిల్లలు లవకుశులు పేర్మిఁ పెద్దయ్యెను దా
నుల్లం బలరంగఁ గుశుం
డల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ 6
[అల్లా = ఆహా/ ప్రసిద్ధి సూచకము ]
సల్లాపంబులఁ జెల్లు నెట్లయిన శాస్త్రంబుల్ సమర్థించవే
ఫుల్లాంభోజ ము ఖారవింద నయనా పూర్ణేందు బింబాననా
కల్లల్ సుమ్మి వినిశ్చయమ్ముగను వాక్యంబుల్ వచింపంగ ని
ట్లల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా 5
లక్ష్మీవర్ధనుఁడు ధను
ర్లక్ష్మీ విభవుండు దాశరథి రాము లస
త్పక్ష్ముని, నూర్మిళ సేకొన
లక్ష్మణుఁ, బెండ్లాడె సీత రాగాన్వితయై 4
లక్ష్మము లందు నిశ్చయము రాముఁడు సత్య పురంపు విష్ణువే
లక్ష్మియ జన్మమెత్తె విపులాత్మజ యై వసుధా తలంబునన్
సూక్ష్మము నెంచి చూడ నిల సుందరి సేయఁగ రామునిన్ మహా
లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా 3
[లక్ష్మణుఁడు = శ్రీమంతుఁడు; లక్ష్మి (సీత) కలవానిగా]
అనలాంబకుండు హరుఁడు న
యనాయుధుఁడు చేతనుండు హైముఁడు శివుఁడే
ఘనుఁడు భవిష్యత్పూజిత
హనుమంతుఁడు, పెండ్లియాడె నద్రి తనూజన్ 2
ఘనుఁ డా శీతమహీధ్ర శేఖరుఁడు ముక్కంటిన్ మహేశున్ మహా
త్ముని జామాతగఁ బొందె నక్కజముగన్ ముల్లోకనాథున్ హరున్
వనజాక్షిన్ సుతపఃకృశాపఘననున్ బాలన్ శివుండా బృహ
ద్ధను మంతుండు వివాహమాడె హిమ శైలాధీశు పుత్రిం దమిన్ 1
[హనువు = ఆయుధము; బృహద్ధనుమంతుఁడు = గొప్పదైన యాయుధము
కలవాఁడు. గరుత్మంతము / గరుత్మంతుఁడు; బుద్ధిమంతుఁడు వలె]

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి