22, ఫిబ్రవరి 2022, మంగళవారం

అమృత మూర్తులు.

భారతామృత మూర్తి పసల అంజలక్ష్మి.

ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.


 

సీ.

వందనములు తల్లి! యందుకొనుమ తెచ్చితమ్మ నీవు పసల యంజలక్ష్మి!
లక్ష్మి నొసఁగు స్వేచ్ఛ రమణిరొ రామ! పాటించి యుప్పునకునై మించి పోరు
పోరుబందరు మహాత్మునిఁ జేరి మన భూమి కెలమి దాసుళ్ల వారింటి పడతి!  
పడఁగఁ గారను బాధ పడవు తల్లిరొ నీదు పసిడి నెల్లను బ్రీతిఁ బంచి పెట్టి  

తే.గీ.

బెట్టిదంపు దాస్యము త్రుంచి తిట్టె యిట్టె

యాంగ్ల విభులు పర్వులిడఁగ నాగ కుండ
నుండ నీ పోరు ముద మందె నుర్వి మాత
మాత! తామ్రపత్రము గొన్న మణివి నిజము   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి