మానవ పూజార్హ రమ
జ్ఞానామృత మయ మనోజ్ఞ నాద భరితముల్
గాన సుధా రస ధారల
గాన సహస్రద సుశీల కరుణా మయియే 10
హరివాగీశాదిగ సుర
జ్ఞానామృత మయ మనోజ్ఞ నాద భరితముల్
గాన సుధా రస ధారల
గాన సహస్రద సుశీల కరుణా మయియే 10
వరగణ సేవిత వధువును వరునిం గనుడీ
దురితౌఘ హరము ఘన శుభ
కరమ్ము గిరిజా పురహర కళ్యాణ మిలన్ 9
వందన మాచరింతు మదిఁ బర్వత రాజ తనూజ భర్తకున్
చందనభస్మగంధ పరి సర్పిత గాత్రుడు చంద్రమౌళికిన్
నందిత భృంగి శృంగి వర నంది పిశాచ గణాధినేతకున్
సుందర ఫాలనేత్ర పరి శోభిత వక్త్రు పినాకపాణికిన్ 8
శ్రీశైలాగ్రతటీస్థ పుణ్యజన సంసేవ్యుండు మల్లన్ననున్
కాశీక్షేత్ర విరాజితున్ శివుని ద్రాక్షారామ భీమేశ్వరున్
రాశీభూత దయాపయోనిధిని సద్రామేశ్వ రాలంకృతు
న్నీశానీ కర పూజితాంఘ్రియుగ దేవేశుం భవున్ వేడెదన్ 7
హరహర! మహా సురా! హిమ
గిరివరవాస! నటరాజ! గిరిజానాథా!
పుర త్రయ హరా! దయాకర!
సురాపగాజూటధీర! సుందర! ప్రణతుల్ 6
మూర్ధవిరాజిత సోమున్
దుర్ధర్షాభీల గరళ దోషిత కంఠు
న్నర్ధేశ సఖుఁ దలతు వా
మార్ధస్థిత శైలసుతు నుమాశంకరునిన్ 5
చిన బృహదాలోచనలు విశేషముగ ఫలిం
చుననిన సందేహంబే
మినుములఁ దిరుగలి నఱుమదె మెత్తని పొడిగన్ 4
మండితము కఠోర ఘోర మరణాస్పదమున్
భండన భీభత్సుండు
ద్దండ ఖగేశ్వరుని పోరు ధరణిన్ ఫణికిన్ 3
స్థిరమతి వనధి తరణ సురుచిర సేవా త
త్పరుని గనుడు రామాంచిత
కరాంగుళీకృత త్రిరేఖుఁ గమనీయముగన్ 2
మాత్సర్య విగుణ విహీన మహి మోన్నతులున్
తాత్సార ఖాదన విహా
రోత్సుకు లిరువురుఁ గురంగ యుగళము గనరే 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి