మ్రోలను జేరి సరాగము
హేలా లీలా వినోదియె ప్రమోదముగం
జూలాలికిఁ దా నాలికిఁ
గాలికి, కాటుక కనులకు, గజ్జెల నుంచెన్ 60
వాలుగ కంటి మానవతి పాటలగంధి మనోధి నాథుఁడే
శీలుఁడు నాదు మిత్రుఁడును జెప్పెద నాతని ప్రేమ గాధ నీ
కాలికి కాటుకం బులిమి గజ్జెలు కన్నులఁ గట్టె వింతగన్
వీలుగఁ బాద యుగ్మమున వేనలి పైనను గారవమ్మునన్ 59
[నీకు+ఆలికి =నీకాలికి; కన్ను = నెమలి పురి కన్ను]
అమ్మ - అయ్య - అన్న – అక్క
అమ్మనుజేంద్ర తనయ సతి
నమ్మానవతీ లలామ నయ్యవనిజనే
యమ్మనుజాన్న గణ ధవుఁడు
నమ్మాయావియు హరించె నక్కపటి వనిన్ 58
గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీఁటె స్నుష యె
వరని రిట్లూఢ యగుఁ గోడలు రమణీ ల
లామ కాదు భేదము గను భామ లందు
భ్రాంతిఁ జిత్త మందు వదలి శాంతిఁ బొందు 57
ఇష్మపు టాగమమ్మును వరేందు నిభాస్యల వాలు చూపులున్
శ్లేష్మము నందు నీగలను జేయును ధీరుల నైన నక్కటా
యుష్మము తాళ లేకయె ముదోద్భవ మంచు నిజేష్ట భర్తకున్,
గ్రీష్మమునందుఁ బైటఁ దొలగించియుఁ, గోడలు గన్నుగీఁటెరా 56
స్తుతమతి విద్యాధిక భూ
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
నత శిరయై భాసిల్లఁగ
నతి సుందరముగ వరుండె యానందమునన్ 55
సతతము ప్రీతి పాత్రమగు చక్కని పల్కులఁ గారవించెడిన్
వితరణ శీలియై జనుల ప్రేమకుఁ బాత్రతఁ బొంది నట్టి యీ
యతులిత సుందరుండు పతి యౌట మదీయ సుభాగ్య మంచుఁ దా
పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్ 54
[తాళి = హారము]
అంగన నవమానించ వ
రాంగ సహస్ర బల భీముఁ డాగ్రహ మది పా
రంగఁగఁ గీచకుఁడు సువ
ర్ణాంగదుఁ డ,నిలోనఁ జంపె, నశ్వత్థామన్ 53
[అశ్వత్థామ = అశ్వ తుల్య బల సంపన్నుఁడు, సింహబలుడు ,
అశ్వ సింహములు శ్రేష్ఠ వాచకములుగా]
ఆశ్వాసమ్మును నీయ రాజునకు దుష్టానీక సాహాయ్యమున్
విశ్వాసమ్మున సిగ్గు వీడి కొని తా భీతిల్లి ఘోరమ్ముగన్
విశ్వం బెల్ల వెఱంగుఁ జెంద ఘనుఁ డా వీరాభిమన్యున్ సహ
శ్రాశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్ 52
[అశ్వత్థామ = అశ్వ తుల్య బల సంపన్నుఁడు; అంగదుఁడు = అంగములను
(సాంగ జనిత కవచ కుండలములు) దాన మిచ్చిన వాఁడు, కర్ణుఁడు]
అజ నిభ సంయ మీంద్రుఁడు మహాత్మ వసిష్ఠుఁడు స్వర్ణ పాలికాం
బుజ నిభ బైజిక ప్రవరముల్ ద్రవ పూర్ణ ఘటాదు లుంచఁగన్
సుజప సుభాషణమ్ములను సుందరుఁడే గిరిజా నికాశ సీ
త జనకుఁ డిచ్చె రామునకు ధాత్రిజ నందఱు మెచ్చఁ బేరిమిన్ 51
ఉత్తరంపుఫాల్గు నోత్తమ మతి శుభ
లగ్న మందు జనక రాజు భద్ర
లక్షణ భరణీజ రామచంద్రకొను గి
ర లనె భద్ర మగును జెలఁగి యడరి 50
దుశ్చర్యఁ జలుప కాకము
పశ్చిమమున రాఘవుండు బ్రహ్మాస్త్రమునే
యాశ్చర్యమ్ముగ నేసెను
వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్ 49
ఋషి వరులైన సైచుదురె యీ మశకంపుఁ బ్రహార బాధఁ బ్ర
త్యుషమున నిల్వఁ గర్ణమున దోమయె, తా విదలించ వేగ నా
వృషభము, వచ్చి నిల్చినది వృశ్చిక పుచ్ఛము మీఁదఁ జూడుమా
విషమును గ్రక్కు కీట మని భీతి యొకింతయుఁ జెందకుండగన్ 48
చంద్రునిఁ జూచు నప్పు డెల్ల బృహస్పతి శోకించు సందర్భము:
గురువునకు ద్రోహ మొనరించె గురు రిపుండు
నాదు తారను మోహించె నీ దురాత్ముఁ
డితఁడు గగనపుఁ తారల పతియు నంచుఁ
జంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు 47
[కంజాత హితుఁడు = బ్రహ్మ దేవునికి మిత్రుఁడు, బృహస్పతి]
సంద్రము నుండి పుట్టెఁ బురశాసను నౌదల నెక్కె వ్యోమ తా
రేంద్రుఁడు పూర్ణిమా తిధియు నేగె గ్రమంబునఁ జూడఁ బాప మీ
సాంద్ర మయూఖ దేహ మిఁక సన్నన యౌనని దక్ష శప్తుఁడౌ
చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై 46
మానినుల కనిశము రజత
నానా విధ భూషణములు నందము నొసఁగుం
గానిమ్మిట్టు లొక పరిన్
నానీ! సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్ 45
నేనీ కానల ధన్యుడం దవ సుసాన్నిధ్యంబు సేకూరగన్
నానాగంధ సమేత పుష్పముల నానందంబునం గోరె నీ
శానీ పూజకు ద్రౌప దింపుగ ననున్ సౌగంధికాంభోజముల్
నా నీ పత్నికి కోర్కె దీర్పమనె నన్మండంత కౌంతేయుతో 44
[ అనుమఁడు = హనుమంతుఁడు]
కలి యడు గిడఁగ ద్వేషము సెలఁగె భువినిఁ
గూలె సంసారములు పెక్కు ఘోరముగను
సఖుల మధ్య చోద్యమ్ముగ సఖ్యత చెడె
దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ 43
తెలుఁగు వ్రాయుట మఱచిరి తెలుఁగు ప్రజలు
పెట్ట నర సున్న మఱచిన వింత నిచట
“దుగ్ధసాగరమున రేగె దుమ్ములెన్నొ”
దుమ్ము లయ్యెను జూడుమ తుమ్ము లన్ని 42
స్నిగ్ధత బూని చిల్కఁగను శీఘ్రమ పుట్టె హలాహల మ్మటన్
దగ్ధము లయ్యె మత్స్యములు తామర సంభవ షండ మెల్ల సం
దిగ్ధము కల్గె దైత్య సుర ధీర వరేణ్యుల కంత భీతినిన్
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేగె నదేమి చిత్రమో 41
గోడలు దాఁటుచుఁ బాఱుచుఁ
గోడి యొకటి మాయమైన ఘోరముగ నటన్
వాఁ డలరి పట్టెఁ, జూపఁగఁ
గోడిని నొక బాపనయ్య, కోరి భుజించెన్ 40
పాడిగ వేద మంత్రములఁ బన్నుగ నేర్చిన వారి నందునన్
వేఁడఁగ భోజనమ్మునకుఁ బేర్మిని సత్కుల జాత భోక్తయే
లేఁ డన రాదు, తన్ను నట లేపఁగ ముంచి పొగడ్త లందునం
గోడిని, బ్రాహ్మణుం డొకఁడు గోరి భుజించె జనుల్ నుతింపఁగన్ 39
వలలుని వేషములో నున్న భీమసేనుఁడు
యతి వేషములో నున్న ధర్మరాజు తో
గుంభనముగా పల్కు వచనములు:
ద్రోవది వనజాక్షి చనును
భూవర సైరంధ్రి యనఁగ ముద్దుల మాద్రే
యావరజుఁ డగ్రజా సహ
దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా 38
ఈ వసుధా కుమారి కిల నేలనొ యిట్టి విపత్తు లుగ్రముల్
రావణ దైత్య బాధ లివి రాదు సహింపగ దేవ నా కిఁకం
బావని తెల్ప వృత్తమును భర్గ మహేశ శివా మదీయ హృ
ద్దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్ 37
సతతము సత్యము నాడగ
నతుల హరిశ్చంద్రుఁడు భువి నాతనికి మహా
సతియై చంద్రమతి సతము
పతినే మనసార నమ్మి బాధల నొందెన్ 36
ధృతిఁ జిత్తమ్మునఁ బూని తర్జనములన్ ధిక్కార దూష్యమ్ములం
బతి విధ్వంసన వాచ్య భర్జనములన్ బాధింప ఘోరమ్ముగన్
సతి వైదేహి దశాస్య బంధిత మహచ్చారిత్ర తా లంకలోఁ
బతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై 35
పరిమార్చి మేలుగ నవాం
తరమ్ముల విళంబి శకమ! ధాత్రి ననుజులై
నరు లుండ జనము దడిసెం
బరువంపు దయాబ్ధిని నని పలుకఁగ రావే 34
[పరువము = పరిపాకము/పక్వము]
మగధీరుఁడు భీభత్సుఁడు
తెగ నఱుకఁగ మత్స్య యంత్ర దివ్య ఝషమునుం
బగులఁగ హృదయము గిరగిర
గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్ 33
పగలును బంతముల్ సహజ భావములే కద ప్రాణి కోటికిం
దగిన ముహూర్త మెంచ నిది తథ్యము సేయుఁడు పెండ్లి నింపుగన్
మృగశిర యుక్తమౌ మకర నిష్ఠిత లగ్నమునం దనంగనే
గగనమునందుఁ జేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్ 32
నిషిద్ధాక్షరములు - వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు. (ఖ,ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భ)
కుసుమమ్ము లన్నిటిఁగూర్చగ నింపుగ నందంపు మాలయౌ డెంద మలర
శిలవోలె కనిపించనల సాన పట్టిన రంజిల్లి కాంతుల రత్న మగును
బంగరు తీగను బన్నుగఁ గరగించి తీరుగ మలచిన హార మగును
మట్టి యిటుక లెల్ల గట్టి సున్నమునఁ గూర్పంగ సుందర గృహ రాజ మగును
శబ్ద కుసుమములను జక్కఁగఁ గూర్చుచు
శిలల వోలె నుండఁ గలయిక లట
నలరఁ జేయ మనము నల నలంకార మా
లలను బద్య కవన మలరు పుడమి 31
అంభోజాక్షుఁడు ఘనుఁడు వి
జృంభిత నయనారవింద సీతాసతి నా
యంభోజానన రుచి జిత
రంభను బెండ్లాడెను రఘురాముఁడు ప్రీతిన్ 30
శంభుని విల్లు ద్రుంచి భుజ సత్వ మహాత్ముఁడు మేటి ధన్వి యా
రంభ మనంగ దైత్యవర రావణ హత్యకుఁ జిత్త మందునన్
శాంభవి నిల్పి యున్న సతి జానకి సమ్మద సత్రపా స సం
రంభను బెండ్లియాడె రఘురాముఁడు తానటు సీత మెచ్చఁగన్ 29
అందఱుఁ దనకుం దానన
తందాన యన వలయు నను దనకు సవతి యీ
సుందరి గర్వము, ఘోరపు
టందము, చెడిపోయె ననుచు నతివయె మురిసెన్ 28
[అందము = విధము; గర్వము ఘోరపుటందము = ఘోరపు టందపు గర్వము]
అందఱుఁ జేరి యొక్క యెడ నంగన లప్పుడు హాస్య కేళిలోఁ
బందెము లాడు చుండఁగ నపారపుఁ బూనికి వే చెలంగ నా
చందము వాదు లాటలు ప్రశాంతము వీగఁగ నట్టి పోరులో
నందము నాశన మ్మయిన దంచుఁ గడున్ ముదమందె నాతియే 27
[అందము = అలంకారము]
ఏమి చేయఁ దీరు నీ ఋణము సెపుమ
మరువఁ జాల నేను మగువ వంట
పంచ భక్ష్య భరిత పరమాన్నమును ముద్ద
రాల! వండి పెట్టె రమణి రుచిగ 26
చాలునె యింటి వంటలకు సద్గణ సంకలి తాన్న శాలలన్
మేలుగ వండ నెన్నఁడును నేర్పున వ్యర్థపు మాట లేటికిన్
బేలయు ముద్దరాలు కడుఁ బ్రీతిని,బియ్యము నందు నేఱి తా
రాలను, వండి పెట్టె రుచి రంజిలు చుండఁగఁ గాంత ముద్దుగన్ 25
[సద్గణ సంకలి తాన్న శాలలు = నక్షత్ర సముదాయము తో గూడిన భోజన శాలలు;
సత్ = నక్షత్రము]
జీవాత్మయుఁ బరమాత్మయుఁ
గావే యొక టని సతము నిగమము లనంగన్
నే వచియింతును దృఢముగ
రావణుఁడే రాముఁ డగుచు రావణుఁ జంపెన్ 24
కావుము లోక సంతతినిఁ గంటకుఁ డా దశకంఠ దైత్య వి
ద్రావిత సంయమీంద్రులకు రక్షణ మిమ్మన, దైవకోటికిన్
దైవమ, ప్రీతి నెత్తి యవతారముఁ, జిక్కులనీయ మిక్కిలిన్
రావణుఁ, డంత రాముఁడయి రావణుఁ జంపె రణమ్మునందునన్ 23
పౌర వాన్వ యో ద్భవ క్షాత్ర వంతుఁడు
శత్రు పక్ష వీర సంచయమ్ముఁ
దోరముఁ గొలుచుచు, నదుష్టుఁ డా కురురాజు
భీకరముగఁ జంపె, భీమసేను 22
[కురువు = కురుమహారాజు, కౌరవ వంశ మూల పురుషుడు;
భీమ సేనుఁడు = శంకరుఁడు]
ఓజము వీడి క్రూరుఁ డల యుద్ధపు నీతిని నెన్నకుండగన్
రాజస మించు కేనియును రంజిల నీయక మత్త చిత్తుఁడై
యోజన సేసి వెక్కసపు టుగ్రుఁడు, నెల్లరు దల్చి రివ్విధిన్,
రాజు యొసంగి దుష్ట కురురాజు రణంబునఁ జంపె భీమునిన్ 21
[దుష్ట కురురాజు = దుష్టాన్న శ్రేష్ఠము / మహా దుష్టాన్నము ; కురువు =
అన్నము; రణంబున భీమునిన్ = యుద్ధములో భయంకరుని]
ఓడు వారు పాప ముండుదు రిఁక దుఃఖ
వారి రాశి యందుఁ దోరముగను
జూచు వారు దాని వేచి చోద్యముగను
జూద మాడువారు సుజనవరులు 20
ఆదిని నప్సరో౽బలలు నందపుఁ బద్మిను లందు నింపుగన్
సేదలు తీర చేయుదురు శీఘ్రమ, నెమ్మినిఁ జేర గోపికల్
మోదము మీఱ నాడె యమి ముష్టిక ఘాతకుఁ డర్థి నంత మ
ఞ్జూదము నాడువారు సరసుల్ సుజనుల్ గద లోకమందునన్ 19
[మఞ్జు +ఉదము = మఞ్జూదము: మనోజ్ఞమైన నీరు; ఉదకము లాడుట]
భువి మోక్ష దాయకమ్ములు
వివరమ్ముగ మాఠరుండు విశ్రుతములు , బ్ర
హ్మవిదులు గాని నుడువ లే
రవి, చెప్పెను విష్ణు కథలు రంజిల్ల జనుల్ 18
[లేరు+అవి = లేరవి]
సువిశాలాంచిత భారతావనికి నీశుండుం బరీక్షిన్మహా
సవనానీక రతుండు శాపగత విశ్రాంతుండు దా వేడఁగన్
వివరం బేర్పడ నేడు ఘస్రములు భూ విఖ్యాత వైయాసి ధీ
రవి చెప్పెం గమనీయ విష్ణుకథలన్ రంజిల్లఁగా నెల్లరున్ 17
తన వారి క్షేమ మరయుచు
నని నిత్యము సలుపుచుఁ దనదౌ సంగర నీ
తినిఁ బూని ప్రభాకరుఁ డను
హనుమంతుఁడు లంక కేగి యసువులఁ బాసెన్ 16
[ప్రభాకరన్ హనువు కూడా పోరులో దెబ్బ తిని యుండవచ్చును.]
కని యాసీతను శోకమూర్ఛిత నశోకక్ష్మాజ మూలమ్మునన్
వన విధ్వంసము సేసి రాక్షసవరవ్రాతమ్ముఁ జెండాడఁగన్
హనుమంతుం డదె లంక కేగి, విడిచెన్ హా సోదరా ప్రాణమున్
ఘనుఁ డా యక్ష కుమారుఁ డాసురుఁడు లంకానాథ పుత్రుండలన్ 15
చెవులపిల్లి దర్పమ్మునఁ దివిరి తిరుగ
వింత సొగసుల నీనుచుఁ జెంత సేరి
యేల తగను నే నంచును వాల మెక్కి
చీమ ముద్దాడెఁ జంద్రునిఁ జిత్రముగను 14
ఏమిల భారతీయులమ యెన్నఁడు నల్పము కాదు శాస్త్ర సం
గ్రామము లందు నేరికినిఁ గాలిడి టెక్కెము చంద్రు సీమపై
భీమపు వేగ సంహిత మభీతిని, మానవుఁ డెంత తల్చగం
జీమయె, ముద్దులాడె నల శీతమయూఖునిఁ జిత్ర మయ్యెడిన్ 13
పద్మనాభ నాభి పద్మ సంజాతుఁడు
బ్రహ్మ దేవుఁ డనఁగఁ బరమ సాధ్వి
శ్రీరమాసతి కగుఁ జెన్నుగఁ బూజిత
గౌరి కాత్మజుండు కమలభవుఁడు 12
వాసురఁ బ్రాణి కోటి తమి బ్రహ్మ సృజించఁగఁ బాలనమ్ము చే
వాసికి నెక్క విష్ణువు శివక్షయ మౌను గ్రమమ్ము దల్చగన్
భాసిలి యగ్నిసంభవుఁడు, పద్మభవుండు, స్మరుండు, దైత్యుఁడున్
వాసిగ గౌరి కాత్మజుఁడు, బ్రహ్మ, యనంగుఁడు, శౌరి కల్లుఁ డౌ 11
[దైత్యుఁడు = ఇక్కడ ఘటోత్కచుఁడు]
సంతతమ్ము త్రాగి వింత ధోరణుల వా
క్రుచ్ఛుచు నపనిందలు పరుల పయి
ధూర్తుఁడు కపటుండు దుండగుం డగు పాన
కాలు కష్ట పెట్టె గ్రామ జనుల 10
ఎక్కిన గద్దె యిచ్చు నిఁక నేరికి నైనను మత్తు ధాత్రినిం
జక్కని వాఁడు గ్రామసభ సన్మతిఁ బాలన సేయు నంచు మేల్
మిక్కుటమై చెలంగునని మీఱిన నమ్మక ముంచి చేయగా
నక్కట సంతకాలు కడు యాతనఁ బెట్టెను గ్రామవాసులన్ 9
శాప కాయ సంతప్తుఁడు సమసెఁ గదిసి
భారతాజిలోఁ గర్ణుండు, పార్థుఁ జంపె
నన్న సరి గాదు సత్యము నరయఁ బుడమి
పూర్వ జన్మ వైర మది యఖర్వ మయ్యె 8
సూర కుమార పుంగవుఁడు సూత తనూజుఁడు నంగ రాజు దాఁ
గౌరవ వంశ వర్ధనుని గాదిలి మిత్రుఁడు నస్త్ర శస్త్ర సం
హార విదుండు చంపెను మహా నృప వర్గము నేల యిట్లనన్
భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై 7
[పార్థుఁడు = రాజు; సంహారము = సమూహార్థమును గూడ గ్రహించఁ దగును.]
భీమావేశము సూపగ
గ్రామం బందునఁ జెడితిమి కన్నా పుత్రా
యేమని చెప్పుదు నయ్యో
రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్ 6
బ్రహ్మర్షి విశ్వామిత్రుఁడు రామునితో నన్న మాటలు:
ఏ మాత్రమ్మును దోష ముండ దిట రాజేంద్రాత్మజా ధర్మమే
లేమం జంపఁగ నాదు వాక్యమున విశ్లేషించి యీ తాటకన్
భామా హత్య పురస్సరమ్ముగను సంభావ్యంపు దైత్యాంతముల్
రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్ 5
[ప్రారబ్ధములు = ప్రారంభింపఁబడినవి]
వెల్లువగఁ బ్రేమ కురియఁగ
నుల్లము వికసించఁ బాండ రోత్పలము వలెం
జల్లఁగఁ దనదు సుతకు మే
నల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే? 4
చల్లగ నుండి మానవులు చక్కగ వర్ధిలి సంచరింతురే
కల్ల యనంగ రాదు భువిఁ గాంతుము చుట్టరికమ్ములన్ నిజం
బెల్లయు రాఘవుండు మిధిలేశునకున్ క్షితి భర్త కుర్వికి
న్నల్లుఁడు, పుత్రుఁడున్, మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే? 3
[మగఁడు = రాజు]
దేవి పార్వతి యాకాంక్ష తీరు నట్లు
దివ్య సుమ బాణ సంతతి దేవదేవు
త్రినయను ఘన మోహితునిగ, దేవతల క
మసి, యొనర్చెను శంకరున్ మన్మథుండు 2
[అమయు =ఉపయుక్తమగు]
అసురాత్మీయుఁడు శూలపాణి పురసంహారుండు కాలాంతకుం
డు సువర్ణాక్షుఁడు భూతరాట్టు హరిదంష్ట్రుండున్ జటాజూటుఁ డా
యసితగ్రీవుని దేవ కార్యమున నత్యావేశ సంరంభి తా
మసిఁ జేసెం దన పుష్ప బాణములతో మారుండు ముక్కంటినే 1
[తామసి = తమోగుణము కలవాఁడు]

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి