|
|
డా. పోచిరాజు శేషగిరి రావు కవి వరేణ్య సంస్తవ దశకము:
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
|
|
|
|
|
|
|
శా.
|
శ్రీమన్మంగళ
పోచిరాజ కుల వారిస్తోమ సోముండునై
ధీమంతుం
డుదయించి శేషగిరి రాడ్దివ్యాఖ్య విఖ్యాతుఁడై
భామా
సత్యవతీ వరాఖ్యకును సుబ్బారావు నా
వెల్గెడిన్
భూమీ
దివ్యునకుం గుమారుఁ డయి సంపూజ్యుండు నయ్యెన్ ధరన్
|
1.
|
|
|
|
|
|
మ.
|
ఛవిమచ్ఛబ్ద
భృదాంధ్ర సాంస్కృతిక భాషా పాండితీ పక్వ పా
టవ
మేపార మహా ప్రభా తిరుపతీ టంకార సప్తాద్రి నా
థ
విశిష్టోన్నత పట్టణమ్మునను విద్వల్లోక సంభావ్యుఁడై
భువి
వెల్గెం గవి వర్య శేషగిరి సంపూర్ణస్థితప్రజ్ఞుఁడై
|
2.
|
|
|
|
|
|
శా.
|
పూజార్హుండును
బిన్న తండ్రి విలసత్పుణ్యాత్ముఁ డౌదార్య స
త్తేజస్వంతుఁడు
పండితుండు కవితా దివ్యాబ్ధి పూర్ణాబ్జుఁడే
సౌజన్యస్ఫుట
వర్తనుండు సు సుధీ శార్దూలుఁ డిద్ధాత్రినిన్
వ్యా
జాజ్ఞానుఁడు సాధు జీవనుఁడు కవ్యారాధ్య శేషాఖ్యుఁడే
|
3.
|
|
|
|
|
|
శా.
|
భాషా శైలి నొనర్ప వీక్షణము కన్పట్టున్ భాసిల్లి సం
తోషం బిచ్చు తెనుంగు తేట పదముల్ తోరమ్ము నొక్కొక్కచో
భూషాలంకృత సంస్కృతేద్ధ పదముల్ పూర్ణంబు నొక్కొక్కచో
దోషాంతర్గత కౌముదీ ప్రభలు విద్యోతమ్ము లందం దహో
|
4.
|
|
|
|
|
|
శా.
|
లేరే సత్కవి పుంగవుల్ మునుపు భూరిజ్ఞాన సంపన్నులున్
లేరే పండిత వంశ సంభవులు లేరే సాహితీ వేదులుం
బారావార పరీత భూతలమునం బ్రఖ్యాత విజ్ఞానులున్
వారిం బోలును బోచిరాజ సుమహావంశోద్భవుం డింపుగా
|
5.
|
|
|
|
|
|
శా.
|
దారాత్మోద్భవ సంఘ సంజనిత బాధా యుక్త సంసార దు
ర్వారాంభోధిఁ దరించు చుండి భగవద్భావైక చింతాత్ముఁడై
ధారాయుక్త సదర్థ శుద్ధ కవితా ధౌరేయుఁ డై నిత్యమున్
సా రాసార వివేక వంతుఁ డయి సచ్చారిత్రుఁ డయ్యెన్ ధరన్
|
6.
|
|
|
|
|
|
మ.
|
పరమార్థంపు విశేష తత్త్వము నిజస్వాంతమ్ము నందేర్పడన్
నిరతమ్మున్ శ్రమియించి సద్గురువు సాన్నిధ్యంబునన్
నిల్చుచుం
గర మాసక్తి నొనర్చి శోధనము నిష్కాముండునై నిత్యమున్
ధరలోఁ జల్పెను స్వీయ జీవనము సద్యస్స్ఫూర్తి
భాసిల్లగా
|
7.
|
|
|
|
|
|
తే.గీ.
|
అలరి శారదా మంజీరములు రచించె
రక్తిఁ దేజో వలయముల రచన సేసెఁ
బరమ గురువు వేటూరి ప్రభాకరు చరి
తమ్ము శేష కవి రచించె సమ్మదముగ
|
8.
|
|
|
|
|
|
మ .
|
అలరించెం దమి నాంధ్ర నామ వర భాషాకాంక్ష విద్యార్థులన్
వెలయించెన్ బహు కావ్య ఖండికల గంభీరార్థ శబ్దావలిం
దలఁపించెం గద పూర్వ సత్కవి కవిత్వప్రౌఢి రమ్యమ్ముగాఁ
గలిగించెన్ ముద మాత్మ కల్పిత
బృహత్కావ్యప్రకాశమ్మునన్
|
9.
|
|
|
|
|
|
ఉ.
|
బాల్యము నందు నేను దమిఁ బంపిన యా
శతకమ్ము నింపుగా
శల్య పరీక్ష సేసి క్షమఁ జక్కఁగ
వ్రాత ప్రతిం గడింది వా
త్సల్యము మీఱ దిద్దియుఁ బ్రశంస
లొసంగెను సంతసమ్మునం
దుల్యునిఁ గాంచఁగాఁ గలనె దొడ్డ
మనస్కుని భూతలమ్మునన్
|
10.
|
|
|
|
|
|
చం.
|
కవి వరు లందు నెన్నగను గమ్ర
లసత్కవితా దురంధరుం
డు
వినుత సంత తాధిక కఠోర పరిశ్రముఁ డర్థ శబ్ద భా
వ
వివర ణాది విద్యలను బాటవ మత్యధికమ్ము నిచ్చలున్
భువిఁ గన నెంద ఱుందు రఁట ముచ్చట గొల్పఁగ నిట్టి
వారలున్
|
11.
|
|
|
|
|
|
శా.
|
కార్పణ్యావృత శాంత చిత్తునకు సంకల్పప్రభా మూర్తికిన్
దర్పావేశ విరోధ హీనునకు విద్యాదాతకున్ నిత్య కం
దర్పస్కంధ వినాశ కార్చకునకున్ దాసుండనై భక్తి నే
నర్పింతుం
గవి లోక మాన్యునకుఁ బద్యాంభోజ భవ్యాంజళుల్
|
12.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి