ఇంద్రు నేలఁ గాంచె నిందుముఖి యహల్య
లేమ యేలఁ దడసె రేణుకయును
గర మరసిన నేమి కలకంఠి హృదయంపు
లోఁతుఁ దెలియ లేరు లోకు లెపుడు 60
రాతిని దేవుఁ డుండుటయు రవ్వ యటంచును గేలి సేయుచుం
జూతు మనంగ విష్ణువును జొప్పడ నెల్లెడ లందు నవ్వుచున్
గోతినిఁ ద్రవ్వఁ ద్రవ్వ ననుకూలముగా మఱి నేల తల్లి దౌ
లోఁతు నెఱుంగ సాధ్య మొకొ లోకులకుం బలు గాకి మూఁకకున్ 59
కేళీ లీల వచించఁ బ్ర
వా ళాభ వచనముల ననపాయము నాయా
వేళలఁ దగ నంచిత కర
తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్ 58
పాళె మనంగ విగ్రహము వర్ధిలు రంధ్ర న వావృతమ్ము భూ
గోళము నందు నింద్రియ సుఘోర పరావసథమ్ము మాన సా
రాళ కుటీర వాసమున రాజిలు దూషిత చింత నాళికిం
దాళము వేయఁగా వలెను ధర్మము నిల్పఁగ బుద్ధి జీవికిన్ 57
కవిగణార్చితుండు కవిశేఖరుం డయ్య
కదలి కైత లనెడు కలహ మందు
నుంచు నదుపున సుగుణోత్తముం డడరి వా
చాలు నింక కంది శంకరయ్య 56
మే లగు పూరణామృతము మేదిని వెక్కస మౌనె త్రాగగం
గ్రోలినఁ జాలునే యసుర కోట్యరి నామ సుధా రసమ్మునుం
గాల విషాభ వాఙ్నిచయ కారణ మేమగు నయ్య దీనికిం
జాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్ 55
కాంక్షలఁ గలుగు నిరంతర
సంక్షయమే కలుగ దింక సన్ముక్తి ధ నా
కాంక్షయె ముదిరిన మో క్షా
కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగ మందున్ 54
ఆంక్షలు మెండు భృత్యులకు నానతి మీఱిన నుండు శిక్షలే
సంక్షయ మైనఁ బో జనము క్ష్మాతల విత్త సువర్ణ సంచ యా
కాంక్షలె కాని భాస్వ దనుకంపన ధర్మ గుణైక చింతనా
కాంక్షలె యుండవీ కలియుగంబున మానవ జాతికిం గనన్ 53
పిలిచి నంతట మిక్కిలి వినయ మెసఁగ
నేఁగి లోపలకు వెదకి బాగుగాను
రయమున నతివ నీతెచ్చిన యది పట్టు
రవికయే చాలుఁ గద చీర రమణి కేల 52
[చీర (న్) = పిలుచుట]
నవయుగ భవ్య ధర్మ మట నారి కొసంగుట నూత్నవస్త్రముల్
కవియ గృహమ్ము వొంద ననురాగము చారు చతుష్పదాన్వ యో
ద్భవము సెలంగి మిక్కుటము భామకుఁ బ్రక్కన నిల్చెనొక్క పే
రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్ 51
[పేరు +అవిక ; అవిక = గొఱ్ఱె (ఆడ); ఈ గొఱ్ఱె కురంగ లోచనయే]
తాపస జన ఘాతకులు నితాంత వర బ
లాన్వితులు జగత్కంటకు లసుర వరులు
నిత్య ఘోర కార్య రతులు నిర్జర గణ
పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు 50
గురుజన నిత్య బాధకులు ఘోర మనస్కులు విత్త ముండగన్
విరివిగ దర్ప ముంచెదురు వీగి ప్రపంచమునన్ మహా భయం
కరు లగు నిర్దయా దురిత కార్య విచారణ సక్త చిత్త త
త్పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా 49
చల్లఁదనపు సాయాహ్నము చారుతరపు
టంబుదమ్ములఁ గాంచి నృత్యమ్ము సేయ
లాలనలఁ గలాప కలాపి జాల మడరి
యీ వసంతమునం బాడవేల పికమ 48
మత్తకోకిల.
రావ మొప్పెను వేద మంత్ర విరాజితమ్మయి యియ్యెడన్
జీవరాశి హృదారవింద వశీకృతమ్ముగ విన్పడన్
భావ మేర్పడ లేద యిత్తరిఁ బాట వెక్కస మైనదో
యీవ సంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా 47
[ఈవ = నీవే; సంత = వేద పాఠము]
దిక్కులు పిక్కటిలంగను
నక్కి విజృంభించు ఘోర నర మృగమునకున్
మిక్కుటపు టుక్కున నడతఁ
గుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే 46
ఎక్కడి వాఁడ వీ వట మదీరిత వాక్యము లోఁ గొనంగ లే
వక్కట తక్కు పట్టుదల నందఱికిన్ బ్రతు కన్నఁ దీపియే
చిక్కిన నొక్క పెట్టునను జీరు నినున్ వృషభేంద్రు దాపు రా
కుక్కకు కొమ్ము లున్న వని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై 45
[రాకు +ఉక్కకు; ఉక్క = బలవంతుఁడు]
అందములౌ పద్యమ్ముల
విందుమె లఘ్వలఘు రేఫ విహితమ్ముల నీ
చందమ్మున నెన్నండును
గందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ 44
సుందరుఁ డెంతయున్ సుతుఁడు చోద్యమ బుద్ధియె మంద మయ్యె నే
మందును వింత లిట్టివియ యర్భకు విద్యలు నిత్య మెంచ మా
కందము నందుఁ బ్రాస మిడఁగన్ వల దంచన వ్రాసె నిట్లు మా
కందము నందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా 43
[ప్రాసము = ఈటె]
పెను మంటలు రేపెఁ బురిని
గనివిని యెఱుఁగని విధముగఁ గక్షలు రేపెన్
జన హృదయమ్ముల నీ పం
చిన వాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్ 42
అనిపెం గాశికి నిర్దయం జెలఁగి యన్యాలాపముల్ పల్కుచున్
ఘన వేశ్మంబును గాంచ రమ్మనుచు నక్షద్యూత మాడించెనే
విన యాధీనుల ధర్మ మెంచకయె నిర్భీతిన్ వెసం దమ్ము పెం
చిన వాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్ 41
అమ్మకచెల్ల నిజము సర
సమ్మగునే యెంచఁ బౌర సంపాదన మం
దిమ్మగు నాఱవ భాగము
రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా 40
[కరము కప్పము]
నమ్మక ముంచుమా వితర ణమ్ముల నుమ్మలికమ్ము లింక పా
పమ్ములు పమ్మ వమ్మ మఱి వమ్మన కివ్వచనమ్ము లిమ్ములే
సుమ్ము దయా గుణమ్ము లను సొమ్ములు నెమ్మన మందు నుంట తో
రమ్ము జగమ్ము నందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా 39
సువిశాల చతుర్దశ భువ
న విరచ నాత్మక సురాద్యు నలినజు వేదాం
గ విదుని సిత చతురాస్య వి
భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా 38
నవ కుము దాభ లోచన సనాతన భవ్య వికుంఠ లోక స
న్నివసన భక్త పాప హర నిర్జర రక్షక నిష్ఠురోగ్ర దా
నవ హర పద్మనాభ వర నాభి బిలోద్భవ దివ్య పద్మ సం
భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా 37
కర మరుదు నిన్ను గెలువఁగ
ధరను గృపా భరిత చిత్త ధారిణి కమ్మా
వరముగ విముక్తి నింపుగ
నరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్ 36
[నీవే దిక్కని యరిషడ్వర్గమునే వేడుట మంచిది]
ధరలోఁ గన్పడు బాహ్య శత్రు తతికిం దల్చంగ దాడిన్ భయం
కరమై వర్తిలి మానవాళికిని నిర్ఘాతాభమై నిల్చి య
స్థిర భావ మ్మలరారఁ జేయు నిదియే తేజంబు ఖండింప నీ
యరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా 35
త్వఙ్నయ నోద్వేగమ్మును
రుఙ్నిచ యోద్భాసితమ్ము రోగక్షయ మీ
దృఙ్నవ విధ ముదయించుచుఁ
బ్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్ 34
[నవము = స్తోత్రము]
దృఙ్నిర తాద్భుతమ్ము నగు దివ్య విలాసము నా నభః పయో
ముఙ్నినదవ్ర జావృతము భూతలవాస మనోహరమ్ము నౌ
ప్రాఙ్నగ సంభవుండు నయి ప్రస్ఫుట మౌయరుణాంశు సంయు తా
ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా 33
[సంయుత + అప్రాఙ్నగము; పశ్చిమాద్రి]
మతి నెంచు నిత్యము భవం
బతి దుఃఖ మయంబు సుమ్మి యారయఁ బృధ్విన్
మృతియే ముక్తి నొసంగును
జితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్ 32
సతి భాసిల్లఁగ నర్థ దేహమున వే సంతోషియై నిల్చి భూ
త తతీశుండు నుమా ధవుండు సతముం దా నుండ సన్నిష్ఠతో
వితతంబై చను భక్తి తత్పరత సంప్రీతిం దపోధ్యాన సం
చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్ 31
మే నలరంగఁ దెనుగు సం
ధానము శృంగార నైషధము నింపారం
దాను గవిసార్వభౌముఁడు
శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై 30
[భారత కృతి = భారతదేశపు ప్రబంధము]
నానా క్షత్రియ వంశ గాథలను విన్నాణమ్ముగం దెల్ప స
త్యానందమ్మును బంచ లోకమున విశ్వాత్మాహ్వయ స్త్యేన చి
త్పానీయమ్మన సంయమీంద్ర వరుఁ డా వ్యాసుండు భాస్వత్తప
శ్శ్రీ నాథుండు రచించె భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్ 29
అర్జున సుభద్రల వివాహ మచ్చటఁ గని
పల్కె నొక్క కవివరుండు పన్నుగ నిటు
తార్క్ష్యువాహను గ్రమమున ధర్మరాజు
సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు 28
సోదరి యొండు పల్కె నిటు చూపుచు నచ్చట క్రొత్త జంటనున్
మోదము బాధయుం గలుగ ముంగటి చేడియ తోడ నాన్నకుం
జేదగుఁ గుండమార్పనఁగఁ జెల్లు ననం దన పెద్ద బావకున్
సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్ 27
కాల విపరీతములు గాక కారుమబ్బు
లెల్లఁ గమ్మి తెఱపి లేక తల్లడిల్లఁ
గుండపోత వర్షము లేల ఘోర మైన
వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల 26
వేసితి నోట నీ విడిన వింత గుడేరము శంక లేకయే
నీ సము లెందు లేరనుచు నేఁ దమి చింతిలి పల్కె భీతి నా
కేసరె నయ్య మిక్కుటమ యెంచఁగ శీత దినమ్ము లయ్యొ కా
వే సవి కాల మందు! చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో 25
[గుడేరము =మాత్ర; సవి =అని చెప్పి; కాల మందు = (నీ) మందు కాల!]
మన గోగులమ్మ మున్కని
విని యెఱుగని మహిమ లలర వెలసెన్ భక్తా
వనమస్మద్గ్రామ నివా
సిని మా దేవతఁ గొలిచిన చేకూరు సిరుల్ 24
మును బుట్టెన్ ధవలాంబురాశి విమలాంభోజాక్షి గాంగేయ మం
డన షండద్యుతి వెల్గఁ గంబు నిభ కంఠంబంత విద్యోతమై
వనితా రత్నము శుద్ధ పద్మకరయున్ వైకుంఠ సద్ధామ వా
సిని, మాదేవత ప్రేమమూర్తిఁ గొలువం జేకూరు సత్సంపదల్ 23
[మా = లక్ష్మి]
శుంభద్వీర వరేణ్యుఁడు
దంభుండు హిరణ్య నేత్ర దైత్యుం డకటా
రంభోరు దితీ కశ్యప
రంభా! శివ సంగమమున రక్కసి పుట్టెన్ 22
[శివ సంగమము = సుఖ సంగమము]
దంభము మీఱ రావణుఁడు దౌష్ట్యుఁడు దా ముని రాజి ఖండ నా
రంభుఁడు భక్తి వేడఁగ వరమ్ములు భంజిత దైత్య కోటి సం
రంభున కీయ నండ నపరాజిత భర్తృ బృహద్వపుః పరీ
రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్ 21
గేహమ్మున సంతృప్తిగ
నాహారము గొని సువర్ణ హారము కొఱకై
యాహా యారును నొక్కటి
మోహన! రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా 20
ఐహిక వాంఛ లందు నిడి యాశలు పెల్లుగ వాటిఁ గోరు నే
దేహికి సమ్మతం బగును దీర్థ గమమ్ములు వారిఁ ద్రాగకే
దాహము తీరునే భువి సదా విరహాగ్ని నిమగ్న జీవికిన్
మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్ 19
వింతగఁ బుట్టిన బిడ్డల
నింతయుఁ గరుణ యది లేక యింతియె చంపెన్
శంతనుఁ డఁట యమర నదీ
కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్ 18
[..గాంచును + అరకమున్; అరకము = నాచు;
గంగా దేవి దేవత, శంతనుఁడు నరుఁడు]
ఇంతికి నెంతొ వంత నిడి యింత సుఖమ్మును బొందకుండ దుః
ఖాంతముఁ గాన లేక సువికార విచార మనో వికల్పుఁడై
స్వాంతము తల్లడిల్లఁగ నశాంతిని సంతత సంశయమ్ము నాఁ
గాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో 17
ఏమఱ నీయక వానిని
వేమరు ప్రశ్న లవిరళము వేయుచు మఱి గా
రాము సెలఁగ వాచాలురు
చీమలు భక్షించె భీము శిరముం బ్రీతిన్ 16
భీముఁడు మృత్యు వాతఁ బడఁ బెద్దలు వైద్యుల చేతిలోమహో
ద్దామ రుజా నిరోధ పరతంత్ర చికిత్స యొనర్చఁ జీమలే
రోమ విహీనమౌ శిరములోఁ గనిపించగ నా ప్రచండ సూ
చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్ 15
[సూచీ + ఈమలు; సూచి = సూది, ఈమలు = పుండ్లు;
భీమసేనుఁడు = భయంకరుఁడు]
పెన్మాన్యంబులు ధనములు
మున్ముందుగఁ బంచఁ దగును మూరిన భక్తిన్
విన్మా వ్యర్థపు మాటల
సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్ 14
విన్మా నాదు సుభాషణమ్ములు గతోద్వేగమ్మునన్ మిత్రమా
కన్మా యర్హుఁడు గాదె యిప్పుడమి వక్కాణించు మేలం దమిన్
సన్మౌనీంద్ర సమాన మానసునకుం జంద్రార్క ధిక్కాంతికిన్
సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్ 13
శ్రీ వికారి సేసె సిరి సంపద లొసంగ
విరివిగ వసుధా ప్రవేశము జన
కాయ హృద్వికాస కారణ భూత గ
రిమము వెల్గ నిడు శుభములు మనకు! 12
చెలువము మీఱ వచ్చినది శ్రీద వికారి సువత్సరమ్ము దాఁ
బెలుచ శుభమ్ము లీయఁగను విస్తృత భోగ వరప్రదార్థ భూ
కలుష చయఘ్న సంభరిత కార్య నిమగ్న మనోవిలాస భూ
రి లలిత భూషణ వ్రజ వరిష్ఠ కటిస్థలి యై సమోదమున్ 11
కోరి చేసిన పాపమ్ము కూల్చు జనులఁ
గీర్తి కాముకత్వమునకు మూర్తు లగుచుఁ
బమ్మి చేసిన యట్టి దానమ్ము, మాని
తల్లికిం దిండి నిడుట, వ్యర్థమ్ము సుమ్ము 10
చల్లని నీ రొసంగినను జాలదె చక్కగ వృద్ధి సెందగం
బెల్లుగ భూరుహమ్ములకు వెఱ్ఱివె తిండి నొసంగ నివ్విధిం
గల్లరి మాట లేల వినగం దమిఁ దల్లికి మాని తిండి పో
తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్ 9
[తిండి పోతు + అల్లి; అల్లి = వృక్ష విశేషము]
వరుఁడు సుందరుండు ప్రద్యుమ్నుఁ డయ్యెను
వర యదు కులజాతుఁ డరయ నతఁడు
రమణి రుక్మిణీ లలామకు దనయుఁ డు
క్కరి ముఖుండు లక్ష్మి కన్నకొడుకు 8
[ తనయుఁడు +ఉక్కరి; ఉక్కరి=శౌర్యవంతుఁడు;
శౌర్యవంతమైన ముఖము కలవాఁడు]
సురుచిర భాషణుండు శ్రుతిసూరి వధూమణి బృంద చిత్త మం
దిర గత మన్మథుండు ఘన దీర్ఘ భుజుండు సునీల మేఘ సుం
దరతర దేహుఁ గాంచు మువిదా సుమనో విల సత్సరోవ రా
కరి ముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁడన్నయున్ 7
[సరోవర +ఆకరి ; ఆకరి = ఖనిజము; సరోవరమను ఖని నుండి పుట్టినది: పద్మము.
అనంగుఁడన్న ( రామన్న వలె) = మన్మథుడు,]
రుక్చైతన్యము నమ్ముము
త్వక్చేల ముడుగు ఫణి వలె దప్పక విడుమీ
వాక్చాతుర్యపు కపటము
వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్ 6
వాక్చాపల్యము నెంత జూపినను దా వంచింప రాదే భువిన్
రుక్చింతా పర రాజ నీతి విలసల్లోలాక్ష రాజన్యునిన్
దృక్చైతన్య విరాజమాన ధవునిన్ ధీమంతుఁ గౌటిల్య భృ
ద్వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా 5
కండలు పెంచి విరివిగన్
దండులఁ గూడి తిరిగెడు వదరుఁబోతులకున్
దండ మొసఁగి దుష్టుల నూ
కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్ 4
భండారమ్ములు నింప నీ ప్రకృతి విధ్వంసమ్ము భావ్యమ్మె బ్ర
హ్మాండాఖ్యమ్ముగ వాసి కెక్కినది విశ్వాత్ముండు సృష్టించె వి
శ్వాండం బింపుగఁ బ్రాణి కోటులకు నే యన్యాంబు నెన్నండు లే
కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్ 3
నగములు కరుగవె సంగీ
త గానముల నక్కజముగ ధరణిని షడ్జ
మ్ము గమకములు పడ వీనుల
నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్ 2
[వీనులన్ + అగము; అగములు = పాములు]
పగలున్ ద్వేషము లందు సంతతము కంపం బొందు దుష్టాత్ములున్
విగతానందులు నుందు రక్కట మహోద్వేగమ్ముతో నార్తులై
గగనం బందున ద్యోత మైన నచలత్కాఠిన్య భాస్వన్మనో
నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్ 1

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి