జలగ - కప్ప - చేప– నత్త
జల గర్భమ్మున కప్పర
కుల భయ విహ్వల మనస్క కురుపతి యరుగన్
జల మది చేప ట్టవ భూ
తలపతి నత్తఱి నెఱింగె ద్రౌపది పతియే 61
[చేపట్టు = అవలంబము]
తనకు నున్న దాని దాన మిచ్చు బడుగు
లేని దాని కర్థి గాని వాని
వాణి యున్న లక్ష్మిఁ బడయ నేరని వాని
నల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు 60
జల్ప విహీను సచ్చరితు సద్దృఢ చిత్తు నహీన సత్య సం
కల్పు నుదాత్త దాంత గుణు గర్వ విహీను నజస్ర హోమముల్
సల్పుచు విశ్వ శాంతికయి సన్మతి నుండెడు సంయమీంద్రు వా
గల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్ 59
కారణము మనోజ కృత వి
కారమునకు మానవులకు ఘనముగ ధవళా
పూరిత దర్పణ నిభ దళ
నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్ 58
వారిధి సంభవుండు శశ బాసిత దివ్య విలాస దేహుఁడున్
మార విరోధి మూర్ధ గత మాన్య నిశీథ ధవుండు నిత్య కౌ
మార విరాజి శైల కుసుమ గ్రహ ఋక్ష నభో ధరిత్రి నా
నీ రజమందునం గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్ 57
[ధరిత్రి నాన్ +ఈ = ధరిత్రి నా నీ; అవని లోని శైల కుసుమములు గ్రహ
నక్షత్రము లన నాకాశమే భూమియన నీ భూధూళి యందు.]
దుర్యోధనుని జన్మమునఁ బెక్కు దుర్నిమిత్తములు పుట్టెను,
జన సంక్షయ జననుఁ డగును గులము నఖిల లోకములకు
నపాయము సేయు పురుషాధముఁ డగును, వీని దూషించి
జగమును కులమును రక్షించుట తగు నని పలికిన భీష్మ
సహిత విదురుని తో ధృతరాష్ట్రుఁ డనిన పలుకులు:
విదుర తగవే యిటు లనంగ విడువ మంచుఁ
బాడియే దుష్టుడంచును వీడ సుతునిఁ
జెప్పి సుద్దుల నింపుగఁ జేసి యితని
సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు 56
వేధించుం గడు భృత్యవర్గమును వే భీభత్సుఁడై నిత్యమున్
సాధించుం దన వారి మీఱ నిజ వాచ్యశ్రేణి యైనన్ దయన్
గోధాన్యాదిగ విత్తరాశులను దాఁ గోపమ్ము వో నీయఁగా
సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్ 55
సుర వరుల ననఁగ నేలం
బురాణములఁ గాంచమే విపులముగ మన మా
పరఁగిన వర బలపుం గా
వర మది భక్తులను మిగుల వంచించెఁ గదా 54
గురుబల రావణాసురునకుం బరమేష్ఠి యొసంగి నట్టిదౌ
వరకరి దైత్యనాథునకు భర్గుఁడు ప్రీతి నొసంగి నట్టిదౌ
స్థిరముగ భస్మ దైత్యునకు శీలి యొసంగిన యట్టి మేటిదౌ
వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్ 53
వనగత ప్రాణి సంచయ మనయము సువి
కాస మొంద నక్షయ మౌచుఁ గడలి యందుఁ
దనర మణులు భృశమ్ము రత్నాకర వర
వనమునన్ సంచరింప వైభవము దక్కు 52
[వనము =జలము]
వనజదళాయతాక్ష ఘన వక్ష సమాశ్రయ పారవశ్యతం
దనరెడు భామినీమణి నితాంత వరార్థ సు కాములౌచుఁ బా
వనతర చిత్త సంస్థితినిఁ బన్నుగ శ్రీద రమార్చనాది భా
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్ 51
చల్లంగజాఱఁ దిమిరము
త్రుళ్ళి పడంగఁ గమలములు దోరం బవనిం
బెల్లుబికి రేఁగ నాకలి
భల్లూకము కడుపులోన, భానుఁడు పొడిచెన్ 50
కల్లోలాంబుధిఁ బూర్వ దిగ్వనిత సత్కారార్థ సంరంభియై
సల్లాపమ్ములు సల్పఁ దోయజ బృహత్షండమ్ముతో నెల్ల శో
భిల్లంగన్ భువి సింహ రాశి మృగ రాడ్విద్రావితక్షుద్ర వ
ద్భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్ 49
ఏపార నారగించి క
ణాపమ్ములు కడుపు నిండ నాహ్లాదముగం
దాపమ్ముడిగిన యాఱిన
దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్ 48
హా పదిలంపు నీ పఱచి నట్టి కడిందిగ రమ్య మైన యీ
చాప పయిం దమిం దిరుగఁ జాలవె వ్రాలుట వీటి నింటి లో
నాప తరమ్మె పుస్తకపు టక్షర సంచయ మందు చూడుమా
దీప! “ము” పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా 47
[నల్లటి యక్షరములపై నల్లని యీఁగ కనిపించుట కష్టము]
వదలక శబ్దార్థ పటిమఁ
బదుగురు మెచ్చెడు విధ మధిపా బహు ముఖ కో
విదుఁ డైనను బుధజన కో
పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ 46
[కోపదము = కోపము నొసఁగునవి]
ఉదయ దినేంద్ర వర్ణ సదృ శోత్పల కుట్మల సన్ని భాక్ష రాం
బుదజ సుధార సైక పరిపూర్ణ వినిర్మల వాఙ్నిబద్ధమై
సదమల భావ యుక్తముగ శౌరి గుణాలి సవర్ణనమ్ము దు
ష్పదములు లేక సత్కవిత వ్రాసిన వాఁడె కవీశ్వరుం డగున్ 45
పెద్ద చీపురుఁగట్టల విరివి నూడ్చి
రలరి కొండల నెవ్వరో యనఁగఁ దోఁచ
రాలి యయ్యాకు లెల్లయుఁ, జూడ వయ్య,
కొట్టుకొనిపోయె గాలికిఁ, గొండలెల్ల 44
కుండల మేఖ లాభరణ కోటి విరాజిత బాలకుండు వే
దండ సహస్ర కోటి సమ దార్ఢ్య శరీరుఁడు కుక్షి పూర్ణ వే
ధోండుఁడు చక్ర వాత ఘన దోర్బల ధాటికి నింగి కేఁగగం
గొండలు గాలి తాకిడికిఁ గొట్టుకు పోయెను దొర్లుచున్ వడిన్ 43
కోపమ మూల మాపదలకున్ భువి మానవ జాతి కెంచఁగన్
వేపును నిత్య మెల్లరను వీడక తాపస కోటి నైన సం
దీపిత రోష వహ్ని నతి ధీరత నార్పును భవ్య శాంత కూ
పాపము లేనిచో జగము పాడయి పోవును నిశ్చయమ్ముగన్ 42
[కూప +ఆపము = కూపాపము]
పాపులు ఘోరావమతిని
నేపునఁ జేయ సభయందు నింద్రానుజుఁడే
ద్రౌపదినిఁ గాచె నయ్యో
పాపము, లేకున్న జగము పాడైపోవున్ 41
బ్రహ్మాస్త్రమును బ్రయోగించిన యశ్వత్థామతో బాదరాయణుని పలుకులు:
రూపరి విశ్వ మంతను విరూపిగఁ జేసెడి యస్త్ర మాపవే
యాపుమ నీదు రోషపు ఘనాంధము వే వెలిగించి చిత్తు పెం
దీపము లేదు దీనికిల నిష్కృతి యెన్నఁడు వీడు మిమ్మహా
పాపము, లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్ 40
దత్తపది : సంధి - సమాస - కారక – క్రియ
సంధింపఁ బరమ శాంతి ప
రంధాముఁడు రా నొసఁగి సుర సమాసన మ
య్యంధపతి చక్రి యడిగిన
సంధి యతని కారక యగు సరణిని నుండెన్ 39
[..యతనికి + ఆరక = యతని కారక; ఆరు = కులుగు]
జంత్వశనముల నచ్చటి జతలు గాంచ
మొదలిటికి సరియగు రెండవది తలంచ
నపరమునకు నాదియ యగు నరసి చూడ
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును 38
అక్కట యక్కుశేశయజు నక్కజపుం బని నొక్కి చెప్పరే
యక్కసు మిక్కుటం బవఁగ నక్కడ నిక్కి చెలంగి గ్రక్కునన్
వ్రక్కలు వాపి భీకరముఁ బ్రక్కన నుండఁగ వీడి భీతినిం
గుక్కలు, పచ్చగడ్డిఁ దిను గోవులు, మ్రింగును పచ్చి మాంసమున్ 37
వరమై యొప్పదె యిందీ
వరాక్షి లభియింపఁ బురుష వరులకు నట్లుం
గరిగమన నడుము నొత్తుచుఁ
జరణముతో భర్తృసేవ సతి యొనరించెన్ 36
ధరణిజఁ బోలు కూర్మి వసుధాభ ఘనక్షమ నిత్య సౌమ్య వా
గ్ఝరులును భాసిలంగ మఱి సాగుచు బంధు జనవ్ర జామి తా
దర కరణైక సక్త గుణ తత్పర స్వీయ నికేతన క్రియా
చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్ 35
సుధలు గురిపింప నోపు వ
సుధ వాక్దేవీ ప్రియతర సూతి కురియ నా
విధముగ హిమ మవిదితము వ్య
వధాన మన మేడసాని వడవడ వడఁకెన్ 34
సడలని యట్టి పట్టుదల చక్కని ధారణ మర్థ శబ్దముల్
బడయ విశుద్ధభావములు పన్నుగఁ గావలె దీనిఁ గెల్వ న
ప్పుడమిని నున్న పండిత సమూహము నందలి యల్ప కోటియే
వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్ 33
వగవక యించుక యైనను
నెగతాళికి నింటను సఖియె తడఁబడుచు నా
యిగురాకుఁబోణి యట్లనె
సిగ రెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్ 32
[రెట్టునకు రెట్ పర భాషా వనిత మాట; సిగ రెట్టు = కొప్పునకు
చుట్టుకొను ముతక బట్ట]
తగ దీ యందము లిచ్చెడిం బులక రింతల్ నీకు నెన్నండునుం
దగునే వాడఁగ నెత్తి కింతటి రుజాత్తంబైన ద్రవ్యమ్ములన్
మగువా చెప్పెద వీవు వింతగ నసంబంధంబ వేయేల యో
సి గ రెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్? 31
[గరు+ఎట్లున్ = గరెట్లున్ ; గరు = గగుర్పాటు; పులకరింత, జుట్టు పూఁతలు రెండు
నెట్లు శ్రేయములు]
కర దశశత విలసిత దిన
కర నామాకాశమణి మకర రాశి దయా
కర సంక్రమణ మనఁబడు మ
కర సంక్రాంతి పుడమినిఁ బ్రకటతర రీతిన్ 30
సృజియించె జీవులను దో
యజగర్భుఁడు లీలగఁ బరమాన్నపుఁ గణమున్
గజిబిజి చెందక దాటుచు
నజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్ 29
అజుఁడు గిరీశుఁ డీయ వర మర్మిలి సింధు ధవుండు కౌరవా
గ్రజ వర బాంధవుం డట ప్రగాఢపుఁ గోపము ప్రజ్వలించగన్
సుజనులు పాండ వాత్మజులఁ జోద్యము మీఱఁగ నాజి నిల్పెనే
యజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే! 28
అంబకు నకట మఱి పరిణ
యంబు సుదూరంబ కాదె యాలోచింపన్
సంబరమునఁ బల్కెదు వే
యంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందఱు మెచ్చన్ 27
అంబ సమాన మీ యువతి యంచును నే నటఁ జూచు చుండ నీ
మంబున సుందర ప్రమద మండప సుజ్వలి తాగ్ని సన్నిధా
నంబ వరాణసీ నగర నాథ వరేణ్య వరాత్మ సంభవా
న్యాంబనుఁ బెండ్లియాడె జను లందఱు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్ 26
కరి వరదునిఁ గిటిని హరి న
సుర గణ దమను నమర విభు సురుచిర నిలయున్
నిరతము నిలుప హృదిని రి
ప్వరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్ 25
[రిపు + అరిషడ్వర్గములు = రిప్వరిషడ్వర్గములు :
అరిషడ్వర్గములకు శత్రువులు: నిష్కామము, అక్రోధము,
నిర్లోభము, నిర్మోహము, నిర్మదము, నిర్మాత్సర్యము]
నిరతం బింపుగ ధర్మ మార్గ రతులై నిల్వంగ నిర్భీతినిన్
మురసంహారుని భక్తి చిత్తమున సంపూజించి వైకుంఠు నా
యరవిందాక్షుని సందియంబు మది నేలా ఖండితక్షుద్ర వా
గరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే 24
విద్వాంసు లైన నకటా
విద్వేషము రేఁగ భృశము విల యారతమై
యుద్వేగ యుత ద్రవిడ జ
గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్ 23
[జగత్ + వాల; వాలము = బెబ్బులి: ఎల్‌టిటిఈ]
సద్వారాయత నాట్ట సంచయ మహాసాల వ్రజ ధ్వంసమై
యుద్వేగమ్ము సెలంగ నెల్లరకుఁ గాదోర్వన్ మరున్నంద నో
గ్రోద్వేలాగ్రహ తప్త మానస మహా యోధాగ్ర్య తైలార్ద్ర సం
గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్ 22
అక్షయధామ విరాజిత
పక్షీంద్ర తురగ విభుండు ఫణిశయనుఁడు ప
ద్మాక్షుఁడు ధరఁ గౌసల్యా
రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్ 19
[కౌసల్య +అరాక్షస = కౌసల్యా రాక్షస; అరాక్షస = మానవ]
రాక్షస కోటి నాయకుఁడు రావణ నామ విరాజమానునిన్
రూక్షుని శిక్ష సేయ ముని లోకము నింపుగఁ గాచ నెంచియే
యక్షయ భోగ భాగ్య పురమయ్య యయోధ్య నరాధిపాగ్ర దా
రాక్ష సగర్భ మందు రఘురాముఁడు పుట్టెను లోక రక్షకై 18
[దార + అక్ష = దారాక్ష; దార = భార్య; అక్షము = తెలియఁబడిన యర్థము;
స గర్భము = పిండము తో; అందు = అయోధ్యలో]
యా ముని వరుఁ గనమె రామాయణమ్మును
వ్రాయ భాసిలంగ వసుధ మాన
సమ్మునఁ గలిగిన విషాద పుంజమ్ము, బో
టీ, వలన కవిత్వమే విలసిలు 17
శీతాంశుద్యుతి సన్ని భాస్య జయముం జేకూర్చు నీ ధైర్యమే
వీతత్రాసఁ జెలంగు మయ్య ధృతి నిర్వీర్యుండు నీ శత్రువే
యే తావుం బరికించినం బుడమి నీవే మిన్న నీ తోటి పో
టీతో వచ్చు, కవిత్వసంపదకుఁ, బోటీ లేదు ముమ్మాటికిన్ 16
ఎన్నఁ డెవ్వ రింత సన్ననఁ జేయరు
నాదు చెయ్వు లేల నారి సేయ
నవ్వ యివ్విధమ్ము నొవ్వఁగఁ జేయంగ
నాన నాన నాన ననన నాన 15
[నాన =సిగ్గు; నను + అన = ననన (నను తిట్ట); నన్ను
తిట్టుట సిగ్గు సిగ్గు ....]
చని వేగమ్ముగ వింటి వీను లలరన్ సంగీత మిభ్భంగినిన్
సనిసా సానిస సాని సానిస ససా సాసా నిసా సానిసా
దనిదా దానిద దాని దానిద నిదా దాదా నిదా దాని దా
నననా నానన నాననా ననన నానానా ననా నాననా ! 14
గోలా తటిఁ జెలరేఁగఁగ
గోల త్రుటినిఁ బాల కొఱకుఁ గూర్పఁగ సంధిన్
గోలను సతిని ననుచు ను
ష్పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్ 13
[గోల = గోదావరి, కలకలము, ముగ్ధ ]
హీలా గతినిం జూచితి
వేలా యీయి ల్లకట సవిస్తరమైనన్
లీలగ వాసమునకు మును
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్ధ్యము దక్కున్ 12
[మునుపు + ఆలన్ = మును పాలన్; ఆలన్ = ఆవులను]
ఏలా మానవు లెల్లరుం జలమునున్ హేయంపు రీతిం గతం
బాలోచించక పూన నేర్తు రకటా యాశ్చర్యమే తల్చఁగన్
జ్వాలా రూపము దాల్చి కాల్చవె మదిన్ శాంతంబునం గోప తా
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్ 11
సంతస మొసంగుచుఁ గమల షండమునకుఁ
జండ కిరణుఁ డాదిత్యుఁడు నెండదొర ది
నేశుఁ డధ్వపతి నిజప్రకాశ దత్త
చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు 10
ఇంద్ర ముఖామర వ్రజ మునీశ్వర సంచయ మర్దనుండు దై
త్యేంద్ర వరానుజుండు ఖరు నిద్ధరఁ గూల్చఁగ రామచంద్రుఁడే
సాంద్ర ధనుర్విలాస కర సంస్తవ పూర్ణ మహా మహీ నభ
శ్చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్ 9
ముదము నొసఁగి మిక్కుటముగ ముగియ పరిణ
యమ్ము దంపతుల జనకు లంత నెమ్మిఁ
బట్టు పీతోత్తరీయము బ్రాహ్మణుండు
పెండ్లి వేది పై శ్రాద్ధముఁ బెట్టిరంట 8
[వేది = విద్వాంసుఁడు; శ్రాద్ధము = శ్రద్ధతో గూడి ]
ఇద్ధపు దీప కాంతు లట నింపు నొసంగఁగఁ దల్లిదండ్రు లా
శుద్ధపు నూత్న వస్త్రములు, శ్రోత్రియు నానతిఁ గ్రొత్త జంట యే
పద్ధతి నెంచి చిత్తమునఁ బన్నుగఁ బీటల మీద నుండగన్
శ్రాద్ధముఁ, బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్ 7
[శ్రాద్ధము = శ్రద్ధతో గూడినది]
ఒక్క సాయంసమయమునఁ జక్క నైన
చుక్క యొక్కతి పతి నెకసెక్కెము లట
వేడ్క నాడుచు నుండంగ వెక్కసముగ
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె 6
[రోయు = వెదకు]
ఉల్లసనమ్ము క్రమ్మికొన నుల్లము నందు విహార యాత్రకై
చల్లని వేళ సాగుచు విశాలపుఁ గుల్య గలట్టి పెద్దదౌ
పల్లెకు పోయి చేర నొక ప్రాంగణ మచ్చట నిల్వకుంటి మే
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే 5
[ఏము + అల్లెల = ఏ మల్లెల ; అల్లెలు = చేపలలో నొక రకపు చేపలు]
నాథుని పయి రోషం బూనిన తఱి నించు
కంత మౌన మూనును గాని పంత మూని
చీటికిని మాటి కెక్కక చింతఁ బాను
పతినిఁ ద్యజియించి సతి పతివ్రత యనఁబడె 4
[పానుపు +అతి = పాను పతి]
అతుల తపో ధనస్థిత మహర్షి భృగూత్తమ నామధేయుఁడే
వితత తమిస్ర సంభృత వివేక విహీనతఁ దన్నవక్షముం
బతి పయి ఘోర రోషమునఁ బాఱె రమాసతి వీడి విష్ణునిం
బతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్! 3
నిషిద్ధము - శ, ష, స
ఇంపగు తిన్నని హృదయ చింతనములఁ దనరారి నిత్యము తగుల మందు
జనహిత కార్య నిచయ నిమగ్నోద్యోగ వర్తనమ్ముల కెల్లఁ గర్త లగుచుఁ
గులమత భేదమ్ము కొంచె మైనను మది రానీక యందఱు రహిని మెలఁగి
విద్యా వివేకము లాద్యమ్ము లని తల్చి పౌరులు వాని నింపారఁ గఱచి
తర తమముల భేద మరయక జను లెల్ల
రొక్క రూప యంచు నుచిత రీతిఁ
గడప జీవనమ్ము కాంతివంత మగుచు
నూత నాబ్ద మలరు జ్యోతి భంగి 2
చేతన సంయు తోత్తమ విశేష వివేక విలాస భోగముల్
నీతి విచార కార్య చయ నిర్జిత శుద్ధ యశస్తరంగముల్
శీత గిరీంద్ర నాథు దయఁ జేకురుఁ గావుతఁ గ్రొత్త యేటినిన్ 1

మృదువుగఁ జెప్పరె బుధవరు
లిది దైవపు మాయ చేత,నెల్ల జనులకున్
విదితం బగు నిశ్చయముగఁ,
జదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ 21
పదిలము నీక వ్యర్థ మగుఁ బల్కిన భీషణ మైన వాక్కులుం
దదితర భాషణమ్ములును, దైవ బలమ్మున, నెద్దియుం గొనం
డెద మఱి యెంత చెప్పినను, నెవ్విధి, యేఁగిన నేమి, వాని నొం
చదు వని వాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ 20
[యేగిన నేమి వని దైవ బలమ్మున నెవ్విధి (ఏ దైవము) వాని నొంచదు.
యెద్దియుం గొనం డెద యెంత చెప్పినను .. మూర్ఖుఁడౌ ]
పక్షీంద్ర తురగ విభుండు ఫణిశయనుఁడు ప
ద్మాక్షుఁడు ధరఁ గౌసల్యా
రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్ 19
[కౌసల్య +అరాక్షస = కౌసల్యా రాక్షస; అరాక్షస = మానవ]
రాక్షస కోటి నాయకుఁడు రావణ నామ విరాజమానునిన్
రూక్షుని శిక్ష సేయ ముని లోకము నింపుగఁ గాచ నెంచియే
యక్షయ భోగ భాగ్య పురమయ్య యయోధ్య నరాధిపాగ్ర దా
రాక్ష సగర్భ మందు రఘురాముఁడు పుట్టెను లోక రక్షకై 18
[దార + అక్ష = దారాక్ష; దార = భార్య; అక్షము = తెలియఁబడిన యర్థము;
స గర్భము = పిండము తో; అందు = అయోధ్యలో]
వ్రాయ భాసిలంగ వసుధ మాన
సమ్మునఁ గలిగిన విషాద పుంజమ్ము, బో
టీ, వలన కవిత్వమే విలసిలు 17
శీతాంశుద్యుతి సన్ని భాస్య జయముం జేకూర్చు నీ ధైర్యమే
వీతత్రాసఁ జెలంగు మయ్య ధృతి నిర్వీర్యుండు నీ శత్రువే
యే తావుం బరికించినం బుడమి నీవే మిన్న నీ తోటి పో
టీతో వచ్చు, కవిత్వసంపదకుఁ, బోటీ లేదు ముమ్మాటికిన్ 16
ఎన్నఁ డెవ్వ రింత సన్ననఁ జేయరు
నాదు చెయ్వు లేల నారి సేయ
నవ్వ యివ్విధమ్ము నొవ్వఁగఁ జేయంగ
నాన నాన నాన ననన నాన 15
[నాన =సిగ్గు; నను + అన = ననన (నను తిట్ట); నన్ను
తిట్టుట సిగ్గు సిగ్గు ....]
చని వేగమ్ముగ వింటి వీను లలరన్ సంగీత మిభ్భంగినిన్
సనిసా సానిస సాని సానిస ససా సాసా నిసా సానిసా
దనిదా దానిద దాని దానిద నిదా దాదా నిదా దాని దా
నననా నానన నాననా ననన నానానా ననా నాననా ! 14
గోలా తటిఁ జెలరేఁగఁగ
గోల త్రుటినిఁ బాల కొఱకుఁ గూర్పఁగ సంధిన్
గోలను సతిని ననుచు ను
ష్పాలన్ దూరమునఁ బెట్ట సౌఖ్యం బబ్బున్ 13
[గోల = గోదావరి, కలకలము, ముగ్ధ ]
హీలా గతినిం జూచితి
వేలా యీయి ల్లకట సవిస్తరమైనన్
లీలగ వాసమునకు మును
పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్ధ్యము దక్కున్ 12
[మునుపు + ఆలన్ = మును పాలన్; ఆలన్ = ఆవులను]
ఏలా మానవు లెల్లరుం జలమునున్ హేయంపు రీతిం గతం
బాలోచించక పూన నేర్తు రకటా యాశ్చర్యమే తల్చఁగన్
జ్వాలా రూపము దాల్చి కాల్చవె మదిన్ శాంతంబునం గోప తా
పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్ 11
జండ కిరణుఁ డాదిత్యుఁడు నెండదొర ది
నేశుఁ డధ్వపతి నిజప్రకాశ దత్త
చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు 10
ఇంద్ర ముఖామర వ్రజ మునీశ్వర సంచయ మర్దనుండు దై
త్యేంద్ర వరానుజుండు ఖరు నిద్ధరఁ గూల్చఁగ రామచంద్రుఁడే
సాంద్ర ధనుర్విలాస కర సంస్తవ పూర్ణ మహా మహీ నభ
శ్చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్ 9
ముదము నొసఁగి మిక్కుటముగ ముగియ పరిణ
యమ్ము దంపతుల జనకు లంత నెమ్మిఁ
బట్టు పీతోత్తరీయము బ్రాహ్మణుండు
పెండ్లి వేది పై శ్రాద్ధముఁ బెట్టిరంట 8
[వేది = విద్వాంసుఁడు; శ్రాద్ధము = శ్రద్ధతో గూడి ]
ఇద్ధపు దీప కాంతు లట నింపు నొసంగఁగఁ దల్లిదండ్రు లా
శుద్ధపు నూత్న వస్త్రములు, శ్రోత్రియు నానతిఁ గ్రొత్త జంట యే
పద్ధతి నెంచి చిత్తమునఁ బన్నుగఁ బీటల మీద నుండగన్
శ్రాద్ధముఁ, బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్ 7
[శ్రాద్ధము = శ్రద్ధతో గూడినది]
చుక్క యొక్కతి పతి నెకసెక్కెము లట
వేడ్క నాడుచు నుండంగ వెక్కసముగ
మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె 6
[రోయు = వెదకు]
ఉల్లసనమ్ము క్రమ్మికొన నుల్లము నందు విహార యాత్రకై
చల్లని వేళ సాగుచు విశాలపుఁ గుల్య గలట్టి పెద్దదౌ
పల్లెకు పోయి చేర నొక ప్రాంగణ మచ్చట నిల్వకుంటి మే
మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే 5
[ఏము + అల్లెల = ఏ మల్లెల ; అల్లెలు = చేపలలో నొక రకపు చేపలు]
కంత మౌన మూనును గాని పంత మూని
చీటికిని మాటి కెక్కక చింతఁ బాను
పతినిఁ ద్యజియించి సతి పతివ్రత యనఁబడె 4
[పానుపు +అతి = పాను పతి]
అతుల తపో ధనస్థిత మహర్షి భృగూత్తమ నామధేయుఁడే
వితత తమిస్ర సంభృత వివేక విహీనతఁ దన్నవక్షముం
బతి పయి ఘోర రోషమునఁ బాఱె రమాసతి వీడి విష్ణునిం
బతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్! 3
ఇంపగు తిన్నని హృదయ చింతనములఁ దనరారి నిత్యము తగుల మందు
జనహిత కార్య నిచయ నిమగ్నోద్యోగ వర్తనమ్ముల కెల్లఁ గర్త లగుచుఁ
గులమత భేదమ్ము కొంచె మైనను మది రానీక యందఱు రహిని మెలఁగి
విద్యా వివేకము లాద్యమ్ము లని తల్చి పౌరులు వాని నింపారఁ గఱచి
తర తమముల భేద మరయక జను లెల్ల
రొక్క రూప యంచు నుచిత రీతిఁ
గడప జీవనమ్ము కాంతివంత మగుచు
నూత నాబ్ద మలరు జ్యోతి భంగి 2
నూత నాబ్ద శుభాకాంక్షలు:
నూతన ధైర్య విక్రమ వినోద సమంచిత పూర్ణ భాగ్యముల్చేతన సంయు తోత్తమ విశేష వివేక విలాస భోగముల్
నీతి విచార కార్య చయ నిర్జిత శుద్ధ యశస్తరంగముల్
శీత గిరీంద్ర నాథు దయఁ జేకురుఁ గావుతఁ గ్రొత్త యేటినిన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి